చెక్‌బౌన్స్‌ కేసులో 6 నెలల జైలు | six months prison of check bounce case | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ కేసులో 6 నెలల జైలు

Published Tue, Jan 31 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

six months prison of check bounce case

హిందూపురం అర్బన్‌ : చెక్‌బౌన్స్‌ కేసులో ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఈశ్వర్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.3,06,780 జరిమానా విధిస్తూ హిందూపురం స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి ఆనందతీర్థ తీర్పునిచ్చినట్లు న్యాయవాది శివశంకర్‌ మంగళవారం తెలిపారు. ఈశ్వర్‌ 2013లో హిందూపురం వైశ్యాబ్యాంకుకు చెందిన చెక్కులను ముద్దిరెడ్డిపల్లి మాధవయ్యకు ఇచ్చారు. అయితే ఆ ఖాతాలో డబ్బు లేకపోవడంతో చెక్‌బౌన్స్‌ అయింది. ఈ కేసును స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో బాధితుడి తరఫున న్యాయవాది శివశంకర్‌ వాదించారు. ఈ మేరకు జడ్జి విచారణలు చేసి తీర్పు ఇచ్చినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement