Lenin
-
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
సత్యం... శాశ్వతం... మూడక్షరాల లెనిన్!
‘వ్లాదిమిర్ ఇల్ల్యిచ్ ఉల్యనోవ్... లెనిన్... పోరాటమే జీవితం అయిన వాడు... తుది శ్వాస విడిచాడు’– ఈ మాటలు 1924 జనవరి 21వ తేదీన, నేటికి సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటి లెనిన్ మరణం గురించి ఆయన జీవిత చరిత్ర రచయిత రాబర్ట్ సర్వీస్ పుస్తకం లోనివి. అలాగే అదే రచయిత మరో సందర్భంలో పేర్కొన్నట్లుగా ‘20వ శతాబ్ద రాజకీయ నేతలలో, అధికార స్థానాన్ని ఈషణ్మాత్రం కూడా తన సొంతం కోసం వాడుకోనివాడు’ వ్లాదిమిర్ లెనిన్. మరణం నాటికి లెనిన్ వయస్సు కేవలం 53 సంవత్సరాలు. 1870 ఏప్రిల్ 22వ తేదీన రష్యాలోని సింబిర్క్స్ పట్టణంలో ఉన్నత విద్యా వంతులైన దంపతులకు మూడవ బిడ్డగా వ్లాదిమిర్ ఇల్ల్యిచ్ ఉల్యనోవ్ జన్మించాడు. ఉద్యమ ప్రస్థానంలో 1901లో లెనిన్ అనే మారు పేరును ఆయన ఎంచుకున్నాడు. నల్లేరు మీద నడక వంటి లెనిన్ కుటుంబం జీవితంలో మొదటి దెబ్బ ఆయన పదిహేనవ ఏట తండ్రి మరణంతో తగిలింది. ఆ తర్వాత లెనిన్ పదిహేడవ ఏట తనకు రోల్ మోడల్‌గా భావించిన తన అన్న... జార్ చక్రవర్తిని హత్యచేసేందుకు ప్రయత్నించి విఫలమై ఉరికంబం ఎక్కాడు. ఈ తరుణంలోనే ఆయన మార్క్సిజం అధ్యయనం దిశగా అడుగులు వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించి 1892–93 కాలంలో న్యాయవాదిగా ప్రధానంగా రైతాంగం, చేతి వృత్తుల వారి కేసులను ఆయన వాదించాడు. 1893 ఆగస్టులో ఆయన సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని చేరి, అక్కడ మార్క్సిస్ట్ అధ్యయన బృందాలలో చురుకైన పాత్ర పోషించనారంభించారు. ఆ సమయంలోనే కార్మికులకు కార్ల్ మార్క్స్ రచించిన ‘పెట్టుబడి’ గ్రంథంపై ఆయన అధ్యయన తరగతు లను నిర్వహించారు. ఈ మార్క్సిస్ట్ విప్లవ భావాల ప్రచార క్రమంలోనే ఆయనతో పాటు కొందరు నాయకులు కూడా 1895 డిసెంబర్లో అరెస్ట్ అయ్యారు. 15 నెలల జైలు జీవితం అనంతరం, లెనిన్‌ను 3 సంవత్సరాల సైబీరియా ప్రవాసానికి నాటి జార్ ప్రభుత్వం పంపింది. అక్కడే ఆయనతో జత కలిసిన కృపస్కయాను ఆయన వివాహం చేసుకున్నారు. కృపస్కయా ఆయనకు జీవితకాల సహచరి, కామ్రేడ్, కార్య దర్శిగా గొప్ప పాత్ర పోషించారు. సైబీరియా ప్రవాసం 1900 జనవరిలో ముగిసింది. అయితే, రష్యాలో ఉండగా చట్టబద్ధంగా రాజకీయ కార్య కలాపాలు సాధ్యం కాదని నిర్ణయించుకొని లెనిన్ రష్యాను విడిచి జర్మనీలోని మ్యూనిక్ నగరాన్ని చేరుకున్నారు. ఈ ప్రవాస ప్రస్థాన క్రమంలో యూరోప్‌లోని అనేక నగరాలలో జీవించారు. తన తాత్విక గురువు ప్లకనోవ్, సహచరుడు మార్టోవ్లతో కలిసి ‘ఇస్క్రా’ (నిప్పురవ్వ) అనే పత్రికను స్థాపించారు. ఒక ప్రచార సాధనంగా, పార్టీ నిర్మాణానికి కేంద్ర బిందువుగా పత్రికల పాత్రను గుర్తించిన లెనిన్ అటు తర్వాత అనేక పత్రికల స్థాపన, నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అలాగే, ఆ యా పత్రికలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. అలాగే, తన అన్న అలెగ్జాండర్ మరణం అనంతరం ఆయన ఆశయాన్ని స్వీకరించి, తీవ్రవాద దాడుల ద్వారా ఆ ఆశయాన్ని సాధించలేమని గుర్తించి కార్మిక రాజ్య లక్ష్యసాధ నకు ఏకైక మార్గంగా సంఘటిత పడ్డ కార్మిక జనాళి తాలూకు నిర్మాణానికి పూనుకున్నారు. ప్రవాసంలో ఉంటూనే పత్రికలూ, రష్యాలోని పార్టీ నిర్మా ణాల ద్వారా కార్మికవర్గంలోనూ, విస్తృత ప్రజానీకంలోనూ సోషలిస్ట్ భావజాల వ్యాప్తికి లెనిన్ కృషి చేశారు. ఈ క్రమంలోనే, మార్క్సిజం పట్ల, దాని సజీవ నిర్వచనం పట్ల వామ పక్షవాదులలో ఉన్న అనేక తప్పుడు ధోరణులపై ఆయన నిరంతర పోరాటం చేశారు. మార్క్సిజం అనేది పోరాట కరదీపిక అనీ... అది కరుడుగట్టిన పిడివాదం కాదనీ ఆయన నిరంతరం బోధించారు. పార్టీలో అంతర్గత పోరాట క్రమంలో మెన్షివిక్ బృందంతో తెగదెంపులు చేసుకొని 1903లో ‘బోల్షివిక్’ పార్టీని ఏర్పరచారు. అనంతరం 1905లో, రష్యా – జపాన్ యుద్ధంలో ఓటమి పాలైన రష్యాలో విప్లవ పోరాటం చెలరేగింది. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలు, ఆర్థిక డిమాండ్ల స్థాయిని దాటి రాజకీయ పోరాటాలుగా మారాయి. అయితే, ఈ విప్లవాన్ని జార్ చక్రవర్తులు అణచివేయగలిగారు. కానీ, అంతిమంగా తమ ప్రజానీకానికి పాక్షిక ప్రజాతంత్ర హక్కులను ఇవ్వక చక్రవర్తికి తప్పలేదు. దీనిలో భాగంగానే పార్లమెంటరీ వేదికగా ‘డ్యూమా’ ఏర్పడింది. అలాగే, 1903లో మెన్షివిక్, బోల్షివిక్ పార్టీలుగా చీలిపోయిన సోషలిస్ట్ డెమోక్రాట్లు ఈ విప్లవ వైఫల్యం పట్ల ప్రతిస్పందించిన తీరూ... వారు దాని నుంచి తీసుకున్న పాఠాలు కూడా పూర్తిగా భిన్నమైనవి. ఈ విప్లవ వైఫల్యానంతరం మెన్షివిక్‌లు మరింత ఆర్థికవాదం, సంస్క రణవాద దిశగా మరలారు. కాగా, ఈ విప్లవ పరాజయం కార్మిక వర్గం మరింత మిలిటెంట్ పోరాటాలకు మరలవలసిన అవసరాన్ని చెబుతోందని లెనిన్ నేతృత్వంలోని బోల్షివిక్‌లు నిర్ధారించుకున్నారు. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందరే యూరప్‌లోని వివిధ దేశాల కమ్యూనిస్టులు యుద్ధం గనుక వస్తే, అది సామ్రాజ్యవాద దేశాలు, ప్రపంచంలోని మార్కెట్లను పంచుకొనేందుకు కొట్లాడుకొనేదిగానే ఉంటుంది గనుక ఆ యుద్ధాన్ని వ్యతిరేకించాలనీ... తమ తమ దేశాల సైనికులకు ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చేందుకు వారు తమ తమ దేశాల పెట్టుబడిదారుల పైకి తమ తుపాకులను తిప్పేలా పిలుపునివ్వాలనీ నిర్ణయించారు. అయితే, తీరా యుద్ధం మొదలయ్యాక అనేక దేశాల పార్టీలు జాతీయత, దేశభక్తి పేరిట తమ తమ దేశాల ప్రభుత్వాలను సమర్థించుకోసాగాయి. ఈ నేపథ్యంలో, ఒక్క లెనిన్ మాత్రమే సూత్రబద్ధ వైఖరి తీసుకొని ఈ యుద్ధంలో రష్యా ప్రవేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ యుద్ధంలో రష్యా సైనికులు, కార్మికులు తమ ఆయుధాలను స్వదేశీ పెట్టుబడిదారులపైకి తిప్పాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదులు తమ తమ స్వప్రయోజనాల కోసం, మార్కెట్లను పంచుకోవడం కోసం కొట్లాడుకొనే ఈ యుద్ధంలో వివిధ దేశాల పేద కార్మికులూ, సైనికులూ పరస్పరం చంపుకోవడం కూడనిదని ఆయన ఉద్భోధించారు. కాగా, కడకు 1917 నాటికి ఈ యుద్ధ క్రమంలో తీవ్ర ప్రాణ నష్టానికి, కడగండ్లకు గురైన రష్యా సైనికులు, కార్మికులు యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయసాగారు. అలాగే, కాస్తంత సొంత భూమి కోసం తపన పడుతోన్న రష్యా రైతాంగం కూడా ఈ అసంతృప్తిలో భాగస్వామి అయ్యింది. దీని పర్యవసానమే 1917 ఫిబ్రవరి విప్లవం. అయితే, ఈ విప్లవ క్రమంలో అధికారంలోకి వచ్చిన మెన్షివిక్‌లు తదితరులు మెజారిటీ రష్యా ప్రజానీకం ఆకాంక్ష అయిన యుద్ధం నుంచి వైదొలగాలన్న దానిని గౌరవించలేదు. వారు ఆ యుద్ధంలో కొనసాగారు. ఈ దశలోనే, స్విట్జర్లాండ్ నుంచి సీల్ వేసిన రైలు పెట్టెలో జర్మనీ గుండా రష్యాలో అడుగిడిన వ్లాదిమిర్ లెనిన్... ‘కార్మి కులకు రొట్టె, రైతుకు భూమి, సైనికుడికి శాంతి’ నినాదంతో మరో విప్లవం దిశగా సాగాల్సిన అవసరాన్ని ‘1917 ఏప్రిల్ థీసిస్’ ద్వారా రష్యా ప్రజల ముందు ఉంచారు. దీనితో అభద్రతకూ... ఆగ్రహానికి లోనైన మెన్షివిక్ ప్రభుత్వం లెనిన్‌ను అరెస్ట్ చేసేందుకు నిర్ణయించింది. పర్యవసానంగా మరికొద్ది కాలం పాటు రష్యా సరిహద్దులోని ఫిన్లాండ్లో ఒక కార్మికుడి ఇంట అజ్ఞాతంగా గడిపిన లెనిన్, అనంతరం అక్టోబర్ నాటికి విప్లవానికి బోల్షివిక్ పార్టీని సమాయత్తం చేశారు. ఈ మొత్తం క్రమంలో పార్టీలో అంతర్గతంగా కూడా వ్యతిరేకతను ఎదు ర్కొన్నారు. మొత్తంగా, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచీ... 1917 అక్టోబర్ వరకూ ఆయన దాదాపు ఒంటరిగానే విప్లవ చోదక శక్తిగా... ప్రపంచ పీడిత జనాళి పథ నిర్దేశకుడిగా ముందు నడిచారు. అక్టోబర్ విప్లవానంతరం, సోవియట్ సోషలిస్ట్ రాజ్యాన్ని కూల్చివేసేందుకు దాడి చేసిన పద్నాలుగు పెట్టుబడిదారీ దేశాల సైన్యాలనూ, వైట్గార్డుల రూపంలో అంతర్గత శత్రు వులనూ తిప్పి కొట్టడంలోనూ... జర్మనీతో బ్రెస్ట్లిటోవుస్క్ సంధి చేసుకోవడం వంటి విషయాలలో ట్రాట్స్కీ వంటి వారి అతివాద పోకడలను అదుపులో పెట్టడం లోనూ లెనిన్ పాత్ర అద్వితీయం. ఈ క్రమంలో ఆయన పైన జరిగిన తుపాకీ కాల్పుల హత్యాయత్నం, తీవ్రమైన పని ఒత్తిడి వంటివి ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. 1917 విప్లవానంతరం 1922 వరకూ రష్యాలో అంతర్యుద్ధం జరిగింది. 1921లో ఆరోగ్య సమస్యలు బయటపడడం మొదలైన తర్వాత 1924 జనవరి 21 వరకు ఆయన స్థితి దిగజారుతూనే ఉంది. అయినా, చివరి క్షణం వరకూ లెనిన్ విప్లవాన్ని కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు పెనుగులాడుతూనే ఉన్నారు. పక్షవాతంతో మంచం పట్టినా పట్టువిడవని దీక్షతో చివరి క్షణం వరకూ విప్లవ పురోగతి కోసం ఆయన తపన పడ్డారు. తాను ముందు ఊహించినట్లుగా రష్యా విప్లవాన్ని అనుసరించి జర్మనీ వంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవాలు జరగకపోవడంతో నాడు ప్రపంచ విప్లవ కేంద్రబిందువు, తూర్పు దిశగా కదిలిందని ఆయన సూత్రీకరించారు. పర్యవసానంగా చైనాలో విప్లవం జరిగే అవకాశాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు. పెట్టుబడిదారులు మార్కి ్సజానికి కాలం చెల్లిపోయిందంటూ చేస్తున్న అసత్య ప్రచారాల ద్వారా మార్క్స్, లెనిన్లను పలచన చేయనారంభించారు. అయితే, అంతిమంగా ఈ మధ్యనే ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారీ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నేటి యుగంలో లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమకాలీనత ఉందంటూ వ్యాఖ్యానించడం వాస్తవాలకు అద్దం పడుతోంది. అయితే, అదే పత్రిక లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయనే ఇచ్చిన జవాబు మాత్రం సరైనది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆ పత్రిక తాలూకు అనివార్య అగత్యం. మూడు దశాబ్దాల క్రితం రచయిత అదృష్ట దీపక్ లెనిన్ గురించి చెప్పిన ఈ మాటలు నేడు మరింత వాస్తవం: ‘అతీత గత అవస్థలను ఎరుగని అఖండ కాలం పేరు లెనిన్, హృదయ స్పందన వీనుల సోకే ప్రతీ ప్రదేశం పేరు లెనిన్...’ డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు మొబైల్: 98661 79615 -
ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్
‘‘మార్క్స్ తదనంతరం విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి వి.ఐ. లెనిన్’’ అంటూ 1924లో ఆనాటి హంగేరియన్ తాత్విక వేత్త జార్జి లూకాస్ వ్యాఖ్యానించారు. అలాంటి లెనిన్ పేరు నేడు కొంత తక్కువగా వినిపిస్తుండవచ్చు. ప్రపంచ కార్మికలోకపు వేగుచుక్క లెనిన్ పేరుని స్మరించుకోవడానికి కూడా కొందరు భయపడి ఉండవచ్చు. లేదా కొందరు కావాలనే ఆతని పేరుని మరుగుపర్చే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు. కానీ 20వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని, కోటానుకోట్ల మానవ మెదళ్ళను కదిలించిన, అనంత జనసమూహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసిన పేరు ఇది. 1917లో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై, అక్టోబర్ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో అగుపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్. 151 సంవత్సరాల క్రితం.. 1870, ఏప్రిల్ 22న రష్యాలోని సింబిర్క్స్‌లో లెనిన్ జన్మించారు. ఆయన పూర్తిపేరు వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ లెనిన్. ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి, ఆయనకు 1887లోనే ఉరిశిక్ష విధించారు. లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం వల్ల 1897లో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ను బహిష్కరించి, సైబీరియాకి పంపించి వేశారు. ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బోల్షివిక్ గ్రూప్‌నకు వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఆ తర్వాత లెనిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల 1917లో జార్ చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ సోషలిస్టు రిపబ్లిక్కు చైర్మన్‌గా ఎన్నికై, 1924లో తుది శ్వాస విడిచేవరకు కొనసాగారు. ఆయన నాయకత్వం, ఆయన రచనలు, విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించిన ఆయన సారథ్యం ఆనాడు యావత్ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి. ఆయన తాత్విక భూమికకు ఆయన రచనలు సాక్ష్యాలు. ముఖ్యంగా రాజ్యం–విప్లవం, కమ్యూనిజం–ఒక బాలారిష్టం, ఒక అడుగు ముందుకు-రెండడుగులు వెనక్కి, సామ్రాజ్యవాదం-పెట్టుబడి దారి విధానపు అత్యున్నత దశ, లాంటి రచనలు ఆనాటి ప్రపంచ కార్మికోద్యమ, ప్రజాస్వామిక, విప్లవోద్యమకారులకు దారిచూపే దివిటీలయ్యాయి. ముఖ్యంగా ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే రచన ఈనాటికీ ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాలలో అత్యంత అరుదైన రచన. ఆ పుస్తకంలో లెనిన్ ఆనాడు రష్యాలోని పెట్టుబడిదారీ పద్ధతులను, యూరప్‌లో జరుగుతున్న పెట్టుబడిదారీ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆనాటి సామ్రాజ్యవాద దశను నిర్వచించడానికి ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు. అందులో మొదటిది, ఉత్పత్తిని, పెట్టుబడిని కేంద్రీకృతం చేసే గుత్త సంస్థలను రూపొందించడం, రెండవది, బ్యాంకుల పెట్టుబడిని, పారిశ్రామిక పెట్టుబడులను కలిపివేసి ఫైనాన్షియల్ పెట్టుబడిని తయారుచేయడం, మూడవది, అంతకు ముందు ఎగుమతిచేసే వస్తువులతో పాటు, పెట్టుబడిని ఎగుమతి చేసే విధానాలను మొదలు పెట్టడం, నాలుగవది, అప్పటికే ఏర్పడిన ప్రపంచ పెట్టుబడి గుత్త సంస్థలు భౌగోళికంగా తమలో తాము విభజించుకోవడం, అయిదవది పెట్టుబడి శక్తులు ప్రాంతాల వారీగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం. ఈ అయిదు అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రపంచ వ్యాపితం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ పుస్తకాన్ని 1916లో లెనిన్ రాశారు. అంటే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు సామ్రాజ్యవాదం రూపు మార్చుకొని ప్రపంచీకరణ అవతారం ఎత్తింది. ఆయా దేశాల్లోని పాలక వర్గాలను తమ అనుచరులుగా మార్చుకొని, ఆ దేశాలలోని ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలను, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో తయారు చేసిన వస్తు సముదాయం మత్తులో ముంచి వేసి, ఎన్నటికీ బయటపడే వీలులేని, ఆర్థికచట్ర వలయంలోకి తోసివేసి, అంతర్జాతీయ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఇప్పుడు మనమంతా ఆ మాయాజాలంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాం. 1917లో రష్యాలో విజయం సాధించిన అక్టోబర్ విప్లవం ప్రపంచంలోని అన్ని దేశాల వలసపాలకులపై ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా స్ఫూర్తిని కలిగించింది. కమ్యూనిజాన్ని ఏ కోశానా సమర్థించని మహాత్మాగాంధీ, మానవతా సిద్ధాంతమే తన జీవిత కవితా వస్తువుగా స్వీకరించిన రవీంద్రనాథ్ ఠాగూర్‌లు కూడా రష్యా విప్లవాన్ని ఆహ్వానించారు. జవహర్లాల్ నెహ్రూ 1920లోనే రష్యాను సందర్శించి ప్రేరణ పొందారు. ఆ తర్వాత జరిపిన కాంగ్రెస్ మహాసభల్లో సోషలిజం ఆవశ్యకతను, సమానత్వ భావనలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా విప్లవం తర్వాతనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, జాతుల విముక్తి పోరాటాలు వెల్లువెత్తాయి. చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మావో సే టుంగ్ నాయకత్వంలో చైనా విప్లవం విజయవంతమైంది. ‘‘జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు’’ అంటూ ఆనాటి విప్లవ యుగ ప్రాముఖ్యతను మావో ఉత్తేజకరంగా చాటిచెప్పారు. ఆనాడు లెనిన్ యువతరం కలల నాయకుడిగా నిలిచారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్‌సింగ్ కూడా లెనిన్ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు. భగత్‌సింగ్‌కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడగ్గా ‘‘నేను లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాను. అది పూర్తిచేయాలనేదే నా కోరిక’’ అని భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్ని తరాలు మారినా, మరెన్ని వక్ర భాష్యాలు, సిద్ధాంతాలు ఉద్భవించినా ప్రపంచగమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు. మానవజాతి మనుగడ కొనసాగినంత వరకూ, దోపిడీ, పీడనలు తొలగిపోయి, ఎటువంటి వివక్షకూ తావులేని సమసమాజం ఆవిష్కృతం అయ్యేవరకు లెనిన్ అనే మూడక్షరాలు యావత్ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (81063 22077) (నేడు లెనిన్ 151వ జయంతి) -
నా చిత్రం నాకే నచ్చలేదు
తమిళసినిమా: నేను నిర్మించిన చిత్రం నాకే నచ్చలేదు అన్నారు నటుడు విజయ్‌సేతుపతి. కథానాయకుడిగా వరుస విజయాలతో రైజింగ్‌లో ఉన్న ఈయన నిర్మాతగా మారి మేర్కు తొడర్చి మలై చిత్రాన్ని నిర్మించారు. తన చిరకాల మిత్రుడు లెనిన్‌భారతీని దర్శకుడిగా పరిచయం చేసిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. కాగా మేర్కు తొడర్చి మలై శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం థ్యాంక్స్ మీటింగ్‌ను చెన్నైలో నిర్వహించింది. కార్యక్రమంలో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ తన చిత్రానికి లభిస్తున్న ప్రశంసలు, విమర్శలకు తాను కారణం కాదన్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రం తనకు నచ్చలేదన్నారు. చిత్రాన్ని సకాలంలో విడుదల చేయలేకపోయానని చెప్పారు. ఎవరూ చిత్రాన్ని కొనడానికి రాకపోవడమే అందుకు కారణం అన్నారు. చివరికి రూ.70 లక్షలు తగ్గించుకుని అమ్మడానికి సిద్ధపడ్డానన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి, ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో! చిత్రం వద్దంటూ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లిపోయారని చెప్పారు. ఆ తరువాతనే సరవణన్ ముందుకు వచ్చి చిత్రాన్ని విడుదల చేశారని తెలిపారు. చిత్రం విడుదలకావడానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం తాను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇచ్చేశానని చెప్పారు. చిత్ర దర్శకుడు లెనిన్‌భారతీ నిజాయితీపరుడని, తాను జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రాన్ని చివరి వరకూ మోసింది దర్శకుడేనని చెప్పారు. చిత్రానికి లభించే అభినందనలు, విమర్శలు ఆయనకే చెందుతాయన్నారు. ఈ చిత్ర హీరో ఆంటని ప్రతిభావంతుడని అభినందించారు. -
మార్క్సిజం ప్రాముఖ్యత మరింత పెరిగింది
ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్క్సిజం, కమ్యూనిజం అదృశ్యమౌతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో ఈమధ్య కారల్‌మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చాలాచోట్ల ఆయన స్మృతికి నివా ళులర్పించడంతోపాటు మార్క్సిజాన్ని భిన్న కోణాల్లో చర్చించారు. గోష్టులు నిర్వహించారు. మార్క్స్ జన్మించిన జర్మనీలోని ట్రియర్ పట్ట ణంలో ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైనా బహుకరించిన ఈ విగ్ర హాన్ని ఆయన అప్పట్లో నివసించిన ఇంటికి సమీపంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగానే చైనాలోని బీజింగ్, షెన్జెన్ నగరాల్లో గత నెల 27 నుంచి 30 వరకూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 21వ శతాబ్దంలో కారల్‌మార్క్స్ ప్రాముఖ్యత గురించి, ప్రపంచంలో సామ్యవాదం భవితవ్యం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుల్లో 70 దేశాలకు చెందిన 75 కమ్యూనిస్టు పార్టీల నుంచి 112 మంది నేతలు పాల్గొన్నారు. మన దేశం నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా సదస్సులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి చైనా నగరాల్లో జరిగిన సదస్సులు, వాటిలో జరిగిన చర్చల గురించి సాక్షి ప్రతినిధి జీకేఎం రావుకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చ డానికి భౌతిక శక్తులను శ్రామికవర్గం నేతృత్వంలో బలోపేతం చేయడం కోసం ప్రజా పోరాటాలను నిర్మించడమే మార్గమని ఏచూరి అంటున్నారు. ఇలాంటి పోరాటాలకు మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుందని చెబుతున్నారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు: కారల్ మార్క్స్, కమ్యూనిజంపై వర్క్‌షాప్‌లు ఎలా జరిగాయి? చైనా సోషలిజానికి తిలోదకాలు ఇస్తూ, పెట్టుబడిదారీ పంథాలో పయనిస్తోందని ప్రపంచ దేశాలు భావిస్తున్న కారణంగా చైనాలో ఇలాంటి సమావేశాలు జరగడం మార్క్సిజానికి గొప్ప విజయం. తమపై ప్రపంచ ప్రజానీకంలో ఉన్న అపోహలనూ, అనుమానాలనూ నివృత్తి చేయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమావేశాలు నిర్వహించింది. ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా చైనా అవతరించింది. సామ్యవాద పంథాలో పయ నిస్తూనే ఇది ఎలా సాధ్యమైంది? నేడు మార్క్సిజం అవసరం ఉందనడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన ప్రారంభ ఉపన్యాసం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించింది. మార్క్సిజానికి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సామ్యవాద పంథాలో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగటం సాధ్యమేనని చైనాను చూస్తే అర్ధమవుతుంది. చైనాలో అవినీతి, అసమానతలపై ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రెండు అంశాలపై చైనా నిజంగా కలవరపడుతోంది. అవినీతి విస్తరించింది. ప్రభుత్వం అవినీతిని రూపుమాపడానికి కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అవినీతికి పాల్పడే వేలాది మంది అధికారులకు ప్రతి వారం ఉద్వాసన పలుకుతున్నారు. చైనాలో నగరాలు, పట్టణాలు పెరిగిపోవడంతో అసమానతలు అధికమౌతున్నాయి. ఈ సమస్య పరిష్కా రానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పట్టణాల్లోని ప్రజలు, ఫ్యాక్టరీలను గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల సముదాయాల్లో వైద్య సౌకర్యాలు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగరాలపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. మార్క్సిజంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు? ప్రారంభ, ముగింపు సమావేశాలతోపాటు మూడు అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించారు. కారల్‌మార్క్స్ చారిత్రక ప్రాధాన్యం–నేటి పరిస్థితుల్లో మార్క్సిజం ప్రయోజనం, 21వ శతాబ్దంలో కొత్త పరిస్థితులకు అనుగుణంగా చైనా తరహా సోష లిజంపై షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానం ప్రభావం, చైనాకు అనుసరణీయమైన సోష లిజం సిద్ధాంతాలు, ఆచరణ–ప్రపంచ సామ్యవాదం భవితవ్యంపై మూడు సదస్సులు జరిగాయి. ప్రపంచంలో సోషల్ డెమొక్రాట్లు, లిబరల్ డెమొక్రాట్లకు ఆదరణ పెరగడంతోపాటు, కొన్ని దేశాల్లో మార్పును వ్యతిరేకించే మితవాదులు బలపడుతున్న నేపథ్యంలో–మార్క్సిజం భవితవ్యం ఏమిటనే విషయం చర్చించారా? విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితంగా నేడు మార్క్సిజం విలువను, ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీకి అంతముండదని, సంక్షోభం ముగియదని గుర్తించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందువల్లే పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడం మార్క్సిజాన్ని అనుసరించే పార్టీల వల్లనే సాధ్యమని తెలుసుకుంటున్నారు. ‘‘తత్వవేత్తలు ప్రపంచం తీరు గురించి అనేక పద్ధతుల్లో కేవలం భాష్యం చెప్పారు. కాని, ప్రపం చాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ అని కారల్ మార్క్స్ చెప్పారు. ఎలా మార్చాలి? అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దోపిడీని అంతం చేసి, మానవుల విముక్తి సాధించడానికి మార్క్సిజం ఒక్కటే మార్గాన్ని అందిస్తుంది. దోపిడీకి గురవుతున్న ప్రజలను ఆకట్టుకుంటున్న సిద్ధాంతం ఇదొక్కటే. మార్క్సిజం మార్పులేని సిద్ధాంతం కాదు. ఇదొక సృజనశీల శాస్త్రమని విప్లవ నేత లెనిన్ ఎన్నడో బోధించారు. చరిత్ర విశ్లేషణకు, మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానం పరిశీలనకు మార్క్సిజమే మంచి మార్గం. మార్క్సిస్టు సిద్ధాంతాలు, మార్క్స్ చూపించిన మార్గాల ప్రాతిపదికగా మేము మా సైద్ధాంతిక అవగాహనను బలోపేతం చేసుకుంటు న్నాము. ప్రస్తుత పరిస్థితులు, సంక్షోభాల నేగాక భవిష్యత్తులో కమ్యూనిస్టులకు గల అవ కాశాలను మార్క్సిజం వెలుగులో అర్థంచేసుకుంటున్నాం. ప్రపంచ నేతగా అవతరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రసంగంలో మీకు నచ్చిన అంశమేంటి? మార్క్సిజం కాలం చెల్లిన సిద్ధాంతం కాదని, ఇది ఎప్పటికీ విలువైనదేననే వాదనకు అభివృద్ధి పథంలో అగ్రగామిగా సాగుతున్న చైనా తిరుగులేని సాక్ష్యమని జిన్‌పింగ్ చెప్పారు. ‘ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ తూర్పు ప్రపంచంలో జబ్బు మనిషిగా ముద్రపడిన దేశం నేడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిరూపించుకుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కొత్త శకానికి కావాల్సింది చైనా తరహా లక్షణాలున్న సామ్య వాదమే అని జిన్‌పింగ్ నమ్ముతున్నారు. ఈ సదస్సులో మీరేం మాట్లాడారు? సమస్య ఎంత తీవ్రమైనదైనా పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతటదే కూలిపోదు. కేపిట లిజాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యామ్నాయం రూపుదిద్దుకునే వరకూ ఇది మానవుల దోపిడీని కొనసాగిస్తూ తన ఉనికిని కొనసాగిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదో యడానికి మేం సమాజంలోని భౌతిక శక్తులను శ్రామిక వర్గం నేతృత్వంలో బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రజా పోరాటాల ద్వారానే ఇది సాధ్యమౌతుంది. ఇలాంటి పోరా టానికి మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుంది. -
కుమారుడు లెనిన్ సమాధి వద్ద చెరుకూరి నిరాహార దీక్ష
-
కవి విగ్రహానికి అవమానం...
సాక్షి, కోల్కత్తా : లెనిన్ విగ్రహం కూల్చివేతతో మొదలైన ధ్వంసకాండ ఇప్పట్లో ఆగేలా లేదు. పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలపై జరిగిన వివిధ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. 19 శతాబ్దానికి చెందిన ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఎర్ర రంగు పూశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన మున్సిపాలిటీ శాఖ విగ్రహాన్ని శుభ్రం చేయించింది. ఎవరీ.. మైఖేల్ మధుసుదన్ దత్ ఆంగ్ల భాషలో పద్యాలు రచించిన మొదటి భారతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు. బెంగాలీతో పాటు సంస్కృతం, తమిళ్, తెలుగు, హిబ్రూ, లాటిన్, గ్రీకు తదితర భాషల్లో ప్రావీణ్యం కలవారు. -
విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత
లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత దృశ్యాలను చూసినప్పుడు ఇద్దరు ఇతిహాస పాత్రలు మనసులో మెదిలారు. ఒకరు రాముడు, ఇంకొకరు ధర్మరాజు. రావణసంహారం జరిగిన తర్వాత, అన్న మరణానికి విభీషణుడు శోకిస్తున్నప్పుడు అతణ్ని ఓదార్చిన రాముడు, మృతుడైన రావణుని పట్ల తన వైఖరిని వివరిస్తూ, ‘‘విభీషణా! వ్యక్తులు జీవించి ఉన్నంతకాలమే వైరాలు ఉండాలి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మన కార్యం నెరవేరింది కనుక ఇతనికి అంత్యక్రియలు నిర్వహించు. ఇతడు నీకెంత గౌరవనీయుడో.. ఇప్పుడు నాకూ అంతే గౌరవనీయుడు’’ అంటాడు. ఈ సందర్భంలో రాముడు అన్న ‘‘మరణాంతాని వైరాణి’’ అనే మాట ఒక గొప్ప సూక్తిగా జాతి నాలుకలపై నిలిచిపోయింది. ధర్మరాజు విషయానికి వస్తే, తన గదాఘాతానికి తొడలు విరిగి దుర్యోధనుడు పడిపోయిన తర్వాత భీముడు అతణ్ని దూషిస్తూ ఎడమ కాలితో అతని శిరస్సును తంతాడు. ఆ చర్యను ధర్మరాజు, అర్జునుడు ఏవగించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటారు. భీముడు రెండోసారి ఆ పని చేసినప్పుడు ధర్మరాజు ఊరుకోలేకపోతాడు. ‘‘ఎందుకలా తంతున్నావు? ఈ అధర్మం నీకు రోత పుట్టించడం లేదా? ఈ రాజరాజు తమ్ముళ్ళు, బంధువులు మరణించిన తర్వాత కూడా యుద్ధం చేసి పడిపోయిన గౌరవాన్ని పొందుతున్నప్పుడు నువ్వు చేసిన ఈ హీనమైన పనిని జనం మెచ్చుతారా?’’ అని తీవ్రంగా మందలిస్తాడు. విజయం కలిగించిన హర్షావేశాలతో ఉచితానుచితాలు పట్టించుకోని అల్పబుద్ధిగా ఈ ఘట్టంలో కవి భీముణ్ని వర్ణిస్తాడు. లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్‌లో బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను ఆదర్శం చేసుకున్నారు. ఈ విగ్రహవిధ్వంసం ఇంతటితో ఆగదనీ, అది తమ నేతలకు కూడా వ్యాపిస్తుందనే స్పృహ లోపించింది కనుక దీని వెనుక అల్పబుద్ధే కాక మందబుద్ధి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహంపట్ల అపచారం జరిగింది. పెరియార్, అంబేడ్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలకు మసిపూశారు. ఇది ఇటీవలి కాలంలో ఎరగని ధోరణి. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలకు త్రిపురను మించి పెద్ద కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను చేజిక్కించున్న తర్వాత కూడా మమతాబెనర్జీ ఇలాంటి దురాగతానికి పాల్పడలేదు. అయినాసరే త్రిపురలో తమది గొప్ప భావజాల విజయంగా మోదీ చెప్పుకోవడం ఒక విడ్డూరమైతే, భిన్న భావజాలప్రతీకైన లెనిన్ విగ్రహాన్ని అనుయాయులు భౌతికంగా కూల్చివేయడం ఇంకొక వైపరీత్యం. లెనిన్ విదేశీయుడు కనుక అతని విగ్రహాన్ని కూల్చినా తప్పులేదని సమర్థించుకున్నారు కానీ, వాస్తవానికి తాము గురిపెడుతున్నది లెనిన్ భావజాలాన్ని నమ్మే స్వదేశీయులపైనేనన్న సంగతిని గమనించుకోలేదు. భావజాలం వ్యక్తుల ఆలోచనల్లో ఉంటుంది తప్ప విగ్రహాలలో ఉండదన్న గ్రహింపు లోపించింది. తన సమకాలీన భారతదేశ పరిణామాలపై లెనిన్ ఎలాంటి సానుకూల వైఖరి తీసుకున్నాడో ఆయనకూ, ఎం. ఎన్. రాయ్‌కి మధ్య జరిగిన చర్చల ద్వారా తెలుస్తుంది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న జాతీయవాద శక్తులను తిరోగమనవాదులుగా పేర్కొంటూ, వారికి సైతం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎం. ఎన్. రాయ్ వాదిస్తే,, లెనిన్ దానిని ఖండిస్తూ కమ్యూనిస్టులు గాంధీ సహా జాతీయవాద శక్తులను బలపరచితీరాలని స్పష్టం చేశాడు. విదేశీయుడన్న కారణంతో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చడంలోని సంకుచితత్వం, చారిత్రిక అజ్ఞానం మాటలకు అందనిది. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే, భారత్‌తో ముడిపడిన ఆయన తాలూకు చారి త్రిక ఆనవాళ్లను చెరిపివేసి చరిత్రకు ద్రోహం చేయబోవడమే. ద్రవిడ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని కూడా కూల్చివేయాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు పిలుపు ఇవ్వడం, విగ్రహానికి మసిపూయడం వెనుక ఉన్నదీ; భిన్న ఆలోచనా పంథాలను తుడిచిపెట్టి, వ్యక్తుల మెదళ్లు వంచి దేశం ఆ చివరి నుంచి ఈ చివరివరకూ ఏకశిలా సదృశమైన భావజాలాన్ని రుద్దే వ్యూహమే. ఈ సందర్భంలో కంచిలోని శంకరాచార్యపీఠాన్ని, చిరకాలం పీఠాధిపత్యం వహించిన పరమాచార్యను గుర్తు చేసుకోవడం అవసరం. కంచి మఠానికి ఎదురుగా గోడలపై పెరియార్ నాస్తికప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దకాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూవచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండడం పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకున్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతి గొప్ప ప్రతీ కలలో ఇదొకటి. ఈ సహజీవన వైవిధ్యాన్ని, చెరిపివేసి ఒకే మూసభావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలో భాగంగానే లెనిన్ విగ్రహ ధ్వంసాన్ని, పెరియార్ విగ్రహంపై దాడిని చూడవలసి ఉంటుంది. ఈ దుశ్చర్యలను సమర్థించుకునే విఫలయత్నంలో బీజేపీ శ్రేణులూ, పరివార్ సంస్థల ప్రతినిధులూ చేసిన వితండవాదాలు, దొర్లించిన వికృత వ్యాఖ్యలు అంతే విస్తుగొలిపాయి. ‘ఒక ప్రభుత్వం చేసిన దానిని ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుం’దని అంటూ త్రిపుర గవర్నర్ బాహాటంగా సమర్థించారు. మనుషులపై దాడి చేసినా, చంపినా హింస అవుతుంది తప్ప విగ్రహాలపై దాడి హింస కాబోదని ఆయన నిర్వచనం. ‘లెనిన్ విగ్రహాలను కూల్చింది రష్యాలో కాదు, త్రిపురలో! మార్పు రావలసిందే’నని మరో నేత వ్యాఖ్య. ఎప్పటిలానే ప్రధాని ఆలస్యంగా గొంతు విప్పి విగ్రహాల కూల్చివేతను ఖండించినా ఈ సమర్థింపు ప్రహసనం సాగుతూనే ఉంది. అధినేత ఖండిస్తారు. అనుయాయులు తాము చేసేది చేస్తూనే ఉంటారు. అంతిమంగా కుప్పకూలుతున్నవి ఏవో విగ్రహాలో మరొకటో కావు... వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశ సంస్కృతీ, సభ్యతా, సంప్రదాయాలు. మనం ఎంతో అపురూపంగా పెంచి పోషించుకోవలసిన ప్రజాస్వామిక విలువలు. భాస్కరం కల్లూరి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : kalluribhaskaram9@gmail.com -
శిలా విగ్రహాలు కూలితేనేం?
మనం ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది మార్పు లేకుండా కొనసాగుతోంది. భారత వామపక్షంతో నా తొలి అవగాహన క్రికెట్ ఆటలో మొదటి బాల్కే డకౌట్ కావడంతో సరిసమానమైనదే. 1975లో నేను జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిందిది. అప్పుడు మాతో పాటు ఒకే ఒక కామ్రేడ్, నిజానికి శాంతియుతంగా ఉండే నక్సలైట్ ఉండేవాడు. ఆయనతో పందెం వేశాను. ఈఎంఎస్ నంబూద్రిపాద్ జీవించి ఉన్నారా, లేదా అన్నదే ఆ పందెం. ఆ పందెంలో నేను పది రూపాయలు పోగొట్టుకున్నాను. విద్యార్థి వసతిగృహం అద్దె, మెస్ బిల్లు కట్టడానికి ఇంటి దగ్గర నుంచి వచ్చే 200 రూపాయల కోసం ఎదురు చూసే రోజులవి. కాబట్టి పది రూపాయలంటే పెద్ద మొత్తమే. తరువాత చాలాకాలానికి కేరళ మీద వార్తా కథనం రాస్తున్నప్పుడు జరిగింది. వామపక్ష ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం (అప్పుడు అక్కడే ఉన్న దాదా జర్నలిస్ట్ రమేశ్ మేనన్‌తో కలసి) రాసినప్పుడు సాక్షాత్తు ఈఎంఎస్‌ను కలుసుకున్నాను. నా పందెం విషయం ప్రస్తావించాను. ఆయన తన చేయి పైకి ఎత్తి, మణికట్టు దగ్గర చూపిస్తూ, ‘మీరు నా నాడిని ఎందుకు పరీక్షంచకూడదు’ అన్నారు, నిర్వికారంగా. ఇంకా, ‘మీరు చెప్పిందే నిజమైతే, మీ డబ్బు మీకు వెనక్కి రావలసిందే’అన్నారు. అంతా నవ్వుకున్నాం. జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను వామపక్ష రాజకీయాల గురించి తెలియకుండా ఉండిపోయానంటే అందుకు పంజాబ్ పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న పాఠశాలల్లో, తరువాత హరియాణా వంటి చోట చదవడం కొంత కారణం. అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు ఉండేవి కావు. ఒక ఉపాధ్యాయుడు కామ్రేడ్ వంటి పదాలతో పిలిపించుకోవాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ అసలు ఎలాంటి కార్మిక సంఘాలు, అందులోను వామపక్ష కార్మిక సంఘాలు లేనేలేవు. ఇక తూర్పున వచ్చిన నక్సల్ ఉద్యమం మాకు చేరేటప్పటికి పురాతనమైపోయింది. నేను భారత వామపక్ష రాజకీయాల గురించి తెలుసుకున్నది జర్నలిస్టుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాతనే. ఆ క్రమంలో నేను వామపక్ష విమర్శకుడిగానే ఎదిగాను. ముఖ్యంగా వారి ఆర్థిక సిద్ధాంతం, రాజకీయ–సామాజిక కపటత్వాన్ని నేను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నాను. నియంతృత్వం నుంచి అధికారాన్ని తెచ్చుకునే ఒక సిద్ధాంతం ‘ప్రజాస్వామిక’ అనే పదం పక్కన ఎలా ఇముడుతుంది? అలాగే భద్రలోక్ అని పిలుచుకునే అగ్రకులాల నుంచి వచ్చిన వ్యక్తులు(విదేశాలలో చదువుకున్నవారు, ప్రత్యేక హక్కులు ఉన్న భారతీయ వ్యవస్థల నుంచి వచ్చిన వారు) సమానత్వం గురించీ, బలహీన వర్గాల గురించీ ఏకధాటిగా ఎలా మాట్లాడతారు? ఇన్ని దశాబ్దాలలోను వామపక్ష రాజకీయాలతో నేను ఏకీభవించిన పరిస్థితి ఎక్కడా లేదు. ఈ మేధోపరమైన, తాత్వికమైన అహంకారం గురించి నేను బాధపడ్డాను కూడా. నీవు మాతో రాకపోతే పెట్టుబడుదారుల తాబేదారువి అయినట్టే. బూర్జువా అనే పదం కాలక్రమంలో వెలుగులోకి వచ్చి, తరువాత అదే నియో లిబరల్గా రూపాంతరం చెందింది. ఇది కాకపోతే ఇంకొకటి. 1989–1993 మధ్య పంజాబ్‌ను తుది దశ ఉగ్రవాదం కకావికలు చేసింది. సరిహద్దు జిల్లాలలో ఉగ్రవాదులు ‘విముక్తం’చేశామని చెప్పిన గ్రామాల మీద తిరిగి పట్టు సాధించిన ఏకైక రాజకీయ శక్తులు, అందుకు త్యాగాలు చేసిన పార్టీలు, ఇప్పటికీ కార్యకర్తలు ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే. పోలీసులు వారికి ఆయుదాలు అందించారు. ఒక మహిళా కామ్రేడ్ ఎల్ఎమ్జీ (లైట్ మెషీన్ గన్)ని తన ఇంటి మీద ఏర్పాటు చేసి, నిరంతరం రక్షించుకుంటూ ఉన్న ఉదంతం గురించి మేం నివేదించాం కూడా. ఆ ఒక్క రాష్ట్రంలో ఆ దశను మినహాయిస్తే, వామపక్షం గురించి చప్పట్లు కొట్టేందుకు ఏదీ నాకు కనిపించలేదు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోయిన తరువాత సీపీఐ నాయకుడు ఏబీ బర్దన్ ‘భాద్మే జాయే డిజిన్వెస్ట్‌మెంట్’ అంటూ ఇచ్చిన ప్రకటనకు నేను మండిపడ్డాను కూడా. అణు ఒప్పందం గురించి జరిగిన ఓటింగ్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ విజయం సాధించినప్పుడు, వామపక్షాలు ఏహ్యభావంతో చూసే మాయవతి, బీజేపీ సహా కుల,మత శక్తులని పిలిచే వారితో చేతులు కలిపినప్పుడు కూడా నేను అభినందించాను. ఆ తరువాత అంతిమంగా మమతా బెనర్జీ వారిని పశ్చిమ బెంగాల్లో ఓడించినప్పుడు అభినందించాను. దాంతోనే భారత వామపక్ష రాజకీయాల కథ ముగిసిందని స్పష్టమైంది. తూర్పు, మధ్య భారతంలో ఉగ్రవాద వామపక్షం కూడా అనివార్యంగా అదే బాటలో ఉంది. కాబట్టి లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్ఘటన పట్ల నేను నిరసన ప్రకటించనని మీలో చాలామంది ఊహించవచ్చు. కానీ నేను నిరసన ప్రకటించాను. కానీ దానికి అనివార్యమైన వేరే కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైనా తమకు నచ్చిన దేవుళ్లను ఎంచుకుని పూజించుకునే హక్కు కలిగి ఉన్నారు. ఇతరులకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేసే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. 1980 దశకం చివరి అంకంలో ప్రపంచ కమ్యూనిజంలో మార్పు ఆరంభమైంది. సోవియెట్ యూనియన్ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆఫ్ఘానిస్తాన్‌తో చేసిన యుద్ధంలో ఓడిపోయింది. గోర్బచెవ్ పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్లను ప్రవేశపెట్టారు. డెంగ్ సరళీ కరణను అనుమతిస్తూ, ఎలకలని పట్టుకోగలినదైతే పిల్లి తెల్లగా ఉంటే ఏమి, నల్లగా ఉంటే ఏమి అంటూ చైనా ప్రజలకు హితబోధ చేశారు. ‘భారత్‌లో మారని వామపక్షం’ అన్న అంశం మీద పని చేయడానికి ఆ సమయంలో నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు సరోజ్ ముఖర్జీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి. పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల లెనిన్, స్టాలిన్, మార్క్స్‌ల పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి. ‘గోర్బచెవ్, డెంగ్ మారుతున్నారు. మీరు ఎందుకు మారడం లేదు సార్?’ అని అడిగాను. ‘ఎందుకంటే, నా కమ్యూనిజం డెంగ్, గోర్బచెవ్‌ల కమ్యూనిజం కంటే స్వచ్ఛమైనది’ అన్నారాయన అచంచల విశ్వాసంతో. తరువాత సరిగ్గా రెండేళ్లకి రిపబ్లిక్లు విడిపోయాక సోవియెట్ యూనియన్ను చూసేందుకు నేను మాస్కో వెళ్లాను. బుఖారెస్ట్‌లో ట్యాంకులు ఇంకా రోడ్ల మీదే ఉన్నాయి. వందలాదిమంది ప్రజలు సీసెస్క్యూను చంపిన చోటికి తండోపతండాలుగా వచ్చారు– శపించడానికి, ఉమ్మడానికి. రుమేనియా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలకు వెళ్లిన భారత వామపక్ష బృందం ఒకటి అంతకు కొన్ని వారాల ముందే మన దేశం చేరుకుంది. ఈ బృందంలోనే ఎవరో ది పయనీర్ పత్రికకు ఒక వ్యాసం రాశారు. సీసెస్క్యూ అరాచకాలకు సంబంధించి వస్తున్న వార్తలు, ఆయన ప్రభుత్వం పతనం కావడం గురించిన వార్తలు– ఇవన్నీ పాశ్చాత్య దేశాల దుష్ప్రచారమేనని రాశారు. అందుకు చూపించిన ఉదా‘‘ నియంత తన ఉపన్యాసం ముగించిన వెంటనే మొదలైన ప్రశంసల వర్షం కొన్ని గంటల దాకా ఆగలేదని పేర్కొన్నారు. ఇది జరిగిన సరిగ్గా ఎనిమిది మాసాల తరువాత మళ్లీ నేను మాస్కో వెళ్లాను. ఇవాళ ఇక్కడ ఎలా జరిగిందో, అలాగే అక్కడ జరిగిన కమ్యూనిస్టు నేతల విగ్రహాలను ఎలా పెళ్లగించడం జరిగిందో చూసేందుకు వెళ్లాను. ఆ విగ్రహాలను కూల్చివేసినందుకు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కొందరు తప్ప చాలా తక్కువ మంది విచారం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం. ఒక సిద్ధాంతం కాలగర్భంలో కలసిపోతే, దానితో పాటు ఆ సిద్ధాంతం పునాదిగా వేళ్లూనిన నియంతృత్వాలు, వాటిని సాగించిన నియంతలు కూడా దాని వెంట కాలగర్భంలోకి నిష్క్రమించవలసిందే. తన 34 సంవత్సరాల పాలనలో రాజకీయంగా వామపక్ష కూటమి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. అది ప్రజాస్వామ్యం గురించి, ఉదారవాదం గురించి ప్రబోధించింది. కానీ దుండగులతో, బలవంతపు వసూళ్లు చేసేవారితో కూడిన ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టింది. ఈ సైన్యం ఏ ఒక్క ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు. కేరళకు ఒక సోషలిస్టు గుణం ఉంది. అక్కడ కాంగ్రెస్, వామపక్షం ఒకదాని తరువాత ఒకటి అధికారం పంచుకుం టాయి. మిగిలిన దేశమంతటా పంజాబ్ మొదలు మహారాష్ట్ర వరకు; బిహార్ నుంచి ఆఖరికి అస్సాం వరకు కూడా వామపక్షాలు అంతర్ధానమయ్యాయి. అయితే ఇతరుల పుణ్యమా అని 2004లో 59 స్థానాలు పొందిన వామపక్షాలకు జాతీయ స్థాయి అధికారాన్ని రుచి చూసే అవకాశం దక్కింది. ఆ తరువాతే వారి రాజకీయ అధికారం పతనం కావడం ఆరంభమైంది. వామపక్షం అడుగంటిపోతోంది. ఆ పార్టీ పెద్దల విగ్రహాలు కూలుతున్నాయి. కానీ వాళ్ల సిద్ధాంతం ఇంకా ఏలుతుంది. అది సవాలు చేయలేనిది. నేను ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం పత్రికా విలేకరులు వార్తా కథనాల కోసం హేళన చేస్తూ ఉంటారు. వాక్లవ్ హావెల్ వెల్వెట్ రివల్యూషన్ కారణంగా ప్రేగ్ నగరంలో కమ్యూనిజం కకావికలైంది. అక్కడ మీరు ప్రయాణించే కారు డ్రైవర్ ఒక అణు ప్రయోగశాలలో ఉద్యోగం పోగొట్టుకున్న కంప్యూటర్ ఇంజనీర్ అయి ఉండవచ్చు. మేం ప్రయాణించిన కారు డ్రైవర్ అలాంటి వాడే. మా సంభాషణ అనివార్యంగా కమ్యూనిజం వైఫల్యాలు, తీవ్ర చర్యల మీదకు మళ్లింది. భారతదేశంలో సోషలిజం ఇప్పటికీ ఎందుకు అంత ప్రాచుర్యం కోల్పోకుండా ఉంది వంటి ప్రశ్న నుంచి చాలా ప్రశ్నలే అడిగాడు. అలాగే ముఖ్యమైన రాష్ట్రాలలో తరుచూ ఎందుకు ఎన్నికవుతారని కూడా అతడు ప్రశ్నించాడు. దానికి అతడే సమాధానం కూడా చెప్పాడు. మీ సోషలిజం మా సోషలిజం కంటే భిన్నమైనదని అన్నాడు. మా సోషలిస్టులు మా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛలను మా నుంచి దూరంగా తీసుకుపోయారు. కానీ మీ స్వేచ్ఛలు మీ దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఎమర్జెన్సీ సమయంలో వాటిని ప్రభుత్వం లాక్కున్నా మళ్లీ మీరు సాధించుకున్నారని కూడా వ్యాఖ్యానించాడు. అతడు చెప్పింది నిజమే. అయితే మీరు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఎన్నడూ రుచిచూడలేదు కాబట్టి సోషలిజం మిమ్మల్ని నష్టపరిచింది ఏమిటో మీరు అర్థం చేసుకోలేరు. అతడు చెప్పింది నిజం. మనం ఇప్పుడు ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగుతోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆ విగ్రహాన్ని వాళ్లే కూల్చారు
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై బీజేపీ స్పందించింది. లెనిన్ విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ భూమిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భూ యజమానులే తొలగించారని దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని చెప్పారు. త్రిపురలో రెండున్నర దశాబ్ధాల సీపీఎం సర్కార్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో లెనిన్ విగ్రహం కూల్చివేత కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘త్రిపురలో ఏ ఒక్క విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదు..ఇది తప్పుడు సమాచారం..కొందరు వ్యక్తులు ప్రైవేట్ భూమిలో విగ్రహాన్ని నెలకొల్పి తర్వాత వారే తొలగించార’ని రాంమాధవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నేతలను గౌరవించాలని ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి హితవు పలకడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మమత ఇతర రాష్ట్రాలలో జరిగే పరిణామాలపై దృష్టిసారించే ముందు తమ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచించారు. -
కొనసాగుతున్న ‘విగ్రహ’ కాండ
చెన్నై/కన్నూర్/లక్నో: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. లెనిన్, పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్ విగ్రహాలపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతుండగానే కేరళలోని కన్నూర్‌లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో గాంధీ కళ్లద్దాలు పగిలిపోయాయి. చెన్నైలోని తిరువోత్తియూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి ఖండించారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అటు, యూపీలోని బలియా జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. -
హింస నచన ధ్వంస రచన
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. ప్రస్తుత పాలకులు, వారు ఆరాధించే నాయకుల విగ్రహాలను కూలదోయడం విప్లవకారుల నుంచి అనేక రాజకీయ గ్రూపుల వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అధికారంలో ఉన్నవారు, రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసేవారు విగ్రహాల విధ్వంసానికి పాల్పడడాన్ని రాజకీయ అసహనంగా ప్రజాస్వామికవాదులు భావిస్తారు. దేశంలో 1960ల ఆఖరులో ఆరంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోలకత్తా నగరంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి 19వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో దళితులతో పేచీ పడిన ఇతర వర్గాలు బడుగువర్గాలు ఆరాధించే బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను పగలగొట్టడం లేదా నల్లరంగు పూయడం ఎంతో కాలంగా జరుగుతోంది. ఎక్కడైనా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై దాడులు జరిపి వాటిని పగలగొట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం రివాజుగా మారింది. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్ డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్టుల పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాల్లోని కమ్యూనిస్ట్యో ధులు వ్లాదిమిర్లెనిన్, జోసెఫ్స్టాలిన్భారీ విగ్రహాలను కూల్చివేయడం ఇతర దేశాల ప్రజలకు దిగ్భాంతి కలిగించింది. కమ్యూనిస్టుల పాలన అంతమైన పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు, విప్లవకారుల విగ్రహాలను బుల్డోజర్లతో తొలగించారు. 2001 మార్చిలో అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్లోయ ప్రాంతంలోని భారీ బుద్ధ విగ్రహాలను పాలకపక్షమైన తాలిబాన్లు తమ నేత ముల్లా మహ్మద్ఒమర్ ఆదేశాలపై కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. దక్షిణాఫ్రికాలోని జొహనీస్ బర్గ్‌లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్12న కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ముఖ భాగం స్వల్పంగా దెబ్బతింది. దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలనపై పోరాడిన గాంధీకి నల్లజాతివారంటే చిన్నచూపని ఆరోపిస్తూ ఈ పనిచేశారు. మరో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని ఆక్రాలోని యూనివర్సిటీ ఆఫ్ఘనా ఆవరణలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలని 2016లో దాదాపు వేయి మంది పౌరులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. దాంతో ఈ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. అమెరికాలోనూ విగ్రహాలపై ఆగ్రహం! అమెరికాను కనుగొన్న స్పెయిన్‌కు చెందిన అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్ స్మారక దినం సందర్భంగా 2017 అక్టోబర్9న ఇలినాయ్, రోడ్ఐలండ్రాష్ట్రాలు, కనెక్టికట్‌లోని మూడు నగరాల్లో వాటిని కొందరు ప్రదర్శకులు కొలంబస్ విగ్రహాలను స్వల్పంగా ధ్యంసం చేశారు. 19వ శతాబ్దంలో నల్లవారిని బానిసలుగా చూసే వ్యవస్థను కాపాడడానికి దక్షిణాది రాష్ట్రాలైన వర్జీనియా, నార్త్, సౌత్కరోలినా రాష్ట్రాల తరఫున పోరాడిని కాన్ఫడరేట్దళాలను నడిపించిన కమాండర్లు, సైనికుల విగ్రహాలు కొన్నింటిని కిందటేడాది తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా సిడ్నీలోని అన్వేషకుడు కెప్టెన్జేమ్స్కుక్విగ్రహంపై నల్ల రంగు పెయింట్పోసి కొందరు స్థానిక జాతుల ప్రదర్శకులు నిరసన తెలిపారు. ఏలూరు కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువలో వేశారు. 2001 మార్చిలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్ బండ్‌పై సాగిన మిలియన్మార్చ్సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. అదే కాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు పగలగొట్టారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు వెంటనే జోక్యం చేసుకుని తెలుగువారికి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన అమరజీవి విగ్రహాల జోలికి పోవద్దనీ, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటించాక ఇలాంటి దాడులు జరగలేదు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
డెక్కుతున్న ‘విగ్రహ’ రాజకీయం
కోల్‌కతా/లక్నో/చెన్నై: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం త్రిపురలో లెనిన్ విగ్ర హం ధ్వంసం.. తర్వాత తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. యూపీ లోని మీరట్ జిల్లాలో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. శ్యామాప్రసాద్.. అంబేడ్కర్ త్రిపురలో లెనిన్ విగ్రహ ధ్వంసానికి ప్రతీకారంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఏడుగురు యువకులు విగ్రహానికి నల్లరంగు పులిమారు. అనంతరం విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఈ ఘటనకు పాల్పడిన వారంతా ‘రాడికల్’ పేరుతో పనిచేసే వామపక్ష భావజాల సంస్థకు చెందినవారు. దీన్ని చాలా తీవ్రమైన ఘటనగా పరిగణిస్తున్నాం’ అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలపై కోల్‌కతాలో బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత రత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏ పార్టీవారైనా శిక్షించండి: మోదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహధ్వంసం ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. విధ్వంసానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, విగ్రహ ధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ‘విగ్రహాలను పడగొట్టడం దురదృష్టకరం. మా పార్టీ వీటికి ఎప్పుడూ మద్దతు పలకదు. తమిళనాడు, త్రిపురల్లో పార్టీ నేతలతో మాట్లాడాను. ఈ విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’ అని షా స్పష్టం చేశారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్ని ప్రేరేపించినట్లుగా భావిస్తున్న తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్బుక్ కామెంట్లపై అమిత్ షా స్పందిస్తూ.. ‘రాజాపై ఎలాంటి చర్యలు ఉండవు’ అని వెల్లడించారు. పెరియార్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కార్యకర్త ముత్తురామన్‌ను పార్టీనుంచి బీజేపీ తొలగించింది. తమిళనాట నిరసనలు రాజా క్షమాపణలు చెప్పినా తమిళనాడు రాజకీయ పార్టీలు, పెరియార్ అభిమాన సంఘా లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష డీఎంకే, పలు తమిళ సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. చెన్నై, కడలూర్, సేలం తదితర ప్రాంతాల్లో రాజా విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కావేరీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చి ఉంటారని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. జంధ్యాలు తెంచేశారు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిని డీవీకే (ద్రవిడార్ విదుత్తలై కళగం) కార్యకర్తలు అటకాయించారు. వీరిని బెదిరించి.. మెడలో వేసుకున జంధ్యాలను బలవంతంగా తెంచేశారు. అనంతరం పెరియార్ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు డీవీకే కార్యకర్తలు రాయపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
విగ్రహాలపై ఆగ్రహం!
వదంతుల వల్లనో, అనుమానాల వల్లనో మనుషుల్ని కొట్టి చంపుతున్న సంస్కృతి సామాజిక మాధ్యమాల ద్వారా పరివ్యాప్తమై అందరినీ బండబారుస్తున్న తరు ణంలో విగ్రహ విధ్వంసాలు అతి సాధారణమనిపించవచ్చు. కానీ మనమొక ప్రజా స్వామిక వ్యవస్థలో ఉన్నామని... ఈ హత్యలు, విగ్రహ విధ్వంసాలు నాగరిక విలు వలకే విరుద్ధమైనవని, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెచ్చే దురం తాలని గ్రహించినప్పుడు ఆందోళనా, ఆవేదనా కలుగుతాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడైన తర్వాత ఆ రాష్ట్రంలో రెండు మూడుచోట్ల బీజేపీ కార్యకర్తలు విజయోత్సాహంతో రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాలను కూల్చారు. కొన్నిచోట్ల సీపీఎం కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. వీటిని చూసి ఉత్సాహపడిన తమిళనాడు బీజేపీ నేత హెచ్. రాజా ‘కులోన్మాది పెరియార్ ఇ.వి. రామస్వామి విగ్రహానికి కూడా ఇదే గతి పడుతుంద’ని ఫేస్బుక్లో హెచ్చరించడం, కొద్దిసేపటికే కొందరు దుండగులు వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని కూల్చడం జరిగిపోయాయి. ఆవేశం తలకెక్కి, విచక్షణ కోల్పోయిన గుంపు ఏదో చేసిందను కోవడానికి లేకుండా త్రిపుర గవర్నర్ తథాగతరాయ్, పలువురు బీజేపీ నేతలు ఆ ఉదంతాలను సమర్థిస్తూ మాట్లాడిన తీరు విస్మయం కలిగిస్తుంది. ఈ వరస విధ్వం సాలపై ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకో మని ఆదేశించారు. కానీ ఆ పని మొట్టమొదటి ఉదంతం సమయంలోనే చేసి ఉంటే ఇవి జరిగేవి కాదు. పైగా అలా చేయడం ఘనకార్యమన్నట్టు సీనియర్ నేతలే మాట్లాడటం అగ్నికి వాయువు తోడైనట్టయింది. ఈ విధ్వంసానికంతకూ లక్ష్యంగా మారినవారు వ్యక్తిమాత్రులు కారు. తమ జీవితకాలంలో అందరిపైనా బలమైన ముద్రవేసిన నాయకులు. మార్పు కోసం తపించినవారు. మెరుగైన సమాజానికి పాటుబడినవారు. వారి భావాలతో ఏకీ భావం లేకపోవచ్చు. వారెంచుకున్న మార్గాలు సరైనవి కావన్న అభిప్రాయం ఉండొచ్చు. వారి సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు. విగ్రహాలను కూల్చినంతమాత్రాన ఆ భావాలు, సిద్ధాంతాలు మటుమాయమవుతాయని మతిమాలిన గుంపు అను కుంటే అనుకుని ఉండొచ్చు... కానీ బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు, నాయకులైన వారు అదే తరహాలో ఆలోచించడం దిగ్భ్రాంతికరం. వీరిలో కొందరైతే లెనిన్ ఈ దేశానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఉగ్రవాది అన్నారు. విదేశీయుడన్నారు. లెనిన్ అయినా, అంతకు చాలాకాలం ముందు మార్క్స్ అయినా మన దేశంపై బ్రిటిష్ వలసవాదుల పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో ఇక్కడ జరుగు తున్న పోరాటాలను సమర్ధించారు. ప్రసార సాధనాలు అంతగాలేని 1850 సమ యంలో కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న పోరాటాలను అధ్యయనం చేసి వాటిని విశ్లేషించినవాడు మార్క్స్. 1857నాటి సిపాయిల తిరు గుబాటుపై వచ్చిన వార్తల ఆధారంగా అమెరికాకు చెందిన న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్‌లో మార్క్స్, ఏంగెల్స్ పలు వ్యాసాలు రాశారు. ‘పూర్ణ స్వరాజ్’ కోసం పోరాడాలని 1929 డిసెంబర్ 19న లాహోర్‌లో కాంగ్రెస్ తీర్మానించడానికి పదేళ్లముందే భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాలని అభిలషిం చినవాడు లెనిన్. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ఎంఎన్ రాయ్‌లాంటి వారికి తోడ్పాటునందించాడు. సమాజానికి వ్యాధిగా పరిణమించిన కులాన్ని నిర్మూలించడానికి, మహిళలకు సమాన హక్కులు సాధించడానికి, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడానికి పెరియార్ ఇ.వి. రామస్వామి చేసిన కృషి అసా ధారణమైనది. తమిళనాట ఆయన నాయకత్వంలో సాగిన ‘ఆత్మగౌరవ పోరాటం’ దక్షిణాదినంతటినీ ప్రభావితం చేసింది. నవ భారతం ఏర్పడేనాటికల్లా దేశంలో అసమానతలు పోవాలని ఆయన కలలుకన్నాడు. ఇలాంటివారి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఏం సాధించవచ్చనుకుంటున్నారో అనూహ్యం. ఇదే తర హాలో అడపా దడపా మహాత్మాగాంధీ విగ్రహాలనూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలనూ ధ్వంసం చేసిన వారున్నారు. వాటిని అవమానించిన వారున్నారు. నిరుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని నిరోధించడానికి గ్రామ పెద్దలు ప్రయత్నించారు. అందుకోసం అనేక నెలలపాటు దళిత సంఘాలు, పార్టీలు పోరాడ వలసివచ్చింది. ఇంతకూ త్రిపురలో ఏం జరిగిందని అంత ఉత్సాహం? ఇరవైయ్యేళ్ల సీపీఎం పాలన అంతమై బీజేపీ అధికారంలోకొచ్చింది. పైగా గెలిచిన బీజేపీకి, ఓడిన సీపీఎంకూ మధ్య ఓట్ల వ్యత్యాసం అరశాతం కూడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లొస్తే... సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఆ రాష్ట్రంలో అంతక్రితం కూడా సీపీఎం ఒకసారి ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే కాక వరసగా ఇరవైయ్యేళ్లు పాలించింది. జనం మెచ్చే రీతిలో పాలన అందించలేనప్పుడు ఓడిపోవడంలో వింతేమీ లేదు. ఆ ఓటమికి మూల కారణాలేమిటో ఓడిన పక్షం విశ్లేషించుకుంటుంది. కొత్తగా అధికారంలో వచ్చిన పార్టీ తానిచ్చిన వాగ్దానాలేమిటో, వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్య లేమిటో పరిశీలించుకోవాలి. ప్రజల సంక్షేమానికి ఇంకేమి కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయించుకోవాలి. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించినప్పుడు ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది. కానీ మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో తుడిచి పెట్టుకుపోయింది. ఎన్నికల్లో గెలవడమే సర్వస్వం అనుకోవడం, విలువలకు తిలోదకాలొదిలి వీరంగం వేయడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. గెలిచిన పక్షం ఓడిన పార్టీ కార్యాలయాలనూ, ఆ పార్టీ స్ఫూర్తిదాయకమని భావించేవారి విగ్రహాలనూ ధ్వంసం చేయడం లాంటి పనులకు పాల్పడితే అది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. గెలుపులోనూ హుందాగా ఉండటం ఏ పార్టీ అయినా అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం. -
పెరియార్ అంటే బీజేపీకి ఎందుకు మంట!
సాక్షి, న్యూడిల్లీ : త్రిపురలో రష్యా కమ్యూనిస్టు విప్లవకారుడు వీఐ లెనిన్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం బుల్డోజర్ పెట్టి కూల్చేసిన బీజేపీ కార్యకర్తలు తమిళనాడులోని పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు బుధవారం ప్రయత్నించడంతో తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి కాషాయ మూకలను ఫేస్బుక్ పోస్టింగ్ ద్వారా రెచ్చగొట్టిందే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా. ‘లెనిన్ ఎవరు? ఆయనకు భారత్‌కు సంబంధం ఏమిటీ? కమ్యూనిస్టులకు భారత్‌కు ఉన్న సంబంధం ఏమిటీ? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులోని ఈవీ రామస్వామి (పెరియార్) విగ్రహం!’ అంటూ బీజేపీ నాయకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానికి స్పందించిన ఇద్దరు బీజేపీ అనుమానిత కార్యకర్తలు తమిళనాడులోని వెల్లూర్‌కు సమీపంలోని తిరుపట్టూర్లో ఉన్న పెరియార్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. రాజాను గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, విగ్రహాన్ని ముట్టుకున్న చేతుల్ని నరికేస్తామంటూ ఎండీఎంకే నాయకుడు వైకో హెచ్చరించారు. దీంతో హెచ్. రాజా వెంటనే ఫేస్‌బుక్‌లోని తన పోస్టింగ్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే పెరియర్ రామస్వామి విగ్రహాలను తొలగించాలని బీజేపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని బీజేపీ తమిళనాడు ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెప్పారు. బీజేపీకైనా, సంఘ్ పరివార్కైనా పెరియార్ రామస్వామి అంటే ఎందుకు కోపం? ఆయన ఎవరు ? ఆయన సిద్దాంతం ఏమిటీ ? తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం. ముఖాన గుండ్రటి కళ్లజోడు. ఉదారత్వం ఉట్టిపడే ఆయన నవ్వును చూస్తే ఎవరైనా ఆయన్ని గౌరవనీయులని అనుకుంటారు. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. ‘దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎటాల్ (దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు)’ పెరియార్ ఉద్యమంలో ప్రధాన నినాదం. ‘దేవుడు దుష్టుడు, దేవున్ని పూజించే వారు ఆటవికులు అని కూడా అన్నారు. కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారత దేశమే తనకు వద్దని, కుల, మత రహిత దక్షిణ భారతమే తనకు దేశంగా కావాలన్నారు. కుల, మతాలకు విలువనిస్తున్న భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. 1957లో పెరియార్ మూడువేల మంది తన అనుచరులతో కలిసి భారత రాజ్యాంగం ప్రతులను తగులబెట్టి అరెస్టయ్యారు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత సమాజం ఏర్పడుతుందని వాదించారు. హిందూత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కారణంగానే బీజేపీకి ఆయన అంటే పడదు. ఈ కారణంగానే బీజేపీ ద్రావిడ రాష్ట్రాలపై ఇప్పటికీ పట్టు సాధించలేక పోతోంది. దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం సైద్ధాంతిక వాదనలకుగాని, విగ్రహ విధ్వంసానికి గానీ బీజేపీ నేతలు ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చారు. పెరియార్ తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1916లో ఏర్పడిన ‘జస్టిస్ పార్టీ’లో 1939లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే పుట్టింది. దాని నుంచి అన్నాడీఎంకే ఆవిర్భవించింది. మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. -
విగ్రహాల ధ్వంసంపై స్పందించిన అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్‌షా హెచ్చరించారు. -
విగ్రహాల ధ్వంసం.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. విగ్రహాల ధ్వంసాన్ని తాను ఎంతమాత్రం ఆమోదించబోనని ఆయన తేల్చిచెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ అడ్వయిజరీ జారీచేసింది. విగ్రహాల ధ్వంసానికి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. త్రిపురలో ధ్వంసమైన లెనిన్ విగ్రహం త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొందరు దుండగులు లెనిన్ విగ్రహాలను కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు తమిళనాడుకూ ఈ సెగ తగిలింది. త్రిపురలో లెనిన్ విగ్రహాలకు పట్టిన గతే తమిళనాడులో పెరియార్ విగ్రహాలకు పడుతుందని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా ఫేస్బుక్లో పోస్టు చేయడం, వెంటనే వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రో బాంబు దాడి జరిగింది. బెంగాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై నల్లరంగు పోసిన దృశ్యం ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించగా.. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తీవ్రంగా స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం తీవ్ర దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఎవరి విగ్రహాల ధ్వంసానికి మద్దతునివ్వబోదని ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడు, త్రిపురలోని పార్టీ యూనిట్లతో మాట్లాడానని, విగ్రహాల ధ్వంసంతో ఎవరికైనా సంబంధం ఉంటే వారిపై తీవ్ర చర్యలు తప్పవని షా హెచ్చరించారు. -
లెనిన్ విగ్రహం కూల్చివేత
అగర్తలా/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం త్రిపుర వేడెక్కుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి సీపీఎం, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. పలు చోట్ల సీపీఎం కార్యాలయాలను ధ్వంసం చేసిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలోని బెలోనియా పట్టణంలోని సోవియట్ రష్యా విప్లవ నేత వ్లాదిమర్ లెనిన్ విగ్రహాన్ని సోమవారం గుర్తుతెలియని దుండగులు జేసీబీతో కూల్చివేసిన ఘటన ఉద్రిక్తతలను మరింత పెంచింది. అంతకుముందు, ఆదివారం సబూన్లోని లెనిన్ విగ్రహాన్ని కూడా కొందరు ధ్వంసం చేసి కూల్చేశారు. బెలోనియాలోని కాలేజీ స్క్వేర్‌లో నెలకొల్పిన లెనిన్ విగ్రహాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ ఇటీవలే ఆవిష్కరించారు. లెనిన్ విగ్రహ కూల్చివేతలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల సీపీఎం శ్రేణులు నిరసనలు నిర్వహించాయి. ఈ ఘటనకు బీజేపీయే కారణమని ఆరోపించాయి. ఎన్నికల్లో విజయంతో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్టీ రాష్ట్రంలో దాడులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్ ధర్ ఆరోపించారు. లెనిన్ విగ్రహం కూల్చివేసిన అనంతరం దుండగులు ‘భారత్ మాతాకీ జై’ అని నినదించారన్నారు. తమ పార్టీకి చెందిన వారిపై దాడులు చేయడంతో పాటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, లెనిన్ విగ్రహాన్ని కూల్చిన జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్, డీజీపీ ఏకే శుక్లాలకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. లెనిన్ తీవ్రవాది: సుబ్రమణ్యస్వామి మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి ఎందరో స్వదేశీ నేతలు, ఆదర్శప్రాయులు మనకు ఉండగా,, విదేశీయుల విగ్రహాలు ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ వ్యాఖ్యానించారు. లెనిన్ విగ్రహం కూల్చివేతను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సమర్థించారు. రష్యాకు చెందిన లెనిన్ తీవ్రవాది అంటూ.. ఆయన విగ్రహాన్ని మన దేశంలో ఏర్పాటు చేయటమేంటని ప్రశ్నించారు. కావాలంటే, లెనిన్ విగ్రహాన్ని పార్టీ కార్యాలయాల్లో పెట్టుకుని, పూజించుకోవాలని కమ్యూనిస్టు నాయకులకు సూచించారు. లెనిన్ నిరంకుశ పాలనలో రష్యాలో ఎంతో మంది మరణించారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని మన దేశంలో నెలకొల్పుతారా అని ప్రశ్నించారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వ అణచివేతకు గురైన ప్రజలే లెనిన్ విగ్రహాన్ని కూల్చి ప్రతీకారం తీర్చుకున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. కాశీ, అయోధ్య, మధుర తదితర దేవాలయాల ధ్వంసంపై ఈ నేతలు మాట్లాడినట్లు తానెప్పుడూ వినలేదన్నారు. ప్రతీకారం.. ప్రజాస్వామ్యం కాదు: మమత ‘సీపీఎం, ఆ పార్టీ అకృత్యాలకు నేను వ్యతిరేకం. మార్క్స్, లెనిన్లు నాకు నచ్చరు. అలాగే, బీజేపీ దౌర్జన్యాలను కూడా సహించను’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రతీకారం.. ప్రజాస్వామ్యం కానేకాదన్నారు. ప్రపంచ నేతల్లో ఒకరైన లెనిన్‌ను గౌరవించటం సంప్రదాయమని సీపీఐ నేత డి.రాజా అన్నారు. కోల్‌కతాలో ర్యాలీ: లెనిన్ విగ్రహం కూల్చివేతకు నిరసనగా కోల్‌కతాలో సీపీఎం చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, బిమన్ బోస్ పాల్గొన్నారు. త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై దాడులను వారు ఖండించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ఏచూరి పిలుపునిచ్చారు. -
ప్రభుత్వంలోకి రాకముందే అల్లర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణంలోని రష్యా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కాషాయ వర్గాల ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాల మధ్య బుల్డోదర్తో కొందరు కూల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఖండించింది. ‘చలో పల్టాయియే’ అనే నినాదంతో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేస్తున్న దశ్యాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి, ఆ తర్వాత కొంత సేపటికి తొలగించారు. త్రిపుర ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ‘చలో పల్టాయియే’ అనే నినాదాన్ని ఎక్కువగా ఇచ్చిన విషయం తెల్సిందే. లెనిన్ ఓ విదేశీయుడు, టెర్రరిస్టు లాంటి వాడని, ఆయన విగ్రహాన్ని తొలగిస్తే తప్పేమిటని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ఇక రాష్ట్ర గవర్నర్ తథాగథ రాయ్ మరో అడుగు ముందుకు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం ఓ పని చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మరో ప్రభుత్వం ఆ పనిని తుడిచేస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వీరి వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి. బీజేపీ సంఘ్‌పరివార్ లెనిన్ విగ్రహాన్ని విధ్వంసం చేశాయని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉద్రిక్తతలు ఏర్పడి అవి అల్లర్లకు, హింసాకాండకు దారితీస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన ఓ గవర్నరే బాధ్యతార హితంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? అప్పుడే సోషల్ మీడియాలో లెనిన్ విగ్రహం విధ్వంసం మీద నిప్పంటుకుంది. సమర్థించే, వ్యతిరేకించే మధ్య రచ్చ జరుగోతోంది. ఇప్పటికే ద్రవిడ ఉద్యమానికి మూలకర్తయిన పెరియార్ రామస్వామి అంటే పడని బీజేపీ మూకలు తమిళనాడులో ఆయన విగ్రహాలను తొలగిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వాటిని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నిస్తే తమిళనాడు భగ్గు మనదా? మెజారిటీ ప్రజల మద్దతు ఉందనుకుని ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన 1984 నుంచి 2002 వరకు దేశంలో రక్తపాత సంఘటనలు పునరావతం అవుతాయి. తాజా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి త్రిపుర గవర్నర్ తథాతథ రావుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలా మందలించారో తెలియదు. -
జేసీబీతో లెనిన్ విగ్రహాన్నికూల్చేశారు
-
బీజేపీ వచ్చింది.. ఆ విగ్రహాన్ని కూల్చేశారు!
అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సరిగ్గా 48 గంటలకే.. ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. త్రిపురలోని బెలోనియా పట్టణంలో లెనిన్‌గా ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ విగ్రహం నెలకొని ఉంది. త్రిపురలో సీపీఎం పాలన 21ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఈ విగ్రహాన్ని కొందరు జేసీబీతో కూల్చేశారు. కాషాయ దుస్తులు, టోపీలు ధరించిన యువకులు ‘భారత్‌మతాకీ’ జై నినాదాలు చేస్తుండగా ఈ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. కొందరి ‘కమ్యూనిస్టు ఫోబియో’కు ఈ ఘటన నిదర్శనమని సీపీఎం విమర్శించగా.. వామపక్ష పాలనలో అణచివేయబడ్డ ప్రజలే ఆ విగ్రహాన్ని కూల్చేశారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. త్రిపురలో బీజేపీ గెలిచిన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయాలపై దాడులు చేసి.. విధ్వంసానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతల సహకారంతో ఆ పార్టీ శ్రేణులు.. సీపీఎం కార్యకర్తలు, నాయకుల లక్ష్యంగా దాడులకు దిగితూ.. హింసకు పాల్పడుతున్నారని, త్రిపురలో బీజేపీ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. -
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
ఎర్రజెండా ఎగిరిన వేళ...
అప్పుడే ఓ ఉద్యమం ముగిసింది. రాచరికం అంతమైన వేళ... రక్తసిక్త ఉద్యమం ముగిసిన వేళ... ఇంక అంతా మంచేనని ప్రజలు పండగ చేసుకుంటున్న వేళ.. సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాల మధ్య యుద్ధం మొదలైంది. దేశంపై ఆధిపత్యం కోసం జరిగిన ఆ పోరాటంలో ఎంతో మంది సామాన్యులు బలయ్యారు. సుమారు 90 లక్షల మంది రక్తాన్ని పూసుకుని ఎర్రజెండా ఎగిరింది. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన రష్యా అంతర్యుద్ధం కథేంటో చూద్దాం..! 1917.. రష్యాలో రాచరికం అంతమైన సంవత్సరం. అంతర్యుద్ధం ప్రారంభమైన సంవత్సరం కూడా అదే. ఆ ఏడాది ఫిబ్రవరిలో రష్యా చక్రవర్తి జార్ నికోలస్-2 నిరంకుశత్వంతో విసుగు చెందిన సామ్యవాద శక్తులు రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపాయి. అక్టోబరు నాటికి నికోలస్‌ను పదవీచ్యుతుణ్ని చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాయి. అప్పటికి రష్యాలో ఎంత నిరంకుశత్వం నెలకొందంటే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్‌ని కాదని జూలియన్ క్యాలెండర్‌ని ఉపయోగించేవారు! ఇదీ నేపథ్యం... కార్ల్ మార్క్స్ భావజాలంతో ఉత్తేజితుడైన లెనిన్ రష్యాలో సామ్యవాదం నెలకొల్పాలనుకున్నాడు. అతను బోల్షెవిక్ పార్టీ నాయకుడు. అయితే రష్యాలోని కొంత మంది దేశంలో పెట్టుబడిదారీ విధానం ఉండాలనుకున్నారు. వీరి మధ్య ఘర్షణ మొదలైంది. కొన్ని రోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్ల జోక్యంతో మరింత హింసాత్మకంగా మారింది. బోల్షెవిక్‌ల ఆధిపత్యం... ఈ యుద్ధంలో అగ్రదేశాలు తమకు ఎదురుగా నిలబడినప్పటికీ బోల్షెవిక్‌లు కొంచెం కూడా బెదరలేదు. వీరు మొదట పెట్రోగాడ్ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి వారి విజయ ప్రస్థానం ఆగకుండా కొనసాగుతునే ఉంది. వీరికి సైబీరియాలో మాత్రం కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఇక్కడ మొదట నుంచి బోల్షెవిక్‌లు వెనుకబడి ఉన్నారు. అయితే 1919 మార్చిలో వీరు సైబీరియాపై నలువైపులా దాడులు ప్రారంభించారు. జూన్ నుంచి సైబీరియాలో వీరు పైచేయి సాధించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1920 ఫిబ్రవరికి సైబీరియా వీరి సొంతమైంది. మధ్య ఆసియాలో బోల్షెవిక్‌లు పూర్తి స్థాయిలో పట్టు సాధించాక ఐరోపాలో ఉన్న రష్యాలోని బోల్షెవిక్ సేనలపై ఇంగ్లండ్ సేనలు దాడులు చేయడం ప్రారంభించాయి. ఒకానొక సందర్భంలో ఈ దాడుల వల్ల మాస్కో, తాష్కెంట్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీనివల్ల యుద్ధంలో వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఉత్తర ఆసియాలో విజయంతో వారు ఈ సమాచార లోపాన్ని అధిగమించి తిరిగి పైచేయి సాధించారు. దక్షిణ రష్యాలో రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరు అనంతరం బోల్షెవిక్‌లు అక్కడ కూడా విజయం సాధించారు. అక్టోబరు 22, 1922న తూర్పు రష్యా నుంచి జపాన్ సేనలు వెనుదిరగడంతో ఈ యుద్ధంలో బోల్షెవిక్‌లు గెలిచి సామ్యవాద రాజ్యాన్ని స్థాపించారు. ఈ పోరాటంలో మొత్తం 90 లక్షల మంది చనిపోయారు. యుద్ధానంతరం ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, ఉక్రెయిన్ దేశాలు వాటి అంతర్యుద్ధాలు, పోరాటాల కారణంగా స్వాతంత్య్రం సాధించుకున్నాయి. ఈ యూనియన్‌కు ‘లెనిన్’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మిగిలిన దేశాలతో కలిసి రష్యా ‘సోవియెట్ యూనియన్’గా ఏర్పడింది. ఆ తర్వాత 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. లెని‘నిజం’..... లెనిన్ పూర్తిపేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్. ఈయన 1870, ఏప్రిల్ 22న రష్యాలోని వోల్గా నది తీరాన ఉన్న సింబిర్క్స్ పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి ఇల్యా నికోలవిచ్ ఉల్యనోవ్, తల్లి మారియా అలెగ్జాండ్రోవ్నా. ఆయనది మిశ్రమ జాతి కుటుంబం. ఈయన పూర్వీకులు రష్యన్, స్వీడిష్, కాల్మిక్, జర్మన్, యూదు జాతులవారు. ఈయన తండ్రి స్కూల్ టీచర్. జార్ అలెగ్జాండర్-3పై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో లెనిన్ అన్నను ఉరి తీశారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి తన భావజాలాన్ని కలిపి లెనిన్ చేసిన రచనలకు, భావాలకు ‘లెనినిజం’ అంటారు. ఆయన బోల్షెవిక్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రష్యా అంతర్యుద్ధంలో బోల్షెవిక్‌ల విజయంలో లెనిన్, స్టాలిన్లదే కీలక పాత్ర. ఈ యుద్ధం కొనసాగుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతర్యుద్ధం అనంతరం ఏర్పడిన యూఎస్ఎస్ఆర్కు ఈయనే తొలి అధ్యక్షుడు. 1924, జనవరి 21న పదవిలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. మన దేశానికి చెందిన ఎం.ఎన్. రారూ, వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ్ వంటి కమ్యూనిస్టులతో ఈయనకు నేరుగా సంబంధాలున్నాయి. -
లెనిన్ ఆశయాలు సాధించాలి
విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు. గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్‌లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అకాడమీకి రూ.లక్ష విరాళం ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు. -
సత్వం: కదనరంగ కార్యశూరుడు
ఏప్రిల్ 22న లెనిన్ జయంతి లెనిన్‌కు శుభ్రంగా ఉండటం ఇష్టం. పనిచేసే బల్లను పద్ధతిగా సర్దుకోవడం ఇష్టం. పెన్సిల్స్ ఎప్పుడూ చెక్కివుండాలి, రాయడానికి రెడీగా. అలాగే మనుషులూ ఎత్తిన తుపాకుల్లా ఉండాలి, పేలడానికి సిద్ధంగా. వ్లదీమీర్ ఇల్యీచ్ ఉల్యనోవ్ అనే అసలుపేరుకన్నా తన కలంపేరుతోనే లెనిన్ ప్రసిద్ధి. ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ రాజనీతిజ్ఞడికి మార్క్స్, ఎంగెల్స్, చెర్నీషెవ్స్కీలంటే ఆరాధన. మార్క్స్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పేవాడు. విప్లవం కోసమే పుట్టినవాడిగా తనను తాను నమ్ముకుని, ప్రజల్ని కూడా ఆ నమ్మకంలో భాగస్వాములను చేశాడు. వ్యాయామం, ఈత, సైక్లింగ్, షూటింగ్లతోపాటుగా పర్వతాలను ఎక్కడంలోనూ లెనిన్ ఆనందం అనుభవించేవాడు. తీవ్రమైన భావోద్వేగాలున్న లెనిన్‌కు జారిస్టులంటే మంట; వాళ్లను కమ్యూనిజపు కాళ్లకిందకు తేలేకపోతే సామాన్య ప్రజానీకానికి ఆనందం ఎలాగ? విప్లవ పరిస్థితులు లేకుండా ఎంత తీవ్రమైన ఉపన్యాసాలిచ్చినా విప్లవం రాదని లెనిన్‌కు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు విప్లవ పదార్థాలన్నీ ఒకచోట చేరతాయి. సమయం రాగానే కుతకుతా పొంగుతూ విప్లవం తన్నుకొని బయటకు వస్తుంది. అదొక మాయ! ఇలాంటి రాడికల్ భావజాలానికి ప్రతిఫలంగా సైబీరియా మంచుగడ్డల్లో శిక్ష అనుభవించాడు లెనిన్. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత మార్పుకు సిద్ధంగా ఉంది రష్యా! అదే తగిన సమయం! బోల్ష్విక్ విప్లవం(1917) ఇప్పుడు కాక మరెప్పుడు? లెనిన్‌కు శుభ్రంగా ఉండటం ఇష్టం. పనిచేసే బల్లను పద్ధతిగా సర్దుకోవడం ఇష్టం. పెన్సిల్స్ ఎప్పుడూ చెక్కివుండాలి, రాయడానికి రెడీగా. అలాగే మనుషులూ ఎత్తిన తుపాకుల్లా ఉండాలి, పేలడానికి సిద్ధంగా. కార్మికుల్ని ఉత్తి వర్కింగ్ మాసెస్‌గా కాకుండా విప్లవవీరులుగా మలచాలనీ, ప్రతి చిన్న జోడింపూ ఒక పెద్ద మానవహారం కాగలదనీ నమ్మినవాడై... కానీ ఎలా? అరవడం, రాయివిసరడం సులువు; ఆగి అర్థమయ్యేలా వివరించడం కష్టం. అందుకే వ్యాసాలు, పాంప్లెట్లు! స్టెనోగ్రాఫర్, సెక్రటరీ సాయం లేకుండా తనే సొంతంగా రాసేవాడు. సాటి కామ్రేడ్స్తోనూ, స్నేహితులు, ఆత్మీయులతోనూ రాతపూర్వకంగా సంభాషించేవాడు. అదంతా కలిపి ‘లెనినిజం’ కావడానికి ఆయన రాతలు ఒక్కోటి 650 పేజీల చొప్పున 54 వాల్యూములు ఉండటమే కారణం కాకపోవచ్చు. వాటన్నింటినీ ఆచరణలోకి తెచ్చిన ఆయన కార్యశూరత కూడా కారణం కావొచ్చు. జార్లను కూల్చడానికి రక్తపాతం తప్పదు. లెనిన్‌కు అనివార్య హింస మీద విముఖత లేదు. దానికి ఆయన దగ్గర సమాధానం ఉంది. ఒక పిల్లాడికి జన్మనిచ్చేటప్పుడు తల్లికి దాదాపుగా ప్రాణం పోయినంత పనవుతుంది. రక్తపుమరకలు అంటుకుంటాయి. వేదన అనుభవిస్తుంది. పండంటి విప్లవబాబుకు జన్మనివ్వడానికి ఇవన్నీ భరించక తప్పదు! రాసుకునేప్పుడు పూర్తి నిశ్శబ్దం కావాలి లెనిన్‌కు. రష్యాలో కూడా నిశ్శబ్ద విప్లవం పనిచేయడం ప్రారంభించింది. రష్యా తొలినాళ్ళ నూతన ఆర్థిక విధానం లెనిన్ ప్రవేశపెట్టినదే. ఏ అధికారికైనా చెమటోడ్చే కార్మికుడి వేతనం కన్నా ఎక్కువెందుకుండాలి! కార్మిక నియంతృత్వంలో అసలైన కమ్యూనిజానికి దారులు వేయడానికి నడుం బిగించింది ఆయనే. లెనిన్ దృష్టి రష్యాకే పరిమితం కాదు. రేప్పొద్దున మొరాకో ఫ్రాన్స్మీద యుద్ధం ప్రకటించినా, భారత్ ఇంగ్లండ్ మీద కాలుదువ్వినా... అందులో ఎవరు ముందు దాడిచేశారన్నదానితో సంబంధం లేకుండా ప్రతి సామ్యవాదీ అణిచివేయబడ్డవారిపైపు నిలబడాలి! అదిమాత్రమే నిజమైన సామ్యవాదుల విజయం అవుతుంది. తప్పుల్ని దిద్దుకుంటూ, నిరంతరం నేర్చుకుంటూ, వర్గాలు అంతరించి, భుజాలు కలుపుకుని, మనుషులూ మనుషులూ దేశాలూ దేశాలూ ఏకమై సమానమై... లెనిన్ కలలు గొప్పవి!