దేవతలు సినిమా తీస్తే..?
దివి నుంచి భువికి దిగి వచ్చి, దేవతలు సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో జేకే అతీక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’. సిరాజ్ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. నరేష్, ఆమని, నాగబాబు ముఖ్య తారలు. ఈ చిత్రం ద్వారా నటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు.
ఇంకా అఖిల్, చరణ్ కూడా హీరోలుగా, మధురాక్షి, జననీరెడ్డి, ప్రజ్ఞ, కిరణ్, సనమ్, సుప్రీత నాయికలుగా నటిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని, వినోద ప్రధానంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి కెమెరా: రఘు ఆర్. బళ్లారి, సంగీతం: శ్రీ కోటి.