
‘ఏజెంట్’ మూవీ తర్వాత అఖిల్ కొత్త చిత్రానికి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘లెనిన్’ అనే చిత్రం రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారట.
ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే గ్రామీణ యాక్షన్ లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని సమాచారం. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని, దాదాపు ఇరవై రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment