కోల్‌కతా: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ విదేశీయుడిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.కోటి విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ 170 గ్రాములు ఉంటుందని, కెవిన్ ఎడ్వర్డ్ అనే ఇతను ఇక్కడి నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం ముంబై నుంచి వచ్చిన విమానంలో ఇక్కడికి వచ్చాడని కోల్‌కతా జోనల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఇక్కడ వివరించారు. నిందితుడు ఢిల్లీలోని ఐజీఐ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మన దేశంలోకి వచ్చాడని, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. ముంబైలో ఉంటున్న మరో నైజీరియన్ జాన్ అలియాస్ టోనీ ఇతనికి ఈ పని అప్పగించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment