పెద్ద మొత్తంలో (కోకైన్) డ్రగ్స్ను అక్రమంగా విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను మెరాకో కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 75 కేజీల కోకైన్ను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు.
కారు విడి భాగాలు, బ్యాగులు, డెకరేషన్ ఐటమ్స్ చాటున కోకైన్ ఉంచి విదేశాలకు తరలించేందుకు వారు ప్రయత్నించారని ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారి అబ్దుల్లాహది సిబా వెల్లడించారు. నిందితులిద్దరిని మెరాకో పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది.