![Victim Laxmi File Complaint Against Janasena Kiran Royal In Tirupati Police Station](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/kiran%20royal.jpg.webp?itok=xsIXisCI)
సాక్షి,తిరుపతి : తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.
తాజాగా,తన కుటుంబంపై కిరణ్ రాయల్ బెదిరింపులకు దిగుతున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఇద్దరు కుమారుల్ని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని ఆదివారం సాయంత్రం లక్ష్మి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కిరణ్ ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇప్పించాలని ఫిర్యాదులో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment