Periyar
-
సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు?
ఉత్తర భారతదేశంలో ఈవీ రామసామి నాయకర్ ‘పెరియార్’.. నాస్తికునిగా, హిందీ వ్యతిరేకిగా పేరొందారు. పెరియార్‌కు సంబంధించి ఇటువంటి పరిచయం తప్పు కానప్పటికీ, ఇది ఏకపక్ష భావన అనే వాదన కూడా వినిపిస్తుంటుంది. పెరియార్ సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశానికి వచ్చి, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీలో నివసించాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక ఘటన పెరియార్‌ను నాస్తికునిగా మార్చివేసింది. పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి పేరు వెంకట్ నాయకర్. తల్లి పేరు చిన్న తాయమ్మాళ్ అలియాస్ ముత్తమ్మాళ్. పెరియార్ తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న వ్యాపారవేత్త. 1944 డిసెంబర్లో కాన్పూర్‌లో ఒక ప్రసంగంలో పెరియార్ స్వయంగా ఇలా అన్నారు.. ‘నా కుటుంబం సనాతన సంప్రదాయాన్ని పాటించే కుటుంబం. దేవాలయాలు, సత్రాలు నిర్మించి ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి పాటుపడిన కుటుంబం. మా కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు అందించారు. అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ నన్ను చాలా మంది విప్లవవాది, అతివాది అంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. మన సమాజంలో ఉండకూడని కొన్ని అంశాలపై నేను దాడి చేశాను’ అని పేర్కొన్నారు. పెరియార్ జీవితంపై రాజ్‌కమల్ ప్రకాశన్ మూడు సంపుటాలుగా పుస్తకాలను ప్రచురించింది. పెరియార్‌కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇదే పెరియార్‌ను సన్యాసం దిశాగా తీసుకువెళ్లింది. పెరియర్ తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి, గంగా నది ఒడ్డున ఉన్న కాశీ (వారణాసి)కి చేరుకున్నారు. సన్యాసి అయినందున అక్కడి ధర్మశాలలో లభించే ఉచిత ఆహారం కోసం ఆశించారు. అయితే అతనికి ఎక్కడా ఉచితంగా ఆహారం లభించలేదు. ఉచిత భోజన సౌకర్యం కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనని అక్కడున్నవారు పెరియార్‌కు చెప్పారు. కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించిన యువ పెరియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. అంతే.. పెరియర్ బ్రాహ్మణ వేషం ధరించారు. జంధ్యాన్ని ధరించి, ఆహారం కోసం ధర్మశాలకు వెళ్లారు. అయితే ఇందుకు అతని మీసం అడ్డంకిగా మారింది. పెరియార్ పుస్తకంలోని వివరాల ప్రకారం.. గేట్ కీపర్ పెరియార్‌ను లోపలికి రాకుండా ఆపడమే కాకుండా, రోడ్డుపైకి నెట్టివేశాడు. అప్పటికే లోపల భోజన కార్యక్రమం పూర్తికావడంతో, ఎంగిలి ఆకులను రోడ్డుపై పడేశారు. చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్న పెరియార్ మరోమార్గం లేక ఆ ఎంగిలి ఆకుల్లో మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది. ఈ సమయంలో వీధి కుక్కలు కూడా ఆ ఆకులలోని ఆహారాన్ని తినడానికి ఎగబడ్డాయి. ఎంగిలి ఆహారం తింటున్నప్పుడు పెరియార్ దృష్టి ఎదురుగా గోడపై రాసిన అక్షరాలపై పడింది. ‘ఈ ధర్మశాల ముఖ్యంగా అత్యున్నత కులానికి అంటే బ్రాహ్మణులకు చెందినది. ఈ ధర్మశాలను తమిళనాడుకు చెందిన ధనిక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించారు’ అని రాసివుంది. పెరియార్ మనసులో అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి..‘ఈ ధర్మశాలను ఒక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించినప్పుడు, బ్రాహ్మణులు..ఇతర ద్రావిడులు ఇక్కడ ఆహారం తినకుండా ఎలా అడ్డుకుంటారు? బ్రాహ్మణులు క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ద్రావిడులతో సహా ఇతర వర్గాలను ఆకలితో చంపడానికే నిశ్చయించుకుని, కుల వ్యవస్థ పేరుతో ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడరా?' పెరియార్ మదిలో మెదిలిన ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కాశీలో బ్రాహ్మణులు చేసిన అవమానం పెరియార్ హృదయాన్ని గాయపరిచిందని ఆ పుస్తకం వెల్లడించింది. ఇదే అతని మనసులో కుల వ్యవస్థపై తీవ్ర ద్వేషాన్ని రగిలేలా చేసింది. దీంతో కాశీ ఒక పవిత్ర నగరం అని అనడాన్ని పెరియార్ ఒక భ్రమగా భావించారు. కొంతకాలానికి సన్యాసాన్ని వదిలివేసి, కుటుంబ సభ్యులు చెంతకు చేరారు. ఇది కూడా చదవండి: నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి.. -
ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్
సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 31వ తేదీ స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కణల్ కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని బద్దలు కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీంతో తందై పెరియార్ ద్రవిడ కావడం చెన్నై జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కణల్ వ్యాఖ్యల వీడియో ఆధారాలను పొందుపరిచారు. వీడియో ఆధారాలను పరిశీలించిన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కణల్ కన్నన్ పరారయ్యారు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్న సమాచారం అందడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ వెళ్లి సోమవారం కణల్ కన్నన్ను అరెస్ట్ చేసి చెన్నై తీసుకొచ్చారు. చదవండి: (సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు) -
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
రజనీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశిస్తుందా?
సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతారా? ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే నటుడు రజనీకాంత్ గత జనవరిలో జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో డ్రావిడ కళగం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పెరియార్ సీతారాముల చిత్ర పటాన్ని విసిరేశారని రజనీకాంత్ అన్నారు. ఈయన వ్యాఖ్యలు పెద్ద వివాదానికే దారి తీశాయి. హిందూ సంఘాలు, రజనీకాంత్ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేశారు. అయితే అందుకు రజనీకాంత్ నిరాకరించడంతో పాటు ఈ అంశంపై చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కాగా రజనీకాంత్ వ్యాఖ్యలు మతసామరస్యానికి చేటు అని మతాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయంటూ స్థానిక ట్రిప్లికేన్కు చెందిన డ్రావిడన్ విడుదలై కళగం చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి జనవరి 18వ తేదీన ట్రిప్లికేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. అక్కడ స్పందించకపోవడంతో ఉమాపతి చెన్నై, ఎగ్మూర్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: పార్టీ ఏర్పాటులో రజనీ మరో అడుగు కాగా ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి రోశ్విన్దురై సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు హాజరై నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలదో మతసామరస్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, ఆయనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాబట్టి రజనీకాంత్‌పై కేసు నమోదు చేసేలా పోలీస్‌కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.దీంతో రజనీకాంత్ వ్మాఖ్యల వల్ల రాష్ట్రంలో గొడవలేమీ జరగలేదుగా అని న్యాయమూర్తి అడిగారు. అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదులు పెద్దగా గొడవుల జరగలేదు గానీ, పుదుచ్చేరిలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, ఇలాంటి నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఇటీవల ఢిల్లీలో అల్లర్లు జరిగాయని వివరించారు. దీంతో న్యాయమూర్తి రజనీకాంత్‌పై కేసు నమోదు చేయాలని గానీ, కుదరదని గానీ చెప్పకుండా సోమవారానికి విచారణను వాయిదా వేశారు. దీంతో సోమవారం న్యాయస్థానం రజనీకాంత్‌పై ఎలాంటి తీర్పును ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది. చదవండి: ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్ -
రజనీకి హత్యా బెదిరింపులు
పెరంబూరు : తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని నటుడు రజనీకాంత్ ప్రస్థావించారు. అది ఇప్పుడు ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది. (రజనీపై పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు) ద్రవిడ విడుదలై కళగం, డీఎంకే వంటి పార్టీ నాయకులు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు రజనీకాంత్ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ, విన్నదే తాను చెప్పానని, సారీ చెప్పనని రజనీకాంత్ తెగేసి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రజనీకాంత్‌పై హాత్యాబెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పీఎస్.అశోక్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పిర్యాదు చేశారు. అందులో గత 22వ తేదీన స్థానిక తేనాపంపేట సమీపంలో సెంమొళి పూంగా వద్ద ద్రావిడ విడుదలై కళగంకు చెందిన కొందరు ఉమాపతి ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రజనీకాంత్‌ను ప్రాణాలతో నవడవనీయమని హెచ్చరించారన్నారు. కాబట్టి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. (పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..) -
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
-
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కొనసాగుతుండగానే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో శుక్రవారం ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కాగా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్‌పై పలు పోలీస్స్టేషన్లలో పెరియార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. తమిళ మేగజీన్ ‘తుగ్లక్’ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలకు చెప్పుల దండలు వేసి నిర్వహించిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌పై ద్రవిడ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఖండించాయి. పెరియార్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల రజనీకాంత్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఆయన తాజా సినిమా ‘దర్బార్’ ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన పెరియార్ గురించి ఆచితూచి మాట్లాడాలని రజనీకాంత్‌కు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో అరంతంగి ప్రాంతంలో పెరియార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 2018, మార్చిలో వెల్లూరులోనూ పెరియార్ విగ్రహాన్ని నాశనం చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలోని పెరియార్ విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. చదవండి: ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి -
రజనీపై పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు
ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌పై చర్యలకు చెన్నై పోలీసులను ఆదేశించాలంటూ 'ద్రావిడర్ విడుదలై కళగం' వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీనిపై మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు రావాల్సిన అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇటీవల చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. (వివాదాల్లో రజనీ.. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు) దీనిపై ద్రావిడర్ విడుదలై కళగం నేతలు రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళగం అధ్యక్షుడు కొళత్తూర్ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రజినీ వ్యాఖ్యలను డీఎంకే తప్పుపట్టగా, డీవీకే జనవరి 18న ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్ నమోదుకు కానీ, ఫిర్యాదు చేసినట్టు రిసిప్ట్ ఇచ్చేందుకు కానీ పోలీసు అధికారులు నిరాకరించినట్టు ఆ సంస్థ చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టును డీవీకే ఆశ్రయించింది. మతం పేరుతో తమిళనాడు ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు, అశాంతిని రెచ్చగొట్టేందుకు రజినీ ప్రయత్నించారంటూ పిటిషన్లో ఆరోపించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరింది. (పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..) -
‘ఆయన బ్రిటిష్ ఏజెంట్’
సాక్షి, న్యూఢిల్లీ : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మద్దతుగా నిలిచారు. పెరియార్ బ్రిటిష్ ఏజెంట్‌గా వారి విభజించి పాలించే విధానాన్ని ముందుకు తీసుకువెళ్లారని కట్జూ ఆరోపించారు. తమిళ మ్యాగజైన్ తుగ్లక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో సీతారాముల విగ్రహాలకు చెప్పుల దండ వేసి చేపట్టిన ర్యాలీలో పెరియార్ పాల్గొన్నారని ఈ వార్తను ఏ ఒక్కరూ కవర్ చేయలేదని రజనీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పెరియార్‌పై రజనీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై జస్టిస్ కట్జూ తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించారు. బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేసిన ఇతరులెందరి మాదిరిగానే పెరియార్ కూడా బ్రిటిష్ ఏజెంటేనని..ఆయన ఉద్దేశాలు ఏమైనా బ్రిటిషర్ల విధానమైన విభజించి పాలించనే సిద్ధాంతానికి అనుగుణంగా పెరియార్ వ్యవహరించారని అన్నారు. దీనిపై పలు వెబ్సైట్లు, తన బ్లాగ్‌లో రాసిన వ్యాసాలను పరీశీలించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. కాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై 2017లో మార్కండేయ కట్జూ విమర్శలు గుప్పించడం విశేషం. పేదరికం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలకు రజనీ వద్ద పరిష్కారం ఉందా అంటూ తన బ్లాగ్‌లో ఆయన తమిళ సూపర్‌స్టార్ రజనీని ప్రశ్నించారు. చదవండి : పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో.. -
పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..
చెన్నై : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తాను చదివిన వార్తాంశాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. పెరియార్‌పై రజనీకాంత్ వ్యాఖ్యలపై ఓ రాజకీయ పార్టీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ తమిళ మేగజైన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలతో జరిగిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు చో రామస్వామి ఒక్కరే ఆ వార్తను రాసి దాన్ని ఖండించారని గుర్తు చేశారు. ఆ వార్త కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని కుదిపివేసిందని, ఆ మేగజైన్ కాపీలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేయగా, చో రామస్వామి వాటిని పునర్ముద్రించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెప్పుకొచ్చారు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలన్న డ్రవిడార్ విదుతులై కజగం (డీవీకే) డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. తాను క్షమాపణ చెప్పనని, వార్తాంశాల్లో వచ్చిన విషయాల ఆధారంగానే తాను మాట్లాడానని అన్నారు. మరోవైపు రజనీకాంత్ క్షమాపణ చెప్పకుంటే థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఆయన సినిమా దర్బార్‌ను అడ్డుకుంటామని డీవీకే హెచ్చరించింది. చదవండి : తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం -
ఉదయనిధి స్టాలిన్ సంచలన ట్వీట్..
చెన్నై, పెరంబూరు : నటుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానీయండి అప్పుడు ఆయన వ్యాఖ్యలకు బదులిస్తానని నటుడు, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. నటుడు రజనీకాంత్ ఇటీవల తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ వేదికపై పెరియర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు చోట్ల రజనీకాంత్‌పై కేసులు నమోదయ్యాయి. కాగా అదే వేదికపై మురసోలి పత్రిక పట్టుకుంటే డీఎంకే వారని, తుగ్లక్ పత్రిక పట్టుకుంటే తెలివైన వారని రజనీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మురసోలి పత్రిక చదివే వారు తెలివైన వారు కాదా? అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై డీఎంకే పెద్దలెవరూ స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే యువ నేత స్పందించిన తీరును రజనీకాంత్ అభిమానులు ఖండిస్తున్నారు. అసలు ఉదయనిధిస్టాలిన్ ఏమన్నారు? రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి కారణం ఏమిటి? ఈ వివరాలు చూస్తే నటుడు ఉదయనిధిస్టాలిన్ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. అందులో ముఖ్యమంత్రి అంటే అన్నాదురై, కళాకారుడంటూ విప్లవ నాయకుడు(ఎంజీఆర్) ధైర్యలక్ష్మి అంటే అమ్మ (జయలలిత) ఇలా శతాబ్దాల కాలంగా కాల్ పట్టుకుని కార్యాలను సాధించుకోవడానికి తలపట్టుకుంటున్న వారి మధ్యలో మురసోలిని చేతబట్టి ఆత్మవిశ్వాసం కలిగిన వారే డీఎంకే వారు అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలు రజనీకాంత్ గురించేనని ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కాగా నటుడు ఉదయనిధిస్టాలిన్, నటించిన సైకో చిత్రం ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన ఒక భేటీలో రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం గురించి అడిగిన ప్రశ్నకు తాను రజనీకాంత్ గురించి మాట్లాడానని ఎవరు చెప్పారు? అని ప్రశ్నంచారు. సరే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదని, వచ్చిన తరువాత బదులు ఇస్తానని ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. -
వివాదాల్లో తలైవా!
చెన్నై ,పెరంబూరు: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నటుడు రజనీకాంత్. ఎప్పుడైతే రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అన్నారో అప్పుటి నుంచే ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు. ఇటీవల రజనీకాంత్ పేరియార్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతకు గురిచేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో రజనీకాంత్‌కు కొందరు రాజకీయనాయకుల నుంచి మద్దతు కూడా లభించడం గమనార్హం. ఇప్పటికే రజనీకాంత్‌పై తిరుచ్చిలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. తాజాగా సేలంలో కూడా ఫిర్యాదు నమోదైంది. కాగా ఈ వ్యవహారంలో ఎవరెలా స్పందిస్తున్నారో చూద్దాం.. రజనీ వివరణ ఇవ్వాలి పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలపై నటుడు రజనీకాంత్ వివరణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సెంగోట్టయన్ డిమాండ్ చేశారు. ఈయన ఆదివారం ఈరోడ్డులోని గోపి బస్టాండ్ సమీపంలో పోలియో చుక్కల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరియార్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందనపై మీడియా ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ వ్యాఖ్యలపై రజనీకాంత్‌నే వివరణ ఇవ్వాలని అన్నారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలి కాగా ద్రావిడ విడుదలై కళగం అధ్యక్షుడు కొలత్తూర్ మణితంజైలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తమిళనాడులో అనవసర చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సినీ నటీనటులను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగా ఇటీవల నటుడు రజనీకాంత్ పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలు అని అన్నారు. ముగ్గులు వేసేవారిపైనా, పుస్తకాల ప్రదర్శనలను ఏర్పాటు చేసేవారిపైన చర్యలు తీసుకుంటున్నారని, మరి నటుడు రజనీకాంత్‌పై ఎందుకు చర్చలు తీసుకోవడం లేని ప్రశ్నంచారు. పెరియార్ భావాలను ఆదరించేవారు పలువురు పోరాటాలకు సిద్ధం అవుతున్నారని, ఇప్పటికే పలుచోట్ల రజనీకాంత్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయని అన్నారు. కాబట్టి పెరియార్ వ్యవహారంలో రజనీకాంత్ భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్.రాజా మద్దతు కాగా పెరియార్ వ్యవహారంలో నటుడు రజనీకాంత్‌కు బీజేపీ అండగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈయన ఆదివారం కాంచీపురంలోని దేవాలయంలో దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమన మీడియాతో మాట్లాడుతూ పెరియార్ వ్యవహారంలో నటుడు రజనీకాంత్ వాస్తవాన్నే చెప్పారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు రజనీకాంత్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు కేఎన్.లక్ష్మణన్ కూడా రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు. రజనీకాంత్‌పై ఫిర్యాదు కాగా నటుడు రజనీకాంత్‌పై ఇప్పుటికే పలు పాంత్రాల్లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా సేలంలో ఆయనపై మరో ఫిర్యాదు నమోదైంది. ద్రావిడ విడుదలై కళగం సేలం తూర్పు జిల్లా అధ్యక్షుడు శక్తివేల్ సేలం ఎస్పీ కార్యాలయంలో రజనీకాంత్‌పై ఫిర్యాదు చేశారు. -
వివాదాల్లో రజనీ.. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు
న్యూఢిల్లీ: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌పై సంచలన ఆరోపణలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ద్రావిడర్ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రాజకీయరంగ ప్రవేశం కోసం రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళగం అధ్యక్షుడు కొళత్తూర్ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: రజనీ చరిత్ర తెలుసుకో.. ద్రవిడ పార్టీల ఆగ్రహం ఈనెల 14న రజనీ తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పెరియార్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ద్రావిడర్ విడుదలై కళగం నేతలు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా మాట్లాడారని ఆరోపించారు. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి మలుపు తీసుకుంటాయో చూడాలి. -
తిరుపూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం
చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
పెరియార్ విగ్రహానికి ఘోర అవమానం
సాక్షి, చెన్నై : ‘అభినవ తమిళనాడు పిత’గా పేరొందిన పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. సోమవారం పెరియార్ 140వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్లిన అభిమానులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి.. తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దృష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం.. ముఖాన గుండ్రటి కళ్లజోడు... ఉదారత్వం ఉట్టిపడే నవ్వు చూస్తే.. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో కుల, మత, వర్గ ఆధిపత్యాలపై రామస్వామి తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సృష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. రాజకీయ ప్రస్థానం.. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1939లో ‘జస్టిస్ పార్టీ(1917లో ఏర్పడింది)’లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. తన లక్ష్యాలకనుగుణంగా.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే ఆవిర్భవించింది. తర్వాత దాని నుంచి అన్నాడీఎంకే కూడా ఆవిర్భవించింది. అదే విధంగా మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. -
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, ఇప్పటివరకు 35, 874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరియన్ నదికి వరద పోటెత్తుతోంది. ఇడుక్కీ డ్యామ్‌కు వరద మరింత పెరగడంతో గేట్లను పూర్తిగా ఎత్తి దిగువనకు నీళ్లు వదులుతున్నారు. ఇడుక్కీ నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో దిగువను ఉన్న ప్రాంతాలను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయ నిధులకు విడుదల చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశంలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకావాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) హెచ్చరించింది. -
నా వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు
-
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ ఉగాది ఏప్రిల్ 14న తాను రాజకీయ పార్టీ, జెండా ప్రకటించడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడులో మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ధ్వంసం, వీహెచ్‌పీ రథయాత్రలపై స్పందించిన రజనీకాంత్ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రామ రాజ్య రథయాత్రతో మత విద్వేషాలు చెలరేగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. తమిళనాడు ప్రశాంతతకు మారు పేరని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ ప్రవేశం వెనక బీజేపీ ఉందంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలను రజనీ తోసిపుచ్చారు. తన వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. రెండు వారాల పాటు ఆధ్యాత్మిక పర్యటన అనంతరం రజనీకాంత్ మళ్లీ చెన్నైకి చేరుకున్నారు. తన హిమాలయాల పర్యటన ప్రశాంతంగా జరిగిందని, కొత్త శక్తినిచ్చిందని రజనీ పేర్కొన్నారు. ఇక తనపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆయన తెలిపారు. -
ఎంజీఆర్, పెరియార్ విగ్రహాలపై కాషాయ వస్త్రాలు
సాక్షి, చెన్నై : విగ్రహాల విధ్వంసం ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్, అన్నాదురై, ద్రవిడ కజగం వ్యవస్ధాపకులు పెరియార్ విగ్రహాలకు కాషాయ వస్త్రాలను కట్టడం కలకలం రేపింది. నమక్కల్‌లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అస్సాంలోని కోక్రాజర్ పట్టణంలో జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహం ధ్వంసం చేసిన మరుసటి రోజు ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. బుధవారం ఉదయం కొందరు దుండగులు ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో కోక్రాజర్ డిప్యూటీ కమిషనర్ నిరంజన్ బారువా పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్ధలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ నెల 7న కోల్‌కతాలోనూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చినందుకు నిరసనగా తాము ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశామని నిందితులు స్వయంగా వెల్లడించారు. మరోవైపు బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాలనూ ఇటీవల ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
కవి విగ్రహానికి అవమానం...
సాక్షి, కోల్కత్తా : లెనిన్ విగ్రహం కూల్చివేతతో మొదలైన ధ్వంసకాండ ఇప్పట్లో ఆగేలా లేదు. పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలపై జరిగిన వివిధ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. 19 శతాబ్దానికి చెందిన ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఎర్ర రంగు పూశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన మున్సిపాలిటీ శాఖ విగ్రహాన్ని శుభ్రం చేయించింది. ఎవరీ.. మైఖేల్ మధుసుదన్ దత్ ఆంగ్ల భాషలో పద్యాలు రచించిన మొదటి భారతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు. బెంగాలీతో పాటు సంస్కృతం, తమిళ్, తెలుగు, హిబ్రూ, లాటిన్, గ్రీకు తదితర భాషల్లో ప్రావీణ్యం కలవారు. -
విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత
లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత దృశ్యాలను చూసినప్పుడు ఇద్దరు ఇతిహాస పాత్రలు మనసులో మెదిలారు. ఒకరు రాముడు, ఇంకొకరు ధర్మరాజు. రావణసంహారం జరిగిన తర్వాత, అన్న మరణానికి విభీషణుడు శోకిస్తున్నప్పుడు అతణ్ని ఓదార్చిన రాముడు, మృతుడైన రావణుని పట్ల తన వైఖరిని వివరిస్తూ, ‘‘విభీషణా! వ్యక్తులు జీవించి ఉన్నంతకాలమే వైరాలు ఉండాలి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మన కార్యం నెరవేరింది కనుక ఇతనికి అంత్యక్రియలు నిర్వహించు. ఇతడు నీకెంత గౌరవనీయుడో.. ఇప్పుడు నాకూ అంతే గౌరవనీయుడు’’ అంటాడు. ఈ సందర్భంలో రాముడు అన్న ‘‘మరణాంతాని వైరాణి’’ అనే మాట ఒక గొప్ప సూక్తిగా జాతి నాలుకలపై నిలిచిపోయింది. ధర్మరాజు విషయానికి వస్తే, తన గదాఘాతానికి తొడలు విరిగి దుర్యోధనుడు పడిపోయిన తర్వాత భీముడు అతణ్ని దూషిస్తూ ఎడమ కాలితో అతని శిరస్సును తంతాడు. ఆ చర్యను ధర్మరాజు, అర్జునుడు ఏవగించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటారు. భీముడు రెండోసారి ఆ పని చేసినప్పుడు ధర్మరాజు ఊరుకోలేకపోతాడు. ‘‘ఎందుకలా తంతున్నావు? ఈ అధర్మం నీకు రోత పుట్టించడం లేదా? ఈ రాజరాజు తమ్ముళ్ళు, బంధువులు మరణించిన తర్వాత కూడా యుద్ధం చేసి పడిపోయిన గౌరవాన్ని పొందుతున్నప్పుడు నువ్వు చేసిన ఈ హీనమైన పనిని జనం మెచ్చుతారా?’’ అని తీవ్రంగా మందలిస్తాడు. విజయం కలిగించిన హర్షావేశాలతో ఉచితానుచితాలు పట్టించుకోని అల్పబుద్ధిగా ఈ ఘట్టంలో కవి భీముణ్ని వర్ణిస్తాడు. లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్‌లో బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను ఆదర్శం చేసుకున్నారు. ఈ విగ్రహవిధ్వంసం ఇంతటితో ఆగదనీ, అది తమ నేతలకు కూడా వ్యాపిస్తుందనే స్పృహ లోపించింది కనుక దీని వెనుక అల్పబుద్ధే కాక మందబుద్ధి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహంపట్ల అపచారం జరిగింది. పెరియార్, అంబేడ్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలకు మసిపూశారు. ఇది ఇటీవలి కాలంలో ఎరగని ధోరణి. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలకు త్రిపురను మించి పెద్ద కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను చేజిక్కించున్న తర్వాత కూడా మమతాబెనర్జీ ఇలాంటి దురాగతానికి పాల్పడలేదు. అయినాసరే త్రిపురలో తమది గొప్ప భావజాల విజయంగా మోదీ చెప్పుకోవడం ఒక విడ్డూరమైతే, భిన్న భావజాలప్రతీకైన లెనిన్ విగ్రహాన్ని అనుయాయులు భౌతికంగా కూల్చివేయడం ఇంకొక వైపరీత్యం. లెనిన్ విదేశీయుడు కనుక అతని విగ్రహాన్ని కూల్చినా తప్పులేదని సమర్థించుకున్నారు కానీ, వాస్తవానికి తాము గురిపెడుతున్నది లెనిన్ భావజాలాన్ని నమ్మే స్వదేశీయులపైనేనన్న సంగతిని గమనించుకోలేదు. భావజాలం వ్యక్తుల ఆలోచనల్లో ఉంటుంది తప్ప విగ్రహాలలో ఉండదన్న గ్రహింపు లోపించింది. తన సమకాలీన భారతదేశ పరిణామాలపై లెనిన్ ఎలాంటి సానుకూల వైఖరి తీసుకున్నాడో ఆయనకూ, ఎం. ఎన్. రాయ్‌కి మధ్య జరిగిన చర్చల ద్వారా తెలుస్తుంది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న జాతీయవాద శక్తులను తిరోగమనవాదులుగా పేర్కొంటూ, వారికి సైతం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎం. ఎన్. రాయ్ వాదిస్తే,, లెనిన్ దానిని ఖండిస్తూ కమ్యూనిస్టులు గాంధీ సహా జాతీయవాద శక్తులను బలపరచితీరాలని స్పష్టం చేశాడు. విదేశీయుడన్న కారణంతో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చడంలోని సంకుచితత్వం, చారిత్రిక అజ్ఞానం మాటలకు అందనిది. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే, భారత్‌తో ముడిపడిన ఆయన తాలూకు చారి త్రిక ఆనవాళ్లను చెరిపివేసి చరిత్రకు ద్రోహం చేయబోవడమే. ద్రవిడ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని కూడా కూల్చివేయాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు పిలుపు ఇవ్వడం, విగ్రహానికి మసిపూయడం వెనుక ఉన్నదీ; భిన్న ఆలోచనా పంథాలను తుడిచిపెట్టి, వ్యక్తుల మెదళ్లు వంచి దేశం ఆ చివరి నుంచి ఈ చివరివరకూ ఏకశిలా సదృశమైన భావజాలాన్ని రుద్దే వ్యూహమే. ఈ సందర్భంలో కంచిలోని శంకరాచార్యపీఠాన్ని, చిరకాలం పీఠాధిపత్యం వహించిన పరమాచార్యను గుర్తు చేసుకోవడం అవసరం. కంచి మఠానికి ఎదురుగా గోడలపై పెరియార్ నాస్తికప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దకాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూవచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండడం పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకున్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతి గొప్ప ప్రతీ కలలో ఇదొకటి. ఈ సహజీవన వైవిధ్యాన్ని, చెరిపివేసి ఒకే మూసభావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలో భాగంగానే లెనిన్ విగ్రహ ధ్వంసాన్ని, పెరియార్ విగ్రహంపై దాడిని చూడవలసి ఉంటుంది. ఈ దుశ్చర్యలను సమర్థించుకునే విఫలయత్నంలో బీజేపీ శ్రేణులూ, పరివార్ సంస్థల ప్రతినిధులూ చేసిన వితండవాదాలు, దొర్లించిన వికృత వ్యాఖ్యలు అంతే విస్తుగొలిపాయి. ‘ఒక ప్రభుత్వం చేసిన దానిని ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుం’దని అంటూ త్రిపుర గవర్నర్ బాహాటంగా సమర్థించారు. మనుషులపై దాడి చేసినా, చంపినా హింస అవుతుంది తప్ప విగ్రహాలపై దాడి హింస కాబోదని ఆయన నిర్వచనం. ‘లెనిన్ విగ్రహాలను కూల్చింది రష్యాలో కాదు, త్రిపురలో! మార్పు రావలసిందే’నని మరో నేత వ్యాఖ్య. ఎప్పటిలానే ప్రధాని ఆలస్యంగా గొంతు విప్పి విగ్రహాల కూల్చివేతను ఖండించినా ఈ సమర్థింపు ప్రహసనం సాగుతూనే ఉంది. అధినేత ఖండిస్తారు. అనుయాయులు తాము చేసేది చేస్తూనే ఉంటారు. అంతిమంగా కుప్పకూలుతున్నవి ఏవో విగ్రహాలో మరొకటో కావు... వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశ సంస్కృతీ, సభ్యతా, సంప్రదాయాలు. మనం ఎంతో అపురూపంగా పెంచి పోషించుకోవలసిన ప్రజాస్వామిక విలువలు. భాస్కరం కల్లూరి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : kalluribhaskaram9@gmail.com -
కొనసాగుతున్న ‘విగ్రహ’ కాండ
చెన్నై/కన్నూర్/లక్నో: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. లెనిన్, పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్ విగ్రహాలపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతుండగానే కేరళలోని కన్నూర్‌లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో గాంధీ కళ్లద్దాలు పగిలిపోయాయి. చెన్నైలోని తిరువోత్తియూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి ఖండించారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అటు, యూపీలోని బలియా జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. -
డెక్కుతున్న ‘విగ్రహ’ రాజకీయం
కోల్‌కతా/లక్నో/చెన్నై: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం త్రిపురలో లెనిన్ విగ్ర హం ధ్వంసం.. తర్వాత తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. యూపీ లోని మీరట్ జిల్లాలో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. శ్యామాప్రసాద్.. అంబేడ్కర్ త్రిపురలో లెనిన్ విగ్రహ ధ్వంసానికి ప్రతీకారంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఏడుగురు యువకులు విగ్రహానికి నల్లరంగు పులిమారు. అనంతరం విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఈ ఘటనకు పాల్పడిన వారంతా ‘రాడికల్’ పేరుతో పనిచేసే వామపక్ష భావజాల సంస్థకు చెందినవారు. దీన్ని చాలా తీవ్రమైన ఘటనగా పరిగణిస్తున్నాం’ అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలపై కోల్‌కతాలో బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత రత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏ పార్టీవారైనా శిక్షించండి: మోదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహధ్వంసం ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. విధ్వంసానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, విగ్రహ ధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ‘విగ్రహాలను పడగొట్టడం దురదృష్టకరం. మా పార్టీ వీటికి ఎప్పుడూ మద్దతు పలకదు. తమిళనాడు, త్రిపురల్లో పార్టీ నేతలతో మాట్లాడాను. ఈ విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’ అని షా స్పష్టం చేశారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్ని ప్రేరేపించినట్లుగా భావిస్తున్న తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్బుక్ కామెంట్లపై అమిత్ షా స్పందిస్తూ.. ‘రాజాపై ఎలాంటి చర్యలు ఉండవు’ అని వెల్లడించారు. పెరియార్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కార్యకర్త ముత్తురామన్‌ను పార్టీనుంచి బీజేపీ తొలగించింది. తమిళనాట నిరసనలు రాజా క్షమాపణలు చెప్పినా తమిళనాడు రాజకీయ పార్టీలు, పెరియార్ అభిమాన సంఘా లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష డీఎంకే, పలు తమిళ సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. చెన్నై, కడలూర్, సేలం తదితర ప్రాంతాల్లో రాజా విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కావేరీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చి ఉంటారని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. జంధ్యాలు తెంచేశారు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిని డీవీకే (ద్రవిడార్ విదుత్తలై కళగం) కార్యకర్తలు అటకాయించారు. వీరిని బెదిరించి.. మెడలో వేసుకున జంధ్యాలను బలవంతంగా తెంచేశారు. అనంతరం పెరియార్ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు డీవీకే కార్యకర్తలు రాయపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
పెరియార్ అంటే బీజేపీకి ఎందుకు మంట!
సాక్షి, న్యూడిల్లీ : త్రిపురలో రష్యా కమ్యూనిస్టు విప్లవకారుడు వీఐ లెనిన్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం బుల్డోజర్ పెట్టి కూల్చేసిన బీజేపీ కార్యకర్తలు తమిళనాడులోని పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు బుధవారం ప్రయత్నించడంతో తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి కాషాయ మూకలను ఫేస్బుక్ పోస్టింగ్ ద్వారా రెచ్చగొట్టిందే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా. ‘లెనిన్ ఎవరు? ఆయనకు భారత్‌కు సంబంధం ఏమిటీ? కమ్యూనిస్టులకు భారత్‌కు ఉన్న సంబంధం ఏమిటీ? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులోని ఈవీ రామస్వామి (పెరియార్) విగ్రహం!’ అంటూ బీజేపీ నాయకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానికి స్పందించిన ఇద్దరు బీజేపీ అనుమానిత కార్యకర్తలు తమిళనాడులోని వెల్లూర్‌కు సమీపంలోని తిరుపట్టూర్లో ఉన్న పెరియార్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. రాజాను గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, విగ్రహాన్ని ముట్టుకున్న చేతుల్ని నరికేస్తామంటూ ఎండీఎంకే నాయకుడు వైకో హెచ్చరించారు. దీంతో హెచ్. రాజా వెంటనే ఫేస్‌బుక్‌లోని తన పోస్టింగ్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే పెరియర్ రామస్వామి విగ్రహాలను తొలగించాలని బీజేపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని బీజేపీ తమిళనాడు ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెప్పారు. బీజేపీకైనా, సంఘ్ పరివార్కైనా పెరియార్ రామస్వామి అంటే ఎందుకు కోపం? ఆయన ఎవరు ? ఆయన సిద్దాంతం ఏమిటీ ? తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం. ముఖాన గుండ్రటి కళ్లజోడు. ఉదారత్వం ఉట్టిపడే ఆయన నవ్వును చూస్తే ఎవరైనా ఆయన్ని గౌరవనీయులని అనుకుంటారు. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. ‘దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎటాల్ (దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు)’ పెరియార్ ఉద్యమంలో ప్రధాన నినాదం. ‘దేవుడు దుష్టుడు, దేవున్ని పూజించే వారు ఆటవికులు అని కూడా అన్నారు. కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారత దేశమే తనకు వద్దని, కుల, మత రహిత దక్షిణ భారతమే తనకు దేశంగా కావాలన్నారు. కుల, మతాలకు విలువనిస్తున్న భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. 1957లో పెరియార్ మూడువేల మంది తన అనుచరులతో కలిసి భారత రాజ్యాంగం ప్రతులను తగులబెట్టి అరెస్టయ్యారు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత సమాజం ఏర్పడుతుందని వాదించారు. హిందూత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కారణంగానే బీజేపీకి ఆయన అంటే పడదు. ఈ కారణంగానే బీజేపీ ద్రావిడ రాష్ట్రాలపై ఇప్పటికీ పట్టు సాధించలేక పోతోంది. దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం సైద్ధాంతిక వాదనలకుగాని, విగ్రహ విధ్వంసానికి గానీ బీజేపీ నేతలు ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చారు. పెరియార్ తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1916లో ఏర్పడిన ‘జస్టిస్ పార్టీ’లో 1939లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే పుట్టింది. దాని నుంచి అన్నాడీఎంకే ఆవిర్భవించింది. మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. -
విగ్రహాల ధ్వంసంపై స్పందించిన అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్‌షా హెచ్చరించారు.