cumbing
-
1400 మంది భద్రతా బలగాల కూంబింగ్‌లో.. మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో సుమారు 11 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. మంగళవారం మావోయిస్ట్‌ల ఏరివేతే లక్ష్యంతో 1400 మంది భద్రతా బలగాలు జాయింట్ కూంబింగ్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే సమయంలో మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్ట్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పల్లో 11 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ ఐజి సుందర్ రాజ్ మావోయిస్ట్‌ల మృతి, కూంబింగ్‌ను ధృవీకరించారు. -
మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేస్తోన్న పోలీసులు
-
మూడు రాష్ట్రాల సరిహద్దులోనే... హరిభూషణ్?
సాక్షి , వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో యాక్షన్ టీంలు మళ్లీ రంగంలోకి దిగాయా? వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలే లక్ష్యంగా దాడులకు దిగనున్నారా? తెలంగాణలో పునర్వైభవం కోసం ఓవైపు మళ్లీ ప్రజాకోర్టులు, దాడులు, మరోవైపు ‘రిక్రూట్మెంట్’పై దృష్టి సారించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో 2019 డిసెంబర్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తెలంగాణ, ఆంధ్రా – ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యనేతలతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ప్లీనరీకి సంబంధించిన కీలకపత్రాలు నిఘావర్గాల చేతికి చిక్కాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ దళాలు దండకారణ్యం మూడు రాష్ట్రాల (తెలంగాణ– మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్) సరిహద్దు, గోదావరి, ప్రాణహిత మధ్య మకాం వేసినట్లు సమాచారం. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌టీంలు రంగంలోకి దిగినట్లు గుర్తించిన పోలీసులు మూడు నెలలుగా సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, అక్టోబర్ 10న రాత్రి ములుగు జిల్లా బోధాపూర్‌లో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వర్‌రావును మావోలు హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పోలీసుల కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లలో ఐదుగురు వరకు మావోయిస్టులు మృతి చెందగా, రెండు రోజుల కిందట ప్రజాకోర్టులో ఇద్దరిని ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు కాల్చి చంపడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీల పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎన్టీఎస్జెడ్సీ), ఆంధ్ర రాష్ట్ర కమిటీ, ఉత్తరాంధ్ర, ఒడిశాకు కలిపి ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ) కమిటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఎస్జెడ్సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్సీ)గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా... ఏఓబీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ జిల్లాలకు కలిపి (కేకేడబ్ల్యూ) డివిజినల్ కమిటీ ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో మావోయిస్టు పార్టీ కూడా తమ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరించింది. కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ను నియమించారు. ఇటీవల కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో రంగంలోకి దిగిన యాక్షన్ టీంలకు తెలంగాణ నాయకులు నాయకత్వం వహిస్తుండగా, దాడులకు మాత్రం ఛత్తీస్‌గఢ్ కేడర్‌నే వాడుతున్నారు. గత నెలలో ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత హత్య ఘటనకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వం వహించడమే ఇందుకు ఉదాహరణ. కాగా దండకారణ్యంలో పోలీసుల గాలింపు, నిఘా ముమ్మరం కావడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఉత్తర తెలంగాణ జిల్లాలను సేఫ్ జోన్‌గా ఎంచుకున్న మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తిరిగి కార్యకలాపాలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు జిల్లాలకో డివిజన్ కమిటీ పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని కొత్త కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి – కరీంనగర్ – భూపాలపల్లి జయశంకర్ – వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, దీనికి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం – మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, వీటికి సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలను కార్యదర్శులుగా నియమించారు. మంచిర్యాల – కొమురంభీం(ఎంకేబీ) డివిజినల్ కమిటీ నాయకత్వాన్ని ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు అప్పగించారు. అంతేకాకుండా ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్ – సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి డివిజినల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల – శబరి ఏరియా కమిటీ, లోకే సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేశారు. చర్ల – శబరి ఏరియా కమిటీకి మడకం కోసీ అలియాస్ రజిత నాయకత్వం వహిస్తున్నారు. ఇక చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునీల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్లు, ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వంలో వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీలు పని చేస్తున్నాయి. మొత్తంగా ఈ కమిటీలకు సారథ్యం వహిస్తున్న బడే దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ కోసం ప్రస్తుతం పోలీసుల వేట సాగుతోంది. -
మన్యంలో అలజడి!
సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్పల్లి పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తప్పించుకున్న ముఖ్య నాయకులు! కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం. తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. -
సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్ పోలీసులు
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. గత ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని పలిమెల మండల సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీంతో జిల్లా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రాజెక్టుల వద్ద భధ్రతను మరింతగా పెంచారు. రాత్రి, పగలు కూంబింగ్, చెకింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ మావోయిస్టులు, రాజకీయ నాయకుల కదలికలపై కూడా పోలీసులు నజర్ వేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే విచారించి వివరాలు ఆరా తీస్తున్నారు. వాహనాల తనిఖీలు పోలీసులు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెనల పైనుండి మçహారాష్ట్ర – తెలంగాణకు వస్తున్న వాహనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ధుృవీకరణ పత్రాలు, చిరునామాలు తెలుసుకునేందుకు మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అడవుల్లో నిరంతరం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపున ఉన్న మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్ మండలంలోని ఓడ రేవులపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిసింది. మరోపక్క వర్షాకాలం గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండనుండడంతో రోడ్డు మార్గాలపైన పోలీసులు నజర్ వేశారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వ వద్ద ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. పల్లెల్లో గుబులు! మంథని మాజీ ఎమ్మెల్యే పట్ట మధు, మాజీ ఏఎంసీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, గతంలో పనిచేసిన డీఎస్పీ కేఆర్కే. ప్రసాదరావుతో పాటు పలువురు రాజకీయనాయకులపైన మావోయిస్టులు మహదేవపూర్–ఏటూరునాగారం కమిటీల పేరిట కరపత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పల్లెల్లో ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆయా గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పట్టుకుని విచారించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఈనెల 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో మావోలు ఇటుగా గోదావరి దాటినట్లు ప్రచారం జరుగుతోంది. మారుమూల మండలం పలిమెల, మహాముత్తారం గ్రామాల్లో మాత్రం అటవీ ప్రాంతం కావడంతో జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో మావోలు అటుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లోని చోటమోట నాయకులతో పాటు మాజీ మావోయిస్టులు మండల కేంద్రంతో పాటు పట్టణాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కరపత్రాల విషయంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. మావోల కరపత్రాలు అసలా, నకిలివా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. భద్రత కట్టుదిట్టం.. జిల్లా ఇచ్చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్, కాటారం ఏఎస్పీ సాయిచైతన్య, సీఐలు నర్సయ్య, హతిరాం ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పిఎఫ్, డిస్ట్రీక్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోలు తెలంగాణ వైపు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా నిఘా తీవ్రతరం చేసి చర్యలు చేపడుతున్నారు. -
విశాఖ సరిహద్దులో కాల్పుల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్‌ను, 15 కిట్ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి విప్లవ సాహిత్యంతో పాటు పలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి 31న దుమ్ముగూడెం ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్, స్పెషల్ పార్టీ పోలీసులతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీనగరంలోని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా జొన్నగుడా గ్రామానికి చెందిన సవలం సోమా, మరొకరు సుకుమా జిల్లా పాలొడీ గ్రామానికి చెందిన మడివి ఉంగా అని గుర్తించినట్లు చెప్పారు. కాగా సోమా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్ కమాండర్ ఇడుమా వద్ద హెడ్‌క్వార్టర్ ప్లాటూన్‌లో సెక్షన్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, ఇడుమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గన్‌మెన్‌గా, కొరియర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మడివి ఉంగా మూడేళ్లుగా మా వోయిస్టు బెటాలియన్ కమాండర్ ఇడుమా పార్టీకి సానుభూతిపరుడిగా పనిచేస్తూ అవసరమైన సామాన్లు, మందుగుండు సామగ్రి, యూనిఫామ్, క్లాత్, చెప్పులు, బూట్లు సరఫరా చేస్తూ ఉండేవారని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో మూ డవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం లో ని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ యజమాని ఎండీ. ఖాదర్ యాసిన్బేగ్గా చెప్పారు. యాసిన్‌బేగ్ మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులను భద్రాచలం, విజయవాడ వెళ్లి కొనుగోలు చేసి సోమా, ఉంగాల ద్వారా మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. సోమా, ఉంగాల నుంచి డబ్బులు తీసుకుని, వారు అడిగిన పేలుడు పదార్థాలు, మందుపాతరలు, గ్రనేడ్ లాంచర్లు ఇతర పరికరాలు, జనరేటర్, వెల్డింగ్ మిషన్, ఐరన్ రాడ్స్ తెప్పించేవా డని వివరించారు. ఆదివారం యాసిన్ తెప్పించిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు సోమా, ఉంగా వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, క్లేమోర్ పైపులు, ఇతర పరికరాలతో పాటు భద్రాచలంలోని ప్రజా సంఘాల నాయకులకు అందజేసేందుకు తీసుకొచ్చిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్న సోమా సోమా ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలతో పాటు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ పోలీస్ సిబ్బందిపై దాడిచేసి హతమార్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరిం చారు. 2014లో సుకుమా జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని కసళ్లపాడు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో దాడి చేయగా 14మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసినట్లు తెలిపారు. 2015లో సుకుమా జిల్లాలో పిడమేలు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా ఏడుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయారని, ఈ దాడిలో ఎస్టీఎఫ్ కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసిన ఘటనలో సోమా పాల్గొన్నాడు. 2017లో సుకుమా జిల్లా కొత్తచెరువు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి, రోడ్డు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడి చేయగా 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ దాడిలోనూ ఆయుధాలను లూటీ చేయడం జరిగిందన్నారు. 2017లో సుకు మా జిల్లాలోని బుర్కాపాల్ వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి రోడ్ తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందగా, 20 తుపాకులు, ఇతర ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేసిన ఘటనలో సోమా పాలుపంచుకున్నారన్నారు. 2018 డిసెంబర్లో జారపల్లి వద్ద పామేడు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కూడా సోమా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ వివరించారు. అరెస్టు చేసిన సోమా, ఉంగా, యాసిన్‌లను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
ఏజెన్సీలో ఎన్నికలు కత్తిమీద సామే..
సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎన్నికల నిర్వహణంటే పెద్ద సవాలే. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరపడమంటే పోలీసు, రెవెన్యూ యంత్రాగానికి కత్తిమీద సామే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ సారి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కార్యచరణ రూపొందించారు. నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం నుంచి పోలింగ్ బూత్‌లకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళిక తయారుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఏడు మండలాలుండేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోని భద్రాచలం డివిజన్ నుంచి నాలుగు మండలాలు కలిశాయి. దీంతో రాష్ట్రంలోనే భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం నిలిచింది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్నాయి. మావోలు చొరబడే అవకాశం ఉండడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని చింతూరు మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి 397 పోలింగ్ బూత్‌లు రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల పరిధిలో 397 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా లేకుండా కొత్త పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 3,49,913 మంది జనాభా ఉండగా.. 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 4,25,658 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం, 183 పంచాయతీలున్నాయి. నియోజకవర్గంలో 174 పోలింగ్ కేంద్రాల్ని అతి సమస్యాత్మకంగా గుర్తించారు. వీటిలో 104 మావో ప్రభావిత ప్రాంతాలున్నాయి. మారేడుమిల్లి మండలంలో 27, చింతూరు మండలంలో 11 పోలింగ్ బూత్‌లు, అడ్డతీగలలో 10, వై.రామవరం మండలంలో 17 పోలింగ్ బూత్‌లపై మావోల ప్రభావం ఉండవచ్చని నిర్ధారించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. 2004 ఎన్నికల్లో వై.రామవరం మండలంలోని విశాఖ సరిహద్దులో హింస చోటుచేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ బూత్‌ల నుంచి ఈవీఎంలను తరలించేందుకు రెండు హెలికాప్టర్లు వాడతారని తెలుస్తోంది. రంగంలోకి ప్రత్యేక బలగాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బలగాలు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలు పోలీసుల అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. పారా మిలటరీ బలగాలతోపాటు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పార్టీల్ని రంగంలోకి దింపారు. ఎన్నికల నిర్వహణ అంశంపై చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇటీవల తెలంగాణలో సమావేశమయ్యారు. – గురుకుల నారాయణ, రంపచోడవరం -
దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు
-
‘పోలీసులకు తగిన గుణపాఠం చెబుతాం’
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని జేగురు కాండు అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మరోసారి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు చనిపోగా, ఆ కాల్పుల్లో తప్పించుకున్న వారికోసం నిన్నటి నుంచి దండకారుణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం సుక్మాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడటంతో మరోసారి కాల్పులు మోత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లు బూటకం మరోవైపు మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమని మావోయిస్టు పార్టీ నేత జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోరుబిడ్డలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలో పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని జగన్ పేర్కొన్నారు. -
ఏవోబీలో విస్తృత తనిఖీలు
సాక్షి, విశాఖ: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన మావోయిస్టుల దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల సరిహద్దులోని పాములగెడ్డ, టిక్కరపాడు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల ఉన్నట్టు గుర్తించారు అదే విధంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మోహరింపు మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న కూంబింగ్
అయిరాల: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం చెడిపోవడంతో వాహనంతో పాటు దుంగలను అందులోనె వదిలేసి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తవేరా వాహనంలో 14 ఎర్ర దుంగలను తరలిస్తుండగా.. గేర్ రాడ్డుకు అడ్డంగా ఓ దుంగ ఇరుక్కోవడంతో వాహనం మొరాయించింది. ఇది గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే బయపడిన దుండగులు దుంగలతో పాటు వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా అయిరాల మండలం చెంగన్నపల్లి గ్రామ సమీపంలోని పెద్దకొండ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. దుంగలను పాటూరు నుంచి కానిపాకం తీసుకెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకొని స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్మగర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
శేషాచల అడవుల్లో కూంబింగ్
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని బొమ్మాజి కొండ వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘురామ్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులకు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అధికారులను చూసిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పరారైన కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
'నల్లమలలో కూంబింగ్ కొనసాగుతుంది'
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేకపోయినా కూంబింగ్ కొనసాగుతుందని మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు తెలిపారు. ఎర్రగొండపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకే ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించేలా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, గురువారం నాటికి వెయ్యి కేసులు నమోదు చేశామని వివరించారు. ఎర్రగొండపాళెంలో నిఘా కెమెరాలను అమర్చామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి త్వరలో ఈ చలానాలు జారీ చేస్తామన్నారు. -
ఆదిలాబాద్ అడవుల్లో భారీ కూంబింగ్
ఆదిలాబాద్: టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ వ్యవహారంతో తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. కూంబింగ్‌లు, అనుమానితుల అరెస్టులతో తెలంగాణ జిల్లాలు ఉద్రిక్తంగా మారాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న రిజర్వు ఫారెస్టులో గురువారం నుంచి భారీగా కూంబింగ్ కొనసాగుతోంది. శుక్రవారం కూడా సుమారు 400 మంది పోలీసులు 14 బృందాలుగా విడిపోయి అడవుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. 30 నుంచి 50 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా చర్లలో బుధవారం కిడ్నాప్‌నకు గురైన నేతల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలతో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గిరిజనులు వణికిపోతున్నారు. -
విజయనగరం ఏజెన్సీలో కూంబింగ్
విజయనగరం: మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో విజయనగరం జిల్లాలో భద్రతా దళాల తనిఖీలు ముమ్మరం చేశాయి. గురువారం ఉదయం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. అదే విధంగా మక్కువ మండలంలోని దుగ్గేరు గ్రామ వార సంతలో బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహన్రావు, ఎస్సై సిరిపురపు రాజు పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో అలజడి
చర్ల, న్యూస్‌లైన్ : ఆంధ్రా- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల అన్వేషణ పేరుతో పెద్ద ఎత్తున చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు ఈ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో సరిహద్దు గ్రామాల ఆదివాసీలు భయాందోళనలకు గురవుతున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల గ్రామాలలో ప్రత్యేక బలగాల భద్రతతో చేపట్టిన అబివృద్ధి పనులకు విఘాతం కలిగించడంతో పాటు, బలగాలను టార్గెట్ చేసేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేసి సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టినట్లు తెలిసింది. దీనికి తోడు ఈనెల 15న దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి సమీపంలో గల బట్టిగుంపులో కోడిపందేలు చూసేందుకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎస్పీవో మడవి సోమయ్య ను మావోయిస్టు మిలిటెంట్లు హతమార్చారు. ఈ ఘటన మావోయిస్టులు సంచరిస్తున్నారన్న అనుమానానికి బలం చేకూరుస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే దండకారణ్య ప్రాంతానికి భారీగా బలగాలను తరలించి గత మూడు రోజులుగా కూంబింగ్ చేపడుతున్నారు. పెద్ద ఎత్తున చేరుకున్న బలగాలను చూసిన సరిహద్దు ప్రాంతంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, కుర్నపల్లి, కొండెవాయి, నిమ్మలగూడెం, కరిగుండం, యాంపురం, జరుపల్లి, తోగ్గూడెం తదితర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు పలువురు ఆదివాసీలను అదుపులోకి తీసుకోవడం, తామెవరినీ అదుపులోనికి తీసుకోలేదంటూ ప్రకటించడం, ఆ తరువాత మళ్లీ వారిని అరెస్ట్ చేశామంటూ ప్రకటనలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా వారు అలాంటి చర్యలకు పాల్పడతారేమోనని భయపడుతున్నారు. 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...! ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సమీపంలో గల చర్ల మండలం ఎర్రంపాడు, చెన్నాపురం గ్రామాలకు చెందిన సుమారు 40 మంది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈ రెండు గ్రామాలలోకి చేరి నిద్రిస్తున్న ఆదివాసీలను లేపి బలవంతంగా అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తామెవ రినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటిస్తుండడంతో ఆదివాసీల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా ఎర్రంపాడు గ్రామంలోకి వెళ్లిన పోలీసులు.. అక్కడ తొమ్మిది మందిని, ఆ తర్వాత చెన్నాపురంలో 35 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో పురుషులు, మహిళలతో పాటు 10-15 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెదమిడిసిలేరు శివారు గీసరెల్లి సమీపంలో గల జమాయిల్ తోటలోకి తీసుకొచ్చారని, అక్కడి నుంచి ఎర్రంపాడుకు చెందిన తొమ్మిది మందిలో గ్రామ పటేల్‌తో పాటు మరో ఇద్దరిని విడిచిపెట్టారని తెలిసింది. అయితే పోలీసులు మాత్రం తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని చెపుతున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేక ఆదివాసీలే భయపడి గ్రామం విడిచి వెళ్లిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ ఒకరి అరెస్ట్.. ఒక బడా స్మగ్లర్ వివరాలు లభ్యం భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లో ఎర్రచందనం దొంగలు - అటవీ, పోలీసు సిబ్బందికి మధ్య శనివారం పరస్పర దాడులు జరిగారుు. పోలీసులు ఒక దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక బడా స్మగ్లర్ ఆచూకీ తెలిసింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో స్మగ్లర్లను గాలిస్తూ వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు 9 కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్రచందనం దొంగ కూలీలను పోలీసులు గుర్తించారు. వారు పోలీసులను చూడగానే రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో వారు పరుగులు తీశారు. ఎం.శివయ్య అనే వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అందరూ చిన్నగొట్టిగల్లు వుండలం చిట్టేచెర్ల పంచాయుతీ తువ్ముచేనుపల్లె గ్రామానికి చెందిన వారిగా వెల్లడైంది. ఆ గ్రామానికి చెందిన గూటాల కృష్ణారెడ్డి ఎర్రచందనం దుంగలను తీసుకురవ్ముని పంపించినట్లు వెల్లడైరుుంది. దీంతో అటవీశాఖాధికారులు, పోలీసులు తువ్ముచేనుపల్లెలోని కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను పరారయ్యూడు. అతనికి సంబంధించిన ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇతని కువూరుడు ఏసీబీ ఉద్యోగి కావటం విశేషం. భాకరాపేట కేంద్రంగా తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, పీలేరు సీఐ పార్థసారథి వుకాం వేసి కూంబింగ్ కొనసాగిస్తున్నారు.