alluri sitarama raju
-
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న గిరిజనులు
-
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్ రూమ్‌లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్‌లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్మెంట్ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్.రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు కళాశాల సిబ్బంది.ప్రిన్సిపల్ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు. -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం
-
మన్యం విప్లవ జ్యోతి..
భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పథాన్ని అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ విద్యతో పాటు యుద్ధ విద్య, జ్యోతిష్యం వంటివాటిని అభ్యసించాడు. తరువాత దేశ సంచారం చేసి దేశంలో ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వచ్చి మన్యంలో తిరుగుబాటు మొదలుపెట్టాడు.కవర్డు, హైటర్ వంటి అధికారులను సీతారామరాజును మట్టు పెట్టటానికి మన్యం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. లోతుగడ్డ వాగు దగ్గర సీతారామరాజు ఉన్నాడని తెలుసుకొని, 300 మంది పటాలంతో వాళ్లు బయలుదేరారు. ముందుగానే వారి రాకను పసిగట్టిన సీతా రామరాజు విలువిద్యలో ఆరితేరిన గోకిరి ఎర్రేసు, గాము గంటం దొర, మల్లు దొర, పడాలు అగ్గిరాజువంటి వారితో కలిసి గొరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరుకైన మార్గంలో వస్తున్న కవర్డ్, హైటర్లు సీతారామరాజు దళం దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇది రామరాజు మొదటి విజయం. దీంతో రామరాజు తలమీద బ్రిటిష్ గవర్నమెంట్ 10 వేల రివార్డు ప్రకటించింది.అయితే ఈ దాడిలో మల్లు దొరకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు రామరాజు బ్రిటిష్ వారితో పోరాడాలంటే విల్లంబులు చాలవనీ, తుపాకులు కావాలనీ భావించాడు. తుపాకుల కోసం ఎవరి మీద దాడి చేయకుండా, పోలీస్ స్టేషన్లో తుపాకులను, మందుగుండు సామగ్రిని కొల్లగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లకు ఒకదాని తరువాత మరొకదానికి మిరపకాయ టపా పంపి తాను స్టేషన్‌పై దాడికి వస్తున్నట్లు తెలిపి మరీ తుపాకులను దోచుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు తీసుకువెళ్తున్నాడో ఆ వివరాలన్నీ రాసి కింద ‘శ్రీరామరాజు’ అని సంతకం చేశాడాయన.గుంటూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న రూథర్‌ఫర్డ్‌ను సీతారామరాజును అణచడానికి విశాఖ జిల్లాకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే సమయంలో పరమ నీచుడైన బ్రిటిష్ మేజర్ గుడాల్, గిరిజన గూడేలపై పడి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తూ పసిపిల్లలను వధించటం, భార్యల ఎదుటే భర్తను చంపటం, గిరిజన గూడేలను తగలబెట్టడం లాంటి చర్యలకు ఒడిగట్టాడు. ఇది సీతారామరాజుకి తెలిసి, తన వల్ల అమాయకులైన గిరిజన జనం చనిపోవడం, ఇబ్బందులపాలు కావడం ఇష్టంలేక లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో గుడాల్ మాటు వేసి, తన సైన్యంతో సీతారామరాజును బంధించాడు. ఆయన్ని నులక మంచానికి కట్టి, నానా హింసలు పెట్టి, వీధుల్లో ఊరేగించి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక విప్లవ జ్యోతి అమరదీపమై దేశ స్వాతంత్రోద్యమానికి దారి చూపింది. – పొత్తూరి సీతారామరాజు, కాకినాడ (నేడు అల్లూరి సీతారామరాజు జయంతి) -
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
అల్లూరి సీతారామరాజు: భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో తొలి వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టగా.. అలా వారి జీవనం సాగుతుండగా, తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే..జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లావ్యను తాను ఇష్టపడ్డ విషయం తన ఇద్దరు భార్యలకు చెప్పాడు పండన్న. ఈ క్రమంలో వారిద్దరే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి పెళ్లి గురించి దీంతో వారే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి మాట్లాడారు. పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో లావ్యను పండన్నకు ఇచ్చి వివాహం జరిపించారు.తల్లిదండ్రులు లేని పండన్నకు ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుభలేఖల్లో కూడా వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వాంచారు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు. -
అల్లూరికి అర్ధ శతాబ్దం
‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్ వాహినీ స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్ ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు. అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్ హిట్. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా, ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’ తీయను’’ అన్నారు ఎన్టీఆర్.మహారథి చేతికి స్క్రిప్ట్ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్‌మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. -
అభివృద్ధిపథంలో అల్లూరి జిల్లా సీఎం జగన్ మార్క్..!
-
చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారా?
ప్రకృతి ఎప్పటికప్పుడూ తన వైవిధ్యంతో మనుషులను మంత్రముగ్దులయ్యేలా చేస్తూనే ఉంటుంది. కొన్నింటిని చూస్తే ప్రకృతిలో ఇంగ గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వేసవి వచ్చిందంటే ఎందురయ్యే నీటి సమస్యకు ఆ అద్భుతం ఓ గొప్ప మార్గాన్ని అందించే ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా అద్భుతం అంటే.. ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది . ఏం జరిగిందంటే..భూమి మూడోంతుల నీరు ఉంటుందని విన్నాం. కానీ కొన్ని చోట్ల భూమ్మీద నీరు కనిపించకపోయినా..తవ్వగానే ఉబికి రావడం జరగుతుంది. మరొకొన్ని చోట్ల కొండల్లోంచి పుట్టుకురావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అత్యంత విభిన్నంగా చెట్టులోంచి నీరు వస్తోంది. అంది కూడా పంపు నుంచి లీకైనట్లుగా ధారాపాతంగా వస్తోంది. ఈ చెట్టుకి పూలు, కాయల తోపాటు నీళ్లు కూడా వస్తాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆ చెట్టు పేరు నల్ల మద్ది చెల్లు. దీన్నుంచి నిరంతరాయంగా పంపు మాదిరిగా నీళ్లు ఫోర్స్‌గా వస్తాయి. అక్కడే ఇలాంటి చెట్లు వేలాదిగా ఉన్నాయి. ఈ చెట్టుకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అందుకు సంబంధించిన వీడియోని తీసి నెట్టింట షేర్ చేయండతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వింతైన దృశ్యాన్ని చూసేయండి. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an — Telugu Scribe (@TeluguScribe) March 30, 2024 (చదవండి: పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!) -
బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. చదవండి: మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి -
స్వరాజ్య పోరులో గర్జించిన మన్యం
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం (టీఎఫ్ఎఫ్ఎం) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్య పోరాటంలో గర్జించిన మన్యం మొనగాళ్ల చరిత్రను ఈ మ్యూజియం భావితరాల కళ్ల ముందు ఉంచనుంది. గిరిజన పోరాట యోధుల చరిత్రతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి స్ఫూర్తి నింపే సంకల్పంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. రూ.35 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియంను నాలుగు జోన్లు(భాగాలు)గా నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పూర్వ యుగం, బ్రిటిష్ పాలన, స్వాతంత్య్ర పోరాటం(తిరుగుబాటు), బ్రిటిష్ వాళ్లు పలాయనం (స్వాతంత్య్రం తర్వాత) అనే నాలుగు ప్రధాన విభాగాలుగా గిరిసీమ చరిత్రను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నానికి ఈ మ్యూజియం వారధిగా నిలవనుంది. మన్య సీమతో పెనవేసుకున్న ఖోండ్ తిరుగుబాటు (1835–37), సవరా తిరుగుబాటు (1853), లాగరాయ్ పితూరి (1914–16), మన్యం (రంప) తిరుగుబాటు(1922–24), మూకదొర తిరుగుబాటు (1924–26), చెంచు తిరుగుబాటు(1938)తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన ఘట్టాలకు ఈ మ్యూజియం నెలవు కానుంది. గాండ్రించిన మన్యసీమ స్వాతంత్య్ర పోరాటంలో మన్యసీమ కేంద్రంగా గాండ్రించిన మొనగాళ్ల చరిత్రతోపాటు అనేక వీరోచిత ఘట్టాలు ఈ మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతోపాటు గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను మ్యూజియంలో నెలకొల్పనున్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చోని వీక్షించేలా డిజిటల్ థియేటర్ నిర్మిస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజా నిర్మిస్తున్నారు. చరిత్రను పదిలం చేసే పనులు షురూ.. మ్యూజియం నిర్మాణం పనులు వేగవంతం చేయడంతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన చరిత్రను పదిలం చేసే పనులు ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించి గత నెల 18న అల్లూరి జిల్లా సీతంపేట ఐటీడీఏలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ), వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, పశు సంవర్ధక శాఖ, జిల్లా పర్యాటక అధికారి, ఉప విద్యా అధికారి, గిరిజన ఉపాధ్యాయులు, వెలుగు సొసైటీ సభ్యులు, గిరిజన తెగల గ్రామ స్థాయి కమిటీల సమన్వయంతో చారిత్రక ఆధారాలను సేకరించేలా సమాయత్తం చేశారు. మన్యం కేంద్రంగా సాగిన స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన ఆధారాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన సామగ్రిని సేకరించేలా దిశానిర్ధేశం చేశారు. గిరిజన జీవన విధానానికి అద్దం పట్టేలా.. గిరిజన కళాఖండాలు, వస్తువులు, నమూనాలు రెండేసి చొప్పున సేకరించి ఒకటి మ్యూజియంకు, మరొకటి స్థానికంగా ఐటీడీఏలలో భద్రపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గిరిజన తెగకు సంబంధించిన వస్తువుల (కళాఖండాలు) జాబితాను సిద్ధం చేయనున్నారు. వాటిని వీలైనంత పెద్ద సైజులో ఫొటోలు తీయిస్తారు. వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. గిరిజనులు ఉపయోగించిన నీటి కుండలు, సీసా పొట్ల కాయలు, సంగీత పరికరాలు, చేపలు పట్టే సామగ్రి, వేటకు వాడిన ఉచ్చులు, నూనె వెలికితీత యంత్రాలు, చెక్క ఇల్లు, గుళిక విల్లు, విల్లు, బాణాలు, వ్రస్తాలు, ఆభరణాలు (పూసల తదితర లోహాలతో కూడిన నగలు), వ్యవసాయ పనిముట్లు, పరికరాలు సేకరిస్తారు. గిరిజన జాతరలు, పండుగలు, మౌఖిక సంప్రదాయాలు, పాటలు, దేవుళ్లు, దేవతలు, సంప్రదాయ నిపుణులు, వివాహ తంతు, స్మారక స్తంభాలు, చెక్క క్రాఫ్ట్, కుండలు, ఇనుప వస్తువులు, ముసుగులకు సంబంధించిన అనేక వస్తువులు, సవివరమైన చరిత్రను అందుబాటులోకి తెస్తారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017 నుంచి కనీసం భూమిని కూడా కేటాయించకపోడంతో దీని నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మ్యూజియం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ శాఖల సమన్వయంతో భూ కేటాయింపు సమస్యను సీఎం వైఎస్ జగన్ కొలిక్కి తెచ్చారు. 2021లో చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రం గర్వించే స్థాయిలో గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియం తాజంగిలో రూపుదిద్దుకుంటోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి శరవేగంగా నిర్మిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే తపనతో ఉన్నాం. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని 10 రాష్ట్రాలకు గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలను మంజూరు చేసింది. జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, గోవాలకు మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. వాటిలో మన రాష్ట్రానికి రూ.15 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతోపాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించింది. – కాంతిలాల్ దండే, కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ -
నిలదీయడానికి రాలేదు.. శభాష్ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్
సాక్షి, అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ10 వేలు ఇవ్వాలని , ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని, ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయమని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇంకేం మాట్లాడరంటే.. ‘కొన్ని రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయి. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చాం. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా చూశారు. సాయం అందలేదనే మాట రావొద్దని ఆదేశించాం మనందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్ చేశాం. వారం రోజుల తర్వాత నేను వస్తాను, గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇచ్చాం’ అని పేర్కొన్నారు. చదవండి: పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు: సీఎం జగన్ సాయం అందకుంటే నాకు చెప్పండి ► గొప్పగా, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ►మనందరి ప్రభుత్వంలో డబ్బులు ఎలా మిగిలించుకోవాలనే తాపత్రయం లేదు. ► ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయం ఉంది. ►ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే తప్పే. ►అలా జరగకపోతే ఎవరైనా నాకు చెప్పవచ్చు. ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశం ► ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే, ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ►25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు ఇటువంటివన్నీ 5 రకాలు కలిపి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆదేశించాం. ► అటువంటివి ఎవరికైనా దక్కకపోయి ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం జవాబుదారీ తనం తీసుకుంటుంది. ►కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియల్లీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దు. ►పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ►ఎన్యుమరేషన్ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే. అందరికీ మేలు జరగాలి ► ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం. ►పొరపాటున నష్టం జరిగి ఉండి జాబితాలో పేరు లేకపోతే వెంటనే జాబితాలోకి పేరు చేర్చి మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు. ►ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. ►మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దానికి తీర్చడం కోసం ఎళ్లవేలళా కృషి చేస్తాడు. ► మీలో కొంత మందికి మాట్లాడటానికి మైక్ ఇస్తా. మాట్లాడొచ్చు. పోలవరం పునరావాస ప్యాకేజీ ►ఈ ప్రాంతానికి జనరల్ ఇష్యూ ఉంది. పోలవరం ప్యాకేజీకి సంబంధించింది. ►ఇంతకు ముందు కూడా మీ అందరికీ ఇదే చెప్పాం.. ►మీ జగన్‌లో కల్మషం లేదు. మీ జగన్ ఎప్పుడైనా మంచి చేయడం కోసమే ఆరాటం, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. ► గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 41.05లో కాంటూర్‌లెవల్‌లో మావి లేనప్పటికీ కటాఫ్ అయిపోయిన గ్రామాల్లో మేము ఉండిపోతామని చెప్పడం జరిగింది. ► అటువంటి గ్రామాలకు మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత సర్వే చేయించాం. ►32 గ్రామాలు 48 హ్యాబిటేషన్లను 41.15 దాకా మొదటి స్టేజ్ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా నిలబెట్టినప్పుడు కూడా కటాఫ్ అయిపోయిన గ్రామాల్లోకి నీళ్లు నిలబడటం వల్ల మరో 48 గ్రామాలు చేరుతాయి. ►ఈ గ్రామాలకు వెళ్లడానికి దారి ఉండదు. కాబట్టి వాటిని చేర్చాలని సర్వే చేయించి, దాని ద్వారా ఇందులోకి సైంటిఫిక్‌గా, ట్రాన్స్పరెంట్గా ఆయా గ్రామాలను తీసుకొచ్చాం. చదవండి: స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్న భూమన మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం ►ఆ గ్రామాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపాం. ►41.15 మీటర్ల దాకా నీళ్లు నింపాలంటే 3 దఫాలుగా నింపాలి. ► ఒకటే స్టేజీలో నింపితే లీకేజీ అవుతుందనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో నింపాలి. ► మూడు సంవత్సరాల్లో 3 ఫేజుల్లో డ్యామ్‌ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. ►డ్యామ్ కట్టిన తర్వాత నీళ్లు నింపేది 41.15కు నింపుతారు. ►కాంటూర్ లెవల్లో వచ్చే ప్రతి నిర్వాసిత కుటుంబాలకు కూడా వాళ్లందరికీ ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇచ్చి, అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకు ► నిర్వాసితులను చూసుకోవంతో పాటు సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్లు కూడా ఫస్ట్ ఫేజ్‌లోకి తీసుకురావడం జరుగుతోంది. ► దాని వల్ల 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికి ఏమేం రావాలో ఫస్ట్ ఫేజ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే లిడార్ సర్వే పూర్తి చేశాం. కేంద్రానికి పంపి ఒప్పించడం జరిగింది. ►దేవుడి దయతో ఈ నెలాఖరుకల్లా కేబినెట్ దాకా పోయే కార్యక్రమం జరుగుతోంది. ►పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్లు సంతకాలు పెట్టడం జరిగింది. ► సీడబ్ల్యూసీ వాళ్లకు చేరింది. మరో వారం దాటేలోపు కేంద్ర జలశక్తి వాళ్లు క్లియర్ చేసి పంపుతారు. కేంద్రంమే స్వయంగా పరిహారం చెల్లించినా పర్వాలేదు. ► ప్రధాని మోదీకి నేను రాసిన లేఖలో ఒకటే చెప్పా.. అయ్యా మీరే బటన్ నొక్కండి నేరుగా మీరే బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు పంపించండి. ► మేమే చెయ్యాలని ఆరాట పడటం లేదు. ప్రజలకు మంచి జరగాలని తాపత్రయ పడుతున్నాం. ►క్రెడిట్ ఎవరికి వచ్చినా పర్వాలేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. ►ఆర్అండ్ ఆర్ కింద ఇవ్వాల్సినవన్నీ జరిగిపోతాయి. లిడార్ సర్వేలో వచ్చిన 48 హేబిటేషన్ష్ కూడా కవర్ అవుతాయి. ► ఇక్కడి ప్రజలు సంతోష పడాలంటే ఇదొక్కటి జరిగించాలి. కేంద్రంపై ఒత్తిడి ►కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల పునరావాస ప్యాకేజీకి తోడు 3.9 లక్షల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. జీవో ఇష్యూ చేశాం. ►మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. ►దేవుడు ఆశీర్వదిస్తే మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచే జరుగుతుంది. ఎన్నికలకు వెళ్లేలోపు కేంద్రం ఇవ్వాల్సినవి, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినవి వచ్చే ఆరేడు నెలల్లో మీకు అందేలా చేస్తాం ► ఇక్కడ మీ బిడ్డ మీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. గట్టిగా కృషి చేస్తున్నాడు. ► వైఎస్సార్ హయాంలోనే లిడార్ సర్వే, దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది. ►సైంటిఫిక్‌గా జరిగింది. ఎవరకీ అన్యాయం జరగదు. ►మా సంకల్పం అంతా ప్రజలకు న్యాయం చేయడమే. ►పోలవరంపై ఎప్పటికప్పుడు కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు పట్టించుకోలేదు ►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం ►ఇంతకు ముందు పాలకుల మాదిరిగా ఇంత ఇస్తే సరిపోతుంది, పోలవరం కట్టే అధికారం ఇస్తే సరిపోతుందని అనుకోలేదు. ► గతంలో పాలకులు చెప్పింది మార్పు చేస్తూ, వాళ్లరందరికీ జ్ఞానోదయం అయ్యటట్లుగా చేశాం. ►2013, 2014కు సంబంధించిన రేట్లు ఇచ్చి 2022లో ఇస్తే ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు మీరే ఆలోచించండి చెప్పాం. ►పోలవరం బాధితుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ►పోలవరం నిర్మా ణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. ► మీరైనా ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశాడు మీ బిడ్డ. శభాష్ అని చెప్పి, వెన్ను తట్టడానికే వచ్చా ►పోలవరానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఈ పద్ధతిలో జరిగిపోతాయి. ►ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది? కలెక్టర్ ఏ విధంగా చేయించాడు. ►కూనవరం ఎస్ఐ వెంకటేశ్ గురించి మంచి వార్త విన్నా.. గొప్పగా ఆదుకున్నాడు, నిలబడ్డాడని విన్నా. ►కలెక్టర్‌కు చెప్పా ఆగస్టు 15న ఇచ్చే మెడల్స్‌లో ఆయన పేరు ఉండాలని సూచించాను. ►నేను అధికారులను నిలదీయడానికి రాలేదు. ► అధికారులకు శభాష్ అని చెప్పి, వెన్ను తట్టి బాగా చేశాడు అని చెప్పడం కోసం, మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. నష్టపోయామనే మాట ఎక్కడా వినపడకూడదు ►ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. ►ఏదైనా పరిష్కరించడం కోసమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ►పోలవరం ప్రాజెక్టు మొదట్లో దివంగత వైఎస్సార్ హయాంలో ల్యాండ్ అక్విజేషన్ జరిగినప్పుడు లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేశారు. ►దాన్ని నేను 5 లక్షలు ఇస్తానని చెప్పాను. ►ఆ మిగిలిన 3.5 లక్షలు కూడా కచ్చితంగా ఇచ్చేస్తాం. ►మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని చెబుతున్నా. ►మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ మీ బిడ్డ చేయడని గుర్తు పెట్టుకోండి’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. -
అల్లూరే అందరికీ స్ఫూర్తి
సాక్షి,అమరావతి: బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా, సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టా రని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని, వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చామని వివరించారు. శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి ఒక మహోన్నత శక్తి
భీమవరం(ప్రకాశం చౌక్)/కొమ్మాది: ‘అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి. ఆయన పోరాటం ఆదర్శనీయం. ఆయన తెలుగువారు, మన ప్రాంతంవారు కావడం మన అదృష్టం. మనందరికీ గర్వకారణం’ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాçసరాజు (వాసు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటాలు బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయని కొనియాడారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అల్లూరి స్మృతివనం, కాంస్య విగ్రహం ఏర్పాటుపై చొరవ చూపారని, రూ.20 కోట్ల విలువైన భూమిని కేటాయించడంతోపాటు 125వ జయంతి వేడుకలకు రూ.10 కోట్ల నిధులు కూడా అందించారని చెప్పారు. ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ,, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, సీనియర్ నాయకులు గోకరాజు గంగరాజు, గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. అల్లూరి లేకపోతే మన్యం లేదు : రాజన్నదొర మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు లేకపోతే నేడు మన్యం ప్రాంతం ఉండేది కాదని, ఆయన పోరాటం వల్లే గిరిజనుల జీవన విధానం దెబ్బతినకుండా నేటికీ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి 126వ జయంతి వేడుకలను రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర విగ్రహాలను అరకు ఎంపీ మాధవి, విశాఖ మేయర్ జి.హరివెంకటకుమారితో కలసి రాజన్నదొర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి పోరాటం చిరస్మరణీయమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, గిరిజన కో–ఆపరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, డైరెక్టర్ రవీంద్రబాబు, ఈడీ చిన్నబాబు, నాగరాజు పాల్గొన్నారు. అల్లూరి స్మృతివనం ప్రారంభించిన రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆమె భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. -
అధికారికంగా ‘అల్లూరి’ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఈ నెల 4వ తేదీన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ శాఖల పరిధిలో మంగళవారం అల్లూరి జయంతిని జరపాలని పేర్కొంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023 చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే? -
400 గ్రామాలకు మోక్షం
సాక్షి, పాడేరు: స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మారుమూల గ్రామాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలకు నోచుకోక గిరిజనులు నరకం చూస్తున్నారు. ప్రధాన గెడ్డలు, వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతున్నాయి. ఇలాంటి గ్రామాలు జిల్లాలో 400 వరకు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. గత పాలకులు కూడా మారుమూల గ్రామాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలను పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి మారుమూల గ్రామాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ప్రధాన గెడ్డలు, వాగులపై వంతెన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపించింది. వంతెనలు, కాజ్‌వేలు, కల్వర్టుల నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు ఐటీడీఏల ద్వారా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక అందించారు. ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో 21 వంతెనల నిర్మాణానికి పలు పథకాల ద్వారా రూ.22.40 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని భారీ వంతెనలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మితమవుతున్నాయి.టెండర్లు పొందిన నిర్మాణ సంస్థలు ఆయా గెడ్డలపై నిర్మాణ పనులను ప్రారంభించాయి. జి.మాడుగుల మండలంలోని అత్యంత మారుమూల కిల్లంకోట పంచాయతీకి పోయే రోడ్డులో కోడుమామిడి గెడ్డ ఉంది.ఈగెడ్డలో నీటి ప్రవాహం నిత్యం అధికంగానే ఉంటుంది. వర్షకాలం మూడు నెలలు గెడ్డ ఉధృతితో గిరిజనులు రాకపోకలు సాగించేందుకు సాహసించరు. గెడ్డను దాటడం అత్యంత ప్రమాదకరం. గెడ్డ అవతల ఆంధ్రాతో పాటు, ఒడిశాకు చెందిన గ్రామాలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు ఈ ప్రాంతం సేఫ్టీజోన్. వంతెన నిర్మాణం చేపట్టడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి పెదబయలు మండలం జామిగుడ పంచాయతీలో ఉంది. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ఈ మారుమూల మావోయిస్టు ప్రభావిత జామిగుడ గిరిజనులకు ప్రభుత్వం న్యాయం చేసింది. గుంజివాడ గెడ్డపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించడంతో పరిసర గిరిజనులతో పాటు ఒడిశా ప్రజల్లో సంతోషం నెలకొంది. మండలాల వారీగా వివరాలు కొయ్యూరు: మండపల్లి రోడ్డులో గెడ్డ రూ.కోటి, ఎర్రగొండ రోడ్డులో రూ.2.35 కోట్లు, ఈదులబంద రోడ్డులో రూ.1.3 కోట్లు. జి.మాడుగుల: కొడిమామిడిగెడ్డపై నిర్మాణానికి రూ.2.2 కోట్లు పాడేరు: గుత్తులపుట్టులో కల్వర్టు నిర్మాణానికి రూ.30 లక్షలు ముంచంగిపుట్టు: ఏనుగురాయి రోడ్డులో రూ.80 లక్షలు, గత్తురుమండ రోడ్డులో రూ.35 లక్షలు, బుంగాపుట్టు రోడ్డులో రూ.35 లక్షలు. పెదబయలు: గుంజువాడ రోడ్డులో రూ.2 కోట్లు, గిన్నెలకోట రోడ్డులో రూ.1.4కోట్లు, పెదలోవ రోడ్డులో రూ.35 లక్షలు, పాతరూడకోట రోడ్డులో రూ.15లక్షలు. హుకుంపేట: బిసాయిపుట్టు రోడ్డులో రూ.35 లక్షలు, ఆమూరు రోడ్డులో రూ.40 లక్షలు. అనంతగిరి: జీలుగులపాడు రోడ్డులో రూ.2.20 కోట్లు, శరవన్నపాలెం రోడ్డులో రూ.2 కోట్లు. డుంబ్రిగుడ: లోగిలిలో రూ.1.8 కోట్లు. కూనవరం: టేకులోడ్డి రోడ్డులో రూ.50 లక్షలు. వై.రామవరం: రవ్వగెడ్డ రోడ్డులో రూ.50 లక్షలు, పులిసురిమెట్టలో రూ. 50 లక్షలు, కోట రోడ్డులో రూ.50 లక్షలు నాణ్యతగా నిర్మాణ పనులు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రధాన గెడ్డలు, కొండవాగులపై కల్వర్టులు, వంతెనల నిర్మాణాలను టెండరుదారులు ప్రారంభించారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతగా నిర్మాణ పనులు జరిగేలా చర్యలు చేపట్టాం. అన్ని స్థాయిల్లోని ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు. పెద్ద సంఖ్యలో వంతెనల నిర్మాణం జరుగుతుండడంతో గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది – శ్రీనివాస్, ముఖ్య ఇంజినీరు, గిరిజన సంక్షేమశాఖ -
గృహ సారథులే అభివృద్ధికి వారథులు
చింతపల్లి: గృహ సారథులే గ్రామాల అభివృద్ధికి వారథులని పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని పెదబరడ పంచాయతీ లోతుగెడ్డ జంక్షన్లో శుక్రవారం గృహసారథులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో గ్రామ వలంటీర్లు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు దోహద పడతాయన్నారు. పాడేరు నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించేందకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జగనన్న పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు నర్సింగరావు, ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యదర్శి పాంగి గణబాబు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పార్టీ అధ్యక్షులు మోరి రవి, బొబ్బిలి లక్ష్మణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, సర్పంచ్‌లు గోపాల్, లలిత, వంతల మహేశ్వరి, పండన్న ఎంపీటీసీలు పద్మ,జయలక్ష్మి, మీనాకుమారి, కో–ఆప్షన్ సభ్యులు షేక్ నాజర్‌వలీ పాల్గొన్నారు. సంక్షేమ రథసారథులు మీరే రాజవొమ్మంగి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 కుటుంబాలకు ఇరువురు గృహ సారథులను నియమించారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో మండలంలోని దూసరపాము, అమీనాబాద్ గ్రామాల్లో ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ శింగిరెడ్డి రామకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామసచివాలయ వ్యవస్థను సీఎం రూపొందించారన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణతోపాటు వారి సమస్యలను గృహసారథులు గుర్తించి ప్రజాప్రతినిధులకు నివేదిస్తే పరిష్కారానికి కృషి జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో టీడీపీ నేతల కుట్ర రాజకీయాలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ పేరిట మంజూరు చేసిన మరుగుదొడ్ల సొమ్ములను బొక్కేశారన్నారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో కావాల్సినవారికి కట్టబెట్టేవారన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు జగనన్న ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చారన్నారు. అనంతరం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు దిశానిర్దేశం చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కిట్లను అందజేశారు. దూసరపాములో సర్పంచ్ చీడి శివ, అమీనాబాద్‌లో కించు వెంకటలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు. సచివాలయ కన్వీనర్ల మండల ఇన్చార్జ్గా జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణను నియమించినట్లు ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రకటించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైస్‌ఎంపీపీ చప్పా చంద్రరాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్‌రాజు పాల్గొన్నారు. ఈనాడు ప్రతులు దహనం తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.తమ ప్రభుత్వానికి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేనితనంతోనే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేతులు కలిపి కావాలనే తప్పుడు ప్రచారానికి కుట్రలకు పూనుకుంటున్నాయని విమర్శించారు. -
గిరి సంక్షేమమే లక్ష్యంగా సేవలు
గూడెంకొత్తవీధి: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ముద్రపడిన జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య వారధిగా సంక్షేమ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పోలీసు మైదానంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన బ్యారెక్స్ భవనాలను చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంతాలతో పోల్చి చూస్తే మన్యంలో పోలీసుల విధులు ఎంతో కష్టతరంగా ఉంటాయన్నారు. ఇటువంటి భిన్నమైన పరిస్థితులు, వాతావరణం మధ్య అమాయక ఆదివాసీ గిరిజనులకు తమవంతు సాయంగా ఉండాలని భావించి పోలీసు యంత్రాంగం అనేక సామాజిక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువతీ యువకులకు ప్రేరణ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. సీఆర్పీఎఫ్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఉచితంగా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. సేతు కార్యక్రమం పేరిట దివ్యాంగులకు సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. సదరం దృవపత్రాలు పొందిన కొందరికి యాభైశాతం రాయితీపై ఆర్టీసీ బస్సు పాసులను తాము చొరవ తీసుకుని మంజూరు చేయించామన్నారు. మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాలకు సెల్ టవర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందన్నారు. గంజాయిని దూరం చేసి ప్రత్యామ్నాయ పంటల ద్వారా గిరిజనులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. చదువు మానేసిన గిరి యువత అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులు కాకుండా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవాలన్నారు. ఇందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. గ్రామ సచివాలయ పోలీసులు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. ఉత్తమ సేవలందించిన గూడెంకొత్తవీధి ఎస్ఐ అప్పలసూరి, సీఆర్పీఎఫ్ సహాయ కమాండెంట్ బీరేంద్రకుమార్, పలువురు సీఆర్పీఎప్ , ఏపీఎస్పీ సిబ్బందితోపాటు మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలను అందించారు. సదరం శిబిరానికి హాజరైన పలువురి దివ్యాంగులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. జీకేవీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ అప్పలసూరి, సీఆర్పీఎఫ్ సహాయ కమాండెంట్ బీరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈనాడు.. అసత్య కథనాలు మానుకో
అరకులోయ రూరల్: కట్టుకథలతో ఈనాడు పత్రికలో రామోజీరావు ప్రచురిస్తున్న అసత్య రాతలు మానుకోవాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో కలిసి ఈనాడు ప్రతులను తగులబెట్టి రామోజీరావు, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ పట్టాభిని కొట్టారంటూ ప్రచురించిన కథకాల్లో ఫొటోలను మార్ఫింగ్ చేయడాన్ని అందరూ గమనించారన్నారు. వైఎస్సార్సీపీకి అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. జర్నలిజం వ్యవస్థను రామోజీరావు, చంద్రబాబు భ్రష్ట పట్టిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదన్నారు. రాజకీయంగా ప్రభుత్వాన్ని చేసేదేమీ లేకపోవడంతో తప్పుడు రాతలతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, మండల కన్వీనర్ పట్టాసి సంపత్‌కుమార్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి హస్తినాకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
పాడేరు రూరల్ : స్పందన వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో ఆర్. గోపాలకృష్ణ ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా తాగునీటి సదుపాయం, రహదారుల నిర్మాణాలు, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఘాట్ మార్గంలో రక్షణ గోడలు నిర్మించాలని వినతులు అందాయి. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. స్పందన వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా విచారణాధికారిని నియమించాలని సూచించారు. అధికారులు ముందుగా అర్జీలు తమ శాఖకు సంబంధించిందా కాదా అనేది ముందుగా పరిశీలించాలన్నారు. కాకుంటే సంబందిత శాఖకు అందజేయాలన్నారు. స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయి తనిఖీ చేపట్టి వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ యోజన పథకంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పీవీటీజీల జీవితాల్లో గణనీయమైన మార్పులు రావాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. అటవీ హక్కుల పత్రాలు పొందిన లబ్ధిదారుల వివరాలను గిరిభూమి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. జేసీ శివ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అభిషేక్ పాల్గొన్నారు. -
వన దేవత వేడుకకు సర్వం సిద్ధం
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరులో నిర్వహించనున్న మన్యం కొండ జాతరకు చకచక ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒడిశా గిరిజనులు నిర్వహించే మన్యం కొండ జాతర వేడుకలకు ఏర్పాట్లు ఒడిశా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్లకు జరిగే మన్యం కొండ జాతరను ఈ ఏడాదిలో ఈనెల 27వ తేదీన నిర్వహిస్తారు. నెల రోజుల ముందు నుంచే ... పొల్లూరులో నిర్వహించే మన్యం కొండ జాతరకు ముందు నెలరోజులు పాటు ఒడిశాలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్క రోజు మాత్రం పొల్లూరులో నిర్వహించే వేడుకకు లక్షలాది గిరిజనులు హాజరవుతారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మన్యంకొండ గ్రామంలో ఉన్న గిరిజన వనదేవతలు కన్నమరాజు( శ్రీకృష్ణుడు) బాలరాజు(అర్జునుడు) పోతురాజు (బీముడు) ముత్యాలమ్మ తల్లి ఘటం ధ్వజం రూపంలో పూజలు చేశారు. వీటిని ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రాణప్రతిష్ట చేస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని పొల్లూరు జలపాతం వద్ద నిర్వహించడం ఒడిశా గిరిజనుల ఆచారం. ఈ నెల 27న ప్రధానమైన మంగళస్నానం, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రూపం లేకుండా ఉన్న ముత్యాలమ్మతల్లి ఘటం ధ్వజ రూపంలో ఉన్న సోదరులు (కన్నమరాజు,బాలరాజు,పోతురాజు)తో కలిసి మన్యం కొండ చేరుకుంటారు.సరసనపల్లి గ్రామం నుంచి గద్వాల కోసం కొత్త వెదుర్లును తీసుకుని పూజారులు వస్తారు. కొండ గృహాల్లో ఉన్న మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి బోయ యాత్ర నిర్వహిస్తారు. భక్తులు చెప్పులు లేకుండా వన దేవతలతో యాత్రను ఒడిశాలోని సీలేరు నది అవతల (పొల్లూరు గ్రామానిక ఎదురు ఒడ్డు)కు 26న చేరుకుంటారు. ఈ నెల 27 ఉదయం పూజ కార్యక్రమాలు ముగించిన తరువాత కొత్తగా తయారు చేసిన ప్రత్యేక పడవలపై వనదేవతలను నది దాటించి ఆంధ్రాలోని పొల్లూరు జలపాతం వద్దకు చేరుకుంటారు. వనదేవతలకు మంగళస్నానం చేయించి ప్రాణప్రతిష్ట చేస్తారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. భారీ అన్నసమారాధన జరుగుతుంది. వన దేవతలకు జలపాతం దగ్గరలో ఉన్న గృహలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలకు సంతృప్తి చెందిన ముత్యాలమ్మ జలపాతంలో బంగారు చేపరూపంలో దర్శనమిస్తుందని నమ్మకం. పక్కా ఏర్పాట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వన దేవతలను, భక్తులను ప్రత్యేక బోట్లు, గస్తీ నడుమ సీలేరు నది అవతల ఒడ్డుకు చేర్చేందుకు ఒడిశా ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాట్లు చేపట్టింది. పొల్లూరు జలపాతం వద్ద రెవెన్యూ అగ్నిమాపక, పోలీస్, అటవీ శాఖ, పంచాయతీ అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తారు. -
మెరుగైన వైద్యం అందించండి
చింతూరు: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పూర్తిస్థాయిలో సౌకర్యాలను 50 రోజుల్లో కల్పిస్తామన్నారు. అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గైనిక్ సేవలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామన్నారు. ఆర్ధోపెడిక్ సేవలకు సంబంధించి ఎక్స్‌రే ప్లాంట్‌కు మరమ్మతులు, ఫ్రాక్చర్ టేబుల్, సిఆర్ట్ సిస్టమ్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈఎన్టీ వైద్యులకు అవసరమైన పోర్టబుల్ ఎండోస్కోపును వెంటనే కొనుగోలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో పుల్లయ్యను ఆదేశించారు. అత్యాధునిక పడకలు, చిన్న పిల్లల మందులు కొనుగోలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవలని సూచించారు. గ్రామ స్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులను భద్రాచలం తరలించకుండా స్థానికంగా మెరుగైన వైద్యసేవలు అందించేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గైనిక్ డాక్టర్ శశికళ, వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం
రాజవొమ్మంగి: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 14 మందిని ఎమ్మెల్సీకి సీఎం జగన్మోహన్రెడ్డి సిఫార్సు చేయడం హర్షణీయమన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు, చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నేడు ఈనాడు పేపరును నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకట లక్ష్మి, వైస్ ఎంపీపీ చంద్రరాణి, పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్రాజ్, అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడు వీర్రాజు, సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల నిఘా
సాక్షి,పాడేరు: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసుశాఖ తనిఖీలను ప్రారంభించింది. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పోలీసు స్టేషన్ల పరిఽధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు బృందాలు వాహన చోదకులకు బ్రీత్ ఎన్లైజర్ పరీక్షలు జరుపుతున్నారు.ప్రమాదాలు నివారణ లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుంది. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్థాలను వాహనచోదకులకు పోలీసులు వివరిస్తున్నారు.పాడేరు పట్టణంలోని అన్ని రోడ్లతో పాటు కాన్వెంట్,చింతలవీధి జంక్షన్ల వద్ద రోజువారి తనిఖీలను ప్రారంభించారు.రాత్రి సమయంలోను తమ పోలీసు బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాయని పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు.పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని ప్రధాన జంక్షన్లు, మండల కేంద్రాల్లో వాహనాల తనిఖీలను మమ్మురం చేశామని, ఇటీవల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈమూడు స్టేషన్ల పోలీసు బృందాలను మరింత అప్రమత్తం చేసినట్టు అరకులోయ సీఐ జి.దేముడుబాబు ‘సాక్షి’కి తెలిపారు. -
గంజాయి సాగు, రవాణా మానుకోవాలి
పెదబయలు: గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని ఎస్ఐ పులి మనోజ్‌కుమార్ చెప్పారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు గంజాయి తదితర కేసుల్లో పాత ముద్దాయిలకు కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో శుక్రవారం నిర్వహించారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల నుంచి గంజాయి కేసుల్లో పాత ముద్దాయిలను పిలిచించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గంజాయి కేసుల్లో ఇరుక్కోవడంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. పాత ముద్దాయిలపై బైండోవర్ కేసులున్నాయన్నారు. గంజాయి ముద్దాయిలుగా ఉన్న వారు మరలా గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఎస్ఐ మనోజ్‌కుమార్ చెప్పారు. గ్రామాల్లో పరివర్తన కార్యక్రమం నిర్వహించి, గంజాయి, సారా అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో పరివర్తన వచ్చి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. -
గిరి యువతి ఆత్మహత్య
గూడెంకొత్తవీధి: మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలో సత్యశ్రీ (25)అనే గిరిజన యువతి గురువారం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొయ్యూరు మండలం చుట్టుబంద గ్రామానికి చెందిన దుచ్చరి సాగర్ అనే యువకుడు తనను మూడేళ్లుగా ప్రేమించి, ఇప్పుడు వేరొకరిని వివాహం చేసుకుంటున్నాడని తెలిసి మనస్థాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు సంఘటన స్థలంలో లభించిన లేఖ ద్వారా తెలిసిందని స్థానిక పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వారు చెప్పారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం యువతి మృతదేహాన్ని పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కుమారి, పెదవలస సర్పంచి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. -
థ్యాంక్యూ సీఎం సార్
(అల్లూరి సీతారామరాజు) పాడేరు : డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) హోదాకల్పిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సీహెచ్‌వోలు పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం సార్ నినాదాలతో ఐటీడీఏ ప్రాంగణం హోరెత్తింది. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వోల సంఘ ప్రతినిధులు పట్నాల దుర్గా భవానీ, కూడా అమూల్య జ్యోత్స్నరాణి, సమరెడ్డి చంద్రకళ, శరబ ఉదయశ్రీ, ఓలేసు మధుసూదన్‌రాజు, పట్నాల స్వాతి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి తొలి దాడికి వందేళ్లు
సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది. చింతపల్లితో మొదలుపెట్టి.. మన్యంలో గిరిజనులపై బ్రిటిష్ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది. ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్ 24న హతమార్చింది. ఆ తరువాత ఆక్టోబర్ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్, 1923 జూన్ 10న మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్ 22న పాడేరు పోలీస్ స్టేషన్‌పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్ పోలీసులు బంధించగా.. మేజర్ గుడాల్ తుపాకీతో కాల్చి చంపాడు. నేడు భారీ బహిరంగ సభ చింతపల్లి స్టేషన్‌పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
శ్రీవిష్ణు 'అల్లూరి' వచ్చేది అప్పుడే
శ్రీ విషు, కయ్యదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారు పేరు’ అనేది ఉపశీర్షిక. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ త్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటింంది. ప్రదీప్ వర్మ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఓ పోలీసాఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు నిజాయితీ గల పోలీసు అధికారిగా అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు’’ అన్నారు. తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట -
అల్లూరి సీతారామరాజు వేషధారణలో చిన్నారులు (ఫొటోలు)
-
నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
అల్లూరి జయంతి వేడుకల హైలైట్స్‌ను షేర్ చేసిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు సంబంధించి వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. నిన్న(సోమవారం) అల్లూరి 125 జయంతి వేడుకల్ని పురస్కరించుకుని భీమవరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోదీ హాజరైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైలైట్స్‌పై ఒక వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని మోదీ పేర్కొన్నారు. Sharing highlights from yesterday’s memorable programme in Bhimavaram, Andhra Pradesh in which we paid homage to the brave Alluri Sitarama Raju. pic.twitter.com/LADvNTL5p3 — Narendra Modi (@narendramodi) July 5, 2022 చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్ -
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం (ఫొటోలు)
-
ఏయూలో అల్లూరి అధ్యయన కేంద్రం
ఏయూ క్యాంపస్: అల్లూరి సీతారామరాజుకు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు నడిపించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర– ఆదివాసీ అధ్యయన కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందిస్తోంది. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సంపూర్ణ సహకారంతో న్యాయ కళాశాల ఆచార్య వి.విజయలక్ష్మి ఈ కేంద్రానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటుకు వీసీ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా అల్లూరి సీతారామరాజుపై లోతైన అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాతల సహకారం ఏయూ పాలక మండలి ఆమోదంతో ఏర్పాటైన అల్లూరి అధ్యయన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నగరానికి చెందిన పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె రాజు వర్సిటీ కోరిన విధంగా ఈ కేంద్రానికి సహాయం అందిస్తానని ప్రకటించారు. ఏయూ పాలక మండలి సభ్యుడు, హోబెల్ బెల్లోస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె.వి.ఎస్ ఆంజనేయవర్మ అల్లూరి సీతారామరాజు పేరుతో చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మారుతి కనస్ట్రక్షన్స్ అధినేత యు.రామకృష్ణరాజు కేంద్రం అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. దాతల సాయంతో ఏర్పాటు చేసిన అల్లూరి పాలరాతి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. (క్లిక్: ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..) పూర్తిస్థాయిలో సేవలందిస్తాం అల్లూరి అధ్యయన కేంద్రం సేవలను విస్తరిస్తాం. విద్యార్థుల్లో అల్లూరిపై మరింత లోతైన అవగాహన కలిగించే విధంగా వక్తృత్వ, వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించాం. గిరిజన విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – ఆచార్య వి. విజయలక్ష్మి, సంచాలకులు, అల్లూరి అధ్యయన కేంద్రం అనుసంధానం చేస్తూ అభివృద్ధి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అరకు, పాడేరులో డిజిటల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో అల్లూరి అధ్యయన కేంద్రాన్ని అనుసంధానం చేస్తాం. తద్వారా అల్లూరి, ఆదివాసీ అంశాలపై అవగాహన, పరిశోధనలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, ఉపకులపతి -
మహోజ్వల భారతి: అగ్నికణం అల్లూరి
రక్తపాతం జరగని ఉద్యమాల్లేవు. కానీ రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులున్నారు. అలాంటి ధీరులలో జాతీయ కథానాయకుడు గాంధీజీ అయితే, మన ఊరి విప్లవ నాయకుడు అల్లూరి! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవై రెండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరక్కుండా సీతారామరాజు అనేకసార్లు నిరోధించగలిగాడు. అంతటి సంయమనం ఇప్పటి మన అవసరం. ఎప్పటికీ మన ఆదర్శం. హింస కోసం హింస అనే పోకడకు ఉద్యమాన్ని దూరంగా ఉంచి, శత్రువుపై విప్లవాగ్నులు కురిపించిన మన్యం మహాత్ముడు, మహోద్యమ అగ్నికణం అల్లూరి. నేడు ఆయన జయంతి. 1897 జూలై 4న విజయనగరం దగ్గరి పాండ్రంగిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు అల్లూరి సీతారామరాజు. అలసి.. సొలసి స్వామి వివేకానంద 1902 జూలై 4న యథావిధిగా రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. శిష్యులకు బోధనలు చేశారు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. అయినప్పటికీ తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపారు. రాత్రి 9 గంటల సమయంలో అలసిపోయినట్లుగా కనిపించారు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథల్లా దుఃఖించారు. జీవించినది 39 ఏళ్లే అయినా భారతీయ ఆధ్మాత్మిక చరిత్రలో ఆయన ఒక భాగంగా నిలిచిపోయారు. 1984 నుంచి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం‘ గా పాటిస్తోంది. చివరి కోరిక ‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు. జాతీయ పతాక నిర్మాతగా ఆ గుర్తింపును పింగళి వెంకయ్య కోరుకోలేదు కానీ, తన విల్లులో చివరి కోరిక ఒకటి వెలిబుచ్చారు. తన పార్థివదేహం మీద (1963 జూలై 4 న బెజవాడలో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు) జాతీయ పతాకాన్ని కప్పాలని కోరుకున్నారు. ఆయన కోరికను భరతజాతి నెరవేర్చింది. -
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన.. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. చదవండి: నిరసనల సెగ.. వెనక్కి మళ్లిన ఎంపీ రఘురామ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. -
అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం. బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...) - పెన్మెత్స శ్రీహరిరాజు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి) -
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...
సన్యసించి విప్లవకారులుగా మారిన ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్ ఘోష్ అయితే, మరొకరు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ రాజును కదిలించింది. ఇల్లు వదలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం. అటువంటి వీరుని 125 జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నారు. ఇదే సందర్భంలో భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్‌ల కోవకు చెందిన మహావీరుడు. అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతా రామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు. చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా రాజు కనిపించాడు. సీతారామరాజును భోజనానికి ఆహ్వానించాడు. అక్కడే 10 రోజులు బెనర్జీ కోరిక మేరకు రాజు ఉండిపోయాడు. ఆ సమయంలో బెనర్జీ ఇంటికి వచ్చిన మోతీలాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులతో రాజు దేశ పరిస్థితుల గురించి చర్చించాడు. అక్కడినుండి కాశీ, హరిద్వార్, రుషీకేశ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలు దర్శించి 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవిపేట చేరాడు. దారకొండపై తపస్సుకు వెళ్తున్న రాజును చిటికెల భాస్కరుడు అనే గ్రామ పెద్ద చూసి, విషయం తెలుసుకుని తపస్సుకు ఆ గ్రామంలోనే అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రజలకు జ్యోతిషం, పురాణాలు, ఆయుర్వేద వైద్యంతో దగ్గరయ్యాడు. అధికారుల దోపిడీని ఎదుర్కొనమని వారిని ప్రోత్సహిం చాడు. వారిలో జాతీయతాభావం రగుల్కొలిపి, ప్రభుత్వ కోర్టులకు పోవద్దనీ, పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడే తగవులు తీర్చుకోమనీ; మద్యం సేవించరాదనీ, ఖద్దరు బట్టలనే ధరించమనీ బోధించాడు. డిప్యూటీ తాసీల్దారు బాస్టియన్, ఓవర్సీరు సంతానం పిళ్ళై చేస్తున్న అరాచకాలను పై అధికారులకు మహజర్ల రూపంలో పంపేవాడు. ఈ మన్య ప్రాంతంలో గతంలో కొన్ని పితూరీలు, దోపిడీలు జరిగాయి. దానితో ప్రభుత్వానికి రాజుపై అను మానం కలిగి డివిజనల్ మేజిస్ట్రేట్ ఫజులుల్లా ఖాన్‌ను ఎంక్వయిరీ చేయమని పంపారు. రాజు పినతండ్రికి ఖాన్ సహోద్యోగి. సీతారామరాజును నర్సీపట్నం తీసుకుని వెళ్లి తాసీల్దారు ఇంటిలో పెట్టి కృష్ణదేవిపేట వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. ఉద్యోగం గానీ, వ్యవసాయ భూమి గానీ తీసుకోమని ఒత్తిడి చేశాడు. సీతారామరాజు ప్రభుత్వ దృష్టిని మళ్ళించటానికి ‘పైడిపుట్ట’లో ఇచ్చిన భూమిని తీసుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చటానికి తిరుగుబాటే ఏకైక మార్గమని భావించి దానికి రహస్యంగా తగిన ఏర్పాట్లు చేయసాగాడు. ప్రభు త్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది అపజయాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసు, మలబారు స్పెషల్ పోలీసులను నియ మించి ఉద్య మాన్ని అణచే ప్రయత్నం చేసింది. ఆనాడు జిల్లా యంత్రాంగం– మద్రాస్ ప్రభుత్వం – ఢిల్లీకి మధ్య జరిగిన రహస్య తంతివార్తలు కొన్ని గమనిస్తే విప్లవం గురించి ప్రభుత్వం చెందిన ఆందోళన తెలుస్తుంది. ఢిల్లీ హోమ్ సెక్రటరీకి మద్రాస్ చీఫ్ సెక్రటరీ రాస్తూ, ‘‘రాజు నాయకత్వాన ప్రారంభమైన విప్లవం 18 నెలలు జరిగినా... అనేక రిజర్వు దళాలను పంపి కూడా అణచలేక పోయాం. సమీపంలో అంతమవుతుందని నమ్మకం లేదు. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధంగానే గుర్తిం చింది’’ అని వాపోయాడు. ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ 1922 అక్టోబర్ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి రాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. మద్రాస్ స్టాఫ్ కెప్టెన్ బిషప్, ఢిల్లీ హోం సెక్రటరీకి రాస్తూ... ‘‘రెండేళ్ల నుంచి విప్లవం నిరా ఘాటంగా సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పదేళ్లయినా కొనసాగుతుంది. అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులు విప్లవకారులకు ఎదురైతే తప్ప ఈ విప్లవం ఆగడం కలలోని మాట. అందువల్ల వెంటనే మార్షల్ లా గానీ, గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ గానీ ప్రకటిం చాలి’’ అని చెప్పాడు. ఈ విధంగా ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో రూథర్‌ఫర్డ్ అనే నరరూప రాక్షసుడిని ఏజెన్సీ కమిషనర్‌గా నియ మించారు. అతను రాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. రాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు. 1924 మే మొదటి వారంలో కృష్ణదేవి పేటలో రూథర్‌ఫర్డ్ మీటింగ్ పెట్టి పరిసర గ్రామ పెద్దలను హెచ్చరిస్తూ, వారం రోజులలో రాజు దళాన్ని పట్టి ఇవ్వకపోతే కృష్ణ దేవిపేటతోపాటు అనేక గ్రామాలను తగులబెడు తామనీ, చిటికెల భాస్కరుడితో సహా, పెద్దలను జైళ్లలో వేస్తామనీ హెచ్చరించాడు. రాజుకు కృష్ణదేవిపేట అన్నా, చిటికెల భాస్కర్ కుటుంబం అన్నా ఎన లేని అభిమానం అని రూథర్‌ఫర్డ్‌కు తెలిసే ఈ హెచ్చరిక చేశాడు. ప్రభుత్వం తనను ఎదుర్కొనలేక, ప్రజలను పెడుతున్న బాధలను చూసి రాజు బాధపడ్డాడు. అందుకే 1924 మే7వ తేదీన కుంచు మీనన్ నాయకత్వంలోని స్పెషల్ పోలీసు దళానికి ఒక బాలుని ద్వారా కబురు పంపి ‘మంప’ గ్రామంలో లొంగి పోయాడు. సీతారామరాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుతో గూడాల్ ఘర్షణపడి రాజును తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక మహోద్యమం పరిసమాప్తం అయింది. సీతారామరాజు దేశభక్తి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ జాతిని మేల్కొలుపుతూనే ఉంటుంది. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకామాత్యులు -
పాడేరులో అల్లూరి విగ్రహావిష్కరణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని వివరించారు. -
స్వాతంత్య్ర సంగ్రామంలో విరబూసిన అగ్ని పుష్పం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అగ్ని పుష్పమై వికసించారు. విప్లవ శంఖమై బ్రిటిష్ ముష్కరులకు ముచ్చెమటలు పోయించారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ముస్తాబైంది. అదే జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు ఆయన స్వస్థలం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ఇనుమడింపచేసేలా 125వ జయంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. భీమవరంలో క్షత్రియ సేవా సమితి నేతృత్వంలో సుమారు రూ.3 కోట్లతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీనిని ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించనున్నారు. విలక్షణమైన విద్యార్థిగా.. భీమవరం పట్టణానికి సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్వస్థలం. సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. ఆయన బాల్యం భీమవరం పరిసర ప్రాంతాల్లోనే సాగింది. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ముంబై వెళ్లి ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం నేర్చుకున్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో కొంతకాలం ఫొటో స్టూడియోలు నడిపారు. సీతారామరాజు పుట్టాక 1902లో రాజమహేంద్రవరంలో స్టూడియో ప్రారంభించారు. ఆయన పలు ప్రాంతాలు తిరగడంతో సీతారామరాజు బాల్యం, చదువు కూడా ఆయా గ్రామాల్లోనే సాగాయి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో రాజమండ్రి నుంచి తల్లి సూర్యనారాయణమ్మ సోదరుడు అప్పలనర్సయ్య స్వగ్రామమైన భీమవరం సమీపంలోని కొవ్వాడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 1909లో భీమవరంలోని మిషన్ హైస్కూల్లో ఒకటో ఫారంలో చేరారు. తర్వాత ఆయనకు జ్వరం రావడంతో మూడు నెలల పాటు స్కూల్‌కు వెళ్లలేదు. అనంతరం రాజమండ్రి వెళ్లి అక్కడి స్కూల్లో తిరిగి ఫస్ట్ ఫారంలో చేరారు. అక్కడే యోగాభ్యాసంపై దృష్టి సారించి హఠయోగం, పతంజలి యోగం, వేదాంతం వంటి వాటిని అభ్యసించారు. కళాకారుడిగానూ రాణింపు సీతారామరాజుకు నాటకాలంటే ఆసక్తి. 1912 డిసెంబర్ 12న 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా పిఠాపురంలోని రాజా కళాశాలలో శశిరేఖా పరిణయం నాటకం ప్రదర్శించారు. అందులో సీతారామరాజు శశిరేఖ పాత్ర వేశారు. తర్వాత విశాఖలోని ఏవీఎన్ కాలేజీ హైస్కూల్లో నాలుగో ఫారం కొంతకాలం చదివి.. 1913 జూలై 2న నరసాపురం టేలర్ హైస్కూల్లో నాలుగో ఫారంలో చేరారు. చించినాడలో గుర్రపు స్వారీ టైలర్ హైస్కూల్లో నాలుగో ఫారం చదువుతున్నపుడు ప్రతి శని, ఆదివారాల్లో సమీపంలోని చించినాడ గ్రామం వెళ్లేవారు. అక్కడ పినతండ్రి పినతండ్రి రామకృష్ణంరాజు మిత్రుడైన మునసబుకు చెందిన గుర్రంపై స్వారీ, చదరంగం నేర్చుకున్నారు. అనంతరం తునిలో ఉంటున్న తల్లి వద్దకు చేరుకున్నారు. 1913–17 మధ్య తుని సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారం చేసి ఆదివాసీ జీవితాలను పరిశీలించారు. అనంతరం విప్లవ బాట పట్టి మన్యం ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరు సాగించి 1924 మే 7న వీర మరణం పొందారు. మోగల్లులో స్మారక కేంద్రం మోగల్లులోని అల్లూరి సీతారామరాజు నివాసాన్ని అల్లూరి స్మారక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ సహకారంతో క్షత్రియ సేవా సమితి ఈ పనులు చేపట్టింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సమీకరించి.. పోరాడారు సాక్షి, అమరావతి: అటవీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన అల్లూరి సీతారామరాజు వారి కోసం 1919 నుంచి పోరుబాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు తిరుగుబాటు చేశారు. తొలుత అటవీ ఉత్పత్తులను కొల్లగొడుతూ.. గిరిజనులకు తగిన కూలీ ఇవ్వకపోవడంపై నిలదీశారు. గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది. ఆయుధాల కో సం అల్లూరి నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. గిరిజనుల్లో అల్లూరికి ఆదరణ పెరగడం, ఉద్యమం తీవ్రతరం కావడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను పంపి అల్లూరి పోరాటానికి అడ్దుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. మన్యం పితూరీగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వం ఆపై అస్సాం రైఫిల్స్‌ను కూడా పంపింది. తీవ్ర పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో గాయాలను శుభ్రం చేసుకుంటున్న అల్లూరిని అస్సాం రైఫిల్స్ దళాలు పట్టుకున్నాయి. పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా, మార్గంమధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. అల్లూరి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉండటంతో 1924 మే 7న కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవీపేటకు తరలించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి çస్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిషర్ల దారుణాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోయిన అల్లూరిని మన్యం వీరుడిగా ప్రజలు కొనియాడుతారు. మన్యం పోరాటంలో అల్లూరిని అనుసరించిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. మన్య పోరాటం ముగిసినా.. ఆ చైతన్య స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. పోలీస్ స్టేషన్లపై దాడులకు వందేళ్లు ► సీతారామరాజు తన బృందంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఈ ఏడాదితో సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి ఆ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు. ► 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మొదటిసారి దాడి చేశారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న ఎస్సై లంబసింగి వద్ద అల్లూరికి ఎదురుపడగా.. ‘ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను’ అని రామరాజు చెప్పారని, అతడు మారు మాట్లాడక తప్పుకున్నట్టు చెబుతారు. ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్నెట్లను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్ డైరీలో రాసి.. అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. æ ఆ మర్నాడు ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి. చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆవిష్కరించింది. -
అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. బుధవారం సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్‌లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని మున్సిపల్ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్‌తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. -
అబ్బురం.. వించ్ వే
ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో వేల అడుగుల ఎత్తులో కొండల మధ్యనున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చారిత్రాత్మకం. ఇక్కడికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వించ్ వేకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1948లో ఏర్పాటుచేసిన నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతుంటారు. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో అవసరమైన సామగ్రి, యంత్రాలను తరలించేందుకు 2,750 అడుగుల ఎత్తులో వించ్ హౌస్‌ను నిర్మించారు. ఇందుకు అప్పటిలో ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చించినట్టు అధికారవర్గాలు చెబుతుంటాయి. 1955 ఆగస్టు 19న విద్యుత్ కేంద్రానికి అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వించ్ ద్వారా చేరుకుంటున్నారు.రెండుకొండల నడుమ లోయలో ఉండే మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి దిగేందుకు 18 నిమిషాలు, పైకి వచ్చేందుకు 13 నిమిషాలు సమయం పడుతోంది. ఆరోజుల్లోనే జీపీఎస్.. వించ్ ఏర్పాటు చేసినప్పుడే రోప్‌వేలో ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్‌ను ఏర్పాటు చేయడం విశేషం. వించ్ కదలిక బట్టి జీపీఎస్ సూచిక కదులుతూ ఉంటుంది. వించ్ ఎక్కడుందో సూచించే ముల్లు మలుపుల దగ్గరకు చేరుకోగానే కంట్రోల్‌రూమ్‌లోని డ్రైవర్ వేగాన్ని నియంత్రిస్తుంటారు. గతంలో పర్యాటకులు, సిబ్బంది వించ్‌లో ప్రయాణించేవారు.అప్పుడు అధికారులు పర్యాటకుల వించ్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు. సందర్శకుల నిరాశ గత కొన్నేళ్లుగా వించ్ ప్రయాణానికి అనుమతులు ప్రాజెక్టు అధికారులు ఇవ్వడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు వించ్‌ను చూసి ఆనందపడుతున్నారు తప్ప ప్రమాణించేందుకు అవకాశం లేకపోవడం తీవ్ర నిరాశ చెందుతున్నారు. వించ్ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. వించ్ ప్రయాణ విషయాన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, ఉన్నతాధికారుల అదేశాలతో అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. దేశంలో రెండే.. దేశంలో రెండే రెండు చోట్ల వించ్‌వేలు ఉన్నాయి. ఇక్కడి వించ్‌వే మొదటిది కాగా, రెండోది తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ఉంది. భారీ సామర్థ్యం ఉన్న మోటార్ సాయంతో స్టీల్ రోప్ ద్వారా వించ్‌ని లోయలోకి దించడం, ఎక్కించడం జరుగుతుంది. స్టీల్ రోప్‌ను ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తుంటారు. దీనికి సంబంధించిన డ్రైవర్ కంట్రోల్ రూంలో ఉండి వించ్‌ను నడుపుతుంటారు. ట్రాలీగార్డు మలుపుల దగ్గర వించ్ పట్టాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వించ్ ఏర్పాటు చేసి ఇప్పటికి 74 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి వించ్ అదుపుతప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిబ్బంది కేవలం గాయాలతోనే బయటపడ్డారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఇంకా నెల రోజులు సమయం ఉందని, ఇప్పటినుంచే తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూలై 4న ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. వీడియో లింక్ ద్వారా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ కుమార్‌రెడ్డి, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి జీతాలు అక్కడే..
మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఉద్యోగులకు అక్కడే జీతాలు ఇచ్చే పద్ధతికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిలాల్లగా విభజించి పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రెండు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల నుంచి స్థానిక ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల ట్రెజరీలకు కోడ్ కేటాయించారు. ఆ కోడ్ ప్రకారం వచ్చే బిల్లులను ట్రెజరీ సిబ్బంది సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. మంగళవారం నాటికి అన్ని బిల్లులు అప్లోడ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో మొత్తం 91 ప్రభుత్వ శాఖలు ఉండేవి. ఇందులో మొత్తం 33,718మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసేవారు. 1299 మంది డీడీఓలు జీతాల ప్రక్రియ బిల్లులు పూర్తి చేసి ట్రెజరీకి పంపేవారు. అనకాపల్లి జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2100 మంది పనిచేస్తున్నారు. విభజన జిల్లాల్లోని ఉద్యోగులు, అధికారుల జీతాల బిల్లులు అక్కడే ఇవ్వగా, రిటైర్ అయిన ఉద్యోగుల పింఛన్లు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి ఇస్తున్నారు. విశాఖ జిల్లాకు 0201, అనకాపల్లి జిల్లాకు 90000039469, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 90000039468 కోడ్ నంబర్లుగా కేటాయించారు. సబ్ ట్రెజరీలు ఇవే.. విశాఖ జిల్లాలో సీతమ్మధార, భీమునిపట్నంలలో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ఈస్టు, అనకాపల్లి వెస్టు, చోడవరం, యలమంచిలి, కోటవురట్ల, మాడుగుల, నక్కపల్లి, నర్సీపట్నం సబ్ ట్రెజరీలు ఉన్నాయి. అల్లూరి జిల్లా పరిధిలో పాడేరు, అరకు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరు సబ్ ట్రెజరీలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో అక్కడే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రకారం ఈ నెల నుంచి జీతాలు వస్తాయని విశాఖపట్నం జిల్లా ట్రెజరీ అధికారి టి.శివరామ ప్రసాద్ చెప్పారు. (చదవండి: అడ్డాకులకు అదిరే ధర) -
27 నుంచి అల్లూరి జయంత్యుత్సవాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ వరకు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి త్యాగాన్ని చాటి చెప్పేలా వేడుకలు ఉంటాయన్నారు. ఉత్సవాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని, పాండ్రంగిలోని అల్లూరి మెమోరియల్ మ్యూజియం, పార్కుతో పాటు అల్లూరి విగ్రహాన్నీ ఆవిష్కరిస్తారని, అక్కడే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారని వివరించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం సంగీత విభావరి, సురభి నాటికలు, దేశభక్తిని పెంపొందించేలా కళా ప్రదర్శనలుంటాయని తెలిపారు. విద్యార్థులకు వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోలి, లఘు చిత్రాలు, పాటలు–నృత్య పోటీలు, అల్లూరి పోరాటాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక ఏకపాత్రాభినయ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించేలా ఊరేగింపులు, సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, యోగా, ఫొటో గ్యాలరీ, 125 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. -
ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’
మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్ రెడ్డి (26), పల్లాల రమేష్ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు. దానికి విద్యుత్ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్ తీగలకు తగలడంతో ఇరువురు షాక్‌కు గురయ్యారు. దీంతో శ్యాముల్రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్‌రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
మన్యం వీరుడికి వందనం
భరత మాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు.. బ్రిటిష్ వారిపై పోరాడాడు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది తెల్లవారిని గడగడలాడించాడు. చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుడి విధానం ఆదర్శప్రాయం. అందుకే దేశం అతన్ని స్మరించుకుంటోంది. సరిగ్గా వందేళ్ల క్రితం 1922 మే 6వ తేదీన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దండెత్తినందుకు గుర్తుగా పోస్టల్ శాఖ శుక్రవారం ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్‌ను విడుదల చేసింది. శనివారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెంలో మన్యం వీరుడి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర పాల్గొంటున్నారు. కొయ్యూరు: మన్యం వీరుడు సాయుధ పోరాటం చేసింది కొయ్యూరు, చింతపల్లి, గూడెం, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాలలోనే. మంప వద్ద ఉర్లకొండ గుహను అల్లూరి వ్యూహాలకు వేదికగా చేసుకుని అక్కడ నుంచి పోరాటం నిర్వహించారు. 1922–24 వరకు సాగిన పోరాటంలో ఎందరో గిరిజనులు పాల్గొన్నారు. అయితే ఆయన పట్టుబడిన చోట నుంచి దహనం చేసిన ప్రాంతం వరకు అంతా కొయ్యూరు మండలంలోనే ఉండటంతో ఇక్కడ మూడు స్మారక ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అల్లూరి పట్టుబడిన మంప, చంపబడిన రాజేంద్రపాలెం, సమాధుల ప్రాంతాలను కృష్ణదేవిపేటను గతంలో పురావస్తు శాఖ అధికారులుసందర్శించారు. అల్లూరి నడిపిన సాయుధ పోరాట దృశ్యాలను చిత్రాలుగా మలుస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. మంపలో పార్కు ఉన్నా అక్కడ అల్లూరికి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. రాజేంద్రపాలెంలోను అదే పరిస్థితి. ఇక్కడ కూడా పార్క్‌ను అందంతా తీర్చిదిద్దాల్సి ఉంది. కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధుల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అలాగే రాజేంద్రపాలెం, మంప ప్రాంతాలను విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి కొయ్యూరు: మన్యం సాయుధ పోరాటంలో ఎందరు పాల్గొన్నారో పూర్తిగా వివరాలు తెలియకపోయినా మొత్తం 232 మంది ఉన్నారని అంచనాకు వస్తున్నారు. దీనిలో భాగంగా మన్యం వీరుడు అల్లూరితోపాటు.. అతని పోరాటంలో కీలకంగా వ్యవహరించిన గాం గంటందొర, మల్లుదొర, పండుపడాల్ విగ్రహాలను రాజేంద్రపాలెంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర శనివారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంపలో 18 అడుగుల అల్లూరి విగ్రహం సీతారామరాజు మంప కొలనులో స్నానం చేస్తుండగా మే7 1924న బ్రిటీష్ సేనలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన పట్టుబడిన చోట స్మారక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదేచోట 18 అడుగుల పొడవైన అల్లూరి విగ్రహాన్ని జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని కూడా మంత్రి రాజన్నదొర ఆవిష్కరిస్తారు. -
మిరపకాయ టపా పేరిట పోస్టల్ కవర్ విడుదల
రాజవొమ్మంగి: విప్లవ వీరుడు, మన్యందొర అల్లూరి సీతారామరాజు ఉపయోగించిన ‘‘మిరపకాయ టపా’’ పేరిట తపాలా శాఖ శుక్రవారం రాజవొమ్మంగిలో తపాలా కవర్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమం ఆయన పాదముద్రలు పడిన ప్రాంతాలైన రంపచోడవరం, అడ్డతీగలలో పూర్తికాగా, ఇప్పుడు రాజవొమ్మంగి వంతు వచ్చింది. తాను వస్తున్నాను కాసుకోండి ఖబడ్దార్ (జాగ్రత్తపడు) అంటూ.. ప్రాణనష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపా పంపేవారట. అలా ఓ వైపు బ్రిటీష్ సేనలను జాగృతం చేస్తూనే, మరోవైపు ఉరుములేని మెరుపులా వచ్చి వాలిపోలియేవారని చెబుతారు. తాను ఎప్పుడు, ఎలా ఎక్కడకు వస్తున్నది, ఏం చేయబోతుంది, లేఖ రాసి బాణానికి గుచ్చి, దాంతో పాటే ఎర్ర మిరపకాయల గుత్తి కట్టి వదిలేవారట. ఆ విధంగా వచ్చిన రామబాణాన్ని చూసి ముష్కరులకు నిద్రపట్టేది కాదని, అప్పటి సాయుధ పోరులో అల్లూరి సీతారామరాజు చూపిన ప్రతిభా పాటవాలను నేటికీ గిరిజనులు కథలుగా చెప్పుకుంటారు. ఆ మహానుభావుని ఉద్యమాల పంథా నూరేళ్ల పండగను జరిపే బరువు బాధ్యతలను తపాలా శాఖ తన భజస్కంధాలపై వేసుకుంది. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది అసువులుబాయగా, మన్యంలో గిరిజనుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అల్లూరికి పరిపరి విధాలుగా ఆ శాఖ నివాళులర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో సాధారణ పోస్టుమన్ నుంచి పోస్ట్‌మన్ జనరల్ వరకు పాల్గొంటూ అల్లూరి స్ఫూర్తి నేటి తరం యువతకు ఎంతో అవసరం అని చాటి చెబుతోంది. హాజరు కానున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మిరపకాయ టపా పేరిట రాజవొమ్మంగి జయలక్ష్మి థియేటర్లో నిర్వహించే అల్లూరి ఉద్యమ శతజయంతి వేడుకలకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్, అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, పోస్ట్ మాస్టర్ జనరల్ (విశాఖపట్నం) ముత్యాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. (చదవండి: అటవీ వనం కన్నీరు..గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం) -
శీకాయతో సిరులు
మన్యంలో అటవీ ఉత్పత్తులకు మంచి ధర లభించే రోజులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా గిరిజనులు సేకరిస్తున్న శీకాయను విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏటా శీకాయ విక్రయం ద్వారా సుమారు రూ.50 లక్షల మేర వ్యాపారం చేస్తున్న జీసీసీ.. తలపెట్టిన విదేశీ మార్కెటింగ్ కార్యరూపం దాల్చితే అధిక ఆదాయం ఆర్జించడమే కాకుండా గిరిజనులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రంపచోడవరం: మన్యంలో గిరిజనులు సేకరిస్తున్న శీకాయ కాసులు కురిపించనుంది. అడవుల్లో పెరిగే ఈ మొక్కలకు గిరిజనుల ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించరు. సహజసిద్ధంగా పెరగడం వల్ల శీకాయకు సేంద్రియ ఉత్పత్తిగా మంచి డిమాండ్ ఉంది. దీనికి విదేశాల్లో మంచి మార్కెటింగ్ ఉన్నందున ఈ దిశగా గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. గిరిజనులు సేకరించే శీకాయ సేంద్రియ ఉత్పత్తిగా ధ్రువీకరించేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) బృందం ఈ నెల మారేడుమిల్లి రానుంది. బృందం సభ్యులు ధ్రువీకరణతో.. ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, నెల్లిపాక అటవీ ప్రాంతాల్లో గిరిజనులు శీకాయను సేకరిస్తుంటారు. మారేడుమిల్లి రానున్న ఐఎంవో బృందం సభ్యులు మండలంలో శీకాయ విరివిగా లభించే బొడ్లంక, పాతకోట ప్రాంతాలను ఈనెల 20న సందర్శిస్తారు. గిరిజనులు సేకరిస్తున్న శీకాయను పరిశీలిస్తారు. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించలేనట్టుగా నిర్థారణ అయిన వెంటనే ధ్రువపత్రం జారీ చేస్తారు. దీని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వెంచూరియా కంపెనీ ద్వారా శీకాయను ప్రోసెసెంగ్ చేసి విదేశాలకు మార్కెటింగ్ ప్రారంభిస్తామని జీసీసీ అధికారవర్గాలు తెలిపాయి. రెట్టింపు ధరకు అవకాశం ప్రస్తుతం గిరిజనులు సేకరిస్తున్న శీకాయకు గిరిజన సహకార సంస్థ కిలోకు రూ. 55 చెల్లిస్తోంది. సేంద్రియ శీకాయగా ధ్రువీకరణ అనంతరం గిరిజనులకు జీసీసీ రెట్టింపు ధర చెల్లించే అవకాశం ఉంది. శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా సేకరించిన గిరిజనులకు 35 శాతం, మార్కెటింగ్ చేయడం వల్ల 15 శాతం లాభాలు వస్తాయని జీసీసీ అంచనా వేస్తోంది. ఏటా వంద టన్నుల సేకరణ.. ఏటా గిరిజన సహకార సంస్థ ఏజెన్సీలో గిరిజనుల నుంచి 100 టన్నుల శీకాకాయను సేకరిస్తోంది. ఐఎంవో గుర్తింపు తరువాత విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు ఆర్గానిక్ శీకాయను గింజలు తొలగించి ఫౌడర్‌గా తయారు చేయాల్సి ఉంటుంది. కుంకుడుకు పెరిగిన ధర గిరిజనులు సేకరించే కుంకుడు ధరను పెంచుతూ గిరిజన సహకార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కిలోకు రూ. 35 చెల్లిస్తే ఇక నుంచి రూ. 45 చెల్లించనున్నట్టు ప్రకటించింది. జీసీసీ రిటైల్ మార్కెట్లో కుంకుడు కాయ పౌడర్, షాంపులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా 150 టన్నుల వరకు కుంకుడు కాయలను గిరిజనుల నుంచి జీసీసీ సేకరిస్తోంది. పచోడవరంలోనే జీసీసీ ఆధ్వర్యంలో కుంకుడు కాయ పౌడరు తయారు చేస్తున్నారు. జీసీసీ సూపర్ మార్కెట్లు, జీసీసీ అవుట్ లెట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇతర అటవీ ఉత్పత్తులకు.. గిరిజనులు సేకరించే కోవెల జిగురు మొదటి రకం కేజీకి రూ. 200 చొప్పున గిరిజన సహకార సంస్థ చెల్లిస్తోంది. ఉసిరిపప్పునకు కేజీకి రూ. 60, పిక్కతీసిన చింతపండుకు రూ. 63, తేనెకు రూ. 170, కొండచీపుర్లు కట్టకు రూ.55 చొప్పున చెల్లిస్తోంది. గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా గిరిజనులకు అధిక రేట్లు లభిస్తాయి. అగ్రిమెంట్ దశలో ఉంది. త్వరలో పూర్తవుతుంది. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో వంద టన్నుల వరకు ఉంది. పిక్క తీయని చింతపండును కొనుగోలు చేయడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందిగా ఉంది. –జె.యూస్టస్, జీసీసీ డీఎం, రంపచోడవరం -
మలేరియాకు చెక్
మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మహమ్మారి తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖల శ్రమకు ఫలితం లభించింది. మరణాల నివారణతోపాటు మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. సాక్షి, పాడేరు : మన్యంలో మలేరియా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఒకప్పుడు మలేరియా మహమ్మారితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దోమకాటుకు గురై మలేరియా జ్వరాల బారిన పడటంతో పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చేది. పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉండేవి. మన్యంలో 2012 నుంచి 2018 వరకు మలేరియా విజృంభించడంతో మరణాలు చోటు చేసుకునేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా.. ఏర్పడిన తరువాత మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ల సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు ప్రభుత్వం ] మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి. దోమతెరలతో.. తెరలను ప్రభుత్వం పంపిణీ చేయడం మరింత మేలు చేసింది. గిరిజనులకు దోమ కాట్ల బెడద లేకుండా 5,02,950 దోమతెరలను అందజేసింది. వీటి వినియోగంపై వైద్య బృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. మలేరియా, వైద్యారోగ్యశాఖలు.. మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. మరణాలు కూడా లేకపోవడంతో మలేరియాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. పాడేరు ఐటీడీఏ పీవో, ఇతర శాఖల అధికారులు కూడా దోమల నివారణ మందు పిచికారీ పనులను నిరంతరం పర్యవేక్షించేవారు. ఏటా రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ పనులు జరిగాయి. ప్రతి గిరిజన కుటుంబం ఇంటా, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా జరుపుకోవాలనే నిబంధనలు కూడా సచివాలయ ఉద్యోగులు అమలు చేసేవారు. గ్రామ వలంటీర్ల పర్యవేక్షణలో.. సచివాలయ వ్యవస్థ ఏర్పడడంతో పాటు గ్రామ వలంటీర్లంతా తమ నిర్దేశిత గిరిజన కుటుంబాల నివాసాలకు దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించేవారు. ఇంటింటా ఫీవర్ సర్వే కూడా విజయవంతంగా జరిగింది -
ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వాతావరణ సమాచారం వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్సైట్ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్ అబ్జర్వేషన్‌లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. గుబాళించిన పూల సాగు మార్కెట్లో అలంకరణ పూలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. గిరిజనులను ప్రోత్సహిస్తాం వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్‌ఫ్లవర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. – డాక్టర్ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం -
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు..ఆకట్టుకునే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య పురుడుపోసుకున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఈ కేంద్రంలో జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు రూ.500 కోట్లు వెచ్చించాయి. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఇక్కడ ఆరు జనరేటర్లు సేవలందిస్తున్నాయి. 1, 2, 3 జనరేటర్లతో 51, 4,5,6 జనరేటర్లతో 69 చొప్పున 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమారు 65 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఈ విద్యుత్ కేంద్రంలో పురాతన యంత్రాలు కావడంతో గత పదేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. తరచూ సాంకేతిక సమస్యలతో అధికారులు, సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ కేంద్రంపై దృష్టి సారించి, శత శాతం విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్ కేంద్రాలు కేవలం పీక్‌లోడ్ అవర్స్‌లో మాత్రమే ఉత్పాదన చేస్తుండగా మాచ్‌ఖండ్ మాత్రం ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో ఆరు జనరేటర్లతో 120 మోగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. డుడుమ, జోలాపుట్టు ప్రధాన ఆధారం మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంంద్రంలో ఉత్పత్తికి నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలశయాలు ప్రధాన ఆధారం. డుడుమ నీటి సామర్థ్యం 2590, జోలాపుట్టు నీటి సామర్థ్యం 2750 అడుగులు. వీటికి మత్స్యగెడ్డ నీరే దిక్కు. జి. మాడుగుల మండలం గెమ్మెలి నుంచి మొదలై మత్స్యగుండం మీదుగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ గెడ్డ విస్తరించింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా రెండు జలశయాల్లో నిల్వ చేస్తారు. డుడుమ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తుంటారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయినా నీరు తొలుత అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అక్కడ నుంచి ఆంధ్ర భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన తరువాత మిగతా నీరు గోదావరిలో కలుస్తోంది రూ.500 కోట్లతో ఆధునికీకరణ.. 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రతీ జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు పైబడినా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరణకు నిర్ణయించాయి. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయించాయి. విద్యుత్ కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక తయారీ బాధ్యత టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకు ఏపీజెన్కో వర్గాలు అప్పగించాయి. దీంతో అదే సంస్థకు చెందిన 14 మందితో కూడిన బృందం గత ఏడాది డిశంబర్ నెలలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌యార్డులు, భవనాల స్థితిగతులను పరిశీలించింది. వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కన్సల్టెన్సీ బృందం అందజేసింది. పూర్తిస్థాయిలో ఉత్పాదన శుభపరిణామం విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరగడం శుభపరిణామం. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి తక్కువే అయినా వాటికి ధీటుగా ఉత్పాదకత ఉంటుంది. ఆధునికీకరణ కోసం ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఎంతో మేలు జరుగుతుంది. – కేవీ నాగేశ్వరరావు, సీనియర్ ఇంజినీర్, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
తెల్లవారిని హడలెత్తించిన ఎర్ర మిరపకాయ్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. -
మరో వివాదంలో ఆర్ఆర్ఆర్.. ఏం జరిగినా రాజమౌళిదే బాధ్యత
Family Members Object to Alluri Sitaramaraju Role in RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను వక్రీకరించారని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు అన్నారు. సినిమాలో ఏది చూపిస్తే ప్రేక్షకులు కూడా అదే నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు తన జీవితంలో ఎక్కడా డ్యాన్స్ చేయలేదని, బ్రిటీష్ సైన్యంలో పనిచేయలేదని ఆయన అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత అల్లూరి సీతారామరాజు అభిమానులు నొచ్చుకొని జరగరాని సంఘటనలు జరిగితే వాటికి దర్శకుడు రాజమౌళి బాధ్యత వహించాలని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు మీడియా ముందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: (అమెరికాలో తారక్ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్ కొనేశాడు) -
RRR సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల అభ్యంతరం
-
బ్రిటిష్ సైన్యానికి పట్టుబడిన చోటే.. 18 అడుగుల అల్లూరి విగ్రహం..
ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు.. వారంతా విప్లవ యోధులుగా మారతారు.. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది.. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది.. మేజర్ గుడాల్‌తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆ వీరుడు అన్నట్టుగానే అతని మరణం తరువాత దేశంలో స్వాతంత్య్ర పోరాటం నిప్పుకణమై మండింది. లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు. సీతారామరాజును కొయ్యూరు మండలం మంపలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోనే ఆ యోధుడి అధ్యాయం ముగిసింది. అందుకు గుర్తుగా అదే చోట 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆ బృహత్ కార్యక్రమానికి ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. కొయ్యూరు: అది మే నెల ఏడవ తేదీ.. 1924వ సంవత్సరం. ఉదయం ఎనిమిది గంటలకు మంపలో ఉన్న కొలనులో సీతారామరాజు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం మేజర్ గుడాల్ నేతృత్వంలో చుట్టుముట్టింది. ఆయనే అల్లూరి అని నిర్ధారించుకునేందుకు గుడాల్ ఓ పరీక్ష పెట్టాడు. మరిగే పాలను ఇచ్చినా రామరాజు గటగటా తాగుతారని తెలిసి వేడి పాలను తీసుకువచ్చి తాగించారు. ఆయన ఆ పాలను నీళ్లు మాదిరిగా తాగడంతో అతనే సీతారామరాజని తేలింది. అప్పుడు అల్లూరిని మంపకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలేనికి తీసుకువచ్చారు. అక్కడ అతడిని మంచానికి కట్టి మేజర్ గుడాల్ కాల్చి చంపారు. రామరాజు చనిపోయే ముందు పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు. అక్కడ నుంచి అతని పార్థివ దేహాన్ని కృష్ణాదేవిపేటకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేశారు. అల్లూరి మరణించి 98 సంవత్సరాలు కావస్తోంది. జాతీయ అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో మంపలో ఆయన పట్టుబడిన కొలను మధ్యలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అల్లూరికి కుడి ఎడమ భుజాలుగా నిలిచిన గాం గంటన్నదొర, మల్లుదొరతోపాటు మరికొందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దీని శంకుస్థాపనకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలను ఆహ్వానించారు. వేధింపులతో విప్లవానికి నాంది: నాడు రంపుల, చింతపల్లి ఘాట్రోడ్ల నిర్మాణ సమయంలో కూలి విషయంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులను వేధించడాన్ని సీతారామరాజు స్వయంగా చూశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై అతను సాయుధ పోరాటం మొదలు పెట్టారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లపై రామరాజు ధైర్యంగా దాడులు చేశారు. పోలీసు రికార్డుల్లో ఆయన పట్టుకువెళ్లిన ఆయుధాలను కూడా నమోదు చేశారు. అతనితో కలిసి పోరాటం చేసిన వారిలో మల్లుదొర, గంటన్నదొరతో పాటు అగ్గిరాజు, యర్రయ్య కూడా కీలకంగా వ్యవహరించారు. మొత్తం 212 మంది ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వందలాదిమంది పోలీసులను నియమించినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. మంపకు సమీపంలో ఉర్లకొండ వద్ద ఉన్న గృహంలో సీతారామరాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేశారు. ఆ గుహ నుంచి చూస్తే మంప, రేవళ్లు రహదారుల నుంచి ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గుహ వైపు వచ్చినా తెలిసిపోతుంది. దీంతో దానినే రాజు స్థావరంగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను సేకరించిన మేజర్ గుడాల్ మంపలో అల్లూరిని పట్టుకునేందుకు పథకం రచించారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసేది ఈ కొలనులోనే.. కొలను చుట్టూ ఇనుప కంచె పెట్టాలి సీతారామరాజు స్మారక ప్రదేశంలో ప్రస్తుతం కొలను వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయాలి. లేకుంటే పశువులు వచ్చి పాడు చేసే అవకాశం ఉంది. అదే విధంగా స్మారక ప్రాంతంలో మంచి మొక్కలను నాటాలి. గోడలపై సీతారామరాజు జీవిత చరిత్రను చిత్రాల రూపంలో వేయాలి. ఇలా చేస్తే సందర్శకులకు చారిత్రక విషయాలు తెలుస్తాయి. మంచి పర్యాటక ప్రదేశమవుతుంది. – ఇంగువ త్రినాథ్ పడాల్, మంప, సర్పంచ్ అల్లూరి జిల్లాతో నిజమైన నివాళి మన్యం వీరుడు అల్లూరిని పట్టుకున్న మంప, అతడిని కాల్చి చంపిన రాజేంద్రపాలెంతోపాటు కృష్ణాదేవిపేటలో ఉన్న సమాధుల ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మంపకు సమీపంలో ఉన్న ఉర్లకొండ గుహ ఒకప్పుడు అల్లూరి స్థావరంగా ఉండేది. దానిని వెలుగులోకి తీసుకురావాలి. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అల్లూరి పేరు పెట్టడం నిజమైన నివాళి. – పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
ఎన్టీఆర్-కృష్ణల మధ్య విభేదాలపై మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Babu Comments Over Sr NTR And Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగానే కాకుండా, అన్‌స్టాపబుల్ షోతో వ్యాఖ్యాతగానూ అదరగొకొడుతున్నారు. ఇప్పటికే ఈ షో ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు గెస్ట్‌గా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. కాగా నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్ కృష్ణ మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామమాజు సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అప్ అయిన మహేశ్ ఎన్టీఆర్- కృష్ణల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న(కృష్ణ)గారికి ఎన్టీఆర్ గారితో గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని ఆ సినిమా చూసిన తర్వాత.. ఆయన చాలా అభినందించారని నాన్న తరుచూ గుర్తుచేసుకునేవారని మహేశ్ వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
జులై 4న ఢిల్లీలో అల్లూరి జయంతి వేడుకలు
-
గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు
బంజారాహిల్స్(హైదరాబాద్): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్స్‌ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు. తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్ వన్ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్‌బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. -
అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు
-
అల్లూరి పేరిట పోస్టల్ కవర్
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించింది. తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
సాక్షి,విశాఖపట్నం: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి వందేళ్లు పూర్తైన సందర్భంగా అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించారు. ఆదివారం విశాఖపట్నం పోస్టుమాష్టరు జనరల్ కార్యలాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోస్టుమాష్టరు జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చదవండి:జగనన్న కాలనీ పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
అల్లూరి బయోపిక్‌లో నేను కూడా ఓ పాత్ర పోషిస్తున్నా: ఎంపీ
సాక్షి, విశాఖపట్నం: వాస్తవానికి దగ్గరగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ మూవీని తీస్తున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. పద్మనాభం జిల్లా పరిషత్ బంగ్లా వద్ద క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ప్రారంభించారు. అల్లూరి జన్మస్థలానికి దగ్గరగా ఉన్న పద్మనాభంలో ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. బ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడిన యుద్ధఘట్టాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ అల్లూరి గురించి తీసిన చిత్రంలా కాకుండా బంధువులు తెలిపిన వివరాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పారు. ఈ సినిమా తీయడానికి ఆయన బంధువులు ముందుకు రావడం విశేషమన్నారు. ఈ చిత్రంలో తాను కూడా ఓ పాత్రను పోషిస్తున్నట్టు ఎంవీవీ తెలిపారు. డైరెక్టర్ వెంకట్ పంపన మాట్లాడుతూ 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి ఓటీటీ ప్లాట్ఫారంలో రిలీజ్ చేస్తామని తెలిపారు. పద్మనాభంలోని జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని పోలవరం బ్రిటీష్ కలెక్టర్ కార్యాలయంగా తీర్చిదిద్ది సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నిర్మాతగా ఆర్.ఎస్.సత్యనారాయణరాజు వ్యవహరిస్తున్నారు.అల్లూరిగా శివవర్మ, గంటం దొరగాడి.జి.రమేష్ మల్లు దొరగా రాఘవ కీలక పాత్రలను పోషిస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.రఘువర్మ, పి.సూర్యనారాయణరాజు(సురేష్‌బాబు), వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, ఆర్ఎస్ దేముడుబాబు, అముజూరి అప్పారావు పాల్గొన్నారు. పద్మనాభంలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన విశాఖ ఎంపీ -
తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనం అల్లూరి : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. pic.twitter.com/9F27TMUqMT — YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2021 -
‘నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దని లెటర్ రాశాడు’
మహారథి... దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు... బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి వచ్చారు... ఎంతో పోరాటం చేసి సినీ రచయితగా నిలిచారు... రణభేరి, బందిపోటు, పెత్తందార్లు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు.. వంటి అనేక చిత్రాలకు పదునైన లయబద్ధమైన మాటలు రచించి కొత్త పంథాను సృష్టించారు.. క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం వల్ల సినీ పెద్దలకు దూరమయ్యారు.. తను కలలు కన్న అల్లూరి సీతారామరాజు కోసం అడవులకు వెళ్లారు... ఆదర్శ జీవితాన్ని గడిపారు.. పిల్లలకు అదే నేర్పారు.. అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలు ‘సాక్షి’కి వివరించారు మహారథి రెండవ కుమారుడు చిట్టిబాబుగా పరిచితులైన వరప్రసాద్.. నాన్న కృష్ణాజిల్లా పసుమర్రులో పుట్టారు. నాయనమ్మ పుణ్యవతి. తాతయ్య సత్యనారాయణ పసుమర్రు మునసబు. ఆయనకు రైస్ మిల్లులు ఉండేవి. నాన్నగారికి ఒక అక్క ధనలక్ష్మి, ఇద్దరు చెల్లెళ్లు.. జయప్రద, రామలక్ష్మి. తాతగారి రెండో భార్యకు ధనలక్ష్మి, మూడో భార్యకు నాన్నగారు, ఇద్దరు చెల్లెళ్లు పుట్టారు. ఆ రోజుల్లో వారసుడి కోసం తపించేవారు. లేకలేక పుట్టడంతో నాన్న ఎంతో అపురూపంగా పన్నెండు మంది దాసీల మధ్య పెరిగారు. పుట్టినప్పుడే జ్యోతిష్కుడు, ‘పిల్లాడు మహావిద్యావంతుడు అవుతాడు, కాని 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నదంతా హరించుకుపోతుంది’ అని చెప్పిన జాతకం నిజమైంది. నాన్నకు 12 సంవత్సరాలు వచ్చేసరికి తాతగారికి ఉన్న 300 ఎకరాల భూమి 16 ఎకరాల కు వచ్చేసింది. ‘పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకు’ అని వాళ్ల నాయనమ్మ చెప్పిన మాటతో 16 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బుతో నిజామాబాద్ ధర్మారంలో వ్యవసాయం చేసి, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి, సన్యాసం తీసుకుని వింధ్య పర్వతాలకు వెళ్లిపోయారట. నాన్న ఏమయ్యారో తెలియక మా నాయనమ్మ దిగులుపడిపోయిందట. అక్కడ స్వామీజీలు నాన్నతో, ‘నీకు సన్యాసి యోగం లేదు, తల్లి మనసు కష్టపెట్టకు, అమ్మ దగ్గరకు వెళ్లిపో’ అనటంతో వెనక్కు వచ్చి, కాకరాల సీతారామయ్యగారి అమ్మాయి కమలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట. ఎవరు చెప్పినా వినలేదు... నాన్నగారికి మేం నలుగురు సంతానం. సత్య కిశోర్ (సి. ఏ), ఉషారాణి (బి.ఏ.), వరప్రసాద్ (చిట్టిబాబు, నేను, బి. కాం.), రాజేంద్ర అనారోగ్యం కారణ ంగా మధ్యలోనే చదువు ఆపేసి, వ్యాపారం లోకి దిగారు. మా అందరి కంటె ముందు ఒక అమ్మాయి పుట్టింది. పేరు క్రాంతి. ఆ ప్రసవం అయ్యాక అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే రామలక్ష్మి అత్త పెంచింది. నాన్నకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆవిడకు సంతాన యోగం లేదని నాన్న చెప్పారు. అత్తయ్య ఆ బిడ్డను తనకు దత్తతు ఇవ్వమని అడిగితే, ‘శ్రావణ శుక్రవారం పుట్టిన బిడ్డను దత్తతు ఇవ్వద్దు’ అని చెప్పినా వినకుండా, అమ్మకు కూడా చెప్పకుండా అత్తయ్యకు దత్తతు ఇచ్చారు. సొంతవారే అవమానించారు... నాన్నగారి చెల్లెళ్లకు ఐశ్వర్యం వచ్చాక నాన్నను చాలాసార్లు అవమానించారు. ఒకసారి సినిమా హాలు దగ్గర క్రాంతి (దత్తు వెళ్లిన అక్క) నాన్న పలకరిస్తే అవమానించింది. క్రాంతి అక్క పెళ్లి పత్రికలో ‘అభినందనలతో అనే చోట మన పేర్లు వేయమనండి’ అని అమ్మ చెప్పటంతో అత్తయ్యను అడిగారట నాన్న. ఇదంతా ఆస్తికోసం చేస్తున్నారంటూ నాన్నను నిందిస్తూ, నిష్ఠూరంగా మాట్లాడారట. అయినా నాన్న ప్రేమనే చూపారు. నాన్న బోళా శంకరుడు. ప్రశంసిస్తే పొంగిపోతారు. క్రమశిక్షణ తప్పితే... నాన్నగారి వివాహం అయ్యాక హైదరాబాద్ డెక్కన్ రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. ఆ తరవాత కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రికలకు పనిచేశారు. అప్పట్లో బాదర్ పేరు మీద రాసేవారు. రజాకార్ ఉద్యమంలో హిట్ లిస్ట్‌లో ఉండేవారు. కొన్నాళ్ల తరవాత అక్కడ నుంచి చెన్నై వచ్చేశారు. అప్పటికే శతకాలు రాశారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ‘వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్’ అని రాసిన బోర్డును ఇంటి గుమ్మం పైన పెట్టి, బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రతిరోజూ తప్పనిసరిగా చదవమనే వారు. నియమాలు పాటించకపోతే గోడ కుర్చీలు, బెల్ట్ దెబ్బలు. మా స్కూల్‌కి రైల్వే గేట్ దాటి వెళ్లాలి. ఒకరోజు గేట్ ఎక్కి దూకి వెళ్లడం ట్యూషన్ మాస్టర్ చూసి, నాన్నకు చెప్పారు. నాకు ఆ రోజు బడిత పూజ. జీవితంలో మళ్లీ ఆ పని చేయలేదు. మాట తీసుకున్నారు.. మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర, ‘మేం కట్నానికి అమ్ముడు పోము’ అని మాట తీసుకున్నారు. నా వివాహం పెళ్లి చూపులు లేకుండా జరిగింది. నాన్నగారే వెళ్లి చూసి నిశ్చయం చేశారు. అమ్మాయితో, ‘మా అబ్బాయి చూడడు, వాడు కోరుకున్నట్లుగా ఉన్నావు నువ్వు, ఒక్క పైసా కట్నం, బంగారం ఏమీ వద్దు. నీ బట్టల సూట్‌కేసుతో మా ఇంట్లో అడుగు పెట్టు’ అన్నారు నాన్న. నాన్న చూసి వచ్చాక, ‘వృద్ధాప్యం వచ్చాక కూడా గ్లామర్ ఉండేలాంటి అమ్మాయిని చూశాను’ అని చమత్కరించారు. నా భార్య ఉషాలత వాళ్లది అతి సామాన్య కుటుంబం. పోరాడారు.. చెన్నై చేరిన కొత్తల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పనిచేశారు. రచయితగా ప్రవేశించటానికి పెద్ద పోరాటమే చేసి, గెలుపు సాధించారు. ‘బందిపోటు’ చిత్రంతో రచయితగా ప్రవేశం చేసి, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక లయలో డైలాగులు రాసి అంతవరకు ఉన్న ఒరవడి మార్చారు. ఈ విషయంలో ఒక జర్నలిస్టు నాన్నను విమర్శించారు. నాన్న కోపంగా, ‘నేను రైటర్ని, అవసరమైతే ఫైటర్ని కూడా అవుతాను, జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు. సీతారామరాజు లైఫ్ యాంబిషన్. ఆ సినిమా కోసం పరిశ్రమలోని పెద్దవాళ్లు విరోధులయ్యారు. అమ్మతో, ‘ఈ సినిమాను దీక్షతో ఒక యజ్ఞంలాగ, తపస్సులాగ చేయాలి. దీని వల్ల కీర్తి వస్తుంది. చాలా సినిమాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతాం. ఏం చేయమంటావు?’ అని అడిగితే, ‘మీకు ఎటు విశ్వాసం ఉంటే అటే వెళ్లండి’ అని అమ్మ ఇచ్చిన మాటతో తెల్లవారు జాము. మూడు గంటలకు నాన్న చింతపల్లి అడవులకు వెళ్లిపోయారు. ఏకాగ్రతతో అనుకున్నది సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రివ్యూ పెద్దల సమక్షంలో జరిగింది. దానికి పి. పుల్లయ్య గారు కూడా వచ్చారు. సినిమా పూర్తిగా చూసి, నాన్నను కౌగిలించుకుని, ‘సినిమా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆనందంగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తన తపస్సు ఫలించినందుకు నాన్న పరమానందించారు. ‘నా పేరు నిలబడే సినిమాలే రాస్తాను. అదే నా కలం బలం’ అని ఎన్నో కథలు తిరస్కరిం చారు. ఫైవ్‌స్టార్ హోటల్, ప్లాట్‌ఫారమ్... రెండిటినీ సమానంగా చూసేవారు. నిజాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ఓపెన్‌గా ఖండించడంతో విరోధులు పెరిగారు. నాన్నను అందరూ మీసాలాయన అనేవారు. సామాన్య జీవితం... చాలా సాధారణంగా ఉండేవారు. మంచి డ్రెస్ వేసుకోమని అమ్మ చెబితే, ‘ఈ బట్టలు చూసి నన్ను మహారథి కాదంటారా’ అంటూ చిరిగిన వాటితోనే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. కారు, రిక్షా, ఆటో, బస్.. అన్ని ప్రయాణ సాధనాలలోనూ ప్రయాణించేవారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ గా భావించి, కంచంలో పెట్టినది తినేసేవారు. ఇంట్లో అందరికీ ఎవరి కంచం వారిది. ఒకసారి అన్నయ్యకు అల్యూమినియం ప్లేట్లో అన్నం పెట్టింది అమ్మ. ‘ఇందులో నేను తినను’ అని అన్నయ్య పేచీ పెట్టాడు. ఆ విషయం నాయనమ్మ నాన్నకు చెప్పింది. నాన్న ఆ రోజున చాలా కోపంగా, అంట్లు తోముకునే బూడిద పెట్టే పళ్లెం కడిగించి, అందులో వారం రోజుల పాటు అన్నం పెట్టమని చెప్పారు. అన్నయ్య తినలేకపోయాడు. ‘అన్నానికి విలువ ఇవ్వాలి. కంచానికి కాదు’ అని మందలించారు. ఒకసారి స్కూల్లో నేను పెన్ దొంగతనం చేశాను. ఎప్పట్లాగే మా నాయనమ్మ నాన్నకు విషయం చెప్పింది. నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ‘చిట్టి పెద్ద అబద్ధాలకోరు’ అని అందరికీ వినపడేలా మూడు సార్లు అనిపించారు. అంతే ఇంకెన్నడూ ఎవ్వరి వస్తువూ ముట్టుకోలేదు. క్యారెక్టర్ బిల్డింగ్‌లో మైండ్ గేమ్ ఆడారని పెద్దయ్యాక తెలిసింది. ఆ బీజాలు మాలో నాటుకుపోయాయి. అందువల్ల కొంత కోల్పోతున్నాం. అందుకని రోజూ నాన్న ఫొటో చూస్తూ, ‘నాన్నా! మీరు మాకు మంచి చేశారో చెడు చేశారో తెలియట్లే్లదు’ అంటుంటాను. ఈ పేరు ఇలా వచ్చింది... వరంగల్ని త్రిపురనేని వంశీకులు పరిపాలించిన కాలంలో, మహారథి అనే ఒక రాజు పేరున నాణెం ముద్రించారు. అందుకని ఆ పేరు పెట్టుకోమని స్నేహితులు చెప్పటంతో నాన్న మహారథిగా మారారు. నాన్నగారి అసలు పేరు బాలగంగాధరరావు. అలా జరిగిపోయింది... 2011 డిసెంబరు 9 వ తేదీ నాన్నగారి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమం అయ్యింది. ‘పిల్లవాడికి ఆశీర్వాదం ఇస్తాను, తీసుకురా’ అన్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను. డిసెంబరు 21న డిశ్చార్జ్ అయ్యాను. 2011, డిసెంబరు 23న నాన్న కన్నుమూశారు. ‘మూడు రోజుల తరవాత దహనం అవుతుంది. కాని నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దు’ అని రాసిన ఒక లెటర్ నాన్న దిండు కింద కనిపించింది. ఆయన అన్నట్లుగానే మూడు రోజుల దాకా వాహనం రాలేదు. ఆశ్చర్యంగా మూడు రోజులూ వాసన రాలేదు. అలా నాన్న తన జాతకం కూడా చెప్పారు. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆర్ఆర్ఆర్ : రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. రేపు(మార్చి27)న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేసింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చేతిలో విల్లు పట్టుకొని అల్లూరి సీతారామరాజుగా పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు రామ్ చరణ్. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన కామన్ డీపీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్‌గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్ చేసేందుకు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా సీతగా ఆలియా భట్ నటిస్తుంది. ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. చదవండి : ఆర్ఆర్ఆర్: సీత వచ్చేసిందిగా ఆర్ఆర్ఆర్: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్! The man of bravery, honour and integrity. Presenting my #AlluriSitaRamaraju to you all... 🔥 #RRR #RRRMovie @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/uEFLFp8bDX — rajamouli ss (@ssrajamouli) March 26, 2021 -
ఎందరో ప్రముఖులకు ఇక్కడ ఓనమాలు
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): స్థల మహిమో.. వ్యవస్థాపకుల సంకల్ప బలమో కానీ కొన్ని పాఠశాలలు నిజమైన సరస్వతీ నిలయాలుగా వెలుగొందుతాయి. ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు వామనుల్లా ఇంతింతై వటుడింతయై అన్నట్టు ప్రజ్ఞలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అది ఎంత ఎత్తంటే వారు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేంతలా. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యం మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే కదా. అలాంటి ‘ఉన్నత’మైనదే కృత్తివెంటి పాఠశాల. శనివారం 116వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. పాఠశాల ప్రస్థానం ఇదీ.. కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు కృత్తివెంటి పేర్రాజు 1852లో కాకినాడలో జన్మించారు. న్యాయవాది అయిన ఆయన ఓ కేసు నిమిత్తం రామచంద్రపురం వచ్చి కక్షిదారులైన ఇద్దరు అన్నదమ్ముల నిరక్ష్యరాస్యతను చూసి కలవరపడ్డారు. తిరుగుప్రయాణంలో బంట్రోతుతో కృత్తివెంటి ‘కాటన్ దొర ఆనకట్టకట్టారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ.. దానితో సమానంగా వీరి బుర్రలు మాత్రం పెరగటంలేదు. విద్యలేని విత్తం అనర్థదాయకం.. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’ అన్నారట. ఆయన అభీష్టం మేరకు 1905లో 4 నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేసేందుకు పాఠశాల స్థాపించి జాతీయ పాఠశాలగా నామకరణం చేశారు. 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. అందుకోసం పేర్రాజు పంతులు 94.21 ఎకరాలను దానం చేసి పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యానవన పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు ఆయన దానం చేసిన స్థలంలో అంకురార్పణ జరిగింది. నియోజకవర్గానికి చెందిన మొట్టమొదటి మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించి భవన, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మరెందరో విద్యాభాస్యం వందేళ్లు పైబడి పాఠాలు నేర్పిన ఈ సరస్వతీ నిలయం మరెందరినో ఎన్నో రంగాలలో తీర్చిదిద్దింది. భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాలనే అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ పాఠశాలలో 6వ తరగతి చదివారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళికథ ఫేం), మాష్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ యాక్టర్ రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రహ దర్శకుడు చోటా కే నాయుడు, మెజీషియన్ వి.పట్టాభిరామ్, రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకుడు, కవి, అదృష్టదీపక్, వీణావాదనలో దిట్ట ద్విభాష్యం నగేష్‌బాబు, వీరే కాకుండా రాజగోపాలనరసరావు, రాజబహదుర్ రామచంద్రరాజు, నందివాడ సత్యనారాయణరావు వంటి మహామహులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. -
అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి
రాజవొమ్మంగి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో బాలుడిగా ఉన్న తాను.. ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని.. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకొనేవారని స్థానికులు తెలిపారు. అయితే వయసు మీదపడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
అల్లూరి స్వగ్రామంలో పోటెత్తిన వరద నీరు
సాక్షి, విశాఖపట్నం : మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరికి వరద నీటి ముప్పు వాటిల్లింది. ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని గోస్తని వరద నీరు పోటెత్తింది. వివరాలు.. అల్లూరి సీతారామరాజు జన్మించిన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి మరోసారి వరదనీటి ముప్పు ఏర్పడింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాండ్రంగి గ్రామానికి ఆనుకుని ప్రవహించే గోస్తనీ నది మూడు రోజులుగా ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో మండల కేంద్రం పద్మనాభం, రేవిడి,మద్ది, విజయనగరం తదితర ప్రాంతాలకు మార్గాలు మూసుకుపోయాయి. దీంతోపాటు గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి వరద నీరు పోటెత్తడంతో వెళ్లడానికి వీలులేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాండ్రంగి వంతెన నిర్మాణానికి రూ.14 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒకవేళ భారీ వర్షాలు లేకపోయుంటే ఈ వారమే ఆ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ భావించారు. కాగా దశాబ్దాలుగా ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసినా గంటా శ్రీనివాసరావు హామీ నెరవేర్చడంలో విఫలం కాగా సీఎం జగన్ మాత్రం వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అల్లూరి, పింగళికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి,అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘మన జాతీయ పతాక రూపశిల్పి.. స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్యగారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. (చెరకు రైతుల బకాయిలు తీర్చాలి) అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ‘గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి.. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. -
అసనగిరి కొండల్లో.. ‘అల్లూరి’ గుహలు నిజమే
నాతవరం (నర్సీపట్నం): విశాఖ జిల్లా నాతవరం మండలం అసనగిరి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నివాస గుహలు ఉన్నట్లు మైనింగ్ శాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ జనవరి నెలలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న లేటరైట్ నిక్షేపాలు, అల్లూరి గుహలకు సంబంధించి అసెంబ్లీ కమిటీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆ తర్వాత అసనగిరి ప్రాంతంలోని లేటరైట్ గుహలపై రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా జరిపిన లేటరైట్ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని అందులో కోరారు. దీనిపై జనవరి 28న అనకాపల్లి మైనింగ్ ఏడీ వెంకట్రావు ఆధ్వర్యంలో నాతవరం మండలంలో సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామ సమీపంలోని అల్లూరి సీతారామరాజు నివాస గుహలను స్వయంగా పరిశీలించారు. జనవరి 28న అసనగిరిలో గిరిజనులతో మాట్లాడుతున్న మైనింగ్ ఏడీ వెంకట్రావు అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. బ్రిటిష్ కాలంలో అల్లూరి సీతారామరాజు ఈ గుహలో ఉండి.. సైన్యాన్ని తయారుచేసుకుని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు పోలీసుస్టేషన్లపై దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. కాగా, ఈ గుహలను అభివృద్ధి చేయాలంటూ ఈ ప్రాంత గిరిజనులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా గత ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు నిబంధనలు ఉల్లంఘించి సింగం భవాని పేరు మీద అనుమతులిచ్చింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది టన్నుల లేటరైట్ మట్టిని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మీదుగా యథేచ్ఛగా తరలించుకుపోయారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత కొందరు కోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. గుహలున్న ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ నేపథ్యంలో.. విశాఖ జిల్లాలో అసనగిరి గ్రామస్తులు చేస్తున్న పోరాటంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ స్పందించి అసెంబ్లీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ తాము పరిశీలించిన అంశాలతో పాటు అసనగిరి గ్రామస్తులు తెలిపిన విషయాలన్నింటినీ ప్రభుత్వానికి ఇటీవల మైనింగ్ ఏడీనివేదించారు. -
కోర్టులో అల్లూరి
కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్నారు రామ్‌చరణ్. ఈ వాడివేడి వాదనను వచ్చే ఏడాది జూలైలో విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చూడొచ్చు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోర్టులో అల్లూరి తన వాదన వినిపించే సీన్స్ తీయడం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
నేడు అల్లూరి జయంతి : జ్ఞాపకాలు అక్కడ పదిలం
సాక్షి, రంపచోడవరం(రాజమండ్రి) : తూర్పు మన్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం ఇప్పటికీ గిరిజనాల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది. అల్లూరి సీతారామరాజును ఏజెన్సీ గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఆదివాసీల తరఫున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేసి అల్లూరి పోరాడారు. అల్లూరి రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తికెళ్లిన భవనాలు నేటికీ పదిలంగా ఉంచారు. అల్లూరి జరిపిన పోరాటాలకు జ్ఞాపకాలుగా ఉంచారు. రంప గిరిజనుల తరఫున అల్లూరి చేసిన రంప పితూరి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అప్పట్లో అల్లూరి అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో రెండేళ్లు వ్యవసాయం చేశారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు అల్లూరి జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. పైడిపుట్టలో వ్యవసాయం అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు కొంతకాలం వ్యవసాయం చేశారు. విప్లవ భావాలతో ఉన్న ఆయన దృష్టిని మార్చాలని అల్లూరి తండ్రి స్నేహితుడు, పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజుల్లాఖాన్ సీతారామరాజును పైడిపుట్ట పంపించి 30 ఎకరాల భూమి ఇచ్చారు. తల్లి సూర్యనారాయణమ్మ, తమ్ముడు సత్యనారాయణరాజులో కలిసి వ్యవసాయం చేశారు. మూలికా వైద్యం చేసే అల్లూరి వద్దకు గిరిజనులు ఎక్కువగా వచ్చే వారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని, ఉద్యమాలపై వెళ్లవద్దని చెప్పారు. ఫజుల్లాఖాన్ చనిపోయాక అల్లూరి విప్లవోద్యమ బాట పట్టారు. పైడిపుట్ట గ్రామం తల్లిని, తమ్ముడిని ఎడ్లబండిపై భీమవరం పంపించి తాను మాత్రం అడవుల్లోకి వెళ్లిపోయారు. పైడిపుట్టలో నివాసం ఉన్న సీతారామరాజు రోజూ అడ్డతీగల సైకిల్‌పై వెళ్లి పత్రికలు చదివేవారు. సీతారామరాజుపై నిఘా ఉంచి బ్రిటిష్ వారు రామరాజు దినచర్య రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లే ముందు పైడిపుట్టలో భూమి ఇచ్చిన దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగన్నదొరకు తిరిగి భూమిని ఇచ్చి రాసిన లేఖ నేటికీ పదిలంగా ఉంది. రంప రాజ్యాన్ని మునసబుదారు భూపతి పాలనలో ఉండేది. తరువాత అతడి వారసులు పాలించారు. వారు పంట, తాటిచెట్లపై పన్నుల భారం మోపారు. అది తట్టుకోలేక గిరిజనులు తిరగబడ్డారు. గిరిజనులు జరిపిన రంప పితూరీకి అల్లూరి అండగా నిలిచారు. ఏజెన్సీలో పోలీస్స్టేషన్లపై అల్లూరి దాడి బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు సాయుధ పోరాటమే మార్గమని భావించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు.1922లో విశాఖ జిల్లా చింతపల్లి, 23న కేడీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేసి ఆయుధాలు కొల్లాగొట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనికులను రంగంలో దింపింది. కొంత కాలం వ్యవధి తరువాత 1922 అక్టోబర్ 15న అడ్డతీగల, 19న రంపచోడవరం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరులతో దాడి చేసిన అల్లూరి సీతారామరాజు తాను గతంలో నివాసం ఉన్న పైడిపుట్ట వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. అక్కడ కొంత సమయం గిరిజనులతో అల్లూరి మాట్లాడారు. అక్కడి నుంచి గంగవరం మండలం మోహనాపురం మీదుగా రంప గ్రామానికి వచ్చారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి అల్లూరి నడయాడిన మన్యం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి అల్లూరి దాడి చేసిన పోలీస్స్టేషన్లు, ఆయన నివాసం, వ్యవసాయం చేసిన పైడిపుట్ట, బ్రిటిష్ వారి చేతిలో చనిపోయిన కొయ్యూరు, అల్లూరి సమాధి ఉన్న కేడీ పేట వరకు పర్యాటకులు తిలకించేలా అభివృద్ది చేయాల్సి ఉంది. కృత్తివెంటి స్కూల్లో అల్లూరి విద్యాభ్యాసం రామచంద్రపురం : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగిన అల్లూరి సీతారామరాజు ప్రాథమిక విద్యాభ్యాసం ఏడాది పాటు రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు స్కూల్లో సాగింది. ప్రముఖ న్యాయవాది కృత్తివెంటి పేర్రాజు పంతులు వంద ఎకరాల భూమిని దానం చేసి పట్టణంలో 1905లో జాతీయ పాఠశాల అనే నామకరణం చేసి మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఈ పాఠశాలను మొదట్లో స్థాపించారు. సమర వీరుడు అల్లూరి సీతారామరాజు రామచంద్రపురం కృత్తివెంటి మిడిల్ స్కూల్లో 6వ తరగతి విద్యను అభ్యసించినట్టు చెబుతున్నారు. నాలుగో తరగతిని తుని రాజావారి పాఠశాలలో 1913 జూలై 25న (అడ్మిషన్ నంబర్797) చేరినట్టు అప్పట్లో వార్తాపత్రికల ద్వారా తెలిసింది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నడయాడిన కృత్తివెంటి స్కూల్ 1915–16లో సీకే గోవిందరాజు ప్రధానోపాధ్యాయుడిగా ఉండగా కృత్తివెంటి మిడిల్ స్కూల్లో అల్లూరి సీతారామరాజు ఆరో తరగతి చదివినట్టు స్పష్టమవుతోంది. అనంతరం ఆయన కాకినాడ పీఆర్ హైస్కూల్లో, నర్సాపురంలో చదివినట్టు తెలుస్తోంది. అల్లూరి నడయాడిన పాఠశాలగా నేటికీ పలు సందర్భాల్లో పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో వక్తలు చెబుతుంటారు. 2006 జనవరి 9న పాఠశాల శత జయంతి ఉత్సవాల్లో కూడా అల్లూరిని పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కొనియాడారు. -
కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెడతాం : అవంతి
సాక్షి, విశాఖపట్నం : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని సీతమ్మధారలోని ఆయన విగ్రహానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి గొప్పతనాన్ని మంత్రి గుర్తుచేశారు. విశాఖలో ఏర్పడే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని మంత్రి పునరుద్ఘాటించారు. అందరూ అల్లూరి స్పూర్తిగా స్వార్థ రహిత జీవితం గడపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమ్మఒడి పథకంతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే అక్షరాస్యతలో నంబర్ వన్‌గా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో యలమంచిలి ఎమ్మెల్యేలు కన్నబాబు, వైఎస్సార్సీపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు, సత్తిరామకృష్ణారెడ్డి, ప్రేమ్‌బాబు, బాకిం శ్యామ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
విప్లవ వీరుడిని విస్మరించిన గత ప్రభుత్వం
-
పార్లమెంటులో అల్లూరి విగ్రహం..!
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై విగ్రహ కమిటీ కూడా ఆమోదం తెలిపినందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు విలేకర్లతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలతో పాటు చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని ఏజెన్సీ ప్రాంతాల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుందని, 73వ స్వాతంత్ర దినోత్సవం కల్లా అల్లూరి విగ్రహ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులై 4న అల్లూరి జయంతి సందర్భంగా ఆరోజు పార్లమెంట్లో ప్రత్యేకంగా మాట్లాడేందుకు జీరో అవర్‌లో స్పీకర్ అనుమతి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.