బాలీవుడ్ ప్రముఖు‌లు కూడా ఉన్నారు: రియా | Rhea Chakraborty Said She Consumed Drugs And Gives Names Of Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ ప్రముఖు‌లు కూడా ఉన్నారు: రియా

Published Tue, Sep 8 2020 3:22 PM | Last Updated on Tue, Sep 8 2020 4:15 PM

Rhea Chakraborty Said She Consumed Drugs And Gives Names Of Bollywood - Sakshi

సాక్షి, ముంబై: సుశాంత్‌ మృతితో వెలుగు చూసిన డ్రగ్‌ కేసులో కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాను తాము సిద్ధం చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఉన్నతాధికారి తెలిపారు. వారి పేర్లను సుశాంత్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచారణలో వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుశాంత్‌ మృతి కేసులో రియాను విచారిస్తున్న క్రమంలో డ్రగ్‌ కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ వేగవంతం చేసేందుకు రంగంలోకి దిగిన ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. అదివారం రియాకు కూడా సమాన్లు జారీ చేసి మూడు దశలుగా విచారణ చేపట్టారు. ఇవాళ జరిగిన మూడవ దశ విచారణలో రియా కిలక విషయాలను అధికారులకు వెల్లడిచింది. తాను డ్రగ్స్‌ తీసుకోనని, సిగరేట్‌ మాత్రం తాగుతానని చెప్పింది. (చదవండి: ఆ మెడిసిన్ వ‌ల్లే సుశాంత్ చ‌నిపోయాడు : రియా)

అయితే ఓ సినిమాలో తన పాత్రలో భాగంగా డ్రగ్స్‌ తీసుకున్నట్లు చెప్పింది. బాలీవుడ్‌లో పలువురికి కూడా  డ్రగ్స్‌ కేసులో ఉన్నారని, వారి పేర్లను, డ్రగ్స్‌ ఉపయోగించే పార్టీల జాబితాను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా రియా కాల్‌ డేటాతో పాటు, స్వాధీనం చేసుకున్న పెడ్లర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల డేటా అధారంగా బాలీవుడ్‌లోని ప్రముఖులకు కూడా కనెక్షన్‌లు ఉన్నట్లు ఇటీవల అధికారుల గుర్తించారు. తాజాగా రియా డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన రియా సోదరుడు షోవిక్‌, సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, నటుడు కుక్‌ దీపెష్‌ సావంత్‌లను పోలీసులు రేపు(సెప్టెంబర్‌ 9)న కోర్టులో హాజరుపరచనున్నారు. (చదవండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement