చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన మందా మల్లికార్జున్‌రావు తన అవసరాల కోసం 2011 ఆగష్టు 21న ఐదులక్షల రూపాయలను నగరంలోని గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని పోతురాజు బాలా కోరడంతో 2012 జూలై 20న 6.20 లక్షల రూపాయలకు చెక్కును మల్లికార్జున్ రావు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో మల్లికార్జున్‌కు లీగల్ నోటీసును బాలా పంపించాడు.
అప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ విచారించి, మందా మల్లికార్జున్‌రావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ గురువారం తీర్పునిచ్చారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహ రించారు.
మరో కేసులో...
చెల్లని చెక్కు కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన బోడా నాగేశ్వరరావు తన అవసరాల కోసం జనవరి 20, 2011న ఐదులక్షల రూపాయలను ఖమ్మం గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లించేందుకుగాను 2012 జూన్ 2వ తేదీన 6.60లక్షల రూపాయలకు చెక్కును బాలాకు ఇచ్చాడు.
ఇది చెల్లకపోవడంతో నాగేశ్వరరావుకు బాలా లీగల్ నోటీస్ ఇచ్చాడు. దీనికి నాగేశ్వరరావు స్పందించలేదు. దీంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. నిందితుడు బోడా నాగేశ్వరరావుపై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహరించారు.
వేరొక కేసులో...
చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని పీఎస్‌ఆర్ రోడ్డుకు చెందిన అంబడిపుడి నరసింహారావు నుంచి 2011 ఏప్రిల్ 20న లక్ష రూపాయలను బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన డి.నరసింహారెడ్డి తన అవసరాల కోసం అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని నరసింహారావు ఒత్తిడి చేయడంతో 2011 సెప్టెంబర్ 5న లక్ష రూపాయలకు నరసింహారెడ్డి చెక్కు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నరసింహారావు లీగల్ నోటీస్ ఇచ్చాడు. అరుునప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశాడు.
ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు విచారించి, నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ నరసింహారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలంటూ ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు గురువారం తీర్పునిచ్చారు. నరసింహారావు తరఫున న్యాయవాదిగా మద్ది శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు.