ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల చరణ్ అనే బాలుడు ఆర్‌ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. అస్వస్థతతో ఉన్న చరణ్‌ను కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి సమయంలోఆర్‌ఎంపీ నరసింహారావు వద్దకు తీసుకెళ్లారు. తొలుత రెండు ఇంజక్షన్లు ఇచ్చిన అతడు... కొద్దిసేపటి తర్వాత మరో రెండు ఇంజక్షన్లు ఇచ్చాడని, అనంతరం పరిస్థితి విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చరణ్ కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.