అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌.. బంగారం వడ్డించారు! | Sara Ali Khan: Ate Gold with Rotis at Anant Ambani, Radhika Merchant Pre Wedding | Sakshi
Sakshi News home page

అంబానీ ప్రీ వెడ్డింగ్‌.. అంతా బంగారుమయం.. ఎక్కడ చూసినా వజ్రాలే.. : హీరోయిన్‌

Published Sun, Jun 23 2024 2:10 PM | Last Updated on Sun, Jun 23 2024 3:02 PM

Sara Ali Khan: Ate Gold with Rotis at Anant Ambani, Radhika Merchant Pre Wedding

పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ అంబానీ పెళ్లికి నెలల ముందు నుంచే సందడి మొదలైంది. జూలైలో జరగబోయే పెళ్లికి మార్చి నుంచే ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టారు. మార్చిలో గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో జరిగిన ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలకు సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఆనందంగా గడిపారు. ఆ వేడుకల్లో బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ కూడా ఉంది.

బంగారం వడ్డింపు
తాజాగా ఆ సెలబ్రేషన్స్‌ సంగతులను సారా అలీ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'అక్కడ ఏకంగా బంగారమే వడ్డించినట్లుగా అనిపించింది. అందరూ చపాతీతో పాటు పసిడి తిన్నట్లుగా ఫీలయ్యాను. ఎక్కడ చూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. అంత అద్భుతంగా వేడుక నిర్వహించారు. ఎంతో బాగా వెల్‌కమ్‌ చెప్పారు. అనంత్‌తో కలిసి నేను స్కూలుకు వెళ్లేదాన్ని. రాధికా మర్చంట్‌ కూడా తెలుసు. 

అది మాత్రం మర్చిపోలేను
ఏదేమైనా.. అంబానీ కుటుంబసభ్యులంతా ఎంతో మంచి మనసుతో సాదరంగా వెల్‌కమ్‌ చెప్పారు. నిజంగా వీళ్లు బంగారంలాంటివాళ్లు! నీతా అంబానీ మేడమ్‌ స్టేజీపై డ్యాన్స్‌ చేయడం మాత్రం మర్చిపోలేని జ్ఞాపకం' అని చెప్పుకొచ్చింది. ఇటీవల క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లోనూ సారా పాల్గొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ నటించిన మెట్రో ఇన్‌ డినో మూవీ విడుదలకు రెడీ అవుతోంది.

చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్‌ సినిమా.. లూ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement