statue destroyed
-
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గోపాలపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోనెల చంటి బుధవారం ధ్వంసం చేశాడు. మండపంపై నుంచి విగ్రహాన్ని పెకిలించి రోడ్డుమీద ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిని పంచాయతీ వార్డుసభ్యుడు కోనపురెడ్డి శ్రీనివాసరావు, గ్రామస్తులు అడ్డుకున్నా రు. చంటికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. సర్పంచ్ బోను రామినాయుడితో పాటు గ్రామపెద్దలతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి లాక్కెళుతున్న చంటి, నిందితుడు చంటి తొలగించిన విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించారు. పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఘటన వెనుక చాలా అనుమానా లున్నాయని చెప్పారు. ఎవరైనా చేయించి ఉండవచ్చన్నారు. నింది తులను కఠినంగా శిక్షించాలని, ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుం డా చూడాలని పోలీసులను కోరారు. డీఎస్పీ సుభాష్, సీఐ విజయానంద్, పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డు సభ్యుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 153ఎ, 427, 109 సెక్షన్లతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్‌కాల్ లిస్టుపై ఆరా తీస్తున్నారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెనుమూరు: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో ప్రభుత్వ కార్యాలయాల కూడలి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తితో ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. కాగా వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను రెండు రోజుల్లో పట్టుకుంటామని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్, కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్ చెప్పారు. (చదవండి: వైరస్ వ్యాధులతో జాగ్రత్త) -
మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
-
మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్పురంలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మండల పరిషత్ కార్యాలయం సమీపంలో వైఎస్సార్ విగ్రహాన్ని శనివారం తెల్లవారుజామున దుండగులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. విగ్రహం ధ్వసం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్ ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం గంగాధర నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను దుండగులు తగలబెట్టారు. ఇప్పుడు సంక్రాంతి రోజున వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే పోలీసులు సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అంటే అందరికీ గౌరవమేనని, గుంటూరు జిల్లా దుర్గిలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై సోమవారం ఆయన స్పందిస్తూ.. జరిగిన ఘటనను వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తోందని, ఆ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. వారి గౌరవార్థం విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ చిన్న ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఈ ఘటనకు, వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ విగ్రహాలను తీసి పక్కన పడేసిన సందర్భాలు ఎన్నోచూశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా ఎన్టీఆర్‌ను తాము గుర్తించి, గౌరవిస్తామని.. అయితే 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసిన చంద్రబాబే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
భైంసా/భైంసాటౌన్ (ముధోల్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేయడం నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ధ్వంసం చేయడంతో విగ్రహం చేయి, కంటిభాగం పాక్షికంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, యువకులు అక్కడికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దుండగుడిని తమకు అప్పగించాలంటూ రాస్తారోకో చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారె నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఆందోళన విరమించాలని సూచించారు. అయినా వినకుండా ఆందోళనకారులు బస్సు లపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో మూడు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ విశ్వంబర్ ప్రకటించారు. -
హుండీలో నగదు లేదని..దేవుని విగ్రహాలు ధ్వంసం
సాక్షి,జలుమూరు: డబ్బు కోసం హుండీని కొల్లకొట్టాడు. అందులో ఏమీ దొరక్కపోవడంతో ఆ కోపాన్ని సమీపంలో ఉన్న విగ్రహాలపై చూపించి ధ్వంసం చేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ ఎం.మహేంద్ర, నరసన్నపేట సీఐ ఎం.తిరుపతిరావులు జలుమూరు పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులకు వివరాలు వెల్లడించారు. జలుమూరు మండలం పద్మనాభ కొండపై లక్ష్మీదేవి, దుర్గామాత, వినాయక వాహనం ఎలుక విగ్రహాలు జూలై 24న ధ్వంసమయ్యాయని, ఇందుకు బాధ్యుడిగా సైరిగాం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సంజయ్గా గుర్తించామని చెప్పారు. ఈయన తాబేళ్లు, ఉడుములు పట్టుకుని పద్మనాభ కొండపైకి వెళ్లి ఎవరూ లేకపోవడంతో ఆలయం హుండీని పగలుకొట్టాడని తెలిపారు. అందులో నగదు లేకపోవడంతో కోపానికి గురై విగ్రహాల ధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. ఆరు నెలల క్రితం కూడా ఇదే ఆలయం హుండీని కొట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారని పేర్కొన్నారు. 20 రోజుల క్రితం కూడా సంజయ్ ఇక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారని తెలిపారు. విగ్రహాల ధ్వంసం అనంతరం ఒడిశా వెళ్లిపోయిన ఈయన ఆధార్ కార్డుతోపాటు కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు స్వగ్రామం సైరిగాం వచ్చాడని, ఈ క్రమంలోనే కొమనాపల్లి వద్ద పట్టుకున్నామని చెప్పారు. ఆలయ అర్చకుడు అగస్తి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఆర్.దేవానంద్ తెలిపారు. అనంతరం కోటబొమ్మాళి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
ఆలయాల భద్రతపై.. ఏపీ వైపు రాష్ట్రాల చూపు
సాక్షి, అమరావతి : హుండీల్లో డబ్బులు చోరీ.. పంచలోహ విగ్రహాలు మాయం.. దేవాలయాలకు సంబంధించిన నేరాల్లో ఏళ్ల తరబడి పోలీసులు, ప్రజలు వింటున్న మాటలు ఇవి. కానీ, ఇందుకు భిన్నంగా.. గత కొంతకాలంగా పథకం ప్రకారం రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు పోలీసులకు సరికొత్త సవాళ్లను విసిరాయి. దేవుడి మాటున విపక్షాలు మత రాజకీయాలకు తెరతీశాయి. దీనిని సకాలంలో పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు దిశా నిర్దేశం చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీ వైపు చూస్తున్నాయి. ఆలయాల భద్రతలో రాష్ట్రం చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రంలో పటిష్ట చర్యలు ఇలా.. ఆలయాల్లో చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఆలయాలకు ఎక్కడాలేని విధంగా భద్రత కల్పించడమే ఇందుకు కారణం. వాటిలో ముఖ్యమైనవి.. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మతపరమైన సంస్థలు, ఆలయాలకు సంబంధించిన భద్రతపై పోలీసు శాఖ సోషల్ ఆడిట్ నిర్వహించింది. దానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ►విగ్రహాల విధ్వంసానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాలోను ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ►గతేడాది సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకు మొత్తం 59,529 మతపరమైన సంస్థలు, ఆలయాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. ►రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46,225 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ►దేవదాయ శాఖకు చెందిన ప్రధాన ఆలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు మూడు షిఫ్ట్‌ల పద్ధతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ►గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి నిర్వాహకులు, యాజమాన్యం, స్థానిక ప్రజలు బందోబస్తు చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. ►అంతేకాక.. రాష్ట్రవ్యాప్తంగా 22,955 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖ నిర్దేశించుకోగా ఇప్పటివరకు 17,853 ఏర్పాటుచేశారు. మిగిలిన 5,102 దళాల ఏర్పాటుకు కూడా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల అధ్యయనం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో మతపరమైన సంస్థలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, గ్రామ రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు ఏపీ డీజీపీ సవాంగ్‌తో చర్చించారు. ఇక్కడికి వచ్చి ఆలయాల భద్రతా చర్యలను అధ్యయనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. అలాగే, పలు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సైతం ఇక్కడి చర్యలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించడం మనకు గర్వకారణం. – జి. పాలరాజు, పోలీస్ అధికార ప్రతినిధి -
అది టీడీపీ నేతల కుట్రే
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్‌నగర్‌లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆలయ ధర్మకర్త, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరులు ఇద్దరితో పాటు అర్చకుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంకట వరాహసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం రెండు చేతులు డిసెంబర్ 31న ధ్వంసం అయ్యాయి. దుండగులు ధ్వంసం చేశారని తర్వాతి రోజు ఆలయ అర్చకుడు మరల వెంకట మురళీకృష్ణ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాల లోతైన విచారణలో ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసు పూర్వాపరాలను సిట్ డీఐజీ అశోక్‌కుమార్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ శేముషీ బాజ్‌పేయి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరుడు, రాజమహేంద్రవరం 42వ డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త మళ్ల వెంకటరాజు, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దంతులూరి వెంకటపతిరాజు.. విగ్రహ ధ్వంసానికి పథక రచన చేశారు. ► ఇందుకు ఆలయ అర్చకుడు మురళీకృష్ణను వారు పావుగా వాడుకున్నారు. ఇతడి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని విగ్రహం చేతులు ధ్వంసం చేయించారు. ఇందుకు అతడికి రూ.30 వేలు ముట్టజెప్పారు. ► రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు çకుట్ర పన్నారు. తొలుత ఫిర్యాదు చేసిన అర్చకుడు మురళీకృష్ణపై అనుమానం రావడంతో లోతుగా విచారించగా కుట్ర కోణం బయటపడింది. ► విగ్రహం ధ్వంసం చేసింది తానేనని, కేసును పక్కదోవ పట్టించేందుకే ఫిర్యాదు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అర్చకుడు అంగీకరించాడు. దీంతో అర్చకుడి (మొదటి నిందితుడు)తో పాటు ఇద్దరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ► ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయతీ వెంకటగిరిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్‌ను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
నంది విగ్రహం ధ్వంసం కేసులో.. ముఠా గుట్టు రట్టు
వత్సవాయి/పెనుగంచిప్రోలు/నందిగామ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబర్ 10న నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే ఓ ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అవి.. ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని పురాతన ఆలయాల్లో రెక్కీ నిర్వహించారు. ఇదే క్రమంలో మక్కపేటలోని శివాలయంలో మొదటిసారి ప్రవేశించి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అనంతరం.. విగ్రహం పొట్ట భాగంలో విలువైన వజ్రాలున్నాయన్న భావనతో రెండోసారి వచ్చిన ముఠా సభ్యులు గుడిలో పూజ చేయించుకుని వెళ్లిపోయారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజి పరిశీలించి విచారణ ప్రారంభించారు. చివరకు.. హైదరాబాద్‌కు చెందిన అనుగొండ్ల శ్రీనివాసరావు, ఇట్టబోయిన విజయ్, మదని రామకృష్ణ, వికారాబాద్ జిల్లాకు చెందిన చిట్యాల కృష్ణయ్య, గంపలగూడెంకు చెందిన అరిపిరాల వెంకటప్పయ్య శాస్త్రిలతోపాటు రంగురాళ్ల వ్యాపారులు నాగేశ్వరరావు, గోపాలరావులను శుక్రవారం అరెస్టుచేశారు. వారి వద్ద పలు ఆలయాల ఫొటోలు, వీడియోలతోపాటు విలువైన సమాచారాన్ని సేకరించారు. రెక్కీ నిర్వహించిన ఆలయాలు ఇవే.. ప్రకాశం జిల్లా పొదిలి శివాలయం, దర్శి సమీపంలోని దేకలకొండపై ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, గిద్దలూరు మండలం గుడిమెట్లలోని ఆంజనేయస్వామి ఆలయం, యర్రగొండపాలెంలోని చెన్నకేశవస్వామి ఆలయం, గుంటూరు జిల్లా దుర్గి శివాలయం, వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఆంజనేయస్వామి ఆలయం, నల్గొండ జిల్లా హాలియా పేరూరు గ్రామంలోని శివాలయం, వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని రామాలయంలో గుప్త నిధుల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల్లో గుప్త నిధుల కోసం వేట సాగించే 25 ముఠాల్లోని సుమారు 70 మంది సభ్యులను గుర్తించామన్నారు. కాగా, కేసును ఛేదించేందుకు కీలక సమాచారం అందించిన మక్కపేట శివాలయ అర్చకుడు యుగంధర శర్మను సిట్ అధికారితోపాటు జిల్లా ఎస్పీ సత్కరించారు. అలాగే, కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పలువురు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. -
వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
సాక్షి, గుంటూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కాకుమానులో ఆదివారం చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. -
దుండగుల దుశ్చర్య
సాక్షి, రుద్రవరం(కర్నూలు) : మండలంలోని చందలూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని దుండగులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై దాడి చేశారు. విగ్రహం కుడి, ఎడమ చేతులను మనికట్ల వరకు విరగ్గొట్టారు. ఇలా చేయడంపై గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 2012లో ప్రభుత్వ పాఠశాలకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి వైఎస్సార్ జయంతి,వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పిస్తున్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెవెన్యూ అధికారుల ఆదేశానుసారం గ్రామసేవకుడు.. వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేశారు. దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అప్పట్లో శ్రీనివాసులు అభ్యంతరం చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఆ ముసుగు తొలగించారు. కాగా..మంగళవారం ఉదయం విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసి శ్రీనివాసులుతో పాటు గ్రామానికి చెందిన గ్రీన్అంబాసిడర్ చింతలయ్య పరిశీలించారు. తర్వాత ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరిశీలించారు. రుద్రవరం ఎస్ఐ విష్ణునారాయణ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహానేతల విగ్రహాల జోలికెళ్తే కఠిన చర్యలు : డీఎస్పీ మహానేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ తిప్పేస్వామి హెచ్చరించారు. చందలూరులో దుండగుల చేతిలో దెబ్బతిన్న వైఎస్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పని హెచ్చరించారు. ప్రత్యేక బలగాలతో వచ్చిన ఆయన ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామంలో కలియదిరిగారు. నూతన విగ్రహం ప్రతిష్టిస్తాం ‘సౌమ్యంగా ఉన్నారు..ఏమి చేసినా పట్టించుకోరని అనుకుంటున్నారేమో! ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేద’ని శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి సోదరుడు గంగుల మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన డీఎస్పీతో కలిసి వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులను త్వరగా గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ వైఎస్ జయంతి సందర్భంగా నూతన విగ్రహం ప్రతిష్టించి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గందం రాఘవరెడ్డి, హనుమంతరెడ్డి, మహేశ్వరెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి, శంకర్, నంబర్‌వన్ ఉశేన్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం
చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
పెరియార్ విగ్రహానికి ఘోర అవమానం
సాక్షి, చెన్నై : ‘అభినవ తమిళనాడు పిత’గా పేరొందిన పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. సోమవారం పెరియార్ 140వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్లిన అభిమానులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి.. తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దృష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం.. ముఖాన గుండ్రటి కళ్లజోడు... ఉదారత్వం ఉట్టిపడే నవ్వు చూస్తే.. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో కుల, మత, వర్గ ఆధిపత్యాలపై రామస్వామి తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సృష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. రాజకీయ ప్రస్థానం.. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1939లో ‘జస్టిస్ పార్టీ(1917లో ఏర్పడింది)’లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. తన లక్ష్యాలకనుగుణంగా.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే ఆవిర్భవించింది. తర్వాత దాని నుంచి అన్నాడీఎంకే కూడా ఆవిర్భవించింది. అదే విధంగా మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. -
గాంధీ విగ్రహం ధ్వంసం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని పడమటివీధిలో ఉన్న గాంధీ మందిరంలోని జాతిపిత విగ్రహం కిందపడేసి ధ్వంసం చేసి ఉండటాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో మందుబాబులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని స్థానికులు కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఉదయం మందిరంలో గేదెలు ఉండటంతో గాంధీ విగ్రహానికి ఉన్న పూలమాలలను అవి లాగే సమయంలో విగ్రహం కిందపడి ధ్వంసమై ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. కాగా విగ్రహం ధ్వంసమైన తర్వాతే మెడలో ఉన్న పూలమాలలు తినేందుకు గేదెలు వచ్చాయనే వాదన ఉంది. నిగ్గుతేల్చాలి స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న గాంధీ నాయుడుపేటకు వచ్చి పడమటివీధిలో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన నడయాడిన స్థలంలో గాంధీ మందిరాన్ని నిర్మించారు. అప్పటి స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి స్థానికులు గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతో పట్టణంలో కలకలం రేగింది. స్థానికులతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారించి నిగ్గుతేల్చాలని, మహాత్ముడి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారుల పరిశీలన గాంధీ విగ్రహం ధ్వంసమైందని సమాచారం రావడంతో ఆర్డీఓ ఎం.శ్రీదేవి, గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక సీఐ మల్లికార్జునరావు తదితర శాఖల అధికారులు మందిరం వద్దకు వెళ్లి పరిశీలించారు. తొలుత నగర పంచాయతీ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖరరెడ్డి వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని తాత్కాలికంగా మందిరంలో ఉంచి తలుపులకు తాళాలు వేశారు. మందుబాబులకు అడ్డాగా.. గాంధీ మందిరం వద్ద అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటున్నారు. గతంలో అక్కడ కొందరు అతిగా మద్యం సేవించి మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మందుబాబులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. -
యూపీలో అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం
లక్నో: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను రెండింటిని యూపీలో గుర్తుతెలియని దుండగులు శనివారం ధ్వంసం చేశారు. అలహాబాద్‌లోని త్రివేణిపురంలోని అంబేడ్కర్ విగ్రహం తల నరికిన దుండగులు సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని విగ్రహం చేయి విరగ్గొట్టారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. -
తమిళనాడును కుదిపేస్తున్న విగ్రహాల ధ్వంసం
సాక్షి, కోయంబత్తూర్ : ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు పెరియార్ రామస్వామి విగ్రహం విధ్వంసంతో తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యాలయాలపై దాడులకు దారి తీశాయి. కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. చితపుదూర్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ దాడి జరిగింది. కార్యాలయ భవనంపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు పెట్రోల్ బాంబులు విసిరి వెనువెంటనే పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనకు సంబంధించి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం అందించామని వారు తెలిపారు. కాగా, దాడి సమయంలో కార్యాలయం మూసివేసి ఉందని, ఎవరికీ గాయాలైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఘటన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. కోయంబత్తూరు దాడి నేపథ్యంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. త్రిపురలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో లెనిన్, పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంపై దాడి జరగడం గమనార్హం. మాటమార్చిన హెచ్ రాజా మరోవైపు తన ఫేస్బుక్ పోస్టుపై హెచ్ రాజా మాట మార్చారు. తాను కామెంట్ చేసినట్టు చెబుతున్న ఫేస్ బుక్ పేజీ తనది కాదని, వేరెవరో దాన్ని మెయింటెయిన్ చేస్తున్నారని తెలిపారు. కాగా పెరియార్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు సైదాపేటలో ఆందోళనకు దిగారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్నినిరసిస్తూ తమిళ సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్రభుత్వంలోకి రాకముందే అల్లర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణంలోని రష్యా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కాషాయ వర్గాల ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాల మధ్య బుల్డోదర్తో కొందరు కూల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఖండించింది. ‘చలో పల్టాయియే’ అనే నినాదంతో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేస్తున్న దశ్యాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి, ఆ తర్వాత కొంత సేపటికి తొలగించారు. త్రిపుర ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ‘చలో పల్టాయియే’ అనే నినాదాన్ని ఎక్కువగా ఇచ్చిన విషయం తెల్సిందే. లెనిన్ ఓ విదేశీయుడు, టెర్రరిస్టు లాంటి వాడని, ఆయన విగ్రహాన్ని తొలగిస్తే తప్పేమిటని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ఇక రాష్ట్ర గవర్నర్ తథాగథ రాయ్ మరో అడుగు ముందుకు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం ఓ పని చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మరో ప్రభుత్వం ఆ పనిని తుడిచేస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వీరి వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి. బీజేపీ సంఘ్‌పరివార్ లెనిన్ విగ్రహాన్ని విధ్వంసం చేశాయని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉద్రిక్తతలు ఏర్పడి అవి అల్లర్లకు, హింసాకాండకు దారితీస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన ఓ గవర్నరే బాధ్యతార హితంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? అప్పుడే సోషల్ మీడియాలో లెనిన్ విగ్రహం విధ్వంసం మీద నిప్పంటుకుంది. సమర్థించే, వ్యతిరేకించే మధ్య రచ్చ జరుగోతోంది. ఇప్పటికే ద్రవిడ ఉద్యమానికి మూలకర్తయిన పెరియార్ రామస్వామి అంటే పడని బీజేపీ మూకలు తమిళనాడులో ఆయన విగ్రహాలను తొలగిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వాటిని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నిస్తే తమిళనాడు భగ్గు మనదా? మెజారిటీ ప్రజల మద్దతు ఉందనుకుని ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన 1984 నుంచి 2002 వరకు దేశంలో రక్తపాత సంఘటనలు పునరావతం అవుతాయి. తాజా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి త్రిపుర గవర్నర్ తథాతథ రావుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలా మందలించారో తెలియదు. -
మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం
కరీంనగర్(కాటారం): ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆయన కుమారుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే విగ్రహాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి ఘటనలో స్పీకర్ విగ్రహం చేయి కూడా విరిగింది. అయితే ఈ పని ఎవరు చేశారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. -
ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం
నెలవంక(కవిటి),న్యూస్‌లైన్: నెలవంక పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ మేరకు సర్పంచ్ మోహిని బిసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలో గౌరీపౌర్ణమి వేడుకల్లో భాగంగా నందన్న సంబరాల ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు జరిగింది. అప్పటి వరకు విగ్రహం బాగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి జనసంచారం లేని సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇందిరాగాంధీ విగ్రహం తలను విరగ్గొట్టి దాన్ని సమీపంలో చెరువులో పడేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఇటీవల వరకు పోలీసులు గాంధీ కుటుంబ విగ్రహాలు ఉన్న నెలవంక, రాజపురం, జగతి తదితర గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాని పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం సీఎం పర్యటన ఉన్న కారణంగా బందోబస్తును అక్కడికి తరలించడంతో దుండగులు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే తహశీల్దార్ గోపాలరావు, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించారు.