చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment