
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.
‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు.
కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment