
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్‌తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ముంబయిలో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు సినీతారలు, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే అతిథులు దాదాపు ముంబయికి చేరుకున్నారు. వీరి పెళ్లి వేడుకల్లో విదేశీ ప్రతినిధులతో పాటు హాలీవుడ్ సినీతారలు సైతం పాల్గొంటున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ జియో వరల్డ్ సెంటర్‌లో జరగనుంది.
ఒక్క పాటకే రూ.25 కోట్లు...
అయితే పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేందుకు పలువురు అగ్రతారలతో కచేరీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ నైజీరియన్ సింగర్ రేమాను ప్రదర్శనకు ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకల్లో అతను ఓ పాటను పాడేందుకు ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా సంగీత్ వేడుకలో ప్రదర్శనకు పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రూ.84 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పంజాబీ గాయకులు బాద్షా, కరణ్ ఔజ్లాకు రూ.4 కోట్ల వరకు ముట్టజెప్పారని టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment