Sushant Singh Drugs Case: NCB Files Chargesheet On Rhea Chakraborty And 34 Others Details Here - Sakshi
Sakshi News home page

Sushant Singh Drugs Case: షాకింగ్‌.. రియాపై ఎన్‌సీబీ చార్జిషీట్‌, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

Published Wed, Jul 13 2022 12:12 PM | Last Updated on Wed, Jul 13 2022 12:42 PM

NCB Files Chargesheet On Rhea Chakraborty, 34 Others Over Sushant Singh Drugs Case - Sakshi

2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్‌ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్‌ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్‌సీబీ ఈ చార్జీషీట్‌ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్‌ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్‌ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్‌సీబీ తమ చార్జిషీట్‌లో వెల్లడించింది.

చదవండి: అతియా, రాహుల్‌ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్‌ శెట్టి

రియా, ఆమె సోదరుడు సోవిక్‌ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్‌సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్‌సీబీ చార్జిషీట్‌లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్‌సీబీ తమ చార్జీషీట్‌లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్‌ 2020 మధ్య బాలీవుడ్‌లో డ్రగ్స్‌ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్‌గా ఏర్పడి డ్రగ్స్‌ సప్లై చేశారు. 

చదవండి: డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్‌ మూవీ!

నిందితులు ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్‌, కొకైన్‌తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్‌ పదార్థాలను ఉపయోగించారని ఎన్‌సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్‌ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్‌ ఆర్డర్‌ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్‌డిపీఎస్‌ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్‌లో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement