ఢిల్లీలో డ్రగ్స్‌.. రూ. 2,000 కోట్ల కొకైన్‌ స్వాధీనం | Biggest Drug Bust In Delhi 500 kg Cocaine Seized | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 2000 కోట్ల కొకైన్‌ స్వాధీనం

Published Wed, Oct 2 2024 2:55 PM | Last Updated on Wed, Oct 2 2024 3:56 PM

Biggest Drug Bust In Delhi 500 kg Cocaine Seized

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2వేల కోట్ల విలువైన 565 కిలోల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ దాదాపు రూ.2000కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ​్యక్తం చేస్తున్నారు.

అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్‌ విషయంలో మరింత అప్రతమయ్యారు. 

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్‌.. రైల్వేస్టేషన్‌లకు బాంబు బెదిరింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement