చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్‌ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు.
ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment