హీరోగా మారనున్న మాస్‌ డైరెక్టర్‌ | Mass Director VV Vinayak As Hero | Sakshi
Sakshi News home page

హీరోగా మారనున్న మాస్‌ డైరెక్టర్‌

May 14 2019 3:29 PM | Updated on May 14 2019 6:03 PM

Mass Director VV Vinayak As Hero - Sakshi

ఆది లాంటి సూపర్‌ హిట్ సినిమాతో పరిచయం అయిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌. హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో సూపర్బ్ అనిపించుకున్న వినాయక్‌ దిల్‌, ఠాగూర్‌, కృష్ణ, అదుర్స్‌, ఖైదీ నంబర్‌ 150 లాంటి సూపర్‌ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇటీవల వరుస తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వినాయక్‌ త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట.

త్వరలో వినాయక్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. గతంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్‌ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. అయితే దర్శకుడు నరసింహరావు వినాయక్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న దిల్‌ రాజు అక్కడే ఈ విషయాన్ని ధృవీకరించారు. దిల్‌ రాజుగా తనను నిలబెట్టిన వివి వినాయక్‌ను తమ బ్యానర్‌లో త్వరలోనే నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటించమని వినాయకే కోరారని దిల్‌ రాజు తెలిపారు. దర్శకుడిగా ఫామ్‌ కోల్పోయిన వినాయక్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
దిల్‌ రాజు బ్యానర్‌లో వీవీ వినాయక్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement