యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయింది. అందంతో, నటనతో కట్టిపడేసిన ఈ బ్యూటీ అంతకుముందు కూడా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. కానీ యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో కొత్తిల్లు కొనుగోలు చేసింది.
ముంబైలో కొత్తిల్లు
సెలబ్రిటీలు నివాసముండే బాంద్రాలోనే తనకంటూ ఓ ఇంటిని సంపాదించుకుంది. ఇది రెండంతస్థుల ఇల్లని, సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. రూ.14 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకుందట! ఇప్పటికే స్టాంప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. మొత్తానికి తృప్తి.. షారుక్ ఖాన్, సల్మాన్, రేఖ, రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్.. వంటి స్టార్స్ ఉండే స్థలానికి త్వరలోనే మకాం మార్చనుందన్నమాట!
ఆ సినిమాతో పాపులారిటీ
తృప్తి డిమ్రి.. ఉత్తరాఖండ్ వాసి. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. తన కెరీర్ టర్న్ అయింది మాత్రం బుల్‌బుల్ చిత్రంతోనే! కాలా చిత్రంతో మరింత ఫేమ్ రాగా యానిమల్ మూవీతో ఆ క్రేజ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ హిట్ హారర్ మూవీ 'భూల్ భులాయా'కు సీక్వెల్‌గా వస్తున్న 'భూల్ భులాయా 3'లో నటిస్తోంది. వీటితో పాటు 'బ్యాడ్ న్యూస్', 'ధడక్ 2' చిత్రాల్లో భాగమైంది.
చదవండి: తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు
Comments
Please login to add a commentAdd a comment