ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి | two Maoists killed in encounter in Visakha agency | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి

Published Fri, Dec 11 2015 8:19 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

two Maoists killed in encounter in Visakha agency

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర కలకలం సృష్టించింది. అరకు మండలం గిన్నిల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు.

గిన్నిల- గిరజాయి ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పలు కిట్ బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఒరిస్సాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలతో పాటు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement