బస్టాప్‌లు, నిర్మానుష్య ప్రాంతాలే అడ్డాలు
సైబరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్స్
నెల రోజుల్లో 53 మంది మహిళలు,ట్రాన్స్‌జెండర్ల బైండోవర్
మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో బస్టాప్‌లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లను బైండోవర్ చేశారు.
వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్‌తో పాటు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్‌పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 7 మంది ఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు.
బుధవారం రాత్రి భాగ్యనగర్ బస్టాప్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లను బైండోవర్ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టంలోని సెక్షన్–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం–1956 కింద కూకట్‌పల్లిలో మూడు, కేపీహెచ్‌బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్స్‌లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment