సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
వెలుగోడు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ఏపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెం కష్ణార్జునరెడ్డి అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీషువారి ఆగడాలను చూసి సహించలేక అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాటపట్టారన్నారు. గిరిజనులను ఏకంచేసి, బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించారని చెప్పారు. యువత అల్లూరి ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరరావు, నాయకులు విజయ్, రవి కిషోర్‌రెడ్డి, శివకృష్ణ పాల్గొన్నారు.
ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని కృష్ణవేణి కాల్యాణ మండపంలో బుధవారం అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్‌వీఎస్ మల్లికార్జున , సీపీఐ నాయకులు వీఎంఎం ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలేటి మల్లికార్జున, జూనియర్ కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు
బండిఆత్మకూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామారాజు 120వ జయంతిని నెమళ్లకుంట గిరిజన తండాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్‌ఎంపీ వైద్యుడు రామరాజు, సర్పంచ్ నాటక్క, ఉపసర్పంచ్ లింగారెడ్డి తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనతరం ఆర్‌ఎంపీ వైద్యుడు రామరాజు ఆధ్వర్యంలో పలువురు ఆర్‌ఎపీ వైద్యులు స్థానిక గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత, జ్వరాలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎంపీ వైద్యులు శీను, గోపాల్‌రెడ్డి, జమ్మన్న, అల్తాఫ్ హుసేన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment