andhra odisha border
-
ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో పెద్దపులి కలకలం
-
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
మావోయిస్టు అగ్రనేత జగన్‌కు మాతృవియోగం
సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. పండన్న అలియాస్ జగన్ స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలోని కొమ్ములవాడ గ్రామం. పండన్న ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి తల్లి సీతమ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు. ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు చూసుకోవాలని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన జగన్, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు. -
‘మత్తు’కు ముకుతాడు.. ఏపీ సర్కార్ చర్యలతో అడ్డుకట్ట
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది. (ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు ఆపరేషన్ పరివర్తన్ ఇలా.. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. ► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు. ► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది. ► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు. ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ ► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది. ► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. ► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. ► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు ► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు. ► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు. ► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు. ► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు. ► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు. ► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి. దేశంలోనే తొలిసారి గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గిరిజనుల జీవితాల్లో వెలుగు గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రాగులు పంట వేశాను ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం. – పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి మా బిడ్డల భవిష్యత్ కోసమే మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం. – బేతాయమ్మ, రైతు, వాకపల్లి ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. – లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి ఈ–క్రాపింగ్ చేస్తున్నాం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్ -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
ఈ పిటిషన్లో జోక్యం చేసుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాలకు సంబంధించి ఏపీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్టికల్ 131 చెల్లుబాటుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. -
కొటియా గ్రామాలపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొటియా గ్రామాలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. రెండు రాష్ట్రాల మధ్య అధికార పరిధికి సంబంధించిన ఆర్టికల్ 131 చెల్లుబాటును సవాల్ చేస్తూ ఒడిశా ఇప్పటికే ఓ వ్యాజ్యం దాఖలు చేసిందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్ తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలు కొనసాగించాలని లేదంటే ఆర్టికల్ 131పై ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యం సహా రెండు అంశాలనూ ఒకేసారి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. ఆర్టికల్ 131పై ఒడిశా వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ స్పందిస్తూ.. తమకు అభ్యంతరం లేదని చెప్పారు. -
‘కొటియా’ క్లస్టర్లో ఏపీ జెండా రెపరెప
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్ జిల్లాలోని కొటియా పల్లెల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని బ్యాలెట్ ద్వారా ఒడిశా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా కొటియా క్లస్టర్ పరిధిలో పొట్టంగి జోన్–1 స్థానానికి ఫిబ్రవరి 18న పోలింగ్ జరిపించింది. అదే నెల 26న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితం ప్రకటించారు. మహిళలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఒడిశా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మమతా జానీ అనే మహిళను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కొటియా గ్రామాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించిన అక్కడి మూడు రాజకీయ పార్టీలు జానీ గెలుపు కోసం పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. తెలుగు మాట్లాడే స్వతంత్ర అభ్యర్థిని టికై గెమెల్ 3,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెమెల్కు 10,354 ఓట్లు రాగా, మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జానీకి 6,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థి ఓటమి పాలవడంతో ఒడిశా రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. తెలుగు అభ్యర్థిని గెలిపించటం ద్వారా తాము ఏపీలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు. -
దైవం 'నైవేద్య' రూపేణా..
నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం రూరల్: ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం. ఊరి అమ్మోరికి.. ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు. పాకంతో పసందు ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది. గజముద్దలకు కేరాఫ్ ఉద్దానం నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు. అమ్మవారి స్వరూపం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గజముద్దను అమ్మోరు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. భక్తులు ఎంతో భక్తితో తలపై ధరించి ఊరేగిస్తారు. ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. – డీబీ పురుషోత్తం, అమ్మవారి పూజారి తరాల నుంచి తయారీ మా కుటుంబం తరతరాల నుంచి అమ్మవారి నైవేద్యం గజముద్దను తయారు చేస్తోంది. నాణ్యమైన ధాన్యం పేలాలను సేకరించి పవిత్రంగా తయారు చేస్తాం. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నెల వరకు గిరాకీ ఉంటుంది. – ధ్రౌపతి గుడియా, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం -
‘మా ఆశలన్నీ జగన్‌పైనే.. మేము ఆంధ్రాలోనే ఉంటాం’
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సాలూరు నియోజకవర్గ పరిధిలో ఐదు గ్రామ పంచాయతీల పరిధిలోని 34 కొటియా గ్రూపు గ్రామాలపై వివాదం దీర్ఘకాలంగా ఉంది. అక్కడ దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైనపుడు కానీ, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైనపుడుగానీ అక్కడ సర్వే లేదు. ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... ఈ వివాదాన్ని పార్లమెంట్లో తేల్చుకోవాలని, అంతవరకూ ఆక్రమణ చర్యలకు పాల్పడవద్దని సూచిస్తూ 2006 సంవత్సరంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ వారంతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. తమ పూర్వీకుల నుంచి ఆంధ్రా ఆచార సంప్రదాయాలను పాటిస్తున్న తమను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించాలని ఇటీవలే 16 గ్రామాలకు చెందిన కొటియా ప్రజలు తీర్మానాలు చేశారు. మేము ఆంధ్రాలోనే ఉంటాం మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మేము ఆంధ్రులం. ఒడిశా రాష్ట్రంలో చేరబోం. ఇన్నాళ్లకు ఒడిశాతో చర్చల్లో కొటియా చేరింది. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో జగన్మోహన్రెడ్డి చర్చించడం, అక్కడ సానుకూల పరిణామాలు రావడం శుభపరిణామం. – కూనేటి గింద, కొదమ ఎంపీటీసీ, సాలూరు మండలం మా ఆశలన్నీ జగన్‌పైనే.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో మా కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మేము ఆంధ్రాలో ఉంటామని తీర్మానాలు చేశాం. వాటికి విలువ ఉంటుంది. మేము ఆంధ్రాలోనే ఉండాలన్న మా ఆశలు నెరవేర్చేది సీఎం జగన్ మాత్రమే. – కూనేటి బెతురు, పగులుచెన్నేరు సర్పంచ్, సాలూరు మండలం ఇద్దరు సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం సంతోషదాయకం. కొటియా, జంఝావతి, శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్టు సమస్యలపై సానుకూల వాతావరణంలో చర్చించారు. వీరి హయాంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని ఒడిశా సీఎం సాదరంగా ఆహ్వానించడం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం. – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఏవోబీలో ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది. ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది. మ్యాపింగ్‌తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు ‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు. ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో.. ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ ఉన్నతాధికారులు అంచనా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్ఈబీ అధికారులు అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా డాగ్‌స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. 18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
గత ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా: పవన్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో గంజాయి మాఫియా రాజ్యమేలిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో తనకు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పలు ట్వీట్లు చేశారు. ‘2018లో ఏవోబీలోని గిరిజన ప్రాంతాల్లో నేను పర్యటించాను. అక్కడ మాఫియా రూపంలో సాగుతున్న గంజాయి వ్యాపారం గురించి స్థానికులు భయపడుతూనే ఫిర్యాదులు చేశారు. దీన్ని అరికట్టడానికి కేంద్రం అంతర్రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి’ అని పవన్ కోరారు. ‘విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని యువకులు ఇందులో చిక్కుకుంటున్నారు. దీని వెనుక ఉండే కీలక వ్యక్తులు మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.’ అని పవన్ ట్వీట్ చేశారు. -
ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రస్తుత ఆంధ్రా పాలకుల దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని, తమను ఆంధ్రప్రదేశ్ వాసులుగానే పరిగణించాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు. 21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో కోరాపుట్ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, వెంకటరావు, మయూక్ అశోక్, డీఆర్వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అన్నివిధాలా రక్షణ... కొటియా గ్రామాల ప్రజలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక హామీ ఇచ్చారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొటియా ప్రజలు ఆమెను కలిశారు. కొటియాలో త్వరలోనే పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు ఆమె చెప్పారు. వారికి నిత్యావసర వస్తువులను ఎస్పీ అందించారు. -
ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
ఏవోబీలో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవ సభ
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని మావోయిస్టుల మిలీషియా కమాండర్లు, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టు మిలీషియా కమాండర్లు, గ్రామ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మావోయిస్టుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించారు. అనంతరం తెలుగు, ఒడియా భాషలలో రాసిన బేనర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులపై అణచివేత చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ సభను ఏర్పాటు చేశారు. జననాట్య మండలి ఆధ్వర్యంలో తెలుగు, ఒడియా భాషలలో విప్లవ గీతాలను ఆలపించారు. సభా ప్రాంగణం అంతా ఎర్ర జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. సభలో ఆంధ్ర ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆంధ్ర–ఒడిశా ‘సరిహద్దు’పై చర్చలు జరపాలి
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వివాదంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ సీఎంకు లేఖ రాశారు. ఒడిశా–ఏపీ రెండు రాష్ట్రాల నివాసితుల ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. చీఫ్ సెక్రటరీలు, డెవలప్మెంట్ కమిషనర్ల స్థాయిలో ఉమ్మడి–వర్కింగ్ గ్రూప్ చర్చలతో పాటు, సమస్యల పరిష్కారానికి భవిష్యత్ రోడ్ మ్యాప్ రూపకల్పనకు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని సూచించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్‌లోని కొటియా గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా అనేక ఘర్షణలు జరిగాయని, అవి ఇప్పుడు గజపతిలోని ఇతర సరిహద్దు గ్రామాలకు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కొటియాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. ఒడిశా ప్రభుత్వం పోలీసులను మోహరించిందని, కొటియా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
మందస: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట పంచాయతీలో ఉన్న మాణిక్యపట్నంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజులుగా సమస్యాత్మకంగా మారిన ఈ గ్రామాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సందర్శించిన సమయంలో ఒడిశా అధికారులు వ్యవహరించిన తీరు విమర్శనీయంగా మారింది. మాణిక్యపట్నం అంగన్వాడీ కేంద్రానికి సీల్‌వేసి, కార్యకర్త సవర లక్ష్మి భర్త గురునాథాన్ని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడం.. శ్రీకాకుళం, పర్లాకిముడి కలెక్టర్ల చర్చలతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమవడం తెలిసిందే. ఈ సమస్యను, సరిహద్దులను తెలుసుకోవడానికి మంత్రి అప్పలరాజు గురువారం మాణిక్యపట్నం వెళ్లారు. ఒడిశా అధికారులు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా.. ఆంధ్రా అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గారబంద తహసీల్దార్ ఆధ్వర్యంలో కేంద్రానికి సీల్ వేశారని, వెంటనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, మందస ఎస్ఐ కోట వెంకటేశ్‌లను ఆదేశించారు. ఆంధ్రా సరిహద్దులోని గిరిజనులను తరచూ బెదిరిస్తూ.. కేసులు నమోదు చేయడం, బంధించడం ఏంటని ప్రశ్నించారు. గురునాథంపై అక్రమంగా కేసు పెట్టి, సమస్యను తీవ్రతరం చేయడానికే ఒడిశా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం, అధికారులు సహనంతో వ్యవహరిస్తుండటం చేతగానితనంగా భావిస్తున్నారన్నారు. తమ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి వెనుదిరగగానే మొదలైన బెదిరింపులు అక్కడి నుంచి బయలుదేరిన మంత్రి మందస వరకు వచ్చేసరికే.. ఒడిశాలోని గజపతి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సంగారాం పండా, బీడీవో రాజారంజిత్, పోలీసులు మాణిక్యపట్నం వెళ్లి మళ్లీ గిరిజనులను బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో మంత్రి అప్పలరాజు, సబ్ కలెక్టర్ వికాస్‌మర్మట్, తహసీల్దార్ బడే పాపారావు, ఎంపీడీవో వాయలపల్లి తిరుమలరావు, డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్ఐలు, పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే మళ్లీ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అయినా ఒడిశా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవద్ద ఏవోబీకి సంబంధించిన రికార్డులున్నాయని చెప్పిన మంత్రి.. మీరు చూపించే ఆధారాలేంటని ఒడిశా అధికారుల్ని ప్రశ్నించారు. తమ వద్ద కూడా ఉన్నాయన్న వారు ఎటువంటి రికార్డులు చూపించలేదు. తాము ఆంధ్రాలోనే ఉంటామని గిరిజనులు చెప్పడంతో ఒడిశా అధికారులు అసహనంతో ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించగా.. ఓ మేజిస్ట్రేట్ స్థాయిలో ఇలా వ్యవహరించడం తగదని మంత్రి హెచ్చరించారు. దీంతో గిరిజనులంతా సీఎం జగన్ జిందాబాద్, మంత్రి అప్పలరాజు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఒడిశా అధికారుల చర్యలు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని, ఆంధ్రా అధికారులు కూడా ఇదేస్థాయిలో వ్యవహరిస్తే పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం శాంతియుతంగా రెండురాష్ట్రాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సాబకోట సర్పంచి సవర సంధ్యారాము, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, మండల అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, యువజన కార్యదర్శి శానాపతి కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ
సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంతరం కూంబింగ్ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు. మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్ సమస్య ఉండేది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. -
మావోయిస్టు కీలకనేతలు అరెస్ట్..
సాక్షి,అమరావతి: మావోయిస్టుల కోసం పోలీసులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలకనేతలు పోలీసులుకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు చెపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా కలిమెల దళ సభ్యులును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేసిన దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుండగా..అది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. -
మా భూభాగంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దు..
రాయగడ: ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రాయగడ సమితిలోని సనొలకుటి గ్రామానికి కూతవేటు దూరంలో విజయనగరం జిల్లాకు చెందిన బీరపాడు పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ ప్రజలు రాకపోకలకు ఒడిశా భూభాగంలోని సనొలకుటి గ్రామం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నెలల కిందట ఏపీ అధికారులు సనొలకుటిలో వంతెన, రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు మెరుగవుతాయని మన అధికారులు చెబుతుండగా.. ఒడిశా అధికారులు మాత్రం దీనికి అంగీకరించలేదు. తమ భూభాగంలో ఏపీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వంతెన, రోడ్డు పనులకు అనుమతివ్వాలని విజయనగరం అధికారులు ఈ నెల 16న రాయగడ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం రాయగడ తహసీల్దార్ ఉమాశంకర్ బెహరా, బీడీవో లక్ష్మీనారాయణ సోబొతొ నేతృత్వంలో రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు సనొలకుటిలో బుధవారం పర్యటించారు. ఏపీ అధికారులు కూడా సరిహద్దు గ్రామానికి వెళ్లారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు. అనంతరం గ్రామ పరిస్థితిపై కలెక్టర్ సరోజ్‌కుమార్ మిశ్రాకు నివేదిక సమర్పించారు. ఒడిశాకు సంబంధించిన భూభాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ఏపీ అధికారులకు కలెక్టర్ లేఖ ద్వారా బదులిచ్చారు. ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాలైనా తామే (ఒడిశా ప్రభుత్వం) చేపడతామని లేఖలో తెలియజేసినట్టుగా తెలిసింది. -
మా గ్రామాలను ఆంధ్రాలో కలపండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత పాలకుల మద్దతు లభించక స్తబ్దుగా ఉన్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఇన్నాళ్లకు చైతన్యం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అందిస్తున్న 24 రకాల సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని చెబుతున్నారు. తాము ఆంధ్ర ప్రాంతానికి చెందినవారమేనని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంగళవారం మరోసారి బయటపెట్టారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని సారిక గ్రామ పంచాయతీ నేరెళ్లవలస సంత వద్ద గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని రాయిపాడు, బిట్ర, తొలిమామిడి, సీడిమామిడి, మెట్టవలస, గాంధీవలస, టడుకుపాడు, బొందెలుపాడు, సివర, బొరియమెట్ట, పొడ్డపుదొర తదితర 15 గిరిజన గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్‌ను కలిశారు. రాగి రేకుపై రాసిన పన్ను ఒప్పంద పత్రం తమ తల్లిదండ్రులు సాలూరు మండలం సారిక గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎంపీ డిప్పల సూరిదొరకు శిస్తు చెల్లించేవారని గుర్తు చేశారు. అందుకు ఆధారంగా రాగిరేకులపై రాసిన ఒప్పందాలను సభలో ప్రదర్శించారు. ఒడిశా ప్రభుత్వం ప్రేరేపించడంతో కొంతమంది నాయకులు, అధికారులు తమ గ్రామాలను ఒడిశా భూభాగంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పూర్తిస్థాయిలో ఆంధ్రా పౌరులుగా గుర్తించేలా చూడాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే రాజన్నదొర స్పందిస్తూ.. ఒడిశా మాదిరిగా తాము దుందుడుకు చర్యలకు పాల్పడబోమని, ఆ రాష్ట్ర చర్యలను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారికి వివరించారు. -
రేపు ఏవోబీ బంద్
సీలేరు/పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికల కోసం సమాచారం సేకరిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్‌ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్‌కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. -
శిక్షణకొచ్చి చిక్కారు!
సాక్షి, అమరావతి, కొయ్యూరు, పాడేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో క్యాడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించి పట్టు సాధించేందుకు మావోయిస్టులు రూపొందించిన వ్యూహం విఫలమైంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి మొదలైన కూంబింగ్, ఎదురు కాల్పులు ఏపీలో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఏవోబీ పరిధిలోని మల్కనగిరిలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీ, ఒడిశా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఒడిశాలో తప్పించుకుని... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌తోపాటు కొందరు అగ్ర నేతలు శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్టు సమాచారం అందడంతో మూడు రోజుల క్రితం మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల్లో ఒడిశా కోబ్రా పోలీసులు, బీఎస్పీ దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం నుంచి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసు బలగాలకు కులబెడ గ్రామంలో మావోయిస్టులు తారసపడ్డారు. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఇన్సాస్ రైఫిల్, ఏకే–47 మ్యాగజైన్, ఇన్సాస్ మ్యాగజైన్, డిటోనేటర్లు, బ్యాటరీలు, ఐఈడీ బాంబుల తయారీ పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అటు ఒడిశా ఇటు ఏపీలోనూ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మన్యం అడవుల్లోకి సరుకులు తరలిస్తూ.. ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట–పి.గంగవరం మధ్యనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు సందే గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్, ఏరియా కమిటీ సభ్యుడు సంతు నచిక, మావోయిస్టు పార్టీ సభ్యులు లలిత, పైకే చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఏకే–47తోపాటు తపంచా, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల ప్రాంతంలో డీసీఎంగా పనిచేసిన రణదేవ్ కూడా మృతుల్లో ఉన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం హెలికాఫ్టర్‌తో గాలింపు చేపట్టారు. గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని విశాఖ రూరల్ ఎస్సీ బి.కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒడిశాలో ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఒడిశాలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. తప్పించుకుని ఒడిశాలో మరోవైపు వెళ్లినవారిలో ఉదయ్‌తోపాటు మరికొందరు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. వారి కోసం ఒడిశా పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
సంక్షేమ పాలనకే ‘కొటియా’ ఓటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజల మనోగతంపై ‘ఒడిశా వద్దు మొర్రో’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం ఇరు రాష్ట్రాల్లోని పాలకులను కదిలించింది. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొటియా ప్రజలకు ప్రయోజనాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవడానికి దోహదపడింది. కొటియా వివాదంపై ట్విట్టర్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం స్పందించారు. ‘కొటియా గ్రామాలన్నీ ఆంధ్రాలోనే ఉంటాం. ఒడిశా వద్దు మొర్రో అంటున్నాయి. సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఇదే సాక్ష్యం. వైఎస్సార్ తర్వాత ఆ గిరిజన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు సీఎం జగనే. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం వల్ల ఆంధ్ర స్కూల్స్‌లోనే వారి పిల్లల్ని చేర్పిస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ కొటియా గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా ఐడీటీఏ పీఓ కూర్మనాథ్ చర్యలు చేపట్టారు. పట్టుచెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పట్టుచెన్నూరు, సల్ఫగుడ, ఎగువ మెండంగి గ్రామాలకు, పగులు చెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పగులు చెన్నూరు, డోలియాంబ, ముడకారు గ్రామాలకు, నేరెళ్లవలసలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పనుకువలస, దొరలతాడి వలస, రణశింగి, ఫణికి, సింహాగెడ్డ, గాలిగబడారు, మూలతాడివలస గ్రామాలకు, దూలిభద్రలోని స్టాక్ పాయింట్ నుంచి ఎగువ శంభి, కొటియ, దూలిభద్ర, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర గ్రామాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం, అక్కడి పోలీసులు కొటియా ప్రజలను అడ్డుకోవడాన్ని ఆంధ్రా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొటియా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీఎంసీఎం ఎర్రంన్నాయుడు వివాదాస్పద గ్రామాల్లో పర్యటించారు. -
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో శనివారం మరోసారి తుపాకీలు దద్దరిల్లాయి. సరిహద్దుల్లో కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఘటనపై మల్కనగిరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మిల్ట్రీ ప్లాటు ఇంచార్జ్ కిషోర్ మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు ఏసీఎమ్ నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్నాం. మరో దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారు' అని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా, సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అనంతరం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
ముదురుతున్న సరిహద్దు వివాదం
సాక్షి, కొరాపుట్: ఆంధ్ర–ఒడిశా బోర్డర్ వివాదాలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. ఇదివరకు ఉన్న కొఠియా, నారాయణపట్నం సమితిలోని చినకరిభద్ర గ్రామాల సరిహద్దుల వివాదం కంటే ఇటీవల బయటపడిన పొట్టంగి సమితి, సంబయి పంచాయతీలోని సునాబెడ గ్రామ సరిహద్దు వివాదంపై ఉభయ రాష్ట్రాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అధికంగా దృష్టి పెడుతున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఓ ప్రాంతం వారు పెట్టిన సైన్ బోర్డును ఇంకొక ప్రాంతం వారు తొలగించడం వంటి చర్యలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ఒడిశా అధికారులు, ప్రజాప్రతి నిధులు వివాదాస్పద గ్రామమైన సునాబెడకి వెళ్లి, ఆంధ్రప్రదేశ్ డుంబిరిగుడ మండలం పేరిట ఏర్పాటు చేసిన సరిహద్దు బోర్డును తొలగించారు. మళ్లీ అదే ప్రాంతంలో ఒడిశా తరఫున బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని వ్యతిరేకించిన సరిహద్దు ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజలు ఆ మరుసటి రోజే ఒడిశా తరఫున ఏర్పాటు చేసిన బోర్డును తీసివేసి, ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్ద వివాదం ముదురుతోంది. ఇటీవల ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పార్టీల నేతలు విశాఖపట్నంలో దగ్గరి ఏఓబీలోని 4 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, అక్కడి అడవులు, అటవీ భూములు తమవని, ప్రాణత్యాగానికైన సిద్దమవుతాము కానీ ఆ భూభాగాన్ని విడిచేది లేదని నినాదాలు చేసినట్లు సునాబెడ వార్డు మెంబరు ముసురు తవుడు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వివాదంపై సునాబెడ గ్రామస్తులు పొట్టంగి బ్లాక్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారికి తగిన రీతిలో మద్దతు, రక్షణ లేదని ఆక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివాదం నెలకొన్న గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ అధికారులు, ప్రజాపతినిధులు తమ మద్దతు తెలుపుతున్నారని, కానీ ఒడిశా తరఫున అటువంటి ఆసరా తమకు దొరకడం లేదని అక్కడి వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామస్తులు తమపై జరుపుతున్న బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని అక్కడి సునాబెడ తదితర సరిహద్దులోని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం
భీమారం: ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్ కోసం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్ తప్పించుకున్నారు. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్సాస్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు) పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్ అంచల్‌లోని జోడాంబో పోలీస్‌స్టేషన్ పరిదిలోని గురాసేటు, బీజింగ్, జంప్లూర్, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. -
ఏవోబీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం మావోయిస్ట్‌లు రెండు వాహనాలను దగ్ధం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరిజిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యి ఏవోబీ ప్రాంతంలో నిఘాను పెంచారు. ఏవోబీ వద్ద మావోయిస్ట్‌లకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా మావోయిస్ట్‌ల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని ముకిడిపల్లి, గురుసేతు, బెజ్జింగి, జంపలూరు, పర్లుబంద గ్రామాల్లో సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక దేశీయతుపాకీ, క్లైమెర్‌మెన్,వైర్, మూడు రంగుల్లో ఉన్న పేలుడు సామాగ్రీ, ఎనిమిది ఎలక్ర్టిక్ డిటోనేటర్లు , ఆక్సిజన్ సిలిండర్, కెమెరాఫ్లాష్, ఇనుపపైపులు, వైరు, మావోయిస్టు విప్లవసాహిత్యంకు సంబంధించిన వాటిని ఒడిశా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. చదవండి: సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు -
ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
సాక్షి, విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్ట్ కంచుకోటగా వెలుగొందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలీసులు వరుస కూబింగ్‌లతో పాటు ఎన్కౌంటర్లు సైతం కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. అయినప్పటికీ పట్టు కోసం పారాడుతున్న మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అండగా ఉంటున్నాయి. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటున్న ఆదివాసీలు సైతం మావోయిస్టులపై తిరుగబడుతున్నారు. తమ వెనుకబాటుకు కారణం మీరే అంటూ మావోలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దుల్లో గిరిజన ప్రజలు భారీ ర్యాలీని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని నినాదంతో 6 గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మావోయిస్టుల కంచుకోటలో వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, సెల్ టవర్ నిర్మించాలి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. (ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు) మరోవైపు తెలంగాణలోనూ మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. -
ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నిర్థిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని సూధికొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్‌మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు ఆయుధాలు తయారుచేస్తున్నట్లుగా తమకు రూఢీ అయిందని ఆయన తెలిపారు. -
ఏఓబీలో కలకలం..
మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి. వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని.. 2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్‌హంట్‌ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్‌ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది. -
ఏజెన్సీలో ముమ్మర కూంబింగ్
పాచిపెంట: ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి గిరిజన గూడ బూట్ల చప్పుళ్లతో మార్మోగింది. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా వటాఫ్ ప్రాంతంలోని ముకుడుపల్లి, విశా ఖ ఏజెన్సీ పెదబయలు మండలంలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మండ లంలోని ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన బంగారుగు డ్డి, అడారుపాడు, కాట్రాగుడ్డి కుంతాం తదితర ప్రాంతాల్లో డేగ కన్నుతో జల్లెడ పడుతున్నాయి. అ టు వైపు నుంచి ఒడిశా పోలీసు బలగాలు కూడా కూ బింగ్‌లో నిమగ్నయయ్యాయి, మండల కేంద్రాలు ప్రధాన రోడ్డలో వాహనాల తనిఖీని విస్తృతం చేసి నట్లు ఎస్ఐ సీహెచ్. గంగరాజు తెలిపారు. -
ఏవోబీలో మళ్లీ పేలిన తుపాకులు
పెదబయలు/పాడేరు: మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒక వైపు మావో యిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు నివ్వగా.. మరోవైపు అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మన్యంలో అప్రకటిత రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏవోబీలో శనివారం సాయంత్రం మళ్లీ తుపాకుల మోత మోగింది. దీంతో ఏవోబీలో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరగడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ, వారిని వెంటాడుతూ పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. ఈ నెల 16న మల్కన్‌గిరి జిల్లా జోడం పంచాయతీ ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు బలగాలు–మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా కటాఫ్ ఏరియా నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం తెలియడంతో ఆంధ్ర పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నెల 19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండూలు, మెట్టగుడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో బయటపడినట్టు, వారి నుంచి కిట్ బ్యాగులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు, లభ్యమైన సామగ్రి ఆధారంగా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీస్ బలగాలు కూబింగ్‌ను ఉధృతం చేశాయి. తాజాగా ఒడిశా రాళ్లగెడ్డ పంచాయతీ గజ్జెడిపుట్టు,దిగుడుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దయా అనే మావోయిస్టు మృతి చెందాడు. ఏవోబీలో వరుస ఎదురు కాల్పులతో యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం. వారోత్సవాలు భగ్నమే లక్ష్యంగా .. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఒడిశా కటాఫ్ ఏరియాలో ఏడు పోలీసుల అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలోఉన్న ముంచంగిపుట్టు మండలం భూషిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీలు, పెదబయలు మండలం ఇంజరి,గిన్నెలకోట ,జామిగుడ పంచాయతీల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో ఆంధ్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు భగ్నం చేయాలని పోలీసులు,ఎలాగైన వారోత్సవాలు జరపాలని మావోయిస్టుల పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఏవోబీలో ఎదురు కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కాస్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల వ్యవధిలో ఏవోబీలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. -
ఏవోబీలో అలర్ట్
పాడేరు: ఏవోబీలో మావోయిస్టు నేతలు, యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా ప్రాంతానికి దగ్గరగా ఉన్న సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అరకు సంతబయలు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో వారి కదలికలపై నిఘా పెంచారు. ఇదీ పరిస్థితి... లాక్‌డౌన్‌తో మావోయిస్టులు కూడా తమ కార్యకలపాలకు విరామం ప్రకటిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటన చేశారు. పోలీసులు కూడా అడవుల్లో కూంబింగ్ నిలిపివేశారు. అయితే మావోయిస్టులు జనావాసాల్లో సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఏవోబీలో నిఘాను పెంచింది. ఇటీవల చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల సంచారంపై ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు, యాక్షన్ టీమ్ సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసుశాఖ విడుదల చేసింది. వారి సమాచారం తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని పేర్కొంది. -
ఆంధ్రాలోకి నోఎంట్రీ
ఒడిశా, పర్లాకిమిడి: లాక్డౌన్ 4.0 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చినా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. అత్యవస వైద్య సేవల కోసం సరిహద్దు దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాలకు వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చికిత్స నిమిత్తం వెళుతున్నారు. వారిని పర్లాకిమిడి చెక్ గేట్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్రాలోకి వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుణుపురానికి చెందిన బిజయ గొమాంగో కుమార్తె మొహిసినీ గొమాంగో(10) పది రోజుల కిందట ఇంటి వద్ద ఆడుకుంటూ చెవిలో గులకరాయి పెట్టుకుంది. చెవి, తలనొప్పి పెడుతోందని తండ్రికి చెప్పగా ఆమెను పర్లాకిమిడిలోని ఒక ప్రైవేటు క్లీనిక్‌లో చేర్చించి చికిత్స అందించారు. అయినా ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు బయలుదేరారు. పర్లాకిమిడి చెక్‌గేట్ వద్ద ఒడిశా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చికిత్స కోసం శ్రీకాకుళం వెళ్తున్నామని, అనుమతివ్వాలని పర్లాకిమిడి పోలీసులను కోరారు. వారు స్పందించకపోవడంతో కలెక్టర్‌ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం ప్రతి రోజు అనేక మంది రోగులు ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చెక్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వెళ్లే వారిని అనుమతించాలని పలువురు న్యాయవాదులు, సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో స్టింగ్ ఆపరేషన్
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసుల వ్యూహం ఫలించింది. గతంలో ఆంధ్రా సరిహద్దులో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహిస్తే, నాటుసారా తయారుదారులు ఒడిశా కొండ కోనలకు పారిపోయి తప్పించుకునేవారు. అదే ఒడిశాలో చేపడితే ఇక్కడకు వచ్చి తలదాచుకునేవారు. ఈ అవకాశం ఇవ్వకుండా రెండు రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో చేసిన స్టింగ్ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ మేరకు పలు గ్రామాల్లో 520 లీటర్ల నాటుసారా, 8,500 లీటర్ల బెల్లంఊటలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఒకరిని అరెస్టు చేశారు. గురువారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీ సీతాపురం (20 లీటర్ల నాటుసారా), పెద్ద బురుజోల (400 లీటర్ల నాటుసారా, 2,500 లీటర్ల బెల్లంఊట), చిన్నబురుజోల (100 లీటర్ల నాటుసారా, 2 వేల లీటర్ల బెల్లం ఊట) భీంపురం (1,500 లీటర్ల బెల్లంఊట), తాలసింగి (2,500 లీటర్ల బెల్లంఊట) పట్టుబడ్డాయి. ఈ క్రమంలో పలువురు తప్పించుకుని పారిపోయారు. వారిలో పట్టుబడిన ఒక వ్యక్తి నుంచి వివరాలు సేకరించి మిగిలిన వారిని అరెస్టు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ సంయుక్త దాడుల్లో పలాస ఏఈఎస్ ఎం రాంబాబు, శ్రీకాకుళం ఎన్‌ఫార్సుమెంట్ ఏఈఎస్ సీ భార్గవ్, పలాస టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ సీఐ టీవీఏ నాయుడు, ఎన్పోర్స్మెంట్ సీఐ పీ రామచంద్రకుమార్, పలాస సీఐ బీ మురళీదార్, టెక్కలి సీఐ జీ రమేష్‌బాబు, పాతపట్నం సీఐ జీ చలపతిరావు, ఎస్ఐ ఎస్ కే అప్పాలస్వామి, సీహెచ్ రాజశ్రీ, ఒడిశా రాష్ట్రం పర్లాకిముండి సీఐ సాహు, బరంపురం సీఐ బిహారా, గారబందా సీఐ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏవోబీలో రెడ్ అలెర్ట్
పాడేరు,సీలేరు: మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవుట్ పోస్టుల ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. సోమవారం నుంచి పీఎల్జీఏ వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు.జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో రెండు నెలల కిందట జరిగిన ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తదనంతరం వారోత్సవాలు జరుగుతుండడంతో మావోయిస్టులు ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం. దీంతో మారుమూ ల గ్రామాల ప్రజలు బితుకుబితుకుమంటూ ఉన్నారు. అయితే పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. విశాఖ రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్‌లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీ సు అధికారులు పకడగ్బందీగా వ్యూహం రచించినట్టు సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసు పార్టీలు ఉమ్మడిగా ఏవోబీలో కూంబింగ్ చర్యలు చేపట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు,సీలేరు, జీ,కే.వీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. అరకు,డుంబ్రిగుడ,హుకుంపేట,అనంతగిరి పోలీసుస్టేషన్ల అధికారులు,ప్రత్యేక పార్టీల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి, రూడకోట అవుట్ పోస్టులలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో ఏవోబీ అంతా పోలీసు నిఘా అధికమైంది.అన్ని మండల కేంద్రాలు,ప్రధాన రోడ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణుకుల లగేజీ బ్యాగ్‌లను సోదా చేస్తున్నారు.కల్వర్టులు,రోడ్డు ఇరువైపులా బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులను నిలిపివేయనున్నారు. సీలేరు ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించిన వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దకు తరలించారు. -
క్షణ క్షణం.. భయం భయం
భామిని, పాతపట్నం: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు కూంబిం గ్ ముమ్మరం చేశారు. నిషేధిత మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్న తరుణంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఎస్పీఎఫ్ పోలీసులు శనివారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పాతపట్నం–మెళియాపుట్టి రహదారికి ఇరువైపుల తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వాహనాలను సోదా చేస్తున్నారు. లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాల సమయంలో ప్రతీకార చర్యలు తీసుకొని సంచలనాలు సృష్టించడం మావోయిస్టులకు ఆనవాయితీ. ఏవోబీ అంతా విస్తృత కూంబింగ్ జరపడంతో ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఏ క్షణానికి ఏమవుతుందోన్న ఆందోళనతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎంపీలకు పోలీసు యంత్రాంగం భద్రత పెంచింది. అప్రమత్తంగా ఉండమని వారిని అధికారులు హెచ్చరించారు. ముందస్తు చర్యలు జిల్లా సరిహద్దులో కీలకమైన పోలీస్ స్టేషన్లను జిల్లా కొత్త ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఇప్పటికే చుట్టివచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరున తివ్వా కొండల్లోని ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యే చర్యలు చేపట్టారు. కొన్ని గిరిజన గ్రామాల్లో కార్డన్–సెర్చ్ పేరుతో ఆదివాసీల గృహాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనుమానితుల వివరాలపై ఆరా తీశారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నిఘా చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఆర్‌వోపీలు చేపడుతున్నారు. గిరిజన గ్రామాల్లో గల ఎస్పీవోలకు జీతాలు పెంచి గుర్తింపు కార్డులు ఇస్తూ స్నేహ చర్యలను పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే నిషేధిత మావోయిస్టుల ఫొటోలతోపాటు రివార్డుల వివరాలు తెలియజేసి అప్రమత్తం చేసి ఉన్నారు. సరిహద్దులో ముందస్తుగా భారీ కూం బింగ్‌లకు సాయుధ పోలీస్ బలగాలు తివ్వాకొండల్లో మోహరింపచేశారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సానుభూతిపరులపై దృష్టి సారించి నిఘా పెంచారు. ఒడిశా పోలీసులతో సత్సంబంధాల కొనసాగింపుపై వివరాలు సేకరించారు. -
ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?
సాక్షి, రాయగడ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్లు సమాచారంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో జవాన్ల కూంబింగ్ ఉద్ధృతంగా సాగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో త్రిలోచనపూర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చగా...జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో కల్యాణ సింగుపురం ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ నాల్గవ బెటాలియన్, ముకుందపుర్ సీఆర్పీఎఫ్ బెటాలియన్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని భారీగా కూంబింగ్ చేపట్టారు. కాగా ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌మైన్ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు తరలించారు. -
కటాఫ్ ఏరియాలో ఎన్నికల సందడి
విముక్తి ప్రాంతంగా మావోయిస్టులు పిలుచుకునే ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మల్కాన్‌గిరిలో చాలాకాలం తరువాత ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కుని వినియోగించుకునే పరిస్థితులు నెలకొల్పినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆం్రధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏఓబీ)లోని ఈ కటాఫ్ ఏరియాపై మావోయిస్టులకు పట్టుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా దశాబ్దం క్రితం బలిమెల రిజర్వాయర్‌లో యాంటీ నక్సల్స్ స్క్వాడ్‌ని తీసుకెళుతోన్న పడవపై మావోయిస్టులు జరిపిన దాడిలో 38 మంది పోలీసు సిబ్బంది మరణించారు. ఆ తరువాత కూడా ఆ ప్రాంతమంతా మావోయిస్టుల అధీనంలోనే ఉంది. మొన్నటి వరకూ ఈ ప్రాంతానికీ బాహ్య ప్రపంచానికీ సంబంధంలేని పరిస్థితులుండేవి. పాలనా వ్యవస్థ సైతం అక్కడ శూన్యమనే చెప్పాలి. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం బాహ్య ప్రపంచానికీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికీ మధ్య గురుప్రియ నదిపై నిర్మించిన బ్రిడ్జిని 2018, జూలై 26న ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. తొలిసారి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రచారం ప్రారంభమైంది. స్థానిక ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని మల్కాన్‌గిరి ఎస్పీ జగ్మోహన్ మీనా వెల్లడించారు. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు.. ఒకే ఓటరు!
ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒకచోట ఉంచి మరోచోట తీసేస్తారు. కానీ ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న దాదాపు 34 గ్రామాల్లో ఇప్పటికీ సుమారు 2,934 ఓట్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఉదయం ఒడిస్సాలో ఓటేసిన వ్యక్తి, సాయంత్రం ఆంధ్రా ఎన్నికల్లో ఓటేస్తాడు. వినడానికి చిత్రంగా అనిపిస్తున్నా, ఇది ముమ్మాటికీ నిజం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాల మధ్య, రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 7 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలో, ఒడిస్సాలోనూ ఓటు వేస్తున్నారు. నేటికీ తేలని వివాదం 1936లో ఒడిస్సా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. కొంతకాలం క్రితం ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. చాలాకాలంగా ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. ప్రయాణం..ప్రమాదం విజయనగరం పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలూరు ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అడవులు, కొండల నడుమ అత్యంత ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తే కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. దాదాపు 14 కిలోమీటర్లు మేర రహదారి అనేదే ఉండదు. రాళ్లురప్పల్లో నడిచి వెళ్లాల్సిందే. అతికష్టం మీద కొంత దూరం వరకూ జీపులో వెళ్లినా పక్కనే వందల అడుగుల లోతున్న లోయల్లో మృత్యువు పొంచి ఉంటుంది. దీంతో ఇక్కడికి ఆంధ్రా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. రేషన్ కార్డులు కూడా మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దులోని కొఠియా ప్రాంతం ఆంధ్రా–ఒడిస్సా పోలింగ్ బూత్‌లు ఆంధ్రా–ఒడిస్సా రేషన్ కార్డులతో గిరిజన మహిళ ఆంధ్రా–ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు కొఠియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టుచెన్నేరు పంచాయతీలో 12, పగులు చెన్నేరు పంచాయతీలో 4, గంజాయిభద్రలో 13, సారికలో 2, కురుకూటిలో 2, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలున్నాయి. ఆంధ్రా ఎన్నికల కోసం నేరెళ్లవలస, శిఖపరువు, డి. వెలగవలస, కురుకూటిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒడిస్సా ఎన్నికల కోసం కొఠియా, రణసింగి, గంజాయిభద్ర, పగులుచెన్నేరులో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం ఒడిస్సాలో ఓట్లు వేసిన తర్వాత మధ్యాహ్నం ఆంధ్రా రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌లో ఓట్లు వేయడానికి వస్తారు. – బోణం గణేశ్, సాక్షి ప్రతినిధి, విజయనగర -
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
విశాఖపట్నం ,సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు 60 మంది వరకు సమావేశమై శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరగడంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గడ్ నుంచి ఆంధ్రా, ఒడిశా బోర్డర్లోకి మావోయిస్టులు వచ్చి ఉంటారన్న సమాచారం మేరకు భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఒడిశా సరిహద్దులో బీఎస్ఎఫ్, ఎస్‌వోజీ, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఆంధ్రాలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మర గాలింపులు జరుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒడిశా రాంగుడ ఎన్కౌంటర్ తరువాత మళ్లీ ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్ జరగడంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా సరిహద్దు ప్రాంతాల్లో సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, తదితర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో పహారా కాస్తున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. వారం కిందట ఒడిశా, తూర్పుగోదావరిలో ఒక్కరోజులో బస్సులను కాల్చివేసిన సంఘటనలు జరిగిన నాటి నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. -
మావోల కోసం వేట
తూర్పుగోదావరి , చింతూరు (రంపచోడవరం): సరిహద్దుల్లో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టుల కోసం వేట మొదలైంది. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రభావం పెంచుకుంటున్న మావోయిస్టుల జాడ కోసం ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. రెండు రోజుల క్రితం విలీన మండలాల్లో మావోయిస్టులు ఆర్టీసీ బస్సు, లారీని దహనం చేసిన నేపథ్యంలో మన్యంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బలగాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఘటనలకు పాల్పడింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దళ సభ్యులైనా ఆ ప్రభావం విలీన మండలాలపై పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఓవైపు మావోయిస్టుల కార్యకలాపాలు, మరోవైపు ప్రత్యేక బలగాల కూంబింగ్‌తో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు గురువారం మావోయిస్టులు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిని పురస్కరించుకుని మావోయిస్టులు అటు ఛత్తీస్‌గఢ్‌లో పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడడంతో పాటు ఇటీవల చింతూరు మండలం పేగలో ఓ వ్యానును, సరివెల వద్ద జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీని దగ్ధం చేశారు. కుంట ఏరియా కమిటీ పనేనా? ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో విలీన మండలాల్లో మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ ఎన్కౌంటర్ అనంతరం రూపు మార్చుకుని చర్ల, శబరి ఏరియా కమిటీగా అవతరించింది. ఈ కమిటీకి కొంతకాలం రజిత, సునీల్‌లు కార్యదర్శులుగా వ్యవహరించారు. అనంతరం సునీల్ పోలీసులకు లొంగిపోడంతో ఈ కమిటీ బాధ్యతలను భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తూ ఈ కమిటీకి శారదక్కను కార్యదర్శిగా నియమించినట్టు తెలిసింది. కాగా శబరి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కు సోమ్‌డాను కమాండర్‌గా నియమించినట్టు సమాచారం. చర్ల, శబరి ఏరియా కమిటీ ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల కార్యకలాపాలను శబరి ఎల్వోఎస్, కుంట ఏరియా కమిటీకి అప్పగించినట్లుగా సమాచారం. సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ బస్సు, లారీ దగ్థం ఘటన అనంతరం ప్రత్యేక బలగాలతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ ద్వారా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డీఎఫ్, సీఏఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో తలదాచుకునే అవకాశమున్న నేపధ్యంలో సరిహద్దుల్లోని మల్లంపేట, నర్శింగపేట, నారకొండ, అల్లిగూడెం, దొంగల జగ్గారం, దుర్మా, మైతా, సింగారం, బండ ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటు పోలీసుల జాయింట్ ఆపరేషన్, ఇటు మావోయిస్టుల ఆధిపత్య పోరు నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు పల్లెల ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. మావోయిస్టుల బంద్ కారణంగా రెండోరోజు కూడా విలీన మండలాలకు బస్సులు బంద్ అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
మావోయిస్టుల ఘటనతో బస్సుల బంద్
చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ఆ పాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు తూర్పుగోదావరి , చింతూరు(రంపచోడవరం): ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన ప్రాంతాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. వారోత్సవాలు, బంద్ నేపథ్యంలో ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారని, ఘటనకు పాల్పడిన మావోయిస్టుల ఆచూకీ కోసం చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక పోలీస్ స్టేషన్ల పరిధిలో బలగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల మేర సీఆర్పీఎఫ్, ప్రత్యేక బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని సుక్మా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలతో మాట్లాడామని త్వరలోనే వారితో కలసి జాయింట్ ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లు అధికం చేశామని, మిలీషియా నెట్‌వర్క్‌పై దృష్టి సారించామని, సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు జరగడం లేదని ఎస్పీ తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశమున్నందున జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతూరు ఓఎస్డీ అమిత్‌బర్దర్, డీఎస్పీ దిలీప్‌కిరణ్, సీఐలు దుర్గాప్రసాద్, అనీష్‌బాబు పాల్గొన్నారు. మావోయిస్టుల ఘటనతో బస్సుల బంద్ చింతూరు (రంపచోడవరం): జాతీయ రహదారిపై మావోయిస్టులు బస్సు, లారీ దగ్ధం చేసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి విలీన మండలాలకు బస్సులు బంద్ అయ్యాయి. దీంతో బుధవారం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణకు చెందిన బస్సులను కూడా రద్దు చేయడంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. ఆంధ్రాలోని రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, గోకవరం, విశాఖపట్నం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు రద్దయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్, కరీంనగర్, తాండూరు, పరిగి డిపోలకు చెందిన బస్సులు కూడా రద్దయ్యాయి. కాగా మావోయిస్టులు గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం కూడా బస్సులు తిరుగుతాయో లేదోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బస్సులు బంద్ కావడంతో ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆటోడ్రైవర్లు మూడు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్టు ప్రయాణికులు వాపోయారు. కుంట, చట్టి, చింతూరు నుంచి భద్రాచలానికి బస్సుకు రూ.60 చార్జీ కాగా సమయాన్ని బట్టి ఆటోడ్రైవర్లు రూ.వంద నుంచి 200 వరకు ఛార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఆరోపించారు. -
ఏవోబీలో హై టెన్షన్
విశాఖపట్నం, అరకులోయ, పాడేరు, సీలేరు(పాడేరు): ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా నిరసన వారాన్ని చేపడుతున్న మావోయిస్టులు ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో సృష్టించిన అలజడి, విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనగా వారాన్ని విజయవంతంగా నిర్వహించిన మావోయిస్టులు గురువారం భారతబంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే సమాచారం ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీ వ్యాప్తంగా ఆందోళకర పరిస్థితులు నెలకొన్నాయి. 10 రోజుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు ఏవోబీలో గాలింపు చర్యలను మమ్మురం చేసినప్పటికీ మావోయిస్టులు మాత్రం ఏవోబీలో రెండు చోట్ల గిరిజనులతో బహిరంగ సమావేశాలు నిర్వహించి తమ ఉనికిని చాటుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం ఓ బస్సును దహనం చేసిన మావోయిస్టులు, విశాఖ, తూర్పుగోదావరి అంతర్రాష్ట్ర రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీని కాల్చివేశారు. దీంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు గోదావరి ప్రాంతాల పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఓ వైపు పోలీసు పార్టీలు అడవిలో జల్లెడపడుతున్నా మావోయిస్టులు ఏవోబీలో నిరసన వారోత్సవాలను నిరాటంకంగా నిర్వహించారు. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మావోయిస్టులు బడిమెల రిజర్వాయర్ పరిధిలోని కటాఫ్ ఏరియాలో తలదాచుకుంటున్నారనే అనుమానంతో ఒడిశా పోలీసు బలగాలు కూడా విశాఖ ఏజెన్సీ సరిహద్దు వరకు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మంగళవారం ముంచంగిపుట్టు మండలంలోని ఒడిశా సరిహద్దు బూసిపుట్టు వారపుసంత ప్రాంతంలోను పోలీసు పార్టీలు అధికంగా సంచరించాయి. రూడకోట అవుట్‌పోస్టు పరిధిలోను కూంబింగ్‌ను విస్తృతం చేశారు. పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు పార్టీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మండలాలు ఒడిశా సరిహద్దులో ఉండడంతో పోలీసులు తమ తనిఖీలను మమ్మురం చేశారు. హుకుంపేట,డుంబ్రిగుడ,అరకులోయ,అనంతగిరి స్టేషన్ల పరిధిలోను పోలీసుల నిఘా అధికమైంది.పలు మండల కేంద్రాల్లో సీసీ కెమెరాలను పోలీసుశాఖ ఏర్పాటు చేయడంతో సంబంధిత స్టేషన్ల అధికారులు అనుమానిత వాహనాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. నర్సీపట్నం ముఖద్వారం నుంచి సీలేరు మీదుగా అన్ని ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాడేరు–జి.మాడుగుల ప్రధాన రహదారిలోని సెయింటాన్స్ స్కూల్ జంక్షన్‌తో పాటు ప్రధాన జంక్షన్ల వద్దపాడేరుఎస్ఐ రామారావు బుధవారం తనిఖీలు నిర్వహించా రు. ఆ మార్గంలో రాకపోకలు సాగిçస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆపి నిశితంగా పరిశీలించి అనుమానితులను ప్రశ్నించి విడిచిపెట్టారు. వాహన పత్రాలు తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ల వద్ద నైట్ హాల్ట్ బస్సులు మావోయిస్టులు భారతబంద్ పిలుపుతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్. కోట నుంచి అరకులోయ,కించుమండ ప్రాంతాలకు నడిచే నైట్హల్ట్ బస్సులను డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల వద్ద పార్కింగ్ చేయాలని, అలాగే పాడేరు డిపో నుంచి జోలాపుట్ నడిచే రాత్రి బస్సులను ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్ వద్ద ఉంచా లని ఆర్టీసీ అధికా రులు నిర్ణయించా రు. మారుమూల ప్రాంతాలకు గురువారం బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. విద్యుత్ కేంద్రాలకు భద్రత సీలేరు(పాడేరు): మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏపీ జెన్కో ఆస్తులకు భద్రత కల్పించారు. మావోయిస్టులు గత రెండు రోజుల్లో బస్సులు, లారీని దహనం చేశారు. విద్యుత్ కేంద్రాలను గతంలో మావోయిస్టులు దహనం చేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయా దారి గుండా వెళ్లే వ్యక్తులను తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు. -
మావోయిస్టుల నిరసన వారోత్సవాలు తొలిరోజు ప్రశాంతం
విశాఖపట్నం , అరకులోయ : కేంద్ర ప్రభుత్వం ఆమలుజేస్తున్న సమాధాన్‌కు నిరసనగా మావోయిస్టులు చేపట్టిన నిరసన వారోత్సవాల తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగానే ఉంది. ఈ వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లలో వాహనాల తనిఖీలను చేపడుతూ ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదాలు చేస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలపై పోలీసులు మరింత నిఘా ఉంచారు. పాడేరు నుంచి అరకులోయ పోయే వాహనాలతో పాటు, సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామాల నుంచి కామయ్యపేట మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను హుకుంపేట వద్ద ఎస్ఐ నాగకార్తీక్ తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించారు. అరకు సంతలోనూ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని రూడకోట, నుర్మతి అవుట్ పోస్టుల పరిధిలోని ప్రత్యేక పోలీసు పార్టీలు డేగకన్నుతో వ్యవహరిస్తున్నాయి. పాడేరులో తనిఖీలు పాడేరు : సమాధాన్ కార్యక్రమానికి వ్యతిరేకంగా సీపీఐ మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాడేరు పట్టణం నలుమూలల పోలీసులు శుక్రవారం ముమ్మరంగా నిఘా చర్యలు చేపట్టారు. పట్టణం వెలుపల జి.మాడుగుల వైపు, పెదబయలు వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బక్కలపనుకు ఏరియాలో పోలీసులు గృహ తనిఖీలు నిర్వహించారు. కూడలి ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్సు తదితర చోట్ల తనిఖీలు చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఎస్ఐ రామారావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు నిఘా చేపట్టాయి. కూంబింగ్ ఉధృతం కొయ్యూరు : కొన్ని వారాలుగా మావోయిస్టుల పలకజీడి వారపు సంతల్లో కరపత్రాలు వేస్తున్నారు. దీంతో పోలీసులు ఆటువైపుగా కూంబింగ్‌ను ఉధృతం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలను లక్ష్యంగా చేస్తూ మావోయిస్టులు కరపత్రాలు, పత్రికాప్రకటనలు చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కరపత్రాలు వెదజల్లిన మావోయిస్టులు చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సమాధాన్ దాడిని ఓడించాలని సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈమేరకు పలుగ్రామాల్లో కరపత్రాలు వెదజల్లారు. సమాధాన్ పేరుతో కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా 30 వరకు నిరసనలు తెలియజేయాలని, 31న భారత్ బంద్ పాటించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. -
ఏఓబీలో ముమ్మర గస్తీ
శ్రీకాకుళం, కాశీబుగ్గ : మావోయిస్టులు నిరసన వారోత్సవాలలో భాగంగా ఈ నెల 31న బంద్‌కు పిలుపునివ్వడంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పోలీసు బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. అడుగడుగునా జల్లెడ పడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్బంధంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉక్కుపాదం మోపడంతో కొన్ని దళాలు మహేంద్రగిరుల బాటపట్టాయి. అక్కడి నుంచి అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తుండటం, వారు ఉనికి ని చాటుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కాశీబుగ్గ పోలీసు డివిజన్ పరిధిలోకి రోప్‌టీం(ప్రత్యేక పోలీసు బలగాలు) చేరుకుని గొప్పిలి, లొత్తూరు తదితర గిరిజన తండాల్లో జల్లెడపట్టాయి. కాశీబుగ్గ ఏఎస్ఐ ఫణిదాస్ ఆధ్వర్యంలో లొద్దబద్ర నుంచి హిమగిరి, దానగోర రోడ్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు తప్పని పాట్లు భామిని: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల అప్రకటిత బంద్ ఆరంభమైంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమాధాన్ పేరున చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లకు నిరశనగా, మావోయిస్టుల ఏరివేతలు, గిరిజనుల హక్కులను కాలరాయడం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ నిరశన వారోత్సవాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నిరసన వారోత్సవాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీస్‌లు అప్రమత్తమయ్యారు. నారు.ఈ నెల 31న ఏఓబి బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు సీఎం సభకు బస్సులన్నీ తరలిపోగా, మిగిలిన ఒక బస్సును కూడా రాత్రి తొమ్మిది గంటలకు కొత్తూరులో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. -
నగరాల్లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల వేట దిశ మారింది. అర్బన్ మావోయిజాన్ని అణచివేసే చర్యలు చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం వేట సాగించే పోలీస్ శాఖ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. బీమా కోరేగావ్ ఉదంతం మొదలు తాజాగా అరెస్టయిన మావోయిస్టు మహిళా సానుభూతిపరుల వ్యవహారం వరకు అర్బన్ హంటింగ్‌ను స్పష్టం చేస్తోంది. మావోయిస్టు పార్టీకి తోడ్పాటు... మావోయిస్టు పార్టీ తను చెప్పాలనుకున్న అంశాలు, జనాల్లోకి వ్యాప్తి చేయించాల్సిన కార్యకలాపాలను ఫ్రాక్షన్ కమిటీల ద్వారా పంపిస్తుంది. అయితే, అనుబంధ సంఘాలు వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీకి మద్దతుగా పనిచేస్తు న్నాయని ముందునుంచి పోలీస్ శాఖ ఆరోపిస్తూ వస్తోంది. కానీ, నేరుగా ఆ సంఘాల సభ్యులనుగానీ, బాధ్యులను గానీ మావోయిస్టులుగా గుర్తించి అరెస్ట్ చేయలేదు. బీమా కోరేగావ్ వ్యవహారంలో మావోయిస్టు అనుబంధ సం«ఘ సభ్యులుగా ఉన్న తెలంగాణకు చెందిన వరవరరావు, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబైకి చెందిన అరుణ్ ఫెరారియా, గన్సల్వేస్, న్యూఢిల్లీ జర్నలిస్టు నవలఖను పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా మావోయిస్టు పార్టీకి తోడ్పాటు అందిస్తూ నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా ఎపిసోడ్... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా పౌర హక్కుల సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేమా మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహీలను పోలీసులు అరెస్టు చేయగా.. వీరంతా నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. వెంకట్రావ్, భవానీ, అన్నపూర్ణ, అనూష... రాడికల్ స్టూడెంట్ యూనియన్ విధానాలకు ఆకర్షితుడైన ఎన్జీఆర్ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ 33 ఏళ్లుగా మావో యిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ ఆరోపించింది. ఏపీలోని పాడేరు పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలు(అక్కాచెల్లెళ్లు) ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండటంతోపాటు చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్)లో పనిచేస్తున్నారు. అనూష మావోయిస్టు పార్టీ దళసభ్యురాలిగా పనిచేస్తోందని తెలిపారు. వీళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్ట్ రెండు రాష్ట్రాల పౌర హక్కుల నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. అనూష చేసిన నేరాలు... మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలిగా ఉన్న అనూష ఈ ఏడాది ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద మాటువేసి పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఏడాది మేలో పాన్పోదార్, జుడంబో గ్రామంలో పోలీసు వాహనాలపై దాడులు, నవంబర్‌లో ఒడిశా సుర్మతి ఏవోబీ సరిహద్దులో రెక్కీ చేసి పోలీసులపై మందుపాతరలతో దాడి చేసింది. రిక్రూట్మెంట్ వెనుక అనుబంధ సంఘాలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో నిరుద్యోగ యువతను ఉద్యమాల పేరుతో మావోయిస్టుపార్టీ వైపు మళ్లించేందుకు అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నా యని తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన 32 మందిని తెలంగాణ ఎస్ఐబీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చింది. వీరికి ఆంధ్రా ఒడిశా బార్డర్(ఏవోబీ) కమిటీ కారద్యర్శి హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ప్రోత్సాహం ఉందని బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన వ్యవహారంలో రామకృష్ణ యాక్షన్ ప్లానే అమలు చేశారని ని ఘా వ్యవస్థ గుర్తించింది. ఇలా 2 రాష్ట్రాల్లో ఎంతమందిని రిక్రూట్ చేశారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుబంధ సంఘాలను నియంత్రిస్తే గానీ రిక్రూట్‌మెంట్‌ను ఆపలేమని ఇరు రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మంగళవారం ఆరోపించారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. చట్టబద్ధమైన, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధంగా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తున్నారని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రజలపై నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత ఐదేళ్లుగా అనుసరించిన నిర్బంధాన్ని తిరిగి కొనసాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఈ నిర్బంధం వల్ల సమాజంలో హింస పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు విరుద్దంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు. ‘మా పిల్లలకు సంబంధం లేదు’ తమ పిల్లలకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన భవానీ, అన్నపూర్ణ, అనూషల తల్లిదండ్రులు రమణయ్య, లక్ష్మీనర్సమ్మలు అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పెద్ద కూతురు భవానీ టైలరింగ్ చేస్తుండగా, మిగతా ఇద్దరు అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పిల్లలను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
విజయనగరం, రామభద్రపురం: విశాఖపట్నం రేంజ్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా సారిస్తున్నట్లు డీఐజీ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, జిల్లాలో మాఓయిస్టుల కదలికలు లేవన్నారు. అయితే ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కదలికలు ఉన్నట్లు చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుడుకి ఆక్టోపస్ భద్రత కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖలో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. పోస్టులు భర్తీ కాగానే పోలీస్స్టేషన్లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మహిళలపై దాడులు జరగకుండా ముఖ్య కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పెండిగ్ కేసులు అధికంగా ఉన్న చోట వెంటవెంటనే సాక్ష్యాధారాలు సేకరించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 8,436 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని.. వారికి జైలు శిక్షలతో పాటు అపరాధరుసుం విధించినట్లు తెలిపారు. ఆయనతో పాటు ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ ఇలియాస్ అహ్మద్, ఎస్సై బి. లక్ష్మణరావు ఉన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు దత్తిరాజేరు : జాతీయ రహదారి పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డీఐజీ శ్రీకాంత్ సిబ్బందికి సూచించారు. పెదమానాపురం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఆయన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం శిథిలమైన క్వార్టర్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ విద్యాసాగర్, ఎస్సై కాంతికుమార్, తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీ గజగజ!
సాక్షి, విశాఖపట్నం/అరకులోయ/సీలేరు: విశాఖ ఏజెన్సీ గజగజ వణుకుతోంది. కొ న్నాళ్లుగా ఆరేడు డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో వణికించే చలి వల్ల కాదు.. మావోయిస్టులు, పో లీసుల వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో మన్యసీమ వణుకుతోంది. పీఎల్జీఏ వారోత్సవాల ఆరంభానికి ముందే మావోయిస్టులు మన్యంలో తన ఉనికిని చాట డం మొదలు పెట్టారు. భారీ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌తో పాటు అడవులను జల్లె డ పడుతున్నా మావోయిస్టులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు పీఎల్జీఏ వారోత్సవాలు జరుగుతున్నాయి. అంతకుముందే అంటే శనివారం సాయంత్రమే పెదబయలు మండలం కోండ్రుం–ఇంజరిల మద్య అటవీ ప్రాంతంలో కూంబింగ్ పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు భారీ మందుపాతర్లను పేల్చారు. ఈ ఘటన నుంచి పోలీసులు త్రుటిలో తప్పించుకున్నారు. మూడు రోజుల క్రి తం కూడా జి.మాడుగుల మండలం నుర్మతి వద్ద మావోయిస్టులు మందుపాతర్లు పేల్చి పోలీ సులకు సవాలు విసిరారు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు సెల్టవర్ల పేల్చివేయనున్నారని సమాచారం అందినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. పీఎల్జీఏ వారోత్సవాలను మావోయిస్టులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.ఈ వారం రోజుల్లో ఏదైనా భారీ ఘటనకు పాల్పడాలని పథక రచన చేస్తారు. మావోయిస్టులు సాదాసీదా భావించే పార్టీ విలీన వారోత్సవాల వేళ (సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు) అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో సెప్టెంబర్ 23న పట్టపగలే కాల్చి చంపారు. అలాంటిది అంతకంటే కీలకంగా భావించే పీఎల్జీఏ వారోత్సవాల సమయంలో ఎలాంటి అఘాయిత్యాలకు దిగుతారోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అంతేకా దు.. అక్టోబర్ 12న మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు మీనాను పోలీసులు పనసపుట్టు–బెజ్జంగిల మధ్య ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఏవోబీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చి మావోయిస్టులు, ప్రతిగా మీనాను ఎన్కౌంటర్ చేసి పోలీసులు ఒకరికొకరు సవాల్ విసురుకున్నట్టయింది. ఇప్పటికే మన్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఏవోబీలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పెట్రోలింగ్‌ను కూడా పెంచారు. దీంతో ఏజెన్సీ అంతటా వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనంటూ గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండండి.. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రుల ఇళ్ల వద్ద అదనపు భద్రతను పెంచారు. ముమ్మరంగా వాహన తనిఖీలు కొయ్యూరు, చింతపల్లి, జీకే.వీధి, జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాలలతో పాటు,ఒడిశా సరిహద్దులో ఉన్న హుకుంపేట,డుంబ్రిగుడ,అరకులోయ ప్రాంతాలలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.అవుట్ పోస్టులలో అదనపు పోలీసు పార్టీలను అందుబాటులో ఉంచారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు,మండల కేంద్రాలలో సంచరించే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఒడిశాలోని కొరాపుట్,మల్కన్‌గిరి జిల్లాల పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. ఒడిశా నుంచి అరకులోయ ప్రాంతం వైపు వచ్చే వాహనాలను,అరకుసంత సమీపంలోని జైపూర్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీలేరు పరిసరాల్లో రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్ వద్దకు చేర్చారు. సెల్టవర్ల వద్ద నిఘా అల్లిపురం(విశాఖ దక్షిణం): సెల్ టవర్ల పేల్చివేతకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారని తెలియడంతో వాటి వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గిరిజన యువత తమ గ్రామాల్లో ఉన్న సెల్ టవర్ల ధ్వంసం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్టు అనుమానం వచ్చిన వెంటనే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు గానీ, అధికారులకు గానీ తెలియజేయాలని ఆయన కోరారు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్లను ధ్వంసం చేయడానికి మావోయిస్టులు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. టవర్లను పేల్చివేస్తే సమాచార వ్యవస్థ స్తంభిస్తుందని, అత్యవసర సమాచారం తెలియక నష్టపోవలసి వస్తుందని తెలిపారు. సెల్‌టవర్లు పేల్చివేయడం అనాలోచిత చర్యకు నిదర్శనమన్నారు. -
ఏవోబీలో అలజడి.. కూంబింగ్ ముమ్మరం
సాక్షి, శ్రీకాకుళం : నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఏవోబీలో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని కోండ్రుం-ఇంజరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శనివారం భారీ మందుపాతరలను పేల్చిన విషయం తెలిసిందే. వారోత్సవాలకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే పక్కా సమాచారంతో బలగాలు గత రెండురోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మందుపాతరలను పేల్చినట్లు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు హెచ్చరికగా ఒడిషాలో మావోయిస్టులు రోడ్డు నిర్మాణం జరుపుతున్న వాహానాలకు దహనం చేశారు. దీంతో ఏవోబీ ప్రాంతంలో ప్రజలకు భయాందోళలకు గురవుతున్నారు. ఆంధ్రా, ఒడిషా, ఛత్తీసగఢ్, ప్రాంతాల్లో బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. -
భయం గుప్పిట్లో మన్యం
విశాఖ, అరకులోయ, కొయ్యూరు: పీఎల్జీఏ(ప్లాటున్ లీబరేషన్ గెరిల్లా ఆర్మ్డ్) వారోత్సవాలను ఆదివారం నుంచి నిర్వహించేందుకు మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మారుమూల ప్రాంతాలలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి.మరోపక్క వీటిని భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ రెండు రోజుల నుంచి ఏజెన్సీలోని పోలీసు యంత్రాం గంతో సమీక్షిస్తున్నారు. దీంతో ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఒడిశాలోని రామ్‌గుడ ఎన్కౌంటర్ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టు పార్టీ రెండేళ్ల వ్యవధిలో బలం పుంజుకుంది.కొత్త రిక్రూట్మెంట్తో పోలీసులకు సవాల్ విసురుతోంది. డుంబ్రిగుడ మండలంలో లివిటిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటనతో మావోయిస్టులు ఏవోబీలో బలపడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 1999లో ఆదిలాబాద్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో నరేశ్, ఆది,శ్యాం అనే ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. దీనికి గుర్తుగా 2001 నుంచి పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విశాఖ మన్యంలో మొదటి పీఎల్జీఏ వారోత్సవాల సమయంలో కొయ్యూరు పోలీసుస్టేషన్‌పై కాల్పులు జరిపారు.అప్పటి చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎం.వి.వి సత్యనారాయణకు చెందిన రెండు ఇళ్లను,తహసీల్దారు కార్యాలయాన్ని పేల్చివేశారు. దీని తరువాత ప్రతీ ఏడాది డిసెంబర్2–8 వరకు ఏవోబీలోనే వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విధ్వంసాలకు వ్యూహాలు రచించే నంబళ్ల కేశవరావు అలియస్ బసవరాజ్ అలియాస్ గంగన్నకు ఏవోబీలో పట్టుంది. దీంతో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారోత్సవాలభగ్నానికి పోలీసుల వ్యూహం మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీసు అధికారులు పకడ్బంధీగా వ్యూహ రచన చేశారని సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసుపార్టీలుఉమ్మడిగాఏవోబీలోకూంబింగ్కుసిద్ధమయ్యాయి.ఇప్పటికేవిశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత కొయ్యూరు,సీలేరు, జీకేవీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి,రూడకోట అవుట్ పోస్టుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరకులోయ,డుంబ్రిగుడ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీసు పార్టీలతో విశాఖ జిల్లా పోలీసు పార్టీలు సమన్వయం చేసుకుని ఉమ్మడి కూంబింగ్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఇప్పటికే మారుమూల ప్రాంతాలలో పోలీసు పార్టీలు సంచరిస్తున్నాయి. హిస్ట్ లిస్టులో ఉన్న నేతలు మైదానప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టుల రాక విశాఖమన్యానికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు వస్తారు.వారు వచ్చేరంటే పెద్ద ఎత్తున ఏదో విధ్వంసానికి వ్యూహ రచన చేసి ఉంటారన్న అనుమానం కలుగుతుంది. కొద్దిరోజుల నుంచి గుత్తికోయల ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందుతోంది. సంతలో బ్యానర్లు కొయ్యూరు మండలం పలకజీడి వారపు సంతలో శుక్రవారం సీపీఐ మావోయిస్టుల పేరిట కరపత్రాలు,బ్యానర్లు వెలిశాయి. గ్రామగ్రామాన పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట ఆ బ్యానర్లో పేర్కొన్నారు. కరపత్రాలు, బ్యానర్లు దర్శనమివ్వడంతో సంతబోసిపోయింది. వ్యాపారులు తగ్గిపోయారు. మందుపాతరల భయం మందుపాతరల భయం పోలీసు పార్టీలను వెంటాడుతోంది. గత ఏడాది పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో మందుపాతరలను పేల్చేందుకు మావోయిస్టులు భారీ వ్యూహం పన్నారు. అయితే పోలీసు పార్టీలు ముందుగానే గుర్తించి,వాటిని నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జి.మాడుగుల మండలం నుర్మతి అవుట్ పోస్టుకు సమీపంలోని గాదిగుంట రోడ్డులో మావోయిస్టులు బుధవారం మందుపాతరలు పేల్చిన ఘటనలో తేలికపాటి గాయాలతో ఇద్దరు పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.దీంతో విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ రంగంలోకి దిగారు.నుర్మతి అవుట్ పోస్టును సందర్శించడంతో పాటు,చింతపల్లి,పాడేరు సబ్డివిజన్ల పోలీసు అధికారులు,ఇతర పోలీసు పార్టీలను అప్రమత్తం చేశారు. -
తప్పిన ముప్పు
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసులకు మద్ధ సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం అలజడి రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన నాటి నుంచి కూంబింగ్ నిరంతరం కొనసాగుతోంది. దళసభ్యుల గాలింపులో భాగంగా భద్రత బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. పోలీసులపై దాడికి మావోయిస్టులు కూడా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య సాగుతున్న వార్తో మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. కూంబిం గ్‌కు వెళ్లి వస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని రెండు మందుపాతరలను జి.మాడుగుల మండలం నుర్మతి ఔట్ పోస్టుకు అతి సమీపంలో బుధవారం ఉదయం దళసభ్యులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు, బైకుపై వెళుతున్న ఒక పౌరునికి గాయాలయ్యాయి. మందుపాతరలు కొంచెం ముందుగా పేలడంతో పోలీసులకు పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, పాడేరు/జి.మాడుగుల : పోలీస్ ఔట్‌పోస్టుకు సమీపంలో మందుపాతరలు పేల్చడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన సుమారు 30 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు కొండదిగి నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో కాలినడకన వస్తుండగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన జగదీష్, ఆనంద్‌లతో పాటు అటుగా బైక్‌పై వస్తున్న డిప్పలగొంది గ్రామానికి చెందిన గిరిజనుడు సన్యాసిరావుకు గాయాలయ్యాయి. నుర్మతి పంచాయతీ గాదిగుంట–తిప్పలగొంది గ్రామాల మధ్య వండ్రుంగుల వద్ద కొత్తగా నిర్మించిన మట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో రెండు చోట్ల అమర్చిన క్యారేజి మందుపాతరలను పేల్చారు. రెండూ ఒకేసారి పేలడంతో ముందుగా నడుస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, కాస్తా వెనుకన ఉన్న పోలీసులు కొండపైకి వెనుదిరిగి తప్పించుకున్నారు. వెంటనే ఎదురుకాల్పులు చేపట్టారు. మావోయిస్టుల గురి తప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన పోలీస్‌లను జి.మాడుగుల స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రతీకారంతోనే.. ఏవోబీలోని రాంగుడ ఎన్కౌంటర్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం, ఇటీవల మహిళా మావోయిస్టును పోలీస్‌లు ఎన్కౌంటర్ చేయడం, ఇన్ఫార్మర్లు పేరుతో గిరిజనులను అరెస్టు చేయాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రగిలిపోతున్న వీరు ప్రతీకారంగా అదును చూసి దెబ్బకొట్టడానికి యత్నిస్తున్నట్టు ఈ ఘటనతో అర్థమవుతోంది. మన్యంలో ఔట్‌పోస్టుల ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీటిని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రకటనలు ద్వారా డిమాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. నుర్మతి గెడ్డకు కాలకృత్యాలకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపి చంపడం, మద్దిగరువులో ఔట్‌పోస్టుపై కాల్పులతో నుర్మతి, మద్దిగరువు ఔట్‌పోస్టులను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద అన్నవరం పోలీస్‌లు వస్తున్న జీపు లక్ష్యంగామందుపాతరలు పేల్చడంతో కానిస్టేబుల్‌ను మృతి చెందిన సంఘటన తెలిసిందే. నుర్మతి, దాని పరిసర ప్రాంతాల్లో 8నెలలు క్రితం బీబీఎన్ఎల్ పనులు చేస్తున్న నాలుగు పొక్లెయిన్లను మావోయిస్టులు ధ్వంసం చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లు పేరుతో మండలంలోని బొయితిలి పంచాయతీ మద్దిగరువుకు చెందిన సూర్యం, కిశోర్‌లను 2017 సెప్టెంబర్12న తుపాకీతో కాల్చిచంపారు. పార్టీ అగ్రనేతలు కోల్పోతుండడంతో పోలీస్‌లపై మందుపాతర దాడులకు దళసభ్యులు పాల్పడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. గాయపడిన వారికి విశాఖలో చికిత్స విశాఖ క్రైం: మందుపాతర పేలుడులో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటిì గాయాలు కావడంతో వారికి ఎటువంటి ప్రాణపాయాంలేదని సమాచారం. -
మావోయిస్టుల ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల నజరానా
విశాఖపట్నం, సీలేరు(పాడేరు): ఆంధ్ర, ఒడిశా సరి హద్దు మావోయిస్టు పార్టీలో యాక్షన్‌టీం సభ్యులుగా తిరుగుతూ గిరిజన ద్రోహులైన మావోయిస్టులను ఆచూకీ తెలిపితే రూ.5 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలతో వాల్‌పోస్టర్లు అతికించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందులో ఎనిమిది మంది మావోయిస్టుల ఫొటోలు ముద్రించారు. వారిని పట్టిచ్చిన వారికి రూ.5లక్షలు ఇస్తూ, వారి వివారాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. వంతాల రామకృష్ణ, జనుమూరి శ్రీనుబాబు, రాకేష్ ఈ ముగ్గురు డీసీఎంలు, సత్తిబాబు, కిషోర్ వీరిద్దరు ఏసీఎంలు, ఆండాలు, శ్రీను,మూర్తి వీరు దళాసభ్యులుగా ఉన్నారని, మన్యంలో ఎక్కడ కనిపించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పాడేరు ఏఎస్పీ, చింతపల్లి డీఎస్పీతో పాటు, విజయనగరం, పశ్చిమగోదావరి, రంపచోడవరం తదితర పోలీసు అధికారుల ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఏవోబీలో మావోయిస్టుల బంద్ ప్రశాంతం
విశాఖపట్నం, అరకులోయ: ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఏవోబీ ప్రతినిధి జగబందు పిలుపు మేరకు మంగళవారం జరిగిన ఏవోబీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో మూడు రోజుల నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పాడేరు,చింతపల్లి పోలీసు సబ్డివిజన్ల పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. అలాగే అవుట్ పోస్టుల్లో భద్రత చర్యలను రెట్టింపు చేశా రు. మండల కేంద్రాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, సోమవారం రాత్రికి విశాఖ చేరుకున్నారు. పాడే రు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఏజెన్సీలో పర్యటనలు మానుకున్నారు. పోలీసుల హెచ్చరికలతో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మండల కేంద్రాలకే పరిమితమయ్యారు. మారుమూల గ్రామాలకు నిలిచిన రవాణా మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలోని మా రుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచి పోయింది. విశాఖపట్నం నుంచి అరకులోయ మీ దుగా ఒడిశాకు నడిచే ఒనకఢిల్లీ, జైపూర్ బస్సులు మంగళవారం రద్దయ్యాయి. అరకులోయ–పాడువా రోడ్డు మీదుగా పలు ప్రైవేట్ వాహనాలు కూ డా నడవలేదు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులోని కటాఫ్ ఏరియా ప్రాం తాలకు జీపులు, వ్యాన్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండల కేంద్రం నుంచి ఒడిశా ప్రాంతానికి రవాణా స్తంభించింది. పాడేరు నుంచి నడిచే డుడుమ బస్‌ను ముంచంగిపుట్టు వరకే పరిమితం చేశారు. హుకుంపేట మండలం కామయ్యపేట రోడ్డు మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానికి ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలంలో పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డులో కొన్ని బస్సులు మాత్రమే తిరగాయి. నుర్మతి, మద్దిగరువు రోడ్డులో టికెట్ సర్వీసింగ్ జీపులు నిలిపివేశారు. మారుమూల గ్రామాలకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు నడపలేదు. ముంచంగిపుట్టు మండలంలోని ఒడిశా సరి హద్దుకు అనుకుని ఉన్న బుసిపుట్టు వారపుసంత కూడా జరగలేదు. అరకులోయ,డుంబ్రిగుడ,అనంతగిరి,హుకుంపేట మండలాల్లో దుకాణాలు తెరుచుకోగా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో వ్యాపారులు దుకాణాలను ఉదయం 11 గంటల వరకు మూసివేసినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి, దుకాణాలను తెరిపించారు. మారుమూల ప్రాంతాల్లో కరపత్రాలు ముంచంగిపుట్టు మండలంలోని కుమడ జంక్షన్ నుంచి ఒడిశాలోని బెజ్జంగి పోయే రోడ్డుతోపాటు, లక్ష్మీపురం రోడ్డులో, నిత్యం నిఘా నిడాలో ఉండే చింతపల్లి మండల కేంద్రంలో మెట్టబంగ్లాకు సమీ పంలోని సాయిబాబా ఆలయం దగ్గర మావోయిస్టుల కరపత్రాలు అతికించారు. బంద్‌ను విజయవతం చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లను నిరసించాలనే నినాదాలు ఈ కరపత్రాలలో ఉన్నట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. -
నేడు మావోల బంద్
శ్రీకాకుళం,భామిని: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో జరిగి న ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ, ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిన సుశీల, సన్నాయి, మీనా తదితరులకు నివాళులు అర్పిస్తూ ఏఓబీ మావోయిస్టులు మంగళవారం మన్యం బంద్‌నకు పిలుపునిచ్చారు. దీనిపై స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యం బంద్‌కు ఏఓబీ కార్యదర్శి జగబంద్ పిలుపు మేరకు పోలీసులు ముందస్తు చర్యల్లోతలమునకలయ్యారు. సోమవారం సరిహద్దులో ము మ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. మంగళవారం జరగనున్న ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ముందస్తుగా సోమవారం రాత్రి ఏజెన్సీ వైపు వచ్చే ఆర్టీసీలు నిలిపివేశారు. ప్రధానంగా కొత్తూరు నుంచి భామిని, బత్తిలి వైపు వచ్చే బస్సులను కొత్తూరులోనే ఆపివేశారు. మంగళవారం కూడా రాత్రి పూట బస్సులు నిలిపివేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. తివ్వాకొండలపై నిఘా.. ఏఓబీలో కీలకమైన తివ్వాకొండలపై పోలీస్ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మావోల బంద్ నేపథ్యంలో గత వారం రోజులుగా తివ్వాకొండల్లోని గిరిజన గూడలను సాయుధ పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి గిరిజన గ్రామాన్ని సందర్శించి ఆది వాసీలతో స్నేహ సంబంధాలు పెంచుకొంటూ కొత్త వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక సాయుధ దళాలు కూడా సరిహద్దులో ముమ్మర కూంబింగ్‌లు చేపట్టాయి. బంద్ నే పథ్యంలో అధికార పార్టీ నాయకులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో పర్యటనలు చేస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులను స్టేషన్‌కు రప్పించి వాకబు చేస్తున్నారు. ‘ఇల్లు దాటి వెళ్లకండి’ కొత్తూరు: మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన సీతంపేట, దోనుబాయి, బత్తిలి, కొత్తూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. నాలుగు స్పెషల్ పార్టీ(ఎస్టీఎఫ్) దళాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. సీతంపేట నుంచి కొత్తూరు, బత్తిలి నుంచి కొత్తూరు, దోనుబాయి నుంచి సీతంపేటతో పాటు పలు గిరిజన రహదార్లలో సోమవారం స్పెషల్ పార్టీలు ఆర్ఓపీ నిర్వహించారు. ప్రతి కల్వర్టు వద్దా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా సీఐ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు గుర్తించిన ప్రజాప్రతినిధులకు ముం దుగానే హెచ్చరికలు పంపించారు. సమాచారం ఇవ్వకుండా ఇల్లు దాటి బయటకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి సోమవారం తెలిపారు. -
మన్యంలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
తూర్పుగోదావరి, వై.రామవరం: మన్యంలో(ఏఓబీలో) మరలా మావోయిస్టు పోస్టర్ల కలకలం చెలరేగింది. గతనెల 12న వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ, పలకజీడి గ్రామంలో సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో సీపీఐ(మావోయిస్టు) ఎంకేవీబీ డివిజన్ కమిటీ పేరున కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింతచెట్లకు అతికించి దర్శనమిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపు సంత కావడంతో, వాటిని చూసిన సంత నిర్వాహకులైన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈనెలలో రెండుసార్లు కూడా వారపు సంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వారపుసంత నిర్వహించే వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆ పోస్టర్ల ద్వా్డరా బాక్సైటు తవ్వకాలు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అదనపు బలగాల పోలీసులకు, స్టేషన్ సిబ్బందికి అడ్డతీగల సీఐ ఎ.మురళీ కృష్ణ సూచించారు. మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయన్న సమాచారం అందగానే శుక్రవారం ఉదయం సీఐమురళీకృష్ణ స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకుని, సిబ్బందిని అప్రమతం చేశారు. స్టేషన్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం మేరకు, అనుమానాస్పద ప్రదేశాల్లో, ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాలను సీఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో విస్తృతంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం మండల లోతట్టు గ్రామాలను సందర్శించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనులకు ప్రాణ సంకటం
విశాఖ సిటీ, సీలేరు: ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. తూటాల శబ్దాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆధిపత్యం కోసం ఓవైపు మావోయిస్టులు చెలరేగుతుండగా.. మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో పోలీసులు వేటాడుతున్నారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను లివిటిపుట్టులో మావోయిస్టులు మట్టుబెట్టినప్పటి నుంచి సరిహద్దు ప్రాంతం రావణ కాష్టంలా మారిపోయింది. ఖాకీల బూట్ల చప్పుళ్లతో, తుపాకీ మోతలతో ఏజెన్సీ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. ఖాకీల నీడలోనే ఏవోబీ పరిధిలో ఉన్న గ్రామాలున్నాయి. లివిటిపుట్టు ఘటన తర్వాత.. దెబ్బకు దెబ్బ తీసేందుకు పోలీసులు సరిహద్దుల్లోనే మాటువేసి ఉన్నారు. గత నెల 12వ తేదీన ఏవోబీ కటాఫ్ ఏరియాలోని ఆండ్రవల్లి పంచాయితీ కేంద్ర అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ఉదయ్ భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ మీనాను హతమార్చిన పోలీసులు.. మరో ముగ్గురు మహిళా దళసభ్యుల్ని, ఓ మిలీషియా సభ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం ఏడు గంటలకే తుపాకీ మోతలతో చెంద్రుపల్లి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. చంద్రుపల్లిలో మావోయిస్టులున్నారన్న సమాచారం తెలుసుకున్న ఒడిశా రాష్ట్ర సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో.. ముగ్గురు మావోయిస్టులతోపాటు ఇద్దరు గిరిజనులు మరణించారు. ప్రజాప్రతినిధుల్ని మావోయిస్టులు హతమార్చిన తర్వాత.. పోలీసు యంత్రాంగం ఏవోబీలో పట్టుకోల్పోయిందనే అంతా అనుకున్న నేపథ్యంలో.. తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసి వరుస ఎన్కౌంటర్లతో చెలరేగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌తో సరిహద్దుల్లో తమ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందనే సంకేతాల్ని పోలీస్ బలగాలు మావోయిస్టులకు పంపించినట్లయింది. అయితే మావోయిస్టులు కూడా.. అదను చూసి ఎదురు దాడి చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా సరిహద్దు వాతావరణం కనిపిస్తోంది. నలిగిపోతున్న ఆదివాసీలు లివిటిపుట్టు ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో.. ఆదివాసీలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. మావోయిస్టులు ఓవైపు.. పోలీసు బలగాలు మరోవైపు.. గిరిపుత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎవరికి సహాయం చేసినా.. రెండో వర్గం విరుచుకుపడుతుండటంతో.. నోరు మెదపలేని పరిస్థితి, కాలు కదపని దుస్థితిలో భయం భయంగా గడుపుతున్నారు. ఎదురు కాల్పులు జరిగినప్పుడు పోలీసులు చనిపోయినా, మావోలు చనిపోయినా.. ఇరువర్గాలూ గిరిజనుల్నే టార్గెట్ చేస్తున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న హడావిడి జరిగినా.. బలవుతున్నది గిరిజనులేనన్నది తాజా ఘటనతో మరోమారు స్పష్టమైంది. దీనికి చంద్రుపల్లి ఘటనే ఉదాహరణ. సోమవారం ఉదయం అటవీ ప్రాంతానికి వచ్చిన కలిమెల దళం సభ్యులు.. తమకు అల్పాహారం కోసం కావాల్సిన నీటిని, సామగ్రిని పంపించాలంటూ గ్రామస్థులకు కబురు పెట్టారు. ప్రతి ఇంటిలోని ఓ మగ మనిషి రావాలని మావోయిస్టులు ఆదేశించారు. దీంతో చేసేది లేక ఏడుగురు గిరిజనులు వారికి కావాల్సిన పదార్థాలు తీసుకొని వెళ్లగా.. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు అమాయక గిరిజనులు బలయ్యారు. ఉలిక్కిపడ్డ ఏవోబీ సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా పప్పులూరు పంచాయతీ చంద్రుపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా ఆంధ్రా–ఒడిశా సరి హద్దులో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌తో రెండు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీరా ఆధ్వర్యంలో సంఘటన స్థలం నుంచి 3 కిలోమీటర్ల వరకు కొండమార్గంలో మోసుకుని రోడ్డుమార్గానికి తీసుకువచ్చి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ట్రాక్టర్లో తీసుకువచ్చారు. పప్పులూరు పంచాయ తీ వద్ద పోలీసు వాహనంలో భద్రతా బలగాలతో మల్కన్‌గిరి జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందడంతో వారిని గిరిజన గ్రామాల మధ్య తరలిస్తే ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అడవిమార్గంలో తీసుకువచ్చారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీరా ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం తెల్లవారుజాము 7 గంటలకు ఈ కాల్పులు జరగ్గా వైర్లెస్ సెట్ ద్వారా ఎస్పీకి తెలియజేశారు. దీంతో ఎస్పీ, ఇద్దరు ఎస్ఐలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సాయంత్రం 4.30 గంటల వరకు ఎస్పీ నిఘా పెట్టి అనంతరం మృతదేహాలను తరలించారు. తప్పించుకున్న అగ్రనేత రణదేవ్ మల్కన్‌గిరి జిల్లా కలిమెల దళం గత కొంత కాలంగా మల్క న్గిరి ప్రాంతంలో సంచరిస్తుంది. అగ్రనేత రణదేవ్(డిసిఎం) అసిస్టెంట్ కమాండెంట్‌తోపాటు మరో ఆరుగురు దళంగా ఉన్నారు. చంద్రుపల్లి గ్రామంలో వచ్చిన ఏడుగురు గుంపుగా ఒకే దగ్గర ఉండి టిఫిన్ వండుతున్న సమయంలో కాల్పుల జరిపారు. ఈ సమయంలో అగ్రనేత రణదేవ్ త్రుటిలో తప్పించుకుని సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రణదేవ్‌ను పట్టుకునేందుకు అయిదేళ్లుగా మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు. రణదేవ్ మీద లక్ష రివార్డు ఉంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పప్పులూరు పంచాయతీ మూడు కొండల మధ్య నివాసం ఉంటున్న చంద్రుపల్లి గ్రామస్తులు ఎన్కౌంటర్ జరగడంతో భయాందోళనలో పక్క గ్రామాలకు వెళ్లిపోయారు. -
మీనాను కాల్చి చంపేశారు
సాక్షి, విశాఖపట్నం: రెండు దశాబ్దాలపాటు ఎన్నో కీలక విప్లవోద్యమాల్లో పాల్గొన్న మావోయిస్టు అగ్రనేత మీనాను పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ ఏవోబీ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి ధ్వజమెత్తారు. లివిటిపుట్టు ఘటన తర్వాత ఏవోబీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం మావోయిస్టులు మీడియాకు వీడియో టేపులు విడుదల చేశారు. శత్రువులిచ్చిన సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు 12వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటలకు చుట్టుముట్టి అతి సమీపం నుంచి ఏకధాటిగా రాపిడ్ ఫైరింగ్ చేశారన్నారు. వారు జరిపిన ఫైరింగ్‌లో తూటాలు తగిలి గాయపడిన మీనాను గ్రేహౌండ్స్ పోలీసులు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మీనా రెండు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ జీవితాన్ని గడిపిందన్నారు. ఉత్తర తెలంగాణ వరంగల్‌లో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంతో 1995లో విప్లవోద్యమంలోకి అడుగు పెట్టి.. ఉమ్మడి ఆంధ్రలో సాయుధ పోలీస్ బలగాలపై జరిగిన ఎన్నో దాడుల్లో ఆమె పాల్గొన్నారని పేర్కొన్నారు. మహిళలను సమీకరించి మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, హింసలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి రెండుసార్లు అరెస్టు అయ్యారన్నారు. ఆమె ఆశయ సాధనకోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. కటాఫ్ ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం వారం పది రోజుల నుంచి ఏవోబీలో భయానక వాతావరణం సృష్టించారని, సరిహద్దు పంచాయతీల్లో కర్ఫ్యూ వాతావరణం కల్పించారని ఏవోబీ డివిజన్ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి ధ్వజమెత్తారు. లివిటిపుట్టు, ఆండ్రపల్లిలో మహిళలను హింసిస్తున్నారని, చుట్టపు చూపుగా వచ్చిన ముగ్గురు యువతులతోపాటు మరో ఇద్దరు యువకులను పోలీస్‌లు నిర్బంధించారని వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ తేదీ ఎన్కౌంటర్ అనంతరం అక్రమంగా నిర్బంధించిన వార్ని విడిచిపెట్టమని గ్రామస్తులు అడ్డుకుంటే వారిపై కాల్పులు జరపడమే కాకుండా.. టియర్ గ్యాస్ ప్రయోగించారన్నారు. తమతో ఎలాంటి సంబంధం లేకుండా అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడిచిపెట్టాలని కైలాష్ అలియాస్ చలపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాక్షి ముందే చెప్పింది.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మావో నేత మీనా 12వ తేదీన జరిగిన ఎదురు కాల్పుల సమయంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించినా.. గ్రేహౌండ్స్ దళాలు బలవంతంగా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి ఎదురు కాల్పుల కథ సృష్టించారని ‘సాక్షి’ముందే చెప్పింది. ఘటన జరిగిన మర్నాడే ‘ఎదురుకాల్పులా.. ఎత్తుకు పోయి కాల్చారా?’అనే శీర్షికన ‘సాక్షి ’ప్రధాన సంచికలో సమగ్ర కథనం వెలువడింది. ‘సాక్షి’చెప్పిన విషయాలను చలపతి వీడియో టేపుల్లో ప్రస్తావించడం గమనార్హం. -
మీనా ఎన్కౌంటర్.. స్పందించిన మావోలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)వద్ద ఈ నెల 12 జరిగిన మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాండర్ మీనా ఎన్కౌంటర్, మరి కొంత మంది అరెస్ట్‌లపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆడియో టేప్ విడుదల చేశారు. ఏవోబీ డివిజన్ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి పేరిట రిలీజ్ చేసిన ఆడియో టేప్‌లో సరిహద్దుల్లో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘కామ్రేడ్ మీనా మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేసుకుంటూ అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శత్రువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రే హౌండ్స్ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి ఏకదాటిగా రాపిడ్ ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్‌కు తూటాలు తగిలిన మీనా తీవ్రంగా గాయపడింది. గ్రే హౌండ్స్ పోలీస్లే మీనాను హత్య చేశారు. గత వారం రోజుల నుంచి కాల్పులతో పోలీస్‌లు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కట్ ఆఫ్ ఏరియాలో ప్రధానంగా ఆంధ్రలో పెద బయలు, ముంచంగిపుట్టు, ఒడిశాలోని మల్కన్ గిర, ఆండ్రపల్లి, జంత్రీ వంటి గిరిజన గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆండ్రపల్లిలోని మహిళలందరినీ హింసించారు. పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను నిర్బంధించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలి’అంటూ ఆడియో టేప్‌లో మావోలు కోరారు. చదవండి: ‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’ ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
సూత్రధారులు టీడీపీ నేతలే
సాక్షి, విశాఖపట్నం/ పెదవాల్తేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా తేటతెల్లమైంది. లివిటిపుట్టు ఘటన వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందంటూ అధికార టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఈ హత్యోదంతంలో మావోలకు సహకరించిన నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఫకీరప్ప, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించారు. టీడీపీ డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు–ఈశ్వరి దంపతులతోపాటు గెమ్మిలి శోభన్, కొర్ర కమలలు ఈ ఘటనలో కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలిందని వారు తెలిపారు. వీరి సహకారంతోనే మావోయిస్టు పార్టీ కోరాపుట్ డివిజన్ దళం పక్కా వ్యూహంతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు గత నెల 23న సర్రాయి వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి హతమార్చిన విషయం తెలిసిందే. 300 మందిని విచారించిన సిట్: ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి 20 రోజులపాటు సుమారు 300 మందిని సిట్ విచారించింది. కిడారి, సోమలను హతమార్చడంలో మావోలకు ప్రత్యక్షంగా సహకరించినట్టుగా పేర్కొంటూ టీడీపీ నాయకుడు యేడెల సుబ్బారావు, యేడెల ఈశ్వరిలతోపాటు గెమ్మిలి శోభన్, కొర్రా కమలను అరెస్టు చేసిన సిట్ బృందం వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అరెస్టయిన నలుగురూ గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్) గ్రూపులో పనిచేసినట్టు సిట్ చీఫ్ ఫకీరప్ప వెల్లడించారు. రెండేళ్లుగా వరుస ఎదురు కాల్పులు, లొంగుబాట్లు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినందున ఉనికి చాటుకోవడంతోపాటు ఏజెన్సీలో అలజడిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రముఖ వ్యక్తుల రాకపోకల గురించి సమాచారం ఇవ్వాలని మావోయిస్టులు వీరిపై ఒత్తిడి తెచ్చారన్నారు. మందుపాతర స్వాధీనం: నిందితుల నుంచి మావోయిస్టులు ముద్రించిన 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకున్నామని సిట్ చీఫ్ తెలిపారు. 10 కిలోల సామర్థ్యం కలిగిన ఓ మందుపాతర, ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావో అగ్రనేతలు చలపతి, అతని భార్య అరుణ ఈ ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా తేలిందన్నారు. మీనా 21వ ముద్దాయే ఏవోబీ సరిహద్దులోని ఆండ్రపల్లి వద్ద ఈ నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనాను కిడారి, సోమల హత్యాకాండలో 21వ ముద్దాయిగా గుర్తించామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట మావోలు విడుదల చేసిన లేఖపై సందేహాలు వస్తున్నందున ఆ లేఖ అసలుదా? లేక నకిలీదా? అని విచారిస్తున్నామన్నారు. -
ఆమెను ముందే అదుపులోకి తీసుకున్నారా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పోలీసులు–మావోల ఎదురుకాల్పుల ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు నేత మీనా అలియాస్ జిలానీ మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది కీలక నేతలు తప్పించుకున్నారని చెబుతున్న పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపాక పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. రెండేళ్ల కిందట రామగుడ ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోలను చావు దెబ్బతీశామని భావిస్తున్న పోలీసులకు లివిటిపుట్టు ఘటన కోలుకోలేని షాక్‌నిచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతూ వస్తున్నారు. (చదవండి: ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ) మావోయిస్టులు పోలీసుల కూంబింగ్‌ను లెక్కచేయకుండా ఏవోబీలోనే ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. ఒడిశాలోని జన్‌బై వద్ద నిర్మిస్తున్న గురుప్రియ వంతెనను వ్యతిరేకిస్తూ ఈనెల 2న ఏవోబీలోనే భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత 7న సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు, దళ సభ్యులు సమావేశం కాగా పోలీసులు కాల్పులు జరిపారు. కూంబింగ్‌ను కూడా లెక్క చేయకుండా మావోలు ఏవోబీలోనే మకాం వేయడం, కటాఫ్ ఏరియాలోని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ పోలీసులు వెళ్లలేకపోవడం, లివిటిపుట్టు ఘటన జరిగి దాదాపు మూడు వారాలవుతున్నా పోలీసుల అదుపులోకి పరిస్థితులు రాకపోవడం వెరసి వ్యూహాత్మకంగానే పోలీసులు ఎదురుకాల్పుల ఘటనను సృష్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీనాను ముందే అదుపులోకి తీసుకున్నారా? ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్య మీనా అలియాస్ జిలానీ కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యమానికి దూరంగానే ఉన్నారని చెబుతున్నారు. లివిటిపుట్టు ఆపరేషన్‌లో ఆమె పాల్గొన్నారా.. లేరా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పోలీసులు ఆమెను కిడారి, సివేరిల హత్య కేసులో 21వ నిందితురాలిగా చూపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా మీనా మల్కన్‌గిరి జిల్లాలోని ఆండ్రపల్లిలో తలదాచుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఆండ్రపల్లిని గురువారం రాత్రే ముట్టడించారని తెలుస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనారోగ్యంతో ఉన్న తాను లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పినా.. ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల కథ సృష్టించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మ నెల రోజులుగా ఇదే గ్రామంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నెన్నో అనుమానాలు? ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్న మీనా మృతదేహాన్ని మీడియాకు, గ్రామస్తులకు పోలీసులు చూపించలేదు. గ్రామస్తులు చుట్టుముట్టినా మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం తెల్లవారుజామున మొత్తం ఏడుసార్లు మాత్రమే కాల్పుల శబ్దం వినపడిందని, ఎదురుకాల్పుల ఘటనల్లో లెక్కకు మించి కాల్పుల శబ్దాలు వస్తాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఘటన జరిగిన ఆండ్రపల్లి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోనిది కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కిడారి హత్య దరిమిలా మూడు వారాలుగా మావోయిస్టులకు సవాల్ విసరాలని భావిస్తున్న పోలీసులు చివరికి.. అనారోగ్యంతో లొంగిపోవాలని చూస్తున్న ఓ మహిళా మావోయిస్టు నేతను ఎదురుకాల్పుల పేరిట మట్టుబెట్టి కలకలం సృష్టించేందుకు యత్నించారన్న వాదనలకే బలం చేకూరుతోంది. -
ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు/మల్కన్‌గిరి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు– మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాం డర్ మీనా మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు ఓ మిలీషియా సభ్యు డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 23న విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చాక మావోల కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్‌వోజీ, డీఓబీ జవాన్లతోపాటు ఆంధ్రా గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 7న ఏవోబీ పరిధిలోని సుంకి అటవీ ప్రాం తంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్‌ను కోరాపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసు లు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం తెల్లవారుజామున చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆండ్రపల్లి–బెజ్జంగి మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పంచాయతీ కేంద్రమైన ఆండ్రపల్లి సమీపంలో ఇరు వర్గాల మధ్య రెండు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు నిలిచిపోయినప్పటికీ పోలీసులు మాత్రం కాల్పులు కొనసాగించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్టు పార్టీ డిప్యూటీ దళ కమాండర్/డివిజన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న మీనా అలియాస్ జిలానీ బేగం అలియాస్ నిడిగొండ ప్రమీలగా నిర్ధారించారు. మృతురాలు మావోయిస్టు కీలక నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్యగా గుర్తించారు. కిడారి, సోమ జంట హత్య కేసులో మీనా 21 వ ముద్దాయిగా ఉన్నట్టుగా నిర్ధారించారు. గ్రామస్తుల అడ్డగింత మహిళా మావో మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న మావోలను గ్రేహౌండ్స్ పోలీసులు మల్కన్‌గిరికి తరలిస్తుండగా బెజ్జంగి జంక్షన్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆండ్రపల్లి, పనసపట్టు, జూడం పంచాయతీల్లోని 60 పల్లెలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా గిరిజనులు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. గ్రేహౌండ్స్ పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశా రు. పోలీసుల వాహనాలను వెంబడించారు. అదుపులో తీసుకున్నవారిని విడిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రేహౌండ్స్ దళాలను చుట్టుముట్టారు. రామగుడ ఎన్కౌంటర్, లివిటిపుట్టు ఘటనల తర్వాత ఆంధ్రా గ్రేహౌండ్స్ బలగాలే తమ ప్రాంతాల్లోకి వచ్చి గాలింపు చర్యల పేరిట తమను వేధిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లోకి చొరబడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అకారణంగా గ్రామస్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారని, సమాచారం చెప్పడం లేదంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుం దని భావించిన గ్రేహౌండ్స్ బలగాలు గాల్లో కాల్పులు జరిపాయి. దీంతో గిరిజనులు చెదురుమదురు కావడంతో పోలీసు వాహనాలు ముందుకు వెళ్లాయి. అగ్రనేతలు తప్పించుకున్నారు: విశాఖ ఎస్పీ ఏవోబీలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలని, ఆ రోజు ఆపరేషన్‌లో ఆమె కీలకంగా పాల్గొన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల ఘటన మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆమె మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న నలుగురిని అక్కడకు తరలించామని చెప్పారు. ఏవోబీలో నిరంతరాయంగా కూంబింగ్ చేస్తున్నామన్నారు. 50 ఘటనల్లో మీనా: మల్కన్‌గిరి ఎస్పీ మీనా గత 20 ఏళ్లుగా ఏవోబీలో డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తోందని మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా చెప్పారు. జిల్లాలోని రామగుడ ఎన్కౌంటర్, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ అపహరణ, ఇన్ఫార్మర్స్ నెపంతో హత్యలు ఇలా సుమారు 50 ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందన్నారు. మీనాపై ఆంధ్రా ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు. మల్కన్‌గిరికి తరలింపు ఘటనా స్థలంలో మహిళా మావోలు.. జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళా మావోయిస్టులూ కటాఫ్ ఏరియా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురితోపాటు మీనా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఛత్తీస్‌ఘడ్‌కే.. ఆర్కే!
ఆయన మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు.. రెండేళ్ల క్రితం రామగుడ ఎన్కౌంటర్ అనంతరం ఆయన ఆచూకీపై ఆందోళన వ్యక్తమైంది.. పోలీసులపై అనుమానాలు వెల్లువెత్తాయి.. చివరికి ఆయన సేఫ్ జోన్లో సురక్షితంగా ఉన్నారని స్పష్టమైంది.గత నెలలో జరిగిన లివిటిపుట్టు హత్యాకాండ.. తదనంతరం ఏవోబీ కటాఫ్ ఏరియాలో మావోల భారీ బహిరంగ సభ, తాజాగా ఒడిశాలోని పొట్టంగి సమీప అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తదితర వరుస ఘటనలు మళ్లీ ఆ మోస్ట్ వాంటెడ్ ఉనికిపై చర్చకు తెరలేపాయి. అతనే మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే..రామగుడ ఎన్కౌంటర్ తర్వాత రెండేళ్లు సేఫ్జోన్లో స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన ఆర్కే.. వాస్తవానికి చాప కింద నీరులా దెబ్బతిన్న మావోయిస్టు క్యాడర్‌ను పునరుజ్జీవింపజేశారని అంటున్నారు. దాని ఫలితమే గత 20 రోజుల్లో జరిగిన దారుణాలు..తెరవెనుక వ్యూహాలు రచిస్తూ.. క్యాడర్‌ను ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి బహిరంగ సభ, పొట్టంగి ఎన్కౌంటర్ స్థలంలో ఆయన ఉన్నారని పోలీసులు ప్రకటిస్తున్నారు. కాల్పుల నుంచి తప్పించుకున్న ఆర్కే సహా కీలక నేతలు తిరిగి ఛత్తీస్‌ఘడ్‌లోకి వెళ్లిపోయారని అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సహా కీలక నేతలే టార్గెట్‌గా ఏపీ, ఒడిశా పోలీసులు ఏవోబీలో జల్లెడపడుతున్నారు. రెండేళ్ల కితం రామ్‌గూడ ఘటనలో ఆర్కే లక్ష్యంగానే పోలీసులు దాడులు చేయగా.. సరిగ్గా ఇప్పుడు కూడా ఆయనే టార్గెట్‌గా ఖాకీలు వేట మొదలుపెట్టారు. వాస్తవానికి రామ్‌గుడ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే ఆచూకీపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో ఆయన కుమారుడు మున్నా సహా 32 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చి చం పారు. ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయంపై చాలా కాలం సందిగ్ధత నెలకొంది. అప్పట్లో భార్యతో సహా కుటుంబసభ్యులు ఆర్కే ఆచూకీని పోలీసులు బయటపెట్టాలంటూ హైకో ర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆర్కే క్షేమంగా సేఫ్జోన్లో ఉన్నారంటూ కుటుం బసభ్యులు, మావోలు ప్రకటించినా... జాడ మాత్రం తెలియరాలేదు. ఏవోబీ దాటి ఛత్తీస్‌గఢ్‌లో ఆయన తలదాచుకున్నారేమోనన్న వాదనలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. పోలీసులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. గత నెల 23వ తేదీన ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మహిళా మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపడం, ఆ తర్వాత ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో వేలాదిమందితో మావోలు బహిరంగసభ నిర్వహించడం, తాజాగా ఆదివారం కోరా పుట్ జిల్లా సుంకి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం కావడం.. తదితర పరిణామాలన్నీ పోలీసులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతోనే మావోలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, స్వయంగా ఆయన ఏవోబీలోనే మకాం వేసి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని పోలీసు అధికారులు నిర్థారణకు వచ్చారు. సుంకి సమీపంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే ఉన్నట్టు అనుమానిస్తున్నామని అక్కడ ఎస్పీ వెల్లడించగా, ఏవోబీలోనే మకాం వేసిన ఆర్కే, ఇతర కీలక నేతలే టార్గెట్‌గా మన పోలీసులు జల్లెడ పడుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. వ్యూహరచనలకే ఆర్కే పరిమితం? ఏవోబీతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో నిదండకారుణ్య ప్రాంతంలో ఆర్కే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మావోల హింసాత్మక సంఘటనలకు వ్యూహ రచన బాధ్యతలు నిర్వహించ డం మినహా నేరుగా ఆపరేషన్లలో ఆయన పాల్గొనడం లేదని సమాచారం. రామ్‌గుడ ఎన్కౌంటర్లో తన కుమారుడు మున్నా, ఆయన గన్మెన్లు సహా 32 మంది మావోలను పోగొట్టుకున్న తర్వాత ఏవోబీలో మావోయిస్టుల ఉద్యమ బాధ్యతను తనపై వేసుకున్న ఆర్కే రెండేళ్లలోనే భారీ రిక్రూట్మెంట్తో పార్టీకి పునరుత్తేజం తీసుకువచ్చిన ట్టు చెబుతున్నారు.మావోల ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో అనునిత్యం శ్రమిస్తున్న ఆర్కే నేరుగా మావోయిస్టుల దళాలు, ఏరియా కమిటీలతో కలిసి తిరగడం లేదని అంటున్నారు. ఏవో బీలోనే సురక్షిత ప్రాంతంలో తలదాచుకుని వ్యూ హాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. గత ఆగస్టు నెలలో కటాఫ్ ఏరియాలో జరిగినఅమరవీరుల వారోత్సవాల్లో పాల్గొన్నారని, ఆయన ఆదేశాలతోనే చలపతి, అరుణ ల ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తోందని అంటున్నారు. ఛత్తీస్‌ఘఢ్ వైపు ఆర్కే ఆదివారం కోరాపుట్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆర్కే సహా మావోయిస్టు నేతలు త్రుటిలో తప్పిం చుకున్నారని భావిస్తున్న పోలీసులు ఇప్పుడు వారు ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏవోబీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మల్కన్‌గిరి మీదుగా వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒడిశా కటాఫ్ ఏరియాలో కూంబింగ్‌ను ఉధృతం చేశారు. గ్రేహౌండ్స్ బలగాలతోపాటు ఒడిశా వైపు నుంచి బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ను చేపట్టాయి. డిసెంబర్ వరకుమావోయిస్టులకు అనుకూలం తూర్పుకనుమల్లో భాగంగా ఉన్న అటవీ ప్రాంతం డిసెంబర్ వరకు ఆకులు, తుప్పలతో దట్టంగా ఉంటుంది. దీంతో ఎంతమంది పోలీసులు కూంబింగ్ చేపట్టినా మావోయిస్టుల కదలికలను పసిగట్టడం అంత తేలిక కాదు. డిసెంబర్ తరువాత అడవిలో ఆకులు రాల్చే చెట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఆ కా>లం మావోయిస్టులకు ప్రతికూలంగా ఉంటుందని.. పోలీసులకు అనుకూలంగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఏవోబీలో రెండు మావో దళాలు!
సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు విసిరిన పంజాకు ఘోరంగా అభాసుపాలైన పోలీసులు సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు పేల్చిన తూట పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ మావోయిస్టుల అణచివేతకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా డీజీపీ శర్మతో సమావేశమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగానే కోరాçపుట్ జిల్లా చిక్కల్‌ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సం యుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరనేది నిర్ధారణకు రాలేదు. ఆంధ్రలో దాడులు.. ఒడిశాలో షెల్టర్.. ఒడిశాలో షెల్టర్ తీసుకుని ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి లక్ష్యాలు నిర్దేశించుకుని మావోయిస్టులు దాడులు చేసేలా కదులుతున్నారు. ఇందుకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్ ఉన్నట్టు గుర్తించారు. టెక్నాలజీని ఆశ్రయించిన పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించేలా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అన్ మాన్డ్ ఏరియల్స్(యుఏవీ), డ్రోన్లను వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్‌లెస్‌సెట్, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత చత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డెప్యూటీ కమాండర్ పోడియం ముడా సోమవారం పోలీసులకు చిక్కాడు. అతని అరెస్టుతో తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. 2014లో చత్తీస్‌గఢ్ మంత్రి మహేందర్ కర్మా సహా అనేక దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి కూడా కారకుడని పోలీసులు చెబుతున్నారు. ఏవోబీలోనే ఆర్కే.. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోనే ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయనతో సహా ఏవోబీలో తలదాచుకున్న మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగానే కూంబింగ్ జరుగుతోందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. -
ఏవోబీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విచారణ నిమిత్తం అంత్రిగూడకు చెందిన గిరిజనులు గతవారం అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. గ్రామస్థుల తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతే కాకుండా గిరిజనులకు మావోయిస్టులు సంబంధాలు ఉన్నయన్న కోణంలో వారిని ఆరా తీస్తున్నారు. కిడారి, సోమ హత్య జరిగి రోజులు గడుస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కోరాపూట్ డివిజన్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయని ఒడిశా ధ్రువీకరించింది. కానీ కాల్పుల్లో ఎవ్వరూ మృతిచెందలేదని... తప్పించుకున్న మావోయిస్టులున ఎలానైనా పట్టుకోవాలని దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయని పోలీసు అధికారులె వెల్లడించారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందనని ఏవోబీలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. -
ఉలిక్కిపడిన సరిహద్దు గ్రామాలు
విజయనగరం, సాలూరు రూరల్: ఏఓబీకి 20కిలోమీటర్ల దూరంలో ఒడిశారాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు – మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ఇక్కడి గిరిజన పల్లెల్లో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యసంఘటన తరువాత ఏఓబీలో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. పోలీసుల బూట్ల చప్పుళ్లతో గిరిజన పల్లెలు మార్మోగుతున్నాయి. ఇంతలోనే ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సుంకి సమీపంలోని షట్రాయ్ అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నట్టు ఒడిశా పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ చనిపోయినట్టు సమాచారం లేదు. కానీ మావోయిస్టులకు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గాలింపు మరింత తీవ్రం ఒడిశా ఘటనలో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారిని ఎలాగైనా వెంబడించి కచ్చితంగా పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక్కడివారిలో ఎక్కువైంది. ఇదే సమయంలో గతంలోని మావోయిస్టుల సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో గతంలో మావోల కదలికలు ఉండేవి. పాచిపెంట మండలంలో 2017 ఫిబ్రవరి 1న మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సుమారు 11 మంది ట్రైనీ పోలీసులు మృతిచెందడం, 2016 మార్చి నెలలో శ్రీకాకుళం–కొరాపుట్ డివిజన్ కమిటీ(మావోయిస్టులు) సాలూరు మండలం కురుకూటి పంచాయతీ జాకరవలసలో గిరిజనుడైన పూసరి వెంకటరావును ఇన్ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. -
భయం గుప్పెట్లో సర్రాయి
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని లివిటిపుట్టు గ్రామ సమీపంలో ఈ నెల 23న మాటువేసి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చినప్పటి నుంచి సర్రాయి గ్రామంలో గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవర్ని తీసుకెళ్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిద్రకు దూరమవుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు తొమ్మిది మంది గిరిజనులను సోమవారం వేకువ జాము న పోలీసులు తీసుకెళ్లి విచారించి, సాయంత్రం విడిచిపెట్టారు.మంగళవారం కూడా గ్రామస్తులందరూ విచారణకు రావాలని పోలీసులు ఆదేశించండంతో వారు భయంతో వణికి పోతున్నారు. ఈ గ్రామంలో 80 కుటుంబాలకు చెందిన 400 మంది జీవిస్తున్నారు. ఈ గ్రామంలో నిర్వహించనున్న సమావేశానికి వెళుతుండగా మార్గమధ్యంలో లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోయిస్టులు హత్యచేసినప్పటి నుంచి వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్: మరో వైపు విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళా లు,స్పెషల్ పార్టీ పోలీసులు సీఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మా వోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మండలంలో దాదాపు అన్ని గ్రామాలు, సమీప అటవీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సాయంత్రం అయితే చాలు ఎవరూ బయటకు రావడం లేదు. సమావేశం ఉందని తెలియదు: తమ గ్రామంలో సమావేశం ఉందని ఆ రోజు ఉదయం వరకు తెలియదని, టెంటు సామగ్రి, కుర్చీలు వచ్చిన తరువాత తెలిసిందని సర్రాయి గ్రామస్తులు తెలిపారు. అప్పటికే ఎక్కువ మంది చర్చిలకు వెళ్లిపోయామని, హత్యల సమాచారం తమకు మధ్యాహ్నం తెలిసిందని వారు చెబుతున్నారు. ఒడిశా అధికారులతో చర్చలు అరకులోయ: తమకు సవాల్ విసిరిన మావోయిస్టులను పూర్తిస్థాయిలో ఏరివేయడమే లక్ష్యంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు ఇటీవల ఒడిశా డీజీపీ, మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ ఠాకూర్ ఫోన్లో చర్చించినట్టు తెలిసింది.లివిటిపుట్టు సంఘటనలో పాల్గొన్న మావోయిస్టుల దండు ఇంకా సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదని, ఏవోబీలో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో పోలీసు పార్టీలు అడవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టాలనే వ్యూహంతో పోలీసు పార్టీలు అడవుల్లో అడుగులు వేస్తున్నాయి. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని అన్ని పోలీసు స్టేషన్లు,అవుట్ పోస్టులలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒడిశాలోని పోలీసు పార్టీలు కూడా తమ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు ఏ ప్రాంతానికి వెళ్లారన్న సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది సహకరించిన వారిపై డీఐజీ ఆరా చింతపల్లి: అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివెరి సోమల హత్య నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మావోయిస్టులపై పూర్తి దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విశాఖరేంజ్ డీఐజీ శ్రీకాంత్, జిల్లా రాహుల్‌దేవ్ శర్మలు అత్యంత రహస్యంగా మండల కేంద్రానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో రాత్రి బసచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక పోలీసు అధికారుల వద్ద మావోయిస్టులకు సంబంధించిన సమాచారం. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సహకరించే వారి వివరాలు అడిగితెలుసుకున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు భోగట్టా. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్టు వేసేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించినట్టు çతెలిసింది. కిడారి హత్య, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసుల వైఫల్యం ఉన్నట్టు ఇటీవల డీజీపీ ఠాకూర్ ప్రకటించడంతో జిల్లా పోలీస్ అధికారులు మావోయిస్టులను ఆగడాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా పూర్తి నిఘా పెట్టినట్టు సమాచారం. హత్యల సంఘటన తరువాత డీజీపీతో కలిసి గత నెల 27 చింతపల్లి వచ్చిన డీఐజీ తాజాగా మరోసారి సందర్శించారు. పోలీసు బలగాల కూబింగ్ ముమ్మరం చేయడంతో పాటు మావోయిస్టుల కదలికలపై స్వయంగా జిల్లా పోలీస్ అధికారులు దృష్టిపెట్టడంతో మ న్యం వాతావరణం వేడెక్కుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతందోనని మారుమూల ప్రాం తాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్స్టేషన్ల తనిఖీ గొలుగొండ(నర్సీపట్నం): ఏజెన్సీకి ముఖ ద్వారమైన కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్ స్టేషన్లను డీఐజీ శ్రీకాంత్, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి పర్యటనను గోప్యంగా ఉంచారు.డీఐజీ, ఎస్పీని ఎవరూ కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు స్టేషన్ల భద్రతపై డీఐజీ, ఎస్పీలు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పోలీసులు, మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలపై ఆరా తీసినట్టు తెలిసింది. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నాయకులకు భద్రతపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. -
‘మావోయిస్టుల ప్రకటన’పై ఉత్కంఠ
విశాఖపట్నం, అరకులోయ: డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల లివిటిపుట్టలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనపై ఇంత వరకు మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయకపోవడం మన్యంలో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టులు ఏదైన సంఘటనకు పాల్పడితే ఆ స్థలంలో విడిచిపేట్టే లేఖల ద్వారా గాని, పత్రిక ప్రకటనల ద్వారా గాని తాము ఆ సంఘటనకు ఎందుకు పాల్పడ్డాయో తెలియజేస్తారు. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను హత్య చేసి వారం రోజులు కావస్తున్నా ఇంత వరకు... ఈ నేతలను ఎందుకు హత్యచేయవలసి వచ్చిందో మావోయిస్టులు ప్రకటించలేదు. మావోయిస్టుల ప్రకటన కోసం హత్యకు గురైన నేతల కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు,మన్యం ప్రజలు,మరో వైపు పోలీసు యంత్రాంగం ఎదురుచూస్తోంది. మావో యిస్టులు ప్రకటనపై మన్యంలో ఉత్కంఠ నెలకొంది.వారు ప్రకటన చేయడంలో జాప్యానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టు క్యాడర్ బలంగానే ఉంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతల పేరుపై ఏదో ఒక చోట పత్రికలకు ప్రకటన వస్తుంది. దీని కోసం మీడియా కూడా ఎదురుచూస్తోంది. సంఘటన జరిగిన వారం రోజుల కావస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనంగానే ఉంది. మరో వైపు పోలీసు యంత్రాంగం సిట్ బృందంతో నేతల హత్యలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోంది. వారిద్దరినీ మావోయిస్టులు హత్యచేయడానికి గల కారణాలను పోలీసు యంత్రాంగం కూడా నిర్ధారించలేక పోతోందని సమాచారం. ఈ హత్యలపై మరిన్ని వివరాల సేకరణకు మావోయిస్టుల ప్రకటన కూడా కీలకంగా ఉంటుందని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ఈ హత్యలకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. రాజకీయ కోణంలో హత్యలు జరిగి ఉంటాయని,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,డీజీపీ ఠాకూర్లకు తెలిపారు.ఈ కోణంలోనూ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కారణాలు బయటపడాలంటే మావోయిస్టులు విడుదల చేసే లేఖ కూడా చాలా ముఖ్యం. నిఘా నీడలో వారపు సంతలు సీలేరు(పాడేరు): లివిటిపుట్టులో గత ఆదివారం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. మావోయిస్టులు కటాఫ్ ఏరియాలోకి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ వారు విశాఖ మన్యంలో ఉన్నారని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీలో11 మండలాల్లో అన్ని వారపు సంతల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ సంతలు పోలీసు ల నిఘా నీడలో జరిగాయి. అనుమానితులను తనిఖీ చేశారు. ఐదు రోజులుగా ఒడిశాసరిహద్దులో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన గుమ్మిరేవులు, ధారకొండ, సీలేరు, కొనములూరు, పాతకోట, చిత్రకొండ, బలిమెల, ఎంవి 79 వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా రోజూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాగా బలిమెల రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గించాలని, గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాలని లాంచీలకు మావోయిస్టులు కరపత్రాలు అతికించారు.దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతలను విచారించిన సిట్ బృందం అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమలను ఇటీవల మావోయిస్టులు హత్యచేసిన ఘటనపై సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ బృందం ఆదివారం డుంబ్రిగుడ,అరకులోయ మండలంలోని కొంతమంది టీడీపీ నేతలను విచారించింది. హత్య జరిగిన రోజు అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కండ్రూం పంచాయతీ సరాయి గ్రామానికి బయలుదేరిన టీడీపీ నేతలతో పాటు,ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేతల వివరాలను సేకరించిన సిట్ బృందం వారందరినీ విచారించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు చింతపల్లి(పాడేరు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టుల హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను మానవ మృగాలతోపోల్చుతూ ఖబడ్దార్, గిరిజన ద్రోహులు మావోయిస్టులంటూ పోస్టర్లలోపేర్కొన్నారు. -
కొనసాగుతున్న కూంబింగ్
శ్రీకాకుళం, భామిని: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సాయుధ పోలీసు బలగాల బూట్లు చప్పుడుతో దద్దరిల్లుతున్నాయి. ఏవోబీలో కీలకమైన సరిహద్దు తివ్వాకొండల్లో ఎస్టీఎఫ్, గ్రేహాండ్స్ దళాలతో జల్లెడ పడుతున్నారు. అరకులో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను బహిరంగంగా మావోయిస్టులు కాల్చివేసిన నేపథ్యంలో అప్రమత్తమై కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఒడిశా సరిహద్దు నుంచి తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్టీ జోన్లోకి సురక్షితంగా చేరుకుంటున్నారనే సమాచారంతో ప్రత్యేక దళాలు చుట్టుముడుతున్నాయి. సాయుధ పోలీసు బలగాల మోహరింపుతో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు పోలీసు స్టేషన్లకు గిరిజన ప్రాంతాల నుంచి సానుభూతిపరులను రప్పించి మావోల కదలికలపై ఆరా తీస్తున్నారు. కొండ ప్రాంతాలకు కొత్తగా వస్తున్న అనుమానిత వ్యక్తులపై వాకబు చేస్తున్నారు. రోజూ కూంబింగ్ పార్టీలు గిరిజన గూడల దాటి వెళ్తుండటంతో పోడు వ్యవసాయానికి కూడా వెళ్లడానికి గిరిజనులు భయపడుతున్నారు. ఏ క్షణమైనా ఉపద్రవం రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. -
గడప దాటాలంటే వణుకు
సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలందరిలోనూ ఒక్కటే భయం.. ఇళ్ల నుంచి బయటకు వెళితే ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన. మావోయిస్టులు ఇన్నాళ్లూ మన్యంలో ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏజెన్సీ ప్రాంతంలోని నాయకుల్లోనే ఆందోళన రేకెత్తేది. ఈనెల 23న జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టిన నాటి నుంచి మైదాన ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మన్యంలో నేతలతో పాటు మైదానంలో ఉంటున్న ప్రజాప్రతినిధులు విశాఖ నగరంలోని సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని సూచించారు. కానీ పోలీసుల సూచనల మేరకు ఇప్పటిదాకా విశాఖలోకి అధికార పార్టీ ముఖ్య నేతలు రాలేదు. ఏజెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను కల్పించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద మరో ఆరుగురు అదనపు సాయుధ పోలీసులను, మాజీ మంత్రి మణికుమారికి కూడా భద్రతను పెంచారు. బుధవారం గిడ్డి ఈశ్వరి ఇంటికి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ సంచరించి మాయమైనట్టు గుర్తించారు. ఆమె మావోయిస్టా? మిలీషియా సభ్యురాలా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ వ్యవహారం వెలుగు చూడడంతో అక్కడ ఏదైనా పథక రచనకు వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలో మిగిలిన అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లను వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మావోయిస్టుల హిట్‌లిస్టులో దాదాపు 200 మంది వరకు చిన్నా, పెద్ద నాయకులున్నట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల నాయకులు ఆడుగు బయట పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రం రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు. మన్యంలో నిన్న మొన్నటి వరకు హడావుడి చేస్తూ కనిపించిన వారెవరూ ఇప్పుడు జనావాసాల్లో కనిపించడం లేదు. రోడ్లపై వారితో పాటు వారి వాహనాల జాడా లేకుండా పోయింది. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసినా బితుకుబితుకుమంటూ ఉన్న వారే కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో సాయుధులైన పోలీసు బలగాలు దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా పహరా కాస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పోలీసు దళాలు లేకపోయినా అక్కడ కూడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు భయంతో వణుకుతున్నారు. నర్సీపట్నానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నారు. దీంతో ఆయన చాలా సంవత్సరాలుగా విశాఖలోనే కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వం బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. తాజాగా మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి , మరో ప్రాంతంలో పర్యటనకు వెళ్లడం లేదు. మరోమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా కిడారి, సివేరిల హత్య అనంతరం భద్రతను పెంచారు. వీరు జిల్లాలో మరెక్కడా అధికార, అనధికార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో యలమంచిలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు విశాఖలోనే ఉంటున్నారు. చోడవరం, అనకాపల్లి శాసనసభ్యులు వారి గ్రామాల్లో మకాం ఉంటున్నారు. ఈ కిడారి, సివేరిల హత్య, పోలీసుల హెచ్చరికలు నేపథ్యంలో శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. మరోవైపు బుధవారం జిల్లాకు వచ్చిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం కూడా ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్‌కు వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సెక్యూరిటీ ఆడిట్ రెవ్యూ నిర్వహించారు. ఆ డివిజన్లోని జీకేవీధి, అన్నవరం, సీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఆయా స్టేషన్ల సీఐ, ఎస్ఐలతో భేటీ అయ్యారు. డీఐజీ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. -
వారెందుకెళ్లారు ?
విశాఖ క్రైం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్‌తో పాటు మరి కొంతమంది పోలీసుఅధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కీలకసమావేశంలో జరిగిన చర్చల సారాంశం కొంత బయటకు వచ్చింది. కిడారి, సోమ ఆ రోజు ఎందుకు వెళ్లారు అన్నదానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. గతంలో జరిగిన దాడులు, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణపై సమీక్షించారు. హత్య చేయడానికి ముందు మావోయిస్టులు ఏరూటులో వచ్చారు, ఎక్కడ ఉన్నారు, వారికి ఎవరు ఆశ్రయమిచ్చారు అన్న విషయాలపై పోలీసులు సేకరించిన సమాచారంపై చర్చినట్టు భోగట్టా. ఈ చర్చ మధ్యాహ్నం వరకు సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ బయటకు వచ్చారు. తరువాత పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు వస్తున్న సందర్భంగా భద్రతాపరంగా తీసుకోవలసిన ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ ఠాకూర్ బక్కన్నపాలెంలోగల గ్రేహౌండ్స్నుసందర్శించారు. అప్రమత్తంగా ఉండాలి చింతపల్లి(పాడేరు): మన్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఠాకూర్ అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి ఆయన సందర్శిం చారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఆయన స్థానిక పోలీసు అధికారులను సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలుతీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, స్థానిక పోలీసు అధికారులను ప్రశంసించారు. చింతపల్లి,గూడెంకొత్తవీధి మండలాల్లో పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. పోలీస్స్టేషన్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మావోయిస్టులతో ప్రమాదం పొంచిఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో విశాఖరేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్, చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనంత్ బన్సీ, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు అరకులోయ: అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్య తరువాత అరకులోయలో పర్యాటప్రాంతాలు బోసిపోయాయి. నేతల హత్య సంఘటన వార్తలు విస్తృతంగా ప్రసారం జరగడంతో పర్యాటకులు అరకులోయ ప్రాంత సందర్శనను వాయిదా వేసుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అనంతగిరి,అరకులోయ,డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక ప్రాంతాల్లో గురువారం పర్యాటకశాఖ కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కిరండూల్ రైలులో కూడా పర్యాటకులు స్వల్ప సంఖ్యలో అరకులోయకు వచ్చారు. బొర్రాగుహలు,కటికి జలపాతం,ఘాట్‌లో కాఫీతోటలు,డముకు,గాలికొండ వ్యూపాయింట్ ప్రాంతాలతో పాటు,పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,రణజిల్లెడ,చాపరాయి,కొల్లాపుట్టు జలపాతాల ప్రాంతాలన్నీ సందర్శకులు లేక బోసిపోయాయి.అరకులోయ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ అతిధి గృహాలు,రిసార్ట్స్.హోటళ్లు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయి. మంత్రి లోకేష్ పర్యటన రద్దు సాక్షి, విశాఖపట్నం: మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన రద్దయ్యింది. హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఏజెన్సీలో పర్యటించాల్సి ఉంది. మంత్రి వస్తున్నట్టు కలెక్టరేట్‌తో పాటు పోలీస్‌శాఖకు మంత్రి కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం వర్తమానం అందింది. మీడియాకు కూడా టూర్ షెడ్యూల్ విడుదలైంది. ఇంతలో ఏమైందో ఏమో మంత్రి లోకేష్ పర్యటన రద్దయినట్టు మంత్రి కార్యాలయం నుంచి సింగిల్ లైన్ వర్తమానం అందింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే లోకేష్ తన పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారంటూ అధికారులే కాదు..అధికార పార్టీ నేతలు కూడా చర్చించు కుంటున్నారు. -
అణువణునా అన్వేషణ
విశాఖపట్నం, అరకులోయ, పెదబయలు: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతం తరువాత పోలీసుశాఖ అప్రమత్తమైంది. మన్యానికి అదనపు పోలీసు బలగాలు చేరాయి. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఏవోబీకి ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు,పెదబయలు, జి.మాడుగుల, జీకే వీధీ, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుధవారం డీజీపీ పర్యటించడంతో భారీగా పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ఆయన పర్యటన ముగిసినప్పటికీ ఆ పార్టీలను మన్యంలోనే ఉంచారు. అనంతగిరి నుంచి అరకులోయ,అరకులోయ నుంచి పాడేరు రోడ్డులో పోలీసు పార్టీలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనంతగిరి ఘాట్, సుంకరమెట్ట,జైపూర్ జంక్షన్,డుంబ్రిగుడ,కించుమండ,హుకుంపేట ప్రాంతాల్లో కూడా పోలీసు పార్టీల ను అధికంగా మోహరించారు. అడవులల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు పార్టీలను అన్ని పోలీసుస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ♦ సీఎం చంద్రబాబు మన్యంలో పర్యటించనుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ♦ బాంబు స్క్వాడ్ తనిఖీలుఅనంతగిరి–అరకు,అరకు–పాడేరు రోడ్డులో బాంబు స్క్వాడ్ బృందాలు గురువారం తని ఖీలు నిర్వహించాయి. రహదారులకు ఇరువైపు ల, గెడ్డల వద్ద ,కల్వర్టులు, వంతెనల సమీపంలో క్షు ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు మరి కొద్ది రోజుల పాటు ఈరోడ్లలో ఉంటాయని పోలీసుఅధికారులు చెబుతున్నారు. చివురుటాకులా.. ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. అడుగుకో పోలీసు తుపాకులతో కనిసిస్తుండడంతో గిరిజనులు తీవ్ర భయోం దోళన చెందుతున్నారు. అనుమానితులను బలగాలు ప్రశ్నిస్తుండడంతో గ్రామాలను వదిలి బయటకురావడానికి వారు సాహసించడం లేదు. మండలకేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉన్నా, పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలంలో కిడారికి నివాళి డుంబ్రిగుడ(అరకులోయ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన స్థలంలో గురువారం సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇద్దరు కుమారులు, కుమార్తె పూలదండలు పెట్టి, పుష్పగుచ్చాలు పట్టుకుని నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. కుటుంబ సభ్యుడు పాండురంగస్వామి మాట్లాడుతూ మంచి ఎమ్మెల్యేను కోల్పోయామన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పటికీ అరకు,పాడేరులలో సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిడారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
30 మంది మావోయిస్టులు.. ఏవోబీలో ఎన్కౌంటర్..!
ఒడిషా : ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. కాగా, గత ఆదివారం ఉదయం ఏవోబీలోని అరకులోయలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. (చదవండి : ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి) -
మారణకాండలో.. మూడు దళాలు!
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కిడారి, సివేరిల హత్యాకాండ వెనుక ఏం జరిగందన్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మావోలు వారినే ఎందుకు టార్గెట్ చేశారు?.. ఎప్పటినుంచి పథక రచన చేశారు?.. వ్యూహం అమలులో ఎవరు సహకరించారు?.. తదితర అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ హత్యాకాండలో స్థానిక మావోయిస్టు కమిటీల ప్రమేయం ఏమీ లేదని వార్తలు వచ్చినా.. అందులో వాస్తవం లేదని తేలుతోంది. అరకు ఏజెన్సీలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పెదబయలు కమిటీ కూడా మావోయిస్టు మిలటరీ కమిషన్‌కు సహకరించిందని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలను రాష్ట్రం బేఖాతరు చేయడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందనీ.. చర్చల పేరుతోనే మావోయిస్టులు కిడారిని రప్పించి మరీ వేటు వేశారని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.మారణకాండ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని లివిటిపుట్టు గ్రామంలోని పలువురిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లడం.. ఆ గ్రామస్తులను వణికించింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టడం ద్వారా ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు రెండు నెలల క్రితం నుంచే ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిం చిన ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ, నందాపూర్ దళానికి పెదబయలు ఏరియా కమిటీలోని ముఖ్య నాయకులు పూర్తి సహకారం అందించినట్టు తెలుస్తోంది. నందా పూర్ దళానికి పెదబయలు దళ కమండర్ సుధీర్, అశోక్‌లతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దు కమిటీలో మంచి పట్టున్న కిరణ్ కూడా ఈ ఆపరేషన్‌లో కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం. నేతలిద్దరి హత్యతో కలకలం సృష్టిం చడంతో పాటు ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోలు పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డుంబ్రి గూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని లివిటిపుట్టు గ్రామాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నట్టు చెబు తున్నారు. వాస్తవానికి కిడారి ఇటీవలి కాలంలో ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. గ్రామదర్శిని కార్యక్రమానికి గత శుక్రవారం మావోల అడ్డాగా పేరొందిన పెదబయలు మం డలం పెదకోడాపల్లితోపాటు అంతకుముందు పర్రెడ పంచాయతీలో కూడా పర్యటించారు. ఆ పర్యటనల్లో ఒకింత బందోబస్తు ఉన్నప్పటికీ మావోలను నిలువరిం చే సంఖ్యలో మాత్రం పోలీసులు లేరు. అయి తే ఆయా ప్రాంతాల్లో మావోలు దాడి చేయకుండా వ్యూహాత్మకంగానే లివిటిపుట్టును ఎంచుకున్నట్టు అర్ధమవుతోంది. డుంబ్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో ఉండటం తో పాటు ఒడిశాకు దగ్గరగా ఉండటం, ఈ ప్రాంతంపై పోలీసులు ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మావోలు వ్యూహాత్మకంగానే లివిటిపుట్టులో ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మావోల అదుపులో ఇన్ఫార్మర్లు పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమాలకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమాలు వచ్చినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా వస్తున్నారనే దానిపై పిన్ పాయింట్‌గా తెలుసుకునేందుకు మావోలు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల్లో పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నవారిని ముందుగానే గుర్తించి వారందరినీ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా తమ కదలికల సమాచారం బయటకు పొక్కకుండా మావోయిస్టులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ తదితర ఏవోబీ సరిహద్దు మండలాల్లోని జామిగుడ, గిన్నెలకోట, ఇంజరి, భూషి పుట్టు, రంగబయలు తదితర ప్రాంతాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇన్ఫార్మర్లను హతమారిస్తే పోలీసులు అప్రమత్తం అవుతారని.. అప్పుడు ఆపరేషన్ కిడారి అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించే.. ఇన్ఫార్మర్లను కట్టడి చేయడానికే పరిమితయ్యారని తెలుస్తోంది. ఇలా రెండు నెలల నుం చి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుకు న్న ఆపరేషన్‌ను పక్కాగా అమలు చేశారని తెలుస్తోంది. -
రణక్షేత్రంలా మన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం యుద్ధభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఉద్రిక్త పరిస్థితే. మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ ఎత్తున సాయుధ బలగాలు మోహరించాయి. అంతటా గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ దళాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)తో పాటు విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కూంబింగ్‌ను ప్రారంభించాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు మార్గాల్లో వీరు కనిపిస్తున్నారు. కేంద్ర పారామిలటరీ దళాలను కూడా పంపడానికి కేంద్ర హోంశాఖ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని రోడ్ల వెంబడి సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. మన్యంలోని పలు ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్‌లు, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు మంచి పట్టుంది. దీంతో ఒకపక్క కూంబింగ్, మరోపక్క మావోయిస్టుల స్థావరాలపై పోలీసులు మరింత దృష్టి సారిస్తున్నారు.వివిధ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సానుభూతిపరులు, అనుమానితులను ఆరా తీస్తున్నారు. మరోపక్క పోలీసులను ఎదుర్కోడానికి మావోయిస్టులూ సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో పోలీసులు మరింతగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుబెట్టిన తర్వాత మావోయిస్టులు ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. తాము హతమార్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెలను కావడంతో అది తమ గొప్ప విజయంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏవోబీలో కూంబింగ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మందుపాతర్లను అమర్చినట్టు సమచారం. తామున్న ప్రాంతానికి వచ్చే సాయుధ దళాలను మట్టుబెట్టే వ్యూహంగా పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి మావోయిస్టు విలీన వారోత్సవాల సందర్భంగా చత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు, కోందు దళాలను ఇప్పటికే ఏవోబీలోకి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు ఎన్కౌంటర్లకు సైతం వెరవకుండా దాడులకు పాల్పడతారన్న పేరుంది. ఇరు వర్గాలు పగ, ప్రతీకారాలతో ఉన్నందున ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విశాఖ మన్యం వాసులు భయం గుప్పెట కాలం గడుపుతున్నారు. అనుమానితుల పేరిట ప్రశ్నించడానికి పోలీసులు ఎవరిని ఎప్పుడు తీసుకుపోతారోన్న భయం వీరిని వెంటాడుతోంది. ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. లివిటిపుట్టులో డీజీపీ డుంబ్రిగుడ(అరకులోయ): ప్రజల కోసం పని చేసే మంచి గిరిజన ప్రజాప్రతినిధులను కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన మండలంలోని లివిటిపుట్టు గ్రామాన్ని, సంఘటన స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం నిశితంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. ఏజెన్సీ గ్రామాలు ఒడిశాకు సరిహద్దుగా ఉండటంతో తరచూ మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయన్నారు. మున్ముందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో క్లిప్పింగ్‌లు, ప్రత్యక్ష సాక్షులు, ఫొటోల ఆధారంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఓఎస్డీ సిద్ధార్థకౌశల్, ఏఎస్పీ అమిత్‌బర్దర్, డీసీపీ ఫకీరప్ప ఉన్నారు. సోమ కుటుంబానికి పరామర్శ అరకులోయ: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని డీజీïపీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ముందుగా సోమ ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ భార్య బిచ్చావతి, కుమారులు అబ్రహం,సురేష్,ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు.. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు తన భర్తను అన్యాయంగా మావోయిస్టులు పొట్టనపెట్టుకుని,తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని సోమ భార్య బిచ్చావతి డీజీపీ ఎదుట రోదించారు. తమను వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యగా విచారణ చేపట్టాలి.. తన తండ్రిని మావోయిస్టులు అన్యాయంగా చంపారని,రాజకీయ హత్య కోణంలో విచారణ చేపట్టాలని సోమ కుమారులు అబ్రహం, సురేష్‌లు డీజీపీకి విన్నవించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోయారని, డుంబ్రిగుడ ఎస్ఐ విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదు చేశారు. అన్ని విధాల న్యాయం చేస్తాం.. మావోయిస్టులు ఇద్దరు నాయకులను హత్య చేయడం బాధాకరమని, మీ కుటుంబానికి అన్ని విధాల సాయం చేస్తామని డీజీపీ ఠాకూర్, సోమ భార్య, కుమారులకు హమీ ఇచ్చారు. సిట్ దర్యాప్తుతో అన్నీ వెలుగులోకి.. పాడేరు: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై సిట్‌తో విచారణ చేపడుతున్నందున అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ ఆర్.పి. ఠాకూర్ అన్నారు. బుధవారం రాత్రి పాడేరులోని కిడారి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కిడారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం కిడారి భార్య పరమేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమారు గంటసేపు కిడారి భార్య పరమేశ్వరితో పలు విషయాలపై ఆంతరంగికంగా చర్చించారు. తమకు జరిగిన అన్యాయం గురించి, కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆమె డీజీపీకి వివరించారు. తమకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరారు. కిడారి సర్వేశ్వరరావు వద్ద పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, అనుచరుల వ్యవహార శైలి, తదితర వాటిపై డీజీపీ కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు డీజీపీ వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏఎస్పీ అమిత్ బర్దర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఉన్నారు. -
మంత్రి పదవి ఇస్తామన్నారు..రూ.12 కోట్లు ఇచ్చారు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ మారితే గిరిజన కోటాలో మంత్రి పదవి ఇస్తామని అధికార తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెల్లడించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. కాల్పుల కంటే ముందు కిడారిని మావోయిస్టులు లోతుగా ప్రశ్నించారని, ఆయన పలు సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... అధికార పార్టీలో చేరినందుకు రూ.12 కోట్లు ఇచ్చారని, విశాఖ మన్యంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు మంత్రి నారా లోకేశ్ తనకు లైసెన్స్‌లు ఇప్పించారని కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల ఎదుట ఒప్పుకున్నారు. తాను కొన్ని తప్పులు చేశానని, మైనింగ్ ఆపేస్తానని, రాజకీయాలు కూడా మానేస్తానని, ఇందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను సైతం మావోలు ప్రశ్నించారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే కిడారితో కలిసి తిరగాలని ముఖ్యమంత్రి తనకు చెప్పారని సోమ అన్నారు. బాక్సైట్ క్వారీలతో ఎమ్మెల్యే తనకు 25 శాతం వాటా ఇచ్చారని, పెట్టుబడి ఆయనే పెడతామన్నారని, ఈ మేరకు తమ పార్టీ కూడా చెప్పిందని మావోయిస్టుల ఎదుట అంగీకరించారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణ మావోలు: పార్టీ ఎందుకు మారావు? కిడారి: గిరిజనుల కోటాలో మంత్రి పదవి ఇస్తామన్నారు. మావోలు: పార్టీ మారినందుకు ఎంత డబ్బు తీసుకున్నావు? కిడారి: 12 కోట్లు. (తొలుత మౌనం. డ్రైవరుతో ఆరా. నాకు తెలియదన్నాక కిడారిని గట్టిగా గద్దించడంతో వెల్లడి) మావోలు: వద్దని చెప్పినా మైనింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నావు. లైసెన్స్‌లు ఎలా వచ్చాయి? కిడారి: మంత్రి నారా లోకేశ్ ఇప్పించారు. అన్నీ ఆయనే చూసుకుంటామన్నారు. మావోలు: అయితే, వద్దనా మైనింగ్ చేస్తావా? కిడారి: కొన్ని తప్పులు చేశా. మైనింగ్ ఆపేస్తా. ఇక చేయను, ఈ మేరకు రాసిస్తా. రాజకీయాలు కూడా మానేస్తా. రెండు రోజులు సమయం ఇవ్వండి. మావోలు: ఇంకా ఏమేం ఒప్పందాలు ఉన్నాయి? కిడారి: ఇంకెప్పటికీ, ఇంకేమీ చేయను. మావోలు: చేసిందంతా ఒక ఎత్తయితే... ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. కొత్తగా రెండు వాహనాలు కొన్నావు కదా! కిడారి: అవును. ట్రైకార్ సంస్థ ద్వారా రుణం తీసుకున్నా. 35 శాతం సబ్సిడీ, ఎమ్మెల్యే అలవెన్స్ ఉంది. మావోలు: అంత విలాసవంతమైన జీవితం కావాలా? కిడారి: మౌనం. సివేరి సోమతో మావోయిస్టుల సంభాషణ మావోలు: నువ్వు వాడితో(కిడారి) కలిసి ఎందుకు తిరుగుతున్నావు? సివేరి: ఎమ్మెల్యే పార్టీ మారి వచ్చినందున కలిసి తిరగమని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని కార్యక్రమాలు, ఫంక్షన్లకు కూడా కలిసే వెళ్లమన్నారు. మావోలు: క్వారీలు వద్దన్నాం, బాక్సైట్ తవ్వొద్దని చెప్పాం కదా! సివేరి: నాకు ఎమ్మెల్యే 25 శాతం వాటా ఇచ్చారు. పెట్టుబడి ఆయనే పెడతామన్నారు. ఈ మేరకు పార్టీ కూడా చెప్పింది. పాలకులతో కుమ్మక్కై మోసం చేస్తావా? మా వద్ద నీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు పలు అంశాలపై నిలదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉన్నది ఉన్నట్లు అంగీకరించానని, ఇకపై ఎలాంటి తప్పులు చేయనని, తనను వదిలిపెట్టాలని, రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కిడారి మొరపెట్టుకున్నారని చెప్పారు. గిరిజనులను బాగుచేస్తానని చెప్పి, బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇప్పుడు వారి బతుకులనే దెబ్బతీసేలా అధికార పార్టీతో చేతులు కలుపుతావా? పాలకులతో కుమ్మక్కై ఇలా ఎంతకాలం మోసం చేస్తావు? నీలాంటి వాడు బతకడానికి వీల్లేదు, నీ ఖేల్ ఖతం అంటూ కిడారిపై తుపాకులు ఎక్కుపెట్టి గుళ్లవర్షం కురిపించినట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ టీడీపీ పెద్దలు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య గురించి తెలియగానే అధికార పార్టీ ముఖ్య నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన ఎలా జరిగిందనే అంశం కంటే ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఆ సంగతులు తెలుసుకోండి అంటూ వారు ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నందున తక్షణమే నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ పనిపైనే దృష్టి పెట్టారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ అప్పటికే బయటకు రావడంతో... ‘‘ప్రత్యక్ష సాక్షుల నుంచి ఒక్క విషయం కూడా బయటకు పొక్కకూడదు. ఎమ్మెల్యే కొనుగోలు సంగతిని బయటకు రానివ్వొద్దు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. వాళ్ల నోళ్లు నొక్కేయండి. ఒక్క మాట బయటకొచ్చినా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త’’ అంటూ అధికార పార్టీ పెద్దల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు అత్యవసర ఆదేశాలు అందినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల మాటలు మార్పించండి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటివరకు చెప్పిన మాటలను స్వయంగా వారితోనే మార్చి చెప్పించాలనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పుడు ఏదో ఆందోళనతో అలా చెప్పామనే కోణంలో మళ్లీ మాట్లాడించాలని సూచిస్తున్నట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేద్దాం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, వారు చెప్పకుండా, తమ సూచనలు లెక్కచేయకుండా వెళ్లారని, మావోయిస్టులతో చర్చించి ఒప్పందాలు చేసుకోవడానికే వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వాలని, దాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలనే సూచనలు ఉత్తరాంధ్రలోని టీడీపీ నేతలకు పార్టీ ముఖ్యుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. తద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై చర్చ జరగకుండా చూడాలనేది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. పోలీసుల చేతగానితనాన్ని కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కూడా అంటున్నట్లు వినికిడి. మావోల వద్ద సమాచారం నిక్షిప్తం అధికార పార్టీ తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబమ్మి చేస్తుందని మావోయిస్టులు గ్రహించినట్లు సమాచారం. అందుకే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలతో జరిగిన సంభాషణలను వ్యూహాత్మకంగా రికార్డు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా సంఘటనకు పాల్పడిన తరువాత మావోయిస్టులు అధికారికంగా మీడియాకు లేఖలు విడుదల చేస్తారు. ఆ లేఖల్లో మరెన్ని వివరాలు ఉంటాయో, ఎలాంటి లోగుట్లు బయటకు వస్తాయో అనే ఆందోళన కూడా తమ పార్టీ ముఖ్య నేతల్లో ఉందని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. గిరిజన ద్రోహులైనందుకే... ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకునే ముందు ఆయన తీవ్ర భయాందోళనలతో తనతోపాటు వాహనంలో ఉన్న వారితో పలు అంశాలను ప్రస్తావించారు. డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, అంగరక్షకులు, ఇతర నాయకులు ఎమ్మెల్యేతోపాటు ఉన్నారు. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాంరా... అని కిడారి వ్యాఖ్యానించినట్లు డ్రైవర్ రవి మీడియాకు చెప్పారు. ‘‘నన్ను బాక్సైట్ తవ్వకాల గురించి అడిగారు. వైకాపా నుంచి టీడీపీలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? అని ప్రశ్నించారు’’ అని రవి వివరించారు. కిడారి, సివేరిలు గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామని మావోయిస్టులు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ స్వామి, కిడారి పీఏ అప్పారావు వెల్లడించారు. ‘‘ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మాత్రం కొద్దిదూరం తీసుకెళ్లారు. స్థానికులతో కొంతమంది మావోయిస్టులు చెట్టు కింద సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కాల్పులు జరిగాయి’’ అరకు మాజీ సర్పంచి చటారి వెంకటరాజు తెలిపారు. స్థానికుల సమక్షంలోనే ప్రశ్నించిన మావోలు వాహనాన్ని అడ్డగించి తమ అదుపులోకి తీసుకోబోయే సమయంలో వ్యూహంలో భాగంగానే పలువురు స్థానికులను మావోయిస్టులు వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ సందర్భంగానూ మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య మాటలు జరిగాయి. సివేరి సోమ విషయంలోనూ దాదాపు ఇదేవిధంగా జరిగింది. వీటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే స్థానికులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘‘ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి గిరిజనులే. వారిని చంపేస్తే గిరిజనులు ఆగ్రహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సహకరించకపోవచ్చు. తమ కదలికలను పోలీసులకు తెలియజేయవచ్చు. వాటన్నింటి దృష్ట్యానే స్థానికులను వెంట తీసుకెళ్లారు. వారి సమక్షంలోనే అన్ని వివరాలు రాబట్టారు. ఆ తరువాతే కాల్చారు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు విశ్లేషించారు. ఎమ్మెల్యే అమ్ముడుపోయిన విషయాన్ని గిరిజనుల మధ్య నిరూపించాలన్నదే మావోల ఎత్తుగడ అని పేర్కొన్నారు. తమ సమక్షంలోనే మావోయిస్టులు పలు ప్రశ్నలు అడిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. సంభాషణలు బట్టబయలు కిడారి, సివేరిల హత్యకు ముందు ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, అరకు మాజీ సర్పంచ్ వెంకట్రాజు, నాయకురాలు లావణ్య తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వీరితోపాటు తమకు నమ్మకస్తులైన వారిని కూడా మావోలు వెంట తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత వేర్వేరుగా కాల్చి చంపారు. సంఘటన జరిగిన తరువాత దాదాపు ఆరేడు గంటలపాటు పోలీసుల జాడ లేదు. ఈలోగానే ప్రత్యక్ష సాక్షులు తమ కళ్లెదుట జరిగిన సంఘటనను హతుల కుటుంబీకులకు, మిత్రులు, బంధువులకు, పార్టీ ముఖ్య నాయకులకు చేరవేశారు. సంఘటనా స్థలం నుంచి అరకు పోలీసుస్టేషన్ వద్దకు మృతదేహాలను సొంత వాహనాల్లో తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజల డిమాండ్ మేరకు ఆగారు. ఆ సమయంలో కూడా జరిగిన సంఘటనను వివరించారు. దీంతో సంభాషణల వ్యవహారం బట్టబయలైంది. -
అరకు దాడి ఆధారాలు దొరికాయ్ : డీజీపీ
సాక్షి విశాఖపట్నం : విశాఖ మన్యం, అరకు లోయలో మావోయిస్టుల కదలికలు తగ్గిపోయినట్టు పోలీసు వర్గాలు ఎప్పుడూ చెప్పలేదని ఆంద్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం డుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యకు గురైన ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. కాల్పుల్లో పాల్లొన్న వారి ఆధారాలు దొరికాయనీ, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు (ఏఓబీ)లో సమస్యలున్నాయనీ, ఈ ఘటనపై ఒడిషా డీజీపీ ఆర్పీ శర్మతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీజీపీ ఇంటలిజెన్స్, విశాఖ జిల్లా ఎస్పీ ఉన్నారు. -
ఏవోబీలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌తో గిరిజన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఓ వైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కిడారి హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు. ప్రత్యక బృందం (సిట్) అధికారి ఫకీరప్ప నేతృత్వంలో స్థానికులను విచారిస్తూ.. ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కిడారి డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. డీజీపీ ఠాకుర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి.. దర్యాప్తుపై వివరాలు సేకరించనున్నారు. కిడారి హత్య అనంతరం మావోయిస్టులు ఎటు వైపుకు వెళ్లారు.. హత్యలో స్థానికుల ప్రేమేయం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్యలో ఇప్పటికే పలువురు మావోయిస్టులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. -
నివురుగప్పిన నిప్పు.. లివిటిపుట్టు
కొద్ది వారాలుగా రెక్కీ.. రెండు మూడు రోజులపాటు మకాం.. గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహణ.. కాల్పులతో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ పూర్తి.. ఆపైన తాపీగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన మావోయిస్టులు.. సంచలనానికి వేదికైన లివిటిపుట్టు ఆదివారంనాటి దారుణ ఘటనకు మౌనసాక్షి. మావోలు బలహీనపడ్డారని, పోలీసులు పైచేయి సాధించారని భావిస్తున్న తరుణంలో ఉరుములేని పిడుగులా సంభవించిన ఈ సంఘటన దేనికి సంకేతం? గిరిజనులను ప్రేరేపించిన.. మావోయిస్టులకు పరోక్షంగా సహాయపడిన అంశాలేమిటి? సర్కారు దోపిడీ విధానంపై మన్య ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికీ, అసహనానికీ దీనిని ఓ ఉదాహరణగా భావించవచ్చా? ప్రజల్లోనూ, ప్రభుత్వ పెద్దల్లోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్.. సాక్షి, విశాఖపట్నం : ఏదైనా ఆపరేషన్‌లో పాతిక మందో.. ముప్ఫైమందో మావోయిస్టులు పాల్గొంటారు. తమ ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పని ముగించుకుని వెళ్లిపోతుంటారు. అంతేకాని గ్రామాల్లో మాటు వేసిన సందర్భాలు చాలా అరుదు. ఎక్కడైనా మారుమూల అటవీ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా గిరిజనులందరినీ తమ వద్దకు రప్పించుకుంటారే తప్ప మావోలు గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందడం ఉండదు. కానీ నిన్నటి లివిటిపుట్టు ఘటనలో 60–70 మంది పాల్గొనగా.. చుట్టుపక్కల వివిధ బృందాలుగా ఏర్పడి మరో 70 మందికి పైగా పహారా కాశారని చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 150 మంది మావోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం చిన్న విషయం కాదు. పైగా డుంబ్రిగుడ మండలం కోండ్రుం పంచాయతీ సోరాయి గ్రామానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెళ్తున్నారన్న సమాచారం నాలుగైదు రోజుల ముందే ఇన్ఫార్మర్ల ద్వారా తెలియడంతో పక్కా ప్లానింగ్‌తో ఈ ఆపరేషన్‌కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మావోయిస్టులపై గిరిజనులకు గురి కుదిరిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల, ప్రభుత్వ, దోపిడీ విధానాలతో విసిగి వేసారడం వలనే గిరిజనులు మావోలను మళ్లీ విశ్వసిస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం బలం చేకూరుస్తుంది. మావోయిస్టులు బృందాలుగా ఏర్పడి రెండ్రోజులు ముందుగానే లివిటిపుట్టు పరిసర గ్రామాలకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్ఫార్మర్లు, మిలిషీయా సభ్యుల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో సురక్షిత ప్రాంతాల్లో మకాం వేసినట్టు తెలియవచ్చింది. కనీసం ఒకటి రెండ్రోజుల ముందు ఈ ప్రాంతానికి చేరుకున్నారని భావించినా వారికి ఆశ్రయం ఇచ్చే విషయంలో గిరిజనులు ఎంతో కొంత సహకారం అందించి ఉంటారని భావిస్తున్నారు. వీరు ఆశ్రయం ఉన్న గ్రామాలు చాలా వరకు సెల్ నెట్వర్కు పనిచేసే గ్రామాలే. పైగా మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, అరుకులోయకు 17 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. నిజంగా పోలీసులకు సమాచారం చేరవేయాలన్నా.. స్వయంగా చెప్పాలన్నా ఏమంత కష్టమైన పనికాదు. ఏ మార్గంలో వెళ్లినా ఒకటి రెండు గంటల్లోనే సమాచారాన్ని చేరవేయొచ్చు. కానీ ఆశ్రయం ఇచ్చిన గిరిజనులు, మిలిషీయా సభ్యులు ఎక్కడా ఏ రూపంలోనూ ఎవరికి సమాచారం చెప్పలేదు. సమాచారం చేరవేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపైన, అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల పైన నమ్మకం పూర్తిగా సడలడమే అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దోపిడీ విధానాల వల్లే గిరిజన యువతకు మళ్లీ మావోలపై గురికుదిరిందన్న వాదన బలంగా విన్పిస్తుంది. గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ నేతలు గిరి సంపదను అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా తమను అన్ని విధాలుగా దోపిడికి గురిచేయడం వలనే వారి పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు కేంద్రానికి రాష్ట్రం ద్వారా ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల గిరిజన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గిరిజన మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరపనీయమని చెప్పినా గిరిజనుల విశ్వసించడం లేదు. మరోవైపు ఫిరాయించిన పార్టీ నేతలు గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం అడ్డుకట్టవేయలేకపోవడం.. తమకు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టడం.. తమ సమస్యలను పట్టించుకోకపోవడం వంటి విషయాల్లో గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఈ కారణంగానే నిన్నటి ఘటనలో వలనేనన్న భావన బలంగా విన్పిస్తుంది. ఈ కారణంగానే తమ చెంతనే మావోలు ఉన్నçప్పటికీ వారు నోరు మెదపలేదంటున్నారు. మావోలు ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో ఆయా గ్రామాల్లోని పోలీస్ ఇన్ఫార్మర్లను నోరుమెదిపే సాహసం చేయలేకపోయారని సమాచారం. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భద్రత పెంపు
మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసు బలగాలు మన్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సమాచారం రాబట్టే పనిలో నిమగ్నమవడంతో గిరిజనులు వణికి పోతున్నారు. లివిటిపుట్టు గ్రామం భయం గుప్పెట్లో ఉంది. గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకు): డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ లివిటిపుట్టు సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతోంది. సంఘటన జరిగిన ఆదివారం నుంచి లివిటిపుట్టుతోపాటు పరిసర గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రశ్నిస్తే.. ఏం చెప్పాలి..? సుమారు 300 జనాభా గల ఈ గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వీరి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఎవరొచ్చి ప్రశ్నిస్తే.. ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వీరున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం. సాయంత్రం ఆరు గంటలు దాటితో ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. మండల కేంద్రం డుంబ్రిగుడలో.. మండల కేంద్రం డుంబ్రిగుడలో కూడా ఇదే పరిస్థితి. రాత్రి ఏడు గంటలకే దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో సెంటర్‌తోపాటు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి వేళల్లో కూడా బితుకుబితుకు మంటూ కాలం గడుపుతున్నారు. బూట్ల చప్పుడుతో గజగజ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ద్వారా ముగ్గురు మావోయిస్టుల వివరాలను సేకరించిన పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో గిరిజనులు మరింత భయంతో వణికిపోతున్నారు. ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. లివిటిపుట్టుతో పాటు మారుమూల ప్రాంతాలను గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎప్ బలగాలు జల్లెడపడుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఒక పక్క మావోయిస్టులు, మరోపక్క పోలీసుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. మండల కేంద్రంలో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. మూడు రోజుల నుంచి గిరిజన ప్రాంత గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామాల్లో కనిపిస్తోంది. భయం గుపెట్లో నాయకులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు భయంతో వణికిపోతున్నారు. మైదాన ప్రాంతానికి తరలిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఆర్కే, చలపతి మళ్లీ తెరపైకిగాలింపు ముమ్మరం చేసిన పోలీసు బలగాలు సీలేరు (పాడేరు): ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న అగ్రనేతలు ఆర్కే, చలపతి రెండేళ్ల తర్వాత మళ్లీ ఉద్యమాన్ని బలోపేతం చేశారనడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యే ఉదాహరణ. గతం వరకు వారిద్దరిని మట్టుబెడితే సరిపోతుందని బలగాలు వారికోసం వెంటాడాయి. అయితే రెండేళ్లుగా ప్రశాంతంగా ఉండి పోలీసుల నుంచి వచ్చిన ఘటనలను ఎదుర్కొంటున్న అగ్రనేతలంతా వ్యూహా రచనతో పెద్ద సంచలనాన్ని సృష్టించడంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరకు సంఘటనకు పదిరోజుల ముందే ఆర్కే, చలపతి విశాఖ ఏజెన్సీలోకి వచ్చారని ఇంటలిజెన్స్ సమాచారం ఉంది. ఈ సంఘటన అనంతరం వారిద్దరిని పట్టుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. అడవుల్లో అణువణువు గాలింపులు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, ఒడిశా పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఏ క్షణంలోనైనా మావో యిస్టులు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయాం పాడేరు: నాన్న దూరమవడంతో పెద్దదిక్కును కోల్పోయాం. మా కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వమే మాకు దారి చూపాలని కిడారి సర్వేశ్వరరావు కుమారులు శ్రావణ్ కుమార్, సందీప్ కుమార్ కోరారు. మంగళవారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి హత్యోదంతంపై కన్నీరు పెడుతూ తమకు ఎంతో అన్యాయం జరిగిందని, మా జీవనం అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. మావోయిస్టులు మా తండ్రిని దారుణంగా చంపారని, తప్పు చేసి ఉంటే ఒక్కసారైనా హెచ్చరించి ఉంటే బాగుండునని, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా చంపడం అన్యాయమని అన్నారు. తనకు మావోయిస్టుల వల్ల ఇలాంటి ముప్పు ఉంటుందని ఏనాడూ మా నాన్న తమకు చెప్పలేదని అన్నారు. గతంలో ఎన్నడూ మా నాన్నను హెచ్చరికలు చేసిన సందర్భాలు కూడా లేవని, ఆకస్మికంగా హత్య చేయడం నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామని, చాలా అభివృద్ధి చేయగలిగానని నాన్న సర్వేశ్వరరావు చెప్పేవారని, తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అంటుండేవారని వారు వెల్లడించారు. నాన్న రాజకీయ వ్యవహారాల్లో తామెప్పుడు జోక్యం చేసుకోలేదని, నాన్న అప్పుడుప్పుడు మంచి కార్యక్రమాలు చేసినపుడు మాకు చెప్పేవారని, మమ్మల్ని మాత్రం ఎప్పుడు బాగా చదువుకోవాలని చెబుతుండేవారన్నారు. మా ఇద్దరితో పాటు చెల్లెలు తనిష్క కూడా చదువుకుంటోందన్నారు. తండ్రి మృతితో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వమే తమను అన్నివిధాలా ఆదుకోవాలని వారు కోరా>రు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికిభద్రత పెంపు పాడేరు: పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో పాడేరులోని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనలకు వెళ్లినపుడు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్మెన్లతో పాటు అదనంగా గన్‌మెన్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. మా కుటుంబాన్ని ఆదుకోవాలి :సివేరితనయుడు అబ్రహం డుంబ్రిగుడ (అరకు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మా వోయిస్టులు కాల్చి చం పేశారు. దీంతో మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా తండ్రి మృతి చెందడంతో వీధిన పడ్డామని, తమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకుని న్యాయం చేయాలని సివేరి సోమ కుమారుడు అబ్రహం కోరారు. లివిటిపుట్టు గ్రామ సమీపంలో తండ్రి సోమ మృతి చెందిన సంఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. మావోయిస్టులు దారుణంగా మా తండ్రిని చంపడం ఎంతో బాధాకరమన్నారు. దీని వెనుక మావోయిస్టులతో పాటు రాజకీయ కుట్ర కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. -
లివిటిపుట్టుకు భారీగా వచ్చిన మావోయిస్టు దళాలు
అరకులోయ: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును టార్గెట్‌గా చేసుకున్న మావోయిస్టులు మూడు రోజులుగా కండ్రూం పంచాయతీ సమీపంలోని అడవుల్లో మాటు వేసినట్టు తెలిసింది. కొందరు సాధారణ దుస్తులు ధరించి ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ ప్రాంతంలో సంచరించారని సమాచారం. కాలినడకన మూడు చోట్ల నుంచి.. ఆపరేషన్ లివిటిపుట్టులో పాల్గొనేందుకు ఏవోబీలోని మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు భారీగా చేరుకున్నారు. ఏజెన్సీలో కీలకమైన పెదబయలు దళంతోపాటు ఒడిశా కటాఫ్ ఏరియాలోని ఏరియా కమిటీ, కొరాపుట్ జిల్లా నందపూర్ దళానికి చెందిన మావోయిస్టులంతా కాలినడకనే లివిటిపుట్టుకి ముందుగానే చేరుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రతి దళంలోనూ 20 మందికి మించి మావోయిస్టులు ఉండరు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల వాహనాలను చుట్టుముట్టినపప్పుడు మావోయిస్టులు భారీగా ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో ఉండగా మరికొందరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మాటు వేసినట్టు చెబుతున్నారు. వీరిని హతమార్చిన తర్వాత మళ్లీ అడవి మార్గంలోనే ఒడిశా ప్రాంతానికి తరలి వెళ్లినట్టు గిరిజనులు పేర్కొంటున్నారు. వెంటనే స్పందించని యంత్రాంగం డుంబ్రిగుడ మండలంలోని మారుమూల ప్రాంతం గుంటసీమ తరువాత ఒడిశా గ్రామాలే అధికంగా ఉన్నాయి. ఒడిశా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో సులభంగా తప్పించుకునే అవకాశం కలిగింది. ఘటన తరువాత ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కొంత సమయం పట్టింది. అయితే పోలీసు యంత్రాంగం నుంచి ప్రతిస్పందన లేకపోవడం మావోయిస్టులకు కలిసొచ్చింది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రకటించినప్పటికీ డుంబ్రిగుడ, ఒడిశా సరిహద్దులో పోలీసుల సంచారం కనిపించడం లేదు. ఎమ్మెల్యే కదలికలపై వివరాల సేకరణ... లివిటిపుట్టు ప్రాంతంలో కొన్నిచోట్ల సెల్‌ఫోన్ సంకేతాలు అందుబాటులో ఉన్నాయి. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామానికి వస్తున్న సమాచారాన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా తెలుసున్నారు. జవాన్ పోస్టుల రాత పరీక్షలో పోలీసులు బిజీ జవాన్ పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజన అభ్యర్ధుల కోసం పోలీసుశాఖ ఆదివారం అరకులోయలో మెరిట్ టెస్ట్ ఏర్పాటు చేసింది. పోలీసులు ఈ పనుల్లో నిమగ్నమవుతారని, డుంబ్రిగుడ వైపు రాలేరని మావోలు లివిటి అపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ మాటు వేశారనే సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం. -
ఉప్పందించింది గంజాయి వ్యాపారులే?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం వెనుక గంజాయి వ్యాపారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిచ్చిన సమాచారంతోనే మావోయిస్టులు పక్కా వ్యూహంతో దాడికి దిగి హతమార్చినట్లు భావిస్తున్నారు. గంజాయి వ్యాపారులు, ఎమ్మెల్యే కిడారి మధ్య ఇటీవల విబేధాలు తలెత్తినట్లు చెబుతున్నారు. అందువల్లే ఎమ్మెల్యే కదలికలను వారు ఎప్పటికప్పుడు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు చేరవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతోనే మావోయిస్టులు దాడి జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. చర్చికి వెళ్లాలని బయల్దేరి... అరకులో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ శనివారం రాత్రి విజయవాడ నుంచి అరకు చేరుకున్నారు. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ నెల 23వతేదీన కుటుంబంతో కలసి స్వగ్రామం బత్తివలసలోని చర్చికు వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అదే సమయంలో తనతోపాటు రావాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరడంతో కాదనలేక ఆయన వెంట వాహనంలో బయల్దేరారు. ఎమ్మెల్యేతోపాటు వెళ్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో.. ‘మీరు వెళ్లండి ఏం పర్వాలేదు.. నేను మీ వెనక తర్వాత వస్తా..’ అని చెప్పారని సోమ అనుచరులు పేర్కొంటున్నారు. సోమ అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న గంజాయి వ్యాపారులు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు ఉప్పందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బందోబస్తు లేకుండా కిడారి, సోమ ఒంటరిగా వçస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం మావోయిస్టులు కార్యాచరణకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఫోన్లు పనిచేయలేదా? ఘటన అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ లివిటిపుట్టులో సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల పూర్తి సమాచారం రాలేదని చెప్పగా.. హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశామని కిడారి, సోమ అనుచరులు పేర్కొనడం గమనార్హం. మన్యంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు.. విశాఖ మన్యంలో సుమారు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక గిరిజనులను అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గంజాయి సాగు నిల్వ, రవాణా విషయంలో అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది, అధికార పార్టీ నేతలకు వ్యాపారులు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. సిట్ దర్యాప్తు ప్రారంభం కిడారి, సోమ డ్రైవర్లను విచారించిన అధికారులు పాడేరు: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై సిట్ అధికారులు అరకులో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి వాహనాల డ్రైవర్లు రవి, చిట్టిబాబులను విచారించిన సిట్ అధికారులు సంఘటన జరిగిన తీరుపై పలు విషయాలను సేకరించారు. అనంతరం లివిటిపుట్టు వద్ద సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు యూనిఫైడ్, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలను మన్యానికి తరలించారు. మంగళవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్న పోలీసు బలగాలు అరకు, డుంబ్రిగుడ మండలాల పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గన్ను పట్టిన మహిళా దండు సాక్షి, విశాఖపట్నం/అరకులోయ: ఏవోబీ మావోయిస్టు పార్టీ ఉద్యమంలో మహిళలు కీలకంగా మారారు. మావోయిస్టు పార్టీలో గతంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారు. ఎన్కౌంటర్లో కీలక నేతలతో పాటు, తన కుమారుడు మున్నాను కూడా పొగొట్టుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే.. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న తర్వాత మళ్లీ ఏవోబీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశారనే విషయం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలతో తెలుస్తోంది. దీనికి మహిళా మావోలను ఆయన సన్నద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలతో పాటు, సరిహద్దులోని ఒడిశా పల్లెల్లో మావోయిస్టు ఉద్యమంపై అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి అనేక గ్రామాల గిరిజన యువత ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. వీరిలో 17 ఏళ్లు దాటిన గిరిజన యువతులే అధికంగా ఉన్నట్టు సమాచారం. విశాఖ ఏజెన్సీ, ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజన యువతులు వందల సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేరినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్లో మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏవోబీలో యువతకు పెద్దఎత్తున శిక్షణ ఇచ్చారని, ఈ శిక్షణలో గిరిజన యువతులు కూడా ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో ఏవోబీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఒడిశాతో పాటు, విశాఖ ఏజెన్సీ మారుమూల గ్రామాలలోను గిరిజనులతో సమావేశాలు నిర్వహించిన సమయంలో మహిళా మావోయిస్టులే కీలకపాత్ర వహించారు. ఆయుధాలు చేతబూనిన మహిళా దండును చూసినట్లు గిరిజనులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీ కోరుకొండ, పెదబయలు దళాలతో పాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో పలు దళాలలో మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల వాహనాలను ముట్టడించిన వారిలో మహిళా మావోయిస్టులే అధికంగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళా మావోయిస్టులే వారిని తుపాకులతో కాల్చి చంపారు.ఇది మహిళా మావోయిస్టులతో చేపట్టిన తొలి ఆపరేషన్‌గా ఏజెన్సీలో ప్రచారం జరుగుతుంది. రెండేళ్లుగా భారీగా రిక్రూట్మెంట్ ఏవోబీలో మావోలు బలపడుతున్నారని లివిటిపుట్టు ఘటనతో తేటతెల్ల మవుతోంది. గత రెండేళ్లలో భారీగా రిక్రూట్మెంట్ జరిగిందన్నది నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోల వయసును బట్టి స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం లివిటిపుట్టు ఆపరేషన్‌లో పాల్గొన్న వారిలో అత్యధికులు 18–20 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో రిక్రూట్మెంట్ జరగడం లేదన్న పోలీసుల వాదన తప్పని రుజువైంది. సాక్షుల చెప్పిన సమాచారాన్ని బట్టి కాల్పుల్లో పాల్గొన్న వారు గుత్తుకోయల, కొందూస్ తెగకు చెందిన వారిగా భావిస్తున్నారు. గుత్తుకోయల తెగకు చెందిన వారు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. ఇక కొందూస్ తెగకు చెందిన వారు ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. కిడారి ఆపరేషన్‌లో పాల్గొన్న వారు తెలుగు మాట్లాడుతుండటంతో వీరంతా తెలంగాణ, ఏపీకి చెందిన వారేనని భావిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ యాసలో మాట్లాడారని సాక్షులు చెబుతున్నారు. -
మన్యంలో భయం భయం
సాక్షి, విశాఖపట్నం :అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు మట్టుబెట్టడంతో విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా గ్రామ, మండల స్థాయి నాయకులనే పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడిన మావోలు ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలనే హతమార్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. తమ నేతలను రక్షించడంలో విఫలమయ్యారంటూ అరుకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆదివారం నాటి ఉద్రిక్త çపరిస్థితులు సోమవారం నాటికి కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన ముగ్గురు మావోల వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయితే వీరు ఏ దళంలో పనిచేస్తున్నది.. ఇప్పటి వరకు ఏఏ ఘటనల్లో పాల్గొన్నది మాత్రం చెప్పలేదు. మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ప్రకటించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. విశాఖ మన్యంతోపాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ఘటన జరిగిన డుంబ్రిగూడ మండలంతోపాటు మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కటాఫ్ ఏరియాతోపాటు ఏవోబీ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. అదనపు బలగాల కూంబింగ్ ఆపరేషన్‌తో ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజన గ్రామాల్లో కన్పిస్తోంది. గిరిజనులైతే ఇళ్లు వదిలి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను చూసారా? వారి కదలికలను గమనిం చారా? గుర్తుపట్టగలరా అంటూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బలగాల బూట్ల చప్పుళ్లతో విశాఖ ఏజెన్సీ దద్దరిల్లిపోతుంది. మొత్తమ్మీద విశాఖ మన్యంలో ఏ క్షణాన్న ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. అర్ధరాత్రి బస్సు సర్వీసులు నిలిపివేత సీలేరు (పాడేరు): ఏవోబీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం నుంచి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకు అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. విశాఖ నుంచి ఏజెన్సీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రాత్రి పూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. విశాఖ–భద్రాచలం, విశాఖ–హైదరాబాదు, భద్రాచలం మీదుగా రాత్రి పూట వెళ్లే బస్సులు తిరగలేదు. ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేస్తున్నారు. -
భయం గుప్పెట్లో పాలకపార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బితుకుబితుకుమంటున్నారు. ఇన్నాళూŠల్ మన్యంలో ఉంటున్న నేతలే ఆందోళన చెందేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కొందరిని దళసభ్యులు టార్గెట్ చేసినట్టు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో మైదానంలో ఉన్నవారూ తీవ్ర భయాదోళనలు చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వీరిని పోలీసులు కూడా హెచ్చరించడంతో మరింతగా కలవరపడుతున్నారు. ఎమ్మెల్యే కిడారి పార్టీ ఫిరాయించిన నాటి నుంచి మావోయిస్టులు అతనిపై గుర్రుగా ఉన్నారు. ఏజెన్సీలోని మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కూడా కన్నెర్ర చేస్తున్నట్టు సమాచారం. ఆమెను కూడా మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గత ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 2004లో మంత్రి మణికుమారి భర్త వెంకట్రాజును కూడా పలుమార్లు హెచ్చరించి ఆ తర్వాత పాడేరులో పట్టపగలే మావోయిస్టులు హతమార్చారు. గతంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు శ్రీను గొలుగొండ మండలం జోగంపేట వద్ద మావోయిస్టులు హత్య చేశారు. కొన్నాళ్ల నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందంటూ అయ్యన్న తనయుడిని కూడా మావోయిస్టుల పేరిట హెచ్చరికలు వచ్చాయి. ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల లక్ష్యంగా మావోయిస్టులు గురిపెడుతుండడంతో వారిలో తీవ్ర కలవరం రేకెత్తుతోంది. -
ఏఓబీలో కూంబింగ్
శ్రీకాకుళం ,భామిని: ఆంధ్రా–ఒడిశా బోర్డర్(ఏఓబీ)లో పోలీస్‌ల కూంబింగ్ ముమ్మరమయింది. గత కొన్నాళ్లుగా స్తబ్ధతగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అరకులో మావోయిస్టుల ఘాతుకంతో పోలీస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చడంతో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో నిలిపివేసిన సాయుధ పోలీస్ కూంబింగ్‌లు తిరిగి ఆరంభమయ్యాయి. ఏఓబీలో కీలకమైన తివ్వకొండల్లో పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. భామిని మండలం నుంచి ఒడిశా, విజయనగరం జిల్లాలకు విస్తరించిన తివ్వకొండలు, అటవీ ప్రాంతంలో సోమవారం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. డీఎస్పీ స్వరూపారాణి సందర్శన తివ్వకొండల్లో జరుగుతున్న పోలీస్ కూంబింగ్‌ను పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావుతో కలిసి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న కూంబింగ్‌ను పరిశీలించారు. సాయంత్రం సాయుధ బలగాలతో కలిసి భామిని మండలం మనుమకొండ–పాలవలస గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. పాలవలస సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహించారు. ఏబీ రోడ్లు వెంబడి పోలీస్‌లు తనిఖీలు చేశారు. -
మహిళా మావోయిస్టు నాయకత్వంలో తొలి ఆపరేషన్!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్‌లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి. మావోయిస్టు ఆపరేషన్‌లో 150 మంది! తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్‌లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. -
అరకు ఘటనతో అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఉద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు, వారి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై మళ్లీ నిఘా ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలకు ఒకప్పుడు గుండెకాయలాంటి ఉత్తర తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే కమిటీల పునర్వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టిందని ఇంటెలిజెన్స్ తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామ పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యా హ్నం మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు బాస్ మహేందర్‌రెడ్డి కూడా ఈ జిల్లాల పోలీసు అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. కొత్తగా కమిటీలు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలను పునరుద్ధరించిన సంగతిని కూడా ఇంటెలిజెన్స్ సంబంధిత అధికారులకు సూచించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్–భూపాలపల్లి జయశంకర్–వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలు ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల– కొమురంభీం (ఎం.కె.బి.) డివిజనల్ కమిటీకి ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్–సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం– తూర్పుగోదావరి డివిజనల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే చర్ల–శబరి ఏరియా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్లు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలం గాణలోనూ దాడుల కోసం మావోయిస్టులు అదను కోసం చూసే అవకాశం లేకపోలేదని, గతంలో హిట్‌లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. గతంలో హెచ్చరికలు ఉన్న ప్రజాప్రతినిధులు ఒంటరిగా తిరగొద్దని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని, గతంలో టార్గెట్లుగా ప్రకటించిన వారిని అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో జల్లెడ సాక్షి, కొత్తగూడెం: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యాన్ని అణువణువూ జల్లెడ పట్టేందుకు హైదరాబాద్ నుంచి భారీగా అదనపు బలగాలను దించారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో నుంచి ఈ బలగాలు దండకారణ్యంలోకి చేరుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు, మంథని భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోయిస్టులు పలువురు నేతలపై రెక్కీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి! ఆంధ్రా ఒడిశా సరిహద్దు రాష్ట్ర కమిటీ నేతృత్వంలో అరకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, రాష్ట్ర మిలటరీ కార్యదర్శి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, బెల్లి నారాయణస్వామి, చెల్లూరి నారాయణస్వామి అలియాస్ సోమన్న, అరుణల ఆధ్వర్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
మంటలు రేపిన మారణకాండ
ఒక ప్రతీకారేచ్ఛ మారణకాండ సృష్టించింది.. ఆ మారణకాండకు నిరసనగా ఆగ్రహజ్వాల రగిలింది. అందాల అరకును అట్టుడికించింది.. మొత్తం మన్యాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది.నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పంజా విసిరారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తూటాలకు నేలకొరిగారు. స్థానికులు, నేతల అనుచరుల్లో అలజడిని, ఆగ్రహాన్ని రేపిన ఈ ఘటన.. అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడికి, దహనానికి పురిగొల్పింది. అనూహ్యంగా జరిగిన మారణకాండ, దాడులు, విధ్వంసాలతో అరుకులోయ చివురుటాకులా వణికిపోయింది. ఈ మొత్తం ఘటనలో కిడారి, సివేరిల మృతదేహాలు నాలుగు గంటల పాటు సంఘటన స్థలంలోనూ.. మరో నాలుగు గంటలు వారి వాహనాల్లోనూ అనాథల్లా మిగిలిపోవడం స్థానికులను కలచివేసింది. సాక్షి విశాఖపట్నం/పాడేరు రూరల్/అరుకులోయ: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. అధికారపార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ప్రజాప్రతినిధి సీవేరిసోమను కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో జరిగిన ఈ ఘటనతో ఏవోబీ ఉలిక్కిపడింది. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం 12.20గంటల సమయంలో మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. వీరిద్దరినీ అతి దగ్గరగా కాల్చిచంపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డుంబ్రిగుడ మండలం లివిటి పుట్టు వద్ద మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. అరకు నుంచి డుంబ్రిగుడ, గుంటసీమ రోడ్డు మీదుగా కండ్రుం పంచాయతీకి కార్యకర్తలు, అనుచరులు సహా మూడు వాహనాల్లో బయలు దేరిన కిడారివాహనాల్ని ముందుగానే మాటువేసిన40 మంది మహిళలు సహా 70 మంది సాయుధదళం కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అడ్డగించి మార్గమధ్యంలోనే మట్టుబెట్టారు. ఉదయం 11 గంటలక వరకూ అరకులోనే ఉన్న కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి లివిటి పుట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. గ్రామ సమీపంలో మార్గమధ్యంలో వాహనాలపై ఒక్కసారిగా మావోలు అడ్డగించారు. ఎమ్మెల్యే గన్మెన్ల వద్ద నుంచి తుపాకీలు, సెల్ఫోన్లు లాక్కొని వారిని దూరంగా పంపించేశారు. అనంతరం వారంతా చూస్తుండగానే చూస్తుండగానే ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సోమకు చేతులు కట్టికొద్ది దూరం ముందుకు తీసుకువెళ్ళి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద నిలిపివేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యే కిడారితో కొద్ది సేపు చర్చించారు. గూడ క్వారీ పర్యావరణాన్ని దెబ్బదీస్తున్నందున మూసెయ్యాలని గతంలో పలు మార్లు హెచ్చరించినా ఎందుకు నడిపిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో వణికిపోయిన కిడారి.. ఈ ఒక్కసారికీ క్షమించాలంటూ వేడుకున్నా.. మావోలు వినిపించుకోకుండా కాల్చిచంపారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమ ఈ దృశ్యాన్ని చూసి భీతావహుడై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా మట్టు బెట్టారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారు. అట్టుడికిన అరకు ఘటనతో అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు తరలివచ్చారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘాతుకం అంటూ సీఐపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నా ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతదేహాల తరలింపులోనూ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. అంతటా విషాదం పాడేరు: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మావోయిస్టుల తూటాలకు బలవ్వడంతో మన్యమంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ వార్త అంతటా దావానంలా వ్యాపించింది. వారి బంధువులు, అభిమానులు, వివిధ గిరిజన వర్గాలు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనూహ్య మరణం పట్ల తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. పాడేరులోని సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద, సతీమణి పరమేశ్వరి స్వగ్రామమైన పట్టణంలోని గొందూరు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటం ఉంచి బంధువులు నివాళి అర్పించారు. పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. కొందరు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. కుగ్రామం నుంచి ప్రభుత్వ విప్ వరకు పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుది ఓ కుగ్రామం. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ నడిమివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటలో ఉండేవారు. చిన్నప్పుడే పెళ్లయింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యాపారం పట్ల మక్కువ చూపేవారు.1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణకు మంచి నమ్మకస్తుడిగా ఉండేవారు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. వైఎస్సార్ మరణం తరువాత వైఎస్సార్సీపీ అరకు సమన్వయకర్తగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్ 28న టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పు.. అరకులోయ: ఇదే సమయంలో రెండు మృతదేహాలు వాహనాల్లో ఈ స్టేషన్ల వద్దకు వచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఒక్కసారిగా పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. వీరంతా రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ రెండు స్టేషన్లకు పక్కనే విద్యుత్ ట్రాన్స్పార్మర్లు ఉండడంతో ముందుస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగుతున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసులు వెనుక నుంచి వచ్చి ఒక భవనంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను తీసుకుని బయటకు వచ్చారు. లేకుంటే తుపాకులు కూడా కాలిపోయే పరిస్థితి ఉండేది. సీఆర్పీఎఫ్ ముట్టడిలో అరకు.. రూరల్ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అంత అరకులోయలోని పరిస్థితిని సమీక్షించారు. దీంతో జిల్లాలోని అందుబాటులో ఉన్న సీఎర్పీఎఫ్ బలగాలను అరకులోయ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు. బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అరకులోయలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద సీఆర్పీఎఫ్ దళాలు పహరా కాస్తున్నాయి. అరకులోయలోనే పోస్టుమార్టం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాల పోస్టుమార్టానికి అరకులోయ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాట్లు చేస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మెయిన్ గేట్ నుంచి మార్చురీ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నాం 3 గంటలకే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారితో పాటు సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకురానివ్వకుండా అభిమానులు, ప్రజలు అడ్డుకోవడంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని డాక్టర్ అర్జున్ ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? చెప్పినా వినలేదా!
సాక్షి, విశాఖపట్నం: అరకు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు డుంబ్రిగుడ మండలంలోని లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. వాస్తవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా పోలీసులకు సమాచారమిస్తారు. అందుకు అవసరమైన బందోబస్తును పోలీసులు సమకూరుస్తారు. ఈనెల 21 నుంచి మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ తమకు సమాచారం లేకుండా ఎక్కడకూ వెళ్లవద్దని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. అయినప్పటికీ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు మారుమూలన ఉన్న లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుకు ఇద్దరు గన్మెన్లు, సోమకు ఒక గన్‌మెన్ ఉన్నారు. వీరిని వెంటబెట్టుకుని గ్రామదర్శినికి పయనమయ్యారు. అరకు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో లివిటిపుట్టు గ్రామం చేరువలోకి వెళ్లేసరికి ఇదే అదనుగా సాయు«ధులైన మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చారు. భారీ సంఖ్యలో ఉన్న సాయుధ మావోయిస్టుల ముందు కేవలం ముగ్గురు గన్మెన్లు నిస్సహాయలయ్యారు. గన్మెన్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులతో వారిద్దరిని కాల్చి చంపారు. సాయుధులైన తమకు ముందస్తు సమాచారం ఇచ్చివుంటే పోలీసు సిబ్బందిని పంపేవారమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల విలీన వారోత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలన్న పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వెళ్లి హతమవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా చరిత్రలో మావోయిస్టులు శాసనసభ్యుడిని మట్టుబెట్టడం ఇదే ప్రథమం. ఆంధ్ర –ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో విశాఖ జిల్లా కూడా ఉంది. దీంతో వారి ప్రాబల్యం జిల్లాలో అధికంగానే కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానించిన వారిని దళసభ్యులు హతమారుస్తున్నారు. వీరిలో ఇన్ఫార్మర్ల నెపంతో కొందరిని, తమకు ప్రత్యర్థులుగా భావిస్తున్న పోలీసులు, మావోయిస్టులను, ప్రభుత్వానికి అనుకూలంగా, గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులను వీరు చంపుతున్నారు. 1990లో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు, ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, తదితరులను పీపుల్స్‌వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న నక్సలైట్ నేత క్రాంతి రణదేవ్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ కిడ్నాప్‌నకు అప్పట్లో పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల అనంతరం ప్రభుత్వం క్రాంతి రణదేవ్‌ను విడుదలతో నక్సలైట్లు బాలరాజు, తదితరులను విడిచిపెట్టారు. అప్పట్లో నక్సల్స్ చెరలో ఉన్న వీరందరినీ హతమారుస్తారని అంతా ఆందోళన చెందారు. తాజాగా ఇప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఇలా ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడం విశాఖ చరిత్రలో ఇదే తొలిసారి! కళ్లెదుట చంపేశారు.. ఎమ్మెల్యే కిడారి వద్ద కొంతకాలంగా పీఏగా పని చేస్తున్నాను. ఆదివారం కండ్రుం పంచాయతీ సర్రాయిలో పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు అడ్డగించారు. వాహనంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్మేన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, డ్రైవర్, నన్ను కిందకు దింపారు. ఎమ్మెల్యేతో మాట్లాడే పనుందంటూ కొంతదూరం తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలితే చంపేస్తామని తుపాకులు ఎక్కుపెట్టారు. కొంత సమయం తర్వాత అంతా చూస్తుండగానే ఎమ్మెల్యేను తుపాకితో కాల్చిచంపారు.– అప్పారావు, కిడారి పీఏ ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే..టీడీపీ కార్యకర్తల ఆరోపణ డుంబ్రిగుడ(అరకులోయ): తనిఖీల పేరిట అరకు రోడ్డులో హడావుడి చేసే డుంబ్రిగుడ ఎస్ఐ అమ్మనరావు మండలం శాంతి భద్రతలను పట్టించుకోక పోవడం దారుణం అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే సంఘటన చోటుచేసుకుందన్నారు. డుంబ్రిగుడ పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఆందోళన చేపట్టారు. ఎస్ఐను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అయ్యన్న దిగ్భ్రాంతి నర్సీపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు దారుణంగా హత్య చేయటంపై రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కిడారి, సోమ హత్యలను ఖండించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎప్పటికప్పుడు సీఎంకు సమాచారం : కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఏజెన్సీ అంతటా అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే భారీ స్థాయిలో భద్రతా బలగాలను ఏజెన్సీకి పంపించామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచారన్ని ఎప్పటికప్పుడు సీఎం, సీఎస్‌తో మాట్లాడుతున్నామని సమాచారాన్ని వాళ్లికి అందిస్తున్నామని తెలిపారు. కాల్పులపై విచారణ చేపట్టునున్నట్లు విలేకరులకు తెలిపారు. కేడీపేటలో కొవ్వొత్తుల ర్యాలీ గొలుగొండ(నర్సీపట్నం): మావోయిస్టుల చర్యకు నిరసనగా కొయ్యూరు సీఐ ఉదయకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు కృష్ణదేవిపేటలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చట్టాలను చేతుల్లో తీసుకొని హింసకు పాల్పడుతున్న మావోయిస్టులకు తగిన గుణపాఠం తప్పదని సీఐ పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవో 97 వల్లే.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీల్లో బాక్సైట్ తవ్వకాలు వీలు కల్పించే 97వ నంబరు జీవోను విడుదల చేయడం వల్లే మన్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య నేపథ్యంలో ఈ జీవో అంశం చర్చనీయాంశంగా మారింది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 97వ నంబరు జీవోను జారీ చేశారు. ఈ జీవో ద్వారా మన్యంలో లేటరైట్ పేరిట లోపాయకారీగా బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఈ జీవో రద్దు కోరుతూ గిరిజనులు, ప్రజా సంఘాలు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం కరువవడమే కాక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బలికావలసి వస్తోందన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
భయోత్పాతం.. భీతావహం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రజాప్రతినిధితో పాటు, మాజీ ప్రజాప్రతినిధిని కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. అయితే రామ్‌గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్‌ను హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. ఒకవైపు గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసినా.. పలు హింసాత్మక చర్యలకు పాల్పడడమేగాక వారోత్సవాలు జరపడం, పోస్టర్లు వేయడం వంటి చర్యల ద్వారా వారు తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపి భయోత్పాతాన్ని సృష్టించారు. మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతోపాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. రామ్‌గుడ ఎన్కౌంటర్ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్ టీమ్ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్యంలో భయంభయం ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. తమ బలం నిరూపించేందుకు మావోయిస్టులు తెగబడిన ఈ ఘటన మన్యంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గిరిసీమలు వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో గ్రామస్తులు బితుకుబితుకుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన దరిమిలా ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలా ఉంటుందోననే భయంతో మారుమూల గూడేల్లోని ప్రజలు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు. డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరికొన్ని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 2014లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలపై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు. సుకుమా జిల్లాలో జరిపిన దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం సంఘటనలు – 155 చనిపోయిన పౌరులు – 128 మరణించిన భద్రతాసిబ్బంది – 87 2015లో ఛత్తీస్‌గఢ్ మందు పాతరలు, ఎన్కౌంటర్లతో దద్దరిల్లింది. మొత్తం సంఘటనలు – 118 చనిపోయిన పౌరులు – 93 చనిపోయిన భద్రతాసిబ్బంది – 57 2016లో ఛత్తీస్‌గఢ్‌లో దాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువ ఘటనలు జరిగాయి. మొత్తం సంఘటనలు – 69 మొత్తం చనిపోయిన పౌరులు – 123 మొత్తం చనిపోయిన భద్రతాసిబ్బంది – 66 -
ఏవోబీలో ఎర్రజెండా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో విస్తరించిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)ను కంచుకోటగా చేసుకుని ఉద్యమాన్ని సాగిస్తున్న మావోయిస్టులు ఒకానొక సమయంలో తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ఒక శాసనసభ్యుడిని, మరో మాజీ ఎమ్మెల్యేను చంపే స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో ఎర్రజెండాపై ‘సాక్షి’ కథనం. భద్రతా విధానాల్లో మార్పులు: మావోయిస్టుల భద్రతా విధానాలు పకడ్బ్డందీగా ఉంటాయి. ఏవోబీకి కేంద్ర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు, పోలీసులు తమ శిబిరాలపై దాడులు చేసినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రతా విధానాన్ని అనుసరిస్తుంటారు. దానిలో లోపాలపై ముఖ్య నేతలు కొంత కాలం క్రితం సమీక్ష చేశారు. కొత్త వ్యూహం ప్రకారం.. డెన్‌లో కొందరు ఉంటే 25 మంది వరకు రక్షణ సెంట్రీల మాదిరిగా నాలుగు వైపులా ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు: మారుతున్న కాలానికనుగుణంగా మావోయిస్టులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏవోబీలో చెడ్డా భూషణం గురించి తెలియని వారుండరు. అతను ఉద్యమంలో ఉన్నంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండేది. అతను పట్టుబడ్డాక కుడుముల రవి, చలపతి వంటి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాచార మార్పిడి కోసం ఉపయో గించారు. అలాగే తమకు అవసరమయ్యే ఆయుధాలను, ఆయుధ తయారీ సామగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచే సమకూర్చుకుంటున్నారనే విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేశారు. సరికొత్త విధానాలు సాధారణంగా మావోయిస్టులు సమాచార మార్పిడికి సంప్రదాయ పద్ధతులనే ఎక్కువగా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా కోడ్ భాషలోనే వారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చి కోడ్ భాషకు బదులు వాకీ టాకీలు, వైర్లెస్ పరికరాలు, స్మార్ట్ సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను పోలీసులు సులభంగా కనిపెట్టగలుగుతున్నారు. ఒకప్పుడు మీడియాకు సమాచారం చెప్పాలంటే విలేకరులను అడవిలోకి తీసుకువెళ్లి మాట్లాడే వారు.కానీ ఇప్పుడు సీడీలు చేసి మరీ పంపిస్తున్నారు. దళపతి.. చలపతి అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏవోబీలో దళపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ) ఇన్చార్జ్గా ఉన్నారు. ఇటీవలే జాంబ్రిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు చలపతిని టార్గెట్ చేశారు. కొరుకొండ ఏరియా కమిటీకి ఒకప్పుడు పట్టున్న ప్రాంతమైన అన్నవరం ప్రాంతంలో కొద్ది కాలంగా మావోయిస్టుల కదలికలు తగ్గాయి. డిప్యూటీ కమాండర్ వంతల మల్లేష్ లొంగుబాటుతో పోలీసుల దృష్టి ఈ ప్రాంతం నుంచి పక్కకు మళ్లడంతో చలపతి ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నాడని తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో అతను తప్పించుకున్నాడు. -
ఏవోబీలో హై అలర్ట్
అరకులోయ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ సంఘటనతో ఏవోబీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో 15మంది మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ సంఘటనతో కేంద్ర హోంశాఖలోని నిఘా వర్గాలు తెలంగాణా, ఒడిశా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఏవోబీలో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలలో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులు ఇటీవల వారం రోజులపాటు ఏవోబీలో ఆమర వీరుల వారోత్సవాలను విజయవంతంగా జరుపుకున్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఏవోబీలో అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో విశాఖ జిల్లాలోని పోలీసు పార్టీలతోపాటు ఒడిశాకు చెందిన పోలీసు భద్రత బలగాలు ఏవోబీవ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో 15మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనతో ఏవోబీలో పోలీసు పార్టీలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేసారు.కూంబింగ్ చర్యలలో ఉన్న పోలీసు పార్టీలకు భద్రతను పెంచే చర్యలను చేపట్టినట్టు విస్వసనీయ వర్గాల సమాచారం. అదనపు పోలీసు బలగాలను ఏవోబీలోకి పంపే చర్యలను ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేసారు. అలాగే విశాఖ ఏజెన్సీలోని రాళ్లగెడ్డ, కోరుకొండ, రూడకోట ప్రాంతాలలో పోలీసు అవుట్ పోస్టులతోపాటు, ఒడిశా సరిహద్దులో ఉన్న పెదబయలు. ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఈ స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. పోలీసులు ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేసారు. -
ఖనిజ సంపద దోచేందుకే..
మల్కన్‌గిరి : మన్యం నుంచి ఖనిజ సంపద దోచేందుకే ఆంధ్రా–ఒడిశా ప్రభుత్వాలు గురుప్రియ వంతెన నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలపై ప్రేమతో దీనికి శ్రీకారం చుట్టలేదని చిత్రకొండ కటాఫ్ ఏరియా దళ అధినేత సుధీర్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వనరులు, ఖనిజ సందను ఇక్కడ నుంచి యథేచ్ఛగా తరలించేందుకే రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారని తెలిపారు. పెట్టుబడిదారీ వర్గాలకు, పారిశ్రామిక వేత్తలకు ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల అభ్యున్నతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి కనీస సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు. మల్కన్‌గిరి జిల్లాలో చిత్రకొండ సమితి కటాఫ్ ఏరియాలోని పనాస్‌పుట్ పంచా యతీలో మావోయిస్టులు ఆదివారం భారీ మేళా నిర్వహించారు. మావోయిస్టుల ఉనికిని కాపాడుకునేందుకు గత వారం రోజులుగా మావో వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చివరి రోజు చిత్రకొండ కటాఫ్ ఏరియా దళ అధినేత సుధీర్ నేతృత్వంలో పనాస్‌పుట్ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను అణచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. మావోయిస్టుల అణచివేత ఎప్పటికీ జరగదన్నారు. మావోలు కేవలం ఆదివాసీల కోసమే పోరాటం చేసి వారికి మేలు చేస్తారన్నారు. వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎంతవరకైనా పోరాడుతారన్నారు. దానికి కోసం ఎంతమంది అయినా ప్రాణాలు త్యాగాలు చేస్తామని అక్కడ నూతనంగా నిర్మించిన స్థూపంపై ప్రమాణం చేశారు. ముందుగా అమరులైన మావోయిస్టుల కోసం నూతన స్థూపం నిర్మించి మావోయిస్టులు, గిరిజనులు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన చుట్టుపక్కల గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు విప్లవ గీతాలను ఆలపించారు. -
షెల్టర్ జోన్లో...గంజాయి జోరు
అరకులోయ: ఏవోబీ... ఇది ఇప్పుడు మావోయిస్టులకే కాకుండా గంజాయి సాగు, స్మగర్లకు షెల్ట్టర్జోన్గా మారింది.ఏజెన్సీలోని పలు మండలాల్లో ఎక్సైజ్, పోలీసు అధికారలు దాడులు చేస్తుండడంతో గంజాయి వ్యాపారులు ఇప్పుడు ఏవోబీపై దృష్టిసారించారు. విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలపై ప్రభుత్వం దృష్టిసారించడంతో బడా వ్యాపారులంతా మకాం మార్చారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో ఒడిశా, విశాఖ జిల్లాకు చెందిన పోలీసు,ఎక్సైజ్‌శాఖలు ఏవోబీలో గంజాయి తోటల జోలికి పోవడం లేదు.దీంతో గంజాయి స్మగర్లర్లు ఏవోబీలో భారీగా పెట్టుబడులు పెట్టి గంజాయి సాగు చేయిస్తున్నారు. జీకే వీధి,చింతపల్లి,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి.దీంతో ఒడిశా,ఆంధ్రా భూములనే తేడా లేకుండా నీటి వనరులు అందుబాటులో ఉన్నచోట గంజాయిని సాగుచేస్తున్నారు. ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో గంజాయి విస్తృంగా సాగవుతోంది. ఆధునిక పద్ధతుల్లో ఏవోబీలో గిరిజనులంతా అధునిక పద్ధతుల్లో గంజాయిని సాగుచేస్తున్నారు.గంజాయి సాగుకు ఎరువులు,క్రిమిసంహరక మందుల వినియోగం కూడా గతంలో కన్న బాగా పెరిగింది.శీలావతి రకం గంజాయికి విలువ అధికంగా ఉండడంతో వ్యాపారులంతా దీనినే ప్రోత్సహిస్తున్నారు. సుమారు 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.బలిమెల, సీలేరు రిజర్వాయర్లను ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతాలలో గంజాయి సాగు అధికంగా ఉంది.మల్కన్‌గిరి కటాఫ్ ఏరియాలో ఎక్కడ చూసిన గంజాయి వనాలే అధికంగా దర్శనమిస్తున్నాయి. వ్యతిరేకత వస్తుందని.. ఏవోబీలో గంజాయి సాగు అధికంగా ఉందనే సమాచారం ఇరురాష్ట్రాల పోలీసు,ఎక్సైజ్ అధికార యంత్రాంగం వద్ద ఉన్నప్పటికీ దాడులు చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. మావో యిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడికి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఏవోబీలో గిరిజనుల్లో ఇప్పుడిప్పుడే పోలీసుల పట్ల సానుకూలత ఏర్పడుతోంది. ఈ సమయంలో దాడులు చేస్తే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో కూంబింగ్ చర్యలు చేపడుతున్న సమయంలో గంజాయి తోటలు కంట పడుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు దాడులు చేయడం లేదు.కేవలం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంతోనే కూంబింగ్‌లు జరుగుతున్నాయి.గడచిన 10 ఏళ్లలో ఏవోబీలో గంజాయి తోటలను నాశనం చేసిన దాఖలాలు లేవు.ఒడిశాలోని యంత్రాంగం కూడా గంజాయి తోటలను చూసిచూడనట్టుగానే వ్యవహరిస్తోంది.గత రెండేళ్ల నుంచి విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.గత ఏడాది 288 గ్రామా ల పరిధిలో సాగైన 3200 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ,ఈ గంజాయి దాడులు మాత్రం మావోయిస్టు ప్రభావిత గ్రామాలు,ఏవోబీలో మాత్రం జరగలేదు.ఏవోబీలో ఒక్క ఎకరం గంజాయితోటను కూడా పోలీసు,ఎక్సైజ్‌శాఖల ఉమ్మడి దాడుల్లో ధ్వంసం చేయలేకపోయాయి. అక్కడ ప్రస్తుతం గంజాయి తోటలలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.ఏవోబీలో గంజాయి తోటల సాగు ఉచ్చు నుంచి గిరిజనులను బయటకు తీసుకొచ్చే చర్యలు చేపట్టి,ఏవోబీలో మకాం వేసిన గంజాయి వ్యాపారులను కూడా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. -
మాజీ మావోయిస్టు నందు మృతి
సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం /పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): మాజీ మావోయిస్టు, ఆంధ్ర– ఒడిశా బోర్డర్ (ఏవోబీ) లో ఒకప్పటి కీలక నాయకుడైన పొన్నోజు పరమేశ్వరరావు (49) అలియాస్ విశ్వనాథ్ అలియాస్ పాపన్న అలి యాస్ నందు గురువారం విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో మృతి చెందాడు. 2011లో పోలీసుల ఎదుట లొంగిపోయిన నందు విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం చింతపల్లిలో వ్యవ సాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళ వారం తీవ్ర అస్వస్థతకు గురైన నందును కుటుంబసభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన మృతి చెందాడు. సాయంత్రం పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య స్వరూప, ఓ కుమార్తె ఉన్నారు. ఆర్ఈసీ నుంచి ఉద్యమంలోకి.. హన్మకొండ సమీపంలోని హసన్‌వర్తికి చెందిన నందు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఈసీ) నాయకుడిగా విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితుడైన నందు.. చదువు మధ్యలోనే ఆపివేసి ఉద్యమంలో చేరాడు. దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. అంచలంచెలుగా ఏవోబీలో కీలక నాయకుడి స్థాయికి ఎదిగాడు. 1987లో పట్టుబడిన నందును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనతో పాటు మరో ఏడుగురు నక్సలైట్లను కూడా అదే జైలులో ఉంచారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు అప్పట్లో నక్సలైట్ అగ్రనేతలు.. ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేశారు. నందు సహా ఏడుగురు నక్సలైట్లను విడుదల చేస్తేనే అధికారులను విడుదల చేస్తామని పీపుల్స్‌వార్ స్పష్టం చేయడంతో ప్రభుత్వం తలొగ్గింది. ఆ ఘటనతో ప్రాచుర్యంలోకి వచ్చిన నందు 20 ఏళ్లకు పైగా ఏవోబీలోనే వివిధ హోదాల్లో పనిచేశాడు. -
టార్గెట్ ఆర్కే
ఒకవైపు మావోయిస్టుల కదలికలు.. వారి జాడలు తెలుసుకునేందుకు పోలీసు బూట్ల చప్పుళ్లు.. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన, అలజడి ఒక్క విశాఖ మన్యంలోనే కాదు.. మొత్తం ఏవోబీలోనే ఉద్రిక్తతలు రేపుతోంది. 2016 అక్టోబర్‌లో రామగుడ ఎన్కౌంటర్ తర్వాత కాస్త తగ్గిన ‘ఎదురు కాల్పుల’ శబ్ధాలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న రెండు ఎదురుకాల్పుల ఘటనలు.. భద్రతా బలగాల విస్తృత గాలింపు చర్యలు ఏవోబీని గడగడలాడిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) లక్ష్యంగానే ఈ గాలింపు జరుగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటంతో ఈ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వాస్తవానికి అవిభక్త రాష్ట్రంలో ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటల్లా ఉన్న నల్లమల, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఏళ్ల కితమే పార్టీ దెబ్బతింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో మాత్రమే పార్టీ కీలకంగా మారింది. ఇందుకు కేవలం ఆర్కే నాయకత్వమే ప్రధానమనేది వాస్తవం. పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను క్యాడర్‌లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆర్కేను పోలీసులు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక్క ఆర్కేను దెబ్బతీస్తే ఏవోబీలో మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేయొచ్చన్న భావనలోనే పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు రామ్‌గూడ ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నాతో సహా 39మంది మావోయిస్టులను కాల్చి చంపారు. ఆ ఘటనలో త్రుటిలో తప్పించుకున్న ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన్ను దండకారుణ్యానికి తీసుకువెళ్లారన్న ప్రచారం సాగింది. ఆర్కే తప్పించుకున్నా... ఆయన వయస్సు, అనారోగ్యం రీత్యా ఇక ఏవోబీలో పార్టీ కోలుకోవడం కష్టమేనని పోలీసు వర్గాలు అంచనాకొచ్చాయి. అయితే పోలీసుల లెక్కలను తారుమారు చేస్తూ.. మావోలు తొందరగానే కోలుకున్నారు. ఇటీవల మావో దళ సభ్యుడిగా పనిచేసిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ లొంగుబాటు సందర్భంగా చెప్పిన మాటలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఆర్కే నాయకత్వంలోనే పార్టీ పుంజుకుంటోందని పోలీసులకు ఉప్పందింది. రామ్‌గూడ ఎన్కౌంటర్ దెబ్బకు దిశానిర్దేశం కోల్పోయిన పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ఆర్కే జనవరిలో ఏవోబీలోకి వచ్చాడని పోలీసులకు పక్కాగా సమాచారం అందిందింది. ఆర్కే రాకతోనే మళ్లీ మావోలు బలం పుంజుకున్నారు. క్యాడర్ రిక్రూట్మెంట్, వరుస సభలు నిర్వహించడం ద్వారా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆర్కే లక్ష్యంగా.. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆర్కే పేరిట పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా డీజీపీలు మాలకొండయ్య, రాజేంద్రకుమార్ నాలుగురోజుల కిందట విశాఖలో సమావేశమై ఇరు రాష్ట్రాల పోలీసులకు, ప్రత్యేకించి ఏవోబీ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్కే జాడ కోసం కొద్దిరోజులుగా జాయింట్ ఆపరేషన్‌గా ఒడిశా, ఏపీ పోలీసు బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆర్కేను సజీవంగా పట్టుకోవడానికి లేదా కూంబింగ్ సమయంలో ఎదురుపడితే ఎన్కౌంటర్ చేసేందుకైనా వెనుకాడకుండా పోలీసులు వ్యూహత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఏవోబీలో పోలీసులకు కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ గతం కంటే మెరుగవడంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆర్కే ఇక్కడే ఉంటాడనే ఆలోచనతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టాయి. పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నా ఆర్కే జాడ తెలుసుకోవడం కష్టసాధ్యమేనని అంటున్నారు.పక్కాగా మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్న ఆర్కేను పట్టుకోవడం పోలీసులకు అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడు రోజులు విస్తృత గాలింపు.. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఏవోబీ పరిధిలో కూంబింగ్ నిరంతర ప్రక్రియే అయినప్పటికీ మరో మూడురోజులపాటు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ.. 21వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బంద్‌ను భగ్నం చేసేందుకు యత్నిస్తామని తెలిపారు. -
ఏవోబీలో మావోయిస్టుల ఘాతుకం
-
సరిహద్దులోభయం.. భయం
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతవారణం నెలకొంది. ఇటీవల కొన్ని రోజుల పాటు పోలీసులు ఏవోబీలో కూంబింగ్‌ను నిలిపివేశారు. దీంతో గిరిజనులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా పోలీసులు మళ్లీ కూంబింగ్ మొదలు పెట్టారు. దీంతో సరిహద్దు గ్రామాలు భీతిల్లుతున్నాయి. ఇటుకల పండుగను ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకోవలసిన గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య గడుపుతున్నారు. పండుగ అనవాయి తీలో భాగంగా గిరిజనులు వారం రోజుల పాటు అడవిలోకి వేటకు వెళ్లాలి. అయితే ఈ సమయంలో అడవిలోకి వెళ్లితే ప్రాణాలపై ఆశవదులుకోవలసి వస్తుందన్న భయంతో వారు వేట వినోదానికి స్వస్తి చెప్పారు. బుధవారం రాత్రి ముంచంగిపుట్టు మండల కేంద్రం మీదుగా భారీగా పోలీసు బలగాలు ఏవోబీ వైపు కదలాయి.అలాగే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నుంచి సరిహద్దు వైపు ఒడిశా పోలీసులు సైతం కూంబింగ్ చేస్తూ వస్తున్నారు. ఆంధ్ర ఒడిశా పోలీసులు కూంబింగ్‌ను మొదలుపెట్టి ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. కొన్ని రోజులుగా సరిహద్దులో మావోయిస్టులు కార్యకాలపాలు అధికమయ్యాయి. భారీగా విధ్వంసానికి పాల్పపడవచ్చన్న నిఘా వర్గాల సమచారంతో పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. రంగబయలు,బుంగాపుట్టు,భూసిపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి వినియోగించే జేసీబీలు, ఇతర యంత్రాలను మావోయిస్టులు దహనం చేయవచ్చని భావించిన పోలీసు బలగాలు ఏవోబీలో మోహరించినట్టు సమచారం.అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపుర్ సుక్మ జిల్లాలో మావోయిస్టులు వరుస అలజడులు సృష్టించి, అక్కడి నుంచి వచ్చి ఏవోబీ లో తలదాచుకున్నారని అనుమానిస్తున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో ఈ సీజన్లో ఇటుకల పండుగతో సందడి ఉండవలసిన గిరిజన గ్రామాలు భయాందోళనల మధ్య మగ్గిపోతున్నాయి. ఎవరూ గ్రామాలను విడిచి బయటకు రావడం లేదు. బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. -
ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి
సాక్షి, ఒడిశా: మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వద్ద ఆదివారం అర్థరాత్రి పోలీసులు,మావోలు ఎదురుకాల్పులకు దిగారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో కోరాపుట్ జిల్లాలోని తొల్లగోమండి గ్రామ సమీపంలో ఉన్న డొక్రిఘాట్ అడవి ప్రాంతంలోకి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల అలికిడి గమనించిన మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగారు. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మిగిలివారు తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో నాలుగు మందుగుండు సంచులు, 303 రైఫిళ్లు, 10 కిట్ బ్యాగులు, మావోయిస్టు పార్టీకి చెందిన సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అటవి ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయాని తెలిపారు. చనిపోయిన ముగ్గురూ మహిళా మావోయిస్టులే. అయితే వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. -
సరిహద్దులో అప్రమత్తం
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మ జిల్లా కిష్టరాం నుంచి పాలడికి వెళ్తున్న సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన బస్సును లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దీంతో పాటు అదే ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దును ఆనుకుని ఉన్న మండలాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఒడిశా రాష్ట్రం ఒనక ఢిల్లీలో బీఎస్ఎఫ్ బలగాలు, జోలాపుట్టు సీఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై సరిహద్దుపై నిఘా పెట్టారు. ఈనెల 2న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది దళసభ్యులు మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి ప్రతికారంగా మావోయిస్టులు మంగళవారం సీఆర్పీఎఫ్ బలగాలను టార్గెట్ చేసి మందుపాతర పేల్చినట్టు తెలిసింది. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయడంతో సరిహద్దు గ్రామాల్లో ఎప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని గిరిజనులు భయందోళన చెందుతున్నారు. కొంత కాలంగా ఆంధ్ర,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య ప్రతికార దాడులు అధికమయ్యాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. దీంతో అటు మావోయిస్టులకు, ఇటు పోలీసులకు మధ్య మారుమూల గ్రామాల గిరిజనులు నలిగిపోతున్నారు. -
ఏవోబీలో విస్తృత తనిఖీలు
సాక్షి, విశాఖ: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన మావోయిస్టుల దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల సరిహద్దులోని పాములగెడ్డ, టిక్కరపాడు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల ఉన్నట్టు గుర్తించారు అదే విధంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మోహరింపు మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఏవోబీలో తుపాకుల మోత
సాక్షి, విజయనగరం : మరో సారి ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తుపాకుల మోత మోగింది. జోడుంబా, సీలేరు ప్రాంతంలో రెండు రాష్ట్రాల పోలీసులు, మావోయిస్టులు పరస్పరం బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జోడాంబా, సీలేరు సమీపంలో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేశారనే సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా విస్తృత కూంబింగ్ నిర్వహించారు. కటాప్ ప్రాంతంలో ఎదురుపడ్డ రెండు వర్గాలు పరస్పర ఎదురు కాల్పులకు దిగాయి. కొన్ని గంటలపాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అక్కడి నుంచి మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో సుమారు 50మందికిపైగా మావోయస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో కీలక నేత ఆర్కే కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ 54 మావోయిస్టుల కిట్ బ్యాగులను స్వాధీన పరచుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు. -
హైదరాబాదీ ఫొటోలకు గిరిజనుల ఫిదా
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతమైనా ఒనకఢిల్లీ వారపు సంతలో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌లాల్ అనే ఫొటో గ్రాఫర్ గురువారం ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. సరిహద్దులోగల బొండా జాతి గిరి మహిళలు జీవన శైలిని ప్రతిబింబించే 120 ఫొటోలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం ఆయన ఒనకఢిల్లీని సందర్శించినపుడు తీసిన చిత్రాలతో అదే గ్రామంలో సొంతంగా ప్రదర్శన నిర్వహించారు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎస్ఈ డి.గోపాలకృష్ణమూర్తి, డీఈలు భాస్కర్,ఉదయ్‌కుమార్,సర్పంచ్ జగన్నాథం వంతాల్ గురువారం ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. సంతకు వచ్చిన సరిహద్దు గిరిజనులు,విదేశీయులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బొండజాతి మహిళలుసైతం తమ ఫొటోలను తిలకిస్తూ ఎంతో సంబరపడ్డారు. కొందరు బొండాజాతి మహిళలకు వారి ఫొటోలను సతీష్‌లాల్ ఉచితంగా అందజేశారు. -
‘కొఠియా’పై కుటిల నీతి !
మనం మౌనం వహిస్తున్నాం... వారు దూకుడు పెంచుతున్నారు. మనం ప్రతిపాదనలే తయారు చేశాం. వారు అమలు చేసి చూపిస్తున్నారు. మనం చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నాం.. వారు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇదీ కొఠియాపై మనరాష్ట్ర పాలకులు... పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్ర పాలకులకు ఉన్న తేడా. ఈ పరిస్థితి అసలు గ్రామాలనే కాదు... అక్కడి ఖనిజ సంపదనూ కోల్పోయేందుకు దారితీస్తోంది. పాపం అధికారులు ఎంతవరకు సాగగలరు? మన పెద్దల మౌనం చూస్తుంటే... కావాలనే దానిని వారికి వదిలిపెట్టే యత్నం సాగుతోందేమోనన్న అనుమానాలకు తావిస్తోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని ఇరవై ఒక్క కొఠియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి పనులు శరవేగంగా చేసుకుపోతోంది. ఆ ప్రాంతం తమదేనని గట్టిగా వాదిస్తోంది. ఒక్కసారి ఆంధ్రా కలెక్టర్ పర్యటించినందుకే ఒడిశా కలెక్టర్‌పై వేటు వేసింది. వివాదం పరిష్కారానికి నిపుణుల కమిటీ వేస్తూనే రూ.కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ పెట్టి కొఠియాకు బస్సులు వేసింది. ఇంత జరుగుతున్నా మన రాష్ట్ర పాలకుల్లో ఏ మాత్రం చలనం లేదు. అధికారులు వెళ్లి రూ.2 కోట్లతో పనులు చేస్తామని గిరిజనులకి చెప్పొచ్చారు. కాని ఒడిశా ఆ పనులు ముందే మొదలు పెట్టేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మనవైపు నుంచి మాత్రం జిల్లాలో ఉన్న కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో ఒక్కరూ నోరుమెదపడం లేదు. రాష్ట్ర స్థాయి సమస్య అయినప్పటికీ సీఎం ఇంత వరకూ ఒక్క ప్రకటనైనా చేయలేదు. పట్టు బిగిస్తున్న ఒడిశా... సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొఠియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. మన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాధమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. త్వరలోనే అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా ప్రభుత్వంలో పెను తుఫాను రేగింది. అక్కడి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే డిమాండ్ లేచింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి తెలుగు తెలిసిన వ్యక్తిని కలెక్టర్‌గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కొఠియా గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి మంత్రంతో గిరి నులకు చేరువయ్యేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, సోలార్‌లైట్ల ఏర్పాట్లు, గృహాలు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్ పంపిణీ, పింఛన్లు మంజూరు, బస్సు సౌకర్యం ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేపడుతున్నారు. గిరిజనుల అభీష్టమే అంతిమ నిర్ణయం కొఠియా పల్లెలు అభివృద్ధికి దూరమైనా... అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదుగుతుందనే వాదనలు ఉన్నాయి. వీటిని పొందాలంటే ముందు ఈ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకోవాలి. కొఠియా పల్లెలకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికివ్వాలనేదానిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ సంక్షే మ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యాయి. అప్పు డు గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఎవ్వరూ పట్టిం చుకోవడం లేదని, ఒడిశా బాగా చూసుకుంటోందని గిరిశిఖర గ్రామాల ప్రజలు అంటున్నారు. వాటాల కోసమేనా...ః మన రాష్ట్రంలో గనుల తవ్వకాలపై ఉన్నన్ని ఆంక్షలు ఒడిశాలో లేవు. అంతే కాదు.. మన రాష్ట్ర టీడీపీ నేతల్లో చాలామందికి ఒడిశాతో వ్యాపార సంబంధాలున్నాయి. ఇదే ఇక్కడి పాలకులు కొఠియా గ్రామాలపై పెదవి విప్పకపోవడానికి ప్రధాన కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్రామాలను ఒడిశాకు వదిలేస్తే ఆ ప్రభుత్వం చేపట్టే మైనింగ్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకుని వాటాలు వెనకేసుకోవాలనే కుటిల నీతితోనే టీడీపీ వర్గీయులెవరూ ఆ పల్లెలు ఆంధ్రాకే కావాలని అడగడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాని కి కొఠియా వివాదాన్ని పార్లమెంట్లో తెల్చుకోమని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ దిశగా జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అక్కడి గనులపై ఒడిశా కన్ను పడిం దని తెలిసినా జిల్లాలోనే ఉంటున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారా వు లో చలనం లేదు. ఒడిశా సీఎం స్వయంగా రంగంలోకి దిగి అక్కడి అధికారులను పరుగులు పెట్టిస్తున్నా మన ముఖ్యమంత్రి కొఠియా మాదంటూ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే కావాలనే మంత్రుల దగ్గర్నుంచి, సీఎం వరకూ నిర్లక్ష్యం వహిస్తున్నారనిపిస్తోంది. ఈ వైఖరి ఇలానే కొనసాగితే ‘మాకు ఒడిశా కావాలి.. ఆంధ్రా వద్దు’ అని ఆ గిరిజనులు చెప్పడం ఖాయం. వివక్షను విడనాడాలి గిరిజనులపై వివక్షను టీడీపీ నేతలు విడనాడాలి. వివాదా స్పద కొఠియా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు మంజూరు చేయకపోవడం వల్లనే వారు ఒడిశా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే విభజనాంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చితికిపోయింది. ఇప్పుడు విలువైన ఖనిజ సంపద ఉన్న కొఠియాను కూడా కోల్పోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. –సంగంరెడ్డి జయసింహ, ఉపాధ్యక్షుడు, అఖిలభారత ఆదివాసీ వికాస పరిషత్, విజయనగరం జిల్లా గిరిజనులంటే చిన్నచూపు టీడీపీ నేతలకు గిరిజనులంటే చిన్నచూపు. వారి కష్టాలను, బాగోగులకు ఎప్పుడూ పట్టించుకోదు. కొఠియా గ్రామాల్లో ఉన్నది గిరిజనులు కావడం వల్లనే వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అక్కడి కొండల్లో ఉన్న ఖనిజ సంపదను ఒడిశా ప్రభుత్వమైతేనే ఎలాంటి అడ్డంకులు లేకుండా తవ్వుకోనిస్తుంది. టీడీపీ నేతల్లో కొందరికి అక్కడ వ్యాపారులన్నాయి. వారే మన రాష్ట్రంలో కంటే సులభంగా గనుల తవ్వకాల కాంట్రాక్టులు ఒడిశాలో పొందే అవకాశం ఉంది. దాని ద్వారా ఇక్కడి పాలకులకు వాటా లు అందుతాయి. ఈ కారణాలతోనే కొఠియా పల్లెలను ఒడిశాకు వదిలేసే కుట్ర జరుగుతోంది. అందుకే ఎవరూ దీనిపై మాట్లాడట్లేదనిపిస్తోంది. – రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు. -
ఏఓబీలో మరో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి
విజయనగరం : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ ఘటన మరవక ముందే ఓవోబీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో లుకాపాణి వద్ద మావోయిస్టులకు బీఎస్ఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంధ్ర పల్లెల్లో ఒడిశా పాగా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి నేరెళ్లవలస మీదుగా కొండలు, గుట్టలు దాటుకుని అడవి మార్గం గుండా వెళ్తే ఏపీ–ఒడిశా రాష్ట్రాల మధ్య 21 కొఠియా గ్రామాలు కనిపిస్తాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి. రక్షిత నీరు, రహదారి సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామాల్లో సంక్షేమ పథకాల జాడ ఎక్కడా కనిపించదు. పచ్చని ప్రకృతి అందాల మధ్య గిరిజనులు ఈ ప్రాంతంలో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంటే ఒడిశా మాత్రం ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఇందుకు ఆ గ్రామాల్లో అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తద్వారా విలువైన ఖనిజ సంపదకు గాలం వేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిశిఖరాల్లో ఇదీ పరిస్థితి! ఏపీలోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్యనున్న కొఠియా పంచాయతీలోని 21 గ్రామాలనే కొఠియా గ్రామాలుగా పిలుస్తున్నారు. విజయనగరం నుంచి 60కి.మీల దూరంలో ఉన్న సాలూరుకు.. అక్కడి నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే గిరిశిఖరాల్లోని కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దాదాపు 14 కి.మీ.ల మేర రోడ్డు అనేదే ఉండదు. రాళ్లూ, రప్పల్లో నడిచి వెళ్లాలి. అతికష్టం మీద జీపులో కొంతదూరం వెళ్లినా.. పక్కనే లోయల్లో ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ గ్రామాల్లో జనాభా దాదాపు 15 వేల మంది. దుంపలు, పళ్లు, పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. ఒడిశాలోని కుండలి గ్రామం నుంచి కొఠియా గ్రామం వరకూ రహదారి సౌకర్యం ఉంది. సాలూరు నుంచి సరైన దారి లేదు. కొఠియా గ్రామంలో ఒడిశా ప్రభుత్వం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నేరెళ్లవలసలో ఏపీ ప్రభుత్వం ఒక పీహెచ్‌సీని ఏర్పాటుచేయడం మినహా మిగిలిన గ్రామాలకు వైద్య సదుపాయం లేదు. ఏదైనా ఉపద్రవం వస్తే డోలీల్లో వెళ్లాల్సిందే. అంగన్వాడీలు ఉన్నా లేనట్టే లెక్క. పౌష్టికాహారం లేక పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇక్కడి గ్రామాల్లో విద్య కూడా అంతంతమాత్రమే. టీచర్లు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. రేషన్ బియ్యాన్ని కిలోమీటర్ల దూరం నడిచెళ్లి తెచ్చుకుంటారు. రక్షిత మంచినీటి మాటేలేదు. కొండల్లో పారే సెలయేర్లే దిక్కు. మావోయిస్టుల భయంతో ఈ గ్రామాలకు పోలీసులెవరూ రారు. కానీ, కొఠియా సర్కిల్ పేరిట ఈ గ్రామాలకు ఒక సీఐ, దాదాపు వంద మంది కానిస్టేబుళ్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. వీరంతా కొఠియా సర్కిల్ పేరుతో సాలూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుంటారు. గిరిజనులకు ఒడిశాకు గాలం ఒడిశా ఏర్పడినప్పుడు గానీ.. ఏపీ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలపలేదు. ఈ గ్రామాలు తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా, పరిష్కారం లభించలేదు. ఇటీవల ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడింది. ప్రస్తుతం ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. మరోవైపు.. ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, ఆకర్ష మంత్రంతో గిరిజనులకు చేరువవుతోంది. సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. ఇక్కడ ఒడిశా ప్రభుత్వం తాగునీరు, సోలార్ లైట్ల ఏర్పాటు, ఇళ్లు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్ పంపిణీ, పింఛన్ల మంజూరు వంటి పనులు చేపడుతోంది. అప్పట్లో ఇక్కడి గిరిజనులు ఏపీ వైపే మొగ్గు చూపారు. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడంలేదన్నది ప్రస్తుతం వీరి ప్రధాన ఆరోపణ. ఖనిజ నిక్షేపాలపై ఒడిశా కన్ను కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మాంగనీస్, ఇనుము, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. గ్రామాల్లోని ప్రజాభీష్టం మేరకే గిరిజనుల స్థానికతను కోర్టు కూడా నిర్ధారించే అవకాశం ఉందని భావిస్తున్న ఒడిశా సర్కార్, వారిని తమవైపు తిప్పుకుని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఒడిశా అధికారులు ఈ గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారని.. ఈ ప్రాంతాలపై వీడియో కూడా తీసుకుంటున్నారని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే, సరిహద్దు గ్రామాల్లోని విలువైన ఖనిజ సంపదను ఒడిశా చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఆంధ్రాలో ఉండాలని ఉంది : గమ్మెల అర్జున్, కొఠియా గ్రామం మా గ్రామానికి ఆంధ్రా నుంచి రోడ్డు లేదు. ప్రమాదకర మార్గంలో 30 కి.మీ.లు జీపులో ప్రయాణించి కుందిలి వైపు వెళ్తున్నాం. ఒడిశా ప్రభుత్వమే కొన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తోంది. కానీ, మాకు ఏపీలోనే ఉండాలని ఉంది. ప్రభుత్వం దృష్టిలో లేదు : డాక్టర్ లక్ష్మీశ, పీఓ, ఐటీడీఎ, పార్వతీపురం కొఠియా గ్రామాల అంశం ప్రభుత్వం దృష్టిలో పెద్దగా లేదు. అయితే, గ్రామాలను సర్వే చేయాలని భావిస్తున్నాం. దానికి అనుమతినిస్తూ ఆర్థిక వనరులు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఇంకా సమాధానం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిశా ప్రభుత్వానికి కొఠియా గ్రామాలను అప్పగించం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని అక్కడి గిరిజనులకు అందేలా చర్యలు తీసుకుంటాం. -
ఆర్కే ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/అమరావతి: మావోయిస్టులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన రామగూడ ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా నేటికి ఏడాదవుతోంది. గతేడాది అక్టోబర్ 24న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పరిధిలో మల్కన్‌గిరి జిల్లా రామగూడ గ్రామానికి సమీపంలోని దట్టమైన అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు పిట్టల్లా రాలిపోయారు. పార్టీ ప్లీనరీకి వచ్చిన అగ్రనేతలు బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్, చాముళ్ల కృష్ణ అలియాస్ దయా, ఐనాపర్తి దాసు అలియాస్ మధు, పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) కుమారుడు మున్నా తదితరులు మరణించారు. మావోల షెల్టర్ జోన్‌గా భావించే ఏవోబీ కటాఫ్ ఏరియాలో జరిగిన ఈ మారణకాండ దేశంలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా రికార్డులకెక్కింది. 2008లో బలిమెల రిజర్వాయర్‌లో 38 మంది గ్రేహౌండ్స్ పోలీసులను పొట్టనపెట్టుకున్న మావోయుస్టులపై ప్రతీకారంగానే రామగూడ ఎన్కౌంటర్లో 32 మందిని పోలీసులు హతమార్చారు. ఏవోబీలో మావోయిస్టుల ఉనికికే సవాల్ విసిరిన ఆ ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) ఆచూకీపై కొన్నాళ్లు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే రామగూడ ఎన్కౌంటర్ జరిగినట్లు అప్పట్లో పోలీసు అధికారులు సైతం అంగీకరించినప్పటికీ ఆయన ఏమయ్యాడన్నది ఎవరూ చెప్పలేకపోయారు. మరోవైపు అప్పట్లోనే మావోయిస్టు పార్టీ మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి వేణు పేరిట వెలువడిన ప్రకటన కలకలం రేపింది. ఎన్కౌంటర్లో ఆర్కేను కూడా దారుణంగా చంపేశారని వేణు పేరిట ప్రకటనలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ పోలీసుల నాటకంలో భాగమేనని.. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నాడని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చాలని ఆర్కే సతీమణి పద్మ, విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. డీజీపీ సాంబశివరావు మాత్రం ఆర్కే తమ అదుపులో లేడంటూ చెప్పుకొచ్చారు. దాదాపు పదిరోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠకు తెరతీస్తూ గతేడాది నవంబర్ 3వ తేదీన వరవరరావు... ఆర్కే సేఫ్ అంటూ ఓ ప్రకటన చేశారు. సురక్షిత ప్రదేశంలో ఆర్కే క్షేమంగానే ఉన్నాడంటూ తమకు, కుటుంబ సభ్యులకు పక్కాగా సమాచారం వచ్చిందన్నారు. దాంతో ఆర్కే ఆచూకీపై గందరగోళానికి తెరపడింది. ప్రతి సవాల్ విసురుతున్న మావోలు వాస్తవానికి ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులను చావుదెబ్బ తీశామని పోలీసులు అంచనాకొచ్చారు. అయితే, ఊహించని రీతిలో మావోయిస్టులు వేగంగా కోలుకున్నారనే చెప్పాలి. ఆ నాటి ఎన్‌కౌంటర్‌తో బలహీన పడినట్టుగా కనిపించిన మావోయిస్టులు తదనంతరం బలంగానే ఉన్నామని హింసాత్మక సంఘటనల ద్వారా నిరూపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మావోయిస్టులే లేరని హోంమంత్రి చినరాజప్ప ఇటీవల ప్రకటించడం గమనార్హం. రగులుతున్న మావోయిస్టులు రామగూడ ఎన్‌కౌంటర్‌కు ఏడాది కావొస్తుండటంతో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందంటూ పోలీసులకు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నెల 24న అమరవీరుల వర్థంతి సభలు నిర్వహించేలా మావోయిస్టులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 నుంచి 30వ తేదీలోగా మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అప్రమత్తం చేయడంతో డీజీపీ నండూరి సాంబశివరావు హైఅలర్ట్ ప్రకటించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఏడాదిగా ఎక్కడ? ఏవోబీ నుంచి సురక్షిత ప్రదేశానికి ఆర్కేను తరలించారని భావించినా... ఏడాదైనా ఆయన గురించి ఒక్క ప్రకటనైనా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్కే ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో ఆయన ఏమయ్యారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఏవోబీలో ప్రధాన భాగమైన ఈస్ట్ డివిజన్లో వరుసగా పాతికేళ్ల నుంచి క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ వస్తున్న ఆర్కే ఈ ఏడాదిలో మాత్రం ఎవరికీ కనిపించలేదు. కనీసం ఆయన ఎక్కడ, ఎలా ఉన్నాడనే సమాచారం కూడా క్యాడర్‌కు తెలియలేదు. ఇక ఆర్కేతోపాటు ఆనాటి ఎన్కౌంటర్ ఘటన నుంచి కనిపించకుండా పోయిన చలపతి, ఆయన భార్య అరుణల ఆచూకీపై కూడా నేటికీ స్పష్టత లేదు. -
ఆంధ్రా-ఒడిశా మధ్య రాకపోకలు బంద్
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య మంగళవారం రాకపోకలు బంద్ అయ్యాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా... రాకపోకలు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో మళ్లీ అలజడి
ముంచంగిపుట్టు (అరకులోయ): ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు మళ్లీ అలజడి సృష్టించారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడ్ని దళసభ్యులు హతమార్చడంతోపాటు ఇద్దరిని తమ వెంట తీసుకెళ్లారు. సరిహద్దు గ్రామాల్లో మరి కొందరి కోసం గాలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంఘటనతో ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం ముంచంగిపుట్టుతోపాటు ప్రధాన కూడళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. జోలాపుట్టు, డుడుమ, కుమడ ప్రాంతల నుంచి వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. బస్సులతోపాటు వాహనాల్లో రాకపోకలు సాగించేవారి లగేజీ బ్యాగులను తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు. అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. హిట్‌లిస్టుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను మరుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులతో ఎప్పుడే సంఘటన చోటు చేసుకుంటుందోనని బిక్కుబిక్కు మంటూ మరుమూల గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. సంఘటన ఇలా.. ముంచంగిపుట్టు మండలం మారుమూల బుంగాపుట్టు పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒడిశా మల్కన్‌గిరి జిల్లా జోడం బ్లాక్ పనసపుట్టు పంచాయతీ మొండిగుమ్మ గ్రామానికి చెందిన కిల్లో ధనపతి ఇంటికి సాయుధ దళసభ్యులు మంగళవారం రాత్రి వచ్చారు. ఇంటిని చుట్టుముట్టారు. నిద్రపోతున్న ధనపతిని లేపి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రజా కోర్టు నిర్వహించి పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ హతమార్చారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు అడవిలోకి వెళ్లి చూడగా రక్తపుమడుగులో శవమై ఉన్నాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని, అందుకే హతమార్చినట్టు మావోయిస్టులు ఒక లేఖను మృతదేహం వద్ద విడిచిపెట్టి వెళ్లారు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరికి దేహశుద్ధి చేయడంతోపాటు తమ వెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనతో కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మళ్లీ అలజడి రేగింది. దీంతో సరిహద్దు గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. ఇళ్లల్లోనుంచి ఆదివాసీలు బయటకు రావడం లేదు. -
ఏవోబీలో భయం.. భయం
♦ నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవం ♦ తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం ముంచంగిపుట్టు(అరకులోయ) : ఆంధ్ర–ఒడిశా సరి హద్దు ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు పార్టీ 13వ వార్షికోత్స వం నేపథ్యంలో ఏవోబీ వేడెక్కింది. పోలీసు బలగాలన్నీ ఏవోబీ వైపు కదిలాయి. మండల కేంద్రంలో ఎస్ఐ అరుణ్కిర ణ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కుమడ, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీలు కొనసాగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మవోయిస్టు పార్టీ హిట్‌లిస్టులో ఉన్నా ప్రజా ప్రతినిధులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద సాయుధ పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కొన్ని రోజులుగా బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లుతున్నారు. ఏవోబీలో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని మారుమూల గిరి గ్రామల గిరిజనులు భయాందోళనకు గురువుతున్నారు. -
వేటుకు... మాటు!
కొత్తగా 40 అనుబంధ సంస్థలతో డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు - చత్తీస్‌గఢ్ నుంచి 80 మంది ఏవోబీలోకి చొచ్చుకు వచ్చిన వైనం - చురుగ్గా నూతన ఆర్మ్డ్ దళాల ఏర్పాటు సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన మావోయిస్టులు తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను కొనసాగించడానికి వ్యూహ రచన చేశారా? చాపకింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నారా? ఏఓబీలో తిష్ట వేశారా? పోలీసుస్టేషన్లు, భద్రత దళాలను లక్ష్యంగా ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు అవుననే అంటున్నారు. సుమారు 40 మావోయిస్టు అనుంబంధ సంస్థలతో కలిసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏపీడీఎఫ్) ఏర్పాటు చేశారని, అన్ని విధాలా బలోపేతమయ్యారని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు, ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం రూరల్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మావోయిస్టులు క్రియాశీలకంగా మారారు. తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఏపీడీఎఫ్ ఏర్పాటు చేశారు. ఇటీవలే చత్తీస్గడ్ క్యాడర్ నుంచి 80 మంది మావోయిస్టులు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దులో (ఏవోబీ)కి చొచ్చుకువచ్చారు. కొత్తగా ఆర్మ్డ్ దళాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసు ఇన్ఫార్మర్లపై దృష్టి కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ ద్వారా రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహించాలని మావోయిస్టులు నిర్ణయించారని, పోలీసులకు అందిన ఓ డాక్యుమెంట్ ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా తొలుత పోలీసు ఇన్ఫార్మర్లను హతమార్చాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మావోయిస్టులు చత్తీస్‌గడ్‌లోని బెజ్జి, బర్కాపాల్లో మిలటరీ బెటాలియన్‌పై దాడి చేసి 45 మంది భద్రతా సిబ్బందిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పెద్ద ఎత్తున అత్యాధునిక యుబిజిఎల్, మొర్టార్స్ తదితర వెపన్స్ మావోయిస్టుల పరమయ్యాయి. ఎకె–47, ఎస్ఎల్ఆర్లు, లైట్ మిషన్ గన్స్, బారెల్ గ్రనేడ్ లాంచర్లు, 51 ఎంఎం మోర్టార్స్ కూడా లూటీకి గురైన వాటిలో ఉన్నాయి. బారెల్ గ్రనేడ్ లాంచర్లు (200 – 250 మీటర్ల రేంజ్), కిలోమీటర్ రేంజ్ కలిగిన మోర్టార్లు తదితర ఆయుధాలు సమకూరడం వారికి అదనపు బలాన్ని చేకూరుస్తోందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూప్ వాహనం తప్ప అన్ని అత్యాధునిక ఆయుధాలను మావోయిస్టులు కలిగి ఉన్నారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. ఇందువల్ల మావోయిస్టుల్లో నైతిక స్థైర్యం కూడా పెరిగిందని ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. దాడులతో బెంబేలెత్తించాలని వ్యూహం రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు, ఆర్మ్డ్ ఔట్ పోస్టులపైన రాకెట్ లాంచర్లతో దాడులు చేయాలనేది మావోయిస్టుల వ్యూహంలో ప్రధానం. గడిచిన రెండేళ్లలో విశాఖపట్నం ప్రాంతంలో భద్రతా దళాలపై మావోయిస్టులు దాదాపు 20 సార్లు దాడులకు యత్నించడం ఇందుకు తార్కాణం. ఈ వివరాలతో పాటు కింద పేర్కొన్న అంశాలు డీజీపీ నివేదికలో ఉన్నాయి. ► విశాఖపట్నంలోని అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రాళ్లగెడ్డ పర్చూరు ఆర్మ్డ్ ఔట్ పోస్టుపై దాడి చేసేందుకు మావోయిస్టులు మాటు వేశారు. ► వీఐపీలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులను కిడ్నాప్ చేసేందుకు వ్యూహ రచన చేశారు. ► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం గిరిజనుల పక్షాన నిలబడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాంతంలో న్యూ డెమొక్రసీకి చెందిన చంద్రన్న గ్రూప్‌తో బుట్టాయగూడెం, పోలవరం గ్రామాలు కేంద్రంగా పని చేయాలని నిర్ణయించారు. ► తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో కొత్త దళాల ఏర్పాటు చురుగ్గా జరుగుతోంది. ► వ్యాపారులను హతమార్చడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్
సీలేరు(పాడేరు): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం పప్పులూరు పంచాయతీ కప్పసొడ్డి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవా రుజామున ఒడిశా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని కలిమెల దళానికి చెందిన సీనియర్ కమాండర్ చిన్నబ్బాయిగా గుర్తించారు. సీలేరు రిజర్వాయర్ ఒడిశా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పప్పులూరు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, కాల్పుల్లో కలిమెల దళ సీనియర్ కమాండర్ మృతిచెందినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. చిన్నబ్బాయిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. అతి చిన్నవయస్సులోనే మిలీషియా సభ్యుడిగా చేరిన చిన్నబ్బాయి 25 ఏళ్లుగా ఉద్యమంలో ఉంటూ కీలక నాయకుడిగా ఎదిగాడు. 2007–08 మధ్యకాలంలో పోలీసులు పక్కా వ్యూహంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో చేరి నాగులూరు, కోరుకొండ, పప్పులూరు, కలిమెల, గాలికొండ, ఎల్లవరం దళాల్లో పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కలిమెల దళానికి కమాండర్‌గా ఉన్నాడు. అతని మృతదేహాన్ని ఒడిశా పోలీసులు పోస్టుమార్టంకోసం మల్కన్‌గిరికి తరలించారు. -
ఏవోబీలో మావోయిస్టుల కదలికలు
విశాఖపట్టణం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏవోబీలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారని తెలపారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్, యాక్షన్ టీంల సంచారంపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలపై విశాఖలో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఉత్తర కోస్తా ఐజీ, రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, ఓఎస్డీలతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. -
ఎరుపెక్కిన ఏఓబీ.. మహిళా మావోయిస్టుల మృతి
ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) మళ్లీ ఎరుపెక్కింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఒడిషాలోని రాయగఢ్ జిల్లాలో మావోయిస్టులు సమావేశమైనట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో ఒడిషాకు చెందిన ఎస్ఓటీ బలగాలు, సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒక గిరిజనుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మహిళా మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా, వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దళానికి చెందినవారనే విషయం మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది. అక్కడ కొన్ని ఆయుధాలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. దొరికిన వాటిలో ఒక ఏకే-47 కూడా ఉందని సమాచారం. సాధారణంగా ఈ తుపాకులను కేంద్రకమిటీ సభ్యులు గానీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగానీ మాత్రమే వాడతారు. దాంతో ఇక్కడకు ఎవరైనా మావోయిస్టు అగ్రనేతలు వచ్చి తప్పించుకున్నారా అనే దిశగా కూడా దర్యాప్తు సాగుతోంది. వేసవి కాలం కావడంతో ఏఓబీలో భద్రతా దళాల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు మావోయిస్టులు కూడా భారీగా రిక్రూట్మెంట్లు చేసే పనిలో కనిపిస్తున్నారు. వేసవిలో నీళ్ల కరొత ఉంటుంది కాబట్టి.. మావోయిస్టులు గ్రామాలకు దగ్గరలోకి వస్తారు. ఇదే అదనుగా వాళ్లను ఏరివేయాలని భద్రతా దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో ఏఓబీ ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
హైఅలర్ట్
ఛత్తీస్‌గఢ్ ఘటనతో సరిహద్దుల్లో భయం భయం మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా ఆంధ్రా సరిహద్దు అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్ ముమ్మరం రంపచోడవరం/చింతూరు : ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు శనివారం జరిపిన మెరుపుదాడిలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతి చెందారు. మన జిల్లాకు సరిహద్దునే ఉన్న సుకుమా జిల్లా భెర్జి ప్రాంతంలో.. నిర్మాణంలో ఉన్న రహదారి భద్రతలో నిమగ్నమైన జవాన్లను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు.. ముందుగా కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకునేలోగానే మందుపాతరలు పేల్చారు. దీంతో పోలీసులకు భారీ నష్టం వాటిల్లింది. అంతలోనే చెలరేగిన మావోయిస్టులు పోలీ సుల ఆయుధాలను లూటీ చేసి తప్పించుకున్నారు. సంఘటన స్థలం మన రాష్ట్ర సరిహద్దు కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో.. దాని ప్రభావం మన రాష్ట్ర సరి హద్దులపై పడే అవకాశముంది. ఘటనకు పాల్పడిన మావోయిస్టులు ఆంధ్రా సరిహద్దులను తమ షెల్టర్‌జోన్‌గా వినియోగించుకునే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. దండకారణ్యంలో కొంతకాలం గా మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్న పోలీసులకు శనివారం జరిగిన మెరుపుదాడితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వేసవికాలం ప్రారంభంలో దండకారణ్యంలో మావోయిస్టులు భారీ దాడులకు పాల్ప డే అవకాశముందని ఇటీవలే నిఘావర్గాలు హెచ్చరించాయి. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం వరకూ బస్తర్ రేంజ్ ఐజీగా పని చేసిన తెలుగు వ్యక్తి శివరామకృష్ణ ప్రసాద్ కల్లూరి.. మావోయిస్టులను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, వందల సంఖ్యలో లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసింది. ఆయన వెళ్లిన కొద్ది రో జులకే భారీ సంఘటన చేసుకోవడం పై ప్రస్తుతం రాజకీయ వేడిని రగిల్చింది. ఆంధ్రా సరిహద్దుల్లో వరుస సంఘటనలు ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ ప్రాంతాల్లో వరుసగా మందుపాతరలు అమర్చడం, రహదారులు తవ్వడం, చెట్లు నరికి రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో చింతూరు మండలం లచ్చిగూడేనికి చెందిన పాస్టర్ మారయ్య, అల్లిగూడేనికి చెందిన పర్శిక పుల్లయ్యలను హతమార్చారు. కూంబింగ్ నుంచి తిరిగి వస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చగా త్రుటిలో ముప్పు తప్పింది. గత నెల 27వ తేదీన భారత్‌బంద్ సందర్భంగా మావోయిస్టులు జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టిం చేందుకు మందుపాతర అమరుస్తున్న క్రమంలో అది కాస్తా వారి చేతుల్లోనే పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా మరో సభ్యుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మందుపాతర అమర్చి ఉండి ఉంటే పోలీసులకు భారీగా నష్టం కలిగేదని నిఘావర్గాలు అంటున్నాయి. పోలీసుల ప్రతివ్యూహం మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు గ్రామాలపై నిఘా పెట్టిన పోలీసులు మావోయిస్టులకు సహరిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిచి్చన సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపి, మరింత మందిని అదుపులోకి తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల గాయపడి, పోలీసుల అదుపులోనున్న ఓ దళసభ్యుడు సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలపై కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దునే భారీ ఘటన జరగడంతో అప్రమత్తమైన మన రాష్ట్ర పోలీసులు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి, నిఘా ముమ్మరం చేసినట్లు సమాచారం. కూంబింగ్ ముమ్మరం చేశాం ఛత్తీస్‌గఢ్ ఘటన నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అదనపు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశాం. ఘటనకు పాల్పడిన మావోయిస్టులు షెల్టర్‌జో¯ŒSగా వినియోగించుకునే అవకాశమున్న గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో నిఘాను పెంచడం జరిగింది. మావోయిస్టులు ఆంధ్రావైపు రాకుండా ఏడుగురాళ్లపల్లి ఔట్‌పోస్టు పరిధిలో మరింత అప్రమత్తం చేయడం జరిగింది. – డాక్టర్ కె. ఫకీరప్ప, చింతూరు ఓఎస్డీ -
ఏవోబీలో మళ్లీ అలజడి
విశాఖపట్నం: ఏవోబీలో మళ్లీ అలజడి చెలరేగింది. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం కన్నవరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. -
AOBలో మావోయిస్టుల మారణకాండ
-
బలగాలపై మావోయిస్టుల పంజా.. భారీ ప్రాణ నష్టం?
ఒడిశా: మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిదిమందికి పైగా బీఎస్ఎఫ్ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సును లక్ష్యంగా ఎంచుకొని ముందాభూమి వద్ద కల్వర్ట్ను పేల్చివేయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 25మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతులలో తులసి మది (డైవర్ హవిల్దార్), సోమనాథ్ సిసా(హవిల్దార్ మేజర్), సంజయ్ కుమార్ దాస్ ఉన్నట్లు గుర్తించారు. పేలుడు ధాటికి బస్సు తునాతునకలైంది. ఈ ఘటన కారణంగా విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య మొదలైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత ఇంతపెద్ద స్థాయిలో మావోయిస్టులు విరుచుకుపడటం ఇదే తొలిసారి. ఆ సమయంలో పోలీసులు, కేంద్ర బలగాలు చేసిన దాడిలో 24మంది మావోయిస్టులు హతమయ్యారు. -
ఏవోబీలో రెవెన్యూ అధికారుల కిడ్నాప్
విశాఖపట్నం: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఉద్యోగులను జోడాంగ్ అటవీ ప్రాంతంలో అపహరించారు. పురుషోత్తమ్ బెహ్రా(బీపీఎం), లింగరాజ్ మజ్హి(వీఎడబ్ల్యు), హృషీకేశ్‌నాయక్(ఎంఐ), ప్రవీణ్ శరణ్(జేఈ), కమినికంట సింగ్(జేఈ), మనోరంజన్ సిసా(గ్రామ పెద్ద)లు కిడ్నాప్ అయిన వారిలో ఉన్నారు. దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చిత్రకొండ బ్లాక్‌లోని జోడాంలో జరిగే ఎన్నికలను మావోయిస్టులు బహిహ్కరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు వీరు వెళ్లినపుడు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. -
రెక్కీపై సమాచారం లేదు..: డీజీపీ
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని ఏపీ భవన్లో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న సమాచారం తమకు రాలేదని డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏవోబి ఎన్కౌంటర్ నేపథ్యంలో సీఎం, ముఖ్య అధికారులకు గట్టి భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ తమను అప్రమత్తం చేసిందని ఆయన వెల్లడించారు. వార్షిక క్రైం సమీక్షలో భాగంగా శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఏపీ భవన్లో మావోయిస్టులు ఆరు సార్లు రెక్కీ నిర్వహించారని వస్తున్న సమాచారాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. గతంలో దేశ వ్యాప్తంగా నక్సలైట్ల పేరు చెబితే ఏపీలోనే ఎక్కువ అనే భయం ఉండేదని, ఏపీ పోలీసుల వ్యూహాత్మక పద్ధతుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంతో ఏవోబిలోని విశాఖ, తూర్పు, విజయనగరం జిల్లాలకు పరిమితమయ్యారని చెప్పారు. కొత్త ఏడాది నుంచి ఏపీలో సింగపూర్ తరహా పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ అన్నారు. జిల్లాల వారీగా క్రైమ్ మ్యాపింగ్ చేసి నేరాల స్వభావాన్ని బట్టి వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. -
చంద్రబాబు ‘చాణక్య’ రాజనీతి
అభిప్రాయం రెండు వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయ్ కంపెనీకి అప్పగించడంపై గత ఇరవై ఏళ్లుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఆదివాసులపై, వారి మధ్యనున్న మావోయిస్టులపై ప్రభుత్వాలు జరిపిన రాజ్యహింసను ఇక్కడ మళ్లీ ప్రస్తావించనక్కర్లేదు. ‘చిలకా చెప్పింది అక్షరాలా నిజం...!’ అంటూ దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య ఎన్కౌంటర్ పేరుతో ఏఓబీ ఘటనపై.. ‘చాణక్యుడు’ ఒక పోస్టర్ వేశాడు. ఆలకూరపాడులో జరిగిన మున్నా సంతాప సభలో ఏఓబీ ఘట నపై ఏపీసీఎల్సీ స్పందనగా దీనిని పేర్కొన్నది. చిలకా చంద్రశేఖర్ చేసిన ప్రసంగంలో ఇది దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్యన జరిగిన ఎన్‌కౌంటర్‌గా ఆయన అన్నట్లుగా పేర్కొన్నది. దీనిపై ఈ ‘చాణక్యుడు’ చాలా వ్యాఖ్యానం చేశాడు. ఈ పోస్టర్లో మావోయిస్టులు విశాఖ మన్యంలో ఒక సంవత్సర కాలంలో చేసే వసూళ్ల వివరాలు వాళ్లు రాసుకున్న డాక్యుమెంట్ల ప్రకారమే అంటూ ఇచ్చారు. అవి అక్రమమైనవని కూడా పేర్కొన్నారు. ఆ మొత్తం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలని, అట్లే గిరిజనుల నుంచి వారి పంట దిగుబడిలో 1/3వ వంతు వసూలు చేస్తారని, గిరిజనులకే చెందాల్సిన ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నిస్తూ, ముసుగు సంఘాల నేతలారా ఇందులో మీ వాటా ఎంత అని ప్రశ్నించింది. రాజ్యాంగం ఆదివాసులకు జల్, జంగల్, జమీన్ల మీద ఇచ్చిన అధికారాలే కాకుండా, తెలుగు నేల మీద 1/70 మొదలు పెసా వరకు చట్టాలే కాకుండా, ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులన్నీ ప్రభుత్వంలో రాజకీయాధికారంలోను, రాజ్యాంగ యంత్రంలోను ఉన్నవాళ్లు ఎవరెంత తింటున్నారో, ఇటువంటి ఒక పారదర్శక జాబితాను చాణక్యుడు ఇవ్వగలడా? ఈ విశాఖ మన్యం ప్రాంతంలోనే నదుల మీద చేసిన నిర్మాణాలు, పవర్ హౌజ్‌లు, బాక్సైట్ తవ్వకాలు, కాఫీ తోటలు మొదలైన ఎన్నో రూపాల అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వంలో రాజకీయాలలో, పరిపాలన యంత్రాంగంలో ఉన్న వాళ్లకు, కాంట్రాక్టర్లకు, తాబేదార్లకు చెందుతున్నదెంత? ఆదివాసులకు చెందుతున్నదెంత? గిరిజనుల పంట దిగుబడిలో మూడో వంతు మావోయిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్న చాణక్యుడు ఈ పంట పండించడానికి వాళ్లు చేస్తున్న పోడు భూములు ఆదివాసేతరులు ఆక్రమించుకుంటుంటే తానేం చేశాడో చెప్పగలడా? మావోయిస్టులు అక్కడ గడ్డి వేళ్ల స్థాయినుంచి అమలు చేస్తున్న అభివృద్ధి గురించి ఇటీవల నిజనిర్ధారణకు వెళ్లి వచ్చిన సీడీఆర్ఓలోని నలభైమంది బృందంలో ఒకరైన ప్రొ‘‘ కాత్యాయని విద్మహే చాలా వివరమైన వ్యాసం రాశారు. ‘మావోయిస్టులు తొలుతగా భూమి సమస్యను తీసుకుని ఆదివాసులను కూడగట్టారు. మద్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసే సోండీల ఆక్రమణలో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని ప్రజాపరం చేయడానికి ఉపక్రమించారు. ఈ ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు ప్రజల వెంటే ఉన్నారు. ప్రజలతోనే ఉన్నారు. ఈ భూమిని స్వాధీన పరిచి, ప్రజలకు పంచి, వ్యవసాయం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇప్పటికీ ప్రజల ఆధీనంలో ఆ భూములు సాగవుతూనే ఉన్నాయి. భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేనివారికి పంచడం ఒక కార్యక్రమంగా మావోయిస్టులు ఆదివాసుల హృదయాలను గెలుచుకున్నారు. రైతాంగ సదస్సులను నిర్వహించి, వ్యవసాయ ఉత్పత్తిలో అభివృద్ధి మార్గాల గురించి ప్రజలతో చర్చించారు. శ్రమ, సహకార సంఘాలను ఏర్పరిచారు. సమష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఈ పద్ధతిలో ఎవరి భూమి వాళ్లు సాగు చేసుకోవడంగా కాక, అందరూ కలసి సాగుయోగ్యమైన భూమినంతటిని ఏకఖండంగా చేసి పనిచేశారు. ఈ క్రమంలో సాగుభూమి లేని వాళ్లు ఎంత ప్రయోజనం పొందారో, భూమి ఉన్నవాళ్లు కూడా వ్యక్తిగతంగా అంతగా లాభపడ్డారు. 26, 27 గ్రామాలలో ఈ విధంగా శ్రమ సహకార పద్ధతిలో జరిగిన వ్యవసాయం వల్ల వచ్చిన ఫలితాలతో మిగిలిన చోట్ల కూడా ప్రజలు ఇలాంటి పద్ధతిలో సాగుచేయడానికి చొరవ తీసుకున్నట్టు తెలిసింది. నిత్య జీవితాల కోసం చేయవలసిన ప్రయాణాలు, సౌకర్యాల కల్పన కోసం ఆదివాసులను కూడగట్టడం మావోయిస్టులు చేసిన మరొక ముఖ్యమైన పని. అందులో భాగంగానే బలిమెల వాగులో పడవలు పెట్టాలనే డిమాండ్ పెట్టి సాధించుకోగలిగారు. చేపలు పడితే కట్టాల్సిన పన్ను రద్దు కోసం పోరాడి సాధించారు. ఆదివాసులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలోను మావోయిస్టులు విశేష కృషి చేశారు. కటాఫ్ ఏరియాల గ్రామ నిర్మాణాల నుండి కొంతమందిని ఎంపిక చేసి, తగిన శిక్షణ ఇచ్చి, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య బృందాలను ఏర్పరిచారు. చాణక్యుడు మావోయిస్టులు ఆదివాసుల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. వైద్యం విషయంలో ప్రభుత్వం ఆధునిక వైద్యాన్ని మారుమూలలకు పంపించే ప్రయత్నం చేస్తుంటే మావోయిస్టులు అడ్డుపడుతున్నారని చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మావోయిస్టులు ఇంటింటికీ రూ. 100 వసూలు చేసి తెప్పించిన మందులతో వాళ్లు గ్రామాలలో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నాయి. మావోయిస్టుల ఈ వైద్య విధాన ఫలితమే ప్రభుత్వం ‘మెడికల్ లాంచ్’ల ఏర్పాటు. విద్య విషయంలో మావోయిస్టులు ప్రస్తుతానికి వయోజనులకు రాత్రి బడులు నడిపే తొలి దశలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణకు బాధ్యులుగా అధ్యాపకులను చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నారు. దాని ఫలితంగానే కొన్ని గ్రామాలలో బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతున్నది. కాఫీ ప్లాంటుల్లోకి చొచ్చుకుపోయిన మావోయిస్టులు బాక్సైట్ సమస్యలపై సంఘటితం అవుతున్న ఆదివాసులకు వెన్నుదన్నుగా ఉన్నారు. దాని ఫలితమే ఇరవై ఏళ్లుగా దాన్ని నిలువరించగలిగారు. ఉద్యమ ఉధృతికి జీవోలు రద్దు చేసుకున్నారు. సమర్థ పాలకుడు దేశాన్ని సక్రమంగా పరిపాలిస్తున్నప్పుడు దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు ఉక్కిరిబిక్కిరై ‘సమాజంలో అవినీతి, అసమానతలు, అసహనం పెరిగిపోయిం ద’ని ఫిర్యాదు చేస్తారని చాణక్యుడు తన పోస్టర్లో ముక్తాయించాడు. ఇవాళ దేశంలో ఉన్న అవినీతి, అసమానత, అసహనాల గురించి దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు మాత్రమే మాట్లాడుతున్నారా? ప్రజలు మాట్లాడుతున్నారా? అనే విషయాన్ని ప్రజల విజ్ఞతకే వదిలేస్తూ చాణక్యుని కుటిలబుద్ధి గురించి దీన్ని బట్టి అంచనా వేయగలరని భావిస్తున్నాను. (వ్యాసకర్త : వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు ) -
ఆపరేషన్ ఆర్కేలో మైండ్‌గేమ్ ఎవరిది?
అభిప్రాయం ప్రజల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనల విషయంలో తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. మనుషుల స్వభావాలు, ఉద్దే శాల గురించి ప్రస్తావించడానికి జంతువుల పోలిక తీసుకురావడం చిరకాలంగా ఉన్నదే. ప్రపంచ సాహిత్యం నిండా ఇది కని పిస్తుంది. మన పంచతంత్రం కథలు అందుకు మంచి ఉదా హరణ. వర్గ సమాజంలో మను షుల స్వభావాలు వాళ్ల ప్రయోజ నాల వల్ల, వాళ్ల స్వార్థం వల్ల మారిపోతూ ఉంటాయి. కానీ జంతువుల సహజాతాలు మనుషుల సంపర్కంలోకి వస్తే తప్ప మారిపోయే అవకాశం లేదు. తొండ ముదిరి ఊసర వెల్లి కావడం, రంగులు మార్చడం, గొంగడి పురుగు సీతా కోక చిలుకగా మారటం ప్రకృతి సిద్ధ్ధమైన పరిణామాలు, సహజాతాలు. ఇందులో మంచి, చెడు అని అనేది ఏమీ లేదు. ఇది ఒక పరిణామం. వర్గసమాజంలోని మానవు లకు ఇటువంటి పోలిక తేవడానికి వీల్లేదు. ఏజెన్సీలో ‘ఊసరవెల్లి’ పేరుతో వెలసిన ఈ పోస్టర్ల సందర్భమే చూద్దాం. ప్రచురించినది ప్రగతిశీల ఆదివాసీ యువత - ఏ తొండ ఊసరవెల్లిగా మారిన రూపానికి ఇది మారుపేరు? ఇది ఆంధ్ర ఎస్ఐబీ తొండ ముదిరిన ఊస రవెల్లి రూపమా? లేక చంద్రబాబు రాజ్యాంగ యంత్ర ఊసరవెల్లి రూపమా? పదహారేళ్లుగా జల్-జంగల్-జమీన్ కోసం, ప్రాదేశిక హక్కుల కోసం గ్రామ విప్లవ అధికారాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలపై, వాళ్ల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనలపై తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. ఈ రంగులు మార్చడం పాలక వర్గాలకు సహజమే. రామ్‌ఘడ్ ఎన్కౌంటర్ గురించి నేను అక్టోబర్ 24 నుంచి ఇస్తూ వస్తున్న ప్రకటనలే నిర్దిష్టంగా చూద్దాం. అక్టో బర్ 24వ తేదీ అంతా ఆంధ్రా డీజీపీ దాన్ని ‘ఆపరేషన్ ఆర్కే’ అన్నాడు. ఆర్కే గాయపడి పోలీసుల అదుపులోనే ఉండే అవకాశం ఉందని, సీఆర్బి, తెలంగాణ పార్టీ భావిం చినందువల్ల తెలుసుకునే ప్రయత్నం చేశాను. తమ అదు పులో లేడని పోలీసు అధికారులు ప్రొ. హరగోపాల్‌కు, బాధ్యత గల వారికి చెప్పినప్పుడు అదుపులో లేకపోవచ్చు గానీ, వాళ్ల నిఘాలో ఉండే అవకాశం ఉందని చెప్పాను. నేను వాడిన మాట ‘పోలీసుల నిఘా’, ‘విసినిటి’, అంటే వాళ్ల కనుసన్నల్లో ఉండే ప్రాంతం అనే అర్థంలో. వదంతులు, ప్రచారాలు చాలా జరిగాయి. విషాహారం పెట్టారని, ఆహారంలో మత్తు మందు చల్లారని వంటివి. ఆర్కే గాయపడడమే కాదు అట్లా పోలీసుల చేతుల్లో పడ్డా డని కూడా. అప్పటికే తన కొడుకు పృథ్వీ (మున్నా)ను ఈ ఎన్కౌంటర్లో కోల్పోయి, మృతదేహాన్ని తీసుకువెళ్లిన కన్న తల్లి శిరీష ఈ ప్రచారాలతో, ఈ ప్రకటనతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆర్కే తమ అదుపులో ఉంటే కోర్టులో హాజరు పరచాలని కోరింది. పోలీసుల నిఘావరణలో, వాళ్ల నిఘా కనుసన్నల్లో ఉండే అవకాశం ఉందనే మాట వాడాను తప్ప, వాళ్ల అదుపులో ఉన్నాడని గానీ, వాళ్లు చిత్రహింసలు పెడుతున్నారని గానీ నేను ఏ సందర్భంలో కూడా ఆరోపించలేదు. అదు పులో ఉండటం అంటే ఎన్కౌంటర్ చేయడమే అని నాకు తెలుసు. ఇంత పెద్ద సంఘటనలో ఆర్కే అదుపులో ఉన్నా డని అనుమానించడానికి, ఆందోళన చెందడానికి ఆస్కారం ఉంది గనుక కోర్టు ఈ ఆరోపణను విచారించడానికి ఏదైనా చట్టబద్ధమైన ఆధారాన్ని చూపండని హైకోర్టులో న్యాయ మూర్తులు కూడా అన్నప్పుడు మాత్రమే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ నన్ను సంప్రదించి అందుకు రెండు వారాల సమయం తీసుకున్నారు. ఆ రాత్రే ఆర్కే క్షేమం అని తెలియడం వల్ల ఇంక ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొల గించాలని వెంటనే మీడియాకు ‘ఆర్కే క్షేమం’ అని తెలి పాను. పోలీసు దిగ్బంధంలో చిక్కుకుపోయిన మేం ప్రజ లకు చెప్పడంలో కొంత ఆలస్యం జరిగింది అంటూ ఏఓబీ కార్యదర్శి జగబంధు చేసిన ప్రకటనబట్టి కూడా.. పోలీసు దిగ్బంధం అంటే పోలీసుల అదుపులో అన్నట్లే కదా. మనుషులు పోలీసు యంత్రాంగంగా, ప్రభుత్వంగా మారినప్పుడు వాస్తవాలను చెప్పే బాధ్యత నిర్వహించడం లేదన్నదే నేను ఈ మైండ్ గేమ్ ఆడుతున్న రాజ్యంపై 1969 నుంచి కూడా చేస్తున్న ఆరోపణ. ఈ సందర్భంగా ఏ పాపం ఎరుగని ఊసరవెల్లి లాంటి ప్రాణుల పోలిక తేవడం మరొక నేరమని నేను ఆరోపించదల్చుకున్నాను. నాకు ఊసరవెల్లి పోలిక తీసుకువచ్చారు గానీ ఈ ఆరో పణ చేస్తున్న వాళ్లకు (వాళ్లెవరైనా సరే అది రాజ్య ప్రాయోజి తమైందని నేను భావిస్తున్నాను) నేను మ్యాకవెల్లి పోలిక చెప్పదల్చుకున్నాను. మన దేశంలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన రోజులలో, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తనను మెకాలే అంటున్నాం. వర్శిటీల ఏర్పాటుకు ఈ దేశ బుద్ధిజీవుల భావాలను వలసీకరించాలనే ప్రయత్నాలకూ ఈయననే వ్యూహకర్త అని చెపుతారు. మన దేశంలో గిరీశం వంటి ఆషాడభూతులు తయారు కావడానికి ఇటువంటి మ్యాకవెల్లిల ఆలోచనలే మూలం. ప్రపంచ బ్యాంక్ సీఈఓలు.. ప్రజలు ఎన్నుకుంటున్న ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం మనకు మ్యాకవెల్లి, గిరీశాల పోలికలు రోజూ తటస్థిస్తూనే ఉంటాయి. కనుక ఇకనైనా మనుషుల భాషలో మాట్లాడుకుందాం. మనకు అర్థం కాని భాష మాట్లాడి, మన భాష అర్థం కాని ప్రాణు లను వాటి మానాన వాటిని వదిలేద్దాం. తాను పొత్తు పెట్టు కున్న బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జంతు ప్రేమికు రాలు మేనకా గాంధీ గురించైనా ఈ సూచనను చంద్రబాబు నాయుడు పాటిస్తాడని ఆశిస్తాను. వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు -
ఆదివాసీలను అన్యాయంగా చంపేశారు
♦ దీనిపై విచారణకు ఆదేశించండి ♦ హైకోర్టులో టీయూసీసీ అధ్యక్షుడి పిల్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) గత నెలలో జరిగిన ఎన్కౌంటర్లో గ్రేహౌండ్స్ పోలీసులు తొమ్మిది మంది అమాయక ఆదివాసీలను కాల్చి చంపారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఎన్కౌంటర్లో బలైపోయి న ఈ 9 మంది ఆదివాసీల కుటుంబాలకూ ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ట్రేడ్ యూ నియన్ కో ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) అధ్యక్షుడు పి.నారాయణస్వామి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గ్రేహౌండ్స్ డీఐజీ, విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గత నెల 24న బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల ఎన్కౌంటర్ సందర్భంగా లచ్చా మోదిలి, కావేరి మోదిలి, ముబిలి, మల్కన్ పంగి, అమ్లా, షిండే, శ్యామల, జయ, కోమలిలను పోలీసులు కాల్చి చంపారన్నారు. వాస్తవానికి మావోయిస్టుల కు, వీరికి ఇటువంటి సంబంధం లేదని పిటిషనర్ వివరించారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వీరిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కడతేర్చారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించేందుకు న్యాయవాదుల బృందాన్ని నియమించాలని నారాయణస్వామి కోర్టును కోరారు. -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
ఛత్తీస్‌గఢ్: మవోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగలింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల క్రితం దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్‌లో ఏవోబీ ఎన్కౌంటర్లో 32మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్డు జడ్జీతో విచారణ చేపట్టాలి
ఏలూరు(సెంట్రల్)ః ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్డీతో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు మాట్లాడుతూ ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు ఆదివాసీలను అడవి నుండి దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, పోలీసులు, పారామిలట్రీ దళాలు, గ్రీన్ హంట్ పేరుతో నరమోధం సృష్టిస్తూ అమాయక ఆదివాసీలు 10 మందిని ఎన్కౌంటర్లో దళ సభ్యులుగా చిత్రీకరించి దారుణంగా కాల్చి చంపారన్నారు. గత నెలలో ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డితో న్యాయవిచారణ చేపట్టాలని, ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్య, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మృతి చెందిన గిరిజనులకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఏవోబీలో పారామిలట్రీ దళాలు కూబింగ్ నిలిపివేయాలని చిట్టిబాబు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినితిపత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.కనకరెడ్డి, దేపాటి శివప్రసాద్,ఎస్. రామకృష్ణ, ఎస్. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
'వాళ్లు కాల్పులు జరిపాకే మేం జరిపాం'
ప్రకాశం: ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై వస్తున్న వదంతులు వాస్తవం కాదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు కాల్పులు జరిపిన తర్వాతే తాము కాల్పులు జరిపామని చెప్పారు. ఏపీ పోలీసుల అదుపులో గిరిజనులు లేరని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 100 ఆదర్శ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం త్వరలో యాక్సిడెంటల్ జోన్ అలర్ట్ యాప్‌ను రూపొందించబోతున్నట్లు తెలిపారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడమే కాదని, పోలీసులు కూడా ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని సాంబశివరావు కోరారు. -
ఆ కాల్పులు వ్యవస్థకే సవాళ్లు..!
అభిప్రాయం ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని సాధించుకోవడమే వ్యక్తిత్వ వికాసమైన స్థితిలో.. తమ సొంతం కోసం కాకుండా పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని తప్పు పట్టడం కష్టం. అలాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసు కాల్పుల వల్ల ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారన్న విషయం త్వరలోనే వార్తా పత్రికలలో కనిపించదు. అయితే సాయుధ వామపక్ష ప్రతిఘటన ఉద్యమం అనే రాజకీయ పోరాటం మాత్రం మన ప్రజాస్వామ్యంపై ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవలసిన అవస రాన్ని, అదే నిజమైన విముక్తి మార్గంగా నమ్మిన వారు కోల్పోయే ప్రాణాల ద్వారా గుర్తు చేస్తూ ఉంటుంది. మనం ప్రజాస్వామ్యంగా పిలుచుకుంటున్న ఈ పాలనా వ్యవస్థ నియమబద్ధతను పాటించి ఇలాంటి కాల్పుల ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు సమాధానం చెప్పే అవకాశం తక్కువ. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల మూక పాలన కాదనీ ప్రజలు తమ అనుభవాల వెలుతురులో చర్చించుకొని రూపొందించు కున్న నియమాల అనుసారం సాగే పాలన అనే అర్థం ఉంది. అందుకే వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చే లిబరల్ కాపిటలిస్ట్ సమాజాలు కానీ, సమానత్వానికి ప్రాధాన్యతను ఇచ్చే సోషలిస్ట్ సమాజాలుగానీ తమ పాలనా రూపాలను ప్రజాస్వామిక రూపాలనే పేర్కొంటు న్నాయి. అయితే ప్రజాస్వామిక రాజ్యాలు అని ప్రకటించుకున్నవి తమ పనితీరుతోనే.. సదరు రాజ్య వ్యవస్థ స్వేచ్ఛా సమానత్వాల సమతులనాన్ని పట్టించుకునేటట్టు చూడవలసి ఉంటుంది. ఈ పని చెయ్యడంలో విఫలమైన ప్రతిచోటా ఆ వైఫల్యపు తీవ్రత, అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు ఉంటాయి. మన దేశంలోనూ నిరాయుధ, సాయుధ పద్ధతుల్లో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీరులో ప్రజలపట్ల మన ప్రభుత్వం వ్యవహార శైలి మీద, ఈశాన్య భారత్‌లో మన సైన్యం జులుం పట్ల, ఆదివాసీ ప్రాంతాలల్లో వనరుల కోసం జరుగుతున్న విధ్వంసంపట్ల, గ్రామం నగరం తేడా లేకుండా సాగుతున్న అమానవీయమైన అవి నీతి మీద ప్రతిఘటన సాగుతూనే ఉన్నది. ఆ పోరాటాల శక్తి, వాటికి దొరికే మద్దతు సందేహమే. కానీ పోరాటాలు సాగుతూనే ఉంటాయి. ఇటువంటి పోరాటాల వరుసలో, వ్యవస్థ సమూల మార్పు కోసం సాగే పోరాటంగా ప్రకటించుకుంటున్న మావోయిస్టు సాయుధ విప్లవ పోరాటం గత 40 ఏళ్ల పైబడి ఉనికిలో ఉన్నది. ‘‘పీడిత వర్గాలు దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా ఈ వ్యవస్థను కూలదోసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ద్వారానే విమోచన పొందుతారు’’ అనే విశ్వాసంతో వీరు పోరాడుతున్నారు. ఈ సాయుధ పోరాటపు గమనం, వారి విశ్వాసమూ ప్రశ్నలకు అతీతమైనవి కావు. ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాలలో వనరుల మీద దేశీయ, అంతర్జాతీయ పెట్టుబ డులు పట్టు బిగిస్తున్నాయి. ఆదివాసులు మునుపటికంటే ఎక్కువగా జీవన్మరణ పోరాటం చేయక తప్పని పరిస్థితికి వచ్చారు. అందుకే సాయుధ పోరుకు మద్దతు అధికంగా ఉన్నది. అంటే అక్కడ మాత్రమే సమస్యకూ, పోరాటానికి మధ్య బలమైన సంబంధం కనిపిస్తున్నది. మైదాన ప్రాంతాలలో ఒకనాడు ఈ ఉద్యమానికి (కనీసం తెలుగు ప్రాంతాలలో) ఉన్న మద్దతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. మైదాన ప్రాంతాలలో సమస్యలు ఏమీ లేవని అర్థం కాదు. ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించుకోవడమే లక్ష్యమైన స్థితిలో కేవలం తమ సొంత తృప్తి కోసం కాక పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మర ణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య పొంతన లేకపోవడం కూడా సమస్యనే. స్వాతం త్య్రానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని స్థితి భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచి పోతున్నాయి అనో.. చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక మూల సాయుధ వామపక్ష రహస్యో ద్యమం.. అది ఎంత అశక్తమైనదీ, పెద్దగా సానుకూల ఫలితాలు సాధించలేనిదీ అయినా సరే... ఒకమేర పీడితులకు, వ్యవస్థాపరమైన అన్యాయాన్ని సహించనివారికీ అది ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా కనిపించడాన్ని మాత్రం అసంబద్ధం అనలేము. వ్యవస్థీకృత హింసను మనం వ్యక్తుల స్థాయిలో, కుటుంబాల స్థాయిలో, కులాల లేదా ఇతర సాంççస్కృతికS సముదాయాల స్థాయిలో గుర్తించి తీరాలి. అట్లనే వాటికి బయట ఉన్న సామాజిక, సాంçస్కృతిక, ఆర్ధిక, రాజ్య సంబంధ నిర్మాణాల పనితీరులో నిరం తరం గుర్తించడం ఎదుర్కోవడం చెయ్యవలసి ఉంటుంది. ఎందు కంటే ఆ హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మన చుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించకపోవడం, పక్కవాడిని కులంపేరనో మతం పేరనో చిన్న చూపు చూడటం మొదలు అడ్డమైన గడ్డి తిని సంపన్నులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని.. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అను కుంటూ ఎవడికి ఏమయితేనేమి నేను బాగుంటే చాలుననే చింతనే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటు వంటి వాతావరణంలో నియమబద్ధ ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదని గుర్తించడం ప్రస్తుత అత్యవసరం. నిత్య జీవితంలో అన్యా యాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరం తరం సాగడం మన అవసరం. వ్యవస్థీకృత హింసనూ, దానిని పెంపొందించే అప్రజాస్వామిక వ్యవస్థను మనం ప్రాణ హాని లేని, లేక తక్కువ ప్రాణహాని ఉండే ప్రయత్నాల ద్వారా లేక ప్రజాస్వామికంగా మార్చుకోగలమా? అన్న కీలకమైన, తప్పించుకోలేని ప్రశ్న ఇటువంటి (మావోయిస్టుల) మర ణాలు సంభవించిన ప్రతిసారీ ముందుకొస్తుంది. ఈ ప్రశ్నను ఎదు ర్కొని దానికి సమాధానం ఎదుర్కునే పయనమే ప్రజాస్వామిక జీవితాన్ని నిలిపే పోరాటమనీ, దాన్ని నిత్య జీవితంలోకి తెచ్చు కోవడం అవసరమనీ మనం గుర్తించాలంటూ ఇలాంటి మరణాలు మనలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాయి అని గ్రహించడం అత్యవసరం. వ్యాసకర్త హెచ్ వాగీశన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ మొబైల్ : 9440253089 -
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
హైదరాబాద్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిం చాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ వివరాలను వెల్ల డించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను, ప్రజలను విచారించి వాస్త వాలను తెలుసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారం తెలుసుకుని వారిని మట్టుపెట్టాలనే లక్ష్యంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు పథకం ప్రకారం పాశవికంగా కాల్చి చంపారని, మృతదేహాలను గుర్తుపట్టకుండా శవాలను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలపై ఉక్కుపాదం మోపు తూ ప్రజల జీవన మనుగడను ప్రశ్నార్థకం చేస్తూనే, మరో పక్క అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏపీ గ్రే హౌండ్‌స దళాలను రద్దు చేయాలని, అటవీ ప్రాంతంలో మోహరించిన పారా మిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కూంబింగ్ ఆపరేషన్స పూర్తిగా నిలిపి వేసి అటవీ హక్కు, పంచాయతీ చట్టాలను అమలు చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆ పోలీసులపై హత్య కేసు పెట్టాలి
మానవహక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వి.ఎస్. కృష్ణ డిమాండ్ పాడేరు: ఆంధ్ర– ఒడిశా సరిహద్దులోని రామగుడ అటవీ ప్రాంతంలో గత నెల 24 నుంచి జరిగిన ఎన్కౌంటర్లపై సీబీఐ విచారణ జరిపిం చాలని మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వి.ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు. మానవహక్కుల వేదిక బృంద సభ్యులు ఎన్కౌంటర్ జరిగిన ప్రాం తాన్ని శుక్రవారం సందర్శించారు. శనివారం విశాఖ జిల్లా పాడేరులో కృష్ణ విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా పోలీసులు వారిపై ఏకపక్షంగా కాల్పులు జరిపారని, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. ఆత్మరక్షణ కోసమే తాము మావోయిస్టులపై కాల్పులు జరిపారని పోలీసులు కట్టుకథ చెబుతున్నారన్నారు. మావోయిస్టులు, గిరిజనులను హతమార్చిన పోలీసులపై చిత్రకొండ పోలీస్ స్టేషన్లో హత్యానేరం కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. సాధారణ పౌరులకులానే పోలీసులకు కూడా చట్టాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆండ్రపల్లి, పనసపుట్టు, డుడుంబ పంచాయతీలకు చెందిన 13 మంది గిరిజనులు కనిపించకుండా పోయారని తెలి పారు. వీరు కూడా చనిపోయి ఉండచ్చని ఆయా గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై సీబీ ఐ విచారణ లేదా ప్రత్యేక అధికారులతో దర్యా ప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నా రు. ఈ సమావేశంలో మావనహక్కుల వేదిక సభ్యులు కె.సుధ, వై.రాజేష్ పాల్గొన్నారు. -
ఆ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి
► తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్ ► కోవర్టు వ్యవస్థకు చంద్రబాబే ఆద్యుడు ► మైండ్‌గేమ్ మాది కాదు.. ఆంధ్రా డీజీపీదే: వరవరరావు ► ఎన్కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేయలేరు: కోదండరాం ► పోలీసులకు చంపే హక్కు ఎవరిచ్చారు?: జస్టిస్ చంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: మల్కన్‌గిరిలో మావోయిస్టులు, మధ్యప్రదేశ్‌లో సిమి, తెలంగాణలో వికారుద్దీన్ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. గత నెల 24న ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరుతో 22 మంది మావోయిస్టులను, తొమ్మిది మంది ఆదివాసీలను పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపిందని ఆరోపించింది. ఈ చర్యను సమావేశంలో పాల్గొన్న వక్తలు తీవ్రంగా ఖండించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. కోవర్టు వ్యవస్థకు అంకురార్పణ చేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన నయీం.. మావోయిస్టుగా చెప్పుకున్న కోవర్టని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మావోయిస్టులను కాల్చిచంపించి, మావోయిస్టులే మైండ్‌గేమ్ ఆడుతున్నారని చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి పంచాది కృష్ణమూర్తిని కాల్చిచంపింది మొదలుకుని నిన్నటి మల్కన్‌గిరి ఎన్కౌంటర్ వరకు గత 40 ఏళ్లుగా మైండ్‌గేమ్ ఆడుతోంది పోలీసులే తప్ప నక్సలైట్లు కాదని స్పష్టం చేశారు. నిజంగా ఎన్కౌంటర్లో చనిపోయిందెవరో స్పష్టంగా తెలి సినా.. వారి పేర్లను కాకుండా అసలు చనిపోని వాళ్ల పేర్లను ప్రకటించి మైండ్ గేమ్ ఆడింది ఏపీ డీజీపీనే అని వరవరరావు ఆరోపించారు. హింసతో మరిన్ని సమస్యలు: కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఎన్కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేస్తామనుకోవడం ప్రభుత్వ అవివేకమన్నారు. ప్రభుత్వమే పౌరులపై హింసకు పాల్పడడం ప్రజాస్వామిక విలువల పతనమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హింస మరిన్ని సమస్యలకు బీజం వేస్తుంది తప్ప పరిష్కారం ముమ్మాటికీ కాదన్నారు. మానవీయ సమాజ నిర్మాణంలో హక్కుల సాధన దిశగా అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పౌరులను చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ మధ్యయుగాల నాటి యూరప్ పరిస్థితులే నేడు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవించే హక్కును హరించి వేస్తున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రొఫెసర్ పద్మజాషా మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ పేరుతో ఈ దేశ పౌరులపైనే క్రూరంగా హింసకు పాల్పడడం తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుని లబ్ధిపొందుతున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పోటీలుపడి మరీ ఇటు వికారుద్దీన్‌ని, అటు ఎర్రచందనం పేరుతో సామాన్యులను మట్టుబెట్టారని ఆరోపించారు. తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బల్లా రవీంద్రనాథ్, ఎన్కౌంటర్లో మరణించిన ప్రభాకర్ భార్య దేవేంద్ర, జైని మల్లయ్య గుప్తా, ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, కోటా శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్, నలమాస కృష్ణ, గురజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కేకు గాయాలు.. అయినా సురక్షితమే
⇒ హైకోర్టుకు నివేదించిన రామకృష్ణ సతీమణి శిరీష ⇒ నిర్దిష్ట సమాచారం అందిందని వెల్లడి ⇒ పిటిషన్ ఉపసంహరణకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి ⇒ ఈ విషయాలన్నీ రాతపూర్వకంగా మా ముందుంచండి: ధర్మాసనం ⇒ విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారని ఆయన భార్య శిరీష శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే, ఈ విషయాలన్నింటినీ రాతపూర్వకంగా న్యాయస్థానం ముందుంచాలని శిరీషకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త ఆర్కే గాయపడ్డారని, ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖప రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ గురువారం కౌంటర్ దాఖలు చేశారు. ఆర్కే తమ కస్టడీలో లేరని కోర్టుకు నివేదించారు. అయితే ఈ వాదనలను శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తోసిపుచ్చారు. ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిశీలించి అవసరమైన పక్షంలో విచారణకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఆర్కే సురక్షితంగా ఉన్నట్లు గురువారం రాత్రి విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తమకు అందిన సమాచారం ప్రకారం ఆర్కే సురక్షితంగా ఉన్నారని ధర్మాసనానికి నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... నిన్ననే కదా.. ఆర్కే ఆచూకీ తెలియడం లేదు, పోలీసుల కస్టడీలోనే ఉన్నారని చెప్పారు అంటూ ప్రశ్నించింది. పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అందువల్ల ఇంతకాలం ఎక్కడున్నారో తెలియలేదని, ఇప్పుడు ఆయన సురక్షితంగా ఉన్నట్లు నిర్ధిష్టమైన సమాచారం అందిందని రఘునాథ్ పేర్కొన్నారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని శిరీష భావిస్తున్నారని, అందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు. ఈ విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచాలని ధర్మాసనం రఘునాథ్‌కు స్పష్టం చేసింది. దానిని పరిశీలించి ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
- ఊపిరిపీల్చుకున్న పోలీసులు.. - ఏజెన్సీల్లో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు - ఇబ్బందులు పడిన ప్రయాణికులు - స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత సాక్షి, విశాఖపట్నం/రంపచోడవరం/అమరావతి/ఏలూరు/రాయగడ: 30 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గురువారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మారుమూల ప్రాంతాలు, అంతర్రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులు దగ్గరుండి వాటిని తెరిపించే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశామని, రూ. 25 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే విశాఖ జిల్లా నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే సర్వీసులు నిలిపేశారు. పాడేరు, చింతపల్లి, అరకు, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, కొత్తూరు, సీతంపేట, పలాస ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లోనూ బస్సు సర్వీసులు రద్దు చేశారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ రహదారి నిర్మానుష్యంగా మారింది. విజయవాడ, రాజ మండ్రి, రావులపాలెం, కాకినాడ, భద్రాచలం తదితర డిపోల నుంచి కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. బంద్ ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో కనిపించలేదు. మావోలు చంపారంటూ వదంతులు... విశాఖలోని కొయ్యూరు మండలానికి చెందిన సర్పంచ్‌ను మావోయిస్టులు చంపేశారంటూ గురువారం వదంతులు వచ్చా యి. కొండగోకిరి మాజీ సర్పంచ్ ఒకరు అనారోగ్యంతో మరణిస్తే దానినే మరో విధంగా సృష్టించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాలను మోహరించడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేశారు. మందుపాతర పేలి పోలీస్ జాగిలానికి గాయాలు మావోరుుస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీస్ జాగిలం గాయాలపాలైంది. ఒడిశాలోని రాయగడ జిల్లా హటొమునిగుడ రహదారి పక్కన మావోరుుస్టులు మందుపాతర్లు అమర్చారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో జాగిలాలతో సీఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మందుపాతర్లను గుర్తిస్తున్న జాగిలాల్లో ఒక జాగిలం కాళ్లు మందుపాతరకు తగిలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన జాగిలానికి చికిత్స అందిస్తున్నారు. కాగా, జాగిలాలు గుర్తించిన మూడు మందుపాతర్లలో ఒకటి పేలిపోగా, మరో రెండింటిని సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు. పోలీసులే లక్ష్యంగా వంశధార, గుమ్సరా, నాగావళి డివిజన్ కు చెందిన మావోలు వీటిని అమర్చి ఉండవచ్చని భావిస్తున్నారు. -
నిఘా నీడన శేషాచలం
ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌తో జిల్లా ఉలిక్కిపడింది. ఇదే జిల్లాకు చెందిన కీలక నాయకుడు చలపతి అదృశ్యంపై ఇంతవరకూ ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో మావోరుుస్టుల ఉనికి చాటుకున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు తాజాగా అప్రమత్తమయ్యారు. మావోరుుస్టులు బంద్‌కు పిలుపు నివ్వడంతో పోలీసులు శేషాచలాన్ని చక్రబంధం చేశారు. అడవిని అణువణువునా జల్లెడ పడుతున్నారు. గత చరిత్ర దృష్ట్యా వీరు తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థారుులో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో మావోరుుస్టులతో సంబంధాలు ఉన్న వారిపై నిఘా పెట్టారు. శేషాచలం అడవులు కేంద్రంగా మావోలు ఉద్యమాలు నిర్వహించిన వైనాలను పోలీసులు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. భాకరాపేట: ఆధ్యాత్మిక జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో మావోరుుస్టుల కార్యకలాపాలు 2004 వరకూ చురుగ్గానే ఉండేవి. 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడిపై అలిపిరి సమీపంలోనే క్లైమోర్ మెన్స బాంబులు పెట్టి పేల్చారు. ఈ దాడికి పథక రచన శేషాచలం అడవులలోనే జరిగిందని పోలీసులు తేల్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై నెల్లూరు జిల్లా వాకాడు వద్ద కూడా ఇదే తరహాలోనే బాంబు దాడి జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా నుంచే పథక రచన చేశారని నిర్ణారణ అరుు్యంది. ఇదీ జిల్లాలో ఎన్కౌంటర్ల నేపథ్యం ►జిల్లాలోని శ్రీ కాళహిస్తి నియోజక వర్గం అదరంలో 1995లో ఎన్కౌంటర్ సంస్కృతి ప్రారంభమైంది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగులు కాళంగి దళం సభ్యులు మృతి చెందారు. ►అదే ఏడాదిలో ఇదే ప్రాంతంలో దళ కమాండర్ సురేష్ ఎన్కౌంటర్ అయ్యారు. ►1996లో పెద్దమండ్యం సమీపంలో మంగలి క్రిష్ణప్ప, వెంకటస్వామి, విజయక్క ఎన్కౌంటర్లో మృతి చెందారు. ►1999లో కేవీ పల్లె మండలం నూతనకాల్వ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ముక్కోడు అలియాస్ బాలన్న మృతి చెందాడు ►2001లో కేవీ పల్లె మండలం పెండ్లిపెంట కొర్నాలగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చంద్రయ్య మృతి చెందగా 9 మంది దళ సభ్యులు తప్పించుకున్నారు. ►2003లో ఎర్వ్రారిపాళెం మండలం తలకోన రిజర్వు ఫారెస్టులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో నలుగురు పరారయ్యారు. ►2004 జనవరి 24 నాటి అర్థరాత్రి పీలేరు సమీపంలో అలిపిరి ఘటనలో పాల్గొన్న ఎరస్రత్యం, శివానంద్ ఎన్కౌంటర్లో చనిపోయారు. బంద్ పిలుపుతో జిల్లాలో... తాజాగా ఏవోబీ బంద్ పిలుపుతో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా గతంలో మావోరుుస్టుల రాష్ట్ర కమిటీ పని చేయడంతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో మావోరుుస్టు ఉద్యమాలు జరిగిన చరిత్ర ఉండడం, సీఎం సొంత జిల్లా కావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, కేవీ పల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దమండ్యం, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాళెం, సత్యవేడు, నగరి, పుత్తూరు, పుంగనూరు, సోమల, సదుం, మండలాల్లో ఎస్టీఎఫ్ బలగాలతో కూంబింగ్‌లు నిర్వహించడం, వాహన రాక పోకలను నిశితంగా తనిఖీలు నిర్వహించి పంపుతున్నారు. ►అటవీ సరిహద్దు, సానుభూతిపరులు ఉన్న గ్రామాల్లోనూ, పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు నిఘా పెట్టారు. జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రహదారులలోని కల్వర్టులను క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్టీఎఫ్ బలగాలతో అటవీ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టారు. జిల్లాలోని తూర్పు, పశ్చిమ మండలాల్లో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ప్రభు త్వ కార్యాలయాల వద్ద పోలీసుల గురువారం తెల్లవారుజాము నుంచే కాపు కాశారు. ► చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, కేవీ పల్లె అటవీ సరిహద్దు ప్రాంతమైన పీలేరు రూరల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ బలగాలు గస్తీ తిరిగారుు. దీంతో వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం పరిధిలో అక్కడి పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహించారు. ►పీలేరు నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి మరింత పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పీలేరు రూరల్, తంబళ్లపల్లె సర్కిల్ పరిధిలో ప్రత్యేకించి జన చైతన్య యాత్రలు చేపట్టేట్లుంటే పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై ప్రజల్లో తీవ్ర స్థారుులో చర్చ జరుగుతుందని ఇంటెలిజెన్స వర్గాలు నివేదికలు ప్రభుత్వానికి అందడం వల్లే పోలీసు శాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందన్నది సమాచారం. అలిపిరి ఘటనతో ఆగిన వార్ అలిపిరి ఉదంతంలో రాష్ట్ర పీపుల్స్‌వార్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మిలటరీ కమిషన్ సభ్యుడైన ఎర్ర సత్యం అలియాస్ బలిజె రామ్మోహన్రావు, అనంతపురం జిల్లా కమిటీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి అలియాస్ తెలంగాణ గంగన్న , అనంతపురం జిల్లా కమిటీ సభ్యుడు శంకర్ అలియయాస్ కురవ శివానంద్ పాల్గొన్నారని పోలీసులు తేల్చారు. ►2004 జనవరి 24న పీలేరుకు మూడు కిలోమీటర్లు దూరంలో వార్ నేతలు ఎరస్రత్యం, శివానంద్ ఎన్కౌంటర్ అయ్యారు. కడప జిల్లా సుండుపల్లె సమీపంలో తెలంగాణ గంగన్న ఎన్కౌంటర్ అయ్యారు. తర్వాత జిల్లాలో మావోరుుస్టుల కార్యకలాపాలు తగ్గారుు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన చర్చల ఫలితంగా మావోల కదలికలు కనుమరుగయ్యారుు. -
ఆర్కే పోలీసుల వద్దనే ఉన్నాడనడానికి ఆధారాలేవి?
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేడని ఆంద్రప్రదేశ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆర్కే ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య శిరీష దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ఏపీ పోలీసులు ఆర్కే తమ వద్ద లేడని కౌంటర్లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్కే పోలీసుల వద్దే ఉన్నాడని విన్నవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆధారలుంటే కోర్టు ముందు ఉంచాలని పిటిషన్ తరపు లాయర్ కు సూచించారు. ఆధారాలు సమర్పించేందుకు పిటిషనర్ 10 రోజుల గడువును కోరారు. దీనిపై విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. ఆర్కే పోలీసులు అదుపులో ఉన్నాడనడంలో వాస్తవం లేదని విశాఖ ఎస్పీ తెలిపారు. ఆర్కే పై 40 కేసులు ఉన్నాయని, 22 కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కావడంలేదని తెలిపారు. ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయం నుండి మావో అగ్రనేత రామకృష్ణ ,గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లేదు. ఇప్పటివరకు వారి సమాచారం గురించి పార్టీ వర్గాలకు సమాచారం చేరలేదు. దీంతో పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలు ఉన్నారని రామకృష్ణ కుటుంబసభ్యులు , ప్రజాసంఘాలు, హాక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. రామకృష్ణ ఆచూకీ కోసం ఆయన సతీమణి రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
చర్లపల్లి జైలులో మావో ఖైదీల నిరాహార దీక్ష
హైదరాబాద్: ఏవోబీలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాల బంద్‌కు సంఘీభావంగా చర్లపల్లి జైలులో మావో రాజకీయ ఖైదీలు గురువారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. బ్యారక్‌లో ఉన్న మావో ఖైదీలు ఉదయం నుంచి అన్నపానీయాలు ముట్టుకోకుండా దీక్ష చేస్తున్నారు. -
మావోయిస్టుల బంద్: ఏజెన్సీలో హై అలర్ట్
విశాఖపట్నం: భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈనెల 24న జరిగిన ఎన్కౌంటర్లో 30మంది మరణించడంతో మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి అమరవీరులకు నివాళి అర్పించాలని మావోయిస్టులు.. వారి ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో మన్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే బస్సులు నిలిపివేశారు. సాలూరు బస్టాండ్‌లో బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేయడంతో కోరాపుట్, జైపూర్, సునాబెడ, రాయ్‌పూర్ వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీలేరు, పాడేరులో ప్రభుత్వ వాహనాలను పీఎస్లలోనే ఉంచారు. ముంచంగిపుట్టు,పెదబైలు, మాచ్ఖండ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ, విజయనగరం నుంచి రాయ్‌గఢ్, కోరాపుట్, మల్కన్‌గిరి, జైపూర్, సునాబెడ వెళ్లే బస్సులను సాలూరులోనే అధికారులు నిలిపివేశారు. రాజమండ్రిలోని తూర్పు మన్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చర్ల, వెంకటాపూర్, వాజేడు మండలాలను బస్సు సర్వీసులు నిలిపివేశారు. మావోయిస్టుల బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో మావోయిస్టు రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. -
రగులుతున్న మన్యం
నేడు ఏజెన్సీ బంద్ ♦ మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసన ఏవోబీలో బలగాల పెంపు ♦ ప్రభుత్వ ఆస్తులు, సెల్‌టవర్లకు భద్రత నిలిచిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ♦ సురక్షిత ప్రాంతాలకు టీడీపీ నేతలు సాక్షి, విశాఖపట్నం/సీలేరు: భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈనెల 24న జరిగిన ఎన్కౌంటర్లో 30మంది మరణించడంతో మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి అమరవీరులకు నివాళి అర్పించాలని మావోయిస్టులు.. వారి ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో మన్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బంద్‌కు సన్నద్ధమైన మావోయిస్టులు బంద్‌ను విజయవంతం చేయడం కోసం ఏజెన్సీలో గిరిజనులను మావోయిస్టులు చైతన్యం చేస్తున్నారు. బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లి ప్రచారం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే గిరిజనులకు ఇప్పటికే కార్యాచరణను రూపకల్పన చేసి వివరించారు. మిలీషియా సభ్యుల సహకారంతో విధ్వంసాలకు పాల్పడే అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. ఆందోళనన కలిగిస్తున్న గతం అగ్రనేతల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి మావోయిస్టులు బంద్‌ను సరైన సందర్భంగా మలుచుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళనన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో ఇలాంటి బంద్‌లు జరిగినప్పుడు మావోయిస్టులు పలు అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారు. జీకే వీధి–సీలేరు మధ్య మూడు బస్సులను తగులబెట్టారు. 100 చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని పేల్చేశారు. ముంచింగ్‌పుట్టు, జి.మాడుగుల, దారకొండలో సెల్‌టవర్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో వారు ఎలాంటి చర్యలకు దిగుతారనే భయం వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల బంద్ నేపధ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లలో సిబ్బందిని పెంచారు. కూంబింగ్ దళాలను వెనక్కు పిలిపించామని చెబుతున్నప్పటికీ ఇంకా అడవిలోనే బలగాలు ఉన్నాయి. ఏజెన్సీకి వెళ్లే ప్రతి రహదారిలో అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ ముందస్తు చర్యలు ఎప్పుడు ఎలాంటి బంద్‌లు, ఆందోâýæనలు జరిగినా ముందుగా నష్టపోయేది ఆర్టీసీనే. అందుకే ఈసారి పరిస్థితి తీవ్రతను బట్టి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. వైజాగ్ నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరికి వెళ్లే బస్సు సర్వీసును, పాడేరు నుంచి సీలేరు మీదుగా తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి వెళ్లే బస్సు, విశాఖ నుంచి సీలేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లే బస్సు సర్వీసులను బుధవారం నుంచే నడపడం మానేశారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. సురక్షిత ప్రాంతాలకు టీడీపీ నేతలు, ఇన్ఫార్మర్లు తమ వారి చావులకు బదులు తీర్చుకునేందుకు మావోయిస్టులు టీడీపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు చెప్పడంతో బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్నవారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే వీరితోపాటు ఈసారి ఇన్ఫార్మర్లకు ప్రమాదం పొంచిఉంది. భారీ ఎన్కౌంటర్ జరగడానికి కోవర్ట్ ఆపరేషనే కారణమని భావిస్తున్న మావోయిస్టులు నమ్మక ద్రోహం చేసిన వారిని శిక్షించే అవకాశాలు లేకపోలేదు. దానిలో భాగంగా పోలీస్ ఇన్ఫార్మర్లపైనా ప్రతీకారం తీర్చుకోవచ్చు. దీంతో వారిని కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. -
నేడు 5 రాష్ట్రాల్లో మావోల బంద్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియాలో ఇటీవల 30 మంది మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం 5 రాష్ట్రాల్లో బంద్ జరగనుంది. బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోలు ఇప్పటికే మన్యంలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తుండగా, విఫలం చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దయ, గణేష్ వంటి స్టేట్ కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులను, అమాయక గిరిజనులను ప్రభుత్వ ప్రోద్బలంలో పోలీసులు పట్టుకుని కాల్చి చంపేసి ఎదురుకాల్పుల్లో చనిపోయారంటున్నారని ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. -
28 ఏళ్లకు మళ్లీ ‘అదృశ్యం’
► ఐలయ్య, రాయమల్లు జాబితాలో ఆర్కే..!? ► అగ్రనేత జాడపై కొనసాగుతున్న సస్పెన్స్ పెద్దపల్లి: తెలంగాణ ప్రాంతంలో 1988లో సంచలనం సృష్టించిన మావోయిస్టు నేతల అదృశ్యం 28 ఏళ్ల తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే ఉదంతంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ నాటి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇన్చార్జి రామకృష్ణ అలియాస్ ఆర్కే కనిపించకుండా పోవడంతో.. గతం అదృశ్యం జాబితాలోనే ఆర్కే చేరుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 28 ఏళ్ల క్రితం అంటే.. 1988 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని నవ్‌రంగ్ థియేటర్ వద్ద అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శి గోపగాని ఐలయ్య, కొరియర్ బుర్ర రాయమల్లును పోలీసులు పట్టుకెళ్లారని తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పెద్ద విధ్వంసం జరిగింది. ఐలయ్య, రాయమల్లుతో పాటు జనశక్తి సభ్యులు వసంత, సుజాతలను కరీంనగర్ కోర్టు వద్ద పోలీసులు మాయం చేశారని, అంతేకాకుండా మంథని నియోజకవర్గం రామయ్యపల్లికి చెందిన రమణారెడ్డి అనే అగ్రనేతను ముంబైలో పట్టుకొని జాడ తెలియకుండా చేశారని అప్పట్లో పీపుల్స్‌వార్ నేతలు ఆరోపించారు. అదృశ్యమైన తమ వాళ్ల జాడ చెప్పాలని డిమాండ్ చేస్తూ అప్పటి కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ టీడీపీ ఎంపీపీని కిడ్నాప్ చేశారు. రామగిరి ఖిలాలో నాలుగు రోజుల పాటు నిర్బంధించి తర్వాత వదిలిపెట్టారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాడిచెర్ల మండల అధ్యక్షుడు మల్హర్‌రావును కిడ్నాప్ చేసిన పీపుల్స్‌వార్ ఆయనను హతమార్చింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎంపీపీని కిడ్నాప్ చేయడంతో పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురితోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 11 మంది మిలిటెంట్లు కలిపి 16 మంది అదృశ్యంపై అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, కేఎల్ఎన్.రెడ్డి కమిషన్‌ను నియమించి విచారణ చేపట్టారు. మూడేళ్లు విచారణ చేపట్టిన కేఎల్ఎన్ రెడ్డి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, కేఎల్ఎన్.రెడ్డి కమిషన్ ఇచ్చిన నివేదికతోపాటు మాయమైన వారి జాడ ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియరాలేదు. ఆ ఎన్కౌంటర్లో మరణించింది రాయమల్లు, ఐలయ్యలే! 1988 డిసెంబర్ 27న అదృశ్యమైన గోపగాని ఐలయ్య.. బుర్ర రాయమల్లును పోలీసులు వారం రోజుల తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని నక్సల్ మృతి చెందినట్లు ప్రకటించిన పోలీసులు వారి మృతదేహాల ఫొటోలను పత్రికలకు విడుదల చేయలేదు. వారే మృతదేహాలను ఖననం చేశారు. కానీ, తర్వాతి రోజుల్లో పార్టీ నాటి ఎన్కౌంటర్లో చనిపోయింది వీరిద్దరేనని ధ్రువీకరించింది. గోపగాని ఐలయ్య, బుర్ర రాములును పోలీసులు పట్టుకునేందుకు కోవర్టుగా వ్యవహరించాడనే అనుమానంతో చత్రపతి శివాజీ అనే వ్యక్తిని పార్టీ హైదరాబాద్‌లోని బోయిన్పల్లి వద్ద చంపేసింది. -
గ్రీన్‌హంట్ మూడో దశలో భాగమే ఎన్కౌంటర్
► ఆర్కే ప్రాణాలకు హాని చేయకుండా కోర్టులో హాజరుపర్చాలి ► పోలీసుల చట్రంలోమీడియా, హైకోర్టు: విరసం నేత వరవరరావు వరంగల్: సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలకు దేశంలోని అటవీ ఖనిజ సంపదను దోచి పెట్టేందుకు చేపట్టిన గ్రీన్‌హంట్ మూడో దశఆపరేషన్-2016లో భాగంగానే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారన్నారు. బాక్సైట్ వెలికితీసేందుకు ఒప్పుకోని ఆదివాసీలు అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విలువైన ఖనిజ సంపద దేశ పార్లమెంటు బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువని.. సుమారు రూ.142 లక్షల కోట్ల విలువైందన్నారు. తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నంలో వాకపల్లి మహిళలు సామూహిక అత్యాచారాలకు గురైనా పోరాటం ఆపలేదన్నారు. ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటాలకు మావోయిస్టులు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వాలు ఎన్కౌంటర్ల పేరిట మారణకాండ జరుపుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన మీడియా సంస్థలు, హైకోర్టులు పోలీసుల చట్రంలో ఉండి వారు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. భోపాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంత మారణకాండ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం సరికాదన్నారు. పౌరహక్కుల సంఘం నేతలు పలుమార్లు హైకోర్టును ఆశ్రయిస్తే మా పరిధి కాదని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆర్కే ఆచూకీ కేంద్ర ప్రతినిధి ప్రతాప్, రాష్ట కమిటీ, ఏవోబీలు తెలియదని ప్రకటనలు ఇచ్చాయన్నారు. ఆర్కే ఆచూకీ ఒక్క పోలీసులకే తెలిసే అవకాశం ఉందన్నారు. ఆయనను కోర్టు ఆదేశాల మేరకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గురువారం వరకు గాయాలతోనైనా కోర్టులో అప్పగించాలని హైకోర్టు చెప్పిందన్నారు. పోలీసులు చంపడం, బహుళజాతి సంస్థలకు ఖనిజ సంపద అప్పగించడమే కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అవసరం ఉందని కోర్టు వాఖ్యానించడం అభినందనీయమని వరవరరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొన్నారు. భోపాల్ ఎన్కౌంటర్ దుర్మార్గం భోపాల్‌లో జరిగిన సిమి కార్యకర్తల ఎన్కౌంటర్ ఇంతకంటే దుర్మార్గమని వరవరరావు ఆరోపించారు. జైలు నుంచి తప్పించుకున్న సిమి కార్యకర్తలు భోపాల్ శివార్లో జరిగిన ఎన్కౌంటర్ మరణించడం అనుమానాలు తావిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై మీడియా, ప్రజాస్వామ్యులు స్పందించక పోవడం సరికాదన్నారు. మీడియా ఇలా తయారయ్యారకా నరహంతకుడు మోదీ ప్రధాని కాకుండా ఎలా ఉంటారు? సీఎంలు చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు, రమణ్‌సింగ్, నవీన్‌సింగ్‌తో పాట పడ్నవీస్లు సామ్రాజ్యవాద సంస్థలకు ఖనిజ సంపదను కట్టపెట్టేందుకే ఈలాంటి ఘటనలు చేయిస్తున్నారని అన్నారు. -
పక్కా సమాచారంతోనే కూంబింగ్!
► మొదట మావోలే మాపై కాల్పులు జరిపారు ► లొంగిపొమ్మని హెచ్చరించినా వినలేదు ► వారి కాల్పుల్లో కమాండో అబూ బాకర్ చనిపోయారు ► ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు ► హైకోర్టులో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మావోయిస్టు అగ్రనేతల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తరువాతనే గ్రేహౌండ్స్‌తో కలిసి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టామని విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హైకోర్టుకు నివేదించారు. కూంబింగ్ సందర్భంగా తారసపడ్డ మావోయిస్టులు తమపై మొదట కాల్పులు జరిపారని, తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారన్నారు. వారి కాల్పుల్లో మొదట పోలీసులే గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపామన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని శర్మ తెలిపారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బుధవారం కౌంటర్ దాఖలు చేశా రు. దీనికి సమాధానమిచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మావోలు ‘విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తూ స్థానికులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్ కమాండోస్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టులు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్రలకు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. గత నెల 24న రామగుహ పరిధికి పోలీసులు చేరుకున్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కమోండో సతీష్ గాయపడగా, మరో కమోండో అబూబాకర్ మృతి చెందారు. తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని హెచ్చరించినా మావోలు పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మేం కూడా ఎదురు కాల్పులు జరిపాం’ అని రాహుల్‌దేవ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ‘ఈ ఘటనపై చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో మొత్తం 24 మంది చనిపోయినట్లు ఒడిశా పోలీసుల ద్వారా తెలిసింది. ఇందులో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశాం. మిగిలిన మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో ఖననం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఘటన జరిగింది ఒడిశాలో. కేసు ఆ రాష్ట్ర పరిధిలోనే నమోదైంది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి.’ అని శర్మ తన కౌంటర్లో కోరారు. -
నేడు మావోల బంద్
జిల్లా పోలీసులు అలర్ట్ నగరంలో వాహనాల తనిఖీలు లాడ్జీల్లో సోదాలు నిజామాబాద్ క్రైం : ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గత నెల 25న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏవోబీలో ఎన్కౌంటర్లో అగ్రనేతలతో పాటు 30 మంది మృతిచెందడంతొ మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం మావోలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనాలను నగర శివారు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని పలు లాడ్జీలలో పోలీసులు విసృ్తతంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని వచ్చే వాహనాలను బోధన్రోడ్డులోని సారంగపూర్, హైదరాబాద్ రోడ్డులోని బోర్గాం(పి), ఆర్మూర్ రోడ్డులోని కంఠేశ్వర్ ప్రాంతం, వర్నిరోడ్డులోని నాగారం ప్రాంతాలలో ఆయా పోలీస్స్టేషన్ల ఎస్సైలు వాహనాలను తనిఖీ చేశారు. అలాగే జిల్లాలోని జాతీయ రహదారులపై బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం వరకు వాహనాలను తనిఖీలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానం వచ్చిన వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నగరంలోకి ఎందుకు వస్తున్నారు. ఎటు వెళ్తున్నారో వివరాలు సేకరించి వదిలిపెట్టారు. జిల్లాలో 1986 నుంచి నక్సల్స్ ప్రభావం తీవ్రమైంది. సిర్నపల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్, అలాగే కామారెడ్డి దళాల పేర్లతో కార్యకలాపాలు కొనసాగించారు. ప్రస్తుతం జిల్లాలో నక్సల్ కార్యకలాపాలు లేకున్నప్పటికి ైపోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మాజీలు, సానుభూతి పరులపై నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించినట్లు సమాచారం. ఇక నక్సల్స్ ప్రభావిత మండలాలు, గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తుకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
తక్షణమే ఆర్కేను కోర్టులో హాజరు పర్చాలి
కర్నూలు: ఏఓబీ ఎన్కౌంటర్లో పోలీసులు మావోయిస్టు అగ్రనేత రామకష్ణ(ఆర్కే)ను అదుపులోకి తీసుకొని ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో సరస్వతి నగర్లో బుధవారం చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగితే ఆంధ్రా డీజీపీనే మాట్లాడుతున్నారు తప్ప ఒరిస్సా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ బూటకమని, కాల్పుల్లో 32 మంది చనిపోతే అందులో ఆర్కే లేడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసుల అదుపులో ఉంటే ఆయనను త్వరగా బయటకు తెచ్చి కోర్టులో హాజరు పర్చాలన్నారు. మావోలు అడవుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోరాదని, వామపక్ష పార్టీల నాయకులతో కలసి పోరాడాలన్నారు. మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలసి ప్రజాసమస్యల పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఈనెల 15న విజయవాడలో అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.