![Tirupati Janasena Leader Kiran Royal Another Video Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/kiranrayalcase1.jpg.webp?itok=RYvlP5Ia)
సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.
కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలు
జనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరించారు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేదని.. మహిళలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఇదేనా మీరు రక్షణ కల్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమగ్ర విచారణ జరిపించాలి
జనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. పార్టీ నాయకుడు కాబట్టి చర్యలు తీసుకోమంటే చూస్తూ ఊరుకోం. కిరణ్ రాయల్ తప్పు ఉందని విచారణలో తేలితే ఆందోళన చేపడతాం. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆమె తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/19_41.png)
ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
మరోవైపు, కిరణ్ రాయల్ నీచుడు.. రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు. కిరణ్ రాయల్‌ను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment