sp praveen
-
ఉనికి కోసమే మావోయిస్టుల ఘాతుకం
వ్యాపారి హత్యపై స్పందించిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ అర్ధరాత్రి అడవుల్లో పర్యటన సీలేరు: మావోయిస్టులు ఉనికి కోసమే వ్యాపారి గుండూరావును హతమార్చారని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. ఆయన సీలేరులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి పర్యటించారు. జీకేవీధి నుంచి సీలేరు వరకు ఉన్న అడవుల్లో అర్ధరాత్రి ప్రయాణించి రాత్రి ఒంటిగంట సమయంలో సీలేరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెల్లవార్లూ స్టేషన్‌లోన ఉన్న ఆయన మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. పావురాయి దళ సభ్యుడిని పట్టించాడనే అనుమానంతో జీకేవీధి మండలానికి చెందిన అపరాల వ్యాపారి గుండూరావును చంపాలని అయిదేళ్లుగా మావోయిస్టుల టార్గెట్ చేశారని చెప్పారు. ఆ వ్యాపారి ఏడాదిపాటు పోలీసు భద్రతలోనే ఉన్నాడని, రెండు రోజుల క్రితం ఎక్కడ ఉన్నావ ని ఫోన్ చేస్తే నర్సీపట్నంలో ఉన్నానని చెప్పాడన్నారు. గుండూరావు మళ్లీ అపరాల వ్యాపారం చేసేందుకు మావోయిస్టులతో సంబంధాలు పెంచుకుందామనే ఉద్దేశంతో అతని భార్య, తమ్ముడిని రాయబారానికి పంపాడని, తమ నుంచి ఎటువంటి హాని ఉండదని చెప్పి మావోయిస్టులు నమ్మించి హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఔట్‌పోస్టులతో గిరిజనులకు మేలు ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువ శాతం ఔట్‌పోస్టులు కావాలని కోరుకుంటున్నారని, అవి పెట్టడం వల్ల గిరిజనులకు మేలు జరుగుతుందే తప్ప నష్టం లేదని చెప్పారు. మావోయిస్టులు గిరిజనుల చేత చెట్లు నరికించడం, ఇళ్లు తగలబెట్టించడం, గిరిజనుల హత్య వంటి చట్ట వ్యతిరేక పనులు చేయించడంతో తాము గిరిజనులపై కేసులు నమోదు చేస్తున్నామని, ఔట్ పోస్టులు ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గిరిజనులకు చేరువయ్యేందుకే రాళ్లగెడ్డలో ఔట్ పోస్టును ఏర్పాటు చేశామని, కేంద్రం నుంచి అదనపు బలగాలు రావాల్సి ఉన్నందున ప్రస్తుతం తమ వద్ద ఉన్న సివిల్ పోలీసు బలగాలతోనే అక్కడ భద్రతను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులల్లో పోలీస్స్టేషన్లపై మావోయిస్టులు దాడులు చేసే అవకాశం లేదని తెలిపారు. ఏజెన్సీలో ఆధునిక పోలీస్స్టేషన్లు ఏజెన్సీలో రూ.2 కోట్లతో కొత్త ఆధునిక పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని, ఇందులో సీలేరు కూడా ఉందని ఎస్పీ చెప్పారు. ఒక్కో ఔట్‌పోస్టుకు 120 మంది పోలీసులు, ఒక సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని, వీటి వల్ల గిరిజనుల భద్రతతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటవుతాయన్నారు. కోరుకొండ పంచాయితీల్లో రూ.8 కోట్లతో రహదారులు, మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 30 వేలకు పైగా కేసులు నమోదు చేశామని, ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేశామని వివరించారు. ఆయన వెంట సీఐ వెంకటరావు, సీలేరు ఎస్ఐ మురళీధర్ ఉన్నారు. -
'ఆ ఐదుగురు పర్యాటకులే'
-
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర కలకలం సృష్టించింది. అరకు మండలం గిన్నిల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. గిన్నిల- గిరజాయి ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పలు కిట్ బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఒరిస్సాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలతో పాటు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
గొల్లూరులో మావోయిస్టుల స్థావరం
పోలీసుల రికార్డుకు ఎక్కని ప్రాంతం మావోయిస్టుల స్థావరాన్ని ఛేదిస్తాం 3 జిల్లాల ఉమ్మడి కూంబింగ్‌కు చర్యలు విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పాడేరు: ఒడిశాలోని కోరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులోని పొట్టంగి బ్లాక్‌లో గొల్లూరు మారుమూల ప్రాంతాన్ని స్ధావరంగా చేసుకొని మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారని విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమావేశం అనంతరం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. గొల్లూరు ప్రాంతం మావోయిస్టుల అడ్డాగా మారిందన్న విషయం ఇంత వరకు ఒడిశా, విజయనగరం, విశాఖ జిల్లాల పోలీసు యంత్రాంగం గుర్తించ లేదన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతం పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదని, ఇక్కడ మావోయిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న వైనం పోలీసు యంత్రాంగాన్నే ఆశ్చర్యపరుస్తుందన్నారు. 3 జిల్లాల సరిహద్దులోని లోయప్రాంతం కావడంతో ఇంత వరకు పోలీసులకు అనుమానం రాలేదన్నారు. అరకులోయ మండల కేంద్రానికి 20 కి.మీ దూరంలో ఉన్న గొల్లూరులో ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయనే పక్కా సమాచారం ఉందన్నారు. మావోయిస్టుల స్థావరాన్ని చేధించేందుకు కొరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. తాను,విజయనగరం, కోరాపుట్టు ఎస్పీలంతా ఉమ్మడి వ్యూహంతో కూంబింగ్ చర్యలను చేపడతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొట్టంగి బ్లాక్ పరిధిలో మావోయిస్టు డొంబ్రి ఎన్‌కౌంటర్‌కు ప్రతికారంగా మావోయిస్టులు ఇద్దరు కొండదొర కులస్తులను హతమార్చారని, గత నెల సొంకి సమీపంలో గిరిజనేతరుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారని తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్టు,విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం వద్ద కూడా ఈ మారుమూల లోయ ప్రాంతం సమాచారం లేదన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏఓబీలోని మావోయిస్టు కేడర్ అంతా అక్కడే మకాం ఏర్పరచుకున్నట్లు తెలుస్తుందన్నారు. మావోయిస్టుల చర్యలను అణచి వేసి ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. విశాఖ ఏజెన్సీలోని ఐఏపీ పథకం కింద చేపట్టిన రూ.3 కోట్ల రోడ్డు పనుల పురోగతిపై ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమీక్షించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించామని ఏజెన్సీలో ఇంజనీరింగ్ పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు పోలీసుశాఖ కూడా కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. -
అల్లూరి స్ఫూర్తితోనే గిరిజనుల తిరుగుబాటు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే మావోయిస్టులపై గిరిజనులు తిరుగుబాటు చేశారని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. మావోయిస్టులు కేవలం తమ ఉనికిని కాపాడుకోడానికే కొత్తగా పెళ్లయిన గిరిజన యువకుడు సంజీవరావును చంపారని అన్నారు. గ్రామస్తుల దాడిలో చనిపోయిన వాళ్లు ఇద్దరూ మావోయిస్టులేనని ఆయన చెప్పారు. ఈ సంఘటన ఆత్మరక్షణ పరిధిలోకే వస్తుందని, అయితే.. దీన్ని మాత్రం వాళ్లు కోర్టులోనే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. గాయపడ్డ మావోయిస్టుపై మంగళవారం సాయంత్రానికి సమాచారం వస్తుందని ఆయన అన్నారు. గ్రామస్తులపై సెక్షన్ 320 (ఎ) కింద కేసు నమోదు చేశామన్నారు. మరణించిన మావోయిస్టు శరత్ కుటుంబానికి సమాచారం ఇచ్చామని, మరో మావోయిస్టు గణపతి మృతదేహాన్ని వాళ్ల కుటుంబ సభ్యులే తీసుకెళ్లినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.