charan
-
‘నారాయణ’ ఫీ‘జులుం’కి విద్యార్థి బలి..
అనంతపురం ఎడ్యుకేషన్/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చరణ్ సోదరుడు సర్దిచెప్పి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసేశారు. కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. -
యర్రంపల్లి నుంచి దిల్లీకి, ఎవరీ శ్రీచరణి?
‘అనుకోలేదని ఆగవు కొన్ని!’ నిజమే... ఇంటర్ వరకు తాను క్రికెట్లోకి అడుగు పెడతానని శ్రీచరణి అనుకోలేదు. ఖోఖో, లాంగ్‌జంప్‌లలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకున్న శ్రీచరణి ఇంటర్ చదివే రోజుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. ఆటలో తనను తాను మెరుగుపరుచుకుంటూ ఆల్‌రౌండర్ అనిపించుకుంది. తాజా విషయానికి వస్తే... మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీచరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ‘దిల్లీ క్యాపిటల్స్’ రూ.55 లక్షలతో శ్రీచరణిని ఎంపిక చేసుకుంది.కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అందరిలాగే ఎంతోమంది స్టార్ క్రికెటర్ల అద్భుతాలు చూస్తూ, వింటూ వస్తోంది. ఇప్పుడు ఆమె ఒక అద్భుతంగా, మోడల్‌గా నిలిచింది. ‘శ్రీచరణి మా ఊరు అమ్మాయే’ అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకునేలా చేసింది.యర్రంపల్లి గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె శ్రీచరణి. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది శ్రీచరణి. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని లేపాక్షి జూనియర్ కళాశాలలో పూర్తిచేసింది. ప్రస్తుతం వీరపునాయునిపల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళా శాలలో బీఎస్సీ, కంప్యూటర్స్చదువుతూ మరోవైపు క్రికెట్లో రాణిస్తోంది.2017–18లో క్రికెట్లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇక వెనక్కి తిరిగిచూసే అవసరం రాలేదు. అదేఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2020లో సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన శిక్షకులు ఖాజామైనుద్దీన్, మధుసూదన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. మెరుగైన శిక్షణ కోసం కడపకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎం. సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సురేష్ క్రికెట్ అకాడమీ’లో శిక్షణ పొందుతూ ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతాలో నిర్వహిస్తున్న బీసీసీఐ మహిళల సీనియర్ క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ఆడుతుంది.పెద్ద పట్టణాల్లో ఉండే అమ్మాయిలు మాత్రమే క్రికెట్లో రాణిస్తారని, జాతీయస్థాయిలో ఆడతారనే అపోహను బ్రేక్ చేసింది. ‘నీ ఇష్టానికి కష్టం తోడైతే... అదే విజయం’ అంటున్న శ్రీ చరణి ఎంతోమంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తోంది. – నాగరాజు, కడప ఫోటోలు: వల్లెపు శ్రీనివాసులుఆ నమ్మకం ఉందిచిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. అమ్మానాన్నలు ఎంతో ్రపోత్సహించేవారు. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న నేను క్రికెట్‌పై ఆసక్తి చూపినప్పుడు అమ్మానాన్నలు మొదట సందేహించారు. అయితే మామ కిశోర్ కుమార్ మాత్రం ్రపోత్సహించేవారు. నేను క్రికెట్లో కూడా రాణిస్తుండడంతో అమ్మానాన్నలకు నాపై నమ్మకం వచ్చి సంతోషంగా ఉన్నారు. మనలో పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి దారి చూపుతాయి. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు నాకు సర్వస్వం అయింది. రానున్న కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. – శ్రీచరణిసత్తా చాటేలా...2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత ఏడాది నిర్వహించిన బీసీసీఐ సీనియర్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కర్నాటక జట్టుపై 7 వికెట్లు, అండర్–23 మ్యాచ్‌లలో రాజస్థాన్ జట్టుపై 5 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.లెఫ్ట్ఆర్మ్ బౌలర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్ ఉమన్‌గా నిలకడగా రాణిస్తుండటంతో ఇటీవల నిర్వహించిన ఉమెన్ టీ–20 పోటీల్లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గత నెలలో ముంబై ఇండియన్స్ జట్టు ఎంపికలకు వెళ్లిన సమయంలో శ్రీచరణి ఆటలోని నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు దిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55లక్షలతో ఎంపిక చేసుకున్నారు. -
తారక్, చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్..!
-
తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..
సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు మరునాడు కాలువలో శవమై తేలిన ఘటన మండల పరిధిలోని దాతర్‌పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయిని యాదగిరి–వాణి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరి పెద్దకొడుకు చరణ్(11) రిమ్మనగూడలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం తల్లిని డబ్బులు అడగడంతో చరణ్‌ను మందలించింది. దీంతో అతను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో చరణ్ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలువ వద్దకు వెళ్లిన పిల్లవాడు ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్‌లో రాసి.. -
ఇద్దరు చిన్నారులను మింగిన పిల్లర్ గుంత
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్ గ్రామంలో గురువారం భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతలో పడి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు నాస్తిక్ (4), నిషాంత్ చరణ్ (4) ఆడుకో వడానికి ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటీవల గ్రామంలో వీడీసీ భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పిల్లర్ల కోసం గుంతలను తవ్వారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు నిలిచింది. ఆడుకుంటూ అటువైపు వెళ్లిన చిన్నారులు గుంత పక్కనున్న మట్టి కుప్పపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి జారి గుంతలో పడిపోయారు. మధ్యాహ్నం దాటినా పిల్లలు ఇంటికి రాకపోవడం, ఎక్కడా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న చెరువు వైపు, గ్రామంలోనూ వెతికారు. మధ్యాహ్నం దాటా క భవన నిర్మాణం పక్కనుంచి వెళ్తున్న ఓ వ్యక్తికి గుంతలో ఓ చిన్నారి వీపు భాగం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు కర్ర సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై గోపి సిబ్బందితో కలసి ఘటనాస్థలిని పరిశీలించారు. కాంట్రాక్టర్ పిల్లర్లు తవ్వి రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వలస వచ్చి రెండు నెలలు.. మృతుల్లో నిషాంత్ చరణ్ తల్లిదండ్రులు గ్రామానికి బతుకుదెరువు కోసం చిట్టాపూర్ నుంచి వలస వచ్చారు. చరణ్ తండ్రి శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం వస్తే బతుకునే కాటేసిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు చిన్నారి నాస్తిక్ తండ్రి దేవాదాస్ 2 నెలల క్రితం ఉపాధి కోసం మాల్దీ వులకు వెళ్లాడు. వారికి కూమార్తె, కుమారుడు ఉండగా అందులో నాస్తిక్ మృతిచెందాడు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. -
మాదాపూర్ బీజేపీ నేత చరణ్ చౌదరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ బీజేపీ నేత చరణ్ చౌదరి అరెస్ట్ అయ్యారు. తనపై నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్ EOW అధికారులు చరణ్ చౌదరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా సోమవారం చరణ్ చౌదరి మిస్సింగ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. తన భర్తను నలుగురు కిడ్నాప్ చేశారని ఆరోపించారు -
మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో షూటింగ్ కోసం వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ఆయన కుమారుడు చరణ్ తన తండ్రి చావుకు సోషల్ మీడియానే కారణమని ఫైర్ అయ్యాడు. (ఇదీ చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి) 'మా నాన్న ఇలా అవడానికి ప్రధాన కారణం సోషల్‌మీడియానే.. పలు యూట్యూబ్ ఛానల్ వారు లబ్ధిపొందేందుకు మా నాన్నను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనను ఎంత నెగిటీవ్‌గా చూపించాలో అంతగా చూపించారు. ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి. ఆయనకు సంబంధించిన విషయాలతో పాటు మా కుటుంబ సభ్యుల విషయాలు కూడా యూట్యూబ్‌లలో ప్రసారం చేయకండి. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలు. మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? మీ కష్టాలు ఏంటీ? మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మరోసారి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను' అని రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
హ్యాపీ బర్త్ డే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్
-
మార్షల్ ఆర్ట్స్‌లో చిచ్చర పిడుగు
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: నేర్చుకోవాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలైనా మనముందు తలొంచాల్సిందే.. మన పట్టుదల ముందు ఎంతటి ప్రతిభైనా మోకరిల్లాల్సిందే.. అందుకు ఉదాహరణే మార్షల్ ఆర్ట్స్‌లో రాటుదేలుతున్న కోటిపల్లి చరణ్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్‌కు ఊహ తెలిసేటప్పటికీ తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. తణుకుకు చెందిన పెద్దమ్మ, పెద్ద నాన్నలే చేరదీశారు. అనుకోకుండా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ చూసి ఆకర్షితుడయ్యాడు. అతన్ని గురువు ఆదరించి శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు. చరణ్ ఆసక్తిని గమనించి.. తణుకు సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి వేదికగా మార్షల్ ఆర్ట్స్ గురువు డీడీ సత్య ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఉదయం సమయంలో ఈ శిక్షణను గేటు బయట నుంచే చరణ్ గమనించేవాడు. ఆ విషయం తెలుసుకున్న గురువు సత్య.. నేర్చుకుంటావా? అని ప్రశ్నించగా చరణ్ వెంటనే తలూపాడు. అప్పటి నుంచి ఉచితంగా శిక్షణ తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చూపుతున్నాడు. ఒకసారి చెబితే పంచ్‌లను ఇట్టే పట్టేస్తాడు. సజ్జాపురం ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చరణ్ చదువులోను తెలివైన విద్యార్థే. చిన్నవాడైనా తన కంటే పెద్దవారితో సమానంగా ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ రెండు పతకాలు సాధించాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన కరాటే టోర్నమెంట్లో బంగారు పతకం, విశాఖపట్నంలో జరిగిన వాకో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఇంటర్నెట్లో చూసి కాగితాలు, ఇతర వ్యర్థాలతో రకరకాల బొమ్మలు చేస్తూ ఆకట్టుకుంటాడని ఉపాధ్యాయులు చెబు తున్నారు. పెద్దమ్మ, పెదనాన్నలు కోటిపల్లి దుర్గా భవాని, వెంకటేశ్వరరావులు చరణ్, అతని అన్న సామ్యేల్ బాధ్యతను తీసుకున్నాడు. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ, పెదనాన్నల ప్రోత్సాహం, గురువు సత్య ఉచిత శిక్షణతో మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నాను. సొంత డబ్బులతో మా గురువే టోర్నమెంట్లకు తీసుకువెళ్తున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది నా కోరిక.– కోటిపల్లి చరణ్, తణుకు స్పాన్సర్లు కావాలి.. మార్షల్ ఆర్ట్స్‌లో చరణ్‌కు మంచి నైపుణ్యం ఉన్నా.. ఖరీదైన క్రీడ కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రీడల్లో రాణించాలంటే మంచి పోషకాహారం అవసరం. పేదరికం కారణంగా చరణ్‌కు ఆ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. స్పాన్సర్లు అండగా నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫైటర్ అవుతాడు. ఎటైనా వంగే శరీర తత్వం అతనిది. మరింత ప్రోత్సహిస్తే విజయాలు సాధించడం ఖాయం. – డీడీ సత్య, మార్షల్ ఆర్ట్స్ గురువు చదువులోను చురుకే చరణ్ చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.– జి.రుద్రమదేవి, ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, తణుకు -
చరణ్.. ఓ నకిలీ పోలీస్
విశాఖ క్రైం, పీఎం పాలెం(భీమిలి): రోడ్డు పక్కన మద్యం తాగేవారు... అబ్బాయిలతో కలిసి ఉండే అమ్మాయిలు... రాత్రి వేళ ఒంటరిగా కనిపించే వారినే లక్ష్యంగా చేసుకుని పోలీస్ ఆఫీసర్ని అని బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8లక్షల నగదుతో పాటు రూ.17లక్షల విలువ చేస్తే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర క్రైం డీసీపీ దామోదర్ బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మరాటీ సృజన కుమార్ అలియాస్ చరణ్(39) దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడడంతో కేసులు నమోదయ్యాయి. అక్కడ పోలీస్ కేసులతోపాటు నిఘా పెరగడంతో విశాఖ నగరానికి మకాం మార్చేశాడు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెం కేంద్రంగా దోపిడీలకు తెగబడ్డాడు. ఇక్కడే ఇల్లు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తూ నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. రోడ్డు పక్కన మద్యం తాగేవారు, అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయిలను భయపించి వారి నుంచి రూ.10వేల నుంచి భారీగా రూ.5లక్షల వరకూ దోచుకునేవాడు. దోచుకున్న నగదుతో విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు ఇంటిలోకి అవసరమైన ఆధునిక వస్తువులు కొనుక్కున్నాడు. పెద్దలకు భయపడి కొందరు, పరువు పోతుందని కొందరు ఈ దోపిడీ విషయాలను ఎవరికీ చెప్పకపోవడంతో చరణ్ ఆటలు సాగిపోయాయి. చివరకు ఓ బుల్లెట్ కొనుక్కుని దానిపై పోలీస్ ఆఫీసర్ని అంటూ లోగో స్టిక్కర్ కూడా అంటించాడంటే ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు. అత్యాశకు పోవడంతో చిక్కాడు జూలై 29న మధురవాడ ఉడా కాలనీ నుంచి వెళ్లే ఐటీ రోడ్డులో ఓ మహిళతో కారులో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లిన చరణ్ వారిని బెదిరించాడు. తాను పోలీస్ ఆఫీసర్‌ను అని, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించడంతో సదరు జంట బెదిరిపోయారు. వారి మెడలోని బంగారు చైన్ లాక్కున్న తర్వాత... సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి బీరువాలోని నక్లెస్ కూడా లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా మరో రూ.5లక్షల నగదు ఇవ్వాలని బెదిరించడంతో సదరు వ్యక్తి స్నేహితుల నుంచి ఆ రాత్రి వేళ నగదు సమీకరించి చరణ్‌కు అందజేశాడు. జరిగిన ఘటనపై బాధితుడు పీఎం పాలెం పోలీస్‌లను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుని ఆనవాళ్లు, బుల్లెట్ వివరాలు ఆధారంగా నేర విభాగం సిబ్బంది చురుగ్గా స్పందిం చారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి అనుమానం రాకుండా నార్త్ సబ్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం పోతిన మల్లయ్యపాలెంలో చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై ఇప్పటికే పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఆరిలోవ పీఎస్‌లో రెండు, త్రీ టౌన్ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయి. చరణ్ వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 87.84గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుని ఇంటిలోని వాషింగ్ మెషీన్, టీవీ, కూలర్, బుల్లెట్, మరో బైక్, కారు, ç2 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని గుర్తించి ఆధారాలతో అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పీఎం పాలెం పోలీస్ స్టేసన్ సిబ్బంది పి.చిన్నరాజు, ఎం.శేఖర్, ఎస్ఐ జి.అప్పారావు, నార్త్ జోన్ సీఐలకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తరఫున డీసీపీ దామోదర్ రివార్డులు అందజేసి అభినందించారు. -
చరణ్ అంకుల్.. ఉప్సీ ఆంటీ..!!
‘థ్యాంక్యూ చరణ్ అంకుల్ అన్డ్ ఉప్సీ ఆంటీ ఫర్ ది లిటిల్ బర్డ్స్! దే ఆర్ సో క్యూట్. హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాల కూతురు సితార ముద్దుముద్దుగా పలికిన మాటలివి. జూలై 20న సితార పుట్టినరోజు. మొన్న తన ఆరవ పుట్టినరోజు జరుపుకున్న సితారకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన చిన్న చిన్న పక్షులను బహుమతులుగా పంపించారట. వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ సితార ఒక వీడియో చేసింది. ఆ వీడియోను మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సితారకు చాలా చిన్నప్పట్నుంచే సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది. సితార పుట్టినరోజు వచ్చిందంటే, మహేశ్ పుట్టినరోజు వచ్చినట్టుగానే ట్విట్టర్లో బర్త్‌డే ట్రెండ్ నడుస్తుంది. అలాగే ఈసారి కూడా సితార బర్త్‌డే ట్విట్టర్లో ట్రెండింగ్‌గా నిలిచింది. ముఖ్యంగా సితార వీడియోకు వేలల్లో రీట్వీట్స్ వచ్చాయి. సితార పుట్టినరోజునే ఉపాసన పుట్టినరోజు కూడా! వీడియో చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’ అని సితార పలకడం వీడియోకు మరింత క్యూట్‌నెస్ తెచ్చిపెట్టింది. మహేశ్, రామ్‌చరణ్‌ల ఫ్రెండ్షిప్కు అభిమానులు కూడా ముచ్చటపడిపోవడం విశేషంగా చెప్పుకోవాలి! -
చరణ్, తిలక్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ ఎంఎస్ఆర్ చరణ్ (192 బంతుల్లో 111; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇన్‌కంట్యాక్స్ 93.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 112 పరుగులు వెనుకబడి ఉంది. ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 14/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టును చరణ్ ఆదుకున్నాడు. రక్షణ్ రెడ్డి (182 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించి మంచి పునాది వేశాడు. ఓ వైపు చరణ్ బౌండరీలతో చెలరేగుతుంటే రక్షణ్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఆ తర్వాత వంశీ వర్ధన్ రెడ్డి (60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ తుంబి (54 బ్యాటింగ్; 8 ఫోర్లు) కూడా రాణించడంతో ఇన్‌కంట్యాక్స్ మంచి స్థితిలో నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో రవికిరణ్, డానియల్ మనోహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ జోరు... ఎంపీ కోల్ట్స్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో జెమిని ఫ్రెండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ ఠాకూర్ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ సెంచరీ కారణంగా జెమిని ఫ్రెండ్స్ ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 275 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 80, ఏఓసీ: 341/9 డిక్లేర్డ్ (ఇర్ఫాన్ ఖాన్ 40, లలిత్ మోహన్ 4/101) కాంటినెంటల్ సీసీ రెండో ఇన్నింగ్స్: 170 (హృషికేశ్ 39, సంహిత్ రెడ్డి 40; సచిన్ షిండే 4/30, సాగర్ శర్మ 3/40). ఈఎమ్సీసీ: 267, స్పోర్టింగ్ ఎలెవన్: 207/9 (భవేశ్ సేత్ 112, విఘ్నేశ్ అగర్వాల్ 3/26). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172 (మెహదీ హసన్ 97, మొహమ్మద్ అజహర్ 37; నవీన్ 3/83, ప్రణీత్‌రెడ్డి 3/41), ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 139/2 (జి. విక్రమ్ నాయక్ 41, బి. మనోజ్ కుమార్ 70 బ్యాటింగ్). ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 275/8 (ఎం. అభిరత్ రెడ్డి 47, ఠాకూర్ తిలక్ వర్మ 129 బ్యాటింగ్, రచ్నేశ్ దూబే 32, గిరీశ్ గౌడ్ 3/51, ఆకాశ్ 3/17). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73 (టీపీ అనిరుధ్ 5/27, ఎం. పృథ్వీ 3/37), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 152/7 (పి. సాయి వికాస్ రెడ్డి 68). ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 309/9 (రఫూస్ రోడ్రిగ్స్ 33 నాటౌట్, సుదీప్ త్యాగి 3/57, ఆకాశ్ సన 3/71) బీడీఎల్: 227/9 (ప్రతీక్ పవార్ 40, కె. సుమంత్ 56, షేక్ ఖమ్రుద్దీన్ 4/39). ఇండియా సిమెంట్స్: 298, హైదరాబాద్ బాట్లింగ్: 313/5 (సాయి ప్రణయ్ 39, రోహన్ 75, రవిందర్ 104 బ్యాటింగ్, నిఖిల్ 31 బ్యాటింగ్). దయానంద్ సీసీ: 371 (భగత్ వర్మ 71, కార్తికేయ 3/57), జై హనుమాన్: 181/5 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 45 బ్యాటింగ్). -
ఆశల హరివిల్లు
‘ఆకాశంలో ఆశల హరివిల్లు.. ఆనందాలే పూసిన పొదరిల్లు’ అంటూ ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ చేసిన నృత్యాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఆ పాట కూడా పాపులర్ అయింది. తాజాగా ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య తారలుగా క్రాంతి కిరణ్ దర్శకత్వంలో బి. సత్యశ్రీ నిర్మించారు. శ్రీనివాస్ మాలపాటి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ఎస్విఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ– ‘‘కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకీ చాన్స్ ఇచ్చిన సత్యశ్రీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో, హీరోయిన్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా తీయగలిగాను.వారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు సత్యశ్రీ. -
ప్రపంచం ఏమైతే నాకేంటి?
చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. సి టి.ఎఫ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి లుక్‌ని విడుదల చేశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా’.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మా చిత్రానికి ఇంత మంచి కథ అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న దర్శకుడు త్రినాథ్‌రావు నక్కినగారికి, స్క్రీన్‌ప్లే అందించిన రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి, సహనిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు మారుతిగారికి ధన్యవాదాలు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ పాటలు ఆకట్టుకుంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలో విడుదల కానున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వర రావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ. శ్రీనివాసరావు, హేమ రత్న, కెమెరా: దాసరది శివేంద్ర. -
విషాదాంతం
అమ్మ ఆశలు ఫలించలేదు. ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు దేవుడు వినలేదు. శుక్రవారం అదృశ్యమైన బాలుడు చరణ్ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం గ్రామంలోని బావిలో శవమై తేలాడు. పండగ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంతో లొద్దపద్ర మూగబోయింది. బాలుడిని తలచుకుని ఊరుఊరంతా రోదించింది. ఈ మరణం వెనుక బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం దొరికిన మృతదేహం ఇంకా తాజాగా ఉండడంతో ‘హత్య’ అనుమానాలు బలపడుతున్నాయి కాశీబుగ్గ : సంక్రాంతి నవ్వులు మాయమైపోయాయి. పండగ కాంతి కారుచీకట్లలో కలిసిపోయింది. శుక్రవారం అదృశ్యమైన బాలుడు మళ్లీ చిరునవ్వుతో తిరిగి వస్తాడని ఆ అమ్మ భావించింది. ఎటో తప్పిపోయి ఉంటాడని, మళ్లీ తమ దగ్గరికే వచ్చేస్తాడని కుటుం బ సభ్యులంతా అనుకున్నారు. కానీ వీరందరి ఎదురు చూపులకు ఫలితం లేకుండా ఆ బాలుడు చనిపోయాడు. ఎవరూ ఊహించని రీతిలో గ్రామంలోనే ఓ బావిలో ఆదివారం శవమై తేలాడు. ఈ దిగ్భ్రాంతికర సంఘటనతో పలాస మండలం లొద్దపద్ర విలవిలలాడిపోయింది. గ్రామంలోని కొండవీధికి చెందిన జినగ దాతచరణ్ (7) ఆదివారం గ్రామం మధ్యలో ఉన్న బావిలో శవమై తేలడంతో ఆ ప్రాంతీయులంతా నిర్ఘాంతపోయారు. ఎలా జరిగింది..? బాలుడు శుక్రవారం తమ్ముడు సాత్విక్, గ్రామంలోని పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో చరణ్ తమ్ముడు సాత్విక్ అక్కడే ఉన్నా ఏం జరిగిందో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఎవరో చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్లి నట్లు సాత్విక్ చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే ఆదివారం బావిలో కనిపించిన మృతదేహం తాజాగా ఉండడంతో ‘హత్య’ అనుమానాలు బలపడుతున్నాయి. శుక్రవారమే చంపేసి బావిలో పడేసి ఉంటే శవం పాడైపోయి ఉండేదని, ఆదివారం వేకువజామునే బావిలో పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘ఇది హత్యే..?’ తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని బాలుడి తల్లి పార్వతి ఆరోపిస్తున్నారు. రెండు రోజులు దాచి పెట్టి మూడో రోజు చంపేశారని అంటున్నారు. అదృశ్యమైన రోజే పోలీసులు అనుమానితులను అరెస్టు చేసి తనిఖీ చర్యలు చేపట్టి ఉంటే భయపడైనా తన కుమారుడిని విడిచిపెట్టేవారని ఆమె చెబుతున్నారు. బాలుడు అదృశ్యమైన సంగతి పోలీసులకు చెప్పగా గ్రామానికి వచ్చి పరిశీలించి వెళ్లిపోయారని, ఇంకాస్త లోతుగా చర్యలు చేపట్టి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అన్నారు. తన కొడుకు తనకు కావాలని ఆమె రోదిస్తూ ఉంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం జరిపి వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. -
విశాల్.. రాజీనామా చెయ్ !
సాక్షి, పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని డిమండ్ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్‌పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది. పోరాటం చేస్తాం: హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు. అప్పుడు కరుణానిధి.. ఇప్పుడు..! దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు. రాజకీయ లబ్ధి: ఆ పదవిని అడ్డు పెట్టుకుని తను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కే.నగర్లో నామినేషన్ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించి మీడియాతో మాట్లాడారు. -
పాటే ప్రాణం!
► కళాకారుడిగా రాణిస్తున్న చరణ్ ►ప్రభుత్వ గుర్తింపునివ్వడంలో వివక్ష ►రాష్ట్రం, జిల్లా సాధన, హక్కుల సాధన కోసం వందలాది ప్రదర్శనలు ►ప్రముఖులచే ప్రశంసలు గద్వాల అర్బన్: ధరూర్ మండలం నీలహాళ్లి గ్రామానికి చెందిన చరణ్‌కు పాటంటే ప్రాణం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి గాయకుడిగా, రచయితగా, డ్యాన్సర్‌గా రాణిస్తున్నాడు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో, సకలజనుల సమ్మెలో తన పాట, ఆటలతో ఆకట్టుకున్నాడు. అలాగే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని నడిగడ్డలో ఎగసిన ఉవ్వెత్తు ఉద్యమంలోనూ తనవంతు పాత్రను పోషించాడు. ఎక్కడ ప్రదర్శనలు చేసినా తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించాడు. అమ్మ తొలిగురువు తల్లిదండ్రులకు నలుగురు సంతానం, చివరి వాడు చరణ్. నిరుపేద దళిత కుటుంబం కావడంతో ఉప్పేరు హాస్టల్లో టె¯ŒS్త వరకు చదివించారు. ఆపై చదువులు చదివించలేకపోవడంతో తల్లితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. అక్కడ తల్లిపాడే జానపద గేయాలు, బొడ్డెమ్మ పాటలకు కోరస్‌గా పాడేవాడు. అప్పుడే పాటపై ఇష్టం ఏర్పడింది. రాత్రివేళ కాలనీలో కోలాటం వేసేవారు. అందులో తండ్రి జంగిలప్ప ద్వారా కోలాటం నేర్చుకున్నాడు. జిల్లా ఉద్యమంలో... నూతన ఏర్పాటులో మొదట గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ప్రజలు జిల్లా కోసం అనేక నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల్లో చరణ్ తన గళంవిప్పాడు. జిల్లా ప్రాశ్సస్త్యం, ప్రాముఖ్యతపై పాటలు రాసి పాడాడు. జిల్లా సాధించుకున్న తర్వాత కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంబురాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులచే శభాష్ అనిపించుకున్నాడు. 2015లో ఐదు రోజుల పాటు జరిగిన పాలమూరు కళాప్రదర్శన కళాబృందం ప్రదర్శించి అప్పటి కలెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారు. కానీ చరణ్‌పై మాత్రం వివక్ష ప్రదర్శించారు. 2001 నుంచి ప్రారంభం... అప్పటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు రాసి స్వయంగా పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలు, మూఢనమ్మకాలపై, అంటరానితనం, దళితుల దేవాలయ ప్రవేశం, పల్లెసుద్దుల తదితర కార్యక్రమాలపై కళాజాతా ప్రదర్శన ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో... 2005లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో నడిగడ్డ నుంచే మొట్టమొదటి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో కేసీఆర్, లక్ష్మారెడ్డి వెంట ధూంధాం కార్యక్రమాలు, ఆటలు పాటలు, డప్పుల ప్రదర్శనలు ఇచ్చారు. పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంపై అవగాహన కల్పించారు. తెలంగాణ వస్తే బతుకు మారుతుందని భావించి సకలజనుల సమ్మెలో 42రోజుల పాటు అహర్నిశలు ఆటలు, పాటలు పాడుతూ ధూంధాం నిర్వహించడం జరిగింది. నడిగడ్డ జిల్లాలో చరణ్ బృందం పాల్గొనని కార్యక్రమమే లేదు. నడిగడ్డ కళాకారులపై ప్రభుత్వం వివక్ష ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పాటను మాత్రం వదలేదు. 17ఏళ్లుగా... తెలంగాణ ఉద్యమం, జిల్లా సాధనలో, జిల్లా సంబరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అయినా ప్రభుత్వం నడిగడ్డ కళాకారులను గుర్తించకుండా వివక్ష చూపుతోంది. నాతోపాటు అనేక మంది కళాకారులకు అన్యాయం చేసింది. ఇది నాపై వివక్ష కాదు. కళపై వివక్ష. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాలి. –చరణ్, కళాకారుడు -
యువకుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం సాయిదుర్గ బార్ ముందు చరణ్ అనే యువకుడిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వ్యక్తులు పరారయ్యారు. చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడిచేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
సాఫ్ట్‌బాల్ సారథులు చరణ్, నమ్రత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తలపడే హైదరాబాద్ జిల్లా జట్లను బుధవారం ప్రకటించారు. పురుషుల జట్టుకు చరణ్ కుమార్, మహిళల జట్టుకు నమ్రత సారథ్యం వహించనున్నారు. పురుషుల జట్టు: చరణ్ (కెప్టెన్), కిరణ్ చారి, అజిత్ కుమార్, శ్రీనాథ్, సిద్దేశ్వర్ రెడ్డి, ఆనంద్, రవి, కార్తీక్, జై రాఘవ్, కథార్, చెన్నయ్య, విష్ణు, నర్సిములు, శ్రీకాంత్; కోచ్: చంద్రప్రకాశ్, మేనేజర్: మృత్యుంజయ్. మహిళల జట్టు: నమ్రత (కెప్టెన్), అక్షర, గ్రీష్మ, పూజ, ప్రియాంక, ప్రీతి, ఇందూజా, చేతన, నిఖిత, సాయి ప్రియా, వశిక, శిఖర, ధనుశ్రీ, నుపుర్; కోచ్: చక్రపాణి, మేనేజర్: పూర్వ. -
ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల చరణ్ అనే బాలుడు ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. అస్వస్థతతో ఉన్న చరణ్‌ను కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి సమయంలోఆర్‌ఎంపీ నరసింహారావు వద్దకు తీసుకెళ్లారు. తొలుత రెండు ఇంజక్షన్లు ఇచ్చిన అతడు... కొద్దిసేపటి తర్వాత మరో రెండు ఇంజక్షన్లు ఇచ్చాడని, అనంతరం పరిస్థితి విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చరణ్ కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
రాకీ హ్యండ్సమ్ రీమేక్ ప్లాన్‌లో 'రామ్ చరణ్'
-
ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి
వరంగల్: వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. నాతి చరణ్ అనే ఆరేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. దీంతో చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడ్ని 108 వాహనంలో ఎంజీఎం కు తరలించారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్వీట్ 60
►జీవితం ఒక అందమైన మెమరీ. ►ప్రతి మెమరీ... ఆల్బమ్‌లో ఓ కాగితం. ►కొన్ని సీపియా షేడ్స్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. ►కొన్ని ఫేడ్ అయిపోయిన కలర్స్‌లో ఎమోషన్స్. ►ఇంకొన్ని రంగురంగుల ఆత్మీయతలు. ►తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లిళ్లు, పిల్లలు, సినిమాలు... ►అన్నీ గుండెను అదుముకున్న మెమరీస్. ►కొన్ని హృదయానికి గుచ్చుకుంటాయి... కొన్ని మందు రాస్తాయి... ►కొన్ని ఒంటరిగా నిలబడతాయి... ఇంకొన్ని ఆప్యాయంగా హత్తుకుంటాయి. ►తప్పు ఒప్పు. మంచి చెడు. ప్రేమ ద్వేషం. గెలుపు ఓటమి. ధనము వనము. ►ఆకలి ఉబ్బరం. బాధ సంతోషం. ఎడారి సస్యశ్యామలం. నీడ నిజము. భయము దైవము. కల పీడ. కావ్యము కర్కశము. కోవెల కోర్టు. ►బంధము బంధనము. నిత్యము సత్యము. శ్వాస శాశ్వతము. వేము తీపి. ►చిరు దీపము చిరు గాలి. ఒంటరితనము ఏకాంతము. పార్శ్వము ఏకము. ద్వైతము అద్వైతము. ‘మెగా’నుభవం మేఘసందేశం. ►ఈ జ్ఞాపకాలన్నీ ఆ అనంత ఆకాశంలో విహరిస్తున్న బాష్పాల కలశాలు. ►ఈ అనుభవాలు మన గడియారం ముళ్లల్లో ఇరుక్కున్న దూదిపూలు. ►ఈ ఎమోషన్స్ భూమి భ్రమణంలో సూర్యుడి ఉదయాస్తమయాల ఇల్యూజన్. ►మన వయసుకు లెక్కలాంటి పితలాటకం... ఒట్టి భ్రమ. ►ఏజ్ షుడ్ బి కౌంటెడ్ ఇన్ మెమరీస్. స్వీట్ మెమరీస్. ►అభిమానుల స్వీట్ మెమరీస్. 60 ఏళ్లొచ్చినా యంగ్‌గా ఉన్నారు. స్పెషల్ ఫొటో షూట్లో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత బర్త్‌డే సందర్భంగా ఇలా ఫొటోషూట్‌లో పాల్గొనడం ఎలా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అరె ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన సామ్రాజ్యం అనిపించింది. సెట్లు, లైటింగ్, మేకప్... ఆ వాసన తగిలితే పుట్టింటికి మళ్లీ వచ్చినట్టుంటుంది. ‘మెగాస్టార్’ అనే స్థానం ఖాళీ అయ్యాక అది ఇప్పటికీ భర్తీ కాలేదని అభిమానులు అనుకుంటున్నారు. మళ్లీ మీరు ఆ స్థానాన్ని క్లయిమ్ చేసుకోవడానికి వ స్తున్నారని భావించవచ్చా? అభిమానుల గుండెల్లో ఇంకా సుస్థిర స్థానం ఉంది. రాజకీయంగా కొంచెం స్తబ్దత ఏర్పడిన పరిస్థితులు మళ్లీ సినిమాల్లోకి నా రీ ఎంట్రీకి అవకాశం కల్పించాయి. అందుకు ఆహ్వానం పలుకుతున్న అభిమానులకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. రాజకీ యంగా ఇదో విరామం అనుకోవచ్చా? రాజకీయంగా ఇదేమీ విరామం అనుకోవడం లేదు. ఉన్న సమయాన్ని ఇటు కూడా వినియోగించుకోవాలనుకుంటున్నా. మీ 150 వ సినిమా స్టేటస్ ఏంటి? నిజంగా చాలా కథలు వింటున్నాం. విన్న వాటిలో కొన్ని మంచి కథలు కూడా ఉంటున్నాయి, కానీ బాగున్న స్టోరీ లైన్స్‌ను ఎక్స్పాండ్ చేసేటప్పటికి అంత సంతృప్తికరంగా ఉండటం లేదు. బాగా ఆకలిగా ఉన్న ప్రేక్షకుడికి అన్ని రుచులతోనూ భోజనం పెట్టాలి. ఈ తాపత్రయమే ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఒకటి రెండు నెలల్లో కథ ఫైనలైజ్ అవుతంది. వాటిని డెవలప్ చేయడంలో రైటర్స్ బిజీగా ఉన్నారు. పూరి చెప్పిన కథ పక్కా అయిపోయినట్టేనా? పూరిగారు చెప్పిన స్టోరీ లైన్ చాలా బాగుంది. దాన్ని పొడిగించే తరుణంలో ప్రథమార్ధం బాగానే వచ్చింది గానీ ద్వితీయార్ధం నాకే కాదు ఆయనకూ నచ్చలేదు. కొంచెం వర్క్ చేద్దామన్నారు. కానీ ఈలోగా ఆయన వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. దాంతో కథ డిలే అయింది. ఈ లోగా వేరే కథ కుదిరితే అది చేస్తా. లేకపోతే పూరి గారి కథను మళ్లీ వర్క్ చేసుకుని ఆయనతోనే చేస్తా. దర్శకుడిని కథే డిసైడ్ చేస్తుంది. అసలు ప్రేక్షకులు కథ నుంచి ఎక్కువ ఆశిస్తున్నారా? లేదా హీరో నుంచి ఎక్కువ ఆశిస్తారా ? మీ ఇన్నేళ్ల అనుభవంలో దీని మీద మీ అభిప్రాయం? హీరో ద్వారా వాళ్లు కథను చూస్తారు. అతని ద్వారా ఓ ఎమోషన్‌ను ఫీల్ అవుతారు. అంతేగానీ హీరోను చూసి సంతృప్తి పడరు. హీరో అన్నది కథలో వాళ్లకో ఆలంబన. నా దృష్టిలో హీరో అనేవాడు కథకు కళ్లద్దాల్లాంటి వాడు. మీ కుటుంబం నుంచి తొమ్మిది మంది స్టార్స్ ఉన్నారు. మీ రాబోయే సినిమాకు సంబంధించి వాళ్లేమైన అడుగుతుంటారా? అంత మంది స్టార్స్ ఉన్నారా! (ఆశ్చర్యంగా) నేనెప్పుడూ కౌంట్ చేయలేదు. మీరు అంటూంటే నాకు ఇప్పుడే తెలిసింది. మేమందరం కలిసినప్పుడు వాళ్ల సినిమాల కంటే నా సినిమా గురించి అడుగుతూ ఉంటారు. ఏదైనా చిన్న అవకాశం ఉంటే చిన్న రోల్ కూడా చేస్తామంటున్నారు. అలాగని అన్ని కాంబినేషన్లు కుదరవు కదా. కానీ ‘మనం’ సినిమా చాలా బాగా సెట్ అయింది. పేరుకు మాత్రం మీరు వేరే జనరేషన్.. కానీ అభిమానులు మాత్రం చరణ్‌ను, మిమ్మల్ని ఒకటే జనరేషన్ అనుకుంటున్నారు! అవునా... చరణ్ వినాలండీ ఇది(నవ్వేస్తూ)...చాలా థ్యాంక్యూ. షష్టిపూర్తికి ఏం ప్లాన్ చేస్తున్నారు? నేనైతే అలా ఏం అనుకోవడం లేదు. ఫ్యాన్స్‌ను కూడా నిన్ననే కలిశాను. ఈ రోజు మాత్రం ఇంటి పట్టునే ఉండి కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతాను. మా వాళ్ల కోరిక కూడా అదే. ఇప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా? మా కుటుంబంలోని అందరి పిల్లలతో ఆడుకుంటూ, వాళ్లలో ఒక్కడిగా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. సండేస్, ఏమైనా పండుగలు, హాలిడేస్ వస్తే కచ్చితంగా కలుస్తాం. కుటుంబంలో అరమరికలు, పొరపొచ్చాలు ఏమైనా ఉంటే అవి సమసిపోతాయి. అది ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు కూడా. మిమ్మల్ని కష్టపెట్టే ప్రశ్న అడుగుతున్నా... ఏమనుకోవద్దు... రాజకీయంగా వేర్వేరు భావజాలంతో ఉన్న మీరు, మీ తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో మాట్లాడుతున్నారా? అసలు అలాంటి క్వశ్చనే ఉండదు. మేము ఎందుకు మాట్లాడుకోం? నాకు రామ్‌చరణ్ ఎంతో పవన్ కూడా అంతే. వారిద్దరూ నాకు రెండు కళ్ల లాంటి వారు. పవన్ నాకు మొదటి బిడ్డ. మీడియా వాళ్లు ఏదో సరదా కోసం అల్లిన కథలవి. మేమందరం ఎప్పుడూ కలుస్తూ ఉంటాం. కానీ కలిసినప్పుడు మాత్రం రాజకీయ చర్చలకు తావుండదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు సెలైంట్ అయిపోతాం. పవన్‌కల్యాణ్, మీరు ఒకేసారి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కదా..! మళ్లీ అన్నదమ్ములు ఒకటయ్యే అవకాశాలున్నాయా? ఇప్పుడు నేను ఉంటున్న పార్టీ నాది కాదు. నా ఇష్టయిష్టాలతో సంబంధం లేదు. భవిష్యత్తులో ఇద్దరం క లుస్తాం అని నేనైతే ఇప్పుడేం అనుకోవడం లేదు. ఎనిమిదేళ్లుగా డ్యాన్స్‌కు దూరంగా ఉన్నారు? మరి ఈ మధ్యలో డ్యాన్స్ క్లాసెస్‌కు ఏమైనా వెళ్లారా? అసలు అవసరం లేదండి... చిటికేస్తే స్టెప్ పడిపోతుంది. ఇది ఏదో సినిమా షూటింగ్స్ నుంచి సడన్‌గా వచ్చింది కాదు. బాడీలో ఇన్‌బిల్ట్ క్వాలిటీ అది. మ్యూజిక్ వినగానే స్టెప్ పడాల్సిందే. ఎన్సీసీలో ఉన్నప్పుడు క్యాంప్ ఫైర్స్‌కు వెళినప్పుడు జ్యోతిలక్ష్మీ, హెలెన్ నంబర్స్‌కు స్టెప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేయడం అప్పట్లో నాకు సరదా. డ్యాన్స్ నాకు పుట్టుకతోనే వచ్చింది. దానికి ఏ మాత్రం ైట్రైనింగ్ అవసరం లేదు. ఏదైనా ఆడియో ఫంక్షన్స్‌కు వెళినప్పుడు అక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్కు ఆల్రెడీ నాలో ఉన్న డ్యాన్సర్ లోపల డాన్స్ చేస్తూనే ఉంటాడు. కానీ పైకి మాత్రం చాలా సీరియస్‌గా ఏమీ తెలియనట్టు ఉంటాను. ‘రేసుగుర్రం’లో శ్రుతీహాసన్లాగా (నవ్వుతూ). మీ మెమరబుల్ డ్యాన్స్ సీక్వెన్స్? నా దృష్టిలో డ్యాన్స్ అనేది చాలా ఫ్రీగా అలవోకగా ఉండాలి. ఒక ఫ్లో ఉండాలి. కిందపడి, మీదపడి చేసేవాటిని విన్యాసాలంటారు.. అది కూడా గొప్ప డాన్స్ ఫామ్. కానీ డాన్స్ అనేది చూసేవాళ్లకు చాలా సింపుల్‌గా ఉండాలి. ఇన్నేళ్లు గడిచినా నాకు బాగా నచ్చిన డాన్స్ మూమెంట్స్ ఉన్న పాట ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ‘అబ్బ నీ తీయని దెబ్బ’ పాట. చాలా సింపుల్ మూమెంట్స్. గ్రేస్ కూడా ఉంటుంది. ఎక్కడా విరగదీస్తున్నట్టు ఉండదు. ఎన్ని తరాలు మారినా ఆ పాట అలానే నిలిచిపోయింది. మీ సినిమాలు మళ్లీ వేసుకుని చూస్తూంటారా? లేదండి! కానీ చానల్స్‌లో వేసినప్పుడు మాత్రం చూస్తూ ఉంటా. మ్యూజిక్ చానల్స్‌లో నా పాటలు చూస్తున్నప్పుడు మాత్రం అప్పటి రోజుల్లోకి వెళిపోతా. అబ్బ అప్పట్లో ఇంత అందంగా ఉన్నానా అని అనిపించిందా? లేదు. కానీ నాలో నాకు లోపాలు కనిపిస్తాయి. అప్పుడలా చేసుంటే బాగుండేదే, ఇలా చేసుండకూడదే అని అనిపిస్తూంటుంది. ఇంత అనుభవం మీద అలా కనిపిస్తోందని కానీ ఆ రా...రస్టిక్లో అదే కరెక్ట్. అంతేగానీ ఆడపిల్లలాగా నాకెప్పుడూ అనిపించలేదు. కులాల పరంగా అభిమానులు విడిపోయారు కదా! మరి బాధ కలుగుతూ ఉంటుందా? డె ఫినెట్లీ అండి. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం. అంత దిగజారి పోవడం హర్షణీయం కాదు. చాలా దురదృష్టకరం. మీ భవిష్యత్ రాజకీయ చిత్రం ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? చాలా మందికి ఎన్నికల్లో గెలుపా, ఓటమా...అనేది మాత్రమే లెక్క. కానీ పార్టీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే ఒకదాంట్లో గెలిచి, మరొక దాంట్లో ఓడిపోవడం , పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత ఆ పార్టీలో ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నా నా పార్టీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కనపడకుండా పోవడం... ఇన్ని వేరియేషన్స్ ఎవరూ చూడరేమో. ఇది నాకో సీరియస్ అండ్ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. చిరంజీవి అంటే చాలా సెన్సిటివ్, మనసుకు కష్టం కలిగినప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకున్నారు? అరవింద్‌గారు మీకు బాగా క్లోజ్ అంటూంటారు కదా? సంతోషం, దు:ఖం, అన్నీ నేను నా భార్య సురేఖతోనే పంచుకుంటా. ఆమె చాలా సెన్సిటివ్. ఆమె ఏదైనా అంటే దానికో కారణం ఉంటుంది. మా ఇద్దరి మధ్య దాంపత్య బంధం కన్నా దానికి మించిన అవినాభావ బంధం ఎక్కువ. ఆ తర్వాత మా పిల్లలు చరణ్, సుస్మిత, శ్రీజ. మీ సినిమా మీరే తీసుకుంటే (డెరైక్షన్) బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు! ‘ఠాగూర్’, ‘ఇంద్ర’ ఇలా నా సూపర్ హిట్స్ అన్నీ తీసుకోండి. నేను కేవలం నటించా అంతే. వాటి వెనక ద ర్శకుల, రచయితల, నిర్మాతల కృషి ఎంతో ఉంది. నన్ను ఎలా చూపించాలో, నా కంటే వాళ్లకే బాగా తెలుసు. వాళ్లే ఇంకా అత్యద్భుతంగా తీస్తారు. వర్మకు అనిపించి ఉండవచ్చేమో. ఆయనతో నేను ఏకీభవించను. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా? ‘బాహుబలి’ బాగా నచ్చింది. దాని గ్రాఫిక్స్‌తో తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ఇలాంటి భారీ స్థాయిలో సినిమా తీయడానికి వెనుకంజ వేయనవసరం లేదని చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాకు శంకర్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు స్ఫూర్తి కావచ్చు. కానీ ఇక మీదట ఈ స్థాయి సినిమాలకు బాహుబలే స్ఫూర్తిగా నిలుస్తుంది రాజమౌళిగారు మీ 150వ సినిమాను ఎందుకు తీయడం లేదు? ఈ ప్రశ్న ఆయన్నే అడగండి(నవ్వేస్తూ). ఆయనే చేస్తే నేనింకా సంతోషపడతా! - స్వప్న, సాక్షి టీవీ -
పుట్టిన రోజున మళ్లీ పుట్టాడు
చరణ్‌కు మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి పునర్జన్మ చిన్నారి ఛాతి నుంచి పెన్సిల్ తొలగింపు హైదరాబాద్: ప్రమాదవశాత్తు పెన్సిల్ ఛాతిలో దిగడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లిన చిన్నారి చరణ్ (6) ఎట్టకేలకు బతికి బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో అతడికి శస్త్ర చికిత్స చేసి పెన్సిల్‌ను బయటకి తీశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చరణ్ శుక్రవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ కింద పడటంతో ఛాతి ఎడమ భాగంలోని గుండెకు పెన్సిల్ గుచ్చుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు చికిత్స కోసం బాలున్ని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ సిటీసర్జన్ లేక పోవడంతో వెంటనే హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. సిటీసర్జన్ డాక్టర్ సమీర్ దివాలే నేతృత్వంలోని వైద్య బృందం శనివారం ఉదయం చరణ్‌కు శస్త్రచికిత్స చేసింది. ఛాతిలో దిగిన రెండు ఇంచుల పెన్సిల్‌ను విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శనివారంనాడే ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన చరణ్‌కు అదే రోజు వైద్యులు చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు.