Charge sheet Filed
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్‌షీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్‌లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
TSPSC Case: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్.. ఏముందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ కేసును కేసీఆర్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్ లీక్ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్ లీకైంది. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్పూర్ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి. -
నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిజామాబాద్‌లో పీఎఫ్ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. 11 మంది నిందితులపై నేరారోపణ మోపింది. నిందితులపై 120B, 132A, UA(p)17,18, 18A,18B సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పీఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది. పీఎఫ్ఐలో రిక్రూట్ అయిన తర్వాత ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణలో నేర్పిస్తున్నట్లు గుర్తించింది. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించిన ఎన్ఐఏ.. పీఎఫ్ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే పీఎఫ్ఐ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. చదవండి: ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్! -
మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్సీబీ చార్జిషీట్లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్సీబీ తమ చార్జీషీట్లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్య బాలీవుడ్లో డ్రగ్స్ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్‌గా ఏర్పడి డ్రగ్స్ సప్లై చేశారు. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్, కొకైన్‌తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్ ఆర్డర్ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్డిపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. -
లైంగిక దాడి కేసులో ఆస్కార్ అవార్డు గ్రహిత కెవిన్‌పై చార్జ్‌షీట్
ప్రముఖ బ్రిటిష్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహిత కెవిన్ స్పేసీ లైంగిక దాడి కేసు నమోదైంది. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కెవిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటిన్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలు రుజువైనందున ఆయనపై తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడం చట్టరిత్యా నేరమని, అందుకే నటుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. చదవండి: అందుకు క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్.. 2005లో మార్చి మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా ఆయనపై లండన్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2008 అగష్టులో, 2013 ఏప్రిల్‌లో పశ్చిమ ఇంగ్లాండ్‌లో ఆయనపై ముగ్గురు లైంగిక ఆరోపణలు చేశారు. ముగ్గురు పురుషులపై కెవిన్ నాలుగు సార్లు వేధింపులకు పాల్పడినట్టు ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. ఒక వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డాడని... ఇద్దరు వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నాడని పోలీసులు తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ చట్టాల ప్రకారం బాధితులను, వారి పేర్లను మీడియాకు వెల్లడించలేదు. చదవండి: ‘థ్యాంక్ యూ’ టీజర్, నాగ చైతన్యపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు -
డ్రగ్స్ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్
సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ), కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. డ్రగ్స్ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్లో సమాచారం పొందుపరిచారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్లో ప్రస్తావించారు. డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే. రాగిణి మత్తు పార్టీలు ఇలా ► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్ద గల హోటల్లో ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్టసీ డ్రగ్ మాత్రల సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్లో ప్రస్తావించారు. ► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్లో పార్టీలో డ్రగ్స్ సేవించారు. ► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్పెపే సాంబాకు ఫోన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుంది. ► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ మొబైల్‌ఫోన్‌ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ► ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి డ్రగ్స్ డీల్ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్‌ను పొందుపరిచారు. -
ఢిల్లీ అల్లర్లపై 17 వేల పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 వేల పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ చార్జీ షీటును దాఖలు చేశారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్ల గురించి ఢిల్లీ పోలీసు విభాగంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మార్చి ఆరవ తేదీన తొలి ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. 59–2020 నెంబర్‌తో నమోదయిన ఈ ఎఫ్ఐఆర్లో జవహర్ లాల్ నెహ్రూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24–25 తేదీల్లో ఢిల్లీకి వచ్చినప్పుడు రోడ్లను దిగ్బంధం చేయాల్సిందిగా ప్రజలను రెచ్చ గొడుతూ ఉమర్ ఖలీద్ ప్రసంగించారు. మైనారిటీలను వేధిస్తున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరవు తీయడమే ఖలీద్ లక్ష్యం. ఆయన తన సహచరులతో కలసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళలను, పిల్లలను సమీకరించారు. వారు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా సేకరించి ఇళ్లలో దాచి పెట్టారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..! టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలు ఫిబ్రవరి 23వ తేదీన జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వెలుపల నిందితులు రోడ్డును బ్లాక్ చేశారు. ఆ ప్రాంతం ప్రజలకు ఇక్కట్లు కలిగించడం ద్వారా అల్లర్లకు వారిని సిద్ధం చేయడమే కుట్రలో భాగం. ఖలీద్ సహచరుడిగా ఎఫ్ఐఆర్లో ఈశాన్య ఢిల్లీకి చెందిన డానిష్‌ను పేర్కొన్నారు. వారిద్దరిపై అల్లర్లు, చట్ట విరుద్ధంగా సమావేశమవడం, నేరపూరిత కుట్ర అభియోగాలను ముందుగా మోపిన పోలీసులు, ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలను జోడించారు. ఈ రెండు అభియోగాల కింద నిందితులకు బెయిల్ దొరకడం అసాధ్యం. మార్చి 9వ తేదీన అరెస్టయిన నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటికీ ఆయనపై అదనపు అభియోగాలు నమోదు కానందున బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 13వ తేదీన అరెస్టయిన ఉమర్ ఖలీదుకు అదనపు అభియోగాల కారణంగా ఇప్పటికీ బెయిల్ లభించలేదు. చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు వీరితోపాటు ఇదే కేసులో అరెస్ట్ చేసిన మిగతా 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మతిలోని హత్యా, దేశద్రేహం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి 26 సెక్షన్లతోపాటు ఆయుధాల చట్టంలోని రెండు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన స్థానిక నాయకుడు, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన రిసర్చ్ స్కాలర్ సఫూర్ జార్గర్ నిందితుల్లో ఉన్నారు. నిందితుల్లో 80 శాతం మంది మైనారిటీ వర్గానికి చెందిన వారే. -
పుల్వామా దాడి.. ఎన్ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు రాఫ్ అస్ఘర్లతో సహా 19 మంది ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులంతా పేలుళ్లకు పాల్పడినట్టుగా ఎన్ఐఏ మంగళవారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల చార్జిషీట్లో పేర్కొంది. అజర్, అతని సోదరుడు, మేనల్లుడు, ఇప్పటికే ఎన్కౌంటర్లో మరణించిన ఉమర్ ఫరూఖ్, అమ్మర్ అల్వీ తదితరుల పేర్లు చార్జిషీట్లో ఉన్నాయి. అభియోగాలు నమోదైన ఉగ్రవాదుల్లో ఆరుగురు ఇప్పటికే ఎన్కౌంటర్లలో మరణించగా, మరోనలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కశ్మీర్‌లోనే ఉన్నట్టు సమాచారం. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో దిట్టయిన ఉమర్ ఫరూఖ్ ఈ దాడిని పర్యవేక్షించడానికి 2018లో భారత్‌లోకి చొరబడ్డాడు. 1999 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అతర్ కుమారుడే ఇతడు. 2019 ఫిబ్రవరిలో ఫరూఖ్ ఈ దాడి చేయించాడు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్కౌంటర్లో ఫరూఖ్ మరణించాడు. ఆత్మాహుతి బాంబర్ చివరి వీడియో చార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ 200 కేజీల పేలుడు పదార్థాలతో నింపిన కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనాన్ని ఢీ కొన్నాడు. పుల్వామాలో షేక్ బషీర్ నివాసంలో బిలాల్ అహ్మద్ కుచే అన్న ఉగ్రవాది తెచ్చిన హైటెక్ ఫోన్ ద్వారా దార్ తన చివరి వీడియోని తీశాడు. దాడిలో అహ్మద్ దార్ మరణిస్తే, బషీర్, బిలాల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏకి ఎన్నో సవాళ్లు పుల్వామా దాడి కుట్రదారులు, దానిని అమలు పరిచిన వారు వివిధ ఎన్కౌంటర్లలో మరణించడంతో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడం ఎన్ఐఏకు కత్తి మీద సాము అయింది. కారు యజమాని అహ్మద్ దార్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డామని ఓ అధికారి చెప్పారు. పేలుడులో నంబర్ ప్లేట్ సహా కారు పూర్తిగా «నుజ్జునుజ్జయినా ఆ కారు యజమానుల జాబితాను సేకరించామని తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ అహ్మద్ దార్ అవశేషాలను సేకరించి, అతని తండ్రి డీఎన్ఏతో సరిపోల్చి ఇదంతా చేసిన వ్యక్తి దార్యేనని కోర్టులో నిరూపించాల్సి వచ్చిందని ఆ అధికారి వివరించారు. -
షమీకి మరో షాకిచ్చిన భార్య
కోల్‌కతా: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందు ఊహించని షాక్ తగిలింది. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రపంచకప్, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. (మహ్మద్ షమీ భావోద్వేగం..) ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్ ఛీట్ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నవిషయం తెలిసిందే. (‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’) జహాన్.. ఐ మిస్ యూ: షమీ -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
నాకు బతకాలన్న కోరిక లేదు
న్యూఢిల్లీ : ‘ నాకు బతకాలన్న ఏ కోరికా లేదు’ అని సునంద పుష్కర్, ఆమె భర్త మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు తాను చనిపోయే ముందు మెయిల్ చేసిందని ఢిల్లీ పోలీసులు సోమవారం కోర్టులో తెలిపారు. శశి థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఈ మేరకు 3 వేల పేజీల చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీట్లు, మెయిల్స్, మెసేజ్‌లే ఆమె మరణ వాంగ్మూలం కింద తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశి థరూర్ నిందితుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని కోర్టుకు విన్నవించారు. ‘ నాకు జీవించాలన్న కోరిక లేదు..చావు కోసం ఎదురు చూస్తున్నాను’ అని జనవరి 8వ తేదీన సునంద, థరూర్‌కు ఈ మెయిల్ చేసిందని, ఢిల్లీలోని ఓ లక్జరీ హోటల్లో ఆమె సూట్లో సరిగ్గా చనిపోవడానికి తొమ్మిది రోజుల ముందు ఈమెయిల్ చేసినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. పాయిజనింగ్ కారణంగా ఆమె చనిపోయినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె రూంలో 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఆమె ఎన్ని మాత్రలు మింగిందనేది స్పష్టంగా చార్జిషీటులో పేర్కొనలేదు. సునంద పుష్కర్ డిప్రెషన్లోకి వెళ్లినా ఒక భర్తగా శశి థరూర్ పట్టించుకోకపోవడం వల్లే, ఆమె అల్ప్రాక్స్ టాబ్లెట్ మింగిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్), చార్జిషీటులో పేర్కొంది. దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె ఒంటిపై గాయాలు అంత సీరియస్ గాయాలు కానప్పటికీ తరచూ వాదులాడుకునేవారని సిట్ చార్జిషీటులో వెల్లడించింది. ఆమె యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు కూడా వాడేదని పేర్కొన్నారు. శశి థరూర్‌కు, పాకిస్తాన్ జర్నలిస్ట్‌తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కలగడంతో ఇరువురి మధ్య పబ్లిక్‌గా ట్విటర్లో యుద్ధం కూడా జరిగింది. సునంద పుష్కర్ కాల్ చేస్తే ఆమె భర్త థరూర్ డిస్కనెక్ట్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం కూడా చేశాడని సిట్, చార్జిషీటులో తెలిపింది. శశి థరూర్‌కు, సునంద పుష్కర్ల వివాహం 2010లో జరిగింది. శశి థరూర్‌కు సునంద మూడో భార్య కాగా..సునందకు కూడా శశి థరూర్ మూడో భర్తే. పెళ్లి అయిన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇది ఇలా ఉండగా మాజీ కేంద్ర శశి థరూర్ మాత్రం తాను భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించానని చార్జిషీటు దాఖలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. -
చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు
-
కాల్‌మనీ నిందితుడు సత్యానందంకు బెయిల్
-
కాల్‌మనీ కేసులో సత్యానందంకు ముందస్తు బెయిల్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు, విద్యుత్ శాఖ డిఇ సత్యానందంకు ముందస్తు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధిస్తూ ఆయనకు హైకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రాగానే సత్యానందం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో పిటిషనర్‌కు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలను తెలుసుకోకుండా పోలీసులు పిటిషనర్‌ను నిందితునిగా చేరుస్తూ కేసు నమోదు చేశారని సత్యానందం తరఫు న్యాయవాది పి.విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన మహిళకు అసలు సత్యానందం ఎవరో కూడా తెలియదని, ఈ విషయం ఫిర్యాదును పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఇవ్వరాదని కోరారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం కీలక నిందితుల్లో ఒకరన్నారు. ఫిర్యాదుదారు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సత్యానందం తనను లైంగికంగా వేధించారని చెప్పారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో పిటిషనర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితులపై చార్జ్‌షీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. అలాగే ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్,వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు. -
కాల్‌మనీ నిందితులపై రౌడీషీటు
సంచలనం రేకెత్తించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులపై రౌడీషీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు రౌడీ షీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నలుగురు నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. కేసులో నిందితులుగా ఉన్న విద్యుత్ శాఖ డీఏ సత్యానందం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుల పరారీ వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయముందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ ముఠాలో పట్టుబడిన ముగ్గురు నిందితుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక అనుమతితో ఈ ముఠాను విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు. కాల్‌మనీ ముఠా సభ్యుల సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్‌మనీ- సెక్స్ రాకెట్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో అధిక శాతం మహిళల నెంబర్లే దర్శనమిస్తున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలతో ఈ ముఠా సభ్యులు సంభాషించారన్న ఆధారాలు లభ్యమవుతున్నాయి. అప్పులు ఇవ్వడం, మహిళల అసహాయతను ఆసరాగా తీసుకుని వారిని తమ లైంగిక వాంఛల కోసం దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడం వీరు పరిపాటిగా చేసుకున్నట్లు కాల్ డెటా సమాచారం ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. పోలీసులు విచారణలోనూ నిందితులు కొన్ని వాస్తవాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. కాల్‌మనీ ముఠా నుంచి లభించిన డాక్యుమెంట్ల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల మేరకు కాల్‌మనీ పేరుతో అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనధికారికంగా 500 కోట్లకు పైగా కాల్‌మనీ పేరుతో డబ్బును చెలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీశంకర్‌ల ద్వారా కాల్‌మనీ వ్యవహారంపై మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాల్‌మనీకి సంబంధించి ఆర్థిక వనరులు ఎలా వచ్చాయనే దానిపై నిందితుల నుంచి సరైన సమాదానం రాబట్టలేకపోయారు. అలాగే కాల్‌మనీలోని మిగిలిన నిందితుల ఆర్థిక మూలాలపై కూడా విచారణ జరిపిస్తామని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటించినా, దానిపై ఇప్పటివరకు చర్యలేవీ మొదలు కాలేదు. ఇక ఈ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డిఇ సత్యానందం తృటిలో పోలీసుల నుంచి తప్పించుకోవడం వెనుక కొందరు పెద్దల సహకారం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించిన కొద్దిసేపట్లోనే ఆయన విజయవాడ నుంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు నగరానికి చెందిన ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్, మరో ఎన్జీఓ నేత కూడా సహకరించనట్లు సమాచారం. వీరి వాహనాల్లోనే సత్యానందం రాష్ట్రం విడిచిపెట్టి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల్లో కీలకమైన ఓ ఎన్ఆర్ఐ అధికార పార్టీలోని ప్రముఖులపై ఒత్తిడి కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. కాల్‌మనీ బాధితుల్లో ఓ యువతికి అమెరికాలో ఉపాధి కల్పిస్తానని మోసగించిన ఘటనలో ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇక మిగిలిన నిందితుల్లో వెనిగళ్ల శ్రీకాంత్‌కు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన శ్రీకాంత్ ఈ కేసు బయటపడగానే హఠాత్తుగా మాయమయ్యాడు. విదేశాల్లోనే ఉన్నాడా... దేశంలోని మరో రాష్ట్రంలో తలదాచుకున్నాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతకు సన్నిహితుడైన పెండ్యాల శ్రీకాంత్ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ తీసుకున్న తరువాతే వీరు రాష్ట్రానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నా.. వీరిని రప్పించేందుకు, ఆర్థిక మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
అత్యాచారం కేసులో డీఐజీపై చార్జిషీటు
ముంబై: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై కేసు నమోదైన 9 నెలల తర్వాత చార్జిషీటు దాఖలైంది. డీఐజీ సునీల్ పరాస్కర్ (57) పై బోరివలీ కోర్టులో 724 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు క్రైం బ్రాంచ్ అధికారులు తెలిపారు. 58 మంది సాక్ష్యులు, ఫిర్యాదుదారుల వాంగ్మూలాలతో కూడిన అభియోగపత్రాన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందుంచారు. తదుపరి విచారణ కోసం కేసును సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. జూన్ 12న కోర్టుకు సునీల్ పరాస్కర్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. 2013 డిసెంబర్లో తనపై పరస్కార్ అత్యాచారం చేశారని 25 ఏళ్ల మోడల్ ఆరోపించింది. ఈ మేరకు గతేడాది జూలైలో పరాస్కర్‌పై మాల్వాణీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పలు సెక్షన్ల కింద నమోదైంది. అయితే అరెస్ట్‌కు ముందే మహిళా ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లుందని ఆ బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు పేర్కొంది. వివరాలు.. 2012లో పరాస్కర్ అదనపు కమిషనర్‌గా ఉండగా ఓ కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.