సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నివారణకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సప్లై మాత్రం ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
వివరాల ప్రకారం.. సైబరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్ ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. కాగా, డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్‌గా ఉన్న చింతా రాకేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ ముఠా.. ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు.. అసలు విషయం తెలిసి షాక్!
Comments
Please login to add a commentAdd a comment