
ముంబై విమానాశ్రయంలో ప్రయాణికుడి అరెస్టు
ముంబై: రూ.6.3 కోట్ల విలువైన 6.7 కేజీల బంగారాన్ని బూట్లలో దాచి తరలిస్తున్న ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్టు చేసింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
శనివారం బ్యాంకాక్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడిని సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అడ్డుకున్నారు. పరిశీలించగా అతను ధరించిన బూట్లలో రూ.6.3 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారు కడ్డీలు బయటపడ్డాయి. విచారణలో స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. అతన్ని కూడా డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.