శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
ఒకరి అరెస్ట్.. ఒక బడా స్మగ్లర్ వివరాలు లభ్యం
భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లో ఎర్రచందనం దొంగలు - అటవీ, పోలీసు సిబ్బందికి మధ్య శనివారం పరస్పర దాడులు జరిగారుు. పోలీసులు ఒక దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక బడా స్మగ్లర్ ఆచూకీ తెలిసింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో స్మగ్లర్లను గాలిస్తూ వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు 9 కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్రచందనం దొంగ కూలీలను పోలీసులు గుర్తించారు. వారు పోలీసులను చూడగానే రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో వారు పరుగులు తీశారు.
ఎం.శివయ్య అనే వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అందరూ చిన్నగొట్టిగల్లు వుండలం చిట్టేచెర్ల పంచాయుతీ తువ్ముచేనుపల్లె గ్రామానికి చెందిన వారిగా వెల్లడైంది. ఆ గ్రామానికి చెందిన గూటాల కృష్ణారెడ్డి ఎర్రచందనం దుంగలను తీసుకురవ్ముని పంపించినట్లు వెల్లడైరుుంది. దీంతో అటవీశాఖాధికారులు, పోలీసులు తువ్ముచేనుపల్లెలోని కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను పరారయ్యూడు. అతనికి సంబంధించిన ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇతని కువూరుడు ఏసీబీ ఉద్యోగి కావటం విశేషం. భాకరాపేట కేంద్రంగా తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, పీలేరు సీఐ పార్థసారథి వుకాం వేసి కూంబింగ్ కొనసాగిస్తున్నారు.