సాక్షి, కోల్‌కత్తా : లెనిన్ విగ్రహం కూల్చివేతతో మొదలైన ధ్వంసకాండ ఇప్పట్లో ఆగేలా లేదు. పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలపై జరిగిన వివిధ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. 19 శతాబ్దానికి చెందిన ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఎర్ర రంగు పూశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన మున్సిపాలిటీ శాఖ విగ్రహాన్ని శుభ్రం చేయించింది.
ఎవరీ.. మైఖేల్ మధుసుదన్ దత్
ఆంగ్ల భాషలో పద్యాలు రచించిన మొదటి భారతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు. బెంగాలీతో పాటు సంస్కృతం, తమిళ్, తెలుగు, హిబ్రూ, లాటిన్, గ్రీకు తదితర భాషల్లో ప్రావీణ్యం కలవారు.
Comments
Please login to add a commentAdd a comment