Jayanthi celebration
-
‘సంక్షేమం’ పెంచేందుకే సర్వే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత పెంచడానికే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చె ప్పారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహిస్తామని ఇ చ్చిన మాటకు కట్టుబడి సర్వే నిర్వహిస్తున్నామని పే ర్కొన్నారు. గురువారం ఆయన గాం«దీభవన్‌లో భా రత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియా తో మాట్లాడుతూ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతోందని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే కుటుంబ సర్వే కు సంబంధించి ప్రశ్నలు తయారు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చటమే బీఆర్ఎస్ లక్ష్యం తమ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేయటం, రైతు రుణమాఫీ, ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యాలా? అని ప్రశ్నించారు.అధికారం పోయిందన్న అక్కసుతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని ఆరోపించారు. నెహ్రూ ఆశయాలు కొనసాగిస్తాం నెహ్రూ ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె మాట్లాడారు. -
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. గురజాడ అప్పారావుకి జగన్ నివాళి
-
చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలకు రూ.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉత్స వాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఐలమ్మ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించా రు. ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం రూ.12 లక్షలు కేటాయించామని, అలాగే ఈ నెల 10న జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం రూ.3 లక్షలు కేటాయించినట్లు పొన్నం వెల్లడించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీలో 40 మంది సభ్యులను కూడా నియమించినట్లు చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి మంత్రి సూచించారు. -
ఏపీలో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
-
వైయస్ఆర్ జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న రైతు దినోత్సవంలో భాగంగా విత్తనాల పండుగ
-
కువైట్‌లో వైఎస్ రాజశేఖరెడ్డి 74వ జయంతి వేడుకలు
-
చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్ వన్ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. (చదవండి: వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి ) ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. -
పీవీ ఒక కీర్తి శిఖరం, ఆయనను ఎంత స్మరించుకున్న తక్కువే: కేసీఆర్
-
హైదరాబాద్: పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
పీవీ ఒక కీర్తి శిఖరం: సీఎం కేసీఆర్
కడుపు నిండిపోయింది... తెలంగాణ బిడ్డ పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడం సంతోషం. భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెట్టుకుందాం. – సీఎం కేసీఆర్ పీవీ ఓ విద్యానిధి... పీవీ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఏ పాత్ర పోషించినా సంస్కరణలకు పెద్దపీట వేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో చదివిన డీజీపీ మహేందర్‌రెడ్డి తరహాలో ఎంతో మంది పీవీని ప్రతినిత్యం స్మరించుకుంటారు. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. కవి పండితుడు, బహుభాషా కోవిదుడు, సమున్నత సాహితీ స్ఫూర్తి. ఆయన వల్లే పెట్టుబడులు... దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నర్సింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ మారక నిల్వలు తరిగి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులను సవాలుగా తీసుకుని చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడు దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. – సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆభరణం... నెక్లెస్ రోడ్‌కు పీవీ విగ్రహం ఒక గొప్ప ఆభరణం. ఈ భూమి పుత్రుడికి దక్కిన గౌరవం. పీవీ కాంగ్రెస్‌కు చెందిన వాడైనా తన ఆత్మకథను ఆవిష్కరించే అవకాశం మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చారు. మానవ హక్కులపై ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం కూడా వాజ్‌పేయికి కల్పించారు. – గవర్నర్ తమిళిసై సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఒక కీర్తి శిఖరం.. ఒక దీప స్తంభం.. పరిపూర్ణ సంస్కరణశీలి. ఆయనను ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా, ఎంత సన్మానించుకున్నా తక్కువే’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలసి సీఎం సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా ఏడాది కాలం గా రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి చెప్పారు. భూ సంస్కరణలకు మార్గదర్శకం ‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. తనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ధారాదత్తం చేసి నిబద్ధ తను చాటుకుంటూ భూ సంస్కరణలు అమలు చేశారు. పీవీ స్మరణ, స్ఫూర్తిని భావితరాలకు చాటే లా కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నం. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుంది. పీవీ అనేక పుస్తకాలు రాయడంతో పాటు రచనలను అధ్యయనం చేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో నే దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. మాజీ ప్రధా ని మన్మోహన్సింగ్ కూడా పీవీని తండ్రిగా, గురువుగా స్మరించుకునేవారు’అని కేసీఆర్ అన్నారు. సోమవారం పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. చిత్రంలో కె.కేశవరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పుట్టిన, పెరిగిన ఊరులో విగ్రహాలు.. ‘పీవీ పుట్టిన, పెరిగిన ఊరు, ఇతర చోట్ల విగ్రహావిష్కరణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీవీ సమాధి ఉన్న జ్ఞానభూమిలోనూ న్యాయపరమైన చిక్కులు లేకుండా స్మారకం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబాన్ని గౌరవించుకునేందుకు ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆదర్శాలు, సంస్కరణశీల భావజాలాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహద పడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి’అని సీఎం అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు పీవీ: కేటీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ యంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పీవీ అభివృద్ధి పథంలో నిలిపారని పేర్కొన్నారు. ఆయన గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. అరుదైన వ్యక్తిత్వం..: గవర్నర్ ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి. పేద ప్రజల పెన్నిది. సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త’అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ‘ఆయనను నేను ఎంతో గౌరవిస్తా. పీవీపై రూపొందించిన పుస్తకాలు వచ్చే తరాలకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం పీవీది. పీవీ రాజకీయాలకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ప్రధాని మోదీ చెప్పినట్లు పీవీ దేశ ఆత్మను, విలువలను ప్రేమించారు. దక్షిణ భారతదేశం నుంచి ఆయన మొదటి ప్రధాని కావడం గర్వకారణం. పీవీ విజయాలను చూసి తెలంగాణ తల్లి ఎంతో సంతోషిస్తోంది’అని గవర్నర్ తమిళిసై అన్నారు. పీవీ విగ్రహం, పుస్తకాల ఆవిష్కరణ.. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను ‘పీవీ మార్గ్’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళి అర్పించగా.. కీర్తనలు, సర్వ మత ప్రార్థనలు జరిగాయి. ఏడాది కాలంగా జరిగిన పీవీ శత జయంతి వేడుకల కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. -
రామానాయుడు విగ్రహావిష్కరణ
మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ ఆవరణలో గురువారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు రామానాయుడు అందించిన సేవలను అతిథులు కొనియాడారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్‌నగర్ సొసైటీ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, ఆర్.నారాయణమూర్తి, విజయ్‌చందర్, శివకృష్ణ, కేఎల్ నారాయణ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బోయిన సుబ్బారావు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు. -
మనువును కాల్చేశాడు పదవిని కాలదన్నాడు
అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. స్త్రీ హక్కుల కోసం అంబేద్కర్ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కులం దుర్మార్గాన్నే కాదు స్త్రీల మీద అణిచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు.‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేవేసిన సామాజిక పరిస్థితులు గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో–‘‘ఆడబిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు.తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు.వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ మాటలు ఎంతో దోహదపడ్డాయి.స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. మహిళలు చదుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేసింది. అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం.కులం, స్త్రీ అణచివేతను విడి విడి సమస్యలుగా చూడలేదు అంబేడ్కర్. రెండు సమస్యలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్, స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు.దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకులవ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు అంబేడ్కర్. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు.‘‘పాత, మురికి బట్టలకు దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం దళిత స్త్రీలు అందంగా, ఆడంబరంగా తయారవ్వాలని కాదు... కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం మాత్రమే ఆయన మాటల వెనుక ఉన్న సారాంశం. అంబేడ్కర్ మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని ఒక తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి.పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని అంబేడ్కర్ దళిత స్త్రీలకు చెప్పేవారు.కుటుంబవ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్’ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. సంప్రదాయ ఛాందసుల కుట్ర వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్దతను చాటుకున్న ధీశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. (సౌజన్యం : డాక్టర్ బి. విజయభారతి) -
ఎల్వీ ప్రసాద్‌గారు ఎందరికో స్ఫూర్తి
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ ఆయన రాణించారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గతాన్ని ఎవరూ మర్చిపోకూడదు. భావి తరాలకు చెప్పాలి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్(ఎల్వీ ప్రసాద్) 111వ జయంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ– ‘‘నన్ను అందరూ సీతమ్మ అని పిలుస్తున్నారంటే కారణం పెద్దాయన ఎన్టీఆర్‌గారే. ‘సీతారామకల్యాణం’ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇల్లాలు’. అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌గారి మెప్పు పొందాను’’ అన్నారు. ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నకి సినిమా తప్ప మరేమీ తెలియదు. నన్ను నటుణ్ని చేయాలన్నది ఆయన కోరిక. అయితే ఓ సారి ‘సంసారం’ సినిమా షూటింగ్లో అంత సేపు స్టూడియోలో కూర్చోవడం ఇష్టం లేక ఆయన్ని విసిగించాను. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను’’ అన్నారు. ‘‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్... ఇద్దరూ మహావృక్షాలు. తాము సంపాదించినదాన్ని సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు రమేష్ ప్రసాద్‌గారు ఓ మంచి బయోపిక్ తీయాలి’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. -
నాన్న జర్నీ నుంచి ఆ నాలుగు విషయాలు నేర్చుకోవాలి
తెలుగు సినిమా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కృషి చేసిన దర్శక– నిర్మాతల్లో ఎల్వీప్రసాద్ ప్రముఖులు. తెలుగు, హిందీ, తమిళ తొలి టాకీ సినిమాల్లో నటించిన అరుదైన రికార్డ్ ఆయనదే. దర్శకుడిగా ‘మన దేశం, సంసారం మిస్సమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా ‘ఇలవేలుపు, ఇల్లాలు’ వంటి చిత్రాలు నిర్మించారు. నేడు ఎల్వీ ప్రసాద్ 111వ జయంతి. ఈ సందర్భంగా తండ్రికి ఎల్వీ ప్రసాద్ ప్రయాణాన్ని పంచుకున్నారు ఆయన తనయుడు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేశ్ ప్రసాద్. ‘‘మా నాన్నగారి ప్రయాణాన్ని తలచుకున్నప్పుడుల్లా నాకు గుర్తొచ్చేది నాలుగు విషయాలు. ప్రిసర్వెన్స్(పట్టుదల), ప్యూరిటీ ఆఫ్ థాట్స్ (కల్మషం లేని ఆలోచనలు), ప్యాషన్ (తపన), పేషన్స్ (ఓపిక). చదువు లేకపోయినా ఆయన అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. వ్యవసాయంలో మా తాతగారికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. దాంతో మా నాన్నగారు ఎవరికీ చెప్పకుండా కేవలం 100 రూపాయిలతో ముంబై వెళ్లిపోయారు. అప్పు తీర్చలేక పారిపోయారని అందరూ అనుకున్నారట. కానీ సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకొని అక్కడ వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించారు. హిందీ రాకపోయినా కేవలం సైగలతో సంభాషించేవారని తర్వాతి రోజుల్లో నాన్నగారు చెబితే మాకు తెలిసింది. ఓ టైలర్ షాప్‌ను శుభ్రం చేసే పని కూడా చేశారాయన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయానికి మా నాన్నగారు ఓ చక్కని ఉదాహరణ. నాన్నగారి తపనను గమనించిన టైలర్ ఆయన సినిమాల్లోకి వెళ్లడానికి తన వంతు సహాయం చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయాక 16 నెలలకు ‘నేను బావున్నాను. సినిమాల్లో పని చేస్తున్నాను’ అంటూ ఇంటికి ఉత్తరం రాశారు. వాచ్‌మేన్‌గా పనిచేసిన థియేటర్ మరమత్తులు జరిగి, మళ్లీ నాన్నగారి సినిమాతోనే ప్రారంభం అయింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు నాన్నగారు. మా నాన్నగారు తీసిన సినిమాల్లో ‘బిదాయి’ అనే సినిమా అంటే నాకు ఇష్టం. వాస్తవానికి నాన్నగారి గురించి వినడం తప్పితే ఎక్కువగా ఆయనతో గడిపింది లేదు. ఆయన షూటింగ్స్‌తో అంత బిజీగా ఉండేవారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. సినిమాకు తిరిగివ్వాలని ప్రసాద్ ల్యాబ్స్ స్థాపించారు. కెమెరా అంటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ‘సంసారం’లో చిన్న పాత్రను పోషించాను. ‘మీ నాన్నగారి బయోపిక్ తీస్తారా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమీ అనుకోలేదు. మా ప్రొడక్షన్లో రెండు సినిమాలు తీశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. మరో సినిమా తీయాడానికి చర్చలు నడుస్తున్నాయి’’ అన్నారు. -
తిరుపూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం
చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
95వ జయంతి మహోత్సవం
దాదా సాహెబ్‌ఫాల్కే, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత, స్వర్గీయ నటుడు డాక్టర్ అక్కి నేని నాగేశ్వరరావు 95వ జయంతి మహోత్సవం ఈ నెల 19న జరగనుంది. ‘రసమయి’ సంస్థ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ‘అక్కినేని ఆలోచనలు’ సంస్కృత అనువాధ గ్రంథం ‘అక్కినేని అనుచింతనాని’, అక్కినేని ప్రత్యేక తపాలా చంద్రిక (అక్కినేని స్పెషల్ పోస్టర్ కవర్) ఆవిష్కరణలు ఉంటాయి. ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ డా. కె. రోశయ్య, సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి పూర్వ చైర్మెన్ డా.ఎ. చక్రపాణి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి. చంద్రశేఖర్, డా. బి.వాణీదేవి తదితరులు పాల్గొంటారు. అలాగే అదే రోజు శ్రీ త్యాగరాయ గానసభలో ‘మహానటులు అక్కినేని’ శీర్షికన ఎం.కె రాము రచించిన సంగీతరూపక ప్రదర్శన ఉంటుందని ‘రసమయి’ అధ్యక్షులు ఎం.కె. రాము తెలిపారు. -
‘అల్లూరి’ జీవితం యువతకు ఆదర్శం
వెలుగోడు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ఏపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెం కష్ణార్జునరెడ్డి అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీషువారి ఆగడాలను చూసి సహించలేక అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాటపట్టారన్నారు. గిరిజనులను ఏకంచేసి, బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించారని చెప్పారు. యువత అల్లూరి ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరరావు, నాయకులు విజయ్, రవి కిషోర్‌రెడ్డి, శివకృష్ణ పాల్గొన్నారు. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని కృష్ణవేణి కాల్యాణ మండపంలో బుధవారం అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్వీఎస్ మల్లికార్జున , సీపీఐ నాయకులు వీఎంఎం ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలేటి మల్లికార్జున, జూనియర్ కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు బండిఆత్మకూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామారాజు 120వ జయంతిని నెమళ్లకుంట గిరిజన తండాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్ఎంపీ వైద్యుడు రామరాజు, సర్పంచ్ నాటక్క, ఉపసర్పంచ్ లింగారెడ్డి తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనతరం ఆర్ఎంపీ వైద్యుడు రామరాజు ఆధ్వర్యంలో పలువురు ఆర్ఎపీ వైద్యులు స్థానిక గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత, జ్వరాలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యులు శీను, గోపాల్‌రెడ్డి, జమ్మన్న, అల్తాఫ్ హుసేన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆగస్టు 2,3 తేదీలలో బళ్లారి రాఘవ జయంతోత్సవాలు
బళ్లారి : కర్ణాటక, ఆంధ్రా నాటక పితామహుడు బళ్లారి రాఘవ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాఘవ మెమోరియల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆగస్టు 2,3 తేదీలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దనగౌడ తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా బళ్లారి రాఘవ పేరు మీదుగా తెలుగు, కన్నడ కళాకారులకు రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు, కన్నడ భాషలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన పలువురు కళాకారులను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఎస్.నాగన్న, ప్రేమా పాటిల్ ఉన్నారు. జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైన వారిలో ఆళ్ల వెంకటరెడ్డి, జెటి.ప్రవీణ్‌కుమార్, కె.మధుసూధన్‌రావ్, కె.సురేంద్ర బాబు, సీజీ లతాశ్రీ, ఎం.ఎల్.రంగస్వామీ, నాగభూషణ నాగళ్లి, పత్తార్ ఖాదర్‌సాబ్, రమేష్‌గౌడ పాటిల్, వీ.ఎన్.గిరిమల్లప్ప ఉన్నారు. జయంతోత్సవం రోజున వారికి నగదు బహుమతితోపాటు ఓ మొమెంటోను బహూకరిస్తారు.