NCB officers
-
డ్రగ్ గుట్టు రట్టు 95 కిలోలు స్వాధీనం
-
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పక్కకు తప్పించింది. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. అయితే ఆ కార్యకలాపాలు ఏంటన్నవి ఎన్సీబీ వెల్లడించింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్, 17 మందికి బెయిల్ దొరికింది. ఇద్దరు ఇంకా జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి మృతి -
ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
ముంబై: మహరాష్ట్రలో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. తాజాగా, ముంబైలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 4 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా.. సహర్ కార్గో కాంప్లెక్స్‌లో 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: నలుగురు అరెస్ట్: పాదరక్షలు తీయకుండ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం -
ఆంధ్రప్రదేశ్‌పై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం
సాక్షి, అమరావతి: తప్పుడు వార్తలతో రాష్ట్రంపై విషం చిమ్మడంలో ‘ఈనాడు’ పత్రిక కొత్త పుంతలు తొక్కుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌లలో జప్తుచేసిన డ్రగ్స్ బాగోతాన్ని పూర్తిగా రాష్ట్రానికి ఆపాదించేసింది. ఈనాడు హైదరాబాద్ ఎడిషన్‌లో ఎన్సీబీ అధికారులు చెప్పిన వాస్తవాలను ప్రచురించగా.. అదే వార్తను ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో మాత్రం వక్రీకరించి ‘ఈనాడు’ మార్కు ఎల్లో జర్నలిజాన్ని చాటుకుంది. వివరాలివీ.. మహిళలు ధరించే లెహంగాల్లో ఓ ముఠా సింథటిక్ డ్రగ్స్‌ను దాచిపెట్టి హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించే ప్రయత్నం చేసింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇవి పట్టుబడ్డాయి. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయటంతో... ఏపీలోని నరసాపురం నుంచి బుక్ చేసినట్లు తప్పుడు చిరునామాలు సృష్టించారని ఎన్సీబీ అధికారుల విచారణలో బయటపడినట్లు వెల్లడించారు. జాతీయ మీడియా మొత్తం ఇదే రాసింది. హైదరాబాద్ ఎడిషన్‌లో ‘ఈనాడు’ కూడా కొంచెం అటూఇటుగా ఇదే రాసింది. చదవండి: (పూర్తి చేస్తోంది ఇప్పుడే..) మరో సంఘటనలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న ఓ నలుగురిని అరెస్టు చేసి... వారి వద్ద పార్టీల్లో వాడే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని హైదరాబాద్‌లో పలు పార్టీల్లో వాడటానికి తెస్తున్నట్లుగా ఎన్సీబీ నిర్ధరించింది. ఈ ఘటనలో హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురూ బీహారీలు. హైదరాబాద్ ఎడిషన్‌లో ‘ఈనాడు’ కూడా అదే రాసింది. కాకపోతే ఇక్కడ కూడా లెహెంగాల్లో దాచి తెస్తున్నట్లు రాసిపారేసింది. ‘ఏపీ’ ఎడిషన్‌లో పూర్తి విరుద్ధంగా... ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు వచ్చేసరికి ‘ఈనాడు’ అని విలువలూ వదిలేసింది. ఈ రెండింటినీ కలిపేసి ఒకే సంఘటనగా రాసిపారేసింది. అదే సంఘటనలో నరసాపురం నుంచి బుక్ చేసిన డ్రగ్స్‌ను బెంగళూరులో పట్టుకున్నారని, లెహెంగాల్లో దాచిన వీటిని స్వాధీనం చేసుకోవటంతో పాటు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారని రాసేసింది. అంటే... ఏపీ వ్యక్తులు... ఏపీ నుంచి డ్రగ్స్ రవాణా చేసినట్లు చెప్పటమన్నమాట. ‘సాక్షి’తో సహా జాతీయ మీడియా మాత్రం ఈ రెండింటినీ వేర్వేరు ఘటనలుగానే... ఎన్సీబీ చెప్పినట్టే రాశాయి. మరి ‘ఈనాడు’ మాత్రమే ఎందుకిలా తప్పుడు రాతలు రాసినట్లు? ఆంధ్రప్రదేశ్ కాబట్టా? -
రూటుమార్చినా దొరికాడు!
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న కింగ్‌పిన్ బాబూ ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పట్టుకుంది. చాలాకాలంగా బాబూ ఖాలే కోసం గాలిస్తున్న ఎన్సీబీ.. ఈసారి అత్యంత పకడ్బందీ ఆపరేషన్ చేపట్టి అతడిని అరెస్టు చేసింది. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఏడాది భారీగా గంజాయి సాగు చేశారు. లాక్డౌన్, విస్తారంగా కురిసిన వర్షాలు దానికి తోడయ్యాయి. లాక్డౌన్ ఎత్తేశాక మహారాష్ట్ర, బెంగళూరులో గంజాయి మార్కెట్, అక్రమ రవాణా పెరిగాయి. కొద్దినెలలుగా ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు గంజాయి గుట్టుగా తరలిపోతోందని ఎన్సీబీకి సమాచారం వచ్చింది. దానికితోడు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ ముఠాలు గంజాయిని వీలైనంత ఎక్కువగా రవాణా చేసే పనిలో పడ్డాయి. ఈ సమాచారంతో నాలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న గంజాయి రవాణాపై నిఘా పెంచారు. హైదరాబాద్, కర్ణాటక మీదుగా.. ఎన్సీబీ అధికారులు ఈ గంజాయి నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పార్సిళ్లు తరలివెళ్తున్న మార్గాలను గుర్తించారు. హైదరాబాద్, కర్ణాటక మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్న సమయంలో స్మగ్లర్లు రెండు రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. తొలుత ఏపీలోని సీలేరు, చింతపల్లి నుంచి తెలంగాణలోకి భద్రాచలం వరకు తెస్తున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదనుకుంటే ఖమ్మం–సూర్యాపేట మార్గం మీదుగా తరలిస్తున్నారు. నిఘా పెరిగిందనుకుంటే.. భద్రాచలం చేరుకున్నాక రూటు మార్చి.. ఖమ్మం–వరంగల్ మార్గంలో ఘట్‌కేసర్‌పై ఔటర్ రింగురోడ్డు ఎక్కుతారు. తర్వాత సంగారెడ్డి-జహీరాబాద్ రూట్లో కర్ణాటకలోని హుమ్నాబాద్, బసవకల్యాణ మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్నారు. కాపుకాసి.. పట్టుకుని.. గంజాయి రాకెట్ కోసం చాలాకాలంగా కాపుగాస్తున్న ఎన్సీబీ అధికారులు.. పెద్ద అంబర్‌పేట వద్ద మార్చి 31వ తేదీన బాబూఖాలేకు చెందిన బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని, రూ.65 లక్షల విలువైన 332 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను గట్టిగా విచారించగా.. బాబూ ఖాలే నెట్‌వర్క్‌పై అవగాహన వచ్చింది. దీంతో రెండో రూటులోనూ దృష్టిపెట్టి.. ఏప్రిల్ 4న ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక ఐషర్ ట్రక్కును పట్టుకున్నారు. ఐషర్ ట్రక్కు క్యాబిన్‌కు, ట్రాలీకి మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో 694 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.4 కోట్లు ఉంటుంది. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఐదుగురిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనే నెట్వర్క్ సూత్రధారి బాబూ ఖాలే కూడా ఉండటం విశేషం. అధికారులు అందరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి -
ఆరోపణలు రుజువైతే రియాకు పదేళ్ల జైలు!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని బుధవారం ఉదయం పోలీసులు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. డ్రగ్స్ కేసులో మూడు దశలుగా రియాను విచారించిన నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు నిన్న(మంగళవారం) రియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన మేజిస్ట్రేట్ రియాకు బెయిలును తిరస్కరించి 14 రోజుల పాటు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రంతా రియా ఎన్సీబీ కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది. అయితే రేపు రియా బెయిలు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ముంబైలో మహిళలకు ఉన్న ఏకైక జైలు బైకుల్లా జైలు. ఈ జైలులోనే కోరీగావ్-భీమాలోని షీనా బోరా హత్య కేసలో ప్రధాన నిందితులుగా అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జీయా, కార్యకర్త సుధా భరద్వాజ్ సహా మరి కొందరు మహిళ ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. (చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!) (చదవండి: బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా) కాగా, ఈ కేసులో రియా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఆరోపణలను ఎదుర్కొంటోంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన మూడు రోజుల విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు వెల్లడైంది. మూడవ దశ విచారణలో రియా డ్రగ్స్ దందాలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని 25 మంది పేర్లు, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఎన్సీబీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్, శామ్యూల్ మిరాండా సహా సుశాంత్ వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులను కూడా పోలీసలు ఆరెస్టు చేసి జైలుకు తరలించారు. (చదవండి: రియా చక్రవర్తి అరెస్ట్) -
బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా
సాక్షి, ముంబై: సుశాంత్ మృతితో వెలుగు చూసిన డ్రగ్ కేసులో కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాను తాము సిద్ధం చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉన్నతాధికారి తెలిపారు. వారి పేర్లను సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచారణలో వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుశాంత్ మృతి కేసులో రియాను విచారిస్తున్న క్రమంలో డ్రగ్ కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ వేగవంతం చేసేందుకు రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. అదివారం రియాకు కూడా సమాన్లు జారీ చేసి మూడు దశలుగా విచారణ చేపట్టారు. ఇవాళ జరిగిన మూడవ దశ విచారణలో రియా కిలక విషయాలను అధికారులకు వెల్లడిచింది. తాను డ్రగ్స్ తీసుకోనని, సిగరేట్ మాత్రం తాగుతానని చెప్పింది. (చదవండి: ఆ మెడిసిన్ వల్లే సుశాంత్ చనిపోయాడు : రియా) అయితే ఓ సినిమాలో తన పాత్రలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పింది. బాలీవుడ్లో పలువురికి కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారని, వారి పేర్లను, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా రియా కాల్ డేటాతో పాటు, స్వాధీనం చేసుకున్న పెడ్లర్, ఎలక్ట్రానిక్ పరికరాల డేటా అధారంగా బాలీవుడ్‌లోని ప్రముఖులకు కూడా కనెక్షన్లు ఉన్నట్లు ఇటీవల అధికారుల గుర్తించారు. తాజాగా రియా డ్రగ్ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన రియా సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, నటుడు కుక్ దీపెష్ సావంత్‌లను పోలీసులు రేపు(సెప్టెంబర్ 9)న కోర్టులో హాజరుపరచనున్నారు. (చదవండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!) -
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ, ఎన్సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆదివారం ఆరుగంటల పాటు విచారించింది. తిరిగి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సోమ వారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు సమన్లు జారీచేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. సుశాంత్ సింగ్ కోసం తన సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని రియా అంగీకరించినట్టు తెలు స్తోంది. డ్రగ్స్ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పారు. రక్త నమూ నాలు ఇవ్వడానికి సిద్ధమని, ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న జైద్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేం దుకు మేనేజర్ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్సీబీ ఎదుట రియా ఒప్పుకున్నారు. మార్చి 15న తన సోదరుడు షోవిక్‌కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్ చాట్ వాస్తవమేనని కూడా ఎన్సీబీ ఎదుట ఆమె అంగీకరించినట్టు సమా చారం. కాగా, రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్సీబీ తెలిపింది. తాజాగా అనూజ్ కేశ్వాని అనే వ్యక్తి ఇంటిపై ఎన్సీబీ దాడిచేసింది. ఈ దాడిలో 590 గ్రాముల హశీష్, 0.64 గ్రాముల ఎల్ఎస్డి షీట్స్, 304 గ్రాముల గంజాయి, 1,85,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నారు. ప్రశ్నల వర్షం... ఎన్సీబీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం, కొంత మంది మహిళా పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున పశ్చిమ శాంతా క్రజ్‌లోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్ళి, ఆమెకు సమన్లు అంద జేసింది. పోలీసు ఎస్కార్ట్‌తో రియాను మధ్యాహ్నం 12 గంటలకు బల్లార్డ్ ఎస్టేట్‌లోని సంస్థ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆమె నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ ఇచ్చిన రిపోర్టుతో ఎన్సీబీ మాదక ద్రవ్యాల కోణంలో విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ ముఠాతో రియాచక్రవర్తికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం, రియా చక్ర వర్తి వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు సేవించలేదని చెప్పారు. సుశాంత్ సింగ్ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్సీబీ తెలిపింది. షోవిక్ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్‌ని సరఫరా చేసేవాడని ఎన్సీబీ వెల్లడించింది. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. 2018 సెప్టెంబర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి సేవిస్తున్నప్పుడు తాను చూశానని వ్యక్తిగత సలహాదారు దీపేశ్ సావంత్ అంగీకరించినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మార్చి 13న రియా సోదరుడు షోవిక్ నుంచి డ్రగ్స్ తీసుకురావాలని సుశాంత్ చెప్పారని, అవి తీసుకొచ్చేందుకు మిరాండాతో కలిసి వెళ్ళానని దీపేశ్ చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్ సేకరించినట్లు దీపేశ్ ఎన్సీబీకి వెల్లడించారు. ప్రేమించడమే నేరమా? ‘‘రియాచక్రవర్తి అరెస్టుకి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా ప్రేమించడం నేరమైతే, తన ప్రేమ కోసం ఆమె ఎన్నికష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె అమాయకురాలు. ఆమెపై బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీలతో కలిసి పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం రియా చక్రవర్తి ఏ కోర్టునీ ఆశ్రయించలేదు’’అని ఆమె న్యాయవాది సతీష్ మనేషిండే ట్వీట్ చేశారు. -
ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...
యశవంతపుర: డ్రగ్స్ దందాకు సంబంధించి మత్తు పదార్థాల నియంత్రణ దళం (ఎన్సీబీ) అధికారులు నటులు, సంగీత దర్శకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి మధ్య పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ తనకు రక్షణ కల్పిస్తే సినిమా రంగానికి చెందిన ముఖ్యల పేర్లను బయటపెడతానని ప్రకటించడం శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ తప్పదని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా గత గురువారం డ్రగ్స్ డీలర్లు అనికా, అనూప్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికర వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పలువురు నటీ–నటులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీవీ రియాలీటీ షో కళాకారులు, డ్యాన్సర్లు కూడా డ్రగ్స్ వాడేవారని, నటీమణులు ఎక్కువగా మత్తు పదార్థాలను కొనేవారని చెప్పినట్లు వెల్లడి. సౌందర్య పోషణ కోసం నటీమణులు డ్రగ్స్‌ను ఉపయోగించేవారని తెలిపారు. సినిమా విడుదలైన వెంటనే నటీనటులు, యూనిట్ సిబ్బంది నగరంలో పేరుమోసిన హోటల్స్, పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకునేవారు. లాక్డౌన్ సమయంలో అనికా డ్రగ్స్‌ను కోరినచోటికి సరఫరా చేసేవారు. ఇంద్రజిత్ లంకేశ్‌కు పిలుపు నటీనటులు ఎక్కడ డ్రగ్స్ తీసుకొనేవారో వెళ్లడిస్తానని పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ చెబుతున్నారు. ఎన్సీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కేసును తమకు అప్పగించిన కేసును విచారిస్తామని అయన తెలిపారు. ఇంద్రజిత్ ప్రకటనపై దృష్టి పెట్టామన్నారు. విచారణకు రావాలని లంకేశ్‌కు శనివారం నోటీసులు పంపినట్లు చెప్పారు. విద్యాసంస్థలూ పారాహుషార్ బనశంకరి: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమైన తరువాత మాదకద్రవ్యాల దుష్పరిణామాల పట్ల జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తాం, కాలేజీలు, హాస్టళ్లలో డ్రగ్స్ దొరికితే సంబంధిత విద్యాసంస్థలనే బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి బసవరాజబొమ్మై తెలిపారు. శనివారం హావేరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీసీబీ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, మాదకద్రవ్యాల ముఠా గురించి కీలక సమాచారం తెలిసిందన్నారు. విదేశీయుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది, ఆ ముఠాలను కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. – హోంమంత్రి -
కోల్‌కతా విమానాశ్రయంలో కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ విదేశీయుడిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.కోటి విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ 170 గ్రాములు ఉంటుందని, కెవిన్ ఎడ్వర్డ్ అనే ఇతను ఇక్కడి నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం ముంబై నుంచి వచ్చిన విమానంలో ఇక్కడికి వచ్చాడని కోల్‌కతా జోనల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఇక్కడ వివరించారు. నిందితుడు ఢిల్లీలోని ఐజీఐ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మన దేశంలోకి వచ్చాడని, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. ముంబైలో ఉంటున్న మరో నైజీరియన్ జాన్ అలియాస్ టోనీ ఇతనికి ఈ పని అప్పగించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
రూ.కోటి విలువ చేసే కిలో మత్తుమందు స్వాధీనం
ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాల ద్వారా పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు చేరిన హెరాయిన్ మత్తు మందు సోమవారం ఎల్బీ నగర్ ప్రాంతంలో స్థానిక స్మగ్లర్ల చేతులు మారుతుడంగా ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు మెరుపు దాడి జరిపి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి విలువ చేసే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, యేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఎన్సీబీ వర్గాల ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలు పాకిస్థాన్ నుంచి రాజస్థాన్,హైదరాబాద్ మీదుగా దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు హెరాయిన్‌ను తరలిస్తుండా పక్కా సమాచారంతో దాడులు జరిపి పట్టుకున్నారు.