Koramulta Srinivasulu
-
చంద్రబాబు, లోకేష్‌లకు సిగ్గుండాలి
సాక్షి, అమరావతి: జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న సహజ మరణాలను ఆసరాగా చేసుకుని శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు సిగ్గుండాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘ ఈ మరణాలపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి క్లియర్‌గా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగడానికి నోరెలా వచ్చింది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెడితే దానిపై చర్చించకుండా, ప్రశ్నోత్తరాలను జరగనివ్వకుండా ప్లకార్డులు తీసుకువచ్చి పథకం ప్రకారం టీడీపీ సభ్యులు పదేపదే సభను అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులేమో తమ తండ్రికి మద్యం అలవాటు లేదంటుంటే.. టీడీపీ శవ రాజకీయం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల సభలో ఏదేదో మాట్లాడారు’ అని విమర్శించారు. -
‘మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అనుచర గణం, బినామీలతో కోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారని మండిపడ్డారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని.. కానీ ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించి పేదల ఆకాంక్షను నెరవేరుస్తామని శ్రీనివాసులు తెలిపారు. కేవలం చంద్రబాబు బినామీదారులకు చెందిన నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను కాపాడుకునేందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదని శ్రీనివాసులు మండిపడ్డారు. -
ఆకేపాటి దీక్ష భగ్నం
రాజంపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఏడో రోజైన మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. డీఎస్పీ జయచంద్రుడు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు దీక్షా శిబిరం వద్ద మోహరించారు. శిబిరంలోకి ప్రవేశించగానే అక్కడే ఉన్న కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. తోపులాట చోటుచేసుకుంది. 15 నిమిషాలపాటు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వ్యూహం ప్రకారం దీక్షను భగ్నం చేశారు. 108 వాహనంలో ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్షను కొనసాగిస్తా.. సమైక్యాంధ్ర కోసం తాను చేపట్టిన ఆమరణ దీక్షను ఆస్పత్రిలో కూడా కొనసాగిస్తానని అమరనాథరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానులు సహనం పాటించాలని కోరారు. ఏడో రోజూ... కొరముట్ల నిరశన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ దీక్ష ఏడో రోజూ కొనసాగింది. పెద్దఎత్తున ప్రజలతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు, అన్నిసంఘాల వారు తరలివచ్చి కొరముట్లకు తమ మద్దతు ప్రకటించారు. షుగర్, బీపీ లెవెల్స్ తగ్గడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్నాయి. వీరి దీక్షలకు డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, నేషనల్ టూరిజం డెరైక్టర్ సురేంద్రకుమార్ సంఘీభావం తెలిపారు.