Narasimha Rao
-
2సీట్లు ఉన్న కుమార స్వామిని చూసి బుద్ధి తెచ్చుకో.. బాబుపై సీపీఎం నేత ఫైర్
-
పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్‌లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్‌ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. -
రూ.15వేల కోట్లు... ఏపీకి ఇచ్చింది అప్పే
-
15 వేల కోట్లు అప్పే.. కుండబద్దలుగొట్టిన జీవీఎల్
-
సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీకి ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోశాధికారి నరసింహారావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకూ తెలంగాణ విద్యార్థులకు 36 శాతం సీట్లు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 36 శాతం సీట్లు కూడా మన విద్యార్థులకే కేటాయించాలని కోరారు. అదే విధంగా కొత్త వైద్య కళా శాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల వాగ్ధానం చేసిందని పేర్కొన్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సంయుక్తంగా విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.సంస్థ పరిధిలోని 38 సాధారణ పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు, 12 మైనారిటీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లు, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 25,216 మంది పరీక్షకు హాజరయ్యారు.» పాఠశాల స్థాయిలో ఐదో తరగతిలో ఎం.కీర్తి (విశాఖపట్నం జిల్లా), 6వ తరగతి పి.సోమేశ్వరరావు (విజయనగరం జిల్లా), 7వ తరగతి కె.ఖగేంద్ర (శ్రీకాకుళం జిల్లా), ఎనిమిదో తరగతిలో వై.మేఘ శ్యామ్ (విజయనగరం జిల్లా) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. » రాష్ట్రంలోని ఏడు జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,149 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో జి.యశ్వంత్ సాయి, ఎంఈసీ/సీఈసీ విభాగంలో ఎల్.సత్యరామ్ మోహన్ (తూర్పు గోదావరి), బైపీసీ విభాగంలో ఎం.మహిత (కర్నూలు జిల్లా) అత్యధిక మార్కులు సాధించారు. వీరితో పాటు నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను https://aprs.apcfss.in/ లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు. -
వైజాగ్‌లో పురందేశ్వరికి బిగ్ షాక్..!
-
విశాఖ ఆశించాను కానీ.. ఎంపీ సీట్ పై జీవీఎల్ కామెంట్స్
-
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
-
టీడీపీ గూండాలతో లోకేశ్ బలప్రదర్శన: పీవీఎల్
-
తెలుగు సినిమాల్లో ‘తెలంగాణ’ ఆయన కృషే.. అప్పట్లోనే ఆయన అలా..
తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్ హాఫ్‌కు వచ్చింది. ఈ సెకండ్ హాఫ్ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి.. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్ సినిమా, నియో రియలిస్టిక్ సినిమా, పారలెల్ సినిమా, ఆఫ్‌బీట్ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది. ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది– 1975లో. ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్ లవర్స్’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది. బి.నరసింగరావు చేసిన నేరం? ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. 1974–75. రెండేళ్లు. ‘అండర్‌గ్రౌండ్’. హైదరాబాద్‌లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్గ్రౌండ్లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్ సింగ్ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్ డైజెస్ట్’ లాంటి మేగజీన్‌ను నడపడం లేదా సినిమా తీయడం. అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా? ∙∙ ‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్ (మెదక్)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్‌లో ‘అల్వాల్’లో గడిచింది. ‘హైదరాబాద్‌లోని రీగల్ థియేటర్లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజ్‌కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన. పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్‌బుక్స్ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి. ∙∙ సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్ సినిమా ‘దో బిఘా జమీన్’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా. సత్యజిత్ రే వచ్చి ‘పథేర్ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్/పారలెల్ ఫిల్మ్స్ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్ ‘అంకుర్’ (1974) పారలెల్ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్ గోపాల్‌కృష్ణన్ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్ బెనగళ్ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్ ఘౌష్ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి. ∙∙ ‘నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్ నా క్లాస్మేట్. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్‌లో కోల్‌కతా వెళ్లి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్లో పెట్టారు. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్‌సేన్‌ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్ ఘోష్‌ను పంపారు. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్ చందర్ నవల ‘జబ్ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్ ఘోష్ దానికి రాసుకొచ్చిన స్క్రీన్‌ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు. 1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి. కె. విశ్వనాథ్‌తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్. ‘లక్ష అనుకున్న బడ్జెట్ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్‌డోర్‌లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్‌లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్. ∙∙ ‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్ పెయింటర్ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్‌ప్లాయిట్ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్‌లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్. గద్దర్ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది. ∙∙ ‘సీనియర్ జర్నలిస్ట్ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు. 1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్‌గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు. ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్‌లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌లకు ఈ సినిమా చూపిస్తారు. ∙∙ బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్ సెట్ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం. ∙∙ బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన. ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది. ► ‘మట్టి మనుషులు’లో మొదటిసారి నీనా గుప్తాను పరిచయం చేశారు బి.నరసింగ రావు. ఆ సినిమాలో ఆమె భవన నిర్మాణ కూలీగా నటించింది. అందుకోసం రెండువారాలు హైదరాబాద్‌లో ఉండి తెలుగు కొద్దిగా నేర్చుకుంది. సినిమాలో ఆమె పాడే బిట్సాంగ్ ఉంది. అది ఆమే పాడింది. ► ‘దాసి’ కోసం నటి అర్చన స్నానం చేసే సీన్ తీయాల్సి ఉంది. ఒప్పుకోదేమో అనుకున్నారు. కాని అప్పటికే షూట్ జరుగుతున్న విధంలోని సీరియస్‌నెస్‌ను గమనించిన అర్చన ఆ సీన్ తీయడానికి అంగీకరించింది. కేవలం కెమెరామేన్ ఎ.కె.బీర్, తాను మాత్రమే లొకేషన్లో ఉండి మిగిలిన వారిని బయటకు పంపించి ఆ సీన్ తీశారు. ► ‘దాసి’లో దొర వేషం వేసిన భూపాల్ నిజ జీవితంలో శాంత స్వభావి. కాని దొర మనస్తత్వం ఏర్పడటానికి ఇంట్లో కూడా కటువుగా వ్యవహరించమని భూపాల్‌కు నరసింగరావు సూచించారు. షూటింగ్ మొదలయ్యాక భూపాల్ ఇంట్లో కూడా భార్యతో కఠినంగా వ్యవహరిస్తుండేసరికి ఆమె బెదిరిపోయి ఏం జరిగిందో తెలుసుకోవడానికి బి. నరసింగరావు దగ్గరకు వచ్చింది. అలా ఉండమని చెప్పింది తనే కనుక ఏం జవాబు చెప్పాలో తెలియక ఏదో సర్దిచెప్పి పంపించారు. ► బి.నరసింగరావు తెలుగు సినిమాకు పరిచయం చేసినవారిలో దర్శకుడు గౌతమ్ ఘోష్, నటుడు భూపాల్, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, కవి దేవిప్రియ, నటుడు సాయి చంద్, గద్దర్, చిత్రకారుడు చంద్ర తదితరులు ఉన్నారు. తోట వైకుంఠం ‘రంగుల కల’ సినిమాలో కనిపిస్తారు. ‘రంగుల కల’లో గద్దర్ ‘భద్రం కొడుకో’ పాడుతుంటే కోరస్ సింగర్స్‌లో వంగపండు ఒకరిగా కనపడతారు. ► బి.నరసింగరావుకు సంగీతంలో గొప్ప ప్రవేశం ఉంది. ‘దాసి’కి ఆయన కూర్చిన నేపథ్య సంగీతం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు సినిమాల్లో నేపథ్య సంగీతంగా బి.నరసింగరావు సమర్థంగా ఉపయోగించారు. ‘ది సిటీ’ డాక్యుమెంటరీ అందుకు ఉదాహరణ. ► ‘రంగుల కల’లో క్రేన్ ఉపయోగించి ఒక షాట్ తీయాల్సి వచ్చింది. కాని క్రేన్‌కు అద్దె ఎక్కువ. తక్కువ బడ్జెట్లో తీస్తున్న సినిమా కనుక కార్పొరేషన్ వారు వీధి దీపాలు మార్చడానికి ఉపయోగించే నిచ్చెన వాడి ఆ షాట్ తీశారు. ► బి.నరసింగరావు మంచి నటులు. ‘మా భూమి’లో ముఖ్యపాత్ర పోషించారు. రజాకార్లు తల మీద వాత పెట్టగా ఆ బాధ పట్టక జనం కోసం మాట్లాడే పాత్ర అది. ‘రంగుల కల’లో బి.నరసింగరావు హీరో. రూప హీరోయిన్. ఆ సినిమాలో ‘కౌగిలించుకోని’ హీరో హీరోయిన్లను చూపించడం ఒక వింత. ఎందుకంటే అప్పటికి హీరో హీరోయిన్ల గెంతులు శ్రుతి మించి ఉన్నాయి. - ఖదీర్ -
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రం ప్రారంభం
-
‘సీనయ్య’గా వినాయక్..
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. మంగళవారం రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అందులో వినాయక్ మెకానిక్ షెడ్లో నుంచి నడిచివస్తున్నట్టు చూపించారు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఈ సినిమాలో పాత్ర కోసం వినాయక్ బరువు తగ్గారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వినాయక్ పుట్టినరోజున(అక్టోబర్ 9) ప్రారంభం కానుంది. దర్శకుడిగా పలువురు తెలుగు హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన వినాయక్.. ఈ చిత్రంలో హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి. -
వినాయక్ సినిమా మొదలవుతోంది!
కమర్షియల్ దర్శకుడిగా ఒకప్పుడు వరుస విజయాలు సాధించన వీవీ వినాయక్ ఇటీవల కాలంలో ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే దర్శకుడిగా నిరాశపరుస్తున్న ఈ సీనియర్ డైరెక్టర్ త్వరలో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. వినాయక్ హీరోగా త్వరలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వినాయక్ కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాతో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ప్రారంభించనున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా కథ 1980ల కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. వినాయక్ లుక్, బాడీ లాంగ్వేజ్, ఏజ్‌కు తగ్గ కథ కావటం దిల్ రాజు స్వయంగా మాట్లాడి వినాయక్ ను హీరోగా ఒప్పించారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
వండవదొరకు కన్నీటి వీడ్కోలు
వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, ప్రజల మనిషి విశ్వాసరాయి నరసింహరావుదొర(95) అంతిమ వీడ్కోలు స్వగ్రామం వీరఘట్టం మండలం వండవలో మంగళవారం జనసందోహం మధ్య నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఐదుగురు కుమార్తెలు, కుమారుల కుటుంబ సభ్యులు సుమారు 80 మంది తరలివచ్చి వండవదొర పార్థివదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. భార్య శాంతకుమారి, చిన్న కుమార్తె, ప్రస్తుత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఇతర కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జనసంద్రమైన వండవ.. అజాత శత్రువుగా పేరున్న వండవదొర పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన రాజకీయ ప్రముఖులు, బంధువులు, గిరిజన సంఘం నాయకులు, అధికారులతో వండవ జనసంద్రంగా మారింది. అంత్యక్రియల్లో పాల్గొని వండవదొర అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ నిమ్మక పాండురంగ, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు తరలివచ్చి వండవదొరకు కన్నీటి వీడ్కోలు పలికారు. మామిడితోటలో అంత్యక్రియలు.... వండవదొర కోరిక మేరకు ఆయన మామిడితోటలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు లక్ష్మణరావు తలకొరివి పెట్టగా చిన్నల్లుడు మండంగి హరిప్రసాద్, మనవడు కుమిధిన్, తమ్ముడు లక్ష్మీనారాయణదొర, అతని పిల్లలు అంత్యక్రియలు పూర్తి చేశారు. భారీ బందోబస్తు.. వండవదొర భౌతిక కాయాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు తరలిరావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలకొండ డీఎస్పీ రారాజుప్రసాద్, సీఐ ఆదామ్ ఆద్వర్యంలో వీరఘట్టం, పాలకొండ, రేగిడి, సీతంపేట ఎస్ఐలు గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రుల పరామర్శ.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కుటుంబాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లు పరామర్శించారు. వీరితో పాటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాసరావు తదితరులు వండవదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వండవదొర కుటుంబ నేపథ్యాన్ని పాలవలస విక్రాంత్ వివరించారు. అంతకుముందు అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఆగస్టులో ఆరంభం
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వీవీ వినాయక్ ఇక నటుడిగా లొకేషన్లోకి అడుగుపెట్టనున్నారు. అవును.. వీవీ వినాయక్ లీడ్ రోల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మిస్తారు. నరసింహ రావు దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు రెండోవారంలో టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. సెట్లో నటీనటులతో ఎలా చేయాలో చెప్పి, చేయించుకున్న వినాయక్‌కి నటన పెద్ద కష్టం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
దిల్ రాజు బ్యానర్లో వీవీ వినాయక్ హీరో
-
హీరోగా మారనున్న మాస్ డైరెక్టర్
ఆది లాంటి సూపర్ హిట్ సినిమాతో పరిచయం అయిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్. హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో సూపర్బ్ అనిపించుకున్న వినాయక్ దిల్, ఠాగూర్, కృష్ణ, అదుర్స్, ఖైదీ నంబర్ 150 లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇటీవల వరుస తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వినాయక్ త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. త్వరలో వినాయక్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. గతంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. అయితే దర్శకుడు నరసింహరావు వినాయక్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న దిల్ రాజు అక్కడే ఈ విషయాన్ని ధృవీకరించారు. దిల్ రాజుగా తనను నిలబెట్టిన వివి వినాయక్‌ను తమ బ్యానర్లో త్వరలోనే నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటించమని వినాయకే కోరారని దిల్ రాజు తెలిపారు. దర్శకుడిగా ఫామ్ కోల్పోయిన వినాయక్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దిల్ రాజు బ్యానర్లో వీవీ వినాయక్ హీరో -
అధికార కుట్ర
ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో చిచ్చుపెట్టే కుట్ర.. ఫ్యాక్షన్‌కు దూరంగా బతుకుతున్న గ్రామాల్లో అలజడి రేపే కుయుక్తులు.. సినీ ఫక్కీలో నాటు బాంబులు ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయించేందుకు అధికార పార్టీ నేతల పథక రచన.. మొత్తంగా రెండు దశాబ్దాలుగా బాంబుల మోతలు లేని పల్నాడులో మళ్లీ నాటు బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున నాటు బాంబులు దొరికాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబుల తతంగంతో పల్నాడు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. సాక్షి, గుంటూరు, రెంటచింతల: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో ఆయన ఇంటికి అతి సమీపంలో శుక్రవారం నాటు బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నాటు బాంబులు పట్టుబడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గుంటూరుకు చెందిన 10 మంది డాగ్ స్క్వాడ్, మరో 10 మంది బాంబు స్క్వాడ్‌తోపాటు 30 మంది పోలీసులతో గురజాల రూరల్ సీఐ బీ నర్సింహారావు, మాచర్ల సీఐ జీ సాంబశివరావు నేతృత్వంలో కారంపూడి ఎస్ఐ ఎం మురళితో కలిసి రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు జరిపారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత యరపతినేని నరసింహారావు నివాసం ముందు ఉన్న వాహనం కింద ప్లాస్టిక్ బకెట్లో నాటు బాంబులను పోలీసు జాగిలాలు గుర్తించాయి. పోలీసులు నరసింహారావు కుటుంబ సభ్యులను నిద్రలేపి బాంబులు ఉన్న విషయం చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఆ బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నరసింహారావునును అదుపులోకి తీసుకుని గురజాల డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో విచారించారు. అన్నీ అనుమానాలే.. పోలీసులు తనిఖీలకు వచ్చిన రోజే నరసింహారావు ఇంటి ముందు నాటు బాంబుల బకెట్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గురజాల ఎమ్మెల్యేకు వరుసకు తమ్ముడు అయిన నరసింహారావు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బాంబులతో నరసింహారావును హత మార్చేందుకు ప్రత్యర్థులు ఆయన కారు కింద ఉంచారో? అక్రమ కేసులో ఇరికించి వేధింపులకు గురి చేసేందుకే కుయుక్తులు పన్నారో ? తెలియాల్సి ఉంది. ఒక వేళ నరసింహావు బాంబులు తెచ్చి ఉంటే నడి రోడ్డుపై తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు కింద ఎందుకు పెడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గ్రామంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసినా వాటిని అక్కడ ఎందుకు వదిలేస్తారనే చిన్న లాజిక్కును టీడీపీ నేతలు, పోలీసులు విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే ? మంచికల్లులో టీడీపీ నుంచి ముఖ్య నేతలు, భారీ స్థాయిలో కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. దీంతో గ్రామంలో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే నాటు బాంబులను తెచ్చి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత తన స్వగ్రామంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బాంబుల కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నరసింహారావు ఈ ఏడాది మేలో మాజీ సర్పంచ్‌లు గీదా సీతారామిరెడ్డి, గోగుల లక్ష్మీ పుల్లారెడ్డి, బొల్లినేని లక్ష్మీ నారాయణతో కలిసి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నరసింహారావు కుమారుడు శివాజీ సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టింగ్‌లు పెడుతుండే వాడు. శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు తెనాలి వెంకట నారపరెడ్డితోపాటు మరో ముగ్గురు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు పెట్టారని కేసు నమోదు చేశామని వెల్లడించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు నాటు బాంబుల కలకలంతో మంచికల్లులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం అమ్మవారి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుంతుందోనని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
టీడీపీ నేతల వల్లే వేధింపులు
-
మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని విద్యాసంస్థల ఏర్పాటు వందశాతం పూర్తి చేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కొన్ని సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు రాలేదని అయినా ఇబ్బందులు తొలగించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మెకా అనే సంస్థ నివేదిక ఇచ్చిందని, ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం రాష్ట్రప్రభుత్వమే చూపించాలని హరిబాబు డిమాండ్ చేశారు. త్వరలోనే రైల్వేజోన్‌పై నిర్ణయం రానుందని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విడుదలలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు వివక్ష ఉండదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత సాయం అందించడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు. సంస్థల భవనాల నిర్మాణాల పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఏపీ విభజన జరిగిన ఏడాదిలోనే ప్రత్యేక దూరదర్శన్ ఏర్పాటు చేశారని, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్‌లకు 17సంత్సరాల తర్వాత దూరదర్శన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. కేంద్రానికి ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందువల్లే అభివృద్ధి చెందుతోందని అన్నారు. తమని పొగడాల్సిన అవసరం లేదని, కానీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిధులు ఇస్తే మా హక్కు లేదంటే మోదీ పాపం అంటూ ప్రచారం చేయడం తప్పు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. తాము కేంద్రం తరపున మాట్లాడుతున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఇది కేవలం రాజకీయ అస్త్రమేనని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాయితీలు ఇచ్చామని, ఏడు జిల్లాల్లో ఏం మాత్రం పెట్టుబడులు తెచ్చారో తెలుగుదేశం నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రజలను రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం, తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఏపీ ప్రజల గొంతు కోసిందని, హైదరాబాద్‌లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేసినందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
బాలికపై టీడీపీ నేత లైంగికదాడి
హైదరాబాద్: బిస్కెట్ ప్యాకెట్‌ను ఆశగా చూపి ఓ గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు చెందిన కోవూరి అయ్యప్ప, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె(12) తల్లికి తోడుగా ఇళ్లల్లో పాచి పనిచేస్తుంటుంది. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, జిల్లా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు బాలికకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఈ నెల 12వ తేదీన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులకు పిర్యాదు చెయ్యగా నరసింహరావును అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. నెల్లూరు మంత్రి నారాయణ ఇందులో కలగజేసుకుని కేసును నీరుగార్చేందుకు పూనుకున్నట్లు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. సోమవారం నారాయణగూడ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్టాడుతూ బాధితురాలి తల్లిదండ్రులు పిర్యాదు చేసినా కేసు నమోదు చెయ్యలేదని తెలిపారు. దీంతో నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు నరసింహారావుపై ఫొక్సోయాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తున్న తరుణంలో మంత్రి నారాయణ నేరుగా బాధితురాలి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అనంతరం 15వ తేదీ నుంచి బాధితురాలు, కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమని వారన్నారు. తక్షణం నిందితుడ్ని అరెస్ట్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేశారు. -
ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల చరణ్ అనే బాలుడు ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. అస్వస్థతతో ఉన్న చరణ్‌ను కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి సమయంలోఆర్‌ఎంపీ నరసింహారావు వద్దకు తీసుకెళ్లారు. తొలుత రెండు ఇంజక్షన్లు ఇచ్చిన అతడు... కొద్దిసేపటి తర్వాత మరో రెండు ఇంజక్షన్లు ఇచ్చాడని, అనంతరం పరిస్థితి విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చరణ్ కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు
-
కెరీర్‌కు వెలుగునిచ్చే కోర్సులు...
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎస్ఏయూ), శ్రీ పి.వి. నరసింహారావు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ ఫర్ వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్,శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. దీనిపై స్పెషల్ ఫోకస్... తెలంగాణ ఎంసెట్-2015 (బైపీసీ స్ట్రీమ్) ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులు బీఎస్సీ(అగ్రికల్చర్) కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్; అగ్రికల్చరల్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం; అగ్రికల్చరల్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 252. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడపల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 16. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్): కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 15ూ. కోర్సు కాల వ్యవధి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స, రాజేంద్రనగర్, హైదరాబాద్; కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స, కోరుట్ల, కరీంనగర్ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.సీట్ల సంఖ్య 108. కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు. బీఎఫ్ఎస్సీ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స, నెల్లూరులో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 10ూ. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్; కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, కొత్తకోట, మహబూబ్‌నగర్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 100. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. అర్హత: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్ లేదా నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.(ూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 371(ఛీ) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 36 శాతం సీట్లు.) అగ్రికల్చర్ కోర్సుల్లో థియరీతోపాటు ప్రాక్టికల్ శిక్షణ! దేశంలో ఫుడ్ టెక్నాలజీ, సీడ్ టెక్నాలజీ తదితర వ్యవసాయాధారిత రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రానున్న పదేళ్లలో ఈ రంగంలో గణనీయ అభివృద్ధి చోటుచేసుకోనుంది. ఈ నేపథ్యంతో వ్యవసాయ రంగంలో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులనభ్యసించిన వారికి విస్తృత అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లోనూ విద్యార్థులకు శిక్షణ లభిస్తోంది. కోర్సులో చివరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి రైతులతో కలిసి పనిచేసి, ప్రాక్టికల్ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో విద్యార్థులను ఏదైనా ఒక పరిశ్రమకు కూడా అనుసంధానిస్తా రు. మన రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే అగ్రిక ల్చర్ కోర్సులు అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్యావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. - డాక్టర్ పీవీ రావు, ప్రొఫెసర్ అండ్ హెడ్(రిటైర్డ్), అగ్రికల్చర్ కాలేజీ, పీజేటీఎస్ఏయూ- హైదరాబాద్. ఇంటర్మీడియెట్ అర్హతతో కోర్సులు బీఎస్సీ(ఆనర్స్) హోమ్‌సైన్స్ (బాలికలకు మాత్రమే): కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 47.అర్హత: ఇంటర్లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. హోంసైన్స్ మూడేళ్ల డిప్లొమా కోర్సు లో ఉత్తీర్ణులు పది శాతం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ(ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ: కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 14. అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ లేదా పాలిటెక్నిక్‌లో హోంసైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. మొత్తం 14 సీట్లలో 7 సీట్లను ఇంటర్ ఒకేషనల్ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్(సీజీడీఎం) కోర్సు చేసిన వారికి కేటాయించారు. బీఎస్సీ(ఆనర్స్) ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్: కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 14. అర్హత: ఇంటర్మీడియెట్ (10+2)లో బైపీసీ/ ఎంబైపీసీ ఉత్తీర్ణత. లేదా హోంసైన్స్ సంబంధిత సబ్జెక్టులు/ న్యూట్రిషన్/ బయో కెమిస్ట్రీ/హ్యూమన్ ఫిజియాలజీతో ఇంటర్ ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత. పాలిటెక్నిక్ (హోంసైన్స్) కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులు. తెలంగాణ ఎంసెట్-2015(ఎంపీసీ స్ట్రీమ్) ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులు బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్): కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్; కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిర అనంతపురం ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 90. వీటిలో 32 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 58 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది. బీటెక్(ఫుడ్ టెక్నాలజీ): లేజ్ ఆఫ్ ఫుడ్సైన్స అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడపల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 27. వీటిలో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 17 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది. బీఎస్సీ(కమర్షియల్ అగ్రికల్చరల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్): కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 12. వీటిలో 4 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 8 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది.ప్రవేశం: ఎంపీసీ స్ట్రీమ్‌లో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. దరఖాస్తు విధానం: ఎంసెట్(బైపీసీ స్ట్రీమ్), ఇంటర్మీడియెట్ ఆధారంగా జరిగే ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు వెబ్సైట్లో లభిస్తాయి. పూర్తి చేసిన దరఖాస్తులను కంప్ట్రోలర్, పీజేటీఎస్ఏయూ పేరుతో హైదరాబాద్‌లో చెల్లుబాటయ్యేలా తీసిన డీడీతో సహా కింది చిరునామాకు పంపాలి. రిజిస్ట్రార్, పీజేటీఎస్ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్-30 దరఖాస్తులకు చివరి తేది: 2015 జూన్ 25 వెబ్సైట్: www.pjtsau.ac.in/ కెరీర్ అవకాశాలు బీఎస్సీ-అగ్రికల్చర్ ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ విభాగాలు; వ్యవసాయం ఆధారంగా పనిచేస్తున్న ఆర్థిక సంస్థలు; బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు; ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సంస్థలు; అగ్రీ బయోటెక్ సంస్థలు; వ్యవసాయ విద్యను అందిస్తున్న సంస్థలు, పరిశోధన సంస్థలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ. 20 వేల వరకు వేతనం లభిస్తుంది. బీఎస్సీ (సీఏ అండ్ బీఎం) బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. బీటెక్-ఫుడ్ టెక్నాలజీ హోటల్ పరిశ్రమలో వీరికి డిమాండ్ అధికంగా ఉంది. ఆహార పదార్థాల తయారీ, ఆహార నాణ్యత విభాగాల్లో అవకాశాలు పుష్కలం. ఆహార శుద్ధి, నిల్వ, ప్యాకేజింగ్ పరిశ్రమల్లోనూ ఉద్యోగాలుంటాయి. పరిశోధన సంస్థల్లోనూ, విద్యా సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రారంభంలో రూ.15 వేల వరకూ వేతనం లభిస్తుంది. బీఎస్సీ ఆనర్స్ (హోంసైన్స్) ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూ ల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు; డైట్ కౌన్సెలింగ్ కేంద్రా లు, విద్యా సంస్థలు;పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటా యి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది. బీఎస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో మర్కండైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలస్ట్రేటర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఎగుమతి సంస్థ లు, వస్త్ర మిల్లులు, బోటిక్‌ల్లోనూ అవకాశాలున్నాయి. ఫ్యాషన్ షోల నిర్వాహకులు కూడా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశాలిస్తున్నారు. ప్రారంభంలో రూ. 15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. సృజనాత్మకతతో ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. బీఎస్సీ (ఆనర్స్) ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆసుపత్రుల్లో డైటీషియన్లు, డైట్ కన్సల్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వసతి గృహాలు, హోటళ్లు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. పాఠశాలలు, కళాశాలలు కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నాయి. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ. 20 వరకు వేతనం ఉంటుంది. బీఎఫ్ఎస్సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్, ఫిషింగ్ గీయర్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో వివిధ హోదాలను అందుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదా యం పొందొచ్చు. ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ.45వేల వేతనం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. బీఎస్సీ హార్టికల్చర్ (ఆనర్స్) వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.10 వేల వేతనం వస్తుంది. ప్రభుత్వ రంగంలో హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్లు, ఆఫీసర్ తదితర హోదాలు పొందొచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లాలనుకుంటే సొంతంగా నర్సరీలు, ఫార్మ్ సెంటర్లను నెలకొల్పవచ్చు. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్లకు అవకాశాలుం టాయి. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ సంస్థ లు, పరిశోధన సంస్థలు, మైక్రో ఇరిగేషన్ సంస్థలు, డైరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. -
కోరికలే... దెయ్యాలైతే!
శ్రీ మన్మథ, రాజీ జంటగా వరసాల సరస్వతి, నరసింహారావు సమర్పణలో గూన అప్పారావు దర్శకత్వంలో వరసాల సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవును-నేనే’. నిర్మాత మాట్లాడుతూ -‘‘దాదాపు 21 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. ఇది మంచి రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘దెయ్యాలు, పిశాచాలు కోరికలతో రగిలిపోతున్న మనుషుల దేహాల్లో నివాసం ఉంటాయనే కథతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు. -
చెల్లని చెక్కులు... ముగ్గురికి జైలు
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన మందా మల్లికార్జున్‌రావు తన అవసరాల కోసం 2011 ఆగష్టు 21న ఐదులక్షల రూపాయలను నగరంలోని గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని పోతురాజు బాలా కోరడంతో 2012 జూలై 20న 6.20 లక్షల రూపాయలకు చెక్కును మల్లికార్జున్ రావు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో మల్లికార్జున్‌కు లీగల్ నోటీసును బాలా పంపించాడు. అప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ విచారించి, మందా మల్లికార్జున్‌రావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ గురువారం తీర్పునిచ్చారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహ రించారు. మరో కేసులో... చెల్లని చెక్కు కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన బోడా నాగేశ్వరరావు తన అవసరాల కోసం జనవరి 20, 2011న ఐదులక్షల రూపాయలను ఖమ్మం గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లించేందుకుగాను 2012 జూన్ 2వ తేదీన 6.60లక్షల రూపాయలకు చెక్కును బాలాకు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నాగేశ్వరరావుకు బాలా లీగల్ నోటీస్ ఇచ్చాడు. దీనికి నాగేశ్వరరావు స్పందించలేదు. దీంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. నిందితుడు బోడా నాగేశ్వరరావుపై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహరించారు. వేరొక కేసులో... చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని పీఎస్ఆర్ రోడ్డుకు చెందిన అంబడిపుడి నరసింహారావు నుంచి 2011 ఏప్రిల్ 20న లక్ష రూపాయలను బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన డి.నరసింహారెడ్డి తన అవసరాల కోసం అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని నరసింహారావు ఒత్తిడి చేయడంతో 2011 సెప్టెంబర్ 5న లక్ష రూపాయలకు నరసింహారెడ్డి చెక్కు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నరసింహారావు లీగల్ నోటీస్ ఇచ్చాడు. అరుునప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు విచారించి, నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ నరసింహారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలంటూ ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు గురువారం తీర్పునిచ్చారు. నరసింహారావు తరఫున న్యాయవాదిగా మద్ది శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. -
కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు అక్షయ గోల్డ్ ఆస్తిని అక్రమంగా రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ విజయవాడ : నగరంలో మరో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బట్టబయలైంది. కస్టమర్లకు కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టిన ఓ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఆస్తులను కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌ను గురువారం సస్పెండ్ చేశారు. అక్షయ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి రెండేళ్ల క్రితం బోర్డు తిప్పేసింది. ఈ కేసు విచారిస్తున్న సీబీసీఐడీ అధికారులు ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్షయ గోల్డ్ ఆస్తుల లావాదేవీలన్నీ నిలిపివేయాలని కొద్దిరోజుల క్రితం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులను కమిషనర్ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. అయితే గత ఏప్రిల్‌లో నూజివీడు ప్రాంతంలో అక్షయగోల్డ్ ఫైనాన్స్‌కు చెందిన 6.50 ఎకరాల భూమిని మరొకరి పేరుతో రిజిస్టర్ చేసినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం కంకిపాడు సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆర్.కె.నరసింహారావు గుణదల జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో విచారణలో ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. హైకోర్టు ఆదేశాలు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఉత్తర్వులను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై సీబీసీఐడీ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ విజయవాడ డీఐజీ లక్ష్మీనారాయణరెడ్డిని ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. డీఐజీ సూచనల మేరకు విజయవాడ తూర్పు డీఆర్ బాలకృష్ణ దీనిపై దర్యాప్తు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అక్షయగోల్డ్ భూమిని రిజిస్టర్ చేసినట్లు బాలకృష్ణ గుర్తించి నివేదిక అందజేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ నరసింహారావును డీఐజీ సస్పెండ్ చేశారు. కంకిపాడుకు నూతన సబ్ రిజిస్ట్రార్‌గా బిక్కవోలు నుంచి ఎన్.ఎం.వి.త్రినాథరావును నియమించారు. ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ అక్షయ గోల్డ్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసిన కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్‌పై వేటు పడింది. దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ విజయవాడ డీఐజీ గురువారం ఆదేశాలిచ్చారు. -
డీఈఓగా నరసింహారావు
భానుగుడి (కాకినాడ) : జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)గా ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో పని చేస్తున్న నరసింహారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీఈఓగా ఉన్న కేవీ శ్రీనివాసులురెడ్డి గుంటూరుకు బదిలీ అయ్యారు. శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి 2012-13లో రెండోస్థానంలో, 2013-14లో ప్రథమస్థానంలో నిలిచింది. రానున్న ఆ స్థానాన్ని నిలబెట్టడంలో డీఈఓ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతి విద్యార్థి పరీక్షల ఫలితాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచడం, డ్రాపవుట్లను, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడాన్ని నిరోధించడం, విధి నిర్వహణలో అలసత్వం వహించే ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, కోర్టు కేసులు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్, ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం వంటి పలు విషయాలు డీఈఓకు సవాళ్లు కానున్నాయి. -
నేను సంపాదించుకున్నది అదే..
బూర్గుల రామకృష్ణారావు.. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి! ఆయన నడతే అతని వారసులకు సంపదైంది. ఆ సంపదను రెండింతలు చేసి ఆ పరంపరను నిలిపాడు రామకృష్ణారావు తమ్ముడి కొడుకు బూర్గుల నర్సింగ రావ్! కమ్యూనిస్ట్ లీడర్‌గా, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్‌గా పనిచేసి ప్రస్తుతం ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారాయన. నేడు... బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి.. ఈ సందర్భంగా నర్సింగరావు తన పెద్దనాన్న గురించి మననం చేసుకున్నారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. పెద్దనాన్న (బూర్గుల రామకృష్ణారావు) మృదుస్వభావి. లిబరల్గా ఉండేవారు. తెలుగు, ఉర్దూ, పర్షియన్, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో దిట్ట. మా కుటుంబంలో ఇంగ్లిష్ మా పెద్దనాన్న, నాన్నతోనే మొదలైంది. పెద్దనాన్నకు మరాఠీ, కన్నడ భాషలూ తెలుసు. కేరళకు తొలి గవర్నర్‌గా వెళ్లి మలయాళం కూడా నేర్చుకున్నాడు. ఉమర్ఖయ్యాం పర్షియన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఇక్కడి ధర్మవంత్ స్కూల్లో స్కూలింగ్, నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి పుణే ఫెర్గ్యూసన్ కాలేజ్‌లో బీఏ, ముంబైలో ఎల్ఎల్బీ చేశారు. సిటీకి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. పెదనాన్న దగ్గర పీవీ నరసింహారావు జూనియర్‌గా ఉండేవారు. ఫుల్‌టైమ్ పాలిటిక్స్.. 1944, 45 నుంచి ఫుల్‌టైమ్ పాలిటిక్స్లోకొచ్చారు. ఆయన హైదరాబాద్ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయి ‘దిల్కుషా’లోకి మారేంత వరకు మాది ఉమ్మడి కుటుంబమే. ఆంధ్రజన సంఘం, ఆంధ్రమహాసభ రెండింట్లోనూ యాక్టివ్‌గా ఉండేవారు. రెండో ఆంధ్రమహాసభకు పెద్దనాన్నే అధ్యక్షుడు. గాంధీగారి ప్రభావం చాలా ఉంది ఆయన మీద. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అక్కడ గాంధీ నిరాహారదీక్ష చేస్తే, ఇక్కడ పెద్దనాన్నా నిరాహార దీక్ష చేశారు. ఆయనను చూసి నేనూ ఉపవాసం ఉన్నాను. నాపై ఆయన ప్రభావం అంతలా ఉండేది. ఒక్కమాటా అనలేదు.. నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై అండర్ గ్రౌండ్‌కీ వెళ్లాను. నేను అరెస్ట్ అయినప్పుడు పెద్దనాన్న మినిస్టర్ కూడా. మా నాన్న చాలా కోపిష్టి. ఆయనకు విరుద్ధం పెద్దనాన్న. నేను విడుదలై వచ్చాక నా మీద కోపంతో నాన్న అరుస్తుంటే.. ‘వాడిమీద అట్లా అరవకు, నెమ్మదిగా చెప్పు’ అనేవారు పెద్దనాన్న. అంతేతప్ప ఎప్పుడూ నా దారి మార్చుకొమ్మని అనలేదు. 1952లో ముల్కీ ఉద్యమమప్పుడు.. నేను నిజాం కాలేజ్‌లో ఎంఏ చదువుతున్నాను. సిటీ కాలేజ్ నుంచి కోఠీ ఇప్పటి ఈఎన్టీ హాస్పిటల్ వరకు పెద్ద ర్యాలీ తీశాం. కోఠీ వరకు వచ్చాక నేను క్యాంపస్ వెళ్లిపోయాను. ర్యాలీ అబిడ్స్‌వైపు మళ్లింది. అందులో కొందరు స్టూడెంట్స్‌కి ఈఎన్టీ హాస్పిటల్ ఆవరణలో ముఖ్యమంత్రి కారు కనిపించేసరికి లోపలకు వచ్చి కారును కాల్చేశారు. అయితే మా పెద్దమ్మ ఆ కారులో హాస్పిటల్లో జరుగుతున్న ఓ మహిళామండలి మీటింగ్‌కి వచ్చింది. కారును కాల్చేస్తున్నప్పుడు ఆమె మీటింగ్‌లో ఉంది. ‘కొడుకు కాబట్టి రామకృష్ణారావు ఏమనట్లేద’ని పెదనాన్నను కొందరు కామెంట్ చే శారు. ఆయన చెప్పలేదు.. నేనూ ఇబ్బంది పెట్టలేదు కమ్యూనిస్ట్ ముద్రతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉన్నా. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా.. కానీ ఉద్యోగం ఇప్పించమని ఆయనను అడగలేదు. ఆయనా రెకమెండ్ చేయలేదు. ఒక్కసారి.. జైలు నుంచి వచ్చాక మళ్లీ కాలేజ్‌లో చేరడానికి పర్మిషన్ ఇప్పించమని అడిగా. అప్పుడు ఉస్మానియా వీసీ అలియావర్ జంగ్. అలియావర్జంగ్కి ఓ ఉత్తరం రాసి నన్ను వెళ్లి కలవమని చెప్పారు. ఆయనకు ఫోన్ కూడా చేశారు. అలియావర్ జంగ్ని వెళ్లి కలిశా... ‘అసలు అటెండెన్స్ లేకుండా పర్మిషన్ ఎలా ఇస్తారు?’అన్నారాయన. ‘మీరు తలుచుకుంటే అవుతుంది’ అన్నా. ‘కుదరదు’ అని కరాఖండిగా చెప్పి మా పెద్దనాన్నకు ఫోన్ చేశారు ‘పర్మిషన్ ఇవ్వడం వీలుకాదు. అంతమాత్రాన వర్రీ కావల్సిందేం లేదని చెప్పండి. నవంబర్‌లో ఎగ్జామ్స్ రాయమనండి’ అని. ఇంకోసారి.. చైనాలో జరుగుతున్న ఓ స్టూడెంట్ కాన్ఫరెన్స్‌కి వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌కి అప్లయ్ చేసుకుంటే రిజెక్ట్ అయింది. పెద్దనాన్నకి చెప్తే నవ్వి ఊరుకున్నారు అప్పటికి. నెల్లాళ్ల తర్వాత అడిగారు నీ పాస్‌పోర్ట్ ఏమైంది? అని. ‘మీ గవర్నమెంట్ ఇవ్వనంది కదా’ అన్నా. అప్పటికి సెలైంట్‌గా ఊరుకొని సెంట్రల్ మినిస్టర్‌కి నాకు పాస్‌పోర్ట్ జారీ చేయమని ఉత్తరం రాశారు ! అంతే! ఈ రోజు హైదరాబాద్ సమాజంలో నాకున్న స్థానం... రెస్పెక్ట్.. నా అంతట నేను సంపాదించుకుందే! ఆయన గౌరవాన్ని కాపాడానే తప్ప ఇరకాటంలో పెట్టలేదు. ఆయన మాకు నేర్పిన విలువా అదే! - సరస్వతి రమ -
అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందే
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో కుంగిన అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందేనని ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ), చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు సూచించారు. ఆరు రోజుల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలోని కంచుగడప సమీపంలో ఉన్న అష్టోత్తరలింగ మండపం కుంగిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించడానికి చెన్నైకి చెందిన ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గోపురాల ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యుడు నరసింహారావును ఆలయ అధికారులు పిలిపించారు. మరో నిపుణుడు జీఎస్ రెడ్డితో కలసి ఆయన అష్టోత్తరలింగ మండపాన్ని, ఆలయంలోని నాలుగు గోపురాలను, చిన్న చిన్న మండపాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ అష్ఠోత్తరలింగ మండపాన్ని మరమ్మతులు చేస్తే సరిపోదు. పూర్తిగా తొలగించి నూతన మండపాన్ని నిర్మించాల్సిందే. మండప బీమ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఏక్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండప బీమ్‌కు ఆధారంగా చెక్కలు ఒక్కచోట పెడితే సరిపోదు. పదిచోట్ల చెక్కలు ఏర్పాటు చేయాలి. ఈ మార్గంలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయండి. ఆలయంపైన పిచ్చిమొక్కలు, కొబ్బరి చిప్పలు నూనె డబ్బాలు ఉంచవద్దు అని సూచించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు మండపం మొత్తం బీమ్‌కు ఆధారంగా చెక్కలను పెట్టారు. ఆమేరకు నూతన మండపం నిర్మాణానికి ఆలయ ఈఈ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మండపం తొలగింపునకు రూ.1.5 లక్షలు, నూతన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. -
రాజధాని ప్రకటన కోడ్ ఉల్లంఘనే
నరహరశెట్టి నరసింహారావు నందిగామ : జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటి కీ నిబంధనలకు విరుద్ధంగా విజయవాడను రాజధానిగా ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు స్పష్టం చేశారు. నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమి భయంతో ఒక్కసారిగా రాజధాని విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి ప్రకటించిందన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నప్పటికీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రకటించటం స్వార్థపూరిత నిర్ణయమన్నారు. మూడు నెలల తెలుగుదేశం పాలనలో ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండ డంతో అది గుర్తించిన ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించేందుకు రాజధాని ప్రకటించిందన్నారు. వారు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్‌రావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడెక్కడ భారీ మొత్తంలో చందాలు వసూలు చేసి ఖర్చుపెట్టేది వివరాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల వారి వద్ద నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిధులు సేకరిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువకులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార న్నారు. ఈ నెల ఏడో తేదీన నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిరంజీవి ఫ్యాన్స్ సమావేశం జరుగనున్నట్లు తెలిపారు. వేల్పుల పరమేశ్వరరావు, నాయకులు తలమాల డేవిడ్‌రాజు, ఎస్కే జాఫర్, అప్పసాని సందీప్, వెలగ లేటి రామయ్య, శివాజి, ఆకుల శ్రీనివాసరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నిజమే.. వజీర్‌ను చితక్కొట్టారు
సాక్షి, ఏలూరు/దెందులూరు : స్కూల్ కరస్పాండెంట్ చావబాదడంతో మతిస్థిమితం కోల్పోయిన నాలుగో తరగతి విద్యార్థి ఉదంతంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న వజీర్‌ను ఆ స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లా విచక్షణా రహితంగా కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయాడని వజీర్ తండ్రి హిదయతుల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, కలెక్టర్ స్పందించారు. హుటాహుటిన విద్యాశాఖ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దీంతో దెందులూరు ఎంఈవో వి.రంగప్రసాద్‌ను విచారణాధికారిగా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎంఈవో రంగప్రసాద్ ఆ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. ఉపాధ్యాయులు అఫీజుల్లా, నుజమిల్, 6వ తరగతి విద్యార్థులు అనిష్, అబ్దుల్ రెహమాన్ షాలిక్‌తోపాటు మరో 12 మందిని విడివిడిగా విచారించిన ఎంఈవో వివరాలు నమోదు చేశారు. కొట్టిన విషయం వాస్తవమే... ఘటన జరిగిన రోజున విద్యార్థి వజీర్ కరస్పాండెంట్ ఉంటున్న గదిలోకి వెళ్లి పాస్ పోసినట్టు విచారణాధికారికి ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన కరస్పాండెంట్ వజీర్‌ను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. వజీర్ బాగా చదువుతాడని, క్రమశిక్షణతో ఉంటాడని విద్యార్థులు వాగ్మూ లం ఇచ్చారు. అయితే వజీర్ తరచూ కిందపడిపోతూ ఉంటాడని, అతనికి ఫిట్స్ ఉందని కొందరు చెప్పినట్టు విచారణాధికారి తెలిపారు. ఘటనపై డీఈవోకు నివేదిక అందజేస్తామని రంగప్రసాద్ తెలిపారు. కాగా విచారణ నిర్వహించిన సమయంలో బాధిత విద్యార్థి సోదరుడు, కరస్పాండెంట్ అక్కడ లేరు. చైల్డ్‌లైన్ సిబ్బంది కౌన్సెలింగ్ మౌలానా అబ్దుల్ కలాం పాఠశాలలో చైల్డ్‌లైన్ (ఏలూరు) కో-ఆర్డినేటర్లు వి.ప్రసాద్, జె.ప్రసాద్ తదితరులు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శని వారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, మానసిక స్థితిగతులు, బోధన, పరస్పర సహాయ సహకారాలు, మానవతా ధృక్పథం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
దాచేపల్లి : గుంటూరు జిల్లా నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో అద్దె ఇంట్లో ఉంటున్న గుండా నరసింహారావు, రాజ్యలక్ష్మి దంపతులు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు యత్నించారు. మజా కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగడంతో అపస్మారకస్థితికి చేరిన వారిని సోమవారం ఉదయం ఆస్పత్రికి తరలించగా రాజ్యలక్ష్మి (50) మృతిచెందింది. నరసింహారావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన గుండా నరసింహారావు, రాజ్యలక్ష్మి దంపతులు రెండేళ్లుగా నారాయణపురంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. నరసింహారావు రెండేళ్లుగా దాచేపల్లికి సమీప భవ్య ఫిల్లింగ్‌స్టేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం యధావిధిగా విధులకు వెళ్లి ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయాన్నే హైదరాబాద్‌లో ఉంటున్న అల్లుడు భాస్కర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆయన నరసింహారావు ఇంటిలోకి వెళ్లి చూడగా దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యశాలకు 108లో తరలించగా రాజ్యలక్ష్మి చికిత్సపొందుతూ మృతిచెందింది. నరసింహారావు పరిస్థితి విషమంగా ఉండడంతో పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ యాదాల కోటేశ్వరరావు అక్కడకు చేరుకుని రాజ్యలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పరిశీలించారు. మజా కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని భార్యాభర్త తాగినట్లు గుర్తించారు. సంఘటనాస్థలంలో వారి సంతకాలతో అల్లుడు భాస్కర్‌కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘మా ఇద్దరి ఆరోగ్యాలు బాగోలేదు కాబట్టి మా మరణానికి మేమే బాధ్యులమని.. నేను ఏ విధమైనతప్పు చేయలేదని, ఎటువంటి డబ్బు నా సొంతానికి వాడుకోలేదని.. నన్ను నమ్మాలి’ అని ఆ లేఖలో రాసి ఉంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు నరసింహారావు చికిత్సపొందుతున్న వైద్యశాలకు వచ్చిన భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులను అక్కడ ఉన్న వ్యక్తులు నిలదీయడంతో వారు జారుకున్నారు. ఇదిలా ఉండగా భవ్య ఫిల్లింగ్ స్టేషన్లో మేనేజర్‌గా పనిచేస్తున్న నరసింహారావు లెక్కలు సక్రమంగా చూపిం చడం లేదని యాజమాన్యం ఫోన్ ద్వారా శనివారం ఎస్ఐ కోటేశ్వరావుకు తెలిపింది. ఫిల్లింగ్ స్టేషన్లో లెక్కల్లో తేడాలు ఉన్నమాట వాస్తవమేనని భవ్యసిమెంట్స్ ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం ఒత్తిడి వల్లే.. భవ్య ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం తీవ్రంగా ఒత్తిడి చేయడంవల్లే నరసింహారావుతోపాటు రాజ్యలక్ష్మి ఆత్యహత్యకు యత్నించారని వారి కుమారుడు నరేష్, అల్లుళ్లు భాస్కర్, ఆనంద్‌లు ఆరోపించారు. నరసింహారావు ఏవిధమైన తప్పిదం చేయకపోయినా, యాజమాన్యం తప్పుగా ఆలోచించి మానసికంగా పెట్టిన ఇబ్బంది వల్లే వారు పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవని, ఫిల్లింగ్ స్టేషన్‌లోని డబ్బును సొంతానికి వాడుకున్నారనడంతో వాస్తవం లేదని వారు తెలిపారు. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
రాశి మారింది...సెంటిమెంట్ పండింది!
సినిమా నేపథ్యం లేదు. లక్షల ఆస్తీ లేదు. ఉన్నదల్లా సినిమా పిచ్చి. దాంతోనే సినిమా తీసేయొచ్చా? డెఫినెట్‌గా తీసేయొచ్చు. ఇది కాశీమజిలీ కథ కాదు. నిర్మాత ‘రాశీమూవీస్’ నరసింహారావు కథ. ఊరు రాజమండ్రి. చిన్నతనం నుంచీ సినిమాలు చూసీ చూసీ సినిమా ఫీల్డ్‌లో స్థిరపడాలనే కోరిక. ధవళేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో తనకు ఒకటో తరగతిలో పాఠం చెప్పిన రాజబాబు మాస్టారు ఇప్పుడో సూపర్ కమెడియన్. ఆయనో ఇన్స్పిరేషన్. మరో పక్క శోభన్‌బాబు అంటే విపరీతమైన అభిమానం. ఇవన్నీ కలగలిసి నరసింహారావుని కుదురుగా కూర్చోనివ్వలేదు. అప్పుడే తమిళంలో కమల్‌హాసన్ చేసిన ‘మన్మథలీల’ సినిమా పెద్ద హిట్టు. దాన్ని డబ్ చేద్దామని మద్రాసు బయల్దేరాడు. ఈలోగా నిర్మాత విజయబాపినీడు రైట్స్ కొనేశారు. ఈ విషయం తెలిసి విజయబాపినీడు దగ్గరకు వెళ్లి ‘‘నేను డబ్ చేయాలనుకున్నా... కనీసం తూర్పు గోదావరి జిల్లా పంపిణీ హక్కులు ఇవ్వండి’’ అని హామీ తీసుకున్నాడు నరసింహారావు. ‘మన్మథలీల’ విడుదలై నరసింహారావుకి రూపాయికి పది రూపాయల లాభం తెచ్చిపెట్టింది. తదుపరి వాసిరెడ్డి నాగేశ్వరరావుతో కలిసి మురళీమోహన్‌తో ‘మంగళగౌరి’ అనే సినిమా మొదలెట్టారు. మొత్తం డబ్బు పోయింది. అయినా నరసింహారావు నిరాశపడిపోలేదు. ఆ టైమ్‌లో శోభన్‌బాబు గుర్తొచ్చాడు. ఇన్నాళ్లూ ఫ్యాన్‌గా చాలాసార్లు కలిశాడు. ఈసారి నిర్మాతగా కలిశాడు. శోభన్‌బాబుకి మాత్రం నమ్మకం కుదరక డేట్లు ఇవ్వలేదు. రచయిత సత్యమూర్తి, నరసింహారావుకు క్లోజ్‌ఫ్రెండ్. ఆయన సిఫార్సుతో శోభన్‌బాబు ‘‘సరే టెస్ట్ చేద్దాం’’ అనుకున్నాడు. అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ ఆరు లక్షలు. కానీ నరసింహారావుని తొమ్మిది అడిగాడు. వెంటనే ఓకే చెప్పేయడం, 50 వేలు అడ్వాన్స్ ఇచ్చేయడం జరిగిపోయింది. దర్శకునిగా ఏ.కోదండరామిరెడ్డిని అనుకుని 10 వేలు అడ్వాన్స్ ఇచ్చొచ్చారు. శోభన్‌బాబు సందేహ పడ్డట్టుగానే అప్పుడు నరసింహారావు దగ్గర ఉన్నది 60 వేలే. అదికాస్తా అడ్వాన్స్‌గా వెళ్లిపోయింది. ఇప్పుడు సినిమా తీయడానికి డబ్బులు ఎలా? గుండె దడ దడా కొట్టుకుంటోంది. అన్నిటికంటే సంకల్పబలం గొప్పదంటారు. నిర్మాత కావాలన్న నరసింహారావు సంకల్పం ఫలించింది. శోభన్‌బాబు ‘దేవత’ రిలీజై సూపర్‌హిట్. ఇటు పక్క కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ బంపర్‌హిట్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బయ్యర్లు ఎగబడ్డారు! ఒక్క రూపాయి ఫైనాన్స్ లేకుండా బయ్యర్లు డబ్బు గుమ్మరించిపోయారు. ఇప్పుడు సినిమా పని మొదలైంది. రజనీకాంత్, రాధ, అంబిక నటించిన తమిళ సినిమా ‘ఎంగయో కేట్ట కురళ్’ నరసింహారావుకి బాగా నచ్చేసింది. దీన్నే రీమేక్ చేస్తే? అయితే.. అది యావరేజ్ సినిమా. కానీ వెనుక సత్యమూర్తి ఉన్నాడనే మొండి ధైర్యం. నిర్మాత పంజు అరుణాచలం దగ్గరకెళ్లి పాతికవేలకి రైట్స్ కొన్నాడు. దాన్ని సత్యమూర్తి బ్రహ్మాండంగా చిత్రిక పట్టాడు. ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా కథ తయారీ. మాటలూ సత్యమూర్తివే. అదే ఆయనకు డైలాగ్ రైటర్‌గా తొలి సినిమా. సుహాసిని, రాధిక, గుమ్మడి, మురళీమోహన్, రావుగోపాల్రావు, అల్లు రామలింగయ్య... ఇలా అందరి డేట్లూ తీసేసుకున్నారు. బేనర్ పేరు ఏం పెట్టాలి? మద్రాసులో నరసింహారావు ఇంటి పక్కనే ‘మరో చరిత్ర’ సరిత ఉంటారు. ‘‘మద్రాసులో రాశీ సిల్క్స్ ఫేమస్. మీరు రాశీ మూవీస్ అని పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చిందామె. అలా ‘రాశీమూవీస్’ సంస్థ పుట్టింది. షూటింగ్ స్టార్ట్. అంతా మద్రాసులోనే. 27 రోజుల్లో సినిమా కంప్లీట్. 23.5 లక్షల బడ్జెట్. 27 లక్షలకు వ్యాపారం. రిలీజ్‌కి ముందే మూడున్నర లక్షల టేబుల్ ప్రాఫిట్. 1984 ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్. కర్చీఫ్ లేకుండా సినిమా చూడకూడదని ప్రేక్షకులకు అర్థమైపోయింది. సినిమా సూపర్‌హిట్. బయ్యర్లకు డబ్బులే డబ్బులు. వైజాగ్ 3 లక్షల పాతికవేలకు కొన్న బయ్యర్‌కి పాతిక, 30 లక్షలు వచ్చిందంటే ఈ సినిమా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. 16 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఇదే కథ హిందీలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సుహాగ్’గా వచ్చింది. కన్నడంలో కూడా ఎవరో సంగ్రహించి సినిమా తీసేశారు. ‘బావా మరదళ్లు’ వల్ల నరసింహారావుకి రెండు లాభాలు. నిర్మాతగా సెటిల్మెంట్. శోభన్‌బాబు కోటరీలో ప్లేస్మెంట్. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చారు శోభన్‌బాబు. ఈ 30 ఏళ్లలో నరసింహారావు 16 సినిమాలు తీశారు. అందులో ఆరు సినిమాలు శోభన్‌బాబుతోనే. రాశీమూవీస్ అంటే శోభన్‌బాబు సొంత సంస్థ అన్నంతగా మమేకమైపోయారు. శోభన్‌బాబుతో ‘మహారాజు’, ‘పున్నమి చంద్రుడు’, ‘భార్యాభర్తలు’ లాంటి మంచి సినిమాలు తీశారు. ‘పున్నమిచంద్రుడు’ సినిమా టైమ్‌లో శోభన్‌బాబుకి 3 లక్షలు బాకీ పడ్డారు. ఆయన అడగలేదు కానీ, ఈయనలో ఏదో గిల్టీ ఫీలింగ్. సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత 3 లక్షలు తీసుకెళ్లి శోభన్‌బాబుకి ఇచ్చేశారు. ‘ఎక్కడిదీ డబ్బు?’ అనడిగాడు శోభన్‌బాబు. ‘‘మద్రాసులో ఉన్న స్థలంలో సగం అమ్మేశాను’’ అని చెప్పారు నరసింహారావు. ‘‘చూడు... నరసింహారావు. నీకు ముగ్గురు కూతుళ్లు. ఇక్కడ నువ్వు సంపాదించుకున్నది ఏమీ లేదు. ఆ ఆస్తి కూడా వాళ్లకు మిగల్చవా?’’ అని క్లాస్ పీకి, అప్పటికప్పుడు ఆ స్థలాన్ని మైనర్ ప్రాపర్టీ కింద ముగ్గురమ్మాయిలకి రాయించేశారు. ఆ తర్వాతి కాలంలో నరసింహారావుకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆ స్థలాన్ని అమ్మలేని పరిస్థితి. అప్పుడు పది లక్షల స్థలం ఇప్పుడు చాలా విలువ పెరిగిపోయింది. ఇదంతా శోభన్‌బాబు చలవే అని నరసింహారావు చెబుతారు. ‘నన్ను టెస్ట్ చేయడానికి శోభన్‌బాబు ముందు ఎక్కువ పారితోషికం చెప్పారు కానీ, ఫైనల్‌గా మామూలుగానే డబ్బు తీసుకున్నారు. నిర్మాతగా ఇన్నేళ్లు నిలబడ్డానంటే దానికి ప్రధాన కారణం శోభన్బాబుగారే. రచయిత సత్యమూర్తిగారి సపోర్ట్ కూడా మరిచిపోలేను. ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకున్నాం. నేను ఛాంబర్ నుంచి మొత్తం సినిమాల లిస్ట్ తెప్పించి చూస్తే ‘బావా మరదళ్లు’ ఆసక్తికరంగా అనిపించింది. అదే మా కథకు సరిపోతుందనుకున్నాం. బాలనటిగా మీనాకు ఇదే తొలి సినిమా. ఎస్పీ బాలసుబ్రమణ్యంగారి అమ్మాయి పల్లవి ఇందులో ఫస్ట్‌టైమ్ పాట పాడింది. శోభన్‌బాబుగారితో సుహాసినికిదే తొలి సినిమా. ఆ తర్వాత వీరిద్దరిదీ ఎంత పెద్ద హిట్ కాంబినేషన్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత స్లాబ్ సిస్టమ్ మొదలైంది. టిక్కెట్ల అమ్మకాన్ని బట్టి పన్ను కట్టే పద్ధతి కాకుండా, ఒక వారంలో 21 ఆటలకు పూర్తిగా పన్ను కట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా మా సినిమా ఎక్కడా తగ్గలేదు. -
మకర వేట చూసొద్దాం రండి
సింహాచలం, న్యూస్‌లైన్ : కనుమ పండగను పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వా మి మకరవేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూల తోటలో సాయంత్రం ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదిక, అధికార వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. వరదరాజస్వామి అలంకారం లో అప్పన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. గజవాహనంపై గ్రామ తిరువీధిలో భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. ఈ వేడుకలో భాగంగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం పూలతోట నుంచి స్వామిని మార్కెట్ కూడలిలో ఉన్న పుష్కరిణి సత్రంలోకి తీసుకొచ్చి విశేష ఆరాధనలు జరిపి గజవాహనంపై తిరువీధి మహోత్సవాన్ని జరుపుతారు. తిరువీధి అనంతరం స్వామిని తిరిగి కొండపైకి చేర్చుతారు. విస్తృత ఏర్పాట్లు మకరవేట ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవం జరిగే పది ఎకరాల ఉద్యానవనానికి నూతన శోభను చేకూర్చారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో ‘మంట’పాలు
=టీటీడీకి బొప్పికడుతున్న మండపాల వ్యవహారం =ఇప్పటికే కూల్చివేసిన వేయికాళ్ల మండపం =గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమంటున్న నిపుణులు =కూల్చితే అడ్డుకుంటామంటున్న యాదవ సంఘ నేతలు =అపోహలు నమ్మొద్దంటున్న టీటీడీ సాక్షి, తిరుమల: తిరుమలలో శతాబ్దాల చరిత్ర ఉన్న మండపాల వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది. కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం కట్టాలని కొందరు వాదిస్తున్నా.. కుదరదని టీటీడీ చెబుతోంది. ఇక శిథిలావస్థకు చేరుకున్న గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమని నిపుణులు సూచిస్తుండగా.. కూల్చితే ఆందోళన తప్పదని యాదవ సామాజిక నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ గొల్ల మండపం వ్యవహారం.. ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464 లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపాన్ని నిర్మించారట. భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. అప్పట్లోనే గొల్ల మండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది. తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు కోర్టులో కేసులూ నడిచాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు టీటీడీకే అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. ‘గొల్ల మండపం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు’ అంటూ ఐఐటీ ప్రొఫెసర్ నరసింహరావు ఇటీవల హెచ్చరించడంతో దీనిపై సత్వర చర్యలు చేపట్టేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇత్తడి గ్రిల్స్ (కటాంజనాల)తో రక్షణ చర్యలు తీసుకుంది. మరోవైపు మండపాన్ని కూల్చివేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై టీటీడీ తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ‘అపోహలొద్దు.. ప్రస్తుతానికి మండపం కూల్చే ప్రసక్తేలేదు’ అని బుధవారం వివరణ ఇచ్చారు. నలుగుతున్న నూరుకాళ్ల మండప వివాదం శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల రాతి మండపాన్ని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా టీటీడీ 2003లో కూల్చివేసింది. కూల్చివేతపై అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళన రేగింది. మండపం కూల్చివేసిన తర్వాత ఆ ప్రాంతం చాలా విశాలమై బ్రహ్మోత్సవాలు, రద్దీ రోజుల్లో భక్తులకు అనువుగా మారింది. అయితే, చారిత్రక నేపథ్యం కలిగిన మండపం కూల్చివేత సరికాదంటూ త్రిదండి శ్రీమన్నారాయాణ చినజీయర్ పెద్ద స్థాయిలో ఉద్యమం చేశారు. అనేక వివాదాల తర్వాత కోర్టు కూడా కూల్చిన ప్రాంతంలోనే 100 అడుగుల వెడల్పు 200 అడుగుల పొడవుతో రాతి మండపాన్ని నిర్మించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులకు టీటీడీ టెండర్ నిబంధనలు రూపొందించి రూ.10.7 కోట్ల అంచనాతో 2009లో పనులు చేపట్టింది. అయితే కేవలం 100కి 100 అడుగుల స్థలాన్ని మాత్రమే అప్పగించడంతో పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఈ స్థలంలోనే నిత్యం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది భక్తులను అలరించే నాదనీరాజనం వేదిక ఉంది. దీనిని తొలగించి రాతి మండపాన్ని విస్తరించేందుకు టీటీడీ సుముఖంగా లే దని తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం మండపం పనులు పునాదికే పరిమితమయ్యాయి. మండపం నిర్మాణ పనుల్ని టీటీడీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ పలుమార్లు చినజీయర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు మండపం పనులను పార్లమెంట్ హోంశాఖ స్టాండింగ్ కమిటీకి టీటీడీ అధికారులు స్వయంగా చూపించి అడ్డంకులను వివరించారు. ఈ మండప నిర్మాణం లేకపోతే ఆలయ ప్రాంతం సువిశాలంగా ఉంటూ భక్తులకు అనువుగా ఉంటుందని వివరించారు. ఇక్కడే మండపం నిర్మించడం వల్ల భద్రతకు ఇబ్బందులుంటాయన్న నిఘా వర్గాల హెచ్చరికల్ని కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీటీడీ సీవీఎస్వో నేతృత్వంలో జేఈవో, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో కమిటీ వేశారు. -
గొల్లమండపానికి రక్షణ
=కూల్చివేతకు వెనుకడుగు =ఇత్తడి కటాంజనాల ఏర్పాటు =పనులు ప్రారంభం =నెలాఖరుకు పూర్తి సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం ఎదురుగా ఉన్న గొల్లమండపాన్ని టీటీడీ అధికారులు పటిష్టపరచనున్నారు. కూలే స్థితిలో ఉన్న ఈ మండపానికి టీటీడీ ఇంజినీర్లు రక్షణ చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ఇత్తడితో కూడిన కటాంజన బంధనాలు అమర్చనున్నారు. ఈ మేరకు శనివారం పనులు ప్రారంభించారు. ఆరు దశాబ్దాల క్రితం.. వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపం నిర్మించారు. అయితే భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. దీనివల్ల అక్కడే ఉన్న గొల్ల మండపం రాతి స్తంభాలకు పగుళ్లు వచ్చాయి. దీంతో గొల్లమండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది. అయితే, తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని కొన్ని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు దీనిపై కోర్టులో కేసులూ నడిచాయి. తీర్పు కూడా టీటీడీకి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. ఏ క్షణమైనా కూలిపోవచ్చు ఐఐటీ ప్రొఫెసర్ నరసింహరావు రెండేళ్లక్రితం గొల్లమండపాన్ని పరిశీలించారు. ఇది ఏ క్షణమైనా కూలిపోవచ్చంటా టీటీడీ అధికారులను హెచ్చరించారు. వ్యతిరేకత ఎదురవుతున్న దృష్ట్యా మండపం కూల్చివేతకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మండపానికి రక్షణ చర్యలు చేపట్టారు. ఇవీ రక్షణ చర్యలు గొల్లమండపానికి ఉన్న నాలుగు రాతి స్తంభాలను కలుపుతూ ఇత్తడితో కటాంజనాలు నిర్మించనున్నారు. మండపం బరువు నాలుగు స్తంభాలపై ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం నుంచి పనులు ప్రారంభించారు. నెలాఖరులోపు పనులు పూర్తి చేయనున్నారు. మండపం కూల్చేస్తారనే వదంతులు కొంతకాలంపాటు వ్యాపించాయి. దీంతో యాదవ సంఘాలు, భక్తుల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రక్షణ చర్యలు చేపట్టడంతో శతాబ్దాలనాటి గొల్లమండపం మరికొంతకాలం పాటు తమకు కనువిందు చేయనుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరి తగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.