సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్‌పురంలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మండల పరిషత్ కార్యాలయం సమీపంలో వైఎస్సార్ విగ్రహాన్ని శనివారం తెల్లవారుజామున దుండగులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. విగ్రహం ధ్వసం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.
చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్
ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం గంగాధర నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను దుండగులు తగలబెట్టారు. ఇప్పుడు సంక్రాంతి రోజున వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే పోలీసులు సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment