ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP
— ANI (@ANI) January 10, 2023
ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు.
గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు.
చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment