cocaine seized
-
ఢిల్లీలో డ్రగ్స్.. రూ. 2,000 కోట్ల కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2వేల కోట్ల విలువైన 565 కిలోల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.2000కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్ విషయంలో మరింత అప్రతమయ్యారు. Delhi Police busted an international drug syndicate and seized more than 560 kgs of cocaine. 4 people arrested. The cocaine is worth more than Rs 2000 Crores in the international market. Narco-terror angle being investigated: Delhi Police Special Cell— ANI (@ANI) October 2, 2024ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. కాగా, ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో విందులో కొకైన్ తీసుకున్నట్టు గుర్తించారు. ఇక, హోటల్లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఉన్నారు. -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో కింగ్ పిన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నివారణకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సప్లై మాత్రం ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. సైబరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. కాగా, డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్‌గా ఉన్న చింతా రాకేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ ముఠా.. ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. తాజాగా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు.. అసలు విషయం తెలిసి షాక్! -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత
ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్‌కు చెందిన ఈ మహిళ ఆడిస్‌అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్ బయటపడటంతో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ విభాగం అధికారులు చెప్పారు. చదవండి: యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం -
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
గోవా నుంచి మత్తు పదార్థాలు రవాణా చేసిన ముఠా అరెస్టు
-
న్యూఇయర్ టార్గెట్: గ్రాము ‘కొకైన్’ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా తయారైంది కొకైన్ . గోవా నుంచి గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున దిగుమతి చేసుకొని... హైదరాబాద్‌లో రూ.14 వేలకు విక్రయిస్తున్న ఓ పెడ్లర్‌తో సహా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ డీసీపీ జి.సందీప్‌తో కలిసి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం.. ♦ బాచుపల్లికి చెందిన రామేశ్వర శ్రవణ్ కుమార్ (24), కొండాపూర్‌కు చెందిన గోరంట్ల చరణ్ తేజ (27) స్నేహితులు. న్యూ ఇయర్ వేడుకలను కొకైన్ మత్తులో తేలిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ టోలిచౌకికి చెందిన అరబిక్ టీచర్ మహ్మద్ అష్రఫ్ బేగ్ (37)ను సంప్రదించారు. చెరో గ్రాము కొకైన్ కొనుగోలు చేశారు. ♦ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ పి.శివ ప్రసాద్ తన బృందంతో రాయదుర్గం పీఎస్ పరిధిలోని గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ ఫ్లాట్ నం. బి–1305లో ఇద్దరు వినియోగదారులు శ్రవణ్, చరణ్ తేజలను అదుపులోకి తీసుకున్నారు. ♦ఇద్దరి నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకుని వారిని విచారించగా టోలిచౌకిలోని మహ్మద్ అష్రఫ్ బేగ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో అష్రఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. వ్యక్తిగత ఫోటోలు పంపు, నీ కష్టాలు తీరుస్తానంటూ.... ♦అఫ్రష్ నుంచి 181 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను నుంచి 183 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలు, మూడు సెల్ఫోన్లు పట్టబడ్డాయి. వీటి విలువ రూ.26.28 లక్షలు. ♦అష్రఫ్‌ను పోలీసులు విచారించగా.. ప్రధాన డ్రగ్ సరఫరాదారు నైజీరియాకు చెందిన జూడ్ అలియాస్ క్రిస్ దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నైజీరియా దేశం నుంచి గోవాకు వచ్చి అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ♦కొంత కాలంగా గోవా నుంచి డ్రగ్స్‌ను దిగుమతి చేసుకొని హైదరాబాద్‌లో వ్యక్తిగత కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అష్రఫ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయిర్ గోవాలో ఉంటున్న జూడ్ పరారీలో ఉన్నాడు. చదవండి: బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో.. ఈ ఏడాది 202 కేసులు.. ♦ కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరా ఉంటుందని సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బల్క్ సప్లయర్స్, స్థానిక రిటైలర్లు, సరఫరాదారులు, వినియోగదారులపై దాడులు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. ♦ ఈ ఏడాది ఇప్పటివరకు 202 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. 419 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 23 మందిపై పీడీ యాక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 1,770.8 కిలోల గంజాయి, 37.2 కిలోల 124 గంజాయి మొక్కలు, 14 గాంజా మాత్రలు, 8.55 లీటర్ల హషీప్ ఆయిల్, 150 ఎంజీ 12 లైరికా మాత్రలు, 141 కిలోల ఆల్ప్రాజోలం, 116.29 గ్రాముల ఎండీఎంఏ, 200 గ్రాముల ఓపీఎం, 61 ఎక్స్టసీ మాత్రలు, 3 ఎల్సీడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం.. ఉమ్మడి రాష్ట్రంలో 63 గ్రాముల కొకైన్ హైదరాబాద్ పరిధిలో అప్పట్లో పట్టుబడింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక కొకైన్ కేసుగా నిలవగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలో 183 గ్రాముల కొకైన్ కేసు బయటపడటంతో ఇదే అత్యధికమని సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ సందీప్ తెలిపారు. -
కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్
బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడినిక స్కాన్ చేయగా.. పొట్టలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీశారు. కాగా కొకైన్ విలువ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండిఎంఏ, 15 గ్రాముల ఛరాస్ స్వాధీనం చేస్తున్నారు. యెమన్ దేశస్తుడితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80 వేల నగదు, రెండు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రూ.1000 కోట్లు విలువైన కొకైన్ పట్టివేత
తూత్తుకుడి: విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు అడ్డ అయితే.. ఓడరేవులు డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా మారుతున్నాయి. తమిళనాడులో మైండ్ బ్లాంక్ అయ్యేలా భారీ ఎత్తున మత్తు పదార్దాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఇతర దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా వేలాది కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవీఓసీ ఓడరేవు వద్ద విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేసిన రూ.1000 కోట్లు విలువైన కొకైన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి ఓడ ద్వారా రవాణా చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల తూత్తుకుడిలోని ఓడరేవు వద్దకు వచ్చిన ఓడ కంటైనర్లను అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కలప కంటైనర్‌లోని సంచుల్లో సుమారు 400 కిలోగ్రాముల కొకైన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొకైన్ ఎక్కడ నుంచి వచ్చిందో నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున భారీగా మాదకద్రవ్యాలను పంపించారో పోలీసులు విచారిస్తున్నారు. కంటైనర్ ఎవరిది? ఇది ఎక్కడ నుండి వచ్చింది.. ఎవరు ఆదేశించారు.. అందులో డ్రగ్స్ ఎవరు పెట్టారో తెలుసుకోవడానికి చెన్నై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పోర్టు ఉద్యోగులు, అటు నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారుతుంటే, ఓడరేవులు మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రాలుగా మారుతున్నాయి. తమిళనాడు విమానాశ్రయంలో ఇటీవల జరిపిన సోదాల్లో వందల కిలోల బంగారం అక్రమంగా దొరికింది. షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా ఇటీవల పెరిగింది. మాదకద్రవ్యాలను తరచూ రవాణా చేస్తుండగా సీజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి. 4 వందల కిలోల కొకైన్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. చదవండి: ఉరి తాడుగా మారిన ఉయ్యాల -
కోల్‌కతా విమానాశ్రయంలో కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ విదేశీయుడిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.కోటి విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ 170 గ్రాములు ఉంటుందని, కెవిన్ ఎడ్వర్డ్ అనే ఇతను ఇక్కడి నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం ముంబై నుంచి వచ్చిన విమానంలో ఇక్కడికి వచ్చాడని కోల్‌కతా జోనల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఇక్కడ వివరించారు. నిందితుడు ఢిల్లీలోని ఐజీఐ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మన దేశంలోకి వచ్చాడని, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. ముంబైలో ఉంటున్న మరో నైజీరియన్ జాన్ అలియాస్ టోనీ ఇతనికి ఈ పని అప్పగించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
రూ.2 కోట్ల కొకెన్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన ఐదు కిలోల కొకైన్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. హొసకోటె సమీపంలోని తోరవనహళ్లి వద్ద దాబా సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. జిల్లా ఎస్పీ రమేష్బానోత్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. హొసకోటె తాలూకాకు చెందిన దివాకర్, రామాంజనప్ప, నరసింహమూర్తి, రాజేశ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి... కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
రెండు టన్నులు కోకైన్ పట్టివేత
ఇటలీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు ఉన్నతాధికారుల పటిష్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇటలీలోని దక్షిణాన గల కలబ్రియా ప్రాంతంలో రెండు టన్నుల కోకైన్ను ఉన్నతాధికారులు స్వాధీనం చేస్తుకుని సీజ్ చేసినట్లు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. అందుకు సంబంధించి 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పింది. భారీగా పట్టుబడిన కోకైన్ను దక్షిణ అమెరిక దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారని పేర్కొంది. ఇటలీలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా వ్యవహారిస్తుంది. ఆ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా కోరలు కత్తరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారించాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఇటలీ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల సహాయంతో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ పోర్ట్‌లో 75 కేజీల కోకైన్ పట్టివేత
పెద్ద మొత్తంలో (కోకైన్) డ్రగ్స్‌ను అక్రమంగా విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను మెరాకో కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 75 కేజీల కోకైన్ను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. కారు విడి భాగాలు, బ్యాగులు, డెకరేషన్ ఐటమ్స్ చాటున కోకైన్ ఉంచి విదేశాలకు తరలించేందుకు వారు ప్రయత్నించారని ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారి అబ్దుల్లాహది సిబా వెల్లడించారు. నిందితులిద్దరిని మెరాకో పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ. 40 కోట్ల విలువైన ఎనిమిది కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఈ మాదకద్రవ్యాన్ని శుక్రవారం స్థానిక ఐదు నక్షత్రాల హోటల్లో స్వాధీనం చేసుకొని అమోబీ చిజిఓకే ఒబినికా అనే నైజీరియన్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో ఓ ఖరీదైన లాడ్జికి అమోబీ దీనిని తీసుకెళ్తుండగా అరెస్టు చేశామని ఎన్సీబీ తెలిపింది. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది ఇంత భారీగా కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో మత్తుమందుల వ్యవసపరులు దీనిని తీసుకోవడానికి చాలా ఇష్టపడుతారని ఎన్సీబీ డెరైక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ తెలిపారు. అయితే ఈ నెల 26న ఢిల్లీకి వచ్చిన నిందితుడు కొకైన్‌ను తన వెంట తీసుకురాకుండా వేరే విమానంలో పార్సిల్ బుక్ చేశాడు. మరునాడు అది ఇతని హోటల్ గదికి కొరియర్లో రావాల్సి ఉంది. ఇతని కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు నిఘా వేశారు. హోటల్ లాబీలో ఇతడు కొరియర్ కోసం ఎదురుచూస్తుండగానే అరెస్టు చేశారు. అమోబీపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని, అయితే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగ్ చెప్పారు. విద్యార్థులకు భారీగా డ్రగ్స్ అందుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. అన్మోల్ సర్నా అనే ఎన్ఐఆర్ విద్యార్థి ఇటీవల మాదకద్రవ్యాలు వికటించడంతో హింసాత్మకంగా మారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే.