
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు బాలీవుడ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెపోబ్యాచ్ సుశాంత్‌ను సైడ్ చేయడం వల్లే అతడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆక్రందన చెందారు. నటుడిది ఆత్మహత్య కాదని.. సినిమా ఇండస్ట్రీనే హత్య చేసిందని ఆరోపించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా అతడి మరణానికి కారణమంటూ ఆరోపణలు సైతం వెలువడ్డాయి.
అటు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే! ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా జైలు శిక్ష సైతం అనుభవించింది. ఈ విమర్శలు, తీవ్రమైన నెగెటివిటీ, ఆరోపణలు, కోర్టు కేసుల ఫలితంగా రియా చక్రవర్తికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలవుతున్న ఆమె తాజాగా ప్రేమలో పడిందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది.
జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని రెడ్డిట్‌లో ఓ రూమర్ వైరలవుతోంది. రియా ప్రేమలో పడిదంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ విరాట్ కోహ్లి మేనేజర్ బంటీ సాజ్‌దేతో ప్రేమలో పడిందని వార్తలు రాగా అవన్నీ వట్టి పుకారుగానే తేలిపోయింది. మరి ఇప్పుడు నిఖిల్ కామత్‌తో ప్రేమాయణంలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.
చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ మాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్
Comments
Please login to add a commentAdd a comment