ఆకేపాటి దీక్ష భగ్నం | MLA Akepati Amarnath Reddy Hunger Strike Hunger strike disruption | Sakshi
Sakshi News home page

ఆకేపాటి దీక్ష భగ్నం

Published Wed, Aug 21 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

ఆకేపాటి దీక్ష భగ్నం

ఆకేపాటి దీక్ష భగ్నం

రాజంపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఏడో రోజైన మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. డీఎస్పీ జయచంద్రుడు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు దీక్షా శిబిరం వద్ద మోహరించారు. శిబిరంలోకి ప్రవేశించగానే అక్కడే ఉన్న కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

తోపులాట చోటుచేసుకుంది. 15 నిమిషాలపాటు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వ్యూహం ప్రకారం దీక్షను భగ్నం చేశారు. 108 వాహనంలో ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

దీక్షను కొనసాగిస్తా..
సమైక్యాంధ్ర కోసం తాను చేపట్టిన ఆమరణ దీక్షను ఆస్పత్రిలో కూడా కొనసాగిస్తానని అమరనాథరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానులు సహనం పాటించాలని కోరారు.

ఏడో రోజూ... కొరముట్ల నిరశన
వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ దీక్ష ఏడో రోజూ కొనసాగింది. పెద్దఎత్తున ప్రజలతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు, అన్నిసంఘాల వారు తరలివచ్చి కొరముట్లకు తమ మద్దతు ప్రకటించారు. షుగర్, బీపీ లెవెల్స్ తగ్గడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్నాయి.

వీరి దీక్షలకు డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, నేషనల్ టూరిజం డెరైక్టర్ సురేంద్రకుమార్ సంఘీభావం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement