
సాక్షి, విశాఖ: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన మావోయిస్టుల దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల సరిహద్దులోని పాములగెడ్డ, టిక్కరపాడు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల ఉన్నట్టు గుర్తించారు
అదే విధంగా మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మోహరింపు మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment