సాక్షి, తిరుపతి: జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా బాధితురాలు లక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం లక్ష్మి ప్రెస్‌మీట్ పెట్టారు. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్ఘతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెక్‌బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కాగా, కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్‌ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment