
ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం
పెనుమూరు: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో ప్రభుత్వ కార్యాలయాల కూడలి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తితో ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం రాస్తారోకో చేపట్టారు.
చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. కాగా వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను రెండు రోజుల్లో పట్టుకుంటామని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్, కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
(చదవండి: వైరస్ వ్యాధులతో జాగ్రత్త)
Comments
Please login to add a commentAdd a comment