check bounce case
-
గుడ్లు అమ్ముకునే బండ్లపై గుదిబండ..
-
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
చెక్‌బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. చెక్‌బౌన్స్‌కు సంబంధించి ఆయన మంగళవారం కోర్టులో హాజరయ్యారు. పట్టణానికి చెందిన పలువురు ఫైనాన్షియర్ల వద్ద అతను డబ్బు తీసుకున్నారు. డబ్బుకు సంబంధించి బండ్ల గణేష్ చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. దీంతో ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా బండ్ల గణేష్ పలుమార్లు ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్‌కు రూ.500 ఫైన్
ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇదే ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్‌కు న్యాయస్థానం వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆమె రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది. ఈ మేరకు అప్పట్లో విచారణ జరిపిన కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి ఆమె తరపున కేసు వాధించే లాయర్ రాకపోవడంతో అమీషా పటేల్‌కు రాంచీ కోర్టు 500 రూపాయల జరిమానా విధించింది. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్‌కు కారణం ఇదే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అమీషా పటేల్ తీసుకున్నారని. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింకు సింగ్ తాజాగా విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. కానీ అమిషా పటేల్ తరపు న్యాయవాది అతన్ని క్రాస్ ఎగ్జామినేట్ చేయలేదు. బదులుగా, ఆమె న్యాయవాది దాని కోసం మరింత సమయం కోరారు. అప్పుడు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డిఎన్ శుక్లా కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అమిషా పటేల్‌కు కోర్టు రూ. 500 జరిమానా విధించింది. తదుపరి విచారణను ఆగష్టు 7కి వాయిదా వేసింది. -
కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!
ఆమె తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీ, పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గానే 'గదర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. తాజాగా ఓ కేసు విషయమై కోర్టులో లొంగిపోయింది. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అడపాదడపా మూవీస్ చేస్తూ వస్తోంది. కొన్నేళ్ల ముందు ఓ సినిమా విషయమై ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అజయ్ కుమార్ దగ్గర రూ.2.5 కోట్ల వరకు డబ్బు తీసుకుంది. ఆ తర్వాత సదరు సినిమా పూర్తి చేయలేదు సరికదా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఓసారి చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో అజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఈమెపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్ కు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రాంచీలోని సివిల్ కోర్టులో ఈమె శనివారం లొంగిపోయింది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన టైంలో తలకు పూర్తిగా ముసుగు వేసుకుని మీడియా ప్రతినిధుల నుంచి ముఖం దాచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?) -
చెల్లని చెక్కు ఇచ్చిన మహిళలకు ఏడాది జైలు
విశాఖపట్నం: చెల్లని చెక్కు జారీ చేసిన మహిళకు ఏడా జైలు శిక్ష విధిస్తూ నగరంలోని నాల్గవ ప్రత్యేక మెజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ఫిర్యాదు న్యాయవాది ఎడ్ల రాజారావు అందించిన వివరాలు ఎలా ఉన్నాయి. నిందితురాలు పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్విఎస్ శ్యాంకృషియాన్ భార్య ఉషారాణి. ఆమె తన అవసరాల నిమిత్తం 2013లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య శ్యాంబాబు నుంచి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చే నిమిత్తం ఒక ప్రాంసరీ నోటు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్యాంబాబు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేయడంతో ఉషారాణి 2017 ఆగస్టు ఏడో తేదీన ఒక చెక్కు జారీ చేశారు. పాక్షికంగా బాకీ తీర్చే నిమిత్తం రూ.8 లక్షలకు జారీ చేసిన చెక్కును ఫిర్యాది శ్యాంబాబు తన ఖాతాలో జమ చేశారు. తగినన్ని నిధులు లేని కారణంగా ఆ చెక్కు నిరాదరణకు గురైంది. ఫిర్యాది తన వారి ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో శ్యాంబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగా శ్యాంబాబు మృతి చెందారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు. -
డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్ ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో -
చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో అత్యున్నత న్యాయస్థానంకీలక వ్యాఖ్యలు చేసింది. చెక్కు బాధ్యత ఇచ్చిన వారిదే అని తెలిపింది. మీరు కాకుండా వేరే ఎవరైనా వివరాలను పూరించినా, చెక్కుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెక్ బౌన్స్ కేసును విచారించిన జస్టిస్ డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పినట్టు లైవ్‌లా నివేదికను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి, సంబంధిత వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా చెక్ ఓనర్‌పై ఉంటుంది. అయితే చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి చెక్కుపై వివరాలు నమోదు చేయలేదని తేల్చిన చేతివ్రాత నిపుణుడి నివేదికను అగౌరవపర్చ లేమని కోర్టు తెలిపింది. కానీ చెక్కులోని వివరాలను డ్రాయర్ ఫిల్ చేశారా, లేదా ఎవరు చేశారనేది సంబంధం లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు చెల్లింపుదారునికి సంతకం చేసిన ఖాళీ చెక్కు ఇచ్చినట్లు అంగీకరించాడు. కానీ వివరాలు నమోదు చేయలేదని వాదించాడు. అలాగే దీన్ని నిర్ధారించడానికి చేతివ్రాత నిపుణుడి సలహా తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి కూడా తీసుకున్నాడు. చేతివ్రాత నిపుణుల నివేదికను జోడించాడు. అయితే దీనిపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. అలాగే వివరాలు ఎవరు నమోదుచేశారు, అప్పుగా ఇచ్చారా, మరోలా ఇచ్చారా అనేవిషయాన్ని నిర్ధారించడంలో చేతిరాత నిపుణుడి రిపోర్టు పాత్ర ఉండదని తెలిపింది. చెక్కుపై సంతకం చేసి, చెల్లింపుదారునికి ఇచ్చే చెక్ రుణం చెల్లించడం లేదా లయబిలిటీ నిమిత్తం ఇచ్చినట్టు రుజువు చేయబడితే తప్ప బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ఐదు రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్ఐ చట్టం కింద కేసుల సంఖ్య గణనీయంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఒక్కో కోర్టు ఏర్పాటు చేయాలన్న అమికస్ క్యూరీ సిఫార్సును అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్ఐ) కింద, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల దృష్ట్యా, ఈ కోర్టులు ఏర్పాటు చేస్తామని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రకటించిన సంగతి విదితమే. -
చెక్‌బౌన్స్ కేసులో నగరి కోర్టుకు హాజరైన సినీనటి జీవిత రాజశేఖర్
-
చెక్కు బౌన్స్ కేసులో కోర్టుకు టీడీపీ నేత అనిత
విశాఖ లీగల్: బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధుల్లేకుండా చెక్కులు జారీ చేసిన (చెక్ బౌన్స్) కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నగరంలోని 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వంగలపూడి అనిత ఎన్నికలు, వ్యక్తిగత ఖర్చుల కోసం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు వద్ద 2015 అక్టోబర్ 1న రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 18 శాతం వడ్డీ చెల్లించడానికి కూడా అంగీకరించారు. మూడేళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. శ్రీనివాసరావు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె 2018 జూలై 30న రూ.70 లక్షలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెక్కు ఇచ్చారు. దానిని శ్రీనివాసరావు 2018 ఆగస్టు 13న ఐసీఐసీఐ బ్యాంక్‌లోని తన ఖాతాలో జమ చేశారు. అది నిరాదరణకు గురైంది. చెక్‌ను ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంక్ అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసరావు నగరంలోని 1వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన న్యాయవాది పంపిన లీగల్ నోటీస్‌ను అనిత తిరస్కరించారు. అనంతరం కేసు 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయింది. ఇటీవల బ్యాంక్ అధికారులు తమ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. అందులో బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు లేని కారణంగా చెక్ నిరాదరణకు గురైనట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అనిత సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. మధ్యలోనే కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో కేసును మేజిస్ట్రేట్ ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు. -
చెక్ బౌన్స్ సత్వర పరిష్కారానికి సుప్రీం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. 1973, సీఆర్పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
సినీ నిర్మాత నట్టి కుమార్‌కు జైలు
విజయనగరం లీగల్: చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ స్థానిక మొబైల్ మెజిస్ట్రేట్ కె.దీపదివ్యకృప శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుని న్యాయవాది ఇనుగంటి రమేష్ తెలిపిన వివరాలు.. నట్టి కుమార్ కరుణాలయ ఫిల్మ్స్ పేరుతో విశాఖలో సినీ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. 2009 సెప్టెంబర్‌లో విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్లో ‘శంఖం’ సినిమా రెండు వారాల పాటు ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యంతో రూ.6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, వారం రోజుల తరువాత సినిమా ప్రదర్శన నిలిపేశారు. దీంతో యాజమాన్యానికి, నిర్మాతకు మధ్య వివాదం తలెత్తింది. పెద్దల జోక్యంతో నిర్మాత రూ.5.5 లక్షలు థియేటర్ యాజమాన్యానికి ఇవ్వడానికి అంగీకరించి చెక్‌ను థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ ఎ.రవికుమార్‌కు ఇచ్చారు. అయితే, నట్టి కుమార్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై రవికుమార్ కోర్టును ఆశ్రయించగా, నట్టికుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్) -
అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్‌బౌన్స్ కేసులు
సిరిపురిపై సినిమా వాళ్లు కన్నుపడింది..సినీ అవకాశాలు, అధిక వడ్డీల ఆశ కల్పించారు. ఫైనాన్సియర్ల నుంచి రూ. కోట్లలో అప్పులు తీసుకొని తీర్చకుండా ‘సినిమా’ చూపిస్తున్నారు. ఓ బడా నిర్మాత ఏకంగా 66 చెక్‌బౌన్స్ కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అప్పులోల్ల నెత్తిన బండ మోపి తాపీగా సినీ షూటింగ్‌కు వచ్చినట్లు కోర్టుకు వచ్చి వెళుతున్నాడని బాధితులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు క్రైం : సిరిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు సినీ ఫైనాన్షియర్లకు కూడా ప్రసిద్ధి. ఇక్కడున్న పలువురు చాలా కాలం నుంచి సినీ నిర్మాతలకు పెట్టుబడికి గాను అప్పు ఇస్తున్నారు. మార్కెట్లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండటంతో ఎక్కువ మంది సినీ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినీ ఫైనాన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. సినీ రంగంలోని వ్యక్తులకు గతంలో అప్పు ఇచ్చేవారు కొందరు మాత్రమే ఉండేవారు. అయితే లాభాలు బాగా వస్తుండటంతో ఇటీవల అప్పు ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని పలువురు నిర్మాతలు ప్రొద్దుటూరుకు వచ్చి రూ. కోట్లలో అప్పు తీసుకొని వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు మధ్య వర్తుల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ ఇచ్చే వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. సుమారు 7 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఒక నిర్మాతకు ఇక్కడి ఫైనాన్షియర్లు రూ. కోట్లలో అప్పు ఇచ్చారు. అయితే అతను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టులో కేసు వేశారు. అతను డబ్బు ఇవ్వకపోవడంతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సంఘటన మరచిపోక ముందే మరో సినీ నిర్మాత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌బాబుకు ప్రొద్దుటూరుకు చెందిన అనేక మంది రూ. లక్షల్లో అప్పు ఇచ్చారు. అతను ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. చెక్‌బౌన్స్ కేసుకు బండ్లగణేష్ ప్రతి నెలా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు అవుతున్నారు. 66 చెక్‌బౌన్స్ కేసులు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టుల్లో సుమారు 66 కేసులు ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 21, ఫస్ట్ ఏడీఎం కోర్టులో 66 చెక్ బౌన్స్‌లు నమోదు అవుతున్నాయి. ఫైనాన్షియర్లు ఇచ్చిన డబ్బుకు గాను ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో వారందరూ 2017లో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత బండ్ల గణేష్‌బాబు పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పేరుపై ప్రొద్దుటూరులో అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అతను రూ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. 66 మందికి సంబంధించి బౌన్స్ అయిన చెక్కుల విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఐదు సార్లు నిర్మాత బండ్ల గణేష్ వాయిదా నిమిత్తం ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. అయితే ఈ నెల 18న 35 కేసులకు సంబంధించిన చెక్‌బౌన్స్ కేసులో బండ్లగణేష్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అతను రాలేదు. తిరిగి ఈ కేసును నవంబర్ నెలకు కోర్టు వాయిదా వేసింది. అదో రంగుల ప్రపంచం.. సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడైనా మన ప్రాంతానికి వస్తే వారిని చూడటానికి ఎగబడి పోతారు. ఎంత కష్టమైనా సరే వాళ్లను ఒక్కసారైనా కళ్లారా చూడాలని పరితపిస్తారు. అలాంటిది హీరోలు, హీరోయిన్లను దగ్గరగా చూసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్లకు ఫైనాన్షియర్లకు ఆహ్వానాలను పంపిస్తారు. వీరికి హీరోలు, హీరోయిన్లతో కలసి ఫొటోలు తీసుకోవడం, భోజనం చేసే అవకాశాలు కూడా లభిస్తుంటాయి. బాగా పేరున్న ఫైనాన్షియర్లకు కొత్త సినిమా ప్రీమియర్ షోకు వెళ్లే ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఎక్కువ వడ్డీతో పాటు చిత్ర పరిశ్రమలోని అనేక మంది సెలెబ్రెటీలు పరిచయం అయ్యే అవకాశాలు ఉండటంతో కొంత మంది ఈ కారణంతో పెట్టుబడులు పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నిర్మాత బండ్ల గణేష్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు రావాల్సి ఉండటంతో వస్తుందో రాదో అని బాధితులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. -
చెక్‌బౌన్స్ కేసులో బాలీవుడ్ నటికి షాక్
ముంబై : చెక్‌బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి కొయినా మిత్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కొయినా మిత్రాకు న్యాయస్ధానం ఆరునెలల జైలు శిక్ష విధించింది. తనపై నిరాధార అభియోగాలు మోపారని.. కోర్టు ఉత్తర్వులను తాను ఎగువ కోర్టులో సవాల్ చేస్తానని నటి పేర్కొన్నారు. 2013లో మోడల్ పూనం సేథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై కేసు నమోదైంది. కొయినా మిత్రా తనకు రూ 22 లక్షలు బాకీపడ్డారని..అప్పును చెల్లించే క్రమంలో ఆమె తనకు ఇచ్చిన రూ 3 లక్షల చెక్ తగినన్ని నిధులు లేకపోవడంతో బౌన్స్ అయిందని సేథి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సేథి తనకు రూ 22 లక్షలు అప్పు ఇచ్చే స్ధాయి ఆమెకు లేదని కొయినా చేసిన వాదనను ముంబైలోని అంథేరి మెట్రపాలిటన్ కోర్టు మేజిస్ర్టేట్ చవాన్ తోసిపుచ్చారు. తుది వాదనల సందర్భంగా తన న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయని తాము ఈ ఉత్తర్వులను ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని కొయినా మిత్రా వెల్లడించారు. -
నోటీస్ ఇచ్చాకే చెక్ బౌన్స్ కేసు
సాక్షి, జగిత్యాల(కరీనగర్) : ఇటీవలి కాలంలో డబ్బులు బాకీ ఉన్న వ్యక్తికి చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కులు బ్యాంకుకు వెళ్లినప్పుడు తిరస్కరించడం వంటి సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులో డబ్బులు లేక చెక్కు తిరిగి వచ్చిందని చెప్పినప్పటికీ, చెక్కులు ఇచ్చిన వ్యక్తులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. కేసు దాఖలుకు ముందే చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఓ నోటీస్‌ను పంపించాల్సి ఉంటుంది. నోటీస్‌కు సంబంధించిన విషయాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మారిశెట్టి ప్రతాప్(94404 38914) వెల్లడించారు. నోటీస్‌లో ఏం ఉండాలంటే.. నోటీస్ ఇలానే ఉండాలనే నియమం ఏమి లేదు. నోటీస్‌ను స్వయంగా లేదా అడ్వకేట్ ద్వారా పంపవచ్చు. చెక్కు ఎవరిపేరిట ఇవ్వబడిందో ఆ వ్యక్తే స్వయంగా నోటీస్ పంపాల్సి ఉంటుంది. నోటీస్‌లో చెక్కు ఇచ్చిన వ్యక్తి బాకీ ఉన్న విషయం, ఆ బాకీ తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చినట్లు స్పష్టంగా ఉండాలి. అలాగే ఏ తేదీన చెక్కును బ్యాంకులో ప్రజెంట్ చేసింది, ఏ తేదీన ఆ చెక్కు చెల్లలేదని బ్యాంకు ద్వారా తెలిసిందనే విషయాలను నోటీస్‌లో స్పష్టంగా పేర్కొనాలి. చెల్లకుండా పోయిన చెక్కు నంబర్‌ను కూడా నోటీస్‌లో చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఏ కారణం చేత చెక్కు చెల్లకుండా పోయిందన్న విషయాలు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా ఆ చెక్కులో పొందుపర్చిన మొత్తాన్ని, నిర్దేశించిన వ్యవధి లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి, తెలియక నోటీస్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో నోటీస్ చెల్లకుండా పోతుందా అనే విషయాలపై సుప్రీంకోర్టు పలు కేసుల్లో వివరణలు సైతం ఇచ్చింది. నోటీస్ ఇవ్వడం ప్ర«ధాన ఉద్దేశ్యం..చెక్కు కర్త తన తప్పును తాను తెలుసుకుని సొమ్ము చెల్లించేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వడంటూ 1999లో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వర్సెస్ సాక్సోన్ ఫామ్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 30 రోజుల్లో నోటీస్ ఇవ్వాలి.. చెక్కు చెల్లని విషయాన్ని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ ద్వారా తెలియజేయడం తప్పనిసరి. నోటీస్ ఇవ్వకుండా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే అది చెల్లదు. ఏదో మాములుగా నోటీస్ ఇవ్వడం కాకుండా అది చట్టబద్ధంగా ఉండాలి. నోటీస్ రాతపూర్వకంగా మాత్రమే ఉండాలి. మౌఖికంగా ఇచ్చె నోటీస్ చెల్లదు. చెక్కు చెల్లలేదని బ్యాంకు నుంచి సమాచారం అందినప్పటి నుంచి 30 రోజుల్లోపు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజుల్లోపు నోటీస్ ఇవ్వకపోతే, ఆ చెక్కును తిరిగి బ్యాంకులో ప్రజెంట్ చేయవచ్చు. చెక్కుపై వేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్నట్లయితేనే తిరిగి బ్యాంకులో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరో ముఖ్య విషయమేమిటంటే, బ్యాంకులో చెక్కువేసిన తేదీ కంటే కూడా, చెక్కు చెల్లకుండా పోయిందని బ్యాంకువారు తెలియజేసిన రోజే ప్రధానం. ఉదాహరణకు.. చెక్కు చెల్లకుండా పోవడానికి సంబంధించి బ్యాంకువారు ఇచ్చిన మెమోపై 5–1–2019 అని ఉండవచ్చు. కాని 9–1–2019 రోజున ఆ మెమో చెక్కు ప్రజెంట్ చేసిన వ్యక్తికి ఇవ్వబడింది. దీని ప్రకారం 10–1–2019 నుంచి 30 రోజులలోపు చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నోటీస్ ఎలా పంపాలంటే.. చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ పంపించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నప్పటికీ, నోటీస్‌ను ఎలా పంపాలన్న విషయంపై స్పష్టత లేదు. సాధారణంగా నోటీస్‌కు తిరుగు రశీదు(ఎకనాలేడ్జ్మెంట్ కవర్)తో కూడిన రిజిస్టర్ పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది. తిరుగు రశీదుతో కూడిన నోటీస్ పంపడం వల్ల, ఆ నోటీస్ ఎవరికి పంపబడిందో ఆ వ్యక్తికి ఆ నోటీస్ ఎప్పుడు అందినదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. నోటీస్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, సరైన చిరునామాకు పంపడం కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో నోటీస్‌లు డోర్ లాక్డ్, సదరు వ్యక్తి ఆ అడ్రస్‌లో లేడని, తీసుకోలేదంటూ తిరిగి రావడం జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని నిజాలు, కొన్ని అవాస్తవాలు ఉండోచ్చు. ఇలాంటి సందర్భాల్లో నోటీస్ పంపానని ఒకరు, నోటీస్ అందలేదని మరొకరు చెప్పడం పరిపాటిగా మారింది. నోటీస్‌పై వాదోపవాదాలు.. నోటీస్ అందడం, అందకపోవడంపై పలు వాదోపవాదాలు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి నివాసం ఉండే చిరునామాకు, అంటే సరైనా చిరునామాకు నోటీస్ పంపబడి ఉండి, అతడికి అందకపోయినప్పటికీ, నోటీస్ అందినట్లుగానే భావించడం జరుగుతుందని సుప్రీంకోర్టు 1999లో కె.భాస్కరన్ వర్సెస్ ఎస్.కె.బాలన్ కేసులో స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో నోటీస్ అందలేదని భావిస్తే, దానిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంటుందని కూడా పేర్కొంది. అలాగే నోటీస్ తిరస్కరించినప్పటికీ అందినట్లుగానే భావించబడుతుంది. అయితే నోటీస్ అందినట్లుగా భావించే సూత్రాన్ని అన్ని కేసులకు ఒకే విధంగా అన్వయించరాదని సుప్రీంకోర్టు మరో కేసులో వ్యాఖ్యానించింది. అయితే కేసు సందర్భాన్ని బట్టి, ఆ కేసు స్వరూపాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేసింది. ఇంకా నోటీస్ సరైన అడ్రస్‌కు పంపించామని, పోస్ట్‌మాన్ ముద్దాయితో మిలాఖత్ అయ్యాడని, పోస్ట్‌మాన్ సహకారంతో ముద్దాయి ఇంట్లో లేనట్టుగా తప్పుడు ఎండార్స్మెంట్ వచ్చిందని ఫిర్యాది వాదన చేస్తే, ఆ విషయాన్ని ఫిర్యాదే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, చట్టప్రకారం అది అతడి బాధ్యత అని సుప్రీంకోర్టు 2004లో వి.రాజకుమారి వర్సెస్ పి.సుబ్రమనాయుడు కేసులో స్పష్టం చేసింది. -
రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయండి
పెరంబూరు: నటుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే, రెడియన్స్ మీడియా సంస్థకు నటుడు శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ చెల్లించాల్సిన రూ.2 కోట్లు ఇవ్వకపోవడంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా చెన్నై , సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ రేడియన్స్ మీడియా సంస్థ తరఫున శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్‌లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్లు రాలేదు.దీంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు. -
కోర్టును తప్పు దోవ పట్టించారు : మోహన్‌బాబు
ప్రముఖ నటుడు, వైఎస్ఆర్సీపీ నేత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలపై మోహన్‌బాబు స్పందించారు. ‘2009లో ‘సలీమ్’ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్ ఇచ్చాం. ‘సలీమ్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవీఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి, కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో చాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు’ అని పేర్కొంటు మోహన్ బాబు పత్రిక ప్రకటనను విడుదల చేశారు. -
కళ్లముందే ‘మాయం..!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): టెక్నాలజీతోపాటు మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు మించిన మోసాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుండటంతో సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా నివ్వెర పోతున్నారు. సింగ్‌నగర్ నందమూరినగర్ ప్రాంతంలో గంజాం గీతా మహాలక్ష్మీ, రాధాకృష్ణ రమేష్‌బాబులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రమేష్‌బాబు కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. వారికి తెలిసిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలం తరువాత వడ్డీ కట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. మే నెలలో తమ పిల్లల ఉన్నత చదువులకు డబ్బులు అవసరమని, మీకు ఇచ్చిన రూ.20 లక్షలు ఇవ్వమని కోరారు. దీనికి ప్రవీణ్‌కుమార్ నా దగ్గర మొత్తం ఇప్పుడు లేవని, ప్రస్తుతానికి రూ.10 లక్షలు చెక్ రాసి ఇస్తానని, దాన్ని ఆగస్టులో బ్యాంకులో వేసుకోవచ్చని చెప్పి వారి కళ్లముందే సంతకాలు పెట్టి ఇచ్చాడు. అతను అంతలా నమ్మకంగా చెప్పడంతో బాధితులు కూడా ఇంకా మూడు నెలలే కదా ఆ తరువాత చెక్ వేద్దామని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఆగస్టు 4న చెక్‌ను బ్యాంకులో వేయగా దానిపై సంతకం లేదని చెక్ రిటర్న్ వచ్చింది. సంతకం లేకపోవడం ఏమిటని చెక్‌ను పరిశీలించి చూడగా దానిపై ప్రవీణ్‌కుమార్ పెట్టిన సంతకం మాయమైంది. బాధితులు విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌కు చెప్పగా నేను కావాలనే మాయమయ్యే పెన్నుతో సంతకం చేసి ఇచ్చానని, డబ్బులు కావాలంటే ఇంకొంతకాలం వేచిచూడాలని సమాధానం చెప్పాడు. దీంతో తాము మోసపోయామని గమనించిన బాధితులు జరిగిన మోసాన్ని వివరిస్తూ సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. -
కోర్టుకు హాజరైన సుప్రియ, సుమంత్
ప్రకాశం, మార్కాపురం: చెక్ బౌన్స్ కేసులో హిరో నాగార్జున మేనల్లుడు, మేనకోడలు సుమంత్, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా..డో నరుడా సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మార్కాపురంలోని కోర్టులో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి వాయిదా కోసం వారు గురువారం హైదరాబాద్ నుంచి తమ న్యాయవాదులతో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. కేసును జూన్ 28కి కోర్టు వాయిదా వేసింది. -
రజనీకాంత్‌పై కేసు విచారణ వాయిదా
తమిళసినిమా: చెన్నై హైకోర్టులో నటుడు రజనీకాంత్‌పై జరుగుతున్న కేసు విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు. వివరాలు.. చెన్నై షావుకార్ పేటకు చెందిన సినీ ఫైనాన్షియర్ బోద్రాకు నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీనిపై బోద్రా నటుడు రజనీకాంత్‌పై చెన్నై జార్జ్‌టౌన్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రజనీకాంత్ పూచీకత్తు మీదే కస్తూరిరాజాకు రుణం ఇచ్చానని, అయితే కస్తూరిరాజా తనకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పూచికత్తుగా నిలిచిన రజనీకాంత్‌పై జార్జ్‌టౌన్ నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీంతో తన పేరుకు కళంకం ఆపాదించడానికే బోద్రా కోర్టుకు వెళ్లారని రజనీకాంత్ ఆరోపించారు. జార్జ్‌టౌన్ కోర్టులో ఈ కేసు విచారణకు బోద్రా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. దీంతో బోద్రా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎంవీ.మురళీధరన్ నటుడు రజనీకాంత్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. రజనీ న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పిటిషన్‌దారుడు కావాలనే రజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారని, పత్రికలకెక్కి ఆయన పేరుకు కళంకం తీసుకొస్తున్నారన్నారు. బోద్రా తరఫు న్యాయవాది దీన్ని వ్యతిరేకిస్తూ తన వాదనలను వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజున రజనీకాంత్ తరఫున బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
నందమూరి జయకృష్ణకు జైలు శిక్ష
- ఆరు నెలల జైలు, రూ.25 లక్షల జరిమాన విధింపు సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను విధించారు. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించిన వివాదంలో నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. కఠిన శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు స్పందించాల్సిఉంది. -
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితురాలికి జైలు శిక్ష
రంగారెడ్డి: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితురాలకి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.7లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మెజిస్టేట్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తె హరిపురి కాలనీకి చెందిన సుజాత, చాణుక్యపురికి చెందిన భాగ్యలక్ష్మీ పరిచయస్తులు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం భాగ్యలక్ష్మీ 2014 సంవత్పరంలో రూ.7లక్షల రూపాలయను సుజాత నుంచి అప్పుగా తీసుకని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించమని కోరగా అందుకుగాను కరూర్వైశ్యా బ్యాంకు ఎల్బీనగర్ బ్రాంచికి చెందిన రూ.6లక్షల చెక్కును సుజాత పేరిట జారీచేసింది. సదరు చెక్కును ఐసీఐసీఐ బ్యాంకు చైతన్యపురి బ్రాంచిలో జమచేయగా బాగ్యలక్ష్మీ ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు.దీంతో సుజాత నోటీసు పంపిన్పటికి భాగ్యలక్ష్మీ డబ్బు చెల్లించకపోవడంతో సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మెజిస్టేట్ పై విధంగా తీర్పు చెప్పారు. -
చెక్‌బౌన్స్ కేసులో 6 నెలల జైలు
హిందూపురం అర్బన్ : చెక్‌బౌన్స్ కేసులో ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఈశ్వర్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.3,06,780 జరిమానా విధిస్తూ హిందూపురం స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆనందతీర్థ తీర్పునిచ్చినట్లు న్యాయవాది శివశంకర్ మంగళవారం తెలిపారు. ఈశ్వర్ 2013లో హిందూపురం వైశ్యాబ్యాంకుకు చెందిన చెక్కులను ముద్దిరెడ్డిపల్లి మాధవయ్యకు ఇచ్చారు. అయితే ఆ ఖాతాలో డబ్బు లేకపోవడంతో చెక్‌బౌన్స్ అయింది. ఈ కేసును స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో బాధితుడి తరఫున న్యాయవాది శివశంకర్ వాదించారు. ఈ మేరకు జడ్జి విచారణలు చేసి తీర్పు ఇచ్చినట్లు ఆయన వివరించారు. -
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు
గుత్తి: చెక్ బౌన్స్ కేసులో దోషి హెచ్‌సీ గురు ప్రసాద్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏడీజే కే.వెంకటరమణారెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బళ్లారికి చెందిన హెచ్‌సీ గురుప్రసాద్ గుంతకల్లుకు చెందిన నూర్ మహ్మద్‌ల మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. నూర్ మహ్మద్‌కు గురుప్రసాద్ ఏడున్నర లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చడం కోసం నూర్మహ్మద్కు గురుప్రసాద్ చెక్ ఇచ్చాడు. అయితే ఆ చెక్ బౌ¯Œ్స అయింది. దీంతో నూర్‌మహ్మద్ గుంతకల్లు పోలీసు స్టేష¯ŒSలో కేసు పెట్టాడు. పలు విచారణల అనంతరం కేసు బుధవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో గురు ప్రసాద్‌కు ఏడాది శిక్షతో పాటు ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఏడీజే తీర్పు చెప్పారు. ప్రాసిక్యూష¯ŒS తరఫున ఎంవీ మహేష్‌కుమార్ వాదించారు.