అంబానీ ఇంట సెలబ్రేషన్స్ అంటే మాటలా.. దేశమంతా ఈ ఫ్యామిలీ వేడుకలను చూసి నోరెళ్లబెడుతోంది. ప్రీవెడ్డింగ్ కోసమే వెయ్యి కోట్లపైనే ఖర్చు చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలంతా గుజరాత్‌లోని జామ్నగర్లోనే రెండు, మూడు రోజులపాటు సెటిలయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పనులన్నీ పక్కనపెట్టి ఈ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఆటపాటలతో అలరించారు.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంబానీ ఫ్యామిలీకి చాలా క్లోజ్. అనంత్ అంబానీ- సల్మాన్ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. అందుకే ప్రీవెడ్డింగ్‌కు సైతం సల్లూభాయ్ ఓ గిఫ్ట్ పట్టుకెళ్లాడట! అనంత్ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్ తయారు చేయించాడట. దాని విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్‌కు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడట. ఇది చూసిన కొందరు అంబానీకి ఆ గిఫ్ట్స్ ఏం సరిపోతాయని సెటైర్లు వేస్తున్నారు. అయినా అంబానీకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే వారి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: పెళ్లికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం! ఆ హీరోయిన్‌తో ఏడడుగులు?
Comments
Please login to add a commentAdd a comment