మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే మావోయిస్టులపై గిరిజనులు తిరుగుబాటు చేశారని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే మావోయిస్టులపై గిరిజనులు తిరుగుబాటు చేశారని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. మావోయిస్టులు కేవలం తమ ఉనికిని కాపాడుకోడానికే కొత్తగా పెళ్లయిన గిరిజన యువకుడు సంజీవరావును చంపారని అన్నారు. గ్రామస్తుల దాడిలో చనిపోయిన వాళ్లు ఇద్దరూ మావోయిస్టులేనని ఆయన చెప్పారు. ఈ సంఘటన ఆత్మరక్షణ పరిధిలోకే వస్తుందని, అయితే.. దీన్ని మాత్రం వాళ్లు కోర్టులోనే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు.
గాయపడ్డ మావోయిస్టుపై మంగళవారం సాయంత్రానికి సమాచారం వస్తుందని ఆయన అన్నారు. గ్రామస్తులపై సెక్షన్ 320 (ఎ) కింద కేసు నమోదు చేశామన్నారు. మరణించిన మావోయిస్టు శరత్ కుటుంబానికి సమాచారం ఇచ్చామని, మరో మావోయిస్టు గణపతి మృతదేహాన్ని వాళ్ల కుటుంబ సభ్యులే తీసుకెళ్లినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.